Why has Scandinavia been producing such good
thrillers? Maybe because their filmmakers can't afford millions for CGI and
must rely on cheaper elements like,you know,stories and characters.
―Roger Ebert, film
critic
ఇప్పుడు నార్డిక్ నోయర్ ఈ కోవలో చేరుతోంది. మిగతా ఏ జానర్ సినిమాలకీ ఓ ప్రామాణీకరించిన కళా విలువలంటూ వుండవు. ప్రేమ సినిమాలని ఎలాగైనా తీసుకోవచ్చు, కుటుంబ సినిమాల్ని ఎలాగైనా తీసుకోవచ్చు. కామెడీ, యాక్షన్, హార్రర్ మొదలైన సినిమాలు, ఆఖరికి క్రైం థ్రిల్లర్ సినిమాలు కూడా ఎలాగైనా తీసుకోవచ్చు. ఆయా దర్శకుల క్రియేటివిటీలతో. అయితే వీటన్నిటిలో ఒక్క క్రైం థ్రిల్లర్స్ కి మాత్రమే కళాత్మకంగా కొన్ని ప్రత్యేక కొలమానాలని నిర్ధారిస్తూ ప్రతిపాదనలు చేశారు. ఈ ప్రతిపాదనలే నోయర్ జానర్ కి దారితీశాయి. ఈ నోయర్ జానర్ ఫ్రెంచి నుంచి హాలీవుడ్ కి, ఆ తర్వాత స్కాండినేవియాకీ ప్రాకింది. ఇండియాలో బాజీ అనే ఫిలిం నోయర్, మనోరమ సిక్స్ ఫీట్ అండర్, జానీ గద్దర్, మక్బూల్, షైతాన్, మున్నారియిప్పు, అరణ్యకాండం, 16 డి, ఇంకా మరెన్నో హిందీ, తమిళ, మలయాళ నియోనోయర్ సినిమాలు వచ్చాయి. తెలుగులో జాడలేదు.
ఉత్తర యూరప్ లోని కొన్ని దేశాల సముదాయాన్ని నార్డిక్ దేశాలని పిలుస్తారు. డెన్మార్క్, ఫిన్లాండ్, స్వీడెన్, నార్వే, అలెండ్ ఐలాండ్, ఫరో ఐలాండ్, స్కాండినేవియా మొదలైన ఏడు మినీ దేశాలు కలిసి నార్డిక్ దేశాలయ్యాయి. 1990 లలో స్కాండినేవియాలో హెన్నింగ్ మాంకెల్ అన్న రచయిత, వాలండర్ అనే పోలీస్ అధికారి పాత్రతో రాస్తూ పోయిన క్రైం నవలలు నోర్డిక్ నోయర్ జానర్ ప్రారంభానికి దారి తీశాయి. ఈ జానర్ ని సృష్టించడానికి మళ్ళీ అమెరికా మీదే ఆధారపడ్డారు. ప్రసిద్ధ అమెరికన్ క్రైం నవలా రచయిత ఎడ్ మెక్ బెయిన్ (1926 -2005) రాసిన పోలీస్ ప్రోసీజురల్ క్రైం నవలలే నార్డిక్ నోయర్ కి మూలమయ్యాయి. స్కాండినేవియా క్రైం జానర్ కి కొత్త ద్వారాలు తెరుస్తూ, నవలలుగా, టీవీ సిరీస్ గా, చలనచిత్రాలుగా, సొంత ఐడెంటిటీతో ‘స్కాండీ నోయర్’ అన్పించుకునే స్థాయికి చేరిందీ జానర్. పక్కదేశాలూ దీన్ని అనుసరించాయి. ఖండాంతర దేశాల ప్రేక్షకుల్లో, పాఠకుల్లో విపరీతమైన క్రేజ్ పెంచేసిన గ్లోబల్ బ్రాండ్ కూడా అయింది.
టీవీ సీరీసులు, సినిమాలూ తరచుగా ప్రభుత్వ నిధులతో నిర్మాణాలు జరుపుకుంటాయి. నార్డిక్ దేశాలు సినిమా వ్యాపారానికి అతి చిన్న ఏరియాలు. కాబట్టి బ్లాక్ బస్టర్స్ ని తీయాలని అనుకోరు. తమ సంస్కృతీ సంప్రదాయాల్ని సజీవంగా వుంచేందుకే సినిమాలు తీస్తారు. బాగా తీయాలి, ఎక్కువ మంది ప్రేక్షకులకి చేరాలి - అనే దృష్టే వుంటుంది తప్ప, ధనార్జన మీద ఆసక్తి వుండదు. రేటింగ్స్ ని పట్టించుకోరు.
