(కవర్
స్టోరీ మిగతా భాగం)
మరి ఇంతటి డిటెక్టివ్
ఇంటికెళ్ళి పోవాల్సిన పరిస్థితి ఎందుకేర్పడింది? రచయితల సరుకు అయిపోయిందా? అదేం
కాదు, సమాజమే దాని రూపు రేఖలు మార్చుకుంది. కాలక్రమంలో నేరాల స్వభావం మారింది, తీవ్రతా విస్తృతీ పెరిగాయి.
అగథా క్రిస్టీ నవలల్లో లాగా నేరమనేది గ్రామీణ జీవితానికే, ఇరుగుపొరుగు ఇళ్లకే పరిమితం కాలేదు. గ్రామాల్లో జరిగే చిన్న చిన్న నేరాలకి సైతం మూలాలు మాఫియా సంస్కృతి వల్లనైతే నేమి, ఇతర వ్యవస్థీకృత
ముఠాల వల్లనైతే నేమి, ఇంకేదో దేశంలో ఏ మారు మూలనో వుంటున్నాయి. ముంబాయిలో పేలుళ్లు
జరిపి దావూద్ ఇబ్రహీం అనే వాడు దుబాయిలోనూ కరాచీలోనూ తల దాచుకుంటున్నాడు. మళ్ళీ
అక్కడ్నించీ నేరాలు సాగిస్తున్నాడు. రాయల సీమ ఫ్యాక్షన్ పోరు హైదరాబాద్ వీధుల దాకా
ప్రాకింది. కోలా కృష్ణమోహన్ అనేవాడి లీలల కిటుకు లండన్లో వుంటోంది...
ఇలాటి పరిస్థితుల్లో నేరాల్ని అరికట్టాలంటే ఏకవ్యక్తి వ్యవహారం చాలదు. ఎలాగైతే నేరస్థ ముఠాలు విస్తృత నెట్ వర్క్ ని ఏర్పాటు చేసుకుంటున్నాయో, అలా వాళ్ళని దండించే వ్యవస్థలకి అంత కన్నా ఎక్కువ స్థాయిలో నెట్ వర్క్ వుండాలి. సంబంధిత అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ విభాగాలతో సమన్వయముండాలి. ఇది ఒక్క పోలీసు వ్యవస్థకే సాధ్యమవుతుంది తప్ప ప్రైవేట్ డిటెక్టివ్ వల్ల కాదు. సాధారణంగా పడక్కుర్చీ మేధావి అయివుండే ప్రైవేట్ డిటెక్టివ్ తర్కవితర్కాలకి ఈ నేరాలు లొంగి రావు. కార్య క్షేత్రంలోకి దూకాలి, పరుగులు పెట్టాలి, వేటాడాలి. డిటెక్టివ్ యుగంధర్, డిటెక్టివ్ నర్సన్, డిటెక్టివ్ పరశురాం లాంటి పాత్రలు విదేశాలకీ వెళ్లి శత్రువుల పనిబట్టిన కథలున్నాయి. యుగంధర్ టిబెట్ వెళ్లి దలైలామాని కాపాడేడు. నర్సన్ అసిస్టెంట్ కృపాల్ తో కలిసి విదేశంలో చేసే ఒక అడ్వెంచర్ లాంటిదే రాజేంద్రకుమార్, వహీదా రెహమాన్ లతో ఎస్ఎస్ వాసన్ తీసిన ‘షత్రంజ్’ (చదరంగం- 1969) అనే హిందీ సినిమాలో వుంటుంది. డిటెక్టివ్ పరశురాం కూడా ఎన్నో దేశాలు తిరిగి వచ్చాడు. డిటెక్టివులుగా స్థానికంగా దేశవాళీ హత్య కేసులు పరిశోధిస్తూనే, అడపాదడపా విదేశాల్లో గూఢచారి పాత్ర కూడా నిర్వహించాయీ పాత్రలు. షెర్లాక్ హోమ్స్, హెర్క్యూల్ పైరట్ లు కూడా గూఢచారి పాత్ర పోషించిన డిటెక్టివ్ పాత్రలే. కానీ ఫిలిప్ మార్లో, లివ్ ఆర్చర్, ట్రావిస్ మెక్ గీ లాంటి డిటెక్టివ్ పాత్రలు కుటుంబాల్లో జరిగే నేరాల పరిశోధనలకే పరిమితమయ్యాయి. 1954 లో ఇయాన్ ఫ్లెమింగ్ సృష్టించిన బ్రిటిష్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ జేమ్స్ బాండ్- 007 పాత్ర ఆగమనంతో గూఢచారి పాత్రకి ప్రొఫెషనలిజం అబ్బింది. ఈ పని డిటెక్టివ్ లు చేస్తే పాఠకులకి వాస్తవికత అడ్డుతగులుతోంది.
