స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ లో మిడిల్ విభాగం కథ రెండు
భాగాలుగా వుంటుందనేది తెలిసిందే- ఇంటర్వెల్ దగ్గర ముగిసే మిడిల్-1, ఇంటర్వెల్ కి
తర్వాత ప్రారంభమయ్యే మిడిల్- 2. క్రిందటి
వ్యాసంలో మిడిల్ -1 ని ఎలా నిర్మించుకోవాలో తెలుసుకున్నాక, ఇప్పుడు మిడిల్- 2
నిర్మాణాన్ని నేర్చుకుందాం. నిర్మాణమంటే కథనమే. ఈ కథనం ఎప్పుడూ కొన్ని
సీక్వెన్సులుగా వుంటుంది. ఒక్కో సీక్వెన్సులో మళ్ళీ బిగినింగ్- మిడిల్- ఎండ్ అనే
స్ట్రక్చర్ వుంటుంది. ఫస్టాఫ్ లో నాలుగు సీక్వెన్సులు, సెకండాఫ్ లో నాల్గు సీక్వెన్సులు
ఉండడమే మొత్తం స్క్రీన్ ప్లే. అంటే ఫస్టాఫ్ బిగినింగ్ విభాగంలో రెండు
సీక్వెన్సులు, మిడిల్-1 విభాగంలో రెండు సీక్వెన్సులు, మళ్ళీ సెకండాఫ్ మిడిల్ -2
విభాగంలో రెండు సీక్వెన్సులు, చివర్లో ఎండ్ విభాగంలో రెండు సీక్వెన్సులు మొత్తం కలిపి ఎనిమిది సీక్వెన్సులూ ఇమిడి
వుంటాయన్న మాట. దీన్ని అర్ధం జేసుకుంటే ఏ సీను తర్వాత ఏ సీను వస్తుందో-
రావాలో తెలుసుకోగలం. అప్పుడు వన్ లైన్ ఆర్డర్ సులభంగా,
పకడ్బందీగా వేయగలం. దీన్ని అర్ధం జేసుకోక
పోతే చీకట్లో తముడుకుంటున్నట్టు వుంటుంది పరిస్థితి- ఆ మేరకు కథనం కూడా!
scriptreview.blogspot.in/2016/06/15.html లో ‘శివ’ ఆధారంగా మిడిల్ -1 స్ట్రక్చర్ ని తెలుసుకుంటున్నప్పుడు, వన్ లైన్ ఆర్డర్ లో అది రెండు సీక్వెన్సులుగా ఎలా విభజన జరిగివుందో గమనించాం. ఇప్పుడు ఇంటర్వెల్ తర్వాత మిడిల్- 2 రెండు సీక్వెన్సుల కూర్పూ ఎలా వుందో చూద్దాం. మరొక్క సారి వెనుక చెప్పుకుంది గుర్తు చేసుకుంటే, స్క్రీన్ ప్లే అంటే మొట్ట మొదట కాన్షస్ – సబ్ కాన్షస్ మైండ్ ల ఇంటర్ ప్లేనే. ఆ తర్వాతే- దీనికి లోబడే స్క్రీన్ ప్లేలో బిగినింగ్- మిడిల్- ఎండ్ విభాగాలు, మళ్ళీ వీటిలో సీక్వెన్సులు, ఈ సీక్వెన్సుల్లో మళ్ళీ వాటి తాలూకు బిగినింగ్- మిడిల్- ఎండ్ విభాగాలు, దీని ప్రకారం వన్ లైన్ ఆర్డర్ లో వేసే సీన్లు, మళ్ళీ ఈ ఒక్కో సీన్లో బిగినింగ్- మిడిల్- ఎండ్ విభాగాలూ అన్నమాట!
ఇలా ఎందులో
చూసినా బిగినింగ్- మిడిల్- ఎండ్ విభాగాలే నన్నమాట- ఎందుకనీ? ఎందుకంటే, వీటన్నిటికీ పై స్థానంలో సర్వాంతర్యామిలా వ్యాపించి వుండే కాన్షస్ – సబ్ కాన్షస్ మైండ్ ల ఇంటర్ ప్లే అనే జగన్నాటక సూత్రధారే కారణం! కాన్షస్ మైండ్ అనేది బిగినింగ్ విభాగమైతే, సబ్ కాన్షస్ మైండ్ మిడిల్ విభాగం, ఎండ్ వచ్చేసి ఈ రెండిటి ఇంటర్ ప్లే ఫలితంగా మనం పొందే మోక్షం. అందుకే స్థూల స్థాయి నుంచీ సూక్ష్మ స్థాయి వరకూ ఎందులో చూసినా బిగినింగ్- మిడిల్- ఎండ్ విభాగాలు సర్దుకుని వుంటాయి. చిట్ట చివర సూక్ష్మ స్థాయిలో ఒక సీను రాస్తున్నప్పుడు దాని ప్రారంభం, అంటే బిగినింగ్ కాన్షస్ మైండ్ లక్షణాలని కలిగి వుంటుంది, ఈ ప్రారంభం తర్వాత సీనుకో నడక వుంటుంది : ఈ నడక అంటే మిడిల్ విభాగం సబ్ కాన్షస్ మైండ్ లక్షణాలని కలిగి వుంటుంది. సీను ముగింపు- అంటే ఎండ్ విభాగం వచ్చేసి మనం పొందే మోక్షాన్ని పోలి వుంటుంది- వుండాలి.