నార్డిక్ నోయర్ సినిమాలు విరివిగా నెట్లో దొరుకుతాయి. నార్డిక్ నోయర్ నవలల వ్యాపారం ఇప్పుడు మల్టీమిలియన్ డాలర్ వ్యాపారంగా మారింది. వేర్ రోజెస్ నెవెర్ డై, ది క్రో గర్ల్, డైయింగ్ డిటెక్టివ్ లాంటి నవలల్ని గుండెలుగ్గబట్టుకుని చదవాలి. అలాగే ది హంట్, హెడ్ హంటర్స్, జార్ సిటీ వంటి సినిమాలు రక్తం గడ్డకట్టిస్తాయి. అమెరికన్ నోయర్ సినిమాలు ఒకెత్తు, నార్డిక్ నోయర్ మరొకెత్తూ. అమెరికన్ నోయర్ కథలు సంపన్న వర్గాల రాత్రి భాగోతాల వ్యక్తిగత కథలుగా వుంటే, నార్డిక్ నోయర్ కథలు సామాజిక - వ్యవస్థాగత రుగ్మతలకి కూడా విస్తరిస్తాయి, నైసర్గిక నేపథ్యాలతో. పైన చెప్పుకున్న నార్డిక్ నోయర్ 10 ఎలిమెంట్స్ తో – ప్రామాణీకరించిన కళా విలువలతో – అంటే జానర్ మర్యాదలతో కూడి వుంటాయి.
ఈ 10 ఎలిమెంట్స్ లో ఒక్క మంచు ప్రాంతాల నైసర్గిక స్వరూపం తీసేస్తే, మిగిలిన వాటిని ఇంకే ఇతర ప్రాంతాల చలనచిత్రాలకైనా అన్వయించుకోవచ్చు. క్రైం జానర్ సినిమాలంటే ఒకడ్ని ఇంకొకడు చంపాడని, మరొకడు వాణ్ణి పట్టుకోవడానికి బయల్దేరే కాలక్షేప బఠానీలుగా తీస్తూంటేనే ప్రేక్షకులు చెత్తబుట్టలో విసిరేసి పోతున్నారేమో ఆలోచించాలి క్రియేటివ్ భయస్థులు. ‘క్రియేటివ్ భయస్థులు’ భాష కరెక్ట్ కాదేమోగానీ, విషయం కూడా కరెక్ట్ కాదు. వాళ్ళ క్రియేటివ్ పరికల్పనల్లో స్వేచ్ఛ అనేదే పరదా తొలగించుకుని కాస్త తొంగి చూడదు. భయమే బుసలు కొడుతూవుంటుంది. ఈ గీత దాటితే ఏమవుతుందో ఏమో - నల్గురు పోతున్న అట్టర్ ఫ్లాపుల బాటలోనే మనమూ సామిరంగా అనుకుంటూ పోదామనే క్రియేటివ్ భయాలే స్వర్గసీమలా వుంటాయి. పైకి క్రియేటివ్ స్వేచ్ఛ గురించి చాలామాట్లాడతారు. చేతల్లో క్రియేటివ్ భయాలు వెండితెర మీద భాంగ్రా వేస్తూంటాయి. రోజురోజుకీ ముందు కెళ్ళిపోతున్న ఎంటర్ టైన్మెంట్ మెంట్ రంగం, దాంతో పాటూ ఈలేసుకుంటూ వలస వెళ్ళిపోతున్న ప్రేక్షకులూ, వున్నచోటే ఎక్కడేసిన గొంగళిలా వుండిపోతే, తమకెంత బాగుండునని కలలుంటాయి.
