తారాగణం: రామ్, రకుల్ ప్రీత్ సింగ్, సోనాల్ చౌహాన్, సంపత్ రాజ్, సాయికుమార్, బ్రహ్మానందం, అభిమన్యుసింగ్, జయప్రకాష్‌రెడ్డి, పవిత్రా లోకేష్, రావు రమేష్, ఎమ్మెస్ నారాయణ తదితరులు
కథ : వెలిగొండ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే- మాటలు : కోన వెంకట్
సంగీతం: ఎస్.ఎస్. తమన్ ఛాయాగ్రహణం: సమీర్‌రెడ్డి
బ్యానర్ : యునైటెడ్ మూవీస్ లిమిటెడ్ నిర్మాత: పరుచూరి కిరీటి
విడుదల మే 29, 2015 సెన్సార్ : U/A

*
ఓ సక్సెస్ కోసం
హీరో రామ్ చేస్తున్న విశ్వ ప్రయత్నాల్లో భాగంగా ఈసారి ‘పండగ చేస్కో’ అనే రెగ్యులర్
కమర్షియల్ వచ్చింది. ఈ రెగ్యులర్ కమర్షియల్ కూడా కుటుంబ సంబంధాలకి సంబంధించింది. ఈ
కుటుంబ సంబంధాల కథ కూడా హేమా హేమీలైన నటీనటులతో వినోద ప్రధానంగా సాగేదే. కాబట్టి ఈ
రెగ్యులర్ కమర్షియల్ = కుటుంబ సంబంధాల కథ + వినోదం అనే బేసిక్ బాక్సాఫీస్
ఫ్రెండ్లీ ఈక్వేషన్ ని రామ్ పికప్ చేసుకోవడంలో ఎలాటి పొరపాటూ చేయలేదు. ఆ తర్వాత ఈ
బేసిక్ ఎక్వేషన్ తో సదరు ‘కిచెన్’ లో జరిగే ‘కుకింగ్’ తో రామ్ కెలాటి సంబంధమూ లేకపోవచ్చు. కానీ
ఈ బేసిక్ ఈక్వేషన్ ని రామ్ జడ్జ్ చేయగల్గినట్టూ- సంబంధీకులు కూడా వాళ్ళ ‘కిచెన్’ లో మిగతా తమ ’కుకింగ్’ నీ జడ్జ్
చేయగల్గారా లేదా అనే దాని పైనే రామ్ అదృష్టం ఈసారి ఆధారపడింది.
దర్శకుడు గోపీచంద్ మలినేని గత మూడు సినిమాలూ సక్సెస్ అయినవే. వీటిలో ‘బాడీగార్డ్’ అనే రీమేక్ ప్రేమకథని తీసేస్తే, మిగతా రెండూ ‘డాన్ శీను’, ‘బలుపు’ లు మాత్రం భారీ మూస యాక్షన్ సినిమాలే. కానీ మళ్ళీ ఈ సారి ఓ ప్రేమకథ కాకపోయినా ఆ తరగతి కింది కొచ్చే అలాటి కుటుంబ సంబంధాలూ అనే సున్నిత సబ్జెక్టునే తీసుకున్నప్పుడు, ఈ కొత్త అనుభవాన్ని తానెలా తెరానువాదం చేయగలిగాడన్నది ఆసక్తి రేపే అంశం సహజంగానే. డార్క్ మూవీస్ తీసే రాంగోపాల్ వర్మ కూడా ‘365 డేస్’ అనే పెళ్లి కథ తీసినా( ఇదెలా ఉన్నప్పటికీ), లేదా హిందీ లో ‘నిశ్శబ్ద్’ వంటి రిలేషన్ షిప్ కథ తీసినా వాటి జానర్ మర్యాదల్ని కాపాడుతూనే తీశాడు. వాటిలో మళ్ళీ తన డార్క్ మూవీస్ చాపల్యాల్ని జొప్పించి కలగూరగంప చేయలేదు. సినిమా క్రాఫ్ట్ తెలిసిన వాళ్ళెవరూ అలాటి పని చేయరు. గోపీచంద్ మలినేని కూడా తన చేతిలో వున్న సున్నితమైన బేసిక్ ఈక్వేషన్ ని కిచెన్ లో వేసి వండుతున్నప్పుడు, దాని జానర్ మర్యాద ని కాపాడగల్గాడా లేదా అన్నదే ప్రధాన ప్రశ్న!
ఈ ప్రశ్న మీదే రామ్ సక్సెస్ చేస్కోవడం ఆధారపడింది.
హీరో రామ్ తో కలర్‌ఫుల్ క్యారక్టరైజేషన్, రకుల్ ప్రీత్ సింగ్, సోనాల్ చౌహాన్ ల వంటి హిందీ హీరోయిన్లతో దండిగా గ్లామర్ కోషెంట్, బ్రహ్మానందంతో హాయైన కామిక్ రిలీఫ్, సంపత్ రాజ్ తో టఫ్ విలనిజం- ఈ నాలుగు మూల స్థంభాలతో ప్రేక్షకులకి ఒక అపూర్వ ఆనందానుభూతుల్ని ఇవ్వగల అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారా లేదా ఈ కింద చూద్దాం..
ఏమిటీ ఈ కుటుంబ సంబంధాలు?
ఎప్పుడో పాతికేళ్ళ క్రితం భూపతి ( సంపత్ రాజ్)- సాయి రెడ్డి (సాయికుమార్) లు స్నేహితులు. తమ కుటుంబాల్లోనే పెళ్ళిళ్ళు కుదుర్చుకున్నారు. భూపతి తమ్ముళ్ళు సాయిరెడ్డి చెల్లెళ్ళని చేసుకున్నారు. భూపతి ఒక చెల్లెలు సరస్వతి ( పవిత్రా లోకేష్) సాయిరెడ్డినే చేసుకోవాలి. కానీ ఆమె రహస్యంగా వేరే వ్యక్తి ( రావురమేష్) ని ప్రేమించి గర్భవతి అయింది. ఈ విషయం సాయి రెడ్డికి చెప్పేస్తే అతను వాళ్ళిద్దరి పెళ్లి జరిపించేసి ఫారిన్ పంపించేశాడు. దీంతో సాయి రెడ్డిని అపార్ధం జేసుకున్న భూపతీ, అతడి తమ్ముళ్ళూ మొత్తం సాయిరెడ్డి చెల్లెళ్ళనీ సాయి రెడ్డి ఇంటికే పంపించేశారు. పాతికేళ్ళుగా ఈ ఎడం ఇంకా కొనసాగుతూనే వుంది.
