రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Thursday, March 15, 2018

620 : తెలుగు సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్

2014 డిసెంబర్ 17 నుంచి ఈ బ్లాగులో ప్రారంభమైన ‘తెలుగు సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్’ వ్యాసాలు మిస్ అయిన వాళ్ళకోసం వరుసగా తిరిగి పోస్ట్ చేస్తున్నాం....

ఎందుకంటే..
* మన బామ్మలు కూడా మనకి కథ చెప్పే విధం  ఒక స్ట్రక్చర్ లోనే వుంటుండేది గనుక  
* శతాబ్దాలుగా స్ట్రక్చర్ అనేది ప్రపంచంలో దేశంలోనై నా ఒకే పోలికతో  వుంటుంది గనుక   
 * ఆదిమ కాలం నుంచీ కథలు చెప్పుకోవడం స్ట్రక్చర్ ప్రకారమే జరిగింది గనుక
 * 
కథా నాయకుడు కథలో ఎప్పుడు ప్రవేశించాలి, కథ ఎప్పుడు మలుపు తిరగాలి, ఎక్కడ ముగింపు  నివ్వాలి అన్నవి, మౌఖికంగా కథలు చెప్పుకునే లిపిలేని కాలం నుంచీ సెట్ అయి వుంది గను
 * శాస్త్రజ్ఞుల ప్రకారం మనిషి మెదడు  కథ చెప్పే తీరుకి, దాన్ని రిసీవ్ చేసుకునే పద్దతికీ మార్పు లేకుండా అనువంశికంగా ట్యూన్ అయి వుంది గనుక!
స్ట్రక్చర్ అంటే..

* అనువంశికంగా సబ్ కాన్షస్ మైండ్ లో రూపుదిద్దుకున్న శాశ్వత నిర్మాణం 
*
 క్రియేటివిటీ అంటే..
*  నిర్మాణం మీద కాన్షస్ మైండ్ కి నచ్చేట్టు సొంతంగా కథనానికి చెక్కుకునే శిల్పం 
*
 స్ట్రక్చర్  సార్వజనీనం, క్రియేటివిటీ వ్యక్తిగత అభిరుచి
* కథా నిర్మాణం (స్ట్రక్చర్)  ఎక్కడైనా ఒకేలా వుంటుంది, కథ చెప్పే తీరు ( క్రియేటివిటీ) కథకుడు కథకుడికీ మారుతుంది
* అందుకే స్ట్రక్చర్ కి రూల్స్ ఏర్పడ్డాయి, క్రియేటివిటీకి సాధ్యం కాదు
*  తేడా తెలీక  స్క్రీన్ ప్లే కి రూల్స్ ఏమిటోయ్ అని అడ్డం తిరుగుతుంటారు
* వాళ్ళ ఉద్దేశంలో క్రియేటివిటీ కి రూల్స్ ఏమిటని!
* అవును- నిజంగానే క్రియేటివిటీకి రూల్స్ లేవు 
*
 అందుకే నా కథ నా ఇష్టం అన్నట్టుగా రాసుకుంటారు 
*
 ప్రకృతి ప్రకారం ప్రేక్షకుల మైండ్ రిసీవ్ చేసుకునేది స్ట్రక్చర్ పరంగానే తప్ప, క్రియేటివిటీ పరంగా కాదని తెలుసుకోక-
* స్ట్రక్చర్ కీ, క్రియేటివిటీ కీ తేడా తెలీక...
* స్ట్రక్చర్ ని విస్మరించి క్రియేటివ్ గానే స్క్రిప్టు రాసుకోవడం వల్ల- 
*
 పునాదుల్లేని భవనానికి నగిషీలు చెక్కుకున్నట్టు వుంటోంది
* స్ట్రక్చర్ లేక ఎంత క్రియేటివిటీని  రంగరించినా..
* సినిమా కథల్ని ప్రేక్షకుల మెదళ్ళు రిసీవ్ చేసుకునే పద్ధతిలో రిసీవ్ చేసుకో లేకపోతున్నాయి.
* అప్పుడవి అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి
ఇందుకే స్ట్రక్చర్ అవసరం!