తెలుగు సినిమాల్లో డిటెక్టివ్ పాత్ర మార్కెట్ యాస్పెక్ట్ కాదు పక్కన పెడదాం, పోలీస్ పాత్రని ప్రొఫెషనల్ గా చిత్రించవచ్చు. పోలీస్ ప్రొసీజురల్ కథలతో వాస్తవిక క్రైం థ్రిల్లర్స్ తీయవచ్చు. పైన చెప్పిన నార్డిక్ జానర్ మర్యాదలతో వీటిని అలంకరించవచ్చు. ముఖ్యంగా నేటివిటీ విషయం. కథ జరిగే ప్రాంతపు ఫీల్ ని పట్టుకోవడం. ఒక వూళ్ళో కథ జరిగితే ఆ వూరి ఫీల్ ఒకటుంటుంది. అది విజువల్స్ లో పలకాలి. మనోరమ సిక్స్ ఫీట్ అండర్ నోయర్ లో బీహార్లో ఒక గ్రామాన్ని దాని వ్యక్తిత్వంతో చూపించారు. కథకి తగ్గ మిస్టీరియస్ వాతావరణం కూడా ఆ పరిసరాల్లో పట్టుకున్నారు. కథ అనుకున్నాక ప్రాంతాన్ని స్టడీ చేయాలి. నగరంలో ఒక కావచ్చు, గ్రామంలో కావొచ్చు. నగరంలో చిక్కడపల్లి అయితే చిక్కడపల్లి నేటివిటీని స్టడీ చేసి అది పలికేలా సీన్లు రాసుకోవాలి. ఏదైనా గ్రామంలో నైతే అక్కడి నేటివిటీని విజువలైజ్ చేస్తూ సీన్లు రాసుకోవాలి. విజువల్ బ్యాక్ డ్రాప్ నోయర్ సినిమాలకెంతో బలాన్నిస్తుంది.
ఇక ఆ ప్రాంతంలో సామాజిక స్థితిని కూడా పరిశీలించాలి. దాన్ని కథలో మిళితం చేసుకోవాలి. కథలో వుండే అనుకూల, వ్యతిరేక శక్తుల్ని ఆ సామాజిక వాతావరణంలో జాగ్రత్తగా సెటప్ చేయాలి.
నోయర్ జానర్ అంటే అన్నిటినీ తొక్కిపారేసుకుంటూ వెళ్ళిపోయే రొడ్ద కొట్టుడు రోడ్డు రోలర్ మూస ఫార్ములా కాదు. ఎత్తు పల్లాలతో దేని ఉనికిని అది చాటుకునేలా చేసే ఆడియెన్స్ ఫ్రెండ్లీ జానర్. గ్లోబల్ యుగం ప్రపంచంలో దేని అస్తిత్వాన్నీమిగల్చకుండా చదును చేసి పారేసింది. దీని మీద పాత్రికేయుడు థామస్ ఎల్ ఫ్రీడ్మన్ ‘వరల్డ్ ఈజ్ ఫ్లాట్’ అన్న గొప్ప పుస్తకం రాశాడు. చదునైపోతున్న జీవితాల్ని నీరుపోసి పెంచి పోషించేవి నోయర్ జానర్లే. అమెరికన్ నోయర్ సంపన్నవర్గాల హిపోక్రసీని తీసుకుంటే, నార్డిక్ నోయర్ సామాజిక వాతావరణాన్ని బ్యాక్ డ్రాప్ గా చేసుకుంది. బ్యాక్ డ్రాప్స్ లేని క్రైం జానర్లు డొల్ల పిల్ల వేషాలే.
