రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...
టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!
Thursday, April 3, 2025
Tuesday, April 1, 2025
1372 : స్క్రీన్ ప్లే సంగతులు
సస్పెన్స్ థ్రిల్లర్లు
లేదా మర్డర్ మిస్టరీలు మలయాళం నుంచే అన్ని భాషల ప్రేక్షకుల దృష్టినీ ఎందుకాకర్షిస్తాయి? అంటే అన్ని మలయాళం సినిమాలని కాదు, కొన్నే కావచ్చు. క్వాలిటీతో ఆ కొన్నయినా ఇతర భాషల నుంచి
రావడం లేదు. ఒకప్పుడు తెలుపు- నలుపు సినిమాల కాలంలో ఈ జానర్ సినిమాలంటే చవకబారు
సినిమాలుగా ముద్ర వుండేది. అదే ముద్రని నేటికీ సర్టిఫై చేస్తూ ఎలా పడితే అలా ఈ
జానర్ సినిమాలు తీసేస్తున్నారు. గత సంవత్సరం తెలుగులో 21 తీస్తే, ఒక్క ‘మత్తు వదలరా -2’ తప్ప మిగతా 20 అట్టర్ ఫ్లాపయ్యాయి. కారణం, ఈ జానర్ లో కథా
సృష్టి ఎలా జరుగుతుందో తెలియక పోవడం. అదే మలయాళంలో పదమూడు తీస్తే 10 హిట్టయ్యాయి.
ఇవన్నీ ఈ జానర్లో అద్భుతాలు కావు. కానీ వీటిలో గత నవంబర్ లో విడుదలైన ‘సూక్ష్మదర్శిని’ అద్భుతమే. తర్వాత గత జనవరిలో విడుదలైన ‘రేఖాచిత్రం’ అద్భుతమే. ఈ జానర్ కథలకి ఏఏ హంగులు కూర్చి కొత్తగా మారుస్తున్నారనేదానికి ఈ
రెండు సినిమాలు స్టడీ మెటీరీయల్ అనాలి. కనుక ఈ దృష్టితో స్క్రీన్ ప్లే సంగతుల్లోకి
వెళ్ళే ముందు దీని దర్శకుడు జోఫిన్ చాకో, రచయితలు జాన్ మంథ్రిక ల్, రామూ సునీల్ లని తెలుసుకుంటే చాలు...
బిగినింగ్ విభాగం
40 ఏళ్ళ క్రితం, 1985లో - ఓపెనింగ్ ఇమేజి : చీకట్లో ఓ
అడవిలో నల్గురు వ్యక్తులు చాపలో చుట్టిన మృత దేహాన్ని ఒక ఇంటి నుంచి తీసికెళ్తూ
కనిపిస్తారు. ఇద్దరు పిల్లలు దూరం నుంచి
ఇది చూస్తారు. మర్నాడు ఆ పిల్లల్లో
ఒకడు తన మిత్రుడికి గత రాత్రి తన తండ్రి సినిమాలో నటిస్తూ కనిపించాడని, నలుగురు వ్యక్తులు
మృతదేహాన్ని తీసుకెళ్ళే దృశ్యంలో తన తండ్రి నటించాడనీ చెప్తాడు.
ప్రస్తుతం -2025లో బిగినింగ్ విభాగం : రెండు సమాంతర కథనాలు కొనసాగుతాయి - సంపన్న వ్యాపారవేత్త రాజన్న
(సిద్ధీఖ్) తో ఒకటి, ఇన్స్ పెక్టర్ వివేక్ గోపీనాథ్
(ఆసిఫ్ అలీ) తో ఒకటి. రాజన్న తన డ్రైవర్‌తో కలిసి కారులో
బయలుదేరతాడు. తీవ్ర దుఃఖంతో మద్యం తాగుతూ, మలక్కప్పార
సమీపంలోని అరణ్య ప్రాంతానికి చేరుకుంటాడు. మలక్కప్పార కేరళలోని త్రిసూర్ జిల్లాలో ఒక చిన్న హిల్
స్టేషన్. కేరళ-తమిళనాడు
సరిహద్దులో వుంటుంది.
డ్రైవర్ కారులో వెయిట్ చేస్తూంటే, రాజన్న అడవిలో వెతుక్కుంటూ వెళ్ళి ఒక చోట కూర్చుని, ఫేస్బుక్లో లైవ్ ప్రసారం ప్రారంభిస్తాడు. తాను ఇప్పడు ధనికుడైనా, ఒకప్పుడు బీదవాడినని మరణ వాగ్మూలం లో వెల్లడిస్తాడు. 1985లో తాను, విన్సెంట్, ఫ్రాన్సిస్ లు కలిసి ఒక అమ్మాయి మృతదేహాన్ని ఇక్కడే పాతిపెట్టామని చెప్తాడు. ఇలా చెప్పి ఆ లైవ్ వీడియో చివర్లో రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంటాడు.
ఇటు ఇన్స్ పెక్టర్ వివేక్ డ్యూటీలో వుంటూ ఆన్లైన్లో పేకాట ఆడినందుకు సస్పెండ్ అయి వుంటాడు. ఇప్పుడు సస్పెన్షన్ ఎత్తివేసి మలక్కప్పార పోలీస్ స్టేషన్‌కి బదిలీ చేస్తాడు పై అధికారి డిప్యూటీ ఎస్పీ మోహన్ దాస్ (నిశాంత్ సాగర్). అక్కడ డ్యూటీలో చేరిన మొదటి రోజే రాజన్న ఆత్మహత్య కేసు దర్యాప్తు వివేక్ కి అప్పగిస్తాడు డిప్యూటీ ఎస్పీ మోహన్ దాస్. అడవిలో రాజన్న ఆత్మహత్య చేసుకున్న ప్రదేశాన్ని తవ్వించి ఒక అస్థిపంజరాన్ని పైకి తీయిస్తాడు ఇన్స్ పెక్టర్ వివేక్. ఆ గొయ్యిలో ఒక కాలి పట్టీ కూడా దొరుకుతుంది. అస్థి పంజరం స్త్రీదిగా గుర్తించాక, ఈమె ఎవరో తెలియక దర్యాప్తు కొంతకాలం నిలిచిపోతుంది.
మరో వైపు వివేక్, మృతుడు రాజన్న చెప్పిన సహ నిందితులైన విన్సెంట్, ఫ్రాన్సిస్ ల గురించి దర్యాప్తు ప్రారంభిస్తాడు. బిగ్ షాట్ అయిన విన్సెంట్ (మనోజ్ కె. జయన్) అనారోగ్యంతో వున్న భార్య అలీస్ (సలీమా) ని కనిపెట్టుకుని వుంటాడు. కొడుకు వచ్చి ఛానెల్స్ లో ప్రసారమవుతున్న రాజన్న వీడియో చూపించేసరికి విన్సెంట్ అప్రమత్తమై, తన అడ్వకేట్ జాకబ్(విజయ్ మీనన్) తో చర్చిస్తాడు. తర్వాత ఇన్స్ పెక్టర్ వివేక్ విచారణ కోసం పిలిచినప్పుడు, అతడితో సహకరిస్తాడు కానీ, తన మీద ఎటువంటి అనుమానాలు రేకెత్తించని విధంగా మాట్లాడి వెళ్ళిపోతాడు.
ఇక వివేక్ తప్పిపోయిన అమ్మాయిల కేసుల కోసం 1985 నాటి పోలీసు రికార్డుల్ని పరిశీలిస్తాడు. అప్పట్లో తప్పిపోయిన అమ్మాయిల కుటుంబాల్ని కలుస్తాడు. ఫలితం వుండదు. మరిన్ని ఫైల్స్ చూస్తూంటే సినిమా ప్రొడక్షన్ మేనేజర్ చంద్రప్పన్(ఇంద్రాంశ్) దృష్టికొస్తాడు. అతన్ని కలుసుకుంటే, 1985 లో రేఖ (అనస్వరా రాజన్) అనే జ్యూనియర్ ఆర్టిస్టు గురించి చెప్తాడు. అప్పట్లో మమ్ముట్టి నటిస్తున్న ‘కథోడు కథోరం’ సినిమాలో బుక్కయ్యింది. అయితే షూటింగ్ మధ్యలో ఆమె అదృశ్యమవడంతో తను పోలీస్ కంప్లెయింట్ ఇచ్చాడు. ఆ సినిమాలోని ఒక పాటలో కనిపిస్తున్న ఒకమ్మాయిని రేఖగా గుర్తిస్తాడు చంద్రప్పన్. ఈ విజువల్ తో రేఖ ఇమేజిని సృష్టించడంతో వివేక్ దర్యాప్తు కీలక దశకి చేరుకుంటుంది...ఇదీ బిగినింగ్ విభాగపు విషయం.