* స్ట్రక్చర్ అనే వాస్తవాన్ని గుర్తించడం అవసరం
* సినిమా ఆఫీసుకి వాస్తు ఎలాగో, కథకి స్ట్రక్చర్ అలా 
*
 ఆఫీసుకి వాస్తు చూసుకుని, ఆఫీసు పెట్టడానికి మూలకారణమైన కథకి వాస్తు (స్ట్రక్చర్) ఉందా లేదా ఆలోచించక పోవడం అవివేకం
ఇంతకీ స్ట్రక్చర్ ఎలా వుంటుంది
*
ఇది నేర్చుకుందాం 
*
 స్ట్రక్చర్  అనే త్రీ యాక్ట్స్ విభాగాల్లో అసలేమేం జరుగుతాయో వివరంగా తెలుసుకుందాం 
*
 ఇందుకు సింపుల్ గా శివఅనే సినిమాని తీసుకుని చెప్పుకుందాం 
- రేపటి నుంచి-
పిడిఎఫ్ కాపీలు డౌన్ లోడ్ చేసుకోవచ్చు...
*



















Wednesday, March 14, 2018

619 :సందేహాలు - సమాధానలు






 Q:    స్పెషల్ ఆర్టికల్ 617 లో దర్శకుడు విజువలైజ్ చేస్తే రచయితలు మంచి అవుట్ పుట్ ఇస్తారని మీరు రాశారు. దర్శకుడు రాజమౌళి గారి విజయ రహస్యం సినిమా తీస్తున్నంత కాలం రచయితల్ని ఇన్వాల్వ్ చేసి వాళ్లకి విజువల్ నేరేషన్ ఇవ్వడమే నంటారా?
రవికుమార్, హైదరాబాద్
A:     రాజమౌళి గారి విజయ రహస్యం రాజమౌళి గారిదే. రచయితల్ని ఇన్వాల్వ్ చేసి విజువలైజ్ చేస్తున్నందుకు ఆయన విజయాలు సాధిస్తున్నారనుకోలేం.  రచయితల వల్ల ఆయన విజయాలు సాధిస్తున్నారనడం హస్యాస్పదమవుతుంది. నిజానికి ఆయన పనితీరు ఆయన దగ్గర పనిచేసే రచయితలకి ప్లస్ అవ్వాలి. కానీ ఆయన దగ్గర పని చేసివచ్చి సినిమాలు తీస్తున్న ఆయన అసిస్టెంట్స్ పరాజయాల పాలవుతున్నారు. వాళ్ళ రచనా సామర్ధ్యం చాలా ఘోరంగా, విస్తుపోయేలా వుంటోంది. దీనికేమనాలో ప్రత్యేకంగా ఆలోచించాలి. బాహుబలి వర్కింగ్ స్టిల్ ఒకటి చూశాం. ఇద్దరు రచయితలు ఎదురుగా కూర్చుని వుంటే రాజమౌళి సీను రాస్తున్నారు, లేదా రచయితలు రాసింది దిద్దుతున్నారు, లేదా ఇంకేదో చేస్తున్నారు. ఏం చేస్తున్నా అది రచయితలకి పాఠమే. కానీ అంత మెగా మూవీ చూసి రచయితల  గురించి ఎవరూ మాట్లాడుకోలేదు. వాళ్ళెవరో కూడా సరిగ్గా తెలీదు. సినిమా దర్శకుడి మీడియా కాబట్టి. రచయితలకి ఈ స్ట్రగుల్ ఎప్పుడూ వుండేదే. అందుకే దర్శకులవుతున్నారు. రెంటికీ చెడ్డ రేవడి అవుతున్నారు. ముందు రాయగల్గితేగా తీయగల్గేది.

