Tuesday, August 15, 2023
Monday, August 14, 2023
1353 : రివ్యూ!
2019
లో
‘హౌస్ ఫుల్’ హిట్టయిన తర్వాత నుంచి నటించిన 12
సినిమాలూ అట్టర్ ఫ్లాపయ్యాక, ‘ఓఎంజీ -2’ తో ఇప్పుడు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నట్టు కన్పిస్తున్నాడు అక్షయ్
కుమార్. 2012 లో తానే నటించిన ‘ఓఎంజీ’ (ఓ మైగాడ్) సూపర్ హిట్టయ్యింది. ఇది తెలుగులో ‘గోపాల
గోపాల’ గా రీమేకైంది. 2010 లో ‘రోడ్ టు
సంగం’ అనే సినిమాతో దర్శకుడుగా మారిన అమిత్ రాయ్, 13 ఏళ్ళ తర్వాత రెండో సినిమా తీసే అదృష్టానికి నోచుకున్నాడు. అయితే ‘ఓఎంజీ -2’, ‘ఓఎంజీ’ కి సీక్వెల్ కాదు. రెండిటి కథలు, పాత్రలు వేర్వేరు. అక్షయ్ కుమార్ తప్ప ‘ఓఎంజీ’ లో నటించిన వాళ్ళెవరూ ‘ఓఎంజీ -2’ లో లేరు. ఇంతకీ అమిత్ రాయ్ ఏం
తీశాడు? ఇది ఎందుకంత సెన్సార్ తో వివాదంలో పడింది? అక్షయ్ కుమార్ కిది హిట్టేనా? ఇవి తెలుసుకుందాం.
కాంతి లక్ష్యం ఏమిటి? విద్యా వ్యవస్థలో ఏం మార్పు కోరుకుంటున్నాడు? ఆ మార్పు సాధించాడా? ఎలా సాధించాడు? ఇదీ మిగతా కథ.
—సికిందర్
Saturday, August 12, 2023
1352 : పరిచయం
నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో ‘జైలర్’ అభిమానుల్ని ఆహ్లాదపరిచే, వినోదాత్మక, భావోద్వేగ, శైలీకృత యాక్షన్ సన్నివేశాల్ని దట్టించిన పాపులర్ కమర్షియల్ మూవీ. దీని ప్రధాన విజయమేమిటంటే విలన్ గా వినాయకన్‌ని ఎంపిక చేయడం. మలయాళ ప్రేక్షకులకి వినాయకన్ గురించి పరిచయం అవసరం లేదు. ఇతర భాషల ప్రేక్షకులకి కొత్త టాలెంట్ ని పరిచయం చేయాలంటే ‘జైలర్’ బాగా తోడ్పడుతుంది. అయితే వినాయకన్ ని తీసుకోవాలని ముందుగా అనుకోలేదు. ముందుగా అనుకున్న స్టార్ వేరు. ‘జైలర్’ ఆడియో లాంచ్‌లో స్వయంగా రజనీకాంత్ చెప్పారు.
పేరు ప్రస్తావించకుండా రజనీ చెప్పిందాన్ని బట్టి చూస్తే, ఆయన చెప్తున్నది మోహన్ బాబు గురించేనని అన్పించక మానదు. మోహన్ బాబు విలన్ గానే నట జీవితం ప్రారంభించి తర్వాత విలన్ అయ్యారు. మోహన్ బాబు, రజనీ చాలా సంవత్సరాలుగా మంచి మిత్రులు కూడా. మోహన్ బాబు నిర్మించిన సూపర్ హిట్ ‘పెదరాయుడు’ లో రజనీ కీలక పాత్ర పోషించారు కూడా. ఈ నేపథ్యంలో ‘జైలర్’ ఆడియో లాంచ్ సందర్భంగా రజనీ చెబుతున్నది మోహన్ బాబు గురించేనని ఇట్టే తెలిసిపోతుంది.