భూపతికి పుట్టిన కూతురు దివ్య ( రకుల్ ప్రీత్ సింగ్) ఎవరి దగ్గర ఉండాలన్న దానిపై కోర్టు తీర్పునిచ్చింది. ఈమె మేనమామ సాయిరెడ్డి దగ్గరే ఉండొచ్చు- పెళ్లి మాత్రం తండ్రి భూపతి చూసిన సంబంధమే చేసుకోవాలి.
ఈ నేపధ్యంలో ఫారిన్ లో ( పోర్చుగల్) లో సరస్వతికి పుట్టి పెరిగిన కార్తీక్ ఆ వయసులోనే కోట్లకు పడగలెత్తి, పెద్ద పెద్ద కంపెనీలు నడుపుతూంటాడు. తన దగ్గరే తండ్రి, చెల్లెలు, బావ పనిచేస్తూంటారు. ప్రతీదీ డబ్బుతో కొలుస్తాడు. ఇంకా ఎదగాలని కలలు గంటాడు. అక్కడే అనుష్కా (సోనాల్ చౌహాన్) అనే యంగ్ బిజినెస్ వుమన్ వుంటుంది. ఈమెదీ కార్తీక్ లాంటి మనస్తత్వమే. కాకపోతే ఈ మె తండ్రి ఒక వీలునామా రాశాడు- ఇంకో నెల రోజుల్లోగా ఈమె పెళ్లి చేసుకోక పోతే- మొత్తం 300 కోట్ల రూపాయల ఆస్తీ ట్రస్ట్ కి వెళ్ళిపోతుందని. దీంతో వీకెండ్ వెంకట్రావ్ ( బ్రహ్మానందం) అనే అసిస్టెంట్ సలహా తీసుకుని కార్తీక్ కి పెళ్లిని ప్రతిపాదిస్తుంది. ఇద్దరూ కలిస్తే బిజినెస్ కి మంచిదేనని కార్తీక్ ఈమె తో ఎంగేజ్ మెంట్ కి సిద్ధపడతాడు, కుటుంబ సభ్యుల అంగీకారంతోనే.
అప్పుడు ఇండియా నుంచి ఒక సమాచారం అందుతుంది. అక్కడ తెలుగు రాష్ట్రం లో తను నడుపుతున్న ఒక ఫ్యాక్టరీని మూసేయాలని కోర్టు ఆదేశాలిచ్చిందని. గ్రీన్ ఆర్మీ అనే ఎన్జీవో ఈ ఫ్యాక్టరీ పర్యావరణానికి ప్రమాదకరంగా మారిందని అర్జీ పెట్టుకోవడంతో కోర్టు ఆ ఫ్యాక్టరీని మూయించేసింది!
కార్తీక్ బయల్దేరి తెలుగు రాష్ట్రానికి వచ్చేస్తాడు. దివ్య మీద ప్రేమాస్త్రం ప్రయోగిస్తాడు- ఆమెని లొంగ దీసుకుని ఫ్యాక్టరీ ని తెరిపించుకోవాలని. అయితే నేరుగా ప్రేమించకుండా ఆమె రూమ్ మేట్ ని ప్రేమిస్తున్నట్టు నటిస్తూ ఉడికిస్తూంటాడు. దివ్య తండ్రి దగ్గర ఉండక, మేనమామ దగ్గరా వుండకా ఏటో వెళ్ళిపోయిందని ముఠా లేసుకుని వెతుకుతున్న భూపతి- సాయి రెడ్డిలు ఆమెని పట్టుకోవడం కోసం ఎట్టకేలకు వచ్చేసినప్పుడు- కార్తీక్ ఎదుర్కొంటాడు. అప్పుడు భూపతికి కార్తీక్ బాగా నచ్చుతాడు. ఇతనే తన అల్లుడని ప్రకటిస్తాడు. అసలు ఫ్యాక్టరీ మూతబడ్డం, దివ్య ఉద్యమం ఏవీ నిజం కావనీ, వేరే ప్లానుతో తను ఈ రూట్లో వచ్చాననీ కార్తీక్ చెప్పి కథ మలుపు (!) తిప్పుతాడు. ఆ ప్లాన్ ఏమిటంటే ఈ విధంగా భూపతిని ఆకట్టుకుని, అతడి ఇంట్లో మకాం వేసి అందర్నీ బకరాల్ని చేసి, తల్లి సమస్యకి పరిష్కారం చూపడ మన్నమాట!
ఎవరెలా చేశారు?
ఈ కథలో పాత్రలే ఆషామాషీగా వున్నప్పుడు నటనల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరమే రాదు, వదిలేద్దాం. ఎడిటర్ గౌతమ్ రాజు సినిమా నిడివిని రెండు గంటలా నలభై రెండు నిమిషాల దాకా ఉదారంగా సాగదీసి వదిలేశారు. యాక్షన్ - ఫ్యామిలీ- కామెడీ- సెక్స్ మొదలైన జానర్స్ తో కలగాపులగమైపోయిన కథా గమనం ఇది కాబట్టి- ఈ ఒడిదుడుకుల ప్రయాణంలో సమీర్ రెడ్డి ఛాయగ్రహణం కూడా ఓడిదుడుకుల పాలైపోయింది. కథ ఏదో ఒక ఫీల్ తో సాగితే, ఆ ఫీల్ ని పట్టుకుని ఆసాంతమూ ఆయన దృశ్యమానం చేసే ఛాయాగ్రహణాన్ని ఆస్వాదించే వీలయ్యేది. ఒక దిశా దిక్కూ లేని స్క్రిప్టు ఎంత ఘోరంగా నటనల్ని, ఎడిటింగ్ ని, ఛాయాగ్రహణాన్నీ, రీరికార్డింగ్ నీ దెబ్బ తీసి వదుల్తుందో తెలియడానికి ఈ చలనచిత్రమే ఉదాహరణ. ఇక కథలో, సన్నివేశాల్లో కిక్కు లేనప్పుడు తమన్ సంగీతంలో పాటలు మాత్రమేం హైలైట్ అవుతాయి.
