(మిగిలిన ప్రశ్నలు వచ్చే ఆదివారం)
―సికిందర్
(మిగిలిన ప్రశ్నలు వచ్చే ఆదివారం)
―సికిందర్
ఇంకో
దశాబ్ద కాలంలో ఆర్టు సినిమాల చెలామణి చరమాంకం కొస్తుందనగా, బాపు భవిష్యద్దర్శనం చేసినట్టు అప్పుడే (1975లో) ఈ ముందుకాలపు ‘కమర్షియలార్టు’ నిచ్చారు. ఉత్తరాదిన ఆర్టు సినిమాల ఉద్యమం
ముగిశాక, వాటి స్థానాన్ని భర్తీ చేస్తూ ఆతర్వాత బాలీవుడ్ లో
క్రాసోవర్ సినిమాల పేరుతో వచ్చినవన్నీ, నేటికీ వస్తున్నవీ, ‘ముత్యాలముగ్గు’ టైపు
కమర్షియలార్టు సినిమాలే.
‘ముత్యాలముగ్గు’ అనగానే రావుగోపాలరావు మెదలడం సహజం.
కానీ ‘ముత్యాలముగ్గు’ అంటే కేవలం రావుగోపాలరావు
క్లాసిక్ విలనీ మాత్రమే కాదు, బహు సుందరమైన కుటుంబ గాథ కూడా.
ఒక శోకనాశన జానకీ వృత్తాంతం. ఆధునిక రామాయణం. ఉత్తర రామాయణం. విడిపోయిన తల్లిదండ్రుల
కోసం పిల్లల గేమ్ ప్లాన్!
శ్రీధర్, సంగీతలు భార్యాభర్తలు. బాధితురాలు
భార్యే. బాధకుడు డబ్బుకోసం ఏమైనా చేసే కాంట్రాక్టర్ రావుగోపాలరావు. అప్పుడా తమ తల్లి
అవస్థ చూడలేక కవలలిద్దరూ సదరు కాంట్రాక్టరు దురాగతాన్ని నిరూపించి, పునీతురాలిగా తిరిగి తల్లిని కన్నతండ్రితో
కలిపి సుఖాంతం చేసే వృత్తాంతమే.
ప్రారంభంలోనే చాలా ఆసక్తి
రేపే ఘట్టం. హీరోయిన్ పెళ్ళవుతోంటే హీరో రావడం! ...ఇలాంటి ప్రారంభంతోనే ఆ మధ్య
కాలం వరకూ అదేపనిగా చాలా సినిమా లొచ్చాయి. ఇప్పుడు కూడా కొంచెం మార్పుతో ‘తెల్లవారితే గురువారం’ వచ్చింది. ఇది ‘ముత్యాలముగ్గు’ పెట్టిన భిక్షే. ఈ ప్రారంభ ఘట్టంలోనే
సంగీత పెళ్లి చెడిపోయి, శ్రీధర్ ఆపద్ధర్మంగా ఆమెనే
చేసుకోవాల్సిరావడంతో, టైమ్ అండ్ టెన్షన్ గ్రాఫ్ అమాంతం
పెరిగి, కథకి గట్టి ముడి పడిపోతుంది ఆదిలోనే. ఇదంతా కేవలం
ఎనిమిది సీన్లలోపే జరిగిపోతుంది.
రిచర్డ్
గెర్ నటించిన విజయవంతమైన సినిమా ‘అన్ ఫెయిత్ ఫుల్’ (2002) లో ఐదవ సీనుకల్లా కథ ముడి
పడిపోతుంది. ఇలాటి క్లుప్తీ కరించిన కథనాలే అసలు సిసలు సినిమా కథనాలవుతాయి. ‘ముత్యాలముగ్గు’ ఈ సెక్షన్ లో అపూర్వంగా నిలబడుతుంది.
దర్శకుడు బాపూ- ఈ కథా, సంభాషణలూ రాసిన రచయిత రమణా, ‘ముత్యాలముగ్గు’ ని భావి తరాలకి
రిఫరెన్స్ గైడ్ లా అందించారు . ఏ కథైనా సరదాగా మొదలై, సంక్షుభితంగా
మారి, తిరిగి శాంతి సామరస్యాలు స్థాపించే మూడంకాల
నిర్మాణంలోనే వుంటుంది. ఆనందంగా సాగుతున్న శ్రీధర్-సంగీతల వైవాహిక
జీవితంలోకి రావుగోపాల రావుని ప్రవేశపెట్టి సంక్షుభితం చేస్తారు బాపు. కడుపుతో
వున్న సంగీత శీలమ్మీద నిందపడి వీధి పాలవుతుంది.