‘జైలర్’ లో విలన్ పాత్రని ఎవరైనా స్టార్ లేదా కొత్త నటుడు పోషిస్తే బావుంటుందనుకున్నానని రజనీకాంత్ చెప్పారు. విలన్ పాత్రలకి పేరుబడ్డ వారెవరిని తీసుకున్నా పెద్దగా ప్రభావం వుండదని అన్నారు. అప్పుడు దర్శకుడు నెల్సన్ ఒక పేరు సూచించాడని, ఆయనొక పెద్ద సౌత్ స్టార్ అనీ, తనకి మంచి మిత్రుడు కూడానని చెప్పారు. ఆయన విలన్ కి సరిపోతాడని భావించి తనే ఫోన్ చేసి మాట్లాడినట్టు చెప్పారు. తర్వాత నెల్సన్ వెళ్ళి కథ విన్పించి వచ్చాక తను పునరాలోచనలో పడ్డాననీ, ఆ స్టార్ కున్నఇమేజిని బట్టి, పాత్రతో వ్యవహరించడానికి తగినంత స్వేచ్ఛ వుండదని, ప్రాక్టికల్ గా కొన్ని పరిమితులు వుంటాయనీ, పైగా తను విలన్ ని కొట్టే సన్నివేశాలు కూడా వున్నాయనీ, ఆ స్టార్ తో ఆ పని చేయలేననీ భావించి, ఆ స్టార్ కి ఫోన్ చేసి సారీ చెప్పినట్టు వివరించారు.
అయితే రజనీ మాటల్ని ఎక్కువమంది తమిళ ప్రేక్షకులు వేరేగా తీసుకున్నారు. ఆయన చెప్పింది కమల్ హాసన్ గురించేనని భావించారు. చెన్నై ఆడియో లాంచ్ లో రజనీ 45 నిమిషాలు ప్రసంగించారు. ఈ స్పీచ్‌తో నెటిజన్లు రజనీ ప్రస్తావించిన స్టార్ మరెవరో కాదని, ఐదు దశాబ్దాల తన ప్రత్యర్థి కమల్ హాసనే అనీ తేల్చేశారు. ఇప్పుడు దాదాపు మూడున్నర దశాబ్దాల తర్వాత వీరిద్దరినీ కలపి తెరపై చూసే అవకాశం చేజారిపోయిందని, వీరిద్దరి అభిమానులు భొరున విలపించారు. అయితే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీ, కమల్ మళ్ళీ తెరపై 'తలైవర్ 171'లో ఒక్కటవుతారని ప్రచారం ఒకటి జరుగుతోంది.
మోహన్ బాబు కావచ్చు, కమల్ హాసన్ కావచ్చు- స్టార్ ని విలన్ గా మార్చే ప్రయత్నం అలా కుదరక పోవడంతో రజనీ, నెల్సన్ లు కొత్త ముఖం కోసం అన్వేషించి వినాయకన్ ని పట్టుకున్నారు. స్టార్ ని తెచ్చి విలన్ చేస్తే ఏమయ్యేదో గానీ, కొత్త ముఖాన్ని తెచ్చుకుని స్టార్ ని చేశారు. ఇంత పచ్చిగా, మురికివాడల క్యారక్టర్ అన్పించే వినాయకన్ స్టార్ విలన్ అయిపోయాడు! స్లమ్ డాగ్ విలియనీర్ అన్నట్టు.
ఎవరీ వినాయకన్?
ఇందుకేనేమో ‘జైలర్’ లో విలన్ గా బాగా హై వస్తే అనుచరులతో కలిసి పిచ్చ డాన్స్ చేస్తాడు. ‘తాళ్’ లో ఐశ్వర్యారాయ్ పాటకి కూడా డాన్స్ చేసి పడేశాడు. చంపడం అంటే అతడికెంత ఆనందమంటే, అనుచరుణ్ణి కింద పడదోసి, ఛాతీ మీద బాసింపట్టు వేసుకుని కూర్చుని, సుత్తితో తనివిదీరా మొహమ్మీద కొట్టి చంపుతాడు. ఇలాటిదే సీను రామ్ గోపాల్ వర్మ హిందీలో తీసిన వీరప్పన్ కథ ‘జంగిల్’ (2000) లో - మనుషుల్ని చంపడానికి ఉవ్వీళ్ళూరుతూ వుండే పొట్టి రాజ్ పాల్ యాదవ్ తో వుంటుంది.