ఇయాన్ ఫ్లెమింగ్ |
రోడ్డు
మీద హత్య, అపార్ట్ మెంట్ లో మానభంగం, వ్యాపారి కొడుకు కిడ్నాప్ లాంటి వ్యక్తి చుట్టూరా నేరాలు ప్రజల
దృష్టి నాకర్షించినంత కాలం, డిటెక్టివ్ పాత్రలకి బాగానే చెల్లు బాటయ్యేది. ఎపుడైతే
ఈ పరిధి దాటుకుని నేరాలు అసాంఘీక శక్తుల చేతుల్లో ఆక్టోపస్ లా వ్యాపించి, తీవ్రత
కూడా పెంచుకుని నిత్యకృత్యాలై పోయాయో, అప్పుడిక ప్రజల దృష్టి వాటి మీదికి
మళ్ళింది. వాటి ముందు డిటెక్టివ్ లు పరిశోధించే
మామూలు హత్య కేసులు వెలవెలబోయాయి. ఇప్పుడు వ్యవస్థీకృత ముఠాల పనిబట్టాలంటే
యాక్షన్ ఓరియెంటెడ్ పాత్ర కావాలి, పడక్కుర్చీ మేధావులైన డిటెక్టివ్ పాత్రలు కాదు. తెలుగులో
ఈ డిటెక్టివ్ పాత్రల స్థానాన్నిమధుబాబు సృష్టించిన యాక్షన్ హీరో షాడో మెల్లమెల్లగా ఆక్రమించ సాగాడు. పూర్తిగా
ఆక్రమించి డిటెక్టివ్ పాత్రల్ని వెనక్కి
నెట్టేశాడు.
అయితే షాడో ఏ ఇన్వెస్టిగేషన్ తోనూ పనిలేని అడ్వెంచర్స్ చేసే పాత్ర. దాని తరహా వేరు. నెట్ వర్క్ ని నెట్ వర్క్ తోనే ఛేదించడం సాధ్యం. ఈ పని ప్రభుత్వ శాఖ అయిన పోలీసు వ్యవస్థకే వీలవుతుంది. పోలీసులకుండే లాబ్ వసతి, రికార్డుల సదుపాయం, సమాచార సౌలభ్యం, ఇన్ఫార్మర్ ల తోడ్పాటూ మొదలైనవి ప్రైవేట్ డిటెక్టివ్ ల అందుబాటులోకి రావు. ఒక హత్య జరగ్గానే ఏ అధికారమూ లేని డిటెక్టివ్ ఆ ఘటనా స్థలానికి వెళ్ళిపోతాడు. ఇన్స్ పెక్టర్ సెల్యూట్ కొట్టి సాదరంగా ఆహ్వానిస్తాడు. హత్యాస్థలంలో అన్నీ చూపిస్తాడు. డిటెక్టివ్ క్లూస్ పట్టుకుంటాడు. తనే కేసు పరిశోధించి, పరిష్కరించి శెభాష్ అన్పించుకుంటాడు. తనే హీరో, పోలీసులు జీరోలు. నిజంగా ఇలా ఎక్కడైనా జరుగుతుందా? ప్రతీ డిటెక్టివ్ రచయితా చేసిన పని ఇదే. ఏదో కాలం కలిసివచ్చి ఆ పాత్రల్ని అలా రాసి ఆరాధ్య దైవాలు చేశారు కాబట్టే పాఠకులూ వాస్తవికత చూడకుండా అభిమానించారు. ఎంత లైసెన్సు వున్న ప్రైవేట్ డిటెక్టివ్ అయినా ఇలాటివి చేయలేడు. పోలీసులూ రానివ్వరు.