గత రాత్రి ‘డోంట్ బ్రీత్’ చూసొచ్చాం. హర్రర్ సినిమాలతో కాన్షస్ – సబ్ కాన్షస్ మైండ్ ల ఇంటర్ ప్లే ని వివరించుకుంటే బాగా అర్ధమవుతుంది- ముగ్గురు దొంగలు ఒక అంధుడి ఇంట్లో డబ్బు కొట్టేయాలని జొరబడతారు. జొరబడే ముందు వాళ్ళ దైనందిన జీవితంలో ఆనందాలు కాన్షస్ మైండ్ కి ప్రతీకలు. ఆ ఇంట్లోకి జొరబడడం సబ్ కాన్షస్ మైండ్ లోకి చేరిక. హార్రర్ సినిమాల్లో చూపించే ఇలాటి గృహలన్నీ మన సబ్ కాన్షస్ మైండ్ లాంటి మిస్టీరియస్ కొంపలే. మన సబ్ కాన్షస్ మైండే ఒక అనంతమైన మిస్టీరియస్ కొంప. అందులో ఏమేం అంతుచిక్కని రహస్యాలుంటాయో, ఇంకెలాటి నేర్చుకోదగ్గ జీవిత సత్యాలుంటాయో మన ఇగోకి తెలీదు. తెలుసుకుని, నేర్చుకుని బాగుపడదామని ప్రయత్నించదు. పైగా అవంటే భయం కూడా. అందుకని ఎంతసేపూ ఆ సబ్ కాన్షస్ కి దూరంగా, ఔటర్ రింగ్ రోడ్ లాంటి కాన్షస్ మైండ్ లో, హార్లీ డేవిడ్సన్ బైక్ వేసుకుని జామ్మని ఎంజాయ్ చేయడమే దానికి కావాలి. అలా ఆ ముగ్గురు దొంగలు (ఇగో) ఆ సబ్ కాన్షస్ మైండ్ అనే చీకటి గృహంలోకి తెగించి ప్రవేశిస్తారు. అప్పుడు గబుక్కున అక్కడున్న జీవిత సత్యం అంధుడి రూపంలో మేల్కొంటుంది. వెంటాడుతుంది. దొంగతనం తప్పని ఇగో కి చెప్తుంది, దొంగతనానికి శిక్ష తప్పదనీ చంపడం మొదలెడుతుంది...ఈ ‘అంతర్మధనాన్ని’ తాళలేక తప్పయిపోయింది క్షమించి వదలమన్నా వదలదు అంధుడి రూపంలో వున్న దొంగతనం తప్పనే ఆ జీవిత సత్యం. ఇలా వెండితెర మీద కదిలే పాత్రలు కేవలం మన ఇగో ప్లస్ జీవిత సత్యాల ప్రతిరూపాలే. మహేష్ బాబు అయినా, తమన్నా అయినా, సప్తగిరి అయినా, ప్రకాష్ రాజ్ అయినా వీటిని ప్రతిబింబించాల్సిందే- ఇంకేదో ప్రదర్శించడం కాదు.
ఎందుకు
ఈ హర్రర్ ఇంతలా ఆడేస్తోందంటే ఇలా ఇది ప్రేక్షకుల మానసిక ప్రపంచాన్ని ‘ఇంటర్ ప్లే’ తో అంతలా పట్టేసుకుంది కాబట్టే. ‘శివ’ కూడా ఇలాగే ‘ఇంటర్ ప్లే’ తో ప్రేక్షకుల మానసిక ప్రపంచాన్ని ప్రతిబింబించింది కాబట్టే అంతలా అడేసింది. స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ అనేది కేవలం భౌతిక పరమైనది, దానికి కెమెరాతో చిత్రీకరణ కేవలం క్రియేటివ్ కోణమే. ‘ఇంటర్ ప్లే’ అనే ఆత్మే లేకపోతే ఈ రెండూ కృతకంగానే మిగిలిపోతాయి.
‘శివ’ లో శివ మన ఇగో కాన్షస్ అయితే, మాఫియా భవానీ సబ్ కాన్షస్ లో దాగి వుండే ఒక జీవిత సత్యం. దాన్ని ఎదుర్కొని, నశింప జేసి, జీవితాన్ని సుఖమయం చేసుకోవాల్సిందే తప్ప- చేతులు ముడుచుకుంటే మోక్షం లేదు. కురుక్షేత్రం ఎక్కడో జరగలేదు. అది మన అంతరంగం లోనే రోజూ జరుగుతోంది. మన కుండేవి పంచ పాండవు ల్లాంటి ఐదే పాజిటివ్ శక్తులు. మన అంతరంగంలో వుండేవి కౌరవుల్లాంటి నూటికి నూరు నెగెటివ్ శక్తులు. ఐదే పాజిటివ్ శక్తులతో నూరు నెగెటివ్ శక్తుల పీచమణిచి మనసు స్వర్గతుల్యం చేసుకోవడమే కురుక్షేత్రపు సూపర్ హిట్ మేజర్ థీమ్- ఫార్ములా!