విగ్రహాల స్మగ్లర్ వర్మగా విలన్ పాత్రలో వినాయకన్ నటన రియలిస్టిక్ నటన. పాత్ర లోతుపాతుల్లోకి వెళ్ళిపోయి, పాత్రనంతా కళ్ళల్లో నింపుకుని- అక్కడ్నించీ ఒడలు జలదరించేలా పాత్రని ఆకాశాన్నంటిస్తాడు. రజనీ కాంత్ మాత్రం కూల్ గా వుంటాడు. రజనీని డామినేట్ చేస్తూ ఆయన ముందు వినాయకన్ ది ఓవరాక్షన్ కాదు- ఆ పాత్రే అంత. దీన్ని రియలిస్టిక్- మెథడ్ యాక్టింగ్ తో ఓవరాక్షన్ అన్పించకుండా చేశాడు. మృగానికి ఓవరాక్షనేంటి? మృగం తీరే అంత. వినాయకన్ మృగంగా మారితేనే ఇది సాధ్యం.
ఇప్పుడు వినాయకన్ పానిండియా కాదు, గ్లోబల్ పండితుల దృష్టిలో పడినట్టు తాజా వార్తలొస్తున్నాయి. ఎప్పుడైనా దేశ సంస్కృతిని ప్రతిబింబించే దేశవాళీ పాత్రలే, దేశీయ నటనలే గ్లోబల్ సమాజాన్ని ఉలిక్కి పడేలా చేస్తాయి.
Friday, August 11, 2023
1351 : రివ్యూ!
అసలు శంకర్ ఎవరు? ఎందుకు మాఫియాల్ని హతమారుస్తున్నాడు? అతడి గతం ఏమిటి? చేస్తున్న హత్యల్ని ఎలా సమర్ధించుకుని ఆగిపోయిన సోదరి పెళ్ళి చేశాడు? ఇదీ మిగతా కథ.
2015 లో తమిళంలో అజిత్ నటించిన ‘వేదాలం’ రీమేక్ కథ ఇది. తెలుగులో ‘ఆవేశం’ పేరుతో డబ్ అయి విడుదలైంది కూడా. యూట్యూబ్ లో ఫ్రీగా వుంది కూడా. అయినా తెలిసిన పాత కథనే రీమేక్ చేశారు. కోల్ కత బ్యాక్ డ్రాప్ లో ఇలాటిదే అన్నాచెల్లెలు కథతో 2021 లో రజనీకాంత్ నటించిన ‘అన్నాత్తే’ (తెలుగులో ‘పెద్దన్న’) వచ్చి ఫ్లాపయ్యింది. ఇందులో కూడా చెల్లెలు కీర్తీ సురేషే. ఇంకోటేమిటంటే, ‘భోళా శంకర్’ లో తమన్నా లాగా, ఇందులో కూడా కోల్ కతాలో నయనతార లాయరే. ఇంకో అద్భుతమేమిటంటే, ఒకేలా వున్న ‘వేదాలం’, ‘అన్నాత్తే’ రెండు సినిమాలకీ దర్శకుడు శివయే!
అంటే తెలుగు ప్రేక్షకులు ఒకేలా వున్న ‘ఆవేశం’, ‘పెద్దన్న’ రెండూ చూశాక, మళ్ళీ అలాటిదే ‘భోళా శంకర్’ కూడా చూడాలన్న మాట. ఇవి మామూలు బరువు బాధ్యతలు కావు. ప్రేక్షకులు నెరవేర్చుకుని విధేయత నిరూపించుకోవాలి. తీసిందే తీస్తూంటే చూసిందే చూస్తూ పోవాలి. ఇదేమైనా మాయాబజారా ఎన్ని సార్లు తీసినా చూడాడానికి.