 Q:    ఎంత బాగా స్క్రిప్టు రాసుకున్నా ఎందుకో పూర్తి విశ్వాసం, సంతృప్తి కలగదు. ఎవరికైనా చూపిద్దామంటే మన ఇగో అడ్డొస్తుంది. రాసుకున్నది బంపర్ అని నమ్మడమెలా?
విఘ్నేష్, దర్శకుడు ( అసలు పేరు గోప్యంగా వుంచమన్నారు)
A:     ఒకటి మార్కెట్ యాస్పెక్ట్, రెండు స్ట్రక్చర్ - ఈ రెండూ స్క్రిప్టులో వుంటే రాసింది బంపర్ అని కళ్ళుమూసుకుని నమ్మ వచ్చు. వచ్చిన సమస్యేమిటంటే ఈ రెండూ తెలియకుండానే ఎంతో మంది స్క్రిప్టులు రాసేస్తున్నారు. కొందరైతే హీరోలకో, నిర్మాతలకో విన్పించేసి ఓకే కూడా చేయించుకుంటున్నారు. కానీ ఎందుకనో మీలాగే డౌట్ వచ్చి సంప్రదింపులు జరుపుతున్నారు. చూస్తే ఆ స్క్రిప్టుల్లో  ఏవైతే ఈ 21 వ శతాబ్దపు తెలుగు సినిమాల్లో కొత్తగా వచ్చి అట్టర్ ఫ్లాప్ చేస్తున్నాయో - ఆ నాల్గు దుష్టశక్తులు జడలు విప్పి నాట్యం చేస్తూంటాయి.1. మిడిల్ మటాష్, 2. పాసివ్ పాత్రలు, 3. ఎండ్ సస్పెన్స్, 4. సెకండాఫ్ సిండ్రోం. ఇవన్నీ స్ట్రక్చర్ పరమైన దుష్టశక్తులే. కాబట్టి స్ట్రక్చర్ అంటే ఏమిటో తెలీదు.  ఇక మార్కెట్ యాస్పెక్ట్ ముసలి వాళ్ళ కోసమన్నట్టు వుంటుంది. కుర్ర దర్శకుడు కూడా ముసలి ఆలోచనలే చేస్తున్నాడు. 

          ఇంతా చేసి ఇలా సంప్రదించే వాళ్ళు  ఈ వ్యాసకర్త రాసే రివ్యూలో, ఆర్టికల్సో  చదివి జ్ఞానం పెంచుకున్నామని చెప్పే వాళ్ళే. పై నాల్గు దుష్ట శక్తుల గురించి వీరోచితంగా చర్చించి వాటిని ఖండించే వాళ్ళే. తీరా వాళ్ళే స్క్రిప్టులు రాసేసరికి అవే దుష్టశక్తుల సమేతంగా సింగారించి,  ఈ వ్యాసకర్తకి చూపించి దిమ్మదిరిగిపోయేలా చేసే వాళ్ళే. ఇలాటివి చాలా జరిగాయి, ఇంకా జరుగుతున్నాయి. ముందే చూపించుకుంటే ముందే సరిదిద్దుకోవచ్చు. కానీ కొందరేం చేస్తూంటారంటే, రాసుకుని హీరోలకో నిర్మాతలకో విన్పించి ఓకే చేయించుకుని,  తీరా అప్పుడు వచ్చి చూపిస్తూంటారు. అప్పుడు ఈ దుష్ట శక్తులు బయటపడి అల్లాడిపోతారు. ఇప్పుడెలా సరిదిద్దాలి?  లోపాలు సరిదిద్దితే, ఇప్పుడు  మారిపోయిన కథకి హీరోనో, నిర్మాతనో ఏమంటారనో, ప్రాజెక్టు వుంటుందో పోతుందోననో భయం. లోపాలు దిద్దుకోకుండా ముందు చెప్పిన కథతోనే ప్రొసీడవడానికీ మనసొప్పదు. ఇదొక మోరల్ డైలెమా.


