Q: సికిందర్ గారూ, ‘పాలపిట్ట’ సాహిత్య మాస పత్రికలో
‘విస్మృత సినిమాలు’ శీర్షిక కింద మీరు రాస్తున్న మరుగున పడిన పాత తెలుగు సినిమాల
విశ్లేషణలు సూపర్. వాటిలో తెలుసుకోవాల్సినవి ఎన్నో వుంటున్నాయి. అయితే ఆ పత్రిక
సరిగ్గా లభ్యం కావడం లేదు. రెగ్యులర్ గా పత్రిక పొందాలంటే ఏం చేయాలంటారు?
―దర్శకుడు, టాలీవుడ్
A: థాంక్స్, మీ శ్రద్ధకి. పత్రిక మార్కెట్లో
అన్ని చోట్లా దొరకదు. విశాలాంధ్ర, నవోదయ షాపుల్లో దొరుకుతుంది. పత్రికకి చందాదారుల
విస్తృత నెట్ వర్క్ వుంది. మూడొందల యాభై చందా కడితే ఏడాది పాటు పత్రిక ఇంటికే
వస్తుంది. ఈ చిరునామాకి పంపండి : మేనేజర్, పాలపిట్ట, 16 -11 – 20 / 6 / 1 / 1, 403
విజయసాయి రెసిడెన్సీ, సలీం నగర్, మలక్ పేట, హైదరాబాద్ – 500 036, ఫోన్ : 040
27378430.
Q: ‘నువ్వు తోపురా’ రివ్యూలో అది బయోపిక్ గా తీశారని నిర్మాత
చెప్పినట్టు మీరు రాశారు. అలా తీయడం వల్ల వచ్చిన తేడా ఏమిటి? రెగ్యులర్ సినిమాలు
బయోపిక్ లా తీయకూడదంటారా? వివరించగలరు.
―అశోక్, టాలీవుడ్
A: బయోపిక్ అంటే ఒకవ్యక్తి జీవిత చరిత్ర. జీవిత చరిత్రలు సినిమాల్లాగా అన్ని హంగులతో సర్వాంగ సుందరంగా వుండవు. జీవితమే కలర్ఫుల్ సినిమాలాగా వుండేడ్వక సతాయిస్తూంటుందెప్పుడూ. నిజ జీవితాల్ని సినిమాగా తీస్తే ఆర్ట్ సినిమా అనే చిప్ప చేతికొస్తుంది. నిజ జీవితాల్ని ఆ వ్యక్తి జీవితం ఎలా సాగిందో అలా నిజ సంఘటనలతో వాస్తవికంగా తీయాల్సిందే తప్ప, లవ్ - యాక్షన్ - కామెడీ - డాన్సులూ అంటూ మసాలా నూరిపోస్తే నవ్విపోతారు. కాకపోతే బయోపిక్స్ విషయంలో ఒకటి చేస్తారు. అది మరీ ఆర్ట్ సినిమాలా తయారవకుండా ఓ సినిమాగా ఆడేందుకు ఒక పని చేస్తారు : ఆ వ్యక్తి జీవితాన్ని మలుపు తిప్పిన ప్రధాన సమస్య ఒకటి తీసుకుని, దాంతో ఎలా సంఘర్షించాడో / సంఘర్షించిందో, ఫలితంగా ఏం సాధించాడో / సాధించిందో - ఆ జీవితంలో వున్న నిజ సంఘటనలు ఏర్చి కూర్చి - త్రీయాక్ట్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్లో ఇమిడ్చి, కమర్షియాలిటీ కల్పిస్తారు. అంటే నిజ జీవితాన్ని - బయోపిక్ ని - సినిమాగా ఆడించుకోవాలన్నా దాన్ని ‘సమస్య - సంఘర్షణ – పరిష్కార’ మనే త్రీయాక్ట్ స్ట్రక్చర్ తోనే చూపించాలన్న మాట. ఇలాకాక జీవితంలో జరిగిన అన్ని సంఘటనలూ అనుభవాలూ ఎపిసోడిక్ గా చూపించుకుంటూ పోతే అది సినిమా అవదు, డాక్యుమెంటరీ అవుతుంది. ఇది టీవీకి పనికొస్తుంది, సినిమాకి కాదు. అలాగే త్రీయాక్ట్ స్ట్రక్చర్ లో బయోపిక్ సినిమాకే పనికొస్తుంది, టీవీ ఫిలింగా తీయడానికి కాదు. అయితే త్రీ యాక్ట్ స్ట్రక్చర్ లో సినిమాగా తీసిన బయోపిక్ ని టీవీలో ప్రసారం చేయొచ్చు. ఈటీవీ మార్గదర్శి ప్రోగ్రాంలో అమితాబ్ బచ్చన్ మీద రెండు భాగాల ‘బయోపిక్’ ఈ వ్యాసకర్త రాసినప్పుడు, డాక్యుమెంటరీగానే రాయాల్సి వచ్చింది. కాకపోతే ప్రారంభం ‘కూలీ’ షూటింగ్ సందర్భంగా అమితాబ్ తీవ్రంగా గాయపడిన ఆసక్తికర సంఘటనతో ఎత్తుకున్నాం. ఇదే సినిమా కోసం బయోపిక్ అనుకుంటే, అమితాబ్ జీవితంలో ఓ ప్రధాన సమస్య తీసుకుని, దాంతో సంఘర్షించిన విధం చూపించాల్సి వుంటుంది.
―అశోక్, టాలీవుడ్
A: బయోపిక్ అంటే ఒకవ్యక్తి జీవిత చరిత్ర. జీవిత చరిత్రలు సినిమాల్లాగా అన్ని హంగులతో సర్వాంగ సుందరంగా వుండవు. జీవితమే కలర్ఫుల్ సినిమాలాగా వుండేడ్వక సతాయిస్తూంటుందెప్పుడూ. నిజ జీవితాల్ని సినిమాగా తీస్తే ఆర్ట్ సినిమా అనే చిప్ప చేతికొస్తుంది. నిజ జీవితాల్ని ఆ వ్యక్తి జీవితం ఎలా సాగిందో అలా నిజ సంఘటనలతో వాస్తవికంగా తీయాల్సిందే తప్ప, లవ్ - యాక్షన్ - కామెడీ - డాన్సులూ అంటూ మసాలా నూరిపోస్తే నవ్విపోతారు. కాకపోతే బయోపిక్స్ విషయంలో ఒకటి చేస్తారు. అది మరీ ఆర్ట్ సినిమాలా తయారవకుండా ఓ సినిమాగా ఆడేందుకు ఒక పని చేస్తారు : ఆ వ్యక్తి జీవితాన్ని మలుపు తిప్పిన ప్రధాన సమస్య ఒకటి తీసుకుని, దాంతో ఎలా సంఘర్షించాడో / సంఘర్షించిందో, ఫలితంగా ఏం సాధించాడో / సాధించిందో - ఆ జీవితంలో వున్న నిజ సంఘటనలు ఏర్చి కూర్చి - త్రీయాక్ట్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్లో ఇమిడ్చి, కమర్షియాలిటీ కల్పిస్తారు. అంటే నిజ జీవితాన్ని - బయోపిక్ ని - సినిమాగా ఆడించుకోవాలన్నా దాన్ని ‘సమస్య - సంఘర్షణ – పరిష్కార’ మనే త్రీయాక్ట్ స్ట్రక్చర్ తోనే చూపించాలన్న మాట. ఇలాకాక జీవితంలో జరిగిన అన్ని సంఘటనలూ అనుభవాలూ ఎపిసోడిక్ గా చూపించుకుంటూ పోతే అది సినిమా అవదు, డాక్యుమెంటరీ అవుతుంది. ఇది టీవీకి పనికొస్తుంది, సినిమాకి కాదు. అలాగే త్రీయాక్ట్ స్ట్రక్చర్ లో బయోపిక్ సినిమాకే పనికొస్తుంది, టీవీ ఫిలింగా తీయడానికి కాదు. అయితే త్రీ యాక్ట్ స్ట్రక్చర్ లో సినిమాగా తీసిన బయోపిక్ ని టీవీలో ప్రసారం చేయొచ్చు. ఈటీవీ మార్గదర్శి ప్రోగ్రాంలో అమితాబ్ బచ్చన్ మీద రెండు భాగాల ‘బయోపిక్’ ఈ వ్యాసకర్త రాసినప్పుడు, డాక్యుమెంటరీగానే రాయాల్సి వచ్చింది. కాకపోతే ప్రారంభం ‘కూలీ’ షూటింగ్ సందర్భంగా అమితాబ్ తీవ్రంగా గాయపడిన ఆసక్తికర సంఘటనతో ఎత్తుకున్నాం. ఇదే సినిమా కోసం బయోపిక్ అనుకుంటే, అమితాబ్ జీవితంలో ఓ ప్రధాన సమస్య తీసుకుని, దాంతో సంఘర్షించిన విధం చూపించాల్సి వుంటుంది.