ఈ వెలిగొండ శ్రీనివాస్ రాసిన కథ మామూలు కాపీ కథ కాదు- కాపీ10 కథ! దీనికి కోనవెంకట్ రాసుకుపోయిన డైలాగులు న ‘బూతో’ న భవిష్యతీ..అనే అనాలి. స్టార్ సినిమా లంటే ఫ్యామిలీలు కూడా చూసే సినిమాలే . ఎప్పుడో అరుదుగా ‘టెంపర్’ లాంటి ఫ్యామిలీస్ కూడా చూడలేనివి వస్తూంటాయి. ‘పండగ చేస్కో’ ని ఫ్యామిలీస్ కూడా చూడాలన్న సదాశయంతోనే తీసి వుంటే, దీనికి సెన్సార్ వారు ‘U/A’ సర్టిఫికేట్ తో పరోక్షంగా ఫ్యామిలీలు కూడా చూడదగ్గ సినిమా కాదనేశారు!
స్క్రీన్ ప్లే సంగతులు
‘A culture cannot evolve without honest, powerful storytelling. When a society repeatedly experiences glossy, hollowed-out, pseudo-stories, it degenerates. We need true satires and tragedies, dramas and comedies that shine a clean light into the dingy corners of the human psyche and society.’ అంటాడు పాపులర్ స్క్రీన్ ప్లే పండితుడు రాబర్ట్ మెక్ కీ, కమర్షియల్ సినిమాల నుద్దేశించి.
ఇది మనకవసరమా? అవసరం లేదు. స్టార్ సినిమాలనేవి కేవలం బి, సి సెంటర్లలో వూర మాస్ ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకుని- repeatedly thrown upon glossy, hollowed-out, pseudo-stories మాత్రమే అయివుండాలి. మానమర్యాదలు ఎంత తక్కువ వుంటే అంత మంచిది. మిగతా నగరాల్లో, ఓవర్సీస్ లో వుండే పై తరగతి ప్రేక్షకులు కూడా ఈ ‘సబ్సిడీ బియ్యమే’ తినాలి. ఛాయిస్ లేదు. అయితే అదృష్ట మేమిటంటే ఈ repeatedly thrown upon glossy, hollowed-out, pseudo-stories తో వస్తున్న స్టార్ సినిమాలతో మాస్ ప్రేక్షక లోకం కూడా degenerate ఏమీ అవడం లేదిప్పుడు. వాళ్ళు బతక నేర్చిన వాళ్ళు. సబ్సిడీ బియ్యంలో కూడా ముక్కిన బియ్యాన్ని తిప్పికొట్టే స్పృహ వాళ్ళ కొచ్చేసింది! సగటు మనుషులైనందుకు ఎప్పటినుంచో వాళ్లకి తెలిసింది ఒక్కటే- పల్లెటూరి రచ్చ బండల దగ్గర- రాత్రి చూసొచ్చిన సినిమా గురించి- ‘ఒరే ఫస్టాఫ్ కామెడీ- సెకండాఫ్ స్టోరీరా!’ అనేసి తామేదో తెలుగు సినిమాల స్క్రీన్ ప్లే రహస్యాన్ని కనిపెట్టేసినట్టు చంకలు కొట్టుకోవడం!
మాస్ ప్రేక్షకులకి కూడా మస్తిష్కం వుంటుంది. వాళ్ళు ఫస్టాఫ్ లో కథ లేకుండానే కామెడీ అంతా ఎంజాయ్ చేసి- ఇక సెకండాఫ్ లో దర్శకుడు సీరియస్ గా చూపబోయే కథ కోసం-పక్కా కథకోసం- చేతులు కట్టుకుని డిసిప్లిన్డ్ గా కూర్చునేవాళ్ళు. సెకండాఫ్ లో ఎంత బరువైన కథనైనా ఇన్వాల్వ్ అయిపోయి ఆలోచనాత్మకంగా చూసే వాళ్ళు- ఫస్టాఫ్ లో అంత కామెడీని ఎంజాయ్ చేశాంగా? అన్న ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో. సెకండాఫ్ లో మెయిన్ లైన్ లో వున్న ప్రధాన పాత్రల్ని కామెడీ లోకి దింపకుండా, వేరే హాస్యగాళ్ళతో సపరేట్ కామెడీ ట్రాకులతో ఎంటర్ టెయిన్ మెంట్ తగ్గకుండా చూసే వాళ్ళు. ప్రధాన పాత్రలతో కొనసాగుతున్న ప్రధాన కథని సెకండాఫ్ లో గల్లంతు చేసేవాళ్ళు కాదు.
కనుక మాస్ జనంలో ఫస్టాఫ్ కామెడీ- సెకండాఫ్ స్టోరీరా! - కొటేషన్ ఇప్పటికీ మారి ఉండడానికి వీల్లేదు. ఎవరో కొంత శాతం కెరీర్ తప్ప మరో ధ్యాసలేని మధ్యతరగతి యువత తమ సాంస్కృతిక మూలాలకి దూరమై, సినిమాల్ని పాప్ కార్న్ ఎంటర్ టైనర్ లుగా మాత్రమే – మెదళ్ళని ఇళ్ళ దగ్గర వదిలేసి- కాసేపు నవ్వేసుకుని వెళ్లిపోతే చాలన్నట్టుగా చూడ్డానికి అలవాటు పడ్డారేమో గానీ- బిసి సెంటర్లలో మాస్ లో మార్పేమీ రాలేదు.
స్టార్ సినిమాలు తీస్తున్న వాళ్ళే కథని పణంగా పెట్టి- ఫస్టాఫ్ కథతో సంబంధంలేని కామెడీ, సెకండాఫ్ లోకూడా కథతో సంబంధం లేని కామెడీ-మొత్తంగా కథతో సంబంధంలేని కామెడీతోనే నడపాలి- అన్న ఆదుర్దానో, తెచ్చి పెట్టుకున్న అభద్రతా భావమో పెంచుకుని అయోమయపు సినిమాలు అందిస్తున్నారు. ఈ రూటులో మొన్నే ఇలాటి ఒక ‘మోసగాళ్ళకు మోసగాడు’ అయింది; ఇప్పుడు ‘పండగ చేస్కో’ అవుతోంది!
పైన- రెగ్యులర్ కమర్షియల్ = కుటుంబ
సంబంధాల కథ + వినోదం అనే బేసిక్ బాక్సాఫీస్ ఫ్రెండ్లీ ఈక్వేషన్ ని రామ్ పికప్
చేసుకోవడంలో ఎలాటి పొరపాటూ చేయలేదనుకున్నాం. ఈ బేసిక్ ఈక్వేషన్ కి పూసిన పూతలు (
షుగర్ కోటింగ్స్) ఒకటి కాదు, రెండూ కాదు...యాక్షన్ పూత, కామెడీ పూత, సెంటిమెంటు
పూత, అశ్లీలపు పూత.. ఇలా ఈ కథలో ఎన్ని రకాల ఇతర సినిమాల కథలుంటే వాటి తాలూకు పూతలన్నీ పూసేశారు. ఈ పూతల్ని కోన
వెంకట్ అనితర సాధ్యంగా కనిపెట్టిన సింగిల్ విండో లోకి పంపిస్తే, ఈరకంగా స్క్రిప్తుగా తయారై ఇవతలకి వచ్చేసిందన్న మాట.