ఎర్ల్ స్టాన్లీ గార్డెనర్ |
ఎర్ల్
స్టాన్లీ గార్డెనర్ సృష్టించిన క్రిమినల్ లాయర్ పాత్ర పెర్రీ మేసన్ తో ఇదంతా
వాస్తవికంగా
వుంటుంది. అతను వెళ్ళిన చోట హత్య జరిగి
వుంటే ఏదీ ముట్టుకోకుండా వెంటనే పోలీసుల్ని పిలుస్తాడు. పోలీసులు వచ్చి అతన్నే
ఇబ్బంది పెడతారు. ఫేమస్ లాయరని సెల్యూట్ కొట్టరు. పెర్రీ మేసన్ కూడా ప్రోటోకాల్
పాటించి వెళ్ళిపోతాడు. పోలీసులే కేసు
దర్యాప్తు చేస్తారు. పెర్రీ మేసన్ కి పాల్ డ్రేక్ అనే ప్రైవేట్ డిటెక్టివ్
వుంటాడు. కేసులోంచి తన క్లయింట్ ని కాపాడడానికి మేసన్, డ్రేక్ చేత సీక్రేట్ గా పరిశోధన చేయిస్తాడు. ఆ
సాక్ష్యాధారాలతో కేసు సంగతి కోర్టులో చూసుకుంటాడు. ఈ కోర్టు సీన్లే మనకి చలిజ్వరం
తెప్పిస్తాయి. ఇదంతా ప్రొఫెషనల్ గా వుంటుంది.
కాబట్టి నెట్ వర్క్ నేరాలతో వాస్తవికత డిటెక్టివ్ పాత్రలకి ప్రతిబంధకంగా మారింది. పైన చెప్పిన పోలీస్ నెట్ వర్క్ లో కూడా డిటెక్టివ్ ని ఇన్వాల్వ్ చేసి రాస్తే చాల అసహజంగా వుంటుంది. షెర్లాక్ హోమ్స్ అయినా కేవలం అతడి కుశాగ్రబుద్ధి చేత ఈ కాలంలో ఇలాటి కేసులు పరిష్కరిస్తున్నట్టు రాయడానికి పూనుకోలేరు. కనుక డిటెక్టివ్ పాత్రలు అస్తిత్వ సమస్యలో పడ్డాయి.
ఈ నేపధ్యంలో ఇంగ్లీషు సాహిత్యంలో పోలీస్ డిటెక్టివ్ అనేవాడు అవతరించాడు (బ్రిటన్ నుంచి రూత్ రెండెల్ నవలలు). ఇతను పోలీసు శాఖలో ఉద్యోగియే. డిటెక్టివ్ ఇన్స్ పెక్టర్, డిటెక్టివ్ సబిన్స్ పెక్టర్ అని మన దగ్గరా వున్నారు. అయితే ఈ పాత్రలు మన డిటెక్టివ్ సాహిత్యంలో కొచ్చేసరికి డిటెక్టివ్ లకి సహకరించే పక్క పాత్రలుగా వుండి పోయాయి ( డిటెక్టివ్ ఇన్స్ పెక్టర్ స్వరాజ్య రావు- కొమ్మూరి సాంబశివరావు, డిటెక్టివ్ ఇన్స్ పెక్టర్ బాలకృష్ణన్- సికిందర్). పాశ్చాత్య సాహిత్యంలో పోలీస్ డిటెక్టివ్ వచ్చేసి స్వతంత్రుడైపోయాడు. ఈ పోలీస్ డిటెక్టివ్ పాత్రలు కేవలం తమ అఖండ మేధాశక్తి తోనే గాక, ఆధునిక ఫోరెన్సిక్ సైన్సు, కంప్యూటర్ ప్రోగ్రాములు వంటి అండదండలతో నేర పరిశోధనని శాస్త్రీయంగా మార్చుకుని ముందుకు సాగుతారు. సమాజంలో చోటు చేసుకునే పరిణామాలు తప్పకుండా సాహిత్యంలో ప్రతిబింబిస్తాయి గనుక, క్రైం సాహిత్యపు రూపు రేఖలు అలా పూర్తిగా మారిపోయాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల ఆధునిక క్రైం సాహిత్యంలో డిటెక్టివ్ తన స్థానాన్ని కోల్పోయాడు. గడచిన నలభయ్యేళ్ళ కాలంలో ఆంగ్లంలో కొత్తగా డిటెక్టివ్ పాత్ర సృష్టి ఏదీ జరగలేదు. వున్న డిటెక్టివ్ కథలే పునర్ముద్రిస్తున్నారు. తెలుగులో అదీ లేదు. కొమ్మూరి జీవించినంత కాలం ఆయన సొంత పబ్లికేషన్లో యుగంధర్ సిరీస్ పునర్ముద్రణలు పొందేవి.