ఇది ఆల్టర్నేట్ హిస్టరీ జానర్ లో
మర్డర్ మిస్టరీ కథ కాబట్టి మర్డర్ మిస్టరీ జానర్ మర్యాదలతో వుంది. మర్డర్ మిస్టరీ
అంటే ఎండ్ సస్పెన్స్ కథ అని తెలిసిందే. ఒక హత్య జరిగితే ఎవరు చేశారో కనుగొనేందుకు
హీరో చేసే జర్నీ. ఈ జర్నీలో చివరిదాకా హంతకుడెవరో హీరోకి తెలియదు కాబట్టి, అప్పటివరకూ ఆ హంతకుడు ప్రేక్షకులకి కూడా తెలియడు కాబట్టీ, ఆ హంతకుడితో హీరోకి సంఘర్షణ అనేది వుండదు. అంటే కథలో ఎదుటి పాత్రా, దాంతో యాక్షనూ వుండవు. అంటే కథ ముగింపులో ఆ హంతకుడ్ని కనుగొనే వరకూ
యాక్షన్ లోకి వెళ్ళదన్న మాట కథ. అప్పుడు
మాత్రమే ఎందుకు హత్య చేశాడో కారణం తెలుస్తుంది. అప్పటి వరకూ అన్నీ మూసి పెట్టి
వుంటాయి ఎండ్ సస్పెన్స్ కథల్లో.
కనుక ఎండ్ సస్పెన్స్- మర్డర్ మిస్టరీ కథనం కేవలం ఇన్వెస్టిగేషన్ తో హీరోచేసే అవరోధాల్లేని ఏకపక్ష జర్నీగా వుంటుంది. ఇందుకే ఎండ్ సస్పెన్స్ తో కూడిన మర్డర్ మిస్టరీ సినిమాలు ఫ్లాపవుతున్నాయి ఎప్పట్నించో. దీనికి కొన్ని దశాబ్దాల క్రితం విరుగుడు కనిపెట్టాయి హాలీవుడ్ కంపెనీలు. ఈ సెటప్ లో బిగినింగ్ ముగిశాక ప్లాట్ పాయింట్ వన్ దగ్గరే హంతకుడెవరో హీరోకీ, ప్రేక్షకులకీ రివీల్ చేసేస్తారు. ఇక వాణ్ని పట్టుకునే యాక్షన్ కథనం చేసేస్తారు. ఇది ఆద్యంతం థ్రిల్స్ తో ఇంట్రెస్టింగ్ గా వుంటుంది. దీన్ని సీన్ టు సీన్ సస్పెన్స్ కథనం అన్నారు. హంతకుడ్ని పట్టుకునే యాక్షన్ కథనంలో సస్పెన్స్ ని జోడించడం వల్ల. ఇలా సినిమా అనే దృశ్య మాధ్యమానికి చైతన్య రహితంగా నష్టాదాయకంగా వుంటున్న ఎండ్ సస్పెన్స్ తో కూడిన మర్డర్ మిస్టరీల కథనాలని సీన్ టు సీన్ సస్పెన్స్-యాక్షన్ కథనాలతో మార్చేసి, ఫ్లాపుల బారి నుంచి బయటపడ్డారు హాలీవుడ్డీయులు.
పోతే, ఏదైనా కథలో ఒక సస్పెన్స్ అనే ఎలిమెంట్ వుంటే దానికి రెండు ముఖాలుంటాయి : ఎవరు, ఎందుకు అన్నవి. ఎండ్ సస్పెన్స్ మర్డర్ మిస్టరీల్లో ఇవి రెండూ ఎండ్ వరకూ మూసి పెట్టేయడంతో, కథేమిటో చివరివరకూ తెలియదు. అదే సీన్ టు సీన్ సస్పెన్స్ కథలో ఎవరు (హంతకుడు) అనేది ఓపెన్ చేసేసి, ఎందుకు హత్య చేశాడనేది చివరి వరకూ హోల్డ్ కోసం అట్టి పెట్టుకుంటారు కాబట్టి ఉభయ కుశలోపరిగా వుంటుంది.
3. రేఖాచిత్రంలో సంకరం
పైన చెప్పుకున్నదంతా చాలా సార్లు
చెప్పుకున్నదే, మళ్ళీ గుర్తు చేయడానికే ఈ చరిత్ర పాఠం. ఇది
గుర్తు చేసుకోకపోతే ఈ స్క్రీన్ ప్లే సంగతులు అర్ధం కావు. చెప్పేదేమిటంటే ఈ ‘రేఖాచిత్రం’ కథ ఇంకా ఈ రోజుల్లో వస్తున్నలాటి ఎండ్
సస్పెన్స్ మర్డర్ మిస్టరీల్లాంటి కథ కాదు.
హాలీవుడ్ మార్చేసిన మర్డర్ తో సీన్ టు సీన్ సస్పెన్స్ కథ. అయితే ఇందులో బిగినింగ్
విభాగం ప్రారంభంలోనే హంతకులెవరో చెప్పేసి కూడా సంఘర్షణతో కూడిన యాక్షన్ కథనం చేయకుండా,
ఎండ్ సస్పెన్స్ మర్డర్ మిస్టరీల్లో ఇన్వెస్టిగేషన్ తో హీరో చేసే అవరోధాల్లేని ఏకపక్ష జర్నీగానే చేసేశారు. అంటే హంతకులెవరో తెలిసి పోయి చక్కగా
సాగాల్సిన సీన్ టు సీన్ సస్పెన్స్ కథనంలో మర్డర్ మిస్టరీల ఎండ్ సస్పెన్స్ కథనాన్ని
జొప్పించేసి సంకరం చేసేశారు!
ఇప్పుడు జానర్ గురించి. ఈ కథని
ఆల్టర్నేట్ హిస్టరీ జానర్ కథగా చెబుతూ సస్పెన్స్ థ్రిల్లర్ల మొనాటనీని బ్రేక్
చేశారు. ఒక కాల్పనిక కథని తీసికెళ్ళి చరిత్రలో జరిగిన ఏదైనా సంఘటనలో జొనిపితే అది
ఆల్టర్నేట్ హిస్టరీ (ప్రత్యామ్నాయ చరిత్ర)
జానర్ అవుతుంది. ఇది హాలీవుడ్ హై
కాన్సెప్ట్ కథల్లో వుండే ‘వాట్ ఇఫ్’ ( what if?) ఫ్యాక్టర్
ఆధారంగా వుంటుంది. అంటే హాలీవుడ్ హై కాన్సెప్ట్ కథల్లో ఒక గ్రహ శకలం వచ్చి భూమిని
తాకితే?...మనిషికి దేవుడు తన
శక్తుల్ని ఇచ్చేసి దాంతో వచ్చే సమస్యల్ని ఎదుర్కోమంటే?... ఈ తరహాలో ‘ఇలా జరిగితే?’ అన్న ఊహా జనిత పాయింటుతో వుండే కథలు ‘వాట్ ఇఫ్’ ఫ్యాక్టర్ కథలు. ఆల్టర్నేట్ హిస్టరీ కథలు ఈ ఫ్యాక్టర్ ఆధారంగానే వుంటాయి. హాలీవుడ్ లో
పదుల సంఖ్యలో వచ్చాయి. తమిళం లో కమల్ హాసన్ తో ‘హేరామ్’ అనేది మహాత్మా గాంధీని చంపడానికి గాడ్సే ప్లాన్ వేసుకు వెళ్తూంటే, అదే సమయంలో కల్పిత పాత్ర కమల్ హాసన్ కూడా మహాత్మాగాంధీని చంపే ప్లానుతో
ముందుకెళ్తూ వుండే ‘వాట్ ఇఫ్’
ఫ్యాక్టర్ కథ. ఇలా ఇప్పుడు ‘రేఖాచిత్రం’ మొదటి మలయాళం ఆల్టర్నేట్ హిస్టరీ
జానర్ అంటున్నారుగానీ, దీనికి చాలా పూర్వం ఈ జానర్లో కొన్ని
మలయాళం సినిమాలున్నాయని సమాచారముంది.