జానర్ ని బట్టి ఇంటర్ ప్లే రస పోషణ వుంటుంది.
యాక్షన్ జానర్ అయితే వయొ లెంట్ గా, హార్రర్
అయితే భయపెడుతూ, థ్రిల్లర్ అయితే ఉత్సుకతని రేపుతూ, ఫ్యామిలీ అయితే సెంటిమెంట్లతో బాధిస్తూ, ప్రేమ అయితే రొమాంటిగ్గా సమ్మోహన పరుస్తూ, కామెడీ అయితే నవ్విస్తూ ఇంటర్ ప్లే సాగుతుంది.
***
ఈ నేపధ్యంలో యాక్షన్ జానర్ ‘శివ’ నిర్మాణాన్ని పెట్టుకుని స్క్రీన్ ప్లే రచన నేర్చుకుంటూ వస్తున్నాం. ఇప్పడు సెకండాఫ్ మిడిల్ – 2 లో ఈ ఇంటర్ ప్లే, సీక్వెన్సుల అమరిక, వగైరా ఎలా వున్నాయో తెలుసుకుందాం. ఇంటర్వెల్లో శివ బృందంలోని మల్లిని చంపించేస్తాడు భవానీ. దీని తర్వాత మిడిల్- 2 వన్ లైన్ ఆర్డర్ ఈ కింది విధంగా వుంటుంది...
51.
శివ హత్యకి గురయిన మల్లి శవాన్ని హాస్పిటల్లో చూడ్డం,
మల్లి నాన్నమ్మ సీఐని నిలదీయడం.
52. శివతో సీఐ తాను భవానీని ఏమీ చేయలేనని నిస్సహాయత వెల్లడించడం, మల్లి హత్యకి ప్రతీకారంగా భవానీని చంపడం కాకుండా, భవానీ లాంటి వాళ్ళని తయారు చేస్తున్న వ్యవస్థని నాశనం చేస్తానని శివ అనడం.
53. ఇంటిదగ్గర వదిన శివ వల్లే తన కూతురు కీర్తి ప్రమాదంలో పడిందని ఆరోపిస్తే, వాళ్ళ క్షేమం కోసం శివ ఇల్లు వదిలి వెళ్ళిపోవడం.
54. ఆశా శివాని తమ ఇంట్లో వుండమనడం, తన దగ్గర వుండమని చిన్నా ఆఫర్ ఇవ్వడం.
55. వీధిలో టీ స్టాల్ ఓనర్ భవానీ వసూళ్లు చేస్తున్న మామూళ్ళ గురించి వాపోతే, ఈ రోజు నుంచీ ఎవ్వరూ భవానీకి మామూళ్ళు ఇవ్వడానికి వీల్లేదని శివ ఆజ్ఞాపించడం.
56. ఫ్యాక్టరీ యజమాని కార్మికుల కోర్కెలు తీర్చకుండా సమ్మె ఆపమని భవానీకి డబ్బు అందించడం.
57. కార్మిక నాయకుడు కృష్ణా రెడ్డి భవానీ దగ్గరకొచ్చి, ఇలా సమ్మె ఆపితే తనకి చెడ్డ పేరొస్తుందని వాపోతే, చెప్పినట్టు చెయ్యమని భవానీ అనడం. భవానీ దగ్గరికి నానాజీ వచ్చి, మల్లి హత్య కేసులో శివ గ్రూప్ గణేష్ మీద కంప్లెయింట్ ఇచ్చారని, గణేష్ ని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైందనీ అంటే, శివని చంపెయ్యమని భవానీ ఆదేశించడం.
58. రాత్రి పూట శివ ఇంటిమీద భవానీ అనుచరుల మీద దాడి, వాళ్ళని ఎదుర్కొని శివ ఒకణ్ణి బందీగా పట్టుకోవడం.
59. బందీగా పట్టుకున్న అనుచరుణ్ణి భవానీ దగ్గరికి తెచ్చి పడేసి- ఈ రోజునుంచి భవానీకి సంబంధించిన ప్రతీదీ నాశనం చేస్తానని శివ ఇవ్వడం.
60. కల్లు కాంపౌండ్ మీద శివ గ్రూపు దాడి చేయడం.
61. శివ దగ్గరికి కృష్ణా రెడ్డి వచ్చి సమ్మెకి సపోర్టు అడగడం, బదులుగా కార్మికుల సపోర్టు శివకే వుంటుందని అనడం.
62. ఇది భవానీకి తెలిసిపోయి- శివ కుటుంబం గురించి ఆరా తీయడం, ఆశాని శివ పెళ్లి చేసుకోబోతున్నాడని తెలుసుకోవడం.
63. భవానీ అనుచరులు ఆశాని కిడ్నాప్ చేస్తే శివ వచ్చి కాపాడుకోవడం.