అగథా క్రిస్టీ |
సరే,
తెలుగు సాహిత్యంలో డిటెక్టివ్ క్యారెక్టర్ అడ్రసు గల్లంతయ్యాక, కాల్పనిక క్రైం కథల
స్థానంలో రియల్ క్రైం స్టోరీస్ ప్రవేశించాయి. పాశ్చాత్య దేశాల్లో లాగా వెంటనే
పోలీస్ డిటెక్టివ్ ని ఎవరూ అందుకోలేదు. ఈ వ్యాసకర్త ‘అపన’ లో రాసినప్పుడు అవన్నీ
ఫోరెన్సిక్- మెడికో లీగల్ ప్రొసీజర్స్ తో కూడిన హత్య కేసుల దర్యాప్తులే. అంటే
సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్. దీన్ని ప్రైవేట్ డిటెక్టివ్ లకి ఆపాదించి రాయడం అసహజంగానే
వున్నా, లాల్ అండ్ జాన్ అనే పాత్రలు పాపులర్ అయ్యాక అవేం చేసినా చెల్లిపోయింది.
విమర్శలు రాలేదు. విషయం ఆకర్షించింది. ఈ డిటెక్టివ్ పాత్రల ప్రత్యేకత గురించి
ఎడిటర్ శ్యామ దామోదర రెడ్డి గారు సంపాదకీయాల్లో రెండు మూడు సార్లు పేర్కొన్నారు
కూడా. డిటెక్టివ్ లాల్ అండ్ జాన్ ల పరిశోధనలు డిటెక్టివ్ సాహిత్యానికే వన్నె
తెస్తున్నాయన్నారు. కానీ మొత్తంగా డిటెక్టివ్ సాహిత్యమే కట్ట కట్టుకుని అటకెక్కాక,
ఇంకే పోలీస్ డిటెక్టివ్ ఆలోచనే ఎవరికీ
రాలేదు. ఛానెల్స్ వచ్చి పుస్తకమే చచ్చిపోయాక, డిటెక్టివుల గురించి మాట్లాడే పనే
లేకుండా పోయింది.
అలా
తెలుగు సాహిత్యంలో డిటెక్టివ్ అనే పాత్రకి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది.
మెదడుని పదునెక్కించేదీ, పరిశీలనా శక్తిని పెంచేదీ; ఇంగిత జ్ఞానాన్ని, తార్కిక బుద్దిని, సమయ స్ఫూర్తి నీ, సూక్ష్మదృష్టినీ పరిపుష్టం జేసేదీ, వేగవంతమైన ఆలోచనా శక్తిని కల్పించేదీ డిటెక్టివ్ కథే. ప్రైవేట్ డిటెక్టివ్ కావొచ్చు, పోలీస్ డిటెక్టివ్ కావొచ్చు- డిటెక్టివ్ ఎప్పుడూ న్యాయం వైపే వుంటాడు. కక్కుర్తి పడి అన్యాయం చెయ్యడు. మంచిని కాపాడతాడు. అతడి మాటా ప్రవర్తనా నిజాయితీతో, బాధ్యతతో కూడుకుని వుంటాయి. నెగెటివ్ భావాల్ని రెచ్చ గొట్టే పనికి డిటెక్టివ్ దూరం –బహుదూరం.