‘
రేఖాచిత్రం’ లో ఆల్టర్నేట్ హిస్టరీ ఏమిటంటే, 1985 లో మమ్ముట్టి నటించిన ‘కథోడు కథోరం’ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఒక జ్యూనియర్ ఆర్టిస్టు అదృశ్యమై హత్యకి గురైతే? ...అన్న ‘వాట్ ఇఫ్’ ఫ్యాక్టర్ తో కల్పిత కథచేసి, ‘కథోడు కథోరం’ షూటింగ్ కార్యక్రమాలకి జోడిస్తే, ‘రేఖాచిత్రం’’ అనే ఆల్టర్నేట్ హిస్టరీ తయారైపోయింది.
రేఖాచిత్రం’ లో ఆల్టర్నేట్ హిస్టరీ ఏమిటంటే, 1985 లో మమ్ముట్టి నటించిన ‘కథోడు కథోరం’ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఒక జ్యూనియర్ ఆర్టిస్టు అదృశ్యమై హత్యకి గురైతే? ...అన్న ‘వాట్ ఇఫ్’ ఫ్యాక్టర్ తో కల్పిత కథచేసి, ‘కథోడు కథోరం’ షూటింగ్ కార్యక్రమాలకి జోడిస్తే, ‘రేఖాచిత్రం’’ అనే ఆల్టర్నేట్ హిస్టరీ తయారైపోయింది.
దీనివల్ల ఈ మర్డర్ మిస్టరీ స్వరూపమే మారిపోయింది. మామూలుగా పీరియెడ్ సినిమాలుంటాయి పూర్వకాలంలో కల్పిత కథ చూపిస్తూ. వీటికంటే వాస్తవంగా గత చరిత్రకి ఆపాదిస్తూ కథ చేసినప్పుడు గట్టి పునాదితో సంభ్రమపర్చే పీరియడ్ మూవీ తయారవుతుంది. ఆల్టర్నేట్ హిస్టరీ జానర్ కథలు కూడా పీరియెడ్ కథలే, కాకపోతే ఆనాడు జరిగిన వాస్తవ సంఘటనలకి వూహాజనితంగా కనెక్ట్ అయి వుండడంతో ఎక్కువ థ్రిల్ చేస్తాయి.
5. whodunnit, whydunnit, howdunnit?
సాధారణంగా
హత్య చుట్టూ తిరిగే మర్డర్ మిస్టరీలు/సస్పెన్స్ థ్రిల్లర్లు -హత్య ఎవరు చేశారు (whodunit), లేదా ఎందుకు
చేశారు (whydunnit), లేదా
ఎలా చేశారు (howdunnit) - అన్న ఏదో ఒక ప్రశ్న కేంద్రకంగా వుంటాయి. కానీ ఎవర్ని హత్య చేశారు అన్న
పాయింటు చుట్టూ చాలా అరుదుగా వుంటాయి. అలాటి అరుదైన సినిమాల్లో అరుదైనది ‘రేఖాచిత్రం’. ఇది హత్యకి గురయిన అమ్మాయి ఎవరనే
అన్వేషణ ప్రధానంగా సాగే కథ. ఈ కథలో ఎవరెవరు కలిసి హత్య చేశారో తెలుసు, ఎందుకు చేశారో తెలీదు,
ఎలా చేశారో తెలియదు- అసలు ఎవర్ని హత్య చేశారో తెలిస్తే ఇవన్నీ తెలుస్తాయి. కనుక ఈ
కథలు హతుడు లేదా హతురాలెవరో తెలుసుకునే కథలుగా వుంటాయి.
ఇంకో ప్రత్యేకత ఏమిటంటే, ఇందులో దర్యాప్తుని పోలీస్ ప్రొసీజురల్ జానర్ ప్రకారం రియలిస్టిక్ గా జరగడం. పక్కా మార్కెట్ యాస్పెక్ట్ తో అమరిన ‘రేఖాచిత్రం’ ప్రత్యేకతలు చూస్తే- 1. ఆల్టర్నేట్ హిస్టరీ జానర్, 2. సీన్ టు సీన్ సస్పెన్స్ కథ, 3. చంపిందెవర్ని అన్న ప్రశ్నతో కథనం, 4 పోలీస్ ప్రొసీజురల్ ఇన్వెస్టిగేషన్- ఇలా నాలుగు ప్రత్యేకతలతో ‘రేఖాచిత్రం’ మర్డర్ మిస్టరీ/ సస్పెన్స్ థ్రిల్లర్ జానర్స్ లో కొత్త బాట పట్టింది.
పైన పకడ్బందీ
మార్కెట్ యాస్పెక్ట్ ని పరిశీలించాక, ఈ మార్కెట్ యాస్పెక్ట్
తగ్గ క్రియేటివ్ యాస్పెక్ట్ ఎంతవరకుందో
చూద్దాం. బిగినింగ్ విభాగంలో విషయ పరిచయం, ప్రధాన పాత్ర ఇన్స్ పెక్టర్ వివేక్, ప్రత్యర్ధి
పాత్ర బిగ్ షాట్ విన్సెంట్ పాత్ర సహా, మరి కొన్ని కీలక
పాత్రల పరిచయం, రాజన్న ఆత్మహత్యతో సమస్యకి దారితీసే
పరిస్థితుల కల్పనా, ముగింపులో సమస్య ఏర్పాటుల సంకలనం వరకూ
స్ట్రక్చర్ పరంగా బాగానే వున్నాయి.
అయితే వీటి కథనంలో డైనమిక్స్ లోపించడం వల్ల కొన్ని సీన్లు తేలిపోయాయి. థీమ్ మర్డర్ మిస్టరీయే అయినా సర్ప్రైజ్, సస్పెన్స్, థ్రిల్ అనేవి ఈ మొత్తం బిగినింగ్ విభాగంలో ఎక్కడా ఫీల్ కాం. ఇన్వెస్టిగేషన్లో సీను తర్వాత సీను డైలాగులతోనే సాగిపోతూంటాయి. అంటే స్క్రీన్ ప్లే విజువల్ గా లేదు, వెర్బల్ గా వుంది. అందువల్ల కథనం మందగమనం బారిన పడింది. పాత్రల మద్య మాటలతో కథ నడపడం సినిమాల అవసరం కాదు, స్టేజి నాటకాల అవసరం. ‘రేఖాచిత్రం’ ఆడియో ఫైలు తీసుకుని డైలాగులు వింటూపోతే చాలు కథ అర్ధమైపోతుంది- రేడియో నాటికల్లాగా.
అయితే ఫోర్ షాడోయింగ్ సీను ఒకటి బావుంది. ప్రారంభంలో సస్పెండ్ అయి వున్న ఇన్స్ పెక్టర్ వివేక్ ఇంటిదగ్గర దినచర్య చూపిస్తున్నప్పుడు, అతను మొక్కలు పెంచుతూ కన్పిస్తాడు. తర్వాత పోస్టింగ్ అతడికి అడవిలోనే అవుతుంది. మొక్కలు- అడవి ఈ ఫోర్ షాడోయింగ్ బావుంది.
కానీ, తర్వాత రాజన్న కారులో అడవిలో కెళ్ళి ఆత్మ హత్య చేసుకుంటున్నప్పుడు, కారులో వెయిట్ చేస్తున్న డ్రైవర్, రాజన్న కూర్చున్న వెనుక సీట్లో ఓ బిజినెస్ మేగజైన్ ని అందుకుని తిరగేస్తూంటాడు. ఆ మేగజైన్ కవర్ పేజీ మీద బిగ్ షాట్ విన్సెంట్ ఫోటో వుంటుంది. అటు రాజన్న ఆత్మ హత్య చేసుకుంటూ పలికే సహ నిందితుల రెండు పేర్లలో ఒకటి విన్సెంటే. అయితే ఇప్పటికింకా విన్సెంట్ ఎవరో మనకి పరిచయం కాలేదు. తర్వాత కొన్ని సీన్ల తర్వాత పరిచయమైనప్పుడు, ఈ డ్రైవర్ తిరగేస్తున్న మేగజైన్ కవర్ పేజీ ఫోటో అప్పుడు విన్సెంట్ దని మనం గుర్తిస్తాం. దీనివల్ల ఏమిటి ప్రయోజనం? ఎప్పుడో ప్రారంభంలో సెటప్ చేసిన ఫోటో ఇన్ని సీన్ల తర్వాత ఇప్పుడు ఫే ఆఫ్ అయితే ఏముంటుంది ఇంపాక్ట్. అసలా మేగజైన్ ఫోటో మీద ఎందరు ప్రేక్షకుల దృష్టి పోతుంది- తర్వాత పిక్చర్ లోకి విన్సెంట్ వస్తే గుర్తించడానికి? గుర్తించి థ్రిల్లవడానికి?