2. రస భంగం మానుకో!
ఫస్టాఫ్ లో ఇలా విడదీయడం సులభమే. సెకండాఫ్ లో కథనానికి ఔచిత్య భంగం కలక్కుండా తిరిగి కలపడమే పెద్ద సమస్య. అంటే ఫస్టాఫ్ ఏ రస ప్రధానంగా సాగిందో సెకండాఫ్ అదే రస ప్రధానంగా సాగాలి. ఇప్పుడు ఈ చౌరాస్తా నుంచీ కథ ఎటువైపు వెళ్ళాలి? పిల్లలు పుట్టి రావడానికి ఇంకా చాలా టైముంది. సంగీత మీద పడ్డ నింద తొలగించేందుకు కథకి ఉపయోగపడే సాధనాలు వాళ్ళే. వాళ్ళు దూకాల్సిన కార్య క్షేత్రంలోకి ముందుగానే ఇంకో పాత్రని పంపి కథ నడిపించడం కోరి (సెకండాఫ్) గండాన్ని తెచ్చుకోవడమే.
చేసిన పాపం చావదనే కదా? సృష్టిలో ప్రతిదీ బూమరాంగ్ అవుతుంది. మంచి చేస్తే మంచీ, చెడు చేస్తే చెడూ చుట్టూ తిరిగి తిరిగి మనకే వచ్చి ఠపీమని తగుల్తుంది. ఈ దుష్ట చతుష్టయం ధనదాహంతో సంగీతని వనవాసం పట్టించినప్పుడు, సృష్టి చూస్తూ ఊరుకోదుగా. సృష్టెప్పుడూ హెచ్చు తగ్గుల్ని సమతూకం చేసే దిశగానే కదుల్తూంటుంది. సంగీతకి ఆ స్థాయిలో అన్యాయం చేసి హెచ్చిపోయిన కీచకుల అదృష్టాల్ని ఛిన్నాభిన్నం చేసి, ఆ నష్టపరిహారం సంగీతకి ఇప్పించడం సృష్టి ధర్మం కదా?
మొన్నెవరో
అడిగారు. మీరు కొన్ని కథల్ని పురాణాల ఆధారంగా ఎలా వివరిస్తున్నారని. కళారంగంలో
వుండాలంటే ఆస్తికత్వంతో, నాస్తికత్వంతో అన్నిటితో ఎంతో కొంత వుండాలిగా. కళలు పోరాటాల నుంచి ఎంత పుట్టాయో, స్పిరిచ్యువాలిటీ నుంచీ అంతే పుట్టాయి. స్పిరిచ్యువాలిటీ నుంచీ వచ్చేవి
ఆత్మిక దాహాన్ని తీరుస్తాయి. ఈ కథలో ఈ ఫిలాసఫీ
ఎంచక్కా ఇమిడిపోయి,
సంగీత పాత్ర పట్ల ప్రేక్షకులకి ఎనలేని సానుభూతేర్పడుతుంది.
4. కాస్త శాస్త్రం చూడు
సినిమాలో ఆల్రెడీ వెన్నుపోట్లతో తెగ కలహించుకుంటున్న దుష్ట చతుష్టయం కీచులాటలన్నిటినీ, ఇక పతాక స్థాయికి చేర్చి, పంచ మహాభూతాల్లా ఒకర్నొకరు మింగేసుకునే నైమిత్తిక ముగింపునే ఇచ్చారు చాలా టెర్రిఫిక్ చిత్రీకరణతో! అప్పుడంతా ఆకాశం శూన్యమైపోయినట్టు శ్మశాన నిశ్శబ్దం! తిరిగి తాజాగా సృష్టి మొదలైనట్టూ...శ్రీధర్-సంగీతల కాపురం.
***
‘ముత్యాలముగ్గు’ లో రావు గోపాలరావు ఫేమస్ విలనీ రీమిక్స్ అయిందని పై డైలాగు చూసి వాటి కోసం ఎవరైనా మార్కెట్లో పరుగులు దీస్తే, అంతకన్నా ‘కర్సయిపోవడం’ వుండదు! అది ‘యాభైలో సగం పన్నెండున్నర’ బాపతు అమాయకత్వమవుతుంది. పై నివేదన నేటి అభిరుచిగల ప్రేక్షకుడి/ప్రేక్షకురాలి ఆవేదనే కావొచ్చు. ‘ముత్యాలముగ్గు’ ని చూసిన కళ్ళతో నేటి సినిమాల్ని చూడలేకపోతున్న రోదనే కావొచ్చు. వాస్తవమెప్పుడూ కఠినం గానే వుంటుంది. ‘ముత్యాలముగ్గు’ దీన్ని గుర్తు చేస్తూనే వుంటుంది.