మెగాస్టార్ ని ఎలివేట్ చేసే ఒక్క సిట్యుయేషన్ గానీ, హీరోయిజాన్ని నిలబెట్టే ఒక్క ఎమోషనల్ సీనుగానీ లేకుండా ఫ్లాట్ గా రన్ చేసేశారు. ఏ సన్నివేశం కూడా అజిత్ తో తమిళంలో లాగా మనసు పెట్టి తీయలేదు. ఇంటర్వెల్ తర్వాత ఒక పదినిమిషాలు మాత్రమే బలం. మిగతా ఫస్టాఫ్, సెకండాఫ్ చిత్రీకరణ డొల్లగా వుంది. సెకండాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ బావుందనుకునేంత లోనే బోరుగా మారిపోతుంది. భోళా శంకర్ గా చిరంజీవి అసలు క్యారక్టర్ వెల్లడయ్యే ఫ్లాష్ బ్యాక్ కూడా విఫల మైంది.
కేవలం చిరంజీవి యంగ్, స్టయిలిష్ లుక్, డాన్సులు, ఫైట్లు మాత్రమే అప్డేట్ అయి వున్నాయి. సినిమాలో విషయం, మేకింగ్ మాత్రం కాలానికి దూరంగా ఔట్ డేటెడ్ గా వున్నాయి.
తమన్నా రొటీన్ ఫార్ములా హీరోయిన్. తమన్నాతో బాటు కీర్తీ సురేష్ పాత్ర కూడా అంతంత మాత్రమే. మొన్నే రజనీకాంత్ తో చెల్లెలిగా నటించి, మళ్ళీ ఇప్పుడు చిరంజీవితో చెల్లెలిగా నటించడం ఎంత ఎంబరాసింగ్ గా వుందో ఆమె మొహంలో చూస్తే తెలిసిపోతుంది. ఇక బోలెడు మంది కామెడియన్లు, విలన్లు రొడ్డ కొట్టుడుగా చేసుకుపోయారు. సంగీతం, కెమెరా వర్క్, ఇతర టెక్నికల్ విభాగాలు ఎంత బాగా పని చేసినా దర్శకుడు కూడా పని చేయాలిగా? ఇది పూర్తిగా మెహర్ రమేష్ చెడ గొట్టుకున్న మెగా అవకాశం, మళ్ళీ రాదు.
మెగాస్టార్ ఈ కాలపు ప్రేక్షకుల కోసం ఇంకా తన 1970-80 లనాటి పురాతన కాలం టైపు సినిమాలు నటించకుండా, ఆ కాలంలో జరిగే పీరియడ్ కథలతో పీరియడ్ సినిమాలు నటిస్తే పాత సినిమాల వైభవమైనా చూసినట్టుంటుంది నేటి తరం ప్రేక్షకులకి. 1969 నేపథ్యంలో తీసిన ‘ఒన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్’ లాగా?
-సికిందర్
Thursday, August 10, 2023
1350 : రివ్యూ!
ఇప్పుడు స్మగ్లర్ వర్మ పెట్టిన కండిషన్ ఏమిటి? దాని ప్రకారం ముత్తు ఓ ఆలయంలో విలువైన కిరీటాన్ని తస్కరించి వర్మ కిచ్చాడా? ఇందులో నార్త్ గ్యాంగ్ స్టర్ (జాకీష్రాఫ్) తో బాటు, మాథ్యూ (మోహన్ లాల్), నరసింహా (శివరాజ్ కుమార్), బ్లాస్ట్ మోహన్ (సునీల్) లు చేసిన సహాయం ఏమిటి? కామ్నా (తమన్నా) ఎవరు? ఆఖరికి ముత్తువేల్, వర్మ డిమాండ్ ని నెరవేర్చాడా లేదా? తీహార్ జైల్లో మాజీ జైలర్ గా పనిచేసిన అతడి గతమేమిటి? చివరికి కొడుకు గురించి తెలుసుకున్న ఒక నిజంతో ఎలాటి భావోద్వేగాలకి లోనయ్యాడు? ఇదీ మిగతా కథ.
ఉపరితలంలో కొడుకు కోసం ముఠా మీద తండ్రి పగ లాంటి రొటీన్ కథగానే వుంటుంది. అయితే ఈ రొటీన్ గా అన్పించే కథ పొరలు పొరలుగా విడిపోతూ కొత్త కోణాలతో, మలుపులతో థ్రిల్ చేస్తుంది. ఇలా ఫస్టావ్ లో ఒక ట్విస్టు, సెకండాఫ్ లో మరో మూడు ట్విస్టులు మొత్తం రజనీ- నెల్సన్ ల బాక్సాఫేసు గేమ్ ని సక్సెస్ ఫుల్ గా మార్చేశాయి.