అసలు రాజన్న ఆత్మహత్య చేసుకోబోయే విషాదకర పరిస్థితుల్లో ఆ మేగజైన్ ని వెంట వుంచుకున్నాడంటే, తన మరణ వాగ్మూలంతో విన్సెంట్ ఫోటో వున్న ఆ మేగజైన్ ఎంతగా ఎమోషనల్ గా కనెక్ట్ అయివుందో తెలిసిపోతోంది. అలాటిది కారు దిగినప్పుడు దాన్ని వెంట తీసుకునే పోవాలి. ఆ తర్వాత ఆ మేగజైన్ మీద సహ నిందితుడు విన్సెంట్ ఫోటో చూపిస్తూ, రివాల్వర్ పెట్టి కాల్చుకుని సూసైడ్ చేసుకుని వుంటే - గట్టి బ్యాంగుతో దద్దరిల్లేది ఈ సీను!
క్రియేటివిటీ పరంగా, ఏ విశేషం ఏ సీనుకి ఎటాచ్ చేస్తే ఇంపాక్ట్ వుంటుందో అర్ధం జేసుకోవడానికి ఇదే ఉదాహరణ - విశేషం : విన్సెంట్ ఫోటోతో వున్న మేగజైన్ షాట్, ఎటాచ్ మెంట్ : రాజన్న రివాల్వర్ తో కాల్చుకునే సీనుతో. ఏ షాట్ ఏ సీనుకి ఎటాచ్ చేస్తే ఇంపాక్ట్ వుంటుందో స్టోరీ రైటింగ్ చేస్తే రాదు- స్టోరీ మేకింగ్ చేస్తే మెరుపులు చాలా మెరిపించ వచ్చు.
అయితే రాజన్న ఆత్మహత్యే చేసుకున్నాడని ఇన్స్ పెక్టర్ వివేక్ ఎలా నమ్మాడు? డ్రైవర్ కాల్చి చంపి వుండొచ్చుగా? ఈ సందేహ నివృత్తి చేసుకోలేదు వివేక్. రివాల్వర్ ని పరీక్షకి పంపడంగానీ, డ్రైవర్ వేలిముద్రలు తీసుకోవడం గానీ చేయలేదు. తన వేలిముద్రలు పడకుండా డ్రైవర్ జాగ్రత్త పడి వుండొచ్చు. అలా వేలిముద్రలు పడకుండా జాగ్రత్త తీసుకున్నా, రివాల్వర్ పేల్చినప్పుడు వెలువడే గన్ పౌడర్ అవశేషాలు అతడి చేతుల మీద వుంటాయి. ఇవేవీ తెలుసుకోకుండానే రాజన్నది ఆత్మహత్యగానే నిర్ధారించేశాడు వివేక్. నిజంగా ఈ సంఘటన ఎలా జరిగిందో సీను చూశాం కాబట్టి మనకి తెలుసు- మనం సీను చూసినట్టు ఇన్స్ పెక్టర్ వివేక్ ఆ సమయంలో వచ్చి చూడలేదుగా? అందుకని ఒక ఇన్వెస్టిగేటర్ గా ఆత్మహత్యని అతను శంకించడమూ, ఆ శంక తీర్చుకోవడమూ కథనానికవసరం.
ఇదంతా అవసరమా అంటే అవసరమే. ఎందుకంటే ఈ కథని ముందు చెప్పినట్టు
ఇన్వెస్టిగేషన్ ని రియలిస్టిక్ గా, పోలీస్ ప్రొసీజురల్
జానర్లో చేసుకుంటూ పోయారు. కాబట్టి ఆ ఇన్వెస్టిగేషన్ అనేది,
అన్ని కోణాల్లో కచ్ఛితత్వంతో లాజికల్ గా మెప్పించక తప్పదు. ఇన్వెస్టిగేటర్ ఎంత లోతుగా ఆలోచిస్తే అంత థ్రిల్ చేసే
విషయాలు బయటపడతాయి కథనంలోంచి. ఇది సినిమాకే లాభం. ఈ కథకి ఎంత పొటెన్షియల్ వుందో
ఆలోచిస్తే, ఏదో 6 కోట్లు పెట్టాం 50 కోట్లు వచ్చాయని
సంతృప్తి పడిపోవడానికంటే మిన్నగా, దీనికి పోలీస్
ట్రైనింగుల్లో సబ్జెక్టుగా బోధించగలిగేంత పొటెన్షియల్ తో బాటు సార్ధకతా వున్నాయని
తెలుస్తుంది.
7. హత్యా రహస్యమంతా అస్థిపంజరంలోనే
ఇక అస్థిపంజరం సంగతి. 40 ఏళ్ల తర్వాత బయట పడిన అస్థిపంజరం భాగాలుగా విడిపోయి వుంటుంది. పుర్రె సహా. ఫోరెన్సిక్ లాబ్ లో అస్థిపంజరం స్త్రీదని తేలుస్తారు. ఐతే వయసు ఇప్పుడే చెప్పలేమంటారు. అస్థిపంజరంతో బాటు ఒక కాలి పట్టీ కూడా దొరుకుతుంది. ఈ అస్థిపంజరం ఏ స్త్రీదో తెలియక దర్యాప్తు ముందుకు సాగదు. తర్వాత చాలా ముందుకెళ్ళాక, ప్రొడక్షన్ మేనేజర్ చంద్రప్పన్ రేఖ గురించి చెప్పి, సినిమా పాటలో ఆమెని గుర్తించడంతో మృతురాలి ఐడెంటిటీ తెలుస్తుంది.
ఇక అస్థిపంజరం సంగతి. 40 ఏళ్ల తర్వాత బయట పడిన అస్థిపంజరం భాగాలుగా విడిపోయి వుంటుంది. పుర్రె సహా. ఫోరెన్సిక్ లాబ్ లో అస్థిపంజరం స్త్రీదని తేలుస్తారు. ఐతే వయసు ఇప్పుడే చెప్పలేమంటారు. అస్థిపంజరంతో బాటు ఒక కాలి పట్టీ కూడా దొరుకుతుంది. ఈ అస్థిపంజరం ఏ స్త్రీదో తెలియక దర్యాప్తు ముందుకు సాగదు. తర్వాత చాలా ముందుకెళ్ళాక, ప్రొడక్షన్ మేనేజర్ చంద్రప్పన్ రేఖ గురించి చెప్పి, సినిమా పాటలో ఆమెని గుర్తించడంతో మృతురాలి ఐడెంటిటీ తెలుస్తుంది.
ఇలాకాకుండా, ఆ పుర్రె సాయంతో ఫోరెన్సిక్ ఆంత్రోపాలజిస్టులు ఫేషియల్ రీ కన్స్ ట్రక్ట్ చేసే టెక్నాలజీ వుంది ప్రపంచంలో. దీంతో పుర్రె సహాయంతో రేఖ రూపం తయారై పోతుంది. దీని ఫోటోలు మీడియాలో ప్రచారం చేస్తే రేఖ బంధువులు గుర్తుపట్టి వచ్చేసే అవకాశముంది. దీన్ని పక్కనబెట్టి పాతకేసులు తిరగదోడుతూ, ఎందర్నో కలుస్తూ చంద్రప్పన్ దాకా వెళ్ళి, చాలా కాలయాపన చేశాడు ఇన్స్ పెక్టర్ వివేక్.
ఇంకోటేమిటంటే, రూల్ ఆఫ్ త్రీస్ కి న్యాయం జరిగిన విధానం... ప్రారంభంలో ఓపెనింగ్ ఇమేజిలో ఓ నల్గురు చాపలో చుట్టిన మృతదేహాన్ని మోసుకుంటూ వెళ్తున్నప్పుడు, ఆ మృతదేహం కాలికి వేలాడుతున్న కాలిపట్టీని బట్టి అది స్త్రీ శవమని ముందే తెలిసిపోతోంది. తర్వాత, రాజన్న ఆత్మహత్య చేసుకుంటూ ఇక్కడ ఒకమ్మాయి మృత దేహాన్ని పాతి పెట్టామని చెప్తాడు. ఓపెనింగ్ ఇమేజి లోనే కాలిపట్టీని బట్టి అమ్మాయి శవమని తెలిసిపోతున్నప్పుడు, మళ్ళీ రెండో సీన్లో రాజన్ అమ్మాయి శవమని అదే విషయం చెప్పడమేమిటి? తర్వాత మూడో సీన్లో ఫోరెన్సిక్ నిపుణుడు కూడా అస్థిపంజరం స్త్రీదని అదే విషయం చెప్పడమేమిటి? సీనిక్ డెవలప్ మెంట్ లేకుండా తెలిసీన విషయమే మళ్ళీ మళ్ళీ చెప్పడమేమిటి? ఇందులో సస్పెన్స్ రివీలవడం గానీ, థ్రిల్ గానీ ఏమైనా వున్నాయా? ఇది రూల్ ఆఫ్ త్రీస్ కి వ్యతిరేకంగా వుంది.