64. ఆశా భద్రత గురించి శివ ఆందోళన చెందితే, ఆశా ప్రేమని వ్యక్తం చేయడం.
65. శివ ఆశాలు ఆశా అన్న (సీఐ) కి తమ పెళ్లి గురించి చెప్పడం.
66. పెళ్లయిపోయిన అర్ధంలో డ్యూయెట్.
67. నానాజీ వచ్చి బార్ వాడు మామూళ్ళు ఇవ్వడం లేదనీ, ఏరియాలో ఎవ్వరూ కేర్ చేయడం లేదనీ భవానీకి చెప్పడం.
68. పెళ్ళయ్యాక శివ తనకే వుండాలన్న స్వార్ధం పెరిగిపోయిందని, అతను జనం కోసం తిరుగుతోంటే భరించలేక పోతున్నానని అన్నదగ్గర ఆశా బాధ పడడం.
69. శివ అన్న కూతుర్ని వెంటబెట్టుకుని శివ ఇంటికి రావడం, తనకి ట్రాన్స్ ఫర్ అయ్యిందని చెప్పడం, ట్రాన్స్ ఫర్ అతడి భద్రత కోసమే తను చేయించానని తర్వాత ఆశాతో శివ అనడం.
70. శివ- ఆశాల డ్యూయెట్.
71. శివ మీద ఎందుకుచర్య తీసుకోవడం లేదని మాచిరాజు వచ్చి భవానీని తిట్టడం, అహం దెబ్బ తిన్న భవానీ ఫైనల్ గా వారం రోజుల్లో ఫినిష్ చేస్తాననడం. భవానీ అనుచరుడు డబ్బు అడిగితే భవానీ వాణ్ణి కొట్టడం.
72. దెబ్బ తిన్న భవానీ అనుచరుడు చిన్నాకి కాల్ చేసి, పది వేలు పట్టుకుని ఊర్వశి బార్ కి వస్తే గణేష్ ఆచూకీ చెప్తాననడం.
73. ఈ విషయం చెప్పడానికి శివ దగ్గరికి చిన్నా వెళ్తే శివ లేకపోవడం.
74. చిన్నా తనే బార్ కి వెళ్లి భవానీ అనుచరుణ్ణి కలవడం, అక్కడికే వచ్చేసిన భవానీ ఆ అనుచరుణ్ణి చంపడం, చిన్నా పారిపోవడం.
75. పారిపోతున్న చిన్నాని పట్టుకుని భవానీ అనుచరులు చంపెయ్యడం.
76. శివకి చిన్నా రాసిన చీటీ అంది బార్ కి వెళ్ళడం.
77. బార్ లో దాక్కున్న గణేష్ ని శివ పట్టుకుని కొట్టడం.
78. గణేష్ ని పోలీస్ స్టేషన్ ముందు తెచ్చి పడేసి శివ వెళ్ళిపోవడం.

**మిడిల్ సమాప్తం**
51
వ సీనులో మల్లి హత్యోదంతంతో ఎత్తుకుని, 78వ సీన్లో గణేష్ ని శివ పట్టుకుని పోలీస్
స్టేషన్ ముందు పడెయ్యడంతో 27 సీన్లతో మిడిల్-2 విభాగం ముగిసింది. మిడిల్ -2 విభాగం
ముగియడమంటే ప్లాట్ పాయింట్ -2 ఏర్పడ్డమే.
మిడిల్ -1 విభాగం ఫస్టాఫ్ లో 22 వ సీన్లో క్యాంటీన్లో శివా అతడి గ్రూపూ ఎలక్షన్స్
గురించి చర్చించుకుంటూ, భవానీ మనిషి జేడీ మీద శివ పోటీ చేయాలని గ్రూపు అంటే, కాదని నరేష్ ని నిలబెడదామని శివ
అనడంతో ప్రారంభమవుతుంది. అది ప్లాట్ పాయింట్ -1.
అంటే అక్కడ్నించీ ప్రారంభమయ్యే మొత్తం మిడిల్ విభాగం సెకండాఫ్ లో గణేష్ ని
శివ పట్టుకుని పోలీస్ స్టేషన్ ముందు పడేసే 78వ సీను
దగ్గర ప్లాట్ పాయింట్- 2 గా ముగుస్తుందన్న మాట. అంటే ప్లాట్ పాయింట్ -1 కీ, ప్లాట్
పాయింట్- 2 కీ మధ్య మొత్తం
మిడిల్ విభాగం నిడివి 56 సీన్లతో వుందన్న మాట. ఇది మొత్తం స్క్రీన్ ప్లే లో 50 శాతంగా ప్రమాణాల ప్రకారమే వుంది.
ఇప్పుడు మిడిల్ -2 నిర్మాణం ఎలా జరిగిందో చూద్దాం : ఈ 27 సీన్లూ రెండు
సీక్వెన్సులుగా ఏర్పడ్డాయి. మొదటి సీక్వెన్స్ టాపిక్ భవానీని చంపడంగా
కాకుండా,భవానీ లాంటి వాళ్ళని
సృష్టిస్తున్న వ్యవస్థని నాశనం చేయడం; రెండో సీక్వెన్స్ టాపిక్ వచ్చేసి మల్లి హత్య
కేసులో నిందితుడైన గణేష్ ని పట్టుకోవడం. ఈ రెండు టాపిక్స్ తో ఈ రెండు సీక్వెన్సులూ
నడుస్తాయి. టాపిక్స్ నిర్ణయించుకుంటే సీక్వెన్సులు నడపడం సులభం. ఈ టాపిక్స్ థీమ్
తో (కాన్సెప్ట్ తో) మమేకం అవాలి.