***

ఇతర
భాషల్లో డిటెక్టివ్ లు...
మన దేశంలో ఇతరభాషల్లో డిటెక్టివ్ పాత్ర లెలా వున్నాయో చూస్తే, బెంగాలీలో సత్యజిత్ రే సృష్టించిన ప్రసిద్ధ ‘ఫెలూదా’ వున్నాడు. చార్మినార్ సిగరెట్ తాగుతూ, స్టేట్స్ మన్ దిన పత్రిక చదివే ఈ డిటెక్టివ్ పాత్ర వెంట తోప్షే అనే టీనేజర్ వుంటాడు. ఈ జంటని ముంబాయి నుంచీ ఖాట్మండూ వరకూ ఎక్కడికైనా తిప్పేవారు సత్యజిత్ రే. సోనార్ కెల్లా, జై బాబా ఫెలూ నాథ్ అనే రచనల్ని తెర కెక్కించారు కూడా. బెంగాలీ లోనే శిబరాం చక్రవర్తి అనే హాస్య రచయిత సృష్టించిన డిటెక్టివ్ కొల్కే కాశీ అనే కామిక్ పాత్ర వుంది. మనోరంజన్ భట్టా చార్య అనే మరో రచయిత హుక్కా కాశీ అనే మరో డిటెక్టివ్ పాత్రని సృష్టించారు. ఇక శరదిందు బందోపాధ్యాయ అయితే ఏకంగా దేశవాళీ షెర్లాక్ హోమ్స్ నే సృష్టించారు. పాత్ర పేరు బ్యాంకేష్ బక్షీ. గంగోపాధ్యాయ అనే మరొకాయన కాకా బాబూ అనే డిటెక్టివ్ నీ, సమ రేష్ బోస్ గగోల్ అనే బాల డిటెక్టివ్ నీ సృష్టించారు. 1960లలో రచయిత నిహరంజన్ గుప్తా ప్రవేశంతో ఊపు వచ్చింది. ఈయన సృష్టి కిరీటీ రాయ్ అప్పట్లోనే హైటెక్ డిటెక్టివ్. కానీ ఎన్ని డిటెక్టివ్ పాత్రలున్నా, బెంగాలీలో డిటెక్టివ్ పాత్ర అనగానే సత్యజిత్ రే ‘ఫెలూదా’ యే మెదులుతాడు.
కన్నడ సాహిత్యంలో క్రైం సాహిత్యం ముప్ఫై శాతం. టాప్ రైటర్ నర్సింహయ్య. ఈయన 1950లో రాయడం ప్రారంభించారు. ఇప్పటికి 400 నవలలు రాశారు. ఈయన సృష్టించిన పురుషోత్తం – మధుసూదన డిటెక్టివ్ పాత్రలు ఇంటింటా తెలిసిన పాత్రలు. రెండో స్థానంలో విజయ నన్నూర్ అనే సీనియర్ ఐపీఎస్ అధికారి వున్నారు. సహజంగానే ఈయన రచనలు సహజత్వానికి దగ్గరగా వుంటాయి. ఇక మరాఠీ కొస్తే, అక్కడ డిటెక్టివ్ సాహిత్యం పుష్కలంగా ఉత్పత్తి అయినా చెప్పుకోదగ్గ రచయితల్లేరు. 1960 లనాటి బాబూరావ్ అర్నాల్కర్ రచనల్నే ఇప్పటికీ యువతకి దిక్కు. ఇతరులు రాసినవి ఆంగ్ల కథలకి మక్కీకి మక్కీ కాపీలు. ఒక్క శ్రీకాంత్ శింకర్ మాత్రం నిజంగా జరిగిన సంఘటనల్ని కథలుగా మల్చి పాపులరయ్యారు. ఇక తమిళంలో, సెక్స్ ఎక్కువ కలిపి రాస్తారు. సుజాత అనే కలం పేరుతో రాసే లాయర్ మాత్రం ఉన్నత ప్రమాణాలు పాటిస్తున్నారు. దేశవాళీ పెర్రీ మేసన్ సృష్టించి పేరు తెచ్చుకున్నారీయన. ఇతర డిటెక్టివ్ రచయితలూ ఛానెళ్ళ వైపు వెళ్ళిపోయారు.