ఇలా సినిమాగా ఆడేందుకు నిజ జీవితాల్నే త్రీయాక్ట్ స్ట్రక్చర్ లో పెట్టి తీయాల్సి వ స్తున్నప్పుడు,
ఇక రెగ్యులర్ గా వచ్చే కమర్షియల్ సినిమాల్లో కల్పిత హీరోయిజాల కథలకి ఇంకెంత త్రీ
యాక్ట్ స్ట్రక్చర్ వుండాలి!! ఇది గుర్తించకపోవడం వల్లే ఎవరి ‘యాక్ట్’ ప్రకారం వాళ్ళు స్ట్రక్చర్ లేని సొంత
క్రియేటివిటీలతో యాక్టింగులు చేస్తూ దెబ్బతిని పోతున్నారు. ‘నువ్వు తోపురా’ కామన్
మాన్ బయోపిక్ అని నిర్మాత అన్నారంటే ఏదో ఈ బయోపిక్ ల ట్రెండ్ లో బిజినెస్ కోసం అన్నారులే
అనుకుంటాం. కానీ నిజంగానే బయోపిక్ లాగే తీయబోయారు.
కల్పిత పాత్రతో బయోపిక్ ఏమిటి, బయోపిక్ అంటే నిజంగా జీవించిన మనిషి కథతో కదా
వుండాలి - అన్న హద్దుల్ని కూడా చెరిపేయదల్చుకున్నారు. ఇక భక్తి సినిమా కూడా ఇలాగే తీస్తారేమో, దేవుళ్ళని
చూపించకుండా ‘నువ్వు తోపురా’ హీరో పాత్ర సూరినే దేవుడిగా చూపిస్తూ భక్తి సినిమా అంటారేమో! రూల్స్ ని ఇలా బ్రేక్
చేస్తారేమో కొంపదీసి.
‘నువ్వు తోపురా’ బయోపిక్ లాగే
తీయబోయారని అనడమెందుకంటే, అలా బయోపిక్ లా తీయడంలో కూడా విఫలమైనందుకే. బయోపిక్ లా
తీయాలనుకుని వుంటే త్రీ యాక్ట్స్ లో తీసేవాళ్ళు.
తీస్తున్నది సహజ జీవితమని దాన్ని సహజ జీవితంలాగే ఆర్ట్ సినిమాలా తీసేశారు. ఆర్ట్
సినిమా ఎవరు చూస్తారు? ఇటీవలే ఇలాటిదే ఇంకోటి జరిగింది. హీరోయిన్ పాత్రతో బయోపిక్
అంటూ రాసుకొచ్చాడు. తను సృష్టించిన ఆ పాత్ర పేరు ఏదో లత. ఆ లత బయోపిక్ అట. ఫిక్షన్
పాత్రతో బయోపిక్ ఏంట్రా నాయనా అంటే, వెళ్ళిపోయి
దాంతోబాటే మాయమైపోయాడు. ఈ బయోపిచ్చి రాతలతో ఎక్కడికి పోతున్నారంటే – ‘జగదేక వీరుడు
అతిలోక సుందరి’ లో జంధ్యాల రాసినట్టు - ఎక్కడికో వెళ్ళిపోతున్నారు...