స్కాండినేవియా థ్రిల్లర్
సినిమాల స్క్రిప్టింగ్ టూల్స్ ని అర్ధం జేసుకుంటే,
లో - బడ్జెట్ లో
తెలుగులో తీసి విఫలమయ్యే
థ్రిల్లర్స్ ని ప్రేక్షకుల హృదయాలకి
అతి చేరువగా తీసికెళ్ళే ప్రయత్నం చేయవచ్చు. స్కాండినేవియా క్రైం సాహిత్యంలో 1990
లలో ప్రారంభమైన నార్డిక్ నోయర్
అనే జానర్, అక్కడి
సినిమాల్లోకి రావడం 2008 నుంచి మొదలయింది. నోయర్ జానర్ 1940 లలోనే ఫ్రాన్సులో ఫిలిం
నోయర్ గా ప్రాణం పోసుకున్నాక, వెంటనే హాలీవుడ్
అందిపుచ్చుకుని, స్టార్స్ తో
సైతం వందలాది ఫిలిం నోయర్
సినిమాలు తీసింది. ఫిలిం నోయర్
జానర్ ప్రధానంగా డిటెక్టివ్ సినిమాలు. దీనికి
చాలా
వరకూ డెషెల్ హెమెట్, జేమ్స్ మెక్
కెయిన్ లు రాసిన ఘాటైన డిటెక్టివ్ నవలల్ని
తీసుకుని హాలీవుడ్ లో ఫిలిం
నోయర్ సినిమాలు తీస్తూపోయారు.1960 లలో
కలర్ సినిమాలతో దీని
పేరు నియో నోయర్
గా మారిపోయింది. స్టార్స్ తో తీస్తున్న ఈ నోయర్ సినిమాలని
కుర్ర హీరోహీరోయిన్లతో తీయడంతో టీనేజి నోయర్ అనే సబ్ జానర్ పుట్టింది. ఇదంతా -
ఫిలిం- నియో- టీనేజీ నోయర్ల గురించి బ్లాగులో గతంలో తెలుసుకున్నదే. ‘బ్లడ్
సింపుల్’, ‘బ్రిక్’ అనే నియో నోయర్, టీనేజీ నోయర్ సినిమాల్ని విశ్లేషించుకున్నదే.
ఇప్పుడు నార్డిక్ నోయర్ ఈ కోవలో చేరుతోంది. మిగతా ఏ జానర్ సినిమాలకీ ఓ ప్రామాణీకరించిన కళా విలువలంటూ వుండవు. ప్రేమ సినిమాలని ఎలాగైనా తీసుకోవచ్చు, కుటుంబ సినిమాల్ని ఎలాగైనా తీసుకోవచ్చు. కామెడీ, యాక్షన్, హార్రర్ మొదలైన సినిమాలు, ఆఖరికి క్రైం థ్రిల్లర్ సినిమాలు కూడా ఎలాగైనా తీసుకోవచ్చు. ఆయా దర్శకుల క్రియేటివిటీలతో. అయితే వీటన్నిటిలో ఒక్క క్రైం థ్రిల్లర్స్ కి మాత్రమే కళాత్మకంగా కొన్ని ప్రత్యేక కొలమానాలని నిర్ధారిస్తూ ప్రతిపాదనలు చేశారు. ఈ ప్రతిపాదనలే నోయర్ జానర్ కి దారితీశాయి. ఈ నోయర్ జానర్ ఫ్రెంచి నుంచి హాలీవుడ్ కి, ఆ తర్వాత స్కాండినేవియాకీ ప్రాకింది. ఇండియాలో బాజీ అనే ఫిలిం నోయర్, మనోరమ సిక్స్ ఫీట్ అండర్, జానీ గద్దర్, మక్బూల్, షైతాన్, మున్నారియిప్పు, అరణ్యకాండం, 16 డి, ఇంకా మరెన్నో హిందీ, తమిళ, మలయాళ నియోనోయర్ సినిమాలు వచ్చాయి. తెలుగులో జాడలేదు.
ఉత్తర యూరప్ లోని కొన్ని దేశాల సముదాయాన్ని నార్డిక్ దేశాలని పిలుస్తారు. డెన్మార్క్, ఫిన్లాండ్, స్వీడెన్, నార్వే, అలెండ్ ఐలాండ్, ఫరో ఐలాండ్, స్కాండినేవియా మొదలైన ఏడు మినీ దేశాలు కలిసి నార్డిక్ దేశాలయ్యాయి. 1990 లలో స్కాండినేవియాలో హెన్నింగ్ మాంకెల్ అన్న రచయిత, వాలండర్ అనే పోలీస్ అధికారి పాత్రతో రాస్తూ పోయిన క్రైం నవలలు నోర్డిక్ నోయర్ జానర్ ప్రారంభానికి దారి తీశాయి. ఈ జానర్ ని సృష్టించడానికి మళ్ళీ అమెరికా మీదే ఆధారపడ్డారు. ప్రసిద్ధ అమెరికన్ క్రైం నవలా రచయిత ఎడ్ మెక్ బెయిన్ (1926 -2005) రాసిన పోలీస్ ప్రోసీజురల్ క్రైం నవలలే నార్డిక్ నోయర్ కి మూలమయ్యాయి. స్కాండినేవియా క్రైం జానర్ కి కొత్త ద్వారాలు తెరుస్తూ, నవలలుగా, టీవీ సిరీస్ గా, చలనచిత్రాలుగా, సొంత ఐడెంటిటీతో ‘స్కాండీ నోయర్’ అన్పించుకునే స్థాయికి చేరిందీ జానర్. పక్కదేశాలూ దీన్ని అనుసరించాయి. ఖండాంతర దేశాల ప్రేక్షకుల్లో, పాఠకుల్లో విపరీతమైన క్రేజ్ పెంచేసిన గ్లోబల్ బ్రాండ్ కూడా అయింది.