అంటే ఓపెనింగ్ ఇమేజిలో శవాన్ని మోసు కెళ్తున్నప్పుడు కాలిపట్టీని రివీల్ చేయకూడదు, అది ఆడమనిషి శవమని అప్పుడే తెలియకూడదు. తర్వాత రాజన్న కూడా ఒక శవం అనివుంటే సరిపోతుంది. ఎవరి శవం? విన్సెంట్, ఫ్రాన్సిస్ అని ఇద్దరు సహనిందితుల పేర్లు చెప్పాడు రాజన్న. అంటే తాము ముగ్గురూ కలిసి తమ పార్ట్నర్ ఎవర్నో చంపి అక్కడ పాతి పెట్టారా? ఈ ప్రశ్న రేకెత్తించి ఫోరెన్సిక్ లాబ్ కెళ్తే, అక్కడ అప్పుడు అస్థిపంజరం స్త్రీదని తెలిస్తే కథనం ఎంత థ్రిల్లింగ్ గా వుంటుంది. కథనమంటే ముందు ప్రశ్న రేకెత్తించి తర్వాత జవాబు చెప్పడమేగా? ఇలా జరిగి వుంటే ఈ మూడు సీన్లూ త్రివిధావస్థలతో రూల్ ఆఫ్ త్రీస్ కి న్యాయం చేసేవిగా?
మరొకటేమిటంటే, ఫోరెన్సిక్ లాబ్ లో ఆ అస్థిపంజరం స్త్రీదని చెప్పినప్పుడు, వయసు ఇంకా నిర్ధారించలేదని, తర్వాత చెప్తామని అంటాడు ఎక్స్ పర్ట్. తర్వాత ఎక్కడా చెప్పడు. కానీ పుర్రెలో దంతాల్ని పరీక్షించి వుంటే వయసు తెలిసిపోతుంది. ఈ పని చేయడు.
ఈ కేసుని పరిష్కరించడానికి అస్థిపంజరంలోనే బోలెడు క్లూస్ వుంటాయి. ఈ ఒక్కో క్లూని పట్టుకున్నప్పుడల్లా కథనానికి పెరుగుతూ పోయే డైనమిక్స్ తోడయ్యే అవకాశముంది. కానీ ఇన్వెస్టిగేషన్లో ఇన్స్ పెక్టర్ వివేక్ బుద్ధి కుశలతని, దాంతో కథనంలో టెన్షన్ నీ సృష్టించే అవకాశాన్ని గుర్తించ లేదు. అస్థిపంజరం దొరికితే నిర్ధారించాల్సిన అంశాలు కొన్ని వుంటాయి- అస్థి పంజరం ఎంత పురాతన మైనది? ఇది తెలుసుకుని మరణం ఎప్పుడు జరిగిందో నిర్ధారిస్తారు. అంతేగానీ 1985 లో సినిమా షూటింగ్ సమయంలో అదృశ్యమైందని సాక్షులు చెప్పిందే వేదంగా టైముని తీసుకోరు. ఫోరెన్సిక్ ఎవిడెన్స్ వుండాలి. అది హత్యా, సహజ మరణమా కూడా సాక్షులు చెప్పింది కాకుండా మెడికల్ గా నిర్ధారించుకోవాలి. తర్వాత సెకండాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ చూపించినప్పుడు, ఆమెని ఉరి బిగించి చంపినట్టు వుంటుంది. అంటే అర్ధం మెడ ఎముక విరిగి వుండాలి. ఇలా జరిగి వుంటే ఇది కూడా ఇప్పుడు అస్థిపంజరం పరీక్షలో బయట పడుతుంది. అప్పుడా ఉరి ఎవరైనా బిగించారా, లేక తానే ఉరేసుకుందా- ఇదసలు హత్యేనా, లేక ఆత్మహత్యా... పరీక్షలు జరిపి రూఢీ చేసుకోవాలి. అంతేగానీ కేవలం ఆత్మహత్య చేసుకున్న రాజన్న మాటలే సాక్ష్యంగా తీసుకోకూడదు.
ఇక కాలిపట్టీ సంగతి. అస్థి పంజరంతో
బాటు, ఒక కాలి పట్టీ
దొరికుతుంది. రెండోది ఏమైనట్టు? మట్టిలో కరిగిపోయిందా? వెండి గొలుసు ఎంతకాలమైనా మట్టిలో కరగదు. మరి రెండో కాలిపట్టీ ఏమైనట్టు? ఆసలా దొరికిన
కాలిపట్టీ ఆమెదేనని ఎలా అనుకుంటారు? ఆమెదే అయితే రెండోది కూడా అక్కడే దొరకాలిగా? దొరక లేదంటే ఆమెని పాతిపెట్టిన మనిషిది కావచ్చా? అంటే ఈ సంఘటనలో
ఆడమనిషి పాత్ర కూడా వుండొచ్చా? దొరికిన కాలిపట్టీ మృతురాలిదే అయితే రెండో కాలిపట్టీ హత్య- లేక ఆత్మహత్యా స్థలంలోనే పడిపోయి
వుండచ్ఛా? ఆ స్థలం ఏది, ఎక్కడుంది?
హత్య కేసు కోర్టులో నిలబడాలంటే నాలుగు సాక్ష్యాల్ని
నిరూపించాలి- హత్యా స్థలం, హత్యా సమయం, హతుడు లేదా హతురాలెవరు, హత్యకి మోటివ్ ఏమిటి- ఈ నాల్గు నిరూపిస్తేనే
కేసుంటుంది. అందుకని ఈ నాల్గింటి ఆధారంగానే దర్యాప్తు సాగిస్తారు. కానీ
పోలీస్ ప్రొసీజురల్ తో కూడిన ఈ కథలో ఇదేమీ కనిపించదు. కేసు దర్యాప్తు అధికారిగా
సర్కిల్ ఇన్స్ పెక్టర్ వున్నా -కేసులో అతడ్ని ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ (ఐఓ) అంటారు. ఇన్స్ పెక్టర్ వివేక్ కి ఈ
హోదా (ఐఓ) కూడా ఇవ్వక ఇన్స్ పెక్టర్ గానే లాగించేశారు.
ఇక కేసుని తవ్వితే ఇంకా వుంది-
అస్థిపంజరంతో స్త్రీగా నిర్ధారణ అయ్యాక- తట్టాల్సిన రెండో ప్రశ్న- ఆమె వివాహితా, అవివాహితా? వివాహిత అయితే ఆమె
భర్త ఏమయ్యాడు? ఆమె మంగళ సూత్రాలు, గాజులు ఏమయ్యాయి? ఆమె కన్యా కాదా
అనేది అస్థిపంజరంతో తెలుసుకోలేరు, కానీ కాన్పు జరిగి
వుంటే కటి భాగంలో ఎముక ద్వారా ఎంత కాలం తర్వాతైనా తెలుసు కోవచ్చు. కథకి ఉత్కంఠనీ
పెంచే ఇలాటి అంశాల్ని ప్లే చేస్తే
బాక్సాఫీసుకి ఉపయోగమే తప్ప వృధా కాదు.
9. ప్లాట్ పాయింట్ వన్ వివరణ
దీన్ని
శ్రద్ధగా చదవాలి... హీరోకి సమస్యని ఏర్పాటు చేసి, దాన్ని సాధించే గోల్ నిచ్చే, ఎదుటి పాత్రతో కాన్ఫ్లిక్ట్ ని ప్రారంభించే బిగినింగ్ మలుపు - అంటే ప్లాట్ పాయింట్ వన్ అనేది –స్క్రీన్ ప్లేకి
ప్రాణం వంటిది. బిగ్ బ్యాంగ్ తో విశ్వం ఏర్పడినట్టు, ప్లాట్ పాయింట్ వన్ లో కాన్ఫ్లిక్ట్ తో కథ పుడుతుంది.
