స్క్రీన్ ప్లే, దర్శకత్వం: జి.నాగేశ్వరరెడ్డి
తారాగణం : సుశాంత్, సోనమ్ బజ్వా, బ్రహ్మానందం, మురళీశర్మ,
ఆనంద్, పోసాని, వెన్నెల కిషోర్, రఘుబాబు, పృథ్వీ, ఫిరోజ్ అబ్బాసీ, సుధ,
రమాప్రభ, తదితరులు
కథ, మాటలు: శ్రీధర్ సీపాన, సంగీతం: అనూప్ రూబెన్స్, ఛాయాగ్రహణం : సినిమాటోగ్రఫీ: దాశరథి శివేంద్ర
బ్యానర్స్: శ్రీ నాగ్ కార్పొరేషన్, శ్రీ జి ఫిలింస్
నిర్మాతలు: చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల
విడుదల : ఆగస్టు 19, 2016
***

మూడేళ్ళ విరామం తర్వాత సుశాంత్ వస్తున్నాడంటే
ఈసారైనా ఎండమావులైపోయిన సక్సెస్ ని కాస్తయినా సాధిస్తాడని ఆశిస్తారెవరైనా. కానీ
ప్రయత్నంలో తన ప్రత్యేకత, తాజాదనం అంటూ లేకుండా సాటి హీరోలు వాడేస్తున్న ఫార్ములానే గత్యంతరం
లేనట్టు తనూ వాడేసుకుంటూ వస్తాడని ఎవరూ వూహించరు. వచ్చి బాక్సాఫీసు దగ్గర మళ్ళీ
పాత కథే రిపీట్ చేస్తాడనీ అనుకోరు. తన లాంటి యంగ్ హీరో ఫ్రెష్ ఆలోచనలతో వుండే యంగ్
డైరెక్టర్లని అన్వేషించకుండా, అదే పాతని
ఆశ్రయిస్తే అశృనయనాలే మిగుల్తాయి.
సుశాంత్ కి నటుడి అర్హత 99 శాతమూ వుండకపోవచ్చు- కానీ మిగిలిన ఆ ఒక్క శాతం మీద దృష్టి పెట్టి ఆ మేరకు సినిమాలు ఒప్పుకుంటే తన కంటూ ఓ ప్రత్యేకమైన స్లాట్ ని సృష్టించుకోగలడు. కేర్ లెస్ గా వ్యవహరించే పాత్రల్లో తను బాగా రాణించగలడని గుర్తిస్తే, ఏ రకమైన సబ్జెక్టుకైనా తన పాత్రని అలా సృష్టింప జేసుకుంటే- ప్రేక్షకుల్లో తానంటే ఫలానా బ్రాండ్ హీరోగా ఒక అవగాహన, ఆకర్షణ ఏర్పడవచ్చు - ‘కేర్ లెస్ సుశాంత్’ గా. ఇది తప్పదు, తమలో వున్న కొద్ది పాటి టాలెంట్ ఏమిటో దాన్నే నమ్ముకుని ఓ వెలుగు వెలిగిన నటులెందరో వున్నారు. సుశాంత్ ఆల్ రౌండర్ మాస్ గీస్ లవ్ గివ్ హీరో అంటూ కూర్చుంటే మాత్రం ఇలాగే కదలిక కన్పించదు.

‘ఈడోరకం- ఆడోరకం’ అని ఒక పరభాషా రిమేక్ చేసిన కామెడీ సినిమాల దర్శకుడు జి. నాగేశ్వర రెడ్డి- చిన్నా పెద్దా ప్రతీ హీరో అదే తన మూస ఫార్ములాలోకి ఇమిడిపోవాలని ఆశించడం చాలా అన్యాయం. సుశాంత్ కి ఓ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ నివ్వకుండా, విడిపోయిన కుటుంబాలని కలిపే బరువు బాధ్యతల పాత చింతకాయ పరోపకారి పాపన్నని అంటగట్టడం హాస్యాస్పదం. నిర్మాతలు కూడా ఇలాటి సినిమా సుశాంత్ కి ఎందుకు ఒప్పుకున్నారో అర్ధంగాదు, ఇదేదో ఆడా మగా అందరూ తరలివచ్చే ఫ్యామిలీ కథగా అన్పించేదేమో. కానీ ఇప్పుడు తెలుగు ఫ్యామిలీ కథలు వయొలెంట్ రౌడీ మూకల కుటుంబ కథలుగానే వుంటున్నాయి అభ్యంతరకరంగా.
‘ఆటాడుకుందాం రా...’ లోనూ ఇదే పరిస్థితి- కాకపోతే కుటుంబాలు లేని రౌడీల గోల.