Q: హలో సర్, మీ ఆర్టికల్స్ ఫిలిం మేకర్స్
కాగోరేవారికి చాలా హెల్ప్ చేస్తున్నాయి. అయితే మా నుంచి మీకు కొన్ని రిక్వెస్ట్స్:
1. ఈ మధ్య స్క్రీన్ ప్లే టిప్స్ పెడుతున్నారు కదా, వాటిలో ఒకదాంట్లో ఇప్పుడు
సినిమా కథంటే హీరోహీరోయిన్ల కథలే అన్నారు. మిగతా కథల్లేవన్నారు. దీన్ని
వివరించగలరు. హీరోహీరోయిన్ల కథల్లో ఇంకా కొత్తగా ఏం చెప్పొచ్చు? ఇతర భాషల్లో ఇవెలా
వుంటున్నాయి? వేరే ఫ్యామిలీ కథలు వగైరా ఎలా డీల్ చేస్తున్నారు? ఆర్టికల్ రాయగలరు.
2. ఈ మధ్య వచ్చిన ‘జెర్సీ’ గానీ ‘మజిలీ’ గానీ లోపాలున్నా అవి హిట్టయ్యాయి. వీటి స్క్రీన్ ప్లే సంగతులు రాయగలరు. ఇప్పటికే స్క్రీన్ ప్లే సంగతులు చాలా రాశాం మళ్ళీ ఎందుకంటారు గానీ, ఒక విషయం ఏంటంటే, మీరు కనీసం హిట్టయిన మూవీస్ కైనా స్క్రీన్ ప్లే సంగతులు రాస్తే మాకు చాలా హెల్ప్ అవుతుంది.
3. ఇతర భాషల్లో హిట్టవుతున్న సినిమాల విశ్లేషణలు వారం వారం రాస్తే, మీతో బాటు మేమందరం అప్డేట్ అవుతూంటాం. ఇది చాలా ఇంపార్టెంట్ సర్. మేం క్వాలిటీ సినిమాల గురించి డిస్కషన్స్ పెట్టుకోవాలంటే మీరే మంచి సోర్స్. ఇవన్నీ మీ మీద అభిమానంతో, మీరు మాకు ఒక గురువుగా అనుకుని, స్క్రిప్ట్స్ రైటింగ్ గురించి, మూవీ మేకింగ్ గురించీ, ఇంకా తెలుసుకోవాలని ఇలా మెసేజి పెడుతున్నాం. మీ బ్లాగుని రెగ్యులర్ గా ఫాలో అవుతున్నాం. మీ వల్ల మాకు మంచే జరిగింది సర్, వుయ్ లవ్యూ.
―టాలీవుడ్ నుంచి పేరు రాయలేదు
A: మీ పేరు రాయలేదు. ముందుగా
ఒక స్పష్టత తెచ్చుకుందాం : ప్రేమ లేఖలు రాయడం మానేయండి, పెడర్ధాలొస్తాయి. ఇక పేర్లు
రాయని ప్రశ్నలకి సమాధానాలివ్వడం కష్టమై పక్కకు పెట్టేస్తున్నాం. ఇదేం డాక్టర్ సమరం
శీర్షిక కాదు, పేర్లు రాయకపోతే అర్ధం జేసుకోవడానికి. సెల్ఫీల కాలంలో పేర్లు
దాయడమేమిటి. పేర్లు వెల్లడిస్తే మిమ్మల్ని పట్టుకుని గాలం వెయ్యం. గాలాలు వేసే గాలి
పనులు ఈ బ్లాగు చేయడం లేదు. ఒక్క దర్శకుల ప్రశ్నలకి మాత్రమే పేర్లు దాస్తున్నాం.