స్క్రీన్ ప్లేలో కథ పుట్టేది ప్లాట్ పాయింట్ వన్ లోనే. కథ పుట్టాలంటే కొన్ని
పరిస్థితులు తోడ్పడాలి. పాత్రల పరిచయం, సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పన, దీంతో సమస్య ఏర్పాటు, దీంతో ఎదుటి పాత్రతో కాన్ఫ్లిక్ట్ తో ప్లాట్ పాయింట్
వన్ ఏర్పాటు, దీంతో హీరో చేతికి
కాన్ఫ్లిక్ట్ ని పరిష్కరించే గోల్- ఈ పరిస్థితులు తోడ్పడాలి. ఈ పరిస్థితులన్నీ
బిగినింగ్ విభాగంలో ఏర్పడి వుంటాయి. బిగినింగ్ విభాగం కంటే ముందు ఏర్పడే అవకాశం
లేదు. కాబట్టి బిగినింగ్ విభాగంలో పరిస్థితులే ప్లాట్ పాయింట్ వన్ లో కథని
పుట్టిస్తాయి. ఇలా పుట్టడం వల్ల బిగినింగ్ విభాగంలోని పరిస్థితుల వల్ల కథలో ఆత్మ
అంతా ప్లాట్ పాయింట్ వన్ దగ్గర వచ్చేస్తుంది. స్క్రీన్ ప్లేలో ప్లాట్ పాయింట్ వన్
లో ఇలా పుట్టిన కథ పూర్తయ్యేది తర్వాత ప్లాట్
పాయింట్ టూ లోనే. ఈ రెండు పాయింట్ల మధ్య వుండేది మిడిల్ విభాగమే. కాబట్టి
ప్లాట్ పాయింట్ వన్ లో కథలో పుట్టిన ఆత్మ అక్కడ్నించి ప్రవహిస్తూ ప్లాట్ పాయింట్
టూ లో కొలిక్కి వస్తుంది. అంటే కథాత్మ అనేది మిడిల్ విభాగమంతా వ్యాపించి వుంటుంది.
ప్లాట్ పాయింట్ టూ తర్వాత ఎండ్ విభాగం వస్తుంది. ఇందులో క్లయిమాక్స్, సమస్యకి పరిష్కారం, ముగింపూ వగైరా.
కాబట్టి కథాత్మని మోస్తున్న మిడిల్
ని కాపాడుకోవాలంటే నాల్గుంటాయి- హీరో కోరిక, పణం, పరిణామాల హెచ్చరిక, ఎమోషన్. ఇవి గోల్ ఎలిమెంట్స్. ఇవి వుంటే కథ, అంటే మిడిల్ విభాగం, ఆత్మ సహితంగా బలంగా వుంటుంది. బిగినింగ్ విభాగంలో
పరిస్థితులు, ప్లాట్ పాయింట్ వన్
లో కాన్ఫ్లిక్ట్, గోల్ ఎలిమెంట్స్ నాలుగూ కథలో ఆత్మకి కారణమవుతాయి. కనుక ఈ ఆత్మని ప్రోది
చేసేందుకే బిగినింగ్ విభాగం రైటింగ్ ఎక్కువ శ్రమ, కాలం తీసుకుంటుంది. ఇందుకే స్క్రీన్ ప్లే సంగతులు
రాస్తున్నప్పుడు బిగినింగ్ విభాగమే చాంతాడులా సాగుతోంది. ఇప్పటికే 3,806 పదాలతో నైలు
నదిలా సాగింది. ఒకసారి బిగినింగ్ విభాగం పైన చెప్పుకున్న అన్ని టూల్స్ తో సమగ్రంగా
ఏర్పాటయ్యిందంటే, ఇక మిడిల్ –ఎండ్ విభాగాలు ఎక్కువ సమయం తీసుకోవు.
ఇప్పుడు ‘రేఖాచిత్రం’ లో ప్లాట్ పాయింట్ వన్ ఏర్పాటు ఎలా జరిగింది? బిగినింగ్ విభాగంలో ఇన్స్ పెక్టర్ వివేక్ తన ధోరణిలో
చేసే ఇన్వెస్టిగేషన్లో మృతుడు రాజన్న
చెప్పిన సహ నిందితులైన విన్సెంట్, ఫ్రాన్సిస్ లపై కూడా దృష్టి పెట్టాడు. విన్సెంట్ ఏదో చెప్పి
తప్పించుకున్నాడు. ఇక మృతురాలి ఐడెంటిటీ తెలుసుకోవడమే మిగిలింది ఈ బిగినింగ్
విభాగానికి. ప్రొడక్షన్ మేనేజర్ చంద్రప్పన్ సాయంతో ఆమె రేఖ అనే జ్యూనియర్
ఆర్టిస్టు అని ఫోటో సహా సమాచారం లభించినప్పుడు ఇదే ప్లాట్ పాయింట్ వన్ అయింది. ఇదే
ఎందుకు ప్లాట్ పాయింట్ వన్ అయింది? విలన్ గా విన్సెంట్ వుండగా అతడితో ఎందుకు కాన్ఫ్లిక్ట్ ఏర్పడకూడదు? ఇలా చేస్తే బలవంతగా
కథని మార్చినట్టవుతుంది. బిగినింగ్ విభాగంలో పరిస్థితుల కనుకూలంగా కథని
పుట్టనివ్వకుండా గొంతు పుచ్చుకుని, నువ్విలాగే పుట్టాలని శాసించినట్టవుతుంది.
కాస్త ఆలోచించి, విన్సెంట్ ని
కిల్లర్ గా పట్టుకునే పాయింటుతో కథ వుండాలా, లేక అతను హత్య చేసిందెవర్నో తెలుసుకునే పాయింటుతో కథ
సాగాలా అనుకున్నప్పుడు- పైన చెప్పుకున్న టూల్స్ పరంగానే కాదు, మార్కెట్
యాస్పెక్ట్ కి దోహదం చేసిన నాలుగు ప్రత్యేకతల ప్రకారం కూడా, రెండో పాయింటే కథ
కోసం నిలబడుతుంది. మార్కెట్ యాస్పెక్ట్ కి whodunit, whydunnit, howdunnit లకి భిన్నంగా ఎవర్ని చంపారు- అనే అనే
నాల్గో ముఖాన్ని తీసుకున్నారు గనుక దీనికి లోబడే - బిగినింగ్ విభాగంలో పరిస్థితుల
ప్రకారం పేరు, ఫోటో సహా హతురాలి క్లూ దొరకడం, దాంతో ఆమె బంధువుల్ని (పుట్టుపూర్వోత్తరాల్ని) అన్వేషించే పాయింటుతో
కాన్ఫ్లిక్ట్ ఏర్పాటవడమూ జరిగిపోయాయి.
ఆమె పుట్టుపూర్వోత్తరాలు
తెలుసుకోవడమే ఇన్స్ పెక్టర్ వివేక్ గోల్. ఈ గోల్ ఎలిమెంట్స్ లో కోరిక-
పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవడం, పణం- తన ప్రాణాలు కావచ్చు, పరిణామాల హెచ్చరిక- సాక్షుల చావులు కావొచ్చు, ఇక ఎమోషన్- మొదటి మూడు ఎలిమెంట్స్ లో పుట్టే భావావేశాల
కూడిక. దీంతో బిగినింగ్ విభాగం సమాప్తం.
10. మిడిల్
విభాగం విషయం

ఇన్స్ పెక్టర్ వివేక్ రేఖ స్కెచ్ సంపాదించాడని తెలుసుకున్న విన్సెంట్, కలవరపడతాడు. వివేక్ దర్యాప్తుని అణిచివేయడానికి, ప్రొడక్షన్ మేనేజర్ చంద్రప్పన్ ని చంపించేస్తాడు విన్సెంట్. తన పలుకుబడి నుపయోగించి, వివేక్ ని కేసు నుంచి తొలగించి ట్రాఫిక్ డ్యూటీకి పంపేస్తాడు. విన్సెంట్ కి లొంగి అతడికి వ్యతిరేకంగా వున్న ఆధారాల్ని తొలగిస్తుంది క్రైమ్ బ్రాంచ్.