ఈ సింగిల్ విండోలోకి ఇంకో పదేళ్ళు ఏ రకం కథ, ఇంకెలాటి కథ పంపినా అవన్నీ ఒకే పోతలో రూపం పోసుకుని, క్లోనింగ్ బేబీస్ లా డెలివరీ అవుతూనే వుంటాయన్న మాట. 2003 లో వినాయక్- నితిన్ ల కాంబినేషన్ లో ‘దిల్’ అనే హిట్ వచ్చింది. దీంట్లో పరిచయమైన ‘విలన్ ఇంట్లో హీరో కుటుంబం చేరి చేసే కన్ఫ్యూజ్ కామెడీ’ స్కీము, 2007 లో శ్రీను వైట్ల- మంచు విష్ణుల ‘ఢీ’ అనే సినిమాలోకి దిగుమతి అయి, కోన వెంకట్ చేతికి సింగిల్ విండో స్కీముగా అంది, తెలుగు సినిమాలకి వరప్రదాయని అయింది!
ఈయన సంగతి ఇలా ఉందా అని, వెలిగొండ శ్రీనివాస్ తను ఎక్కడెక్కడ్నించో లిఫ్ట్ ఇరిగేషన్ చేసుకొచ్చిన ఘోరమైన, బరువైన కాపీ10 ప్యాకింగ్ తెచ్చి కోన వెంకట్ కిస్తే, ఆయన ఆటోమేటిగ్గా తన సింగిల్ విండోలో పది పన్నెండు పూతలేసి, మర ఆడించి, పైకి తీస్తే చెక్కు చెదరకుండా రొటీన్ షేపులోనే వచ్చేసింది!
ఒక హీరో హీరోయిన్ తో ఆడుతూ పాడుతూ తిరుగుతూంటాడు. ఇంటర్వెల్లో ఏదో సమస్య ఎదురవుతుంది. అప్పుడు విలన్ ఇంట్లో మకాం వేసి రకరకాల వాళ్ళని దింపి, ‘కన్ఫ్యూజ్ కామెడీ’ తో బకారాల్ని చేస్తాడు. చివరికి ఈ బకరాలని ఉపయోగించుకుని సమస్య పరిష్కరించు కుంటాడు. ఇవీ సింగిల్ విండో స్కీమ్ సేమ్ స్టోరీ పూర్వాపరాలు.

సింగిల్ విండో స్కీమ్ మేడీజీ
హీరో హీరోయిన్లు- ఆటాపాటా
హీరోకి ఓ సమస్య
విలన్ ఇంట్లో హీరో
ఇంకా అనేక క్యారక్టర్లు
వాళ్ళని హీరో బకారాలుగా చేయడం
కన్యూజ్ కామెడీతో బకారాల్ని ఆటపట్టించడం
తానెవరో చెప్పి కథం ముగించడం!
దట్సాల్ !
హీరోకి ఓ సమస్య
విలన్ ఇంట్లో హీరో
ఇంకా అనేక క్యారక్టర్లు
వాళ్ళని హీరో బకారాలుగా చేయడం
కన్యూజ్ కామెడీతో బకారాల్ని ఆటపట్టించడం
తానెవరో చెప్పి కథం ముగించడం!
దట్సాల్ !
ఈ స్కీములో ఈ సారి కూడా రెగ్యులర్
కమర్షియల్ = కుటుంబ సంబంధాల కథ + వినోదం అనే బేసిక్ బాక్సాఫీస్ ఫ్రెండ్లీ ఈక్వేషన్
ఇర్రెగ్యులర్ ఈక్వేషన్ గా ఎలా మారిందో ఇప్పుడు చూద్దాం.
ఈ సినిమాలో కథనేది పాతికేళ్ళ క్రితం పుట్టింది. భూపతీ, అతడి తమ్ముళ్ళూ, పెళ్లి చేసుకున్న సాయి రెడ్డి చెల్లెళ్ళు నల్గుర్నీ అతడి ఇంటికే పంపేసి పగదీర్చుకున్నారు. దీనికి కారణమైన భూపతి చెల్లెలు, అంటే హీరో తల్లి ఈ విషయం హీరోకి చెప్పింది. హీరో ఆ కుటుంబాల్ని కలిపి తల్లి కోరిక తీర్చాలని బయల్దేరాడు.
ఇదెంత అసహజంగా, కృత్రిమంగా వున్నా, మౌలికంగా – మూలంలో ఇది కుటుంబ సంబంధాల కథే. మనసుపొరల్లో పేరుకు పోయిన విష ద్వేషాలతో సంఘర్షణ. మానసిక సంబంధమైనది. తగు జాగ్రత్త తీసుకుని, భావోద్వేగాల్ని అదుపుచేస్తూ, ఆయా పక్షాల మనోభావాలు దెబ్బతీయకుండా- ఒక సైకో థెరఫీ తరహాలో సున్నితంగా పరిష్కరించాల్సిన సమస్య.
ఇలాటి కథని ప్రారంభించడమే దడదడ మని చంపుకునే ముఠాలతో, వాళ్ళ చేతుల్లో రక్తాన్ని చిందించే కత్తులూ తుపాకులతో, స్కార్పియో కార్ల పేలుళ్లతో హింసాత్మకంగా ప్రారంభించడమేమిటి? చాలా సిల్లీగా లేదూ? ఎవడో జైల్లోంచి విడుదలై ఇంకెవణ్ణో చంపడానికి రావడమనే దాంతో ఈ సినిమాకి సంబంధమేమిటి? ఆ తర్వాత హీరోయిన్ కోసం భూపతీ, సాయి రెడ్డిలు ముఠాలుగా ఏర్పడి మారణాయుధాలతో తరుముకుంటూ రావడమేమిటి, హీరోయిన్ నేరస్థు రాలైనట్టు?