కథ
విజయ రాం ( మురళీ శర్మ), ఆనంద రావు (ఆనంద్) మంచి మిత్రులు. ఆనంద్ సలహాలతో విజయ్ రాం వ్యాపారంలో బాగా ఎదుగుతాడు. ఇది ఓర్వలేని శత్రువు మిత్రులు విడిపోయేలా చేస్తాడు. విజయ రాం తీవ్రంగా నష్టపోతాడు. తన నష్టాలకి ఆనందరావే కారణమని నమ్మి విడి పోతాడు. పాతికేళ్ళ తర్వాత ఓ రైసు మిల్లు నడుపుకుంటున్న విజయ రాం తమ్ముడి కూతురు పెళ్లి చేయాలనుకుంటాడు. ఇందుకు మిల్లు అమ్మబోతే తక్కువకి కొట్టేయాలని అదే పాత శత్రువు పథకాలేస్తాడు. మిల్లు అమ్మకానికి విజయ్ రాం చెల్లెలు కూడా సంతకం పెట్టాల్సి వుంటుంది. చెల్లెలు తన మాట వినకుండా వేరే పెళ్లి చేసుకోవడంతో ఆమెతో కూడా తెగతెంపులు చేసుకున్నాడు విజయ రాం. ఇప్పుడు అమెరికాలో వుంటున్న చెల్లెలి అవసరం వచ్చింది. చెల్లెలు రాలేక కొడుకుని పంపు తానంటుంది. అక్కడ ఈ కొడుకూ కార్తీక్ (సుశాంత్) మంచి మిత్రులు. కార్తీక్ ఆనందరావు కొడుకు. తన తండ్రి మీద అభండాలేసి విడిపోయిన విజయ రాం అపార్ధాలు తొలగించి తిరిగి ఇద్దర్నీ కలపాలంటే ఇదే అవకాశమనుకుంటాడు. ఇందుకు విజయరాం మేనల్లుడి వేషం కట్టి విజయరాం ఇంట్లో దిగుతాడు. ఈ మేనల్లుడన్నా విజయ రాం కిష్టం లేదు. కానీ ‘మేనల్లుడు’ కార్తీక్ మిల్లు అమ్మకానికి అడ్డుపడుతున్న శత్రువుల పని పట్టడం మొదలెడతాడు. పనిలోపనిగా విజయ్ రాం కూతురు శృతి నీ ప్రేమిస్తాడు. పాత శత్రువులతోనూ ఆటలాడుకోవడం మొదలెడతాడు....

ఎలా వుంది కథ
గుండమ్మ కథ, రాముడు భీముడు, సంబరాల రాంబాబు, ఇంటింటి రామాయణం మొదలైన వాటితో బాటు సుశాంత్ తాతగారు అక్కినేని నాగేశ్వర రావు, మామగారు అక్కినేని నాగార్జున నటించిన పాత సినిమాలన్నీ అర్జెంటుగా చూసెయ్యాలన్పించేలా వుంది. ఇలాటి ‘ఆటాడుకుందాం రా’ బాపతు సోకాల్డ్ ఫ్యామిలీ- కామెడీ సినిమాలకి ధూమ పాన- మద్యపాన హెచ్చరికలకి బదులు- ‘ఈ సినిమా చూడడం మీ ఆరోగ్యానికే చాలా ప్రమాదకరం, వెంటనే మరికొన్ని పాత సినిమాల్ని మాత్రలుగా వేసుకుంటే రోగం నిదానిస్తుంది’ అని వేయాలని రూలు తేవాలి.
ఎవరెలా చేశారు
రూపు రేఖల విషయంలో సుశాంత్ ఇంప్రూవ్ అయ్యాడు. ఇందాక పైన చెప్పుకున్నట్టు ఈ సినిమాలో అతడి నటనలో పట్టుకోగల ఒకేఒక్క ప్లస్ పాయింట్ కేర్ లెస్ గా ప్రవర్తించే సన్నివేశాల్లో రాణింపు. మరొకరికి లేని ఒక గమ్మత్తయిన బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ ఇలా నటించడంలో తనకున్నాయి. కేర్ లెస్ గా ప్రవర్తించే పాత్ర అతడి యూనిక్ సెల్లింగ్ పాయింట్ కాగలదు. నేటివిటీ, కమర్షియాలిటీ, యూత్ ట్రెండ్ అన్నిటికీ నప్పే పాజిటివ్ కోణం. అయితే డైలాగులు చెప్పేటప్పుడు సాధ్యమైనంత వరకూ క్లోజప్స్ కి దూరంగా వుం డాల్సిన సమస్య మాత్రం అలాగే వుంది- హిందీలో ఇమ్రాన్ హాష్మీకి లాగా!
హీరోయిన్ సోనం బజ్వాకి పెద్దగా గ్లామర్ లేదు, సినిమాలో పనికూడా లేదు. ఫస్టాఫ్ లో మళ్ళీ అదే మార్పులేని పృథ్వీ పేరడీ, సెకండాఫ్ లో బ్రహ్మాండం మళ్ళీ అదే మార్పు లేని కన్ఫ్యూజ్ కామెడీ తో వాళ్ళాటేదో వాళ్ళు ఆడుకుంటారు. ఛోటా విలన్ గా పోసాని పరిస్థితీ ఇదే. ఈ ముగ్గుర్నీ చూసి ఒక్క మాస్ ప్రేక్షకుడు కూడా ఈల వేయలేదంటే ఇది ప్రమాద ఘంటికే. వెన్నెల కిషోర్, రమాప్రభ, సుధ, రఘుబాబు ఇంకా చాలామందితో కూడిన తారాగణముంది ఈ కుటుంబ కామెడీలో.