―సికిందర్
చిన్న సినిమాకి దానిదైన సొంత జీవితం ప్రత్యేకంగా వుంటుంది. పెద్ద సినిమాల ఛాయల్ని దగ్గరికి కూడా రానివ్వదు. పెద్ద సినిమాలన్నీ ఒకే పోతలో పోసినట్టున్నా చెల్లిపోవచ్చు. చిన్న సినిమాలకి ఏ కథకా కథగా యూనిక్ క్రియేషన్ వుంటుంది. ఇదే వాటిని నిలబెడుతుంది. అదే సమయంలో చిన్న సినిమా ఒళ్ళు దగ్గర పెట్టుకుని స్ట్రక్చర్ ని పాటిస్తే కథా కథనాలే కాదు, ప్రధాన పాత్ర ననుసరించి ఇతర పాత్రలు, పాత్ర చిత్రణలు, వాటి ప్రయాణాలు, చెప్పాలనుకున్న పాయింటూ సమస్తం ప్రభావ శీలంగా అర్ధవంతంగా వస్తాయి.
స్ట్రక్చర్ వల్ల కాన్సెప్ట్ దానికదే లోతుపాతుల్లోకి
వెళ్ళిపోతుంది. స్ట్రక్చరే పట్టని స్క్రిప్టుతో చిన్న సినిమా చెత్త బుట్ట
దాఖలవుతుంది. బుట్ట దాఖలయ్యే సినిమాలే మెట్ట వ్యవసాయం చేస్తున్నాయి. చినుకు పడదు, చిల్లులు మాత్రం పడుతూంటాయి నిర్మాత జేబుకి.
‘రామ్
సింగ్ చార్లీ’ స్ట్రక్చర్ లో వున్న
అర్ధవంతమైన కథ, కథనమూ. కథనంలో దృశ్యాల
అల్లిక చాలా సార్లు మెస్మరైజ్ చేస్తుంది. ఉదాహరణకి వూరికెళ్ళి పోయిన హీరోయిన్ పాత్ర కజ్రీ అక్కడెవరితోనో ఫోన్లో
మాట్లాడుతున్నట్టు కన్పిస్తుంది. తీరా ఇటు ఓపెన్ చేస్తే భర్త పాత్ర రామ్ సింగ్ తోనే
మాట్లాడుతున్నట్టు దృశ్యం థ్రిల్ చేస్తుంది. ఇంకో దృశ్యంలో బార్ దగ్గర ఒకడు అదే
పనిగా వెక్కిరిస్తూంటే, పొట్టి లిల్లీపుట్ చూసి చూసి
లాగిపెట్టి లెంపకాయ కొడతాడు. లెంపకాయ తిన్నవాడు పరమ కోపంగా చూస్తాడు. అంతే, దృశ్యం కట్ అయిపోతుంది. తర్వాతి దృశ్యంలో రామ్
సింగ్ ఇంటికి పరుగెత్తు కొచ్చి డబ్బులన్నీ తీసుకుని పరిగెడతాడు.
ఈ దృశ్యమేంటో కూడా అర్ధం గాకుండానే ఇదీ కట్ అయిపోతుంది. దీని
తర్వాతి దృశ్యంలో గాయపడిన లిల్లీపుట్
హాస్పిటల్లో పడి వుంటాడు. అక్కడికి డబ్బుతో వచ్చేస్తాడు రామ్ సింగ్. ఇలా మొదటి
దృశ్యంతో సస్పెన్స్ క్రియేట్ చేసి, రెండో దృశ్యంతోనూ సస్పెన్స్
క్రియేట్ చేసి, రెండిటి అర్ధాలూ మూడో సీన్లో
స్పష్టం చేస్తాడు దర్శకుడు. ఇదీ దృశ్య మాలిక అంటే. రొటీన్ మెలోడ్రామాని తొలగించే ఈ
మ్యాటరాఫ్ ఫ్యాక్ట్ కథనపు టెక్నిక్ వల్ల కథ చెడకుండా సినిమా నిడివి, షూటింగ్ సమయం, బడ్జెట్ ఎంతో ఆదా అయ్యాయి. దీన్ని గుర్తించి తెలుగులో ఎవరైనా
పాటిస్తారా? సందేహమే. ఇలా కథని బట్టి దానిదైన యూనిక్- పర్సనలైజుడు డైనమిక్స్ తో కథనం చిన్న
సినిమాకే సాధ్యమవుతుందని
గమనించాల్సి వుంటుంది.
―సికిందర్