ఇతరులకి ఈ మినహాయింపు లేదని గమనించగలరు. అలాగే ఈ ‘గురువుగారు’ సంబోధనలు ఆపొచ్చు.
మనకెవరూ గురువుల్లేరు, మేమెవ్వరికీ గురువులం కాం. మీలాగే ఎడ్యుకేట్ అవడానికి
ప్రయత్నిస్తున్నాం.
ఇక మొదటి ఐటెంకి సమాధానం - ఇది మా చిన్నప్పుడే విన్నాం, ఎవరన్నారో గుర్తుకు రావడం లేదుగానీ, ఓ సినిమా ప్రముఖుడే సినిమా కథంటే హీరో హీరోయిన్లదే అన్నారు. నిజమే కదా, ప్రేక్షకులు హీరోహేరోయిన్లని చూడ్డానికే సినిమా కొస్తారు. మరి కథ వాళ్ళ మీద లేకపోతే ఎలా? యూ ట్యూబులో ఏ పాత సినిమా చూసినా, ఏ జానర్ కథైనా, హీరోహీరోయిన్ల మీదే వుంటుంది. ఇక ఒక హీరో, ఇద్దరు హీరోయిన్లు, లేదా ఇద్దరు హీరోలు, ఒక హీరోయిన్ వుంటే చెప్పాల్సిన పనే లేదు. కమర్షియల్ సినిమాలకి గ్లామర్ కోషేంట్ హీరోహేరోయిన్లే. రానురానూ ఇందులోంచి హీరోయిన్ తప్పిపోయింది. సినిమా కథంటే హీరోకీ విలన్ కీ మధ్య హీరోయిజాల కథగా మారిపోయింది. హీరోయిన్ నామ్ కే వాస్తే మిగిలింది. సెకండాఫ్ లోనైతే పాటల కోసమే వచ్చి పోతూంటుంది. గర్ల్స్ జీవితంలో చాలా ముందుకెళ్ళి పోతున్నారు. చాలా ఉన్నత స్థానాలకి చేరుకుంటున్నారు. సినిమాల్లో చూద్దామంటే ఆలోచనలో, ప్రవర్తనలో ఏ మాత్రం పరిపక్వత లేని, తాము ఐడెంటిఫై చేసుకోలేని నేలబారు హీరోయిన్ పాత్రలు కన్పిస్తూంటాయి. హీరోయిన్ పాత్రలతో ఈ ‘కమ్యూనికేషన్ గ్యాప్’ ని భరిస్తూ, హీరోయిజాల మేల్ సెంట్రిక్ సినిమాలు చూడాల్సి వస్తోంది. గర్ల్స్ తమ చదువుల్లో, వృత్తుల్లో వొంటరిగా ఎదుర్కొంటున్న సమస్యలకి సమాధానంగా ఒక్క హీరోయిన్ పాత్రనైనా చూసి సంతృప్తి పడదామంటే సాధ్యమయ్యే పరిస్థితి లేదు.
కాబట్టి ఒకప్పుడున్న ఏ సాంప్రదాయాన్ని వదిలేసుకుని ఈ పరిస్థితికి సినిమా లొచ్చాయో తెలుస్తోంది. ఇదిమంచిదే అనుకుంటే ఇలాగే కొనసాగవచ్చు. లేదంటే మళ్ళీ బయల్దేరిన చోటు నుంచి ప్రారంభం కావొచ్చు. హీరో హీరోయిన్లతో ఏ కథలు చేస్తారన్నది కాదు ముఖ్యం, హీరోయిన్ పాత్రల్ని గర్ల్స్ ఆశయాలకి ఎంత దగ్గరగా తీసికెళ్తారన్నది పాయింటు. దీని మీద ప్రత్యేకంగా ఆర్టికల్ రాయనవసరం లేదు. హీరోతో బాటు హీరోయిన్ కి ప్రాధాన్యమున్న సినిమాలు చాలా వున్నాయి. అవి సెర్చ్ చేసి చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు హిందీలో మూస ఫార్ములాని భూస్థాపితం చేశాక, హీరోయిన్ పాత్రలు ప్రయోజనకరంగా, పవర్ఫుల్ గా, ఆలోచనాత్మకంగా వస్తున్నాయి.