అనూప్ రూబెన్స్ సంగీతం కూడా మనసుపెట్టి చేయలేదు. దాశరథి శివేంద్ర ఛాయాగ్రహణం రొటీనే. దర్శకత్వం రొటీనే, డైలాగులు ఇంకా గిరిగీసుకున్న అవే సినిమా మూస డైలాగుల్లా వున్నాయి. అవే తిరగేసి మడతేసి వాడేశారు. వాటిని డైలాగు లనుకుంటున్నారు. సృజనాత్మక హస్యమనేది ఎక్కడా కన్పించదు డైలాగుల్లో.
చివరికేమిటి?
అసలు విషయ మేమిటంటే, ఇది కామెడీ సినిమా కాదు. ఇందులో కామెడీ లేదు. కామెడీ కోసం కష్ట పడలేదు. కొన్ని సినిమాల్ని ముందేసుకుని వాటిని పేరడీ చేస్తే అదే కామెడీ అయిపోతుందనుకుంటున్న గుట్టంతా మళ్ళీ ఇక్కడ రట్టయింది. ఇదే కామెడీ అని హీరోల్నీ నిర్మాతల్నీ నమ్మించగల్గుతున్నారు- ప్రేక్షకుల్ని నమ్మించలేక పోయినా ఫర్వాలేదు- ప్రేక్షకు లెవరిక్కావాలి? నిర్మాతలూ హీరోలూ నమ్మితే చాలు - సినిమా చేతిలో పడుతుంది, పని దొరుకుతుంది, సునాయాసంగా లక్షలు జేబులో పడిపోతాయి. చాలా సుఖమైన కుటీర పరిశ్రమ.
ఇలా పృథ్వీని టీవీ దర్శకుడిగా చూపించి, అతడి చేత బాహుబలి సీరియల్ ని డైరెక్ట్ చేయించే ఎపిసోడ్లు కొన్ని పెట్టుకుని లాగించేస్తే ఫస్టాఫ్ సగం గడిచి పోతుంది. అలాగే బ్రహ్మానందంతో ఆదిత్య- 369 ని ఆదిత్య -469 గా మార్చి టైం మెషిన్ తో పేరడీ చేస్తే సెకండాఫ్ సగం కూడా గడిచిపోతుంది. ఈ పేరడీని పేరడీ అంటే నామోషీ. అందుకని ‘స్పూఫ్’ అని అందమైన పేరు పెట్టుకున్నారు. గారడీ వాళ్ళలాగా ఇలా కొన్ని ‘స్పూఫ్’ లు చేస్తే అదే కామెడీ అనుకుని పైసలు విసిరెయ్యాలి. ప్రతీ తెలుగు సినిమాలో కామెడీని సృష్టిం చలేని అసమర్ధతని ఇలా కప్పి పుచ్చుకుంటున్నారు. ఈ ‘స్పూఫ్’ ల మీద ఆధారపడి బతికేస్తున్న వాళ్ళ మీద నడ్డి విరిగే రైట్స్ ని సదరు సినిమాల నిర్మాతలు వసూలు చేస్తే గానీ, ఈ బెడద తెలుగు కామెడీకి తప్పేలా లేదు. ఈ ‘స్పూఫ్’ ల దుకాణాలు తెలుగు కామెడీకి బెల్టు షాపుల్లాంటివి.
సినిమాని నింపాలంటే ఈ ‘స్పూఫ్’ లతో బాటు ఇంకో శ్రమ లేని పనేమిటంటే, సుశాంత్ లాంటి హీరో వుంటే అతడి కుటుంబ నేపధ్యాన్ని వాడుకుని తాతగారి నామస్మరణాలూ; నాగచైతన్య, అఖిల్ లని కూడా క్లయిమాక్స్ లో రప్పించుకుని గెస్ట్ అప్పీరియన్సులూ ఇప్పించుకోవడాలూ చేస్తే చేతికి మట్టి అంటకుండా పని జరిగి పోతుంది. ఇంకా సుశాంత్ మీద ‘దేవదాసు’ లో ‘పల్లెకు పోదాం’ పాట రీమిక్స్ చేసి కూడా నాశనం పట్టించి లాగించెయ్యొచ్చు. సొంత ఔట్ పుట్ అనేది ఒక్క ముక్క లేకుండా, ఎవరెవరివో క్రియేటివిటీలని అడ్డంగా వాడేసుకుని వెటకారాలు చేస్తే అదే కామెడీ, అదే సినిమా, అదే ఆట అయిపోయి - ఆటాడుకుందాం రమ్మని ఇలా పిలుస్తారు కట్ అండ్ పేస్ట్ దర్శకులు –రచయితలు.
-సికిందర్