          కాబట్టి ఒకటే చేయాలి, రాసుకున్న స్క్రిప్టు రాసుకున్నట్టే ఓకే అయిపోయిందా, ఇక అంతా బాగానే వున్నట్టని నమ్మి, ఆ స్క్రిప్టుని ఎవరికీ చూపించకూడదు. ముందు కెళ్ళిపోవాలి. స్క్రిప్టులో దుష్టశక్తులు మృత్యు నాదాలు చేస్తున్నాయని తెలుసుకుని మోరల్ డైలమాలో పడేకంటే, తెలుసుకోకుండా కొబ్బరికాయ  కొట్టడమే సుఖం.  ఒకచోట ఇలాగే ఓకే చేయించుకున్నాక, దుష్ట శక్తులు బయటపడి కిమ్మన కుండా వుండే పాలసీ దర్శకుడు పెట్టుకుంటే, తీరా ఆ హీరో డేట్లు కనుచూపు మేరలేక, నిర్మాత వెళ్ళిపోయి, ప్రాజెక్టు క్యాన్సిలై,  ఆరేడు కోట్ల రూపాయల నష్టం తప్పింది. హీరోకి ఒక ఫ్లాపు, దర్శకుడుకి కెరీర్ ఖరాబు కూడా తప్పాయి. ప్రస్తుతం ఇలాటిదే ఇంకో కేసుని ఎలా హేండిల్ చేసి ప్రాజెక్టుని గట్టెక్కించాలా అని ఆలోచిస్తున్నాడు ఈ వ్యాసకర్త. దుష్ట శక్తుల గురించి చెప్తే నిర్మాతకి, హీరోకి అర్ధంకావు. కాబట్టి చెప్పకుండా, కథ మారినట్టు అన్పించకుండా, దర్శకుడికి వచ్చిన అవకాశం పోకుండా, మధ్యేమార్గంగా స్ట్రక్చర్ తో చేయరాని ప్రయోగాలు చేయాలమాట.

           అందుకని ఒకసారి సొంతంగా రాసుకున్న స్క్రిప్టు ఓకే అయ్యాక, ఇక క్రాస్ చెకింగ్ ఆలోచనలు పెట్టుకోకూడదు. రాసుకున్నది బంపర్ అని నమ్మేసి కొబ్బరికాయ కొట్టడమే. అలాకాక, స్క్రిప్టుని మూవ్ చేసే ముందు క్రాస్ చెకింగ్ చేసుకుంటే ఏ గొడవా వుండదు. అయితే దేన్ని  బేస్ చేసుకుని స్క్రిప్టులు రాస్తూంటారో అర్ధంగాదు. అంతా రాసేశాక ఫలనా ఫలానా  దుష్టశక్తులు తిష్ట వేసుకుని వున్నాయని తెలిశాక కూడా, రాసిన ట్రాష్ మీద మమకారం చంపుకోరు.  మార్చడానికి ఒప్పుకోరు. స్క్రిప్టు రాయడం ఎలా ప్రారంభించాలో ‘తెలుగు సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్’ అంటూ ఈ బ్లాగులోనే  రాసిన వ్యాసాల్లో మొట్ట మొదటి అధ్యాయం ఐడియా గురించే వుంది.  ముందు ఐడియాని నిర్మించకుండా స్క్రీన్ ప్లేని నిర్మించలేరని చెప్పాం. కానీ రాస్తున్న స్క్రిప్టులు చూస్తే ఐడియా దగ్గర్నుంచి ప్రారంభించడం లేదని తెలిసి పోతూంటుంది. మళ్ళీ ఈ వ్యాసాల గురించి చాలా చర్చలు చేస్తారు. ఆచరణలో ఏమీ వుండదు. ముందుగా ఐడియాని నిర్మిస్తే, స్క్రీన్ ప్లే లో ఎక్కడా ఏ దుష్టశక్తీ జొరబడదు. చాలా సింపుల్, అంతే. స్క్రిప్టులు  రాయడానికి ఎందుకు తలలు బద్దలు కొట్టుకుంటారో అర్ధంగాదు. 