2. స్ట్రక్చర్ సంగతులు, ఆ స్ట్రక్చర్ తో స్క్రీన్ ప్లే సంగతులు మేం రాసి రాసి వున్నాక, ఈ పాటికి మీకు ‘శాస్త్రం’ తెలిసిపోయి వుండాలి. అప్పుడు ఈ నాలెడ్జితో మీరు సినిమాలు చూస్తూంటే, ఇంకా స్క్రీన్ ప్లే సంగతులు మీకవసరం లేదు. సినిమాల్ని తెలిసిపోయిన స్ట్రక్చర్ ప్రకారం మీరే విశ్లేషించెయ్య వచ్చు. అందుకని రెగ్యులర్ గా అన్నిటికీ స్క్రీన్ ప్లే సంగతులు రాయడం లేదు, రివ్యూల వరకే రాస్తున్నాం. ఎన్నో సినిమాలకి స్క్రీన్ ప్లే సంగతులు రాశాక, ఇంకా మీకు స్క్రీన్ ప్లే నాలెడ్జి అబ్బక పోతే స్క్రిప్టు లెలా రాస్తున్నారు. కాబట్టి ఇకపైన అన్ని సినిమాలకి స్క్రీన్ ప్లే సంగతులు ఆశించవద్దు. ఒక్క సినిమాకి స్క్రీన్ ప్లే సంగతులు రాయాలంటే చాలా శ్రమ వుంటుంది. రోజులు పడుతుంది. ఇది రాయాలి, రాయక తప్పదు అన్పించినప్పుడు రాస్తూ వుందాం.
3. ఈ బ్లాగుని తెలుగు, హిందీ, అప్పుడప్పుడు హాలీవుడ్ సినిమాలకే పరిమితం చేశాం. ఇతర భాషల్లో హిట్టవుతున్న సినిమాల విశ్లేషణలు కూడా రాయాలంటే అసాధ్యం, ఇక ఇతర పనులు చేయలేం. మీరన్నట్టు రాస్తే మీతోబాటు మేమూ అప్డేట్ అయ్యే మాట నిజమే. ఇవ్వాళ నాలెడ్జి తో బాటు ఆ నాలెడ్జిని అప్డేట్ చేసుకుంటూ వుండడం చాలా అవసరమే. అయితే ఈ అప్డేట్స్ అన్నీ రాస్తూ కూర్చోవడమంటే సాధ్యమయ్యే పని కాదు. అప్పటికీ స్ట్రక్చర్ అప్డేట్స్ అంటూ ఇస్తూనే వున్నాం. ఇతర భాషల సినిమాల్లో పనికొచ్చే ముక్క ఏదైనా వుంటే నోట్ చేసి పెట్టుకుంటాం. సందర్భం వచ్చినప్పుడు ప్రస్తావిస్తాం. అంతేగానీ సినిమాలకి సినిమాలు విశ్లేషణలు రాసేంత అవసరం లేదు. ఒక్కటి గుర్తు పెట్టుకోండి. ఫ్యాషన్ కోసం నానా సినిమాలన్నీ చూడకండి, ఫ్యాషన్ కోసం డిస్కషన్స్ పెట్టుకోకండి, ఫ్యాషన్ కోసం ఇంకా ఇంకా విశ్లేషణలూ మన్నూమశానం చదవకండి. ఈ యాక్టివిటీస్ కి అంతుండదు. ఇవన్నీ చేస్తూ ఏం చేద్దామని? ఇది వ్యసనంగా మారితే మీరు చేయాల్సిన అసలు పని చేయలేరు. కాబట్టి వీటిని పరిమితం చేసుకుని, వర్క్ లోకి దిగండి. స్క్రిప్టు రాయండి, స్క్రిప్టు రాయండి, స్క్రిప్టు రాయండి, రాయడం గురించి ఆలోచించండి...
