(నాలుగో మెట్టు)
రాస్తున్నప్పుడే తిరగ రాస్తూ వుండడం అలవాటు చేసుకోవాలి. ఏక బిగిన మొత్తం కథంతా రాసుకుపోవాలనుకోవడం నాన్సెన్స్. ఆ ఉచ్చులో పడకుండా జాగ్రత్తపడండి. ఫ్లాష్ రైటింగ్ అనేదాన్ని మర్చిపోండి. ఫ్లాష్ రైటింగ్ తో ఫస్ట్ డ్రాఫ్ట్ రాసుకుంటూ పోవడం చేస్తే ఓ పెద్ద గొయ్యి తవ్వుకుని అందులో పడ్డట్టే. మళ్ళీ అందులోంచి బయటికి రాలేరు. నిజంగా మీరొక ప్రొఫెషనల్ లాగా రాయడం నేర్చుకోవాలనుకుంటే ఈ పని చేయకండి. ఫ్లాష్ రైటింగ్ మీకే మాత్రం మేలు చేయదని గ్రహించండి.

సమన్వయం చేసుకుంటూ రాసుకుపోవడం చాలా మేలు చేస్తుంది. రాస్తూనే తిరగ రాస్తూ పోవడమనే వ్యూహం తర్వాత వారాల తరబడి చేయాల్సిన పనిని తగ్గిస్తుంది. అంతే కాదు, కేవలం మూడు డ్రాఫ్టులే రాసి ముగించవచ్చు. ఏకబిగిన మొత్తం ఒకేసారి రాసుకుంటూ పోతే తర్వాత వంద సార్లు దాన్ని తిరగ రాయాల్సి వుంటుంది. ఈ తేడా గమనించాలి. రాస్తూనే తిరగ రాస్తూపోవడం వల్ల కేవలం ఫస్ట్ డ్రాఫ్ట్, రీరైట్ డ్రాఫ్ట్, పాలిష్ డ్రాఫ్ట్ - ఈ మూడింటితో పనైపోతుంది. రాస్తూ తిరగరాయడం వల్ల చాలా టైము కూడా ఆదా అవుతుంది. ఎలాగో ఈ కింద చూద్దాం -
మొదటి రోజు – పది పేజీలు రాస్తారు.
రెండో రోజు – ఆ పది పేజీలు చదువుకుంటారు. మార్పుచేర్పులు చేసుకుంటారు. ఇంకో పది పేజీలు రాస్తారు.
రెండో రోజు – ఆ పది పేజీలు చదువుకుంటారు. మార్పుచేర్పులు చేసుకుంటారు. ఇంకో పది పేజీలు రాస్తారు.
మూడో రోజు – ఆ ఇరవై పేజీలూ చదువుకుంటారు. మార్పుచేర్పులు
చేసుకుని ఇంకో పది పేజీలు రాస్తారు.
ఇలా పూర్తయ్యే వరకూ చేసుకుపోతారు. ఇలా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలేమిటంటే, ప్రతీ రోజూ వెనకటి కథ పునశ్చరణ అవుతుంది. కథాక్రమం, పాత్ర చిత్రణలు, ప్లాట్ పాయింట్లు మీ మైండ్ లో ఎప్పుడూ లైవ్ గా వుంటాయి. అలాగే లోటుపాట్లు తగ్గడం గమనిస్తారు. అంతేకాదు లోపాలు, తప్పులు, పొరపాట్లూ తగ్గిపోవడం గమనిస్తారు. రాయడానికి కూర్చున్న ప్రతీసారీ అంతవరకూ రాసిన కథని అనుభవంలోకి తెచ్చుకుంటూ వుంటారు. కథని ప్రతీరోజూ అనువభవిస్తూంటారు. మీరెప్పుడో రాసిన మొదటి సీను నుంచి తెగిపోరు. ప్రతీరోజూ అంతకి ముందు రోజుల్లో రాసిన సీన్లన్నీ వరస క్రమంలో రీలులా తిరుగుతూంటాయి కళ్ళ ముందు. చాలా అద్భుతంగా వుంటుంది ఈ పని విధానం. ప్రయత్నిస్తే మీకే తెలుస్తుంది. ప్రొడక్టివిటీ కూడా పదిరెట్లు పెరుగుతుంది.
―కెన్ మియమోటో
(రేపు చివరి ఐదో మెట్టు)