ఈ ఎదురుదెబ్బలు తగిలినప్పటికీ, న్యాయం కోసం అన్వేషణ
కొనసాగిస్తాడు వివేక్. నిందితుల్లో రెండో వాడయిన ఫ్రాన్సిస్ గురించి ఆరా తీస్తే, అతడి వివరాలు చర్చి
బిషప్ కి తెలుసని ఒకరు చెప్పడంతో- వివేక్ ఆ బిషప్ ని కలవడానికి వెళ్ళేసరికి అతను
చనిపోయి వుంటాడు. ఇతడ్ని కూడా విన్సెంట్ చంపించేశాడన్న మాట. ఇక వివేక్ ఒకప్పుడు సినిమా షూటింగ్ ప్రదేశాలని విస్తృతంగా
కవర్ చేసిన మాజీ టాబ్లాయిడ్ జర్నలిస్ట్, నేటి వ్లాగర్ అయిన పల్లాస్సేరీ (టిజి రవి) ని
ట్రాక్ చేస్తాడు. ఇతడి దగ్గర్నుంచి పాత స్టిల్స్ ని జల్లెడ పట్టి, ఒకప్పుడు
రేఖని కలిసి ఆమెతో చాలా స్నేహంగా మెలిగిన
స్టెఫీ (మేఘా థామస్) అనే నన్ ని గురించి తెలుసుకుంటాడు.
నన్ స్టెఫీని వివేక్ ట్రేస్ చేసి వెళ్ళి కలుసుకుంటే, ‘కథోడు కథోరం’ షూటింగ్ సమయంలో రేఖతో తనకి ఎదురైన అనుభవాల్ని వివరిస్తుందామె. తను పనిచేసిన కాన్వెంట్ షూటింగ్ ప్రదేశానికి దగ్గర్లోనే అడవిలో వుంది. హీరో మమ్ముట్టికి అంటే రేఖాకి పిచ్చి అభిమానం. సినిమాల్లో హీరోయిన్ కావాలని బలంగా కోరిక వుండేది. ఆ ప్రాంతంలో ‘కథోడు కథోరం’ షూటింగు జరుగుతోందని తెలుసుకుని మమ్ముట్టిని కలుసుకుందామని వచ్చింది. కలిసే అవకాశం లేకపోవడంతో ఒక పాటలో నటించే అవకాశం సంపాదించుకుని ఆ విధంగా మమ్ముట్టికి దగ్గరై తన గురించి చెప్పుకోవాలనుకుంది. అలా ఒక రాత్రిపూట బస చేయమని రేఖని కాన్వెంటుకి ఆహ్వానించింది నన్ స్టెఫీ. తెల్లారి చూస్తే గదిలో లేదు- కాన్వెంట్ సేఫ్ లో వున్న పెద్ద మొత్తంలో డబ్బుతో పాటు రేఖ కనిపించకుండా పోయింది.
కాన్వెంట్ ప్రతిష్టని కాపాడేందుకు నన్స్ అందరూ కలిసి ఈ సంఘటన గురించి రిపోర్టు చేయకూడదని నిర్ణయించుకున్నారు. రేఖ లేకపోవడంతో షూటింగుకి అంతరాయమేర్పడి నిర్మాతలు ప్రొడక్షన్ మేనేజర్ చంద్రప్పన్ ని నిలదీయడంతో అతను వెళ్ళి పోలీస్ కంప్లెయింట్ ఇచ్చాడు. కానీ పోలీసులు ఆమె జాడ తెలుసుకోలేకపోయారు.
పై ఫ్లాష్ బ్యాక్ తో విషయ సేకరణ చేసుకున్న వివేక్, కొత్త సమాచారంతో బినూ, సజీవన్ అనే వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్తాడు. రాజన్న ఆత్మహత్యకి ముందు ఫోన్లో వీళ్ళిద్దరు మాట్లాడారు. ఇప్పుడు వీళ్ళని పట్టుకుంటే, బినూ చిన్నతనంలో తన తండ్రి - ఇతర వ్యక్తులు ఓ మృతదేహాన్ని మోసుకెళ్లడం తాను చూశానని ఒప్పుకుంటాడు. అయితే తండ్రి అప్పట్లో దాన్ని 'కాథోడు కాథోరం' లోని దృశ్యంగా చెప్పాడని వివరిస్తాడు. అంటే శవాన్ని మోసిన రాజన్న, విన్సెంట్, ఫ్రాసిస్ లతోబాటున్న నాల్గో వ్యక్తి బినూ తండ్రి అన్నమాట. ఇతను చనిపోయాడు.
ఇది అబద్ధమని తర్వాత తను గ్రహించాడు - ఇది నిజ హత్య అనీ , రాజన్నతో సంబంధం వుందనీ తెలుసుకుని, సజీవన్ తో కలిసి డబ్బుకోసం రాజన్నని బ్లాక్ మెయిల్ చేయసాగాడు. ఇప్పుడు వివేక్ పట్టుకున్నాక, కేసులో సాక్షులుగా వుండేందుకు ఒప్పుకుంటారు. అయితే విన్సెంట్ వీళ్ళని కూడా చంపించేస్తాడు.
ఇక సినిమా సెట్స్ లోని పాత స్టిల్స్ ఆధారంగా ఫ్రాన్సిస్ ని పట్టుకుంటాడు వివేక్. ఫ్రాన్సిస్ ఇక తప్పించుకోలేక 1985లో ఆ రాత్రి జరిగిన భయంకర సంఘటనని వెల్లడిస్తాడు. అప్పట్లో కాన్వెంట్లో బిషప్ సహాయకుడిగా వున్న విన్సెంట్, పుష్పం అనే పనిమనిషి సాయంతో చిన్నచిన్న దొంగ తనాలకి పాల్పడేవాడు.
ఓ రాత్రి, పుష్పం కాన్వెంట్‌లోని సేఫ్‌ని దోచుకోవడానికి పథకం వేసింది. ఆ రాత్రి రేఖా అక్కడ బస చేయడంతో దొంగతనం ఆమె మీదికి పోయేలా విన్సెంట్ సాయంతో ప్లానేసింది. గదిలో రేఖాని దుప్పటితో ఊరి బిగించి చంపేసింది. సేఫ్ లో దోచుకున్న డబ్బులోంచి కొంత విన్సెంట్, ఫ్రాన్సిస్ లకిచ్చి రేఖ డెడ్ బాడీని మాయం చేయమని చెప్పేసింది. అలా రేఖ మృతదేహాన్ని తీసికెళ్ళి అడవిలో పాతిపెట్టారు...
ఇలా ఫ్రాన్సిస్ నుంచి స్టేట్ మెంట్ తీసుకున్న
వివేక్ అతడ్ని అరెస్టు చేయడంతో మిడిల్ విభాగం ముగిసి, ప్లాట్ పాయింట్ టూ ఏర్పాటవుతుంది.
11. ఎలావుంది మిడిల్
మిడిల్ విభాగంలో బిజినెస్ ఏమిటి? కేవలం ఒక్క
యాక్షన్- రియాక్షన్ల ఇంటర్ ప్లే మాత్రమే, ఇంతకీ మించి ఏం లేదు. ప్లాట్ పాయింట్ వన్ నుంచి ప్లాట్ పాయింట్ టూ వరకూ
మిడిల్ విభాగంలో ఇదే తంతు వుంటుంది ఏ జానర్ సినిమాలోనైనా. ప్లాట్ పాయింట్ వన్ లో గోల్ ని చేపట్టిన హీరో యాక్షన్ ని అడ్డుకుంటూ
విలన్ రియాక్షన్ ఇవ్వడం, విలన్ రియాక్షన్ ని తిప్పికొడుతూ హీరో ఇంకో యాక్షన్ ఇవ్వడం, ఈ యాక్షన్ కి విలన్
మళ్ళీ ఇంకో రియాక్షన్ ఇవ్వడం...ఇలా ఇద్దరి మధ్య యాక్షన్ రియాక్షన్లతో కాన్ఫ్లిక్ట్
వేడెక్కుతూ, ప్లాట్ పాయింట్
టూలో - కథని బట్టి ఎవరిదో ఒకరిది పైచేయి అవుతుంది. ఇంతే. ఇక్కడ్నుంచీ ఎండ్ విభాగం
మొదలై క్లయిమాక్స్ బాట పడుతుంది.