ఇక్కడ రెండు సీక్వేన్సుల ప్రారంభాలకీ 52, 57 సీన్లలోనే బీజాలు పడ్డాయి. 52 వ సీన్లో శివతో సీఐ తాను భవానీని ఏమీ చేయలేనని నిస్సహాయత వెల్లడించడంతో, దీనికి మల్లి హత్యకి ప్రతీకారంగా భవానీని చంపడం కాకుండా, భవానీ లాంటి వాళ్ళని తయారు చేస్తున్న వ్యవస్థని నాశనం చేస్తానని శివ అనే మొదటి టాపిక్ తో, మొదటి సీక్వెన్స్ కి బీజం పడింది.
అలాగే 57 వ సీన్లో, మల్లి హత్య కేసులో శివ గ్రూప్ గణేష్ మీద కంప్లెయింట్ ఇచ్చారని, గణేష్ ని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైందనీ భవానీతో నానాజీ అనే మాటగా రెండో టాపిక్ తో, రెండో సీక్వెన్సుకి బీజం పడింది.
కానీ రెండు సీక్వెన్సులూ ఈ రెండు టాపిక్స్ తో ఏకకాలంలో సమాంతరంగా నడవలేదు. అలా నడిపి వుంటే చాలా గజిబిజి అయ్యదే. ఇప్పుడు చాలా సినిమాల్లో సీక్వెన్సుల విధానం తెలీక టాపిక్స్ ని గజిబిజి చేసి నడిపిస్తున్నారు. ‘శివ’ లో ఎత్తుకున్న మొదటి టాపిక్ తో మొదటి సీక్వెన్స్ ని ముగించాకే, రెండో టాపిక్ ని ఎత్తుకుని రెండో సీక్వెన్స్ ని నడిపారు.
పై వన్ లైన్ ఆర్డర్ లో మొదటి టాపిక్ కి సంబంధించిన సీన్స్ ని గమనిస్తే – 55,56,57,58,59,60,61,62,63,67,71 సీన్లలో వ్యవస్థని నాశనం చేసే మొదటి టాపిక్ తాలూకు విషయం ప్రవహిస్తుంది. మొదటి టాపిక్ ఎత్తుకున్న 52 వ సీనుతో కలుపుకుని మొత్తం 13 సీన్లుగా మొదటి సీక్వెన్స్ నడుస్తుంది. 52 వ సీనులో వ్యవస్థని నాశనం చేస్తానని శివ అనడంతో మొదలై, 71 వ సీనులో ఆ వ్యవస్థకి మూలపురుషుడైన మాచి రాజు, భవానీ దగ్గర కొచ్చేసి క్లాసు పీకడంతో మొదటి సీక్వెన్స్ కొలిక్కొస్తుంది.
ఈ మొదటి సీక్వెన్సు నడిచే 52- 71 సీన్ల మధ్య 57 వ సీన్లో బీజం పడేప్పుడు తప్పితే, రెండో టాపిక్ కి సంబంధించిన సీన్లు గానీ, దాని ప్రస్తావన గానీ ఎక్కడా లే కపోవడాన్ని గమనించాలి. స్ట్రక్చర్ అంటే ఇదే.
ఈ మొదటి సీక్వెన్స్ స్ట్రక్చర్ చూద్దాం :
బిగినింగ్ -ఎత్తుగడతో సాధారణ స్థితి : 51. శివ హత్యకి గురయిన మల్లి శవాన్ని హాస్పిటల్లో
చూడ్డం, మల్లి నాన్నమ్మ సీఐని నిలదీయడం.
52. శివతో సీఐ తాను భవానీని ఏమీ చేయలేనని నిస్సహాయత వెల్లడించడం, మల్లి హత్యకి ప్రతీకారంగా భవానీని చంపడం కాకుండా, భవానీ లాంటి వాళ్ళని తయారు చేస్తున్న వ్యవస్థని నాశనం చేస్తానని శివ అనడం.
55. వీధిలో టీ స్టాల్ ఓనర్ భవానీ వసూళ్లు చేస్తున్న మామూళ్ళ గురించి వాపోతే, ఈ రోజు నుంచీ ఎవ్వరూ భవానీకి మామూళ్ళు ఇవ్వడానికి వీల్లేదని శివ ఆజ్ఞాపించడం.
56. ఫ్యాక్టరీ యజమాని కార్మికుల కోర్కెలు తీర్చకుండా సమ్మె ఆపమని భవానీకి డబ్బు అందించడం.