          ఒకసారి బ్లాగులో మార్చి మూడున జాన్ ట్రుబీ ఇంటర్వ్యూ చూడండి.  ఐడియా ప్రాముఖ్యం గురించి ఆయనెంత చెప్పాడో తెలుస్తుంది. సినిమా మేకింగ్ లో  ప్రతీదీ హాలీవుడ్ నుంచి తెచ్చుకునేదే, కానీ  హాలీవుడ్ నుంచి స్క్రీన్ ప్లే శాస్త్రం మాత్రం తెచ్చుకోకూడదా? ఎందుకని? ఇక్కడ మొనగాళ్ళు వున్నారనా?

Q:      జాన్ ట్రుబీ గారి 22 బిల్డింగ్ బ్లాక్స్ గురించి సినిమాల ఉదాహరణలతో వివరిస్తారా?
మహేష్ రెడ్డి,  డైరెక్షన్ రైటింగ్
 A:     బ్లాగులో మార్చి మూడున జాన్ ట్రుబీ ఇంటర్వ్యూలో సిడ్ ఫీల్డ్  పారాడైం గురించి ఆయనేం చెప్పాడో చూసే వుంటారు. ఆయనే కాదు, ఇంకా విలియం ఫ్రోగ్, మైకేల్ హాగ్ వంటి పాత స్కూలు పండితులు కూడా సిడ్ ఫీల్డ్ మీద విరుచుకు పడతారు. కానీ హాలీవుడ్ లో 1990 ల నుంచీ సినిమాలు సిడ్ ఫీల్డ్ ఆధారంగానే తీస్తున్నారు. హాలీవుడ్ స్క్రీన్ ప్లేలని కాలానుగుణంగా మార్చుకుంటూ వస్తున్నారు. అరిస్టాటిల్ తో ప్రారంభించి, జోసెఫ్ క్యాంప్ బెల్ మీదుగా సిడ్ ఫీల్డ్ కొచ్చారు. ట్రుబీ, ఫ్రోగ్, హాగ్ ల వంటి వాళ్ళు జోసెఫ్ క్యాంప్ బెల్ తరానికి చెందిన పాత స్కూలు స్క్రీన్ ప్లే బోధకులు. అందుకే వీళ్ళు చెప్పే స్ట్రక్చర్ లో  క్యాంప్ బెల్ ‘హీరోస్ జర్నీ’ మజిలీలే కొంచెం మార్చో,  సంఖ్య తగ్గించో వుంటాయి. సిడ్  ఫీల్డ్ వచ్చేసి మరింత కమర్షియల్ కి పనికొచ్చేట్టు సరళీకరించి పారాడైం ఇచ్చాడు. ఇది పాపులరవడాన్ని జీర్ణించుకో లేకపోతున్నారు పాత స్కూలు పండితులు. వాళ్ళ దొక్కటే వాదన,  గొప్ప గొప్ప  సినిమాలు తీయడం హాలీవుడ్ మర్చి పోయిందని. కానీ ఇవ్వాళ  తెలుగులోనైనా కావాల్సింది గొప్పగొప్ప కళాఖండాలు కావు, అర్ధవంతమైన దృశ్యీకరణలు. సిడ్ ఫీల్డ్ ఇదే ఇచ్చిపోయాడు కొత్త తరానికి. కనుక ఇప్పటితరం పాత స్కూలువైపు చూడకుండా, సిడ్ ఫీల్డ్ లాంటి ‘శివ’ ని బాగా స్టడీ చేసి పట్టు సాధించడంలోనే  విజ్ఞత వుంది. నేటి తెలుగు సినిమాల స్క్రీన్ ప్లేలకి ‘శివ’లో సమస్తం వుంది. 