హీరోయిన్ ట్రైన్ లో తమ వూరికి వస్తోందనే అనుకుందాం; ఆమెని తీసి కెళ్ళేందుకు పోటీలు పడి వస్తున్న భూపతి, సాయి రెడ్డీలు ముఠాలు లేకుండా ఫన్నీ క్యారక్టర్స్ తో ఎత్తుకు పైయెత్తు లేసుకుంటూ ఫన్నీగానే రావాలిగా? అలా దీన్ని ఓపెనింగ్ లోనే ఇది ఫ్యామిలీ ఫన్ మూవీ అన్న భావాన్ని ఎష్టాబ్లిష్ చేసి, ప్రేక్షకుల్ని థ్రిల్లింగ్ గా కొత్త అనుభూతితో సంసిద్ధుల్ని చేయాలిగా? ఫస్ట్ యాక్ట్ బిజినెస్ ఏమిటి? ఇక్కడ ఎష్టాబ్లిష్ చేయాల్సిన కథానేపధ్యం అనే టూల్ తో చూపబోయే కథ గురించి ప్రేక్షకులకి ఏం హింట్ ఇవ్వాలి?
ప్రతీ సినిమాకీ కాపీ కొట్టినట్టు ఇదే ప్రారంభమా? ప్రతీ కథా ఒకేలాగా ప్రారంభామౌతాయా ఎక్కడైనా? ‘సన్నాఫ్ సత్య మూర్తి’ అనే ఫ్లాపైన కుటుంబ సంబంధాల కథని కూడా ఇంతే రాక్షసంగా చాలా దారుణంగా ప్రారంభించారు. ప్రతీ సినిమాకీ గత పదేళ్లుగా ఈ బెడద వదలదా?
ఇవి తప్ప వేరే కథా ప్రారంభాలే ఉండవా? అసలు కుటుంబ కథకి ఈ ముఠాల ముష్టి హింసతో ప్రారంభాలేమిటి? ఈ తెచ్చిపెట్టుకుంటున్న బిల్డప్పులేమిటి? వీటికేమైనా ప్రేక్షకులు సీట్లకి అతుక్కుపోయి కూర్చుంటున్నారా? ఇవెంత హాస్యాస్పదంగా తయారయ్యాయో ఎవరైనా ఫీల్డు బయట నుంచి గమనించారా?
ఇంకా ఈ సినిమాలో అడుగడుగునా అర్ధంపర్ధం లేకుండా కొత్త కొత్త ముఠాలు పుట్టుకొస్తాయి. ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీ అన్న స్పృహ కూడా లేకుండా రాక్షసమైన అరుపులతో బీభత్సం సృష్టిస్తాయి. ఒక కుటుంబ సంబంధాల కథని దాని జానర్ మర్యాదని గౌరవిస్తూ- రాక్షస విలన్లూ వాళ్ళ ముఠాలూ లేకుండా- ఫీల్ గుడ్ నేచర్ తో తీయలేకపోతే, ఫ్యామిలీ కథల జోలికే వెళ్ళనవసరం లేదు. సినిమా ఈజ్ సైకో థెరఫీ అన్న ప్రాథమిక సూత్రాన్ని ఒప్పుకో గల్గితే వాటి జోలి కెళ్ళొచ్చు. అన్ని కథలకీ ఒకే రొడ్డ కొట్టుడు ట్రీట్ మెంట్ ఇస్తే ఇలాగే మొరటుగా, నాటుగా అవకరాలతో పుట్టిన ఇర్రెగ్యులర్ కమర్షియల్స్ చేతికొస్తాయి.

కథలో హీరోనా? అతనెవరు?
కథలో హీరోనా? అతనెవరు?
ఈ కథకి ఒక కథా పథకం ( ప్లాటింగ్) అంటూ లేదు. ఆ కథా
పథకంలో మూల స్థంభాల్ని గుర్తించిందీ లేదు. మూలస్థంభాల్ని గుర్తిస్తే కథా పథక మనేది
వస్తుంది. హీరో- ఇద్దరు హీరోయిన్లు- బ్రహ్మానందం- సంపత్ రాజ్ పాత్రలు ఈ కథకి
మూలస్థంభాలు. ఈ పాత్రలతోనే కథని ప్రధానంగా నడపాలి. వీటిలో హీరో ని తప్పిస్తే, మిగిలిన నాల్గు
పాత్రలూ హీరోకి అనుకూలంగానో, వ్యతిరేకంగానో ప్రవర్తిస్తూ హీరో సంఘర్షణని హైలైట్
చేస్తూండాలి.
కానీ ఇదేమీ పట్టకుండా- ఎక్కడపడితే
అక్కడ ఎవరెవరో ముఠాల్ని దింపుతూ, వాటితో కామెడీలతో ఉపకథల్ని పెంచేస్తూ, గందరగోళం
సృష్టించారు. ఒక దశలో ఏ పాత్ర ఏమిటో ఫాలో కాలేని భారాన్ని మోపేశారు.
సినిమా ప్రారంభించిన అరగంట లోపు బిగినింగ్ ముగిసింది. పోర్చుగల్ లో సెకండ్ హీరోయిన్ తో ఎంగేజ్ మెంట్ చేసుకున్న హీరోకి, ఇండియాలో తన ఫ్యాక్టరీ ఫస్ట్ హీరోయిన్ కారణంగా మూతబడిందని తెలియడంతో- సమస్య ఏర్పాటయి మిడిల్ లో పడింది కథ. ఈ మలుపు నిజానికి చాలా సెన్సాఫ్ డేంజర్ ని క్రియేట్ చేసింది! ఆ ఎంగేజ్ మెంట్ వల్ల సెకండ్ హీరోయిన్ తో అలా లాక్ అయిపోయిన హీరో- ఇప్పుడు ఫస్ట్ హీరోయిన్ తో ఏం చేస్తాడన్న ఆందోళనని సృష్టించింది నిజానికి. ఈ సైన్ పోస్టుని హైలైట్ చేయగలిగారా అంటే అదీ లేదు. ఈ సెన్సాఫ్ డేంజర్ నేపధ్యంలో కథ నడిపి ప్రేక్షకుల్ని కదలకుండా కట్టి పడేశారా అంటే అదీ లేదు. ఎంతసేపూ కామెడీ కామెడీ! తెలుగు ప్రేక్షకులు ఇంతోటి తెలుగు సినిమాల్లో కామెడీ కోసమే చచ్చిపోతున్నట్టూ, అది లేకపోతే సినిమాల్ని అట్టర్ ఫ్లాప్ చేసేస్తున్నట్టూ ఫీలైపోయి- ప్రేక్షకులతో నిజమైన సంబంధాలు తెగిపోయిన వాతావరణంలో కథ లేకుండా కామెడీల్ని వండేస్తున్నారు. ఈ కామెడీలు కూడా ఫ్రెష్ గా వుండవు.