57. కార్మిక నాయకుడు కృష్ణా రెడ్డి భవానీ దగ్గరకొచ్చి, ఇలా సమ్మె ఆపితే తనకి చెడ్డ పేరొస్తుందని వాపోతే, చెప్పినట్టు చెయ్యమని భవానీ అనడం. భవానీ దగ్గరికి నానాజీ వచ్చి, మల్లి హత్య కేసులో శివ గ్రూప్ గణేష్ మీద కంప్లెయింట్ ఇచ్చారని, గణేష్ ని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైందనీ అంటే, శివని చంపెయ్యమని భవానీ ఆదేశించడం.
52. శివతో సీఐ తాను భవానీని ఏమీ చేయలేనని నిస్సహాయత వెల్లడించడం, మల్లి హత్యకి ప్రతీకారంగా భవానీని చంపడం కాకుండా, భవానీ లాంటి వాళ్ళని తయారు చేస్తున్న వ్యవస్థని నాశనం చేస్తానని శివ అనడం.
55. వీధిలో టీ స్టాల్ ఓనర్ భవానీ వసూళ్లు చేస్తున్న మామూళ్ళ గురించి వాపోతే, ఈ రోజు నుంచీ ఎవ్వరూ భవానీకి మామూళ్ళు ఇవ్వడానికి వీల్లేదని శివ ఆజ్ఞాపించడం.
56. ఫ్యాక్టరీ యజమాని కార్మికుల కోర్కెలు తీర్చకుండా సమ్మె ఆపమని భవానీకి డబ్బు అందించడం.
57. కార్మిక నాయకుడు కృష్ణా రెడ్డి భవానీ దగ్గరకొచ్చి, ఇలా సమ్మె ఆపితే తనకి చెడ్డ పేరొస్తుందని వాపోతే, చెప్పినట్టు చెయ్యమని భవానీ అనడం. భవానీ దగ్గరికి నానాజీ వచ్చి, మల్లి హత్య కేసులో శివ గ్రూప్ గణేష్ మీద కంప్లెయింట్ ఇచ్చారని, గణేష్ ని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైందనీ అంటే, శివని చంపెయ్యమని భవానీ ఆదేశించడం.
మిడిల్ – శివ మీద దాడితో అసాధారణ స్థితి- సంఘర్షణ :
58. రాత్రి పూట శివ ఇంటిమీద భవానీ అనుచరుల మీద దాడి, వాళ్ళని ఎదుర్కొని శివ ఒకణ్ణి బందీగా పట్టుకోవడం.
59. బందీగా పట్టుకున్న అనుచరుణ్ణి భవానీ దగ్గరికి తెచ్చి పడేసి- ఈ రోజునుంచి భవానీకి సంబంధించిన ప్రతీదీ నాశనం చేస్తానని శివ ఇవ్వడం.
చేస్తున్న వ్యవస్థని నాశనం చేస్తానని శివ అనడం.
60. కల్లు కాంపౌండ్ మీద శివ గ్రూపు దాడి చేయడం.
61. శివ దగ్గరికి కృష్ణా రెడ్డి వచ్చి సమ్మెకి సపోర్టు అడగడం, బదులుగా కార్మికుల సపోర్టు శివకే వుంటుందని అనడం.
62. ఇది భవానీకి తెలిసిపోయి- శివ కుటుంబం గురించి ఆరా తీయడం, ఆశాని శివ పెళ్లి చేసుకోబోతున్నాడని తెలుసుకోవడం.
63. భవానీ అనుచరులు ఆశాని కిడ్నాప్ చేస్తే శివ వచ్చి కాపాడుకోవడం.
67. నానాజీ వచ్చి బార్ వాడు మామూళ్ళు ఇవ్వడం లేదనీ, ఏరియాలో ఎవ్వరూ కేర్ చేయడం లేదనీ భవానీకి చెప్పడం.
58. రాత్రి పూట శివ ఇంటిమీద భవానీ అనుచరుల మీద దాడి, వాళ్ళని ఎదుర్కొని శివ ఒకణ్ణి బందీగా పట్టుకోవడం.
59. బందీగా పట్టుకున్న అనుచరుణ్ణి భవానీ దగ్గరికి తెచ్చి పడేసి- ఈ రోజునుంచి భవానీకి సంబంధించిన ప్రతీదీ నాశనం చేస్తానని శివ ఇవ్వడం.
చేస్తున్న వ్యవస్థని నాశనం చేస్తానని శివ అనడం.
60. కల్లు కాంపౌండ్ మీద శివ గ్రూపు దాడి చేయడం.
61. శివ దగ్గరికి కృష్ణా రెడ్డి వచ్చి సమ్మెకి సపోర్టు అడగడం, బదులుగా కార్మికుల సపోర్టు శివకే వుంటుందని అనడం.
62. ఇది భవానీకి తెలిసిపోయి- శివ కుటుంబం గురించి ఆరా తీయడం, ఆశాని శివ పెళ్లి చేసుకోబోతున్నాడని తెలుసుకోవడం.
63. భవానీ అనుచరులు ఆశాని కిడ్నాప్ చేస్తే శివ వచ్చి కాపాడుకోవడం.
67. నానాజీ వచ్చి బార్ వాడు మామూళ్ళు ఇవ్వడం లేదనీ, ఏరియాలో ఎవ్వరూ కేర్ చేయడం లేదనీ భవానీకి చెప్పడం.