          ఇంకా కావాలంటే ఇక్కడ క్లిక్ చేసి ,  బ్లాగులో స్క్రోల్ డౌన్ చేసి,  జనవరి ఏడున, ‘మూడు హాలీవుడ్ ప్రామాణికాలు’ వ్యాసం చదవండి. ఇక 22 బిల్డింగ్ బ్లాక్స్ జోలికెళ్ళరు.

సికిందర్





Tuesday, March 13, 2018

618 : క్రియేటివిటీ సంగతులు

‘      ప్లేలన్నీ ఎలా ప్లే చేస్తాయి?’  శీర్షికన గత వ్యాసంలో (ఈ పోస్టు కింద లింకు క్లిక్ చేయండి) మొదటి రెండు ప్లేలు – నాన్ లీనియర్, రియల్ టైం – గురించి చెప్పుకున్నాం. స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ ఒకటే, అది సార్వజనీనం. దాని లోపల చేసే రకరకాల ప్లేలు క్రియేటివిటీ అవుతుంది. బస్సుకి స్ట్రక్చర్ ఒకటే, అది సార్వజనీనం. ఆ స్ట్రక్చర్ మీద వివిధ మోడల్స్ ని రూపొందించుకోవడం క్రియేటివిటీ. ప్రపంచంలో ఏ  స్ట్రక్చర్ అయినా  భౌతిక సూత్రాల మీదే ఆధారపడుతుంది. భౌతిక సూత్రాలు సార్వజనీనం కాబట్టి దేని స్ట్రక్చర్ అయినా  ఎక్కడైనా ఒకలాగే వుంటుంది. అలాగే స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ కూడా. ఈ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ లో క్రియేటివ్ ప్లేలు తొమ్మిది రకాలు వుంటాయని హాలీవుడ్ ఆధారంగా చెప్పుకున్నాం. హాలీవుడ్ ఓకే చేసిన ప్లేలనే కమర్షియల్ సినిమాలకి అనుసరించాలని కూడా చెప్పుకున్నాం. ఇలా తొమ్మిది రకాల ప్లేలలో గత వ్యాసంలో చెప్పుకున్న నాన్ లీనియర్, రియల్ టైం రెండూ కాక మరో ఏడు వున్నాయి. అవి : మల్టిపుల్ టైం లైన్, హైపర్ లింక్, ఫేబులా, రివర్స్ క్రోనాలజీ,  రోషోమన్,  సర్క్యులర్, ఒనీరిక్ మొదలైనవి. ఇప్పుడు మూడోదైన  మల్టిపుల్ టైం లైన్ తో ప్రారంభించి తెలుసుకుందాం. 