‘
రేఖాచిత్రం’ లో హీరో పాత్ర ఇన్స్ పెక్టర్ వివేక్- ప్లాట్ పాయింట్ వన్ లో మృతురాలి పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవాలన్న గోల్ చేపట్టాడు. అయితే ముందుగానే పైన చెప్పుకున్నట్టు - ఈ గోల్ సాధన ఏ అవరోధాలూ లేకుండా ఏకపక్ష జర్నీగా సాగుతుంది. విలన్ గా విన్సెంట్ వున్నా, అతను ఎక్కడికక్కడ గోల్ ని అడ్డుకుంటున్నా, వరసగా సాక్షుల్ని చంపుకకు పోతున్నా, రియాక్ట్ అవడు వివేక్. దీన్నసలు పట్టించుకోకుండా, ఇన్వెస్టిగేషన్ చేస్తూనే వుంటాడు. చివరికి లారీతో గుద్దించి తనని చంపాలని చూసినా పట్టనట్టు వుంటాడు. దీనివల్ల కథలో యాక్షన్ రియాక్షన్ల ఇంటర్ ప్లే పూర్తిగా లోపించి- సీను తర్వాత సీను డైలాగులతోనే సాగిపోతూంటాయి. విజువల్ గా కాకుండా స్క్రీన్ ప్లే వెర్బల్ గా తయారైంది. అందువల్ల కథనం మందగమనం బారిన పడి, భారంగా సాగుతున్నట్టు అనిపిస్తుంది.
రేఖాచిత్రం’ లో హీరో పాత్ర ఇన్స్ పెక్టర్ వివేక్- ప్లాట్ పాయింట్ వన్ లో మృతురాలి పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవాలన్న గోల్ చేపట్టాడు. అయితే ముందుగానే పైన చెప్పుకున్నట్టు - ఈ గోల్ సాధన ఏ అవరోధాలూ లేకుండా ఏకపక్ష జర్నీగా సాగుతుంది. విలన్ గా విన్సెంట్ వున్నా, అతను ఎక్కడికక్కడ గోల్ ని అడ్డుకుంటున్నా, వరసగా సాక్షుల్ని చంపుకకు పోతున్నా, రియాక్ట్ అవడు వివేక్. దీన్నసలు పట్టించుకోకుండా, ఇన్వెస్టిగేషన్ చేస్తూనే వుంటాడు. చివరికి లారీతో గుద్దించి తనని చంపాలని చూసినా పట్టనట్టు వుంటాడు. దీనివల్ల కథలో యాక్షన్ రియాక్షన్ల ఇంటర్ ప్లే పూర్తిగా లోపించి- సీను తర్వాత సీను డైలాగులతోనే సాగిపోతూంటాయి. విజువల్ గా కాకుండా స్క్రీన్ ప్లే వెర్బల్ గా తయారైంది. అందువల్ల కథనం మందగమనం బారిన పడి, భారంగా సాగుతున్నట్టు అనిపిస్తుంది.
గోల్ ఎలిమెంట్స్ లో పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవాలన్న కోరికతో వున్నాడు, దీని కోసం పణంగా పెట్టిన తన ప్రాణాల మీద జరగాల్సిన దాడి కూడా జరిగింది, సాక్షులకి ప్రమాదం పొంచి వుందన్న పరిణామాల హెచ్చరికా వాళ్ళని విన్సెంట్ చంపుకుంటూ పోవడంలో వుంది, ఈ మూడు గోల్ ఎలిమెంట్స్ కథలో సోల్ కోసం పనిచేస్తూనే వున్నాయి- కానీ వివేక్ వీటిని ఫీలవక పోవడంవల్ల భావావేశాలనేవీ పుట్టక- కథకి సోల్ నిల్ అయిపోయింది! ఇలా మిడిల్ విభాగంలో కూడా క్రియేటివ్ యాస్పెక్ట్ ఫెయిలైంది. కథనానికి వాడిన పోలీస్ ప్రొసీజూరల్ జానర్ మర్యాదల్ని నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ పరిస్థితి. మార్కెట్ యాస్పెక్ట్ కి తగ్గట్టు లేని క్రియేటివ్ యాస్పెక్ట్ ఇది.
ఎప్పుడో బిగినింగ్ విభాగంలోనే పుర్రె సాయంతో మృతురాలి రూపం తయారు చేయవచ్చని చెప్పాం. ఆ రూపాన్ని మీడియాలో ప్రచారం చేస్తే ఆమె బంధువులెవరైనా వుంటే గుర్తు పట్టి వచ్చే అవకాశముందన్నాం. అయితే బిగినింగ్ విభాగంలో వేరే విజివల్స్ నుంచి ఆమె స్కెచ్ తయారు చేసినప్పుడైనా మీడియాకి రిలీజ్ చేయాలని అనుకోలేదు. మళ్ళీ ఆ స్కెచ్ పట్టుకుని మిడిల్ లో ఆమె కోసం వేట! కానీ బిగినింగ్ విభాగంలో చూస్తే, రాజన్న ఆత్మహత్య తాలూకు వీడియోని వెంటనే మీడియాలో ప్రసారం చేయించాడు మరి!
ఇప్పుడు పై మిడిల్ విభాగంలో రేఖ తాలూకు పూర్తి కథ, నిందితుల స్వరూపాలూ అన్నీ వెల్లడయ్యాక- నిందితుడు ఫ్రాన్సిస్ అరెస్టుతో మిడిల్ విభాగం ముగిసింది. ఇక్కడ హుక్ ఏమిటంటే రేఖని చంపిన పుష్పం ఎక్కడుందనేది.
రేఖని
చంపిన పుష్పం ఇక్కడే వుంది- హాస్పిటల్లో అనారోగ్యంతో బెడ్ మీద- విన్సెంట్ భార్య అలీస్ గా...
ఇలా బిగినింగ్ విభాగంలోనే ఈమెని చూశాం కానీ రేఖని చంపిన హంతకురాలని అప్పుడు మనకి
తెలీదు. ఇప్పుడు వివేక్ వచ్చేసి విన్సెంట్ కొడుకుని పట్టుకుని- అతడి తల్లిదండ్రులు
చేసిన దురాగతం చెప్పేస్తాడు. కొడుకు వెళ్ళి తండ్రి విన్సెంట్ ని నిలదీస్తాడు. ఇక తప్పించుకోలేని పరిస్థితుల్లో విన్సెంట్
చేసిన నేరం ఒప్పుకుంటాడు- ఒప్పుకుని, అనారోగ్యంతో వున్న భార్య పుష్పం అలియాస్ అలీస్ ని, చట్టపరమైన
పరిణామాల్ని ఎదుర్కోకుండా వుండడానికి చంపేసి లొంగి పోతాడు!
ఇలా చాలా డ్యామేజీ ఎండ్ విభాగానికి! ఈ ఎండ్ లో కూడా క్రియేటివ్ యాస్పెక్ట్ లోపించింది- పూర్తిగా ముగింపుని దెబ్బకొట్టింది! వివేక్ నేరుగా వెళ్ళి విన్సెంట్ ని ఎదుర్కొని అరెస్ట్ చేసి వుంటే, రేఖని చంపిన హంతకురాలు పుష్పం సజీవంగా చట్టానికి దొరికేది. ఆమె సజీవంగా దొరకడం కేసుకి ముఖ్యం! వివేక్ తెలివి తక్కువతనం వల్ల విన్సెంట్ కి చంపేసే అవకాశం దొరికింది. ఆమె చట్టపరమైన పరిణామాల్ని ఎదుర్కోకుండా వుండడానికి చంపేసి తాను భార్యని చంపిన హంతకుడు కూడా పోతాడా? ఇదెక్కడి లాజిక్?
వివేక్ విన్సెంట్ కొడుకు ద్వారా విన్సెంట్ కి చెప్పించాలనుకోవడం పూర్తిగా తెలివితక్కువ తనం. మొదట్నుంచీ ఒక విధంగా వివేక్ పాసివ్ క్యారక్టరే. నలబై ఏళ్ళ తర్వాత దొరికిన హంతకురాల్ని చంపేసేలా చేసుకుని కేసుని బలహీన పర్చుకున్నాడు!! రేఖని అంత క్రూరంగా చంపిన పుష్పం ఇప్పుడు చట్టానికి దొరికి కఠిన శిక్ష అనుభవిస్తే ఎలా వుంటుందో ఆమె మొహం చూడాలని మనకే వుంది!
ఇంతకీ రేఖ బంధువుల్ని కనుక్కున్నాడా వివేక్ అంటే, ఎండ్ విభాగం మొదట్లోనే కన్యాకుమారి వెళ్ళి ఆమె అక్కని కలుసుకుంటాడు. ఆ అక్కకి ఇప్పుడు రేఖ అస్థిపంజరం అప్పగించి అంత్యక్రియలు నిర్వహిస్తాడు. ఇదీ ముగింపు.
—సికిందర్
Subscribe to:
Posts (Atom)