ఎండ్ – పరిష్కారం :
71. శివ మీద ఎందుకుచర్య తీసుకోవడం లేదని మాచిరాజు వచ్చి భవానీని తిట్టడం, అహం దెబ్బ తిన్న భవానీ ఫైనల్ గా వారం రోజుల్లో ఫినిష్ చేస్తాననడం. భవానీ అనుచరుడు డబ్బు అడిగితే భవానీ వాణ్ణి కొట్టడం.
వివరణ :
ఈ సీక్వెన్సులో మధ్య మధ్యలో శివ- ఆశాల ప్రేమా పెళ్ళీ తాలూకు సీన్లు; అన్న, వదిన, కీర్తి తాలూకు సీన్లూ డ్యూయెట్లూ వున్నాయి. ప్రధాన కథతో సంబంధం లేకుండా ఇవి సబ్ ప్లాట్ సీన్లూ - పాటలు. ఫస్టాఫ్ నుంచి ఈ సబ్ ప్లాట్ కంటిన్యూ అవుతోంది.
***
ఇక రెండో సీక్వెన్స్ 72-78 సీన్ల మధ్య 7
సీన్లతో నడుస్తుంది. రెండో సీక్వెన్స్ నిడివి ఎప్పుడూ తక్కువే వుంటుంది. ఫస్టాఫ్
లో మిడిల్-1 కి రెండో సీక్వెన్స్ ని కూడా
గమనిస్తే, అది 10 సీన్లతోనే వుంటుంది. కానీ మొదటి సీక్వెన్స్ 16 సీన్లతో వుంటుంది.
ఫస్టాఫ్ లో రెండో సీక్వెన్స్ ఎప్పుడూ ఇంటర్వెల్ కి దారి తీసే పించ్ -1 దగ్గర
ప్రారంభమైనట్టు, సెకండాఫ్ లో కూడా రెండో సీక్వెన్స్ ప్లాట్ పాయింట్ -2 కి ప్రేరేపించే పించ్ - 2
దగ్గరే ప్రారంభమ
వుతుంది. అందుకని వీటి నిడివి ఎప్పుడూ తక్కువే వుంటుంది. పించ్- 1, పించ్- 2 లకి
దారితీసే సీక్వెన్స్ లెప్పుడూ చప్పున ముగుస్తాయి.
ఇప్పుడు చూద్దాం : మొదటి సీక్వెన్స్ లోని 57 వ సీన్లోనే రెండో సీక్వెన్స్ టాపిక్ కి బీజం పడిందని పైన గమనించాం. గణేష్ ని పట్టుకునే టాపిక్. మొదటి సీక్వెన్స్ 71 వ సీనుతో ముగిసింది. ఈ సీను ముగింపులోనే రెండో సీక్వెన్స్ ప్రారంభమయ్యింది. ఎలాగంటే డబ్బడిగిన అనుచరుణ్ణి భవానీ లాగి కొట్టాడు. ఈ లాగి కొట్టడమే గణేష్ దొరికిపోవడమనే రెండో సీక్వెన్స్ కి ‘కీ’ ఇచ్చినట్టయ్యింది.
బిగినింగ్ -ఎత్తుగడతో సాధారణ స్థితి :
72. దెబ్బ తిన్న భవానీ అనుచరుడు చిన్నాకి కాల్ చేసి, పది వేలు పట్టుకుని ఊర్వశి బార్ కి వస్తే గణేష్ ఆచూకీ చెప్తాననడం.
73. ఈ విషయం చెప్పడానికి శివ దగ్గరికి చిన్నా వెళ్తే శివ లేకపోవడం.
72. దెబ్బ తిన్న భవానీ అనుచరుడు చిన్నాకి కాల్ చేసి, పది వేలు పట్టుకుని ఊర్వశి బార్ కి వస్తే గణేష్ ఆచూకీ చెప్తాననడం.
73. ఈ విషయం చెప్పడానికి శివ దగ్గరికి చిన్నా వెళ్తే శివ లేకపోవడం.
మిడిల్ – అనుచరుడి హత్యతో అసాధారణ స్థితి- సంఘర్షణ :
74. చిన్నా తనే బార్ కి వెళ్లి భవానీ అనుచరుణ్ణి కలవడం, అక్కడికే వచ్చేసిన భవానీ ఆ అనుచరుణ్ణి చంపడం, చిన్నా పారిపోవడం.
75. పారిపోతున్న చిన్నాని పట్టుకుని భవానీ అనుచరులు చంపెయ్యడం.
76. శివకి చిన్నా రాసిన చీటీ అంది బార్ కి వెళ్ళడం.
ఎండ్ – పరిష్కారం :
77. బార్ లో దాక్కున్న గణేష్ ని శివ పట్టుకుని కొట్టడం.
78. గణేష్ ని పోలీస్ స్టేషన్ ముందు తెచ్చి పడేసి శివ వెళ్ళిపోవడం.