ఫస్టాఫ్ రజనీకాంత్ రిటైరైన వ్యక్తిగా కుటుంబ జీవితం గడపడంతో, మనవడితో కామెడీతో ప్రారంభమవుతుంది. ఒక చిన్నఇల్లు, ఇంట్లో సేంద్రీయంగా కూరగాయలు పండించుకోవడం, యూ ట్యూబర్ గా 96 మంది సబ్ స్రైబర్లున్న మనవడికి శిక్షణ నివ్వడం, వీధిలో కనిపిస్తే చాలు రజనీని దాదాపు గుద్దేసేంత పనిచేసే క్యాబ్ డ్రైవర్ తో చిరు తగాదాలు - ఇదే జీవితంగా సాగుతున్నప్పుడు, ఏసీపీ అధికారియైన కొడుకు అదృశ్యం జీవితాన్ని మలుపుతిప్పుతుంది. భార్యతో, కోడలితో ఈ భాధలో వుండగా, కొడుకు హత్యావార్త కూడా తెలుస్తుంది. దీంతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని దొరికిన ముఠా వాళ్ళని చంపడం, ముఠా కుటుంబం మీద ఎదురు దాడికి దిగడం వంటి ఘటనలతో ఫస్టాఫ్ ముగుస్తుంది. ఇంటర్వెల్లో బ్యాంగులు గానీ, ట్విస్టులు గానీ ఏమీ వుండక -ఒక కుటుంబ సన్నివేశంతో ముగుస్తుంది. ఇది రొటీన్ కి భిన్నం.
సెకండాఫ్ రజనీ వేట కొనసాగుతుంది. ఈ వేటలో ఒకచోట ఒకప్పటి జైలర్ గా రజనీ ఫ్లాష్ బ్యాక్ ఓపెనవుతుంది. రజనీ మాజీ జైలర్ అని ఇప్పుడే తెలుస్తుంది. ఈ ఫ్లాష్ బ్యాక్ సాగదీయకుండా ఒకే జైలు సన్నివేశంతో ముగిసిపోవడం కూడా రొటీన్ కి భిన్నమే. ఆ తర్వాత కిరీటం కోసం స్మగ్లర్ పెట్టే డిమాండ్ తో సెకండాఫ్ కథ మలుపు తిరిగి వరుసగా బాలీవుడ్ స్టార్ జాకీ ష్రాఫ్, మలయాళ స్టార్ మోహన్ లాల్. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్. తెలుగు కమెడియన్ సునీల్ తెరపై కొస్తూంటారు. ఒక పాటతో తమన్నా కూడా వస్తుంది. కిరీటాన్ని హైజాక్ చేసే కాన్సెప్ట్ తో సాగుతూ వుండే సెకండాఫ్ కొడుకుతో క్లయిమాక్స్ ట్విస్టుతో ముగింపుకి చేరుకుంటుంది.
కథ నీటుగా వుండడం, ఎలాటి డాన్సులు, కామెడీలు లేకుండా రజనీకాంత్ పాత్ర ఫ్యామిలీమాన్ గా హూందాగా కొనసాగడం - అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ ఆద్యంతం కూర్చోబెట్టేలా చేస్తాయి. సూపర్ స్టార్ సినిమా పేరుతో లిబర్టీ తీసుకుని వూర మాస్ కమర్షియల్ చేయకుండా, కాస్త అర్ధవంతమైన ఎంటర్ టైనర్ గానే తీశాడు దర్శకుడు. కాకపోతే నిడివి తగ్గాలి.