నాటు
సరుకంటే హిందీలోనే!
ఇంగ్లీష్ డిటెక్టివ్ సాహిత్యానికే దేశంలో అత్యధిక పాఠకులున్నారు. తర్వాతి స్థానం హిందీది. అయితే రాసేదంతా చవకబారు సరుకే. ఎప్పుడో దశాబ్దం క్రితం కల్నల్ రంజిత్ పేరుతో డిటెక్టివ్ నవలలు వచ్చేవి. వాటిలో డిటెక్టివ్ భగవాన్ వుండేవాడు. ఈ అపరాధపరిశోధకుడి పాత్ర ఆకట్టుకునే విధంగా వుండేది. ఇప్పుడొస్తున్న డిటెక్టివ్ నవలలన్నీ సి గ్రేడ్ హిందీ సినిమాల స్థాయిలో వుంటున్నాయి. చాలావరకూ సినిమా కథల్లాగే వుంటాయి డైలాగులు సహా. ఈ ‘డిటెక్టివ్ రచయితలు’ హిందీ సినిమాల్లో అవకాశాల కోసం తహతహలడుతున్నట్టుగా సినిమాటిక్ గా నవలలు రాస్తూంటారు. 1980 లకి పూర్వం వేద్ ప్రకాష్ కాంభోజ్, ఓం ప్రకాష్ శర్మ, ఇబ్నె షఫీ అనే రచయితలు హిందీ డిటెక్టివ్ సాహిత్యానికి ఆద్యులని చెప్పాలి. ఇబ్నె షఫీ సృష్టించిన డిటెక్టివ్ జంట అబ్దుల్ అండ్ హమీద్ లు నాటుగా మోటుగా మాస్ గా వుంటూ హిందీ గ్రామీణ పాఠకుల్ని ఆకట్టుకునేవి. 1980-90 లలో అంతా నరేంద్ర మోహన్ పాఠక్ రాజ్య మేలారు. ఇదే సమయంలో రాయడం మొదలెట్టిన వేద్ ప్రకాష్ శర్మ ‘వర్దీ వాలా గూండా’ (పోలీస్ యూనిఫాంలో గూండా) అనే నవల ఇప్పటికి అయిదు లక్షల కాపీలు అమ్ముడయ్యిందని చెప్పుకుంటారు. దీన్ని నవల అనేకన్నా సినిమా స్క్రిప్ట్ అనొచ్చు. హిందీ డిటెక్టివ్ నవలల టైటిల్స్, కథా కథనాలు, పాత్రలు ప్రతీదీ హిందీ మసాలా మూవీస్ లాగే వుంటాయి. వీటిని చదవడమంత శిక్ష వుండదు. ఈ వ్యాసకర్త పది పేజీలకన్నా చదవలేక పోయేవాడు. ముద్రించే కాగితం కూడా అత్యంత హీనంగా వుంటుంది. హిందీకి జాతీయ భాషా హోదా వున్నప్పటికీ ఆ భాషలో ఒక్కరంటే ఒక్కరు ఓ పాపులర్ డిటెక్టివ్ పాత్రని అందించలేకపోయారు.

వాడుకలో డిటెక్టివ్ పదం
సర్ ఆర్ధర్ కానన్ డాయల్ |
ప్రపంచ సాహిత్యంలో తొట్ట తొలి
డిటెక్టివ్ పాత్ర సృష్టికర్త సర్ ఆర్ధర్ కానన్ డాయల్ కాదు. ఆయన షెర్లాక్ హోమ్స్
పాత్రని 1887 లో సృష్టించారు. కానీ ఇంకా పూర్వం 1841 లో ఎడ్గార్ అలన్ పో ‘ది మర్డర్స్ ఇన్ ది రూమార్గ్’ అన్న నవల రాశారు.