కమర్షియల్ సినిమా కథెప్పుడూ హీరో హీరోయిన్లదే. వాళ్లకి ఏం జరిగిందన్నదే కథ. అంతే గానీ, ఈ సినిమాలోలాగా తల్లి చెప్పిందని, తల్లి కోసం బయల్దేరడం కథ కాదు. తల్లి కోసం, తండ్రి కోసం, చెల్లి కోసం, ఫ్రెండ్ కోసం హీరో బయల్దేరడమనేది కాలం చెల్లిన ఓల్డ్ ఫార్ములా. హీరోయిన్ కోసం హీరో చేయడమే నేటి సక్సెస్ ఫుల్ కమర్షియల్ ఫార్ములా.
పాతికేళ్ళూ సైలెంట్ గా వున్న తల్లి, హఠాత్తుగా మహాతల్లి అవతారం దాల్చి- అదికూడా తన స్వార్ధంకోసం కుటుంబాల్ని కలపమంటూ కొడుకుని ప్రేరేపించడం కాకుండా, కొడుకు కోసం ఒక పాయింటు చెప్పివుండాల్సింది...
‘బాబూ, నేనెలాగూ ఇలా అయిపోయాను. నువ్వు కూడా రేపు చుట్ట పక్కాల్లేని ఒంటరి కాకూడదు. ఎలాగైనా నువ్వైనా వెళ్లి అక్కడ నీ మరదల్ని చేసుకుని వాళ్ళందరితో సంబంధాలని కలుపుకో, అప్పుడే నాకు మనశ్శాంతి’ – అన్నదనుకుందాం, అప్పుడామె త్యాగశీలి అన్పించుకునేది.
హీరో అక్కడ హీరోయిన్ని చేపట్టడానికి మాత్రమే బయలేదేరే వాడు. ఇది పైకి కన్పించే బాక్సాఫీస్ అప్పీలున్న రొమాంటిక్ యాంగిల్ తో కూడిన ఫిజికల్ గోల్. దీన్ని సాధిస్తే ఆ పునరుద్ధరించిన బంధుత్వాల్లోకి ఆటో మేటిగ్గా తల్లికూడా జాయినై పోయి హీరో ఎమోషనల్ గోల్ కూడా పూర్తవుతుంది.
ఆల్రెడీ ఎంగేజ్ మెంట్ అయిన కొడుకుతో వెళ్లి మరదల్ని చేసుకోమని తల్లి ఎలా అంటుందని అనొచ్చు. ఈ తల్లి క్యారక్టర్ బయోగ్రఫీ ప్రకారం చూస్తే- వేరే పిల్లతో ఎంగేజ్ మెంట్ కి ససేమిరా అంటుంది. అప్పటికే ఆమె మేనకోడల్ని డిసైడ్ చేసుకుని వుంటుంది. కాబట్టి సినిమాలో చిత్రించినట్టుగా- సెకండ్ హీరోయిన్ తో పెళ్ళికి తల్లి ఒప్పుకోవడమనేది హీరో పాత్ర పరంగా చూసినా చాలా పూర్ కథనం. ఎంగేజ్ మెంట్ విషయం అసలు ఇంట్లో చెప్పకుండా సస్పెన్స్ క్రియేట్ చేసే వాడే నిజమైన హీరో!
What is character but the illumination of incident? And what is incident but the illumination of character?- అని పాత్రచిత్రణ గురించి హెన్రీ జేమ్స్ అన్నట్టు ఈ బ్లాగ్ లో అనేక సార్లు ప్రస్తావించుకున్నాం. హీరో పాత్ర దేదీప్యమానంగా వెలిగిపోవాలంటే పై పేరాలో చెప్పినట్టుగా ఇంట్లో చెప్పకుండా అతను సస్పెన్స్ క్రియేట్ చేయాల్సిందే. డైనమిక్స్ ని మెయింటైన్ చేయాల్సిందే. అప్పుడే దాన్ని క్యారక్టరైజేషన్ అంటారు.
హీరోకి ఇంకో రూటు క్లియర్ చేయాల్సి వుంటుంది- ఫస్ట్ హీరోయిన్ మేనమామ దగ్గరే ఉండొచ్చని, కానీ పెళ్లి మాత్రం తండ్రి చూసిన సంబంధమే చేసుకోవాలనీ కోర్టు ఉత్తర్వు లిచ్చిందని సొంత కవిత్వం చెబుతూ కథ రాసుకున్నారు. దీనికి అర్ధం పర్ధం ఏమైనా ఉందా? హీరోయిన్ తల్లిదండ్రు లేమైనా విడాకులు తీసుకున్నారా? మరి కోర్టు ఎలా ఉత్తర్వులిస్తుంది? కోర్టు మేనమామ దగ్గరే వుండాలని ఎలా చెప్తుంది? మేనమామ దగ్గర తల్లి ఉంటోంది. ఆ తల్లి దగ్గరే వుండాలని చెప్పకుండా మేనమామ ఏమిటి? ఆడదానికి పాత్ర ఉండరాదని కోర్టు వివక్ష చూపిందా? పైగా మైనారిటీ తీరాకా కూడా అక్కడే వుండాలని చెప్పిందా? తండ్రి చూసిన సంబంధమే హీరోయిన్ చేసుకోవాలని కూడా కోర్టు ఎలా చెప్తుంది? చట్ట ప్రకారం మైనారిటీ తీరాక ఆమె పెళ్లి ఆమె ఇష్టమని చెబుతున్న చట్టాలేమైనా మారిపోయాయా? స్టార్ సినిమాకి ఏ లాజిక్కూ అవసరంలేదా?
