రచన - దర్శకత్వం శ్రీను గవిరెడ్డి
తారాగణం : రాజ్ తరుణ్, కశిష్ ఖాన్, నరేన్, పోసాని కృష్ణమురళి, అజయ్, అరియనా తదితరులు
సంగీతం : గోపీ సుందర్, ఛాయాగ్రహణం : నగేష్ బనేల్
బ్యానర్స్ : : అన్నపూర్ణ స్టూడియోస్, శ్రీవెంకటేశ్వరా సినిమాస్ ఎల్లెల్పీ
నిర్మాతలు : సుప్రియ, ఆనంద్ రెడ్డి
విడుదల : నవంబర్ 26, 2021
***
రాజ్ తరుణ్ సక్సెస్
కోసం చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి రావడం లేదు. 2013 లో పరిచయమవుతూ నటించిన ‘ఉయ్యాల
జంపాల’ సక్సెస్ తర్వాత, 2015 లో ‘కుమారి 21 ఎఫ్’ తప్ప, ఇంత వరకూ
సక్సెస్ ఏమీ లేదు. నటించిన 11 సినిమాలూ వరుసగా ఫ్లాపయ్యాయి. తాజాగా ఇప్పుడు ‘అనుభవించు రాజా’ విడుదలైంది. దీనికి దర్శకుడు తను నటించిన
‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ అనే ఫ్లాప్
తీసిన గవిరెడ్డి శ్రీను! ఫ్లాపు ఫ్లాపూ కలిసి ‘ అనుభవించు రాజా’ అంటూ వచ్చారు. అన్నపూర్ణ స్టూడియోస్ పెద్ద బ్యానర్ అండగా వుంది. మరి ఈసారి
ఏం అనుభవించారు- హిట్టా, ఫ్లాపా? తెలుసుకుందాం...
కథ
పశ్చిమ గోదావరి జిల్లా యండగండి అనే గ్రామం. ఈ గ్రామంలో బంగారం అలియాస్ రాజు (రాజ్ తరుణ్) తాత బాగా ఆస్తిపరుడు. రాజు ఏ లోటూ లేకుండా పెరుగుతాడు. ఇంతలో యాక్సిడెంట్ జరిగి తల్లిదండ్రులు చనిపోతారు. తాత కూడా చనిపోతూ మాట చెప్తాడు- ఇన్నాళ్ళూ డబ్బు కూడ బెట్టడమే సరిపోయిందనీ, దాన్ని అనుభవించ లేకపోయాననీ, నూవ్వైనా రాజాలా అనుభవించమనీ చెప్పి చచ్చిపోతాడు. చెప్పకపోయినా ఏకైక వారసుడిగా అనుభవించే వాడే. రాజు పెద్దవాడై అనుకోని ఒక సంఘటనలో జైలుకి పోతాడు. జైల్లోంచి విడుదలై హైదరాబాద్ వెళ్ళిపోతాడు. ఆక్కడ ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో చేరతాడు. ఇక్కడ ఇటీ జాబ్ చేస్తున్న శృతి (కాశీష్ ఖాన్) తో ప్రేమలో పడతాడు. రాజు సిస్టమ్స్ సెక్యూరిటీ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడనునుకుని ఆమె కూడా ప్రేమలో పడుతుంది. తీరా ఒట్టి సెక్యూరిటీ గార్డేనని తెలుసుకుని షాకవుతుంది. రాజు వూరు విడిచి వచ్చేయాడానికి కారణమేమై వుంటుంది? అక్కడేం జరిగి వుంటుంది? ఆస్తిని రాజాలా అనుభవించకుండా ఎందుకు వదిలేసి వచ్చాడు? ఇవి తెలుసు కోవాలంటే మిగతా సినిమా చూడాలి.