ప్రపంచంలో ఇదే మొట్టమొదటి డిటెక్టివ్ రచన. ఇందులో ఆయన లీ షావెలర్ సీ ఆగస్ట్ డుపిన్
అనే డిటెక్టివ్ పాత్రని సృష్టించారు. ఇదే ప్రపంచంలో మొట్ట మొదటి డిటెక్టివ్ పాత్ర.
కానీ డుపిన్ వల్లా, షెర్లాక్ హోమ్స్ వల్లా డిటెక్టివ్ అన్న పదం వాడకంలోకి రాలేదు. 1829
లో స్కాట్ లాండ్ యార్డ్ గా పిలిచే లండన్ పోలీసు వ్యవస్థ ఏర్పాటయ్యాక, నెమ్మదినెమ్మదిగా 1878లో అందులో సీఐడీ
విభాగాన్ని ప్రారంభించాక, సీఐడీ పోస్టుల్ని
సృష్టించారు. ఆ సీఐడీ లకే డిటెక్టివ్ లన్న
పర్యాయనామం స్థిరపడింది. అలా క్రైం సాహిత్యానికి డిటెక్టివ్ సాహిత్యమని
పేరొచ్చింది. అందులో అపరాధపరిశోధకుడు డిటెక్టివ్ అయ్యాడు. షెర్లాక్ హోమ్స్ సహా
అపరాధపరిశోధక పాత్రలన్నిటికీ డిటెక్టివ్ లనే పేరొచ్చింది.
తెలుగు
సాహిత్యంలో డిటెక్టివ్ పాత్రలు
|
వాటి సృష్టి
కర్తలు
|
యుగంధర్
|
కొమ్మూరి
సాంబశివరావు
|
లాయర్
విశాలాక్షి
|
ఆరుద్ర
|
వాలి, పరశురాం
|
టెంపో రావ్
|
భగవాన్
|
విశ్వ ప్రసాద్
|
పృథ్వీరాజ్
|
మల్లాది
వెంకటకృష్ణ మూర్తి
|
నర్సన్
|
గిరిజశ్రీ
భగవాన్
|
వెంకన్న
|
వసుంధర
|
ఇంద్రజిత్
పాణి
ఇంద్రజిత్-
ప్రమీల
చాణక్య
చంద్రమోహన్
సిన్హా
సుధాకర్
కరణ్
ఇన్స్ పెక్టర్
రాజారెడ్డి
గిరి
వాసు- శేషు
లాల్ అండ్ జాన్
ఆహర్పతి,
జగత్
|
రావులపాటి
సీతారామారావు
కృష్ణ మోహన్
కనకమేడల
జివిజి
విజయబాపినీడు
శ్యాం బాబు
ఏవీ మోహన్రావ్
బొమ్మిడి
అచ్చారావు
అజీజ్
ఎంవివి సత్యనారాయణ బి. రాజేశ్వరి సికిందర్ (అపరాధపరిశోధన)
సికిందర్
(ఆంధ్రభూమి)
|
ఆంగ్ల సాహిత్యంలో డిటెక్టివ్ పాత్రలు
|
వాటి సృష్టికర్తలు
|
షెర్లాక్
హోమ్స్
|
కానన్ డాయల్
|
హెర్క్యూల్
పైరట్, మిస్ మార్పుల్
|
అగథా క్రిస్టీ
|
ఫిలిప్ మార్లో
|
రేమండ్
చాండ్లర్
|
లివ్ ఆర్చర్
|
రాస్ మెక్
డొనాల్డ్
|
ట్రావిస్ మెక్
గీ
|
జాన్ డి.
డొనాల్డ్
|
ఫాదర్ బ్రౌన్
|
చెస్టర్టన్
|
పెర్రీమేసన్
(క్రిమినల్ లాయర్)
|
ఎర్ల్ స్టాన్లీ
గార్డెనర్
|
జేమ్స్ బాండ్
(గూఢచారి)
|
ఇయాన్
ఫ్లెమింగ్
|
(కవర్ స్టోరీ అయిపోయింది)
రేపు : ఈ వ్యాసాలు ఎవరి కోసం?
- సికిందర్