ఇలా బాధ్యతారాహిత్యంగా లింకులు పెట్టి ఫస్ట్ హీరోయిన్ కి లాజిక్‌కి నిలబడని ట్విస్టు పెట్టారు. ఆల్రెడీ మొదట్లోనే సెకండ్ హీరోయిన్ కి ఓ ట్విస్టు ఉండనే వుంది. నెలలోగా ఆమె పెళ్లి చేసుకోక పోతే ఆస్తి ట్రస్టుకి పోతుందని. ( ‘ది బ్యాచిలర్’ ( 1999) అనే హాలీవుడ్ హిట్ కథకి మెయిన్ పాయింటు ఇదే. కాకపోతే ట్విస్టు హీరో మీద వుంటుంది. ఈ హిట్ కూడా 1925 లో తీసిన మూకీ ‘సెవెన్ ఛాన్సెస్’ కి రీమేక్.. ఇదే పాయింటుతో ఒక యంగ్ స్టార్ కి కథ విన్పించాలనుకుంటున్న దర్శకుడికి ‘పండగ చేస్కో’ సినిమా చూస్తున్న ఈ వ్యాసకర్త, ఈ సినిమాలో ఈ పాయింటే వుందని మెసేజి కొడితే ఆయన షాకై పరుగులు తీశాడు! ఇంకో సినిమా చూస్తూ ఇంకో దర్శకుడికీ ఇలాగే ఓ మెసేజీ కొడితే ఆయన కూడా చేసుకున్న స్క్రిప్టు అవతల పడేసి కింకర్తవ్యం ఆలోచిస్తున్నాడు. కనీసం విడుదలవుతున్న తెలుగు సినిమాలు చూడకపోవడం, వాటి కథలేమిటో నెట్ లో ఓ నిమిషం పాటు చదువుకుని తెలుసుకోక పోవడం కొందరి స్టయిల్. ఎందుకంటే టాలీవుడ్ @ జోరుగా లిఫ్ట్ ఇరిగేషన్ కదా! అంత టైముండదు!)
సెకండ్ హీరోయిన్ కి అలా ట్విస్టు పెట్టాకా, మళ్ళీ ఫస్ట్ హీరోయిన్ కీ ట్విస్టు పెట్టడం అనాలోచితమైన కథనం. పునరుక్తితో రెండూ పేలవంగా తయారయ్యేవే. కాబట్టి ఫస్ట్ హీరోయిన్ కి ఎలాటి నిషేధాజ్ఞాలూ వుండే అవకాశం లేదు. ఇవి లేకపోయాక తండ్రీ మేనమామాలు తనకోసం ముఠాలతో కొట్టుకు చచ్చే – బలవంతంగా ఇరికించిన యాక్షన్ ఎపిసోడ్స్ కీ స్థానం వుండదు. కథ చాలా క్లీన్ గా స్పష్టంగా అర్ధమవుతూ హాయిగా వుంటుంది.
ఇదంతా స్టోరీ సెటప్- దీన్నందుకుని మిగతా కథ చెప్పాలి. ఇది వదిలేసి విలన్ ఇంట్లో ఇంకేవేవో లెక్కకందని పాత్రలతో, వాటి ఉపకథ లతో గందరగోళం చేశారు. ఒకవైపు శృంగారం కోసం నల్గురు భార్యలు- నల్గురు భర్తల పాట్లు, సెకండ్ హీరోయిన్ ని ఎలాగైనా అనుభవించాలని బ్రహ్మానందం ఆరాటం- ఆమే అనుకుని సంపత్ రాజ్ తో ‘గే’ చేష్టలకి పాల్పడడం...ముందు ఫస్ట్ హీరోయిన్ తో- తర్వాత సెకండ్ హీరోయిన్ తో విలన్ అభిమన్యూ సింగ్ వెర్రి చేష్టలు- వీటికి జేపీ సపోర్టు; భూపతి ముఠా- సాయిరెడ్డి ముఠాలేగాక, జేపీ ముఠా, వీళ్ళందరి మీదా ఇంకో ముఠా...బయట ముఠాల గొడవలు, లోపల కామ గోలలు, ఇంట్లోకి దూరిన మరో ఇద్దరు దొంగలూ- వీటన్నిటి మధ్యా హీరో మాయం! హీరో ఎక్కడుంటాడో తెలీదు- అసలు జ్ఞాపకమే రాడు! ఇదీ వరస.
సత్యజిత్ రే జీవిత చరిత్ర రాసిన మేరీ సెటన్ ఎప్పుడో 1960 లలోనే ఆ పుస్తకంలో పేర్కొంది - భారతీయ సినిమాలు ఇంకా వీధి భాగోతాల స్థాయి దాటుకుని రాలేక పోతున్నాయని! ‘పండగ చేస్కో’ చూస్తూంటే ఇప్పటికీ -ఇంకెప్పటికీ ఆమె మాటలు నిజమౌతూనే వుంటాయన్పిస్తోంది!
పాత్రోచితానుచితాలు
విదేశంలో అంత శక్తిమంతమైన యంగ్ బిజినెస్ మాన్ గా చెలామణి అయిన హీరో, సొంత ఊరికొచ్చేసరికి తానెవరో చెప్పుకునే ధైర్యంలేక దొంగాటకాలు మొదలెడతాడు. అద్భుతమైన వ్యాపార వ్యూహాలున్న వాడిలా బిల్డప్పిచ్చిన తను, ఇక్కడి సమస్యని తేల్చే బుద్ధికుశలత లేక భీరువులా ఏవేవో వేషాలేస్తాడు. ఫ్యాక్టరీ మూత బడ్డమూ, ఫస్ట్ హీరోయిన్ ఉద్యమమూ అంతా నాటకమని తేల్చేస్తాడు. ( ఎవరైనా స్క్రీన్ ప్లేలో బిగినింగ్ లో ఎస్టాబ్లిష్ చేసిన-టర్నింగ్ పాయింటుని ఇలా తీసిపడేసుకుని ప్రేక్షకుల్ని చీట్ చేసే సాహసం చేస్తారా!).
ఛీ, కథా కాకరకాయా ఎవడిక్కావాలి- అన్నట్టు హీరోగారు ఆ టర్నింగ్ పాయింటుని తీసి అవతలకి గిరవాటేసి- తను వచ్చిన పని వేరే అని ఇంటర్వెల్ ఇచ్చుకుని వెళ్ళిపోతాడు. అంతే, ఇక సెకండాఫ్ లో పనేం వుండదు. అతడికి క్కావాల్సిందదే! దర్శకుడూ రచయితలూ కథని తప్పించుకోవాలి- హీరో పని తప్పించుకోవాలి!
కానీ ఇంటర్వెల్ లో ప్లేటు ఫిరాయించే ముందు- ఎంగేజ్ మెంట్ చేసుకున్న సెకండ్ హీరోయిన్ తో అయినా తన ఎథిక్స్ ఏమయ్యాయో, ఇక్కడ ఫస్ట్ హీరోయిన్ తో ప్రేమాయణం మొదలెడతాడు. ఫస్ట్ హీరోయిన్ని నేరుగా ప్రేమించే దమ్ముల్లేక ఆమె రూమ్మేట్ ని ప్రేమిస్తున్నట్టు నటిస్తూ ఉడికిస్తూంటాడు. ఆ రూమ్మేట్ తల్లిదండ్రులు ఇక పెళ్లి చేసుకోమనగానే- తను ప్రేమిస్తున్నది ఫస్ట్ హీరోయిన్నే అని ఫస్ట్ హీరోయిన్ సహా అందరి ముందూ తోక ముడిచేస్తాడు! రూమ్మేట్ అమ్మాయిని ని ఘోరంగా అవమానిస్తాడు! ఇక్కడ్నించీ ఈ రూమ్మేట్ పాత్రకి- నువ్వు ఆడదానివే, నువ్విలాగే పడుండాలి సుమా- అన్న తీరులో అద్భుతమైన పాత్రచిత్రణ!!