ఇలా ముగిసే మిడిల్- 2 ని మనమొకసారి పరిశీలిస్తే, ఫస్టాఫ్ లో
మిడిల్-1 లో కేవలం భవానీతో సంఘర్షిస్తూ వుండిన శివ, సెకండాఫ్ మిడిల్ -2 కి
వచ్చేసి, భవానీని కాదు, అంతం చేయాల్సింది భవానీలాంటి మాఫియాల్ని తయారు చేస్తున్న
వ్యవస్థని అనీ తెలుసుకుని, ఆ మేరకు తన
గోల్ ని మరింత విస్తరించడంతో పాత్ర చిత్రణకి సంబంధించి క్యారక్టర్ డెవలప్ మెంట్,
గ్రోత్, మెచ్యూరిటీ ఇవన్నీకనపడుతున్నాయి.
52 వ సీన్లో - ‘నా తప్పు నాకిప్పుడు అర్ధమవుతోంది. రౌడీయిజానికి ఎదురు తిరిగాను కానీ అదొక్కటే సరిపోదని తెలిసింది. మల్లిని చంపాడన్న కోపంతో నేను భవానీని చంపితే, వ్యక్తిగతంగా నా పగ తీర్చుకోవడమే తప్ప, ఇంకేమీ జరగదు. ఈ భవానీ కాకపోతే రేపు గణేష్ భవానీ అవుతాడు, లేకపోతే ఇంకొకడు. దీనికి సొల్యూషన్ భవానీని చంపడం కాదు, అలాటి గూండాల్ని పుట్టిస్తున్న వ్యవస్థని నాశనం చెయ్యాలి- గెలుస్తానో లేదో తెలీదు, కానీ ప్రయత్నిస్తాను-‘ అని సీఐ తో శివ అనడం పాత్ర మానసికంగా ఎదిగిందనేందుకు నిదర్శనం. ‘నా తప్పు నాకిప్పుడు అర్ధమవుతోంది. రౌడీయిజానికి ఎదురు తిరిగాను కానీ అదొక్కటే సరిపోదని తెలిసింది...’ అని ఒప్పుకోవడం ప్రేక్షకులకి ఎంతో కనెక్ట్ అవుతుంది. తప్పు చేయడంతో హీరో కూడా తమలాంటి సాధారణ మానవమాత్రుడే నన్న ఫీల్ తో ప్రేక్షకులు కరిగిపోతారు. అంతేగాక, వ్యూహం మార్చడం కోసం హీరో ఆలోచనలు ప్రేక్షకులకి తెలియాలి. ఇప్పటి సినిమాల్లో అరుపులు అరిచి నరకడమే తప్ప- ఆలోచనలు తెలిపి ప్రేక్షకుల్ని దగ్గర చేసుకునే విధానం లేదు. భవానీ కూడా ఎంత చక్కగా తన వ్యూహం తాలూకు ఆలోచనలు ప్రేక్షకులకి తెలుపుతాడంటే- శివ గణేష్ మీద కంప్లెయింట్ ఇచ్చాడని తెలిశాక - 57వ సీన్లో- ‘నానాజీ. మన బిజినెస్ లో ఎప్పుడూ ఎదుటివాడి దెబ్బ కోసం వెయిట్ చేయడం మంచిది కాదు, ముందు మన దెబ్బ పడిపోవాలి-’ అని! ఇలా చెప్పి రెండో ఇన్నింగ్స్ దాడులు ప్రారంభిస్తాడు.
వీటితో జతకూడే ఆశాతో రిస్కూ పెరిగి, పరిణామాల హెచ్చరికలూ రెండింత లయ్యాయి. అదే సమయంలో మిడిల్ -1 బిజినెస్ ప్రకారం ఏ యాక్షన్- రియాక్షన్ లతో కూడిన సంఘర్షణ ప్రారంభమయ్యిందో, అది మరింత బలపడి మిడిల్ -2 లోనూ కొనసాగడం గమనించ వచ్చు.
ప్లాట్ పాయింట్ -2 ఎప్పుడూ కథ ముగించడానికి పరిష్కార మార్గం లభించే దృశ్యంతో వుంటుంది. అలా శివ గణేష్ ని పట్టుకుని కోర్టుకి అప్పగించడానికి పోలీసులకి సాయపడుతూ, వాణ్ణి తెచ్చి పోలీస్ స్టేషన్ ముందు పడేసే దృశ్యంతో ఈ మిడిల్ విభాగం స్ట్రక్చర్ పరిసమాప్తమవుతోంది.
-సికిందర్
ఎక్సర్ సైజులు:
1. ఏదైనా సినిమా దగ్గర పెట్టుకుని చూస్తూ దాని వన్ లైన్ ఆర్డర్ రాయండి.
2. ఆ వన్ లైన్ ఆర్డర్ లో బిగినింగ్- మిడిల్- ఎండ్ విభాగాల్ని గుర్తించండి.
3. వీటిలో సీక్వెన్సులు కనిపెట్టి, వాటిలో బిగినింగ్-మిడిల్- ఎండ్ విభాగాల్ని గుర్తించండి.
4. ఏదైనా సినిమా చూసి దాని కథ రెండు పేరాల్లో రాయండి.

-