Q: స్క్రీన్ ప్లే టిప్స్ (పోస్ట్ నెం : 817) లో ‘నువ్వు తోపురా’
గురించి రాసింది చదివాను. ఆ పాత్ర నైతిక
ప్రాతిపదిక సరీగ్గా లేదని రాశారు. మరి ఏం చేస్తే బావుండేదంటారు?
―సుదర్శన్, టాలీవుడ్
A: బ్లాగులో హాలీవుడ్ ‘బేబీ డ్రైవర్’ ఆధునిక స్క్రీన్ ప్లే సంగతులు (802,
803, 805) చదివారా? ఆ బేబీ గాడు కావాలని నేరాలు పూసుకోలేదు. కుట్రలు పన్న లేదు. తల్లి
మరణంతో చాలా బాధాకర బాల్యం వెన్నాడుతూంటే, దారి చూపించేవాళ్ళు లేక, కనిపించిన
విలన్ దగ్గర అప్పుచేసి, ఆ అప్పు తీర్చడానికి ఆ విలన్ ఆపరేషన్స్ కోసమే కారు డ్రైవర్
గా చేరి బ్యాంకు దోపిడీల్లో సహకరించాల్సి వచ్చింది. ఇలా ఈ అప్పు వరకూ తీర్చేసి బయటపడి,
హీరోయిన్ తో మంచి జీవితం గడుపుదామనుకుంటే, మళ్ళీ ఆ విలన్ ట్రాప్ చేశాడు. బేబీ డ్రైవర్ దోపిడీ
జాబ్స్ కి సహకరించి ఎంత విలన్ బాకీ తీర్చేసినా, ఆ దోపిడీ జాబ్స్ లో తనూ భాగస్థుడైనందుకు,
చట్టంతో తీర్చుకోవాల్సిన బాకీ మిగిలే వుంది. ఈ బాకీ తీర్చే నైతిక ప్రాతిపదికతోనే మిగతా
కథా యానం.
మంచోడు కుట్రలు పన్నడు. బేబీ డ్రైవర్ కుట్రలు పన్నలేదు. పరిస్థితులవల్ల ఇరుక్కుని విలన్ కుట్రలకి సహకరించాడు. అందులోంచి బయటపడాలని ప్రయత్నించి పోలీసులకి దొరికి శిక్ష అనుభవించాడు. ఇలా కథ ప్రతిపాదిస్తున్న నైతిక విలువల్ని మన్నించాడు.
‘నువ్వు
తోపురా’ హీరో కూడా మంచోడే. అమెరికా వెళ్లి తిరిగి రాలేక ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్ గా కంటిన్యూ
అవుదామనుకున్నాడు. ఇంతవరకూ ఓకే. బేబీ డ్రైవర్ కూడా విధిలేక విలన్ కి పడ్డ బాకీ తీర్చడానికి
ఇల్లీగల్ పనులు చేశాడు. కానీ మన తోపు ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్ ఆలోచనతో ఆగక, గ్రీన్ కార్డు
అనుకున్నాడు, దాని కోసం బోగస్ పెళ్లి అనుకున్నాడు, దీనికి డబ్బుకోసం డ్రగ్స్ దందా అనుకున్నాడు.
ఈ కుట్రలన్నీ చేశాడు. ఎక్కడా చట్టానికి దొరక్కుండా తప్పించుకున్నాడు. దీంతో కథ నైతిక
ప్రాతిపదిక గతితప్పి పోయింది.
మరేం చేసి వుండాలి? బేబీ డ్రైవర్ ని మళ్ళీ విలన్ వచ్చి ఇరికించినట్టు, తోపుని డ్రగ్ మాఫియా ఇరికించి వాడుకోవాలి. మంచోడు కుట్రలు చేయకూడదు, కుట్రల్లో ఇరుక్కోవాలి. ఇది అమల్లో వున్న సినిమా కథా రచనా నీతి.
―సికిందర్