ఫస్ట్ హీరోయిన్ని కూడా హీరో ప్రేమించడం అలా ప్రేమించి ఫ్యాక్టరీని తెరిపించుకోవడానికట! అంత కొమ్ములు తిరిగిన బిజినెస్ మాన్ కి వ్యవస్థ గురించే తెలీనట్టుంది? తీర్పు ఇచ్చేశాక ఈమె చేతుల్లో మాత్రం ఏముంటుంది? వెళ్లి అప్పీల్ చేసుకోవాలి. అసలు హీరో గారి పక్షం వాదన వినకుండానే- అసలు ఆయనకీ నోటీసులు పంపకుండానే, ముద్దు ముద్దు అల్లరి పిల్ల హీరోయిన్ పడేసిన పిటీషన్ ని పట్టుకుని, ఏకపక్షంగా కోర్టు తీర్పు పళ్ళెంలో పెట్టి ఇచ్చేసిందా?
ఇదంతా కట్టుకథ అంటాడు హీరో. ఇదేమిటో అస్సలు అర్ధంగాదు. కట్టు కథలో ఇన్ని బొక్కలా? అమ్మాయిల జీవితాలతో ఆడుకునే హీరోకి వేరే నాలెడ్జ్ ఏమంత వుంటుంది?
30 రోజుల టైం లాక్ తో హీరోతో పెళ్ళికోసం ఎదురు చూస్తున్న సెకండ్ హీరోయిన్ కూడా కామెడీగా మారిపోవడంతో ఈ పాత్రకూడా చచ్చిపోయింది. హీరో ఎర వేసిన బ్రహ్మానందం ని కాదనుకుని, ఛోటా విలన్ని చేసుకుని అంతటి హైఫై యంగ్ లేడీ కూడా ఈసురోమంటుంది దర్శకుడూ- రచయితల చేతుల్లో.
ఫస్ట్ హీరోయిన్ పిచ్చి పిల్ల. అంత ఎదిగినా తన హక్కులేంటో తనకే తెలీవు, అట్నుంచీ ఇట్నుంచీ తండ్రీ మేనమామలు పీకుతూంటే దాన్ని ఎంజాయ్ చేస్తూంటుంది. పైగా పర్యావరణ హక్కులంటూ టీనేజీ పిల్లాలా ఎగురుతూ కిలకిల నవ్వులతో ఊరేగింపులు తీస్తుంది. ఈమెని చూసి భయపడి ఫ్యాక్టరీ మూత పడేలా కోర్టు తీర్పు ఇచ్చిపారేసిందట! ఇంత ఉద్యమం చేస్తూ ఈమె అంతో ఇంతో పబ్లిక్ ఫిగర్ అయ్యే వుంటుంది. ఈమె ఎక్కడుందో ఛానెల్స్ లో చూస్తే తెలిసిపోతుంది. అయినా తండ్రీ మేనమామల ముఠాలు పదండ్రా అని ఎక్కడెక్కడో పడి వెతుకుతూంటారు. సినిమాలో యాక్షన్ సీన్స్ బాగా ఇరగదీయాలనా?
తల్లి క్యారెక్టర్...తన కోసం త్యాగం చేసుకున్న సాయిరెడ్డినీ, అతడి నల్గురు చెల్లెళ్ళనీ వాళ్ళ ఖర్మానికి వదిలేసి ఎక్కడో విదేశంలో సకలైశ్వర్యాలూ అనుభవిస్తున్న తను- ఎప్పుడో మేల్కోవాలి. పాతికేళ్ళుగా కాపురాల్లేక కొడిగట్టిన ఆ చెల్లెళ్ళ జీవితాల్ని, ఇక పిల్లలు పుట్టే వయసు కూడా దాటిపోయిన వాళ్ళ దైన్యాన్నీ పట్టించుకోకుండా ఎలా వుంటుంది? పాతికేళ్ళ తర్వాత తన స్వార్ధం కోసం వాళ్ళంతా గుర్తొచ్చారా? ఇప్పుడు వాళ్ళతో కలుపుకోకుంటే తను బతకలేదా?
భూపతి కూడా మూర్ఖుడు. తను ఒక పిల్లని కనేశాడు, తనకి బాధలేదు. తన తలతిక్క తనం తో తమ్ముళ్ళని భార్యల నుంచి విడగొట్టి మొండి గోడల్ని చేశాడు. పాతికేళ్ళుగా ఆ తమ్ముళ్ళు పెళ్ళాం పిల్ల ల్లేకుండా, అన్నకి ఎదురు తిరక్కుండా ఎలావుంటారో అర్ధంగాదు. అటు సాయి రెడ్డి కూడా ఇలాటి మొగుళ్ళ పీడా తన చెల్లెళ్లకి వదిలిస్తూ విడాకు లిప్పించి వేరే పెళ్ళిళ్ళు చేసెయ్యొచ్చు. అదేదో గొప్ప ఫ్రెండ్ షిప్ అయినట్టూ- ఆ ఫ్రెండ్ షిప్ కోసం త్యాగాలు చేస్తున్నట్టూ మూర్ఖంగా చెల్లెళ్ళని బలితీసుకోవడం! భూపతితో తనకి సెంటిమెంటు వుంటే, చెల్లెళ్లకి సంబంధమేమిటి?
ఇలా ఫ్యామిలీ స్టోరీ అన్న ప్రచారంతో ఎలాపడితే అలా అడ్డగోలు చిత్రణలూ, కథలూ ఎందుకొస్తాయంటే ఇవి నరుక్కునే దుర్మాగుల కుటుంబాల కథలు కావం వల్లే. నరుక్కునే దుర్మాగుల కుటుంబ కథలు తప్ప ఇంకే కుటుంబాల కథలూ చెప్పడం చేతగానందు వల్ల! కాబట్టి ఫ్యామిలీ సినిమా వచ్చిందంటే నరుక్కునే దుర్మార్గుల కుటుంబాల గోడు చూడబోతున్నామని ముందే సిద్ధపడి వెళ్ళాల్సి వుంటుంది..

—సికిందర్