ఆయాచిత ఆస్తిని అనుభవించే పని లేని రాజాగా
కామెడీ కథగా చెప్పొచ్చు. దీంట్లో ఏదో గుణపాఠం నేర్పొచ్చు. కానీ కామెడీ అనుకున్నది కాస్తా
హంతకులు జొరబడే సస్పెన్స్ థ్రిల్లర్ గా మారుపోవడంతో ఫస్టాఫ్ వరకే వర్కౌట్ అయింది. సెకండాఫ్
విషయంలేక తేలిపోయింది. ఎత్తుగడ ఆసక్తి కరంగానే వుంది. టైటిల్స్ కి ముందు ఆ గ్రామంలో రాజ్ తరుణ్ కోటీశ్వరుడి
వారసుడిగా పరిచయమై, తర్వాత జైల్లో కనిపిస్తాడు. ఆ తర్వాత హైదారాబాద్
లో ఐటీ కంపెనీకి సెక్యూరిటీ గార్డ్ గా వుంటాడు. ఇలా క్యారక్టర్ సస్పెన్స్ తో మారిపోతూ
వుంటుంది. హీరోయిన్ తో లవ్ ట్రాక్ మొదలవుతుంది. అది రెగ్యులర్ గా సినిమాల్లో బోరు కొడుతున్న
సాఫ్ట్ వేర్ ప్రేమల్లో ఒక టెంప్లెట్ ప్రేమగా టైము తినేస్తుంది.
ఇంటర్వెల్లో ఒక మలుపుతో సెకండాఫ్ లో గ్రామంలో ఫ్లాష్ బ్యాక్
లోకి పోతుంది కథ. ఇంటర్వెల్ వరకూ సస్పెన్సుతో
నిలబడ్డ కథ, సెకండాఫ్ లో విషయం లేక చతికిల బడింది. కామెడీ చేసి
నవ్వించే ప్రయ్తత్నాలు కూడా ఫలించలేదు. కోళ్ళ పందాలూ, అవెలా జరుగుతాయన్న
వివరాలూ, రాజ్ తరుణ్ ప్రెసిడెంట్ గా పోటీ, హంతకుల హడావిడీ...ఏవీ ఫస్టాఫ్ లో లేవనెత్తిన ప్రశ్నలతో పోటీ పడి నడవలేదు.
బలమైన కాన్ఫ్లిక్ట్ లేకపోతే ఇంతే. లైటర్ వీన్ సినిమాలు తీస్తే ఒకప్పటి రోమాంటిక్ కామెడీల్లాగే
ఫ్లాపావుతాయి. ఈ మూవీ రాజ్ తరుణ్ కి ఫస్టాఫ్ హిట్, సెకండాఫ్ ఫ్లాప్.
రాజ్ తరుణ్ ఏ పాత్రయినా
చక్కగా నటించగలడు. కథలే కలిసి రావడం లేదు. తనకున్న యూత్ ఫాలోయింగ్ క్రమక్రమంగా తగ్గిపోతున్న
పరిస్థితి వుంది. ఓపెనింగ్స్ కూడా వుండడం లేదు. తనేం చేయాలో ఇక తీవ్రాలోచన చేయాల్సిందే.
అన్నపూర్ణ బ్యానర్లో కూడా పరిస్థితి మారకపోతే ఇంకెప్పుడూ మారుతుంది. ఐతే అన్నపూర్ణ
నిర్వాహకులు ఈ స్క్రిప్టుని ఎలా అనుకుని జడ్జి చేశారన్నది కూడా పాయింటే.
రాజ్ తరుణ్ గ్లామర్ కి గోపీసుందర్ సమకూర్చిన
పాటలు కూడా సహకరించలేదు. కొత్త హీరోయిన్ కశీష్ ఖాన్ తో రొటీన్ రోమాన్సు వల్ల కెమిస్ట్రీ
కూడా వర్కౌట్ కాలేదు. అందచందాలున్న కశీష్ కి సరైన పాత్ర కూడా లేదు. ప్రొడక్షన్ విలువలూ, కెమెరామాన్ నగేష్ విజువల్స్ మాత్రం బావున్నాయి.
—సికిందర్