అయితే రమ్య కృష్ణ, మిర్నా మీనన్ కుటుంబ పాత్రల్ని నిర్లక్ష్యం చేశాడు. కథకి అడ్డు వస్తున్నారనుకుని పక్కకు పెట్టేసినట్టున్నాడు. క్యాబ్ డ్రైవర్ గా రజనీతో యోగిబాబు కామెడీ మాత్రం నవ్వకుండా నవ్వించేదే. ఈ మధ్య సినిమాల్లో టూరిస్టు ఆర్టిస్టులా వచ్చిపోతున్న యోగిబాబుకి ఈసారి విషయమున్న పాత్ర దక్కింది. రజనీ కొడుకు పాత్రలో వసంత్ రవి పాత్ర తీరుతెన్నులకి సరిపోయాడు. నార్త్ గ్యాంగ్ స్టర్ గా జాకీష్రాఫ్, ముంబాయి మాఫియాగా మోహన్ లాల్, కర్ణాటక క్రిమినల్ గా శివరాజ్ కుమార్, తెలుగు సినిమా పిచ్చోడుగా సునీల్ తమ సంక్షిప్త పాత్రలతో సెకండాఫ్ ని నిలబెట్టారు. ఇక విలన్ వర్మగా మలయాళ నటుడు వినాయకన్ విలనీ అతి క్రూరంగా, రాక్షసంగా వుంది. ఈ పాత్రతో రక్త పాతం కూడా ఎక్కువే. చంపే దృశ్యాలు షాకింగ్ గా వున్నాయి. రజనీ కాంత్ సినిమా అంటే ఫ్యామిలీలు కూడా చూసే సినిమా. హింస ఇలా వుంటే జడుసుకు ఛస్తారు.
రజనీ కాంత్ తన ‘ఒన్ మాన్ షో’ తో ప్రేక్షకుల మెదళ్ళ లోకి చొచ్చుకుపోయే ఫ్యామిలీ- యాక్షన్ హీరోగా మళ్ళీ తన అగ్రస్థానాన్ని చాటుకున్నాడు. ఫ్లాష్ బ్యాక్ లో యంగ్ జైలర్ పాత్ర, దాంతో చేసిన కామెడీ పెద్దగా నిలబడవు. ప్రధాన కథలో ఫ్యామిలీ- యాక్షన్ హీరోగానే గుర్తుంటాడు. తండ్రీ కొడుకుల సంబంధాల కథని బయట పెట్టుకోలేని భావోద్వేగాలతో తన అనుభవంతో బాగా పండించాడు.
సాంకేతికంగా రజనీ స్థాయి విలువలతోనే వుంది. అయితే సాంకేతికాలే తప్ప రచన బావుండని సినిమాలే ఎక్కువ వస్తూంటాయి. దర్శకుడు నెల్సన్ ఈ రెండూ సమం చేశాడు. నిగ్రహం తప్పకుండా కథా కథనాల్ని క్వాలిటీ రైటింగుతో కొనసాగించడమే గాక, నటింప జేసుకోవడం, సంగీతం, ఛాయాగ్రహణం, సెట్స్, లొకేషన్స్ వంటి సర్వ హంగుల్నీ ద్విగుణీకృతం చేశాడు. రజనీ స్టార్ డమ్ ని కాపాడుతూ.
Saturday, July 22, 2023
1349 : రివ్యూ!
ప్రపంచమంతా ఎంతో
ఆసక్తితో ఎదురు చూస్తున్న క్రిస్టఫర్ నోలన్ ‘ఒపెన్ హైమర్’ బయోపిక్ మూవీ మన దేశంలో ఇంగ్లీషు, హిందీ భాషల్లో
విడుదలైంది. స్టీవెన్ స్పీల్ బెర్గ్ తర్వాత టాప్ పొజిషన్లో వున్న నోలన్ సినిమా
అంటే అంతర్జాతీయంగా ప్రేక్షకులు విరగబడి చూస్తారు. తీసింది 12 సినిమాలే అయినా
వాటిలో ఒక్క ‘టెనెట్’ (2020) తప్ప మిగిలినవన్నీ
సూపర్ హిట్లే. సైన్స్ ఫిక్షన్లు ఎక్కువ తీసే నోలన్ తాజాగా బయోపిక్ ప్రయత్నించాడు.
అణుబాంబు సృష్టికర్త జూలియస్ రాబర్ట్ ఒపెన్ హైమర్ జీవి చరిత్రని ఎపిక్ బయోగ్రఫికల్
థ్రిల్లర్ అంటూ అందించాడు.