***
‘నార్డిక్ నోయర్ ఆక్స్ ఫర్డ్ రీసెర్చి ఎన్ సైక్లోపీడియా’
ప్రకారం, ఈ జానర్ లో పోలీస్ నేరపరిశోధక కథలుంటాయి. వీటికి నేపధ్యంగా-
1.
క్షీణించిన సామాజిక విలువలుంటాయి.
2. సమానాధికారవాదుల పక్షపాతం, ద్వేషం వుంటాయి.
3. హీరోలు యాంటీ హీరోలుగా వుంటారు. వాళ్ళ వృత్తులతో, బలహీనతలతో సతమతమయ్యే - జీవితంలో అన్నివిధాలా దెబ్బతిన్న యాంటీ హీరోలు. ప్రైవేట్ డిటెక్టివ్ లు, లేదా పోలీస్ డిటెక్టివ్ లై వుంటారు. తమ జీవితాలు దగాపడ్డా ఇతరులకి న్యాయం కోసం ఎన్నైనా త్యాగాలు చేస్తారు.
4. హీరోయిన్ పాత్రలు బలంగా వుంటాయి.
5. సకల భ్రష్టత్వంతతో, పరమ నికృష్టంగా విలన్లుంటారు.
6. హాలీవుడ్ కథల కంటే కటువుగా వుంటాయి వీటి కథలు.
7. వీటన్నిటినీ కలిపివుంచే డార్క్ మూడ్ తో – రక్తాన్ని గడ్డకట్టించే మంచు ప్రాంతాలుంటాయి. రహస్యాల్ని కప్పెట్టుకున్న హిమ కుహరాలు. నైరాశ్యాన్ని కల్గించే నిర్జీవ మంచు మేటలు.
8. స్థానిక ఫీల్ తో కథ చెప్పే తీరుతెన్నులు వైవిధ్యభరితంగా వుంటాయి.
9. సంభాషణలు సూటిగా, సాదాగా వుంటాయి.
10. అక్కడి సంస్కృతీ సంప్రదాయాల్ని సజీవంగా వుంచుతాయి.

నార్డిక్ దేశాల్లో శీతాకాలం సుదీర్ఘంగా
వుంటుంది. పగలు తక్కువ, రాత్రి ఎక్కువ. ఉదయం పది గంటలకి తెల్లారుతుంది. మధ్యాహ్నం
రెండున్నరకి చీకటి పడిపోతుంది. దీంతో ఎక్కువమంది మనో మాంద్యానికి లోనై మద్యం
ఎక్కువ సేవిస్తారు. బలమైన, సురక్షితమైన మధ్యతరగతి వర్గముంది. ఖాళీ సమయాన్ని ఎలా
ఎంజాయ్ చేయాలో వాళ్లకి తెలుసు. శబ్ద, వాయు కాలుష్యాలు లేవు. నిశబ్దమే అక్కడి
శబ్దం. నిశ్శబ్దమే వాళ్ళ సంస్కృతి. నిశ్శబ్దమే వాళ్ళ కమ్యూనికేషన్. నిశ్శబ్దాన్ని
సంభాషణలతో భర్తీ చేసే అవసరం వాళ్ళకి రాదు. అమెరికన్లు మాట్లాడేంత వేగంగా మాట్లాడరు.
