రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Wednesday, December 16, 2020

1004 : రైటర్స్ కార్నర్

   

  చయిత అవాలని కలలుగనే వారెవరినీ నేను విమర్శించను. రచనలు చేసి జీవించడం చాలా కష్టం. అందుకే ఇలాటి కలలున్న వాళ్ళు రెండు ఉద్యోగాలు చేస్తారు. ఒకటి జీతం వచ్చే పగటి ఉద్యోగం. దీంతో తలపైన కప్పు, కడుపుకి ఇంత తిండీ లభిస్తాయి. ఇక ఖాళీ సమయాన్ని రాతపనికి  కేటాయించుకుంటారు. పనిలో మీరు ఒంటరి. మీకెవరి  సపోర్టూ లభించదు. రచనలు చేసే వాడి మీద అంత సదభిప్రాయం వుండదు మనుషులకి. ఇలా స్ట్రగుల్ చేసి మీరు రచయిత అన్పించుకుని సినిమాల్లోకి వచ్చారంటే, ఇక్కడ కూడా స్ట్రగుల్ వుంటుంది. చాలా తక్కువ మందికి చేతినిండా పని వుండి, వాళ్లకి  సినిమాలు తప్ప  ఇక దేని గురించీ ఆలోచించే అవసరముండదు. మిగిలిన వాళ్ళు మళ్ళీ రెండుద్యోగాలు చేయాల్సిందే!   
-
రాబిన్ స్వికార్డ్   
       
నేనెందుకు రాస్తున్నానంటే... రాయడాన్ని ఎంజాయ్ చేస్తాను గనుక, సినిమాల్ని ప్రేమిస్తాను గనుక. కానీ ప్రధాన కారణం చెప్పుకోవాలంటే, నేను రాసింది ఎవరో ఒకరు ఇష్ట పడుతున్నారు కాబట్టి, నాకు డబ్బిస్తున్నారు కాబట్టి. లేకపోతే నేనిక్కడ వుండేవాణ్ణి కాదు, చేపలు పడుతూ వుండే వాణ్ణి.
-జిమ్ కౌఫ్ 
       
ఎవరో అన్న ఒక మాటని రాసిపెట్టుకోవడంతో ప్రారంభమయ్యింది నేను రచన చెయ్యడం. తర్వాత ఇంకెవరో చెప్పిన మాట నచ్చి అదీ రాసి పెట్టుకున్నాను. అలా అలా విన్న డైలాగులనీ కలిపి నాటిక రాసేశాను. నాటిక ఎలా రాయాలో తెలీకుండానే నలభై నిమిషాల నాటిక రాసేశాను. ఇదంతా చేస్తున్నప్పుడు  నా సబ్ కాన్షస్  మైండ్ అందిస్తూ పోయిన క్రియేటివిటీ మాదకద్రవ్యాల్లాంటి మత్తులా నన్నావహించింది... మత్తు నన్ను రచయితగా మార్చేసింది
-
నికోలస్ కజన్  
       
ఇంతకంటే సంతృప్తికరమైన వృత్తి నాకు తోచదు. రాసే దినచర్య నాలుగు గోడల మధ్య  బందీ చేస్తుంది. సినిమా తీయడం పూర్తిగా వేరు, అది బయటి లోకంలోకి రప్పిస్తుంది. అటు ఇటూ రెండు సంబంధిత లోకాల్లో జీవించడం నాకు సరిపోయే వృత్తే : ఏకాంతంలో రాయడం, సమూహంలో తీయడం!
-
అకివా గోల్డ్స్ మాన్
       
నేను చిన్న పిల్లగా ఉన్నప్పుడే మా ఇంగ్లీషు టీచరు నువ్వు రైటర్ అవ్వాలని ఎప్పుడూ అంటూ వుండేది. ఎనిమిదేళ్ళప్పటి నుంచే నేను రచయిత్రినైనట్టు కలల్లో మునిగి తేలిపోతూ వుండే దాన్ని. నేను రాయాలంటే ఇంకో జాబ్ చేసుకుంటూ రాత్రి పూట మాత్రమే రాసుకోగలిగే పరిస్థితుల్లేకుండా, రచనే జీవితంగా చేసుకుని రంగాన్ని ఎన్నుకోవాలా అని ఆలోచిస్తున్నప్పుడు,  సినిమాలపై నాకున్న వ్యామోహం అటు వైపు లాగింది.  ఇక వృత్తీ ప్రవృత్తుల సంగమంలాగా సినిమా రంగమే నాకు బెస్ట్ ఆప్షన్ అయింది.
- లెస్లీ డిక్సన్  
       
సినిమా సెట్ మిలిటరీ ఏరియా  లాంటిది. అక్కడ జరిగే కార్యకలాపాల్లో రచయితగా మీకెలాటి పాత్రా లేదు. అందుకని మీరక్కడికి వెళ్తే మిమ్మల్ని వింత జీవిలా చూస్తారు.
-మార్క్ కీఫ్
       
ఎప్పుడూ మామూలు చైర్లో కూర్చోండి....ఇదీ కొత్త రచయితలకి నేనిచ్చే సలహా. పెద్ద కుర్చీని  ప్రొడ్యూసరో, డైరెక్టరో కూర్చోవడానికి వదలండి...
-
జాన్ డి. బ్రాన్ కాటో
       
రచయితగా నా జీవితంలో సగభాగం, బహుశా ముప్పాతిక వంతు, నేను రాసింది తిరగరాయడంతోనే గడిచిపోయింది. నాకు ప్రత్యేకమైన టాలెంట్ వుందని అనుకోను, కానీ అసాధారణ  స్టామినా ఏదో నాకుందని నాకు తడుతూ వుంటుంది.
-జాన్ ఇర్వింగ్