         
3. మల్టిపుల్ టైం లైన్ : 
    వేర్వేరు కాలాల్లో జరిగిన కథల్ని సమాంతరంగా ఇప్పుడు జరుగుతున్న ప్రధాన కథకి అనుసంధానించి చెప్పుకు రావడమే మల్టిపుల్ టైం లైన్ ప్లే. ‘మళ్ళీ రావా’ లో హీరో చిన్నప్పటి కథ ఒకవైపు, పెద్దయ్యాక హీరోయిన్ తో ఇంకో కాలంలో ఇంకో కథ ఇంకోవైపు నడుస్తాయి. ఈ రెండిటి మధ్య  వీటిని ప్రేరేపించే ప్రస్తుత ప్రధాన కథ వుంటుంది. గాడ్ ఫాథర్ – 2, ది ఫౌంటెయిన్ లని కూడా ఇలా చూడొచ్చు. ఇంకా సైన్స్ ఫిక్షన్ లో ఈ ప్రయోగం వుంటుంది. ఆదిత్య - 369, బ్యాక్ టు ది ఫ్యూచర్ లని కూడా చెప్పుకోవచ్చు. ఈ ప్లేలో విభిన్న కాలాల కథలు ఎక్కడా ఒకదానితో  ఒకటి స్పర్శించవు. కాకపోతే గత కాలపు కథల్లో వున్న పాత్రల  ప్రస్తుత కాలపు ప్రధాన కథలో పంథాని  ప్రభావితం చేసే విధంగా వుంటాయి. సైన్స్ ఫిక్షన్ తప్పించి, ఇతర జానర్స్ లో విభిన్న కాలాలంటే అవన్నీ విభిన్న కాలాల  ఫ్లాష్ బ్యాకులే మళ్ళీ రావాలోలాగా . వీటితో జాగ్రత్తగా ఉండకపోతే మొత్తం కథ గజిబిజి అయిపోతుంది. మల్టిపుల్ టైం లైన్స్  ఒక ప్రధాన కథని ఆశ్రయించి వుంటాయి. ప్రధాన కథలో పాత్రలు గతాన్ని తల్చుకున్నప్పుడు ఎన్ని గతాకాలాలు తల్చుకుంటే అన్ని టైం లైన్స్ లో అప్పటి కథలు కనపడతాయి. ప్రేక్షకుల్ని తికమక పెట్టకుండా వీటిని నడపాలంటే ఒన్స్ అపాన్ ఏ టైం ఇన్ అమెరికా చూడవచ్చు. ఇందులో 1920 – 30 – 60 మూడు కాలాల కథలు సజావుగా సాగుతాయి. 

          4. హైపర్ లింక్ : 
      ‘శివ’ లాంటి లీనియర్ కథల్లో సంఘటనలు  చైన్ రియాక్షన్ లా వుంటాయి. అంటే ఒక సంఘటన ఇంకో సంఘటనకి దారి తీయడం, ఈ సంఘటన మళ్ళీ ఇంకో సంఘటనకి దారితీయడం...ఇలా...ముగింపు వరకూ ఎడతెగని యాక్షన్ రియాక్షన్ల ప్లేగా వుంటాయి.  అంటే ‘అ’ తో మొదలైతే ‘అంఅః’ దాకా ఆగకుండా సాగే  సంకుల సమరమన్న మాట. మధ్యమధ్యలో ఎక్కడా ఉ అనో, ఐ అనో, ఓ అనో సంఘటనలు మిస్ కాకుండా – లింకు కోల్పోకుండా వుంటాయి.  హైపర్ లింక్ విషయానికొస్తే మల్టిపుల్ టైంలైన్ అయినా కావొచ్చు, లేదా ఒకే కాలంలో వేర్వేరు పాత్రల  విడివిడి కథలు కావచ్చు,  అవన్నీ ఒకదానితో వొకటి లింక్ అయి వుంటాయి. ఒక టైంలైన్ లో, లేదా ఒక కథలో ఒకరికి జరిగే సంఘటన ప్రభావం, ఇంకో టైం లైన్లో,  లేదా ఇంకో కథలో ఇంకో పాత్రని ప్రభావితం చేస్తూంటాయి. ఈ పాత్రలన్నీ చివరికొచ్చేసరికి ఒకే ముగింపుకి  కనెక్ట్ అవుతాయి. ఈ హైపర్ లింక్ ప్లే మనుషులంగా మనం ఎక్కడెక్కడో ఎవరెవరితోనో కనెక్ట్ అయి వుంటామన్న ఫీల్ ని ప్రేక్షకులని కలగజేస్తుంది. దీని ప్రధానోద్దేశం ఇదే. హేపీ ఎండింగ్స్, ట్రాఫిక్, మంగోలియా, వేదం, మెట్రో (తమిళ డబ్బింగ్) కొన్ని ఉదాహరణలు. 

          5. ఫేబులా - సియోజై (Syuzhet) ప్లే :  
      ఇది రష్యన్ నుంచి హాలీవుడ్ కమర్షియల్ చేసుకున్న ప్లే. ఈ కథలు ముగింపుతో ప్రారంభమవుతాయి. ఈ ముగింపుకి ఎలా చేరుకుంది కథ అనే కథనాన్ని చేసుకుపోతుంది. అంతే గానీ ఎందుకు చేరుకుందనే ప్రశ్నతో కాదు. ‘ఎందుకు’ చేరుకుందనే ప్రశ్నతో కథనం చేస్తే ఒక్క ముక్కలో ఆ కారణం చెప్పేయ వచ్చు. అందుకని  ‘ఎలా’ చేరుకుందనే కథనం ప్రారంభమవుతుంది.  ఇందులో ఫెబులా అనేది ఫ్లాష్ బ్యాకుల్లో వచ్చే కథనమైతే, సియోజై అనేది, ఆ గతాన్ని  తెలుసుకునే క్రమంలో ప్రస్తుత కాలపు పాత్ర కథ. ‘సిటిజన్ కేన్’ క్లాసిక్ ఉదాహరణ. ఇందులో ప్రధాన పాత్ర మరణం దగ్గర్నుంచి కథ ప్రారంభమవుతుంది. అతను  రోజ్ బడ్ అనే మాట చెప్పి మరణిస్తాడు. అ మాట పట్టుకుని జర్నలిస్టు అతడి జీవితాన్ని శోధిస్తూ పోతాడు. జర్నలిస్టు వివిధ వ్యక్తుల్ని కలవడం వర్తమాన కాలపు కథ అయితే (ప్ప్రెజెంట్ టైం), ఇది ‘సియోజై’ అవుతుంది. ఆయా వ్యక్తులు వివిధ టైం లైన్స్ లో మరణించిన ప్రధాన పాత్ర గురించి చెప్పే విషయాలు ఫ్లాష్ బ్యాకులతో ‘ఫెబులా’ అవుతుంది. మళ్ళీ ఈ వ్యక్తులు క్తులు చెప్పే ఒక్కో ఫ్లాష్ బ్యాకుతో టెన్షన్, సస్పన్స్  పెరుగుతాయి. వీటిని  ఫెబులా తెలుసుకుంటున్న పాత్ర (ఇక్కడ జర్నలిస్టు) అనుభవిస్తుంది. ‘వెనిల్లా స్కై’ కూడా దీని కిందికే వస్తుంది. 

          రివర్స్ క్రోనాలజీ :  
      ఇది కథని వెనుక నుంచి చెప్పడం. అయితే దీనికీ ఫేబులా - సియోజై (Syuzhet) ప్లేకీ తేడా ఏమిటంటే, ఫేబులా - సియోజై (Syuzhet) ప్లే వెనక్కి వెళ్ళే కథనం ఒక క్రమంలో వుంటే, రివర్స్ క్రోనాలజీ వెనక్కెళ్ళే  కథనానికి ఒక క్రమం వుండదు. సీన్లు వెనకా ముందూ అవుతూంటాయి. ప్రారంభం ముగింపు తోనో, లేదా ముగింపు మందు నుంచో వుండవచ్చు. ఐతే ఇదే టెన్షన్ పుట్టించేలా వుంటుంది. ‘మెమెంటో’ దీనికుదాహరణ. పాత్ర అసలెవరు? అన్న ప్రశ్నతో ప్రారంభమై, ఎందుకీ చర్యలకి పాల్పడుతోంది, అసలేం జరిగింది – అనే అనుబంధ ప్రశ్నలని రేకెత్తిస్తూ, సమాధానం దొరుకుతోందనగా ఆ సీను బ్రేక్ అయి ఇంకో సంబంధం లేని సీనుతో మొత్తంగా ఆ పాత్ర మానసిక సంక్షోభాన్ని ప్రతిబింబిస్తూ మూలకారణానికి చేరుకుంటుంది కథ.
(సశేషం)

సికిందర్  
ప్లేలన్నీ ఎలా ప్లే చేస్తాయి? -2