వాళ్ళు అంతర్ముఖీనులు కావొచ్చు, కానీ నిజాయితీ పరులు. తామేమిటో తమకి తెలిసిన
వాళ్ళు. ఇవన్నీ నార్డిక్ నోయర్ సినిమాల్లో వ్యక్తమవుతాయి. చీకట్లో మునిగి వుండే
కాలమే ఎక్కువ కాబట్టి, నార్డిక్ రచయితల్ని
అంతటి హింసాత్మక నేర కథలు రాసేందుకు పురిగొల్పి వుండొచ్చు. కానీ ఇతర దేశాల్లో కంటే
ఇక్కడ నేరాలు చాలా తక్కువ.
టీవీ సీరీసులు, సినిమాలూ తరచుగా ప్రభుత్వ నిధులతో నిర్మాణాలు జరుపుకుంటాయి. నార్డిక్ దేశాలు సినిమా వ్యాపారానికి అతి చిన్న ఏరియాలు. కాబట్టి బ్లాక్ బస్టర్స్ ని తీయాలని అనుకోరు. తమ సంస్కృతీ సంప్రదాయాల్ని సజీవంగా వుంచేందుకే సినిమాలు తీస్తారు. బాగా తీయాలి, ఎక్కువ మంది ప్రేక్షకులకి చేరాలి - అనే దృష్టే వుంటుంది తప్ప, ధనార్జన మీద ఆసక్తి వుండదు. రేటింగ్స్ ని పట్టించుకోరు.
***
ఈ జానర్ అమెరికా దాకా ప్రాకి ది
కిల్లింగ్స్, ది బ్రిడ్జి వంటి నార్డిక్ నోయర్ టీవీ సిరీస్ రిమేక్ అవడం
మొదలెట్టాయి. 2011 లో ఆస్కార్ అవార్డు దర్శకుడు (‘ది క్యూరియస్ కేస్ ఆఫ్ బెంజమిన్
బటన్’) డేవిడ్ ఫించర్, ఆస్కార్ అవార్డు రచయిత (షిండ్లర్స్ లిస్ట్) స్టీవెన్
జిలియన్ లు కలిసి ‘ది గర్ల్ విత్ ది డ్రాగన్
టాటూ’ అనే నార్డిక్ నోయర్ నవలని విజయవంతమైన హాలీవుడ్ మూవీగా తీసి సంచలనం సృష్టించారు
(బడ్జెట్ – 90 మిలియన్ డాలర్లు, రెవిన్యూ 232.6 మిలియన్ డాలర్లు). ఇందులో జేమ్స్
బాండ్ హీరో డేనియల్ క్రేగ్, రూనీ మారాలు నటించారు.
నార్డిక్ నోయర్ సినిమాలు విరివిగా నెట్లో దొరుకుతాయి. నార్డిక్ నోయర్ నవలల వ్యాపారం ఇప్పుడు మల్టీమిలియన్ డాలర్ వ్యాపారంగా మారింది. వేర్ రోజెస్ నెవెర్ డై, ది క్రో గర్ల్, డైయింగ్ డిటెక్టివ్ లాంటి నవలల్ని గుండెలుగ్గబట్టుకుని చదవాలి. అలాగే ది హంట్, హెడ్ హంటర్స్, జార్ సిటీ వంటి సినిమాలు రక్తం గడ్డకట్టిస్తాయి. అమెరికన్ నోయర్ సినిమాలు ఒకెత్తు, నార్డిక్ నోయర్ మరొకెత్తూ. అమెరికన్ నోయర్ కథలు సంపన్న వర్గాల రాత్రి భాగోతాల వ్యక్తిగత కథలుగా వుంటే, నార్డిక్ నోయర్ కథలు సామాజిక - వ్యవస్థాగత రుగ్మతలకి కూడా విస్తరిస్తాయి, నైసర్గిక నేపథ్యాలతో. పైన చెప్పుకున్న నార్డిక్ నోయర్ 10 ఎలిమెంట్స్ తో – ప్రామాణీకరించిన కళా విలువలతో – అంటే జానర్ మర్యాదలతో కూడి వుంటాయి.
ఈ 10 ఎలిమెంట్స్ లో ఒక్క మంచు ప్రాంతాల నైసర్గిక స్వరూపం తీసేస్తే, మిగిలిన వాటిని ఇంకే ఇతర ప్రాంతాల చలనచిత్రాలకైనా అన్వయించుకోవచ్చు. క్రైం జానర్ సినిమాలంటే ఒకడ్ని ఇంకొకడు చంపాడని, మరొకడు వాణ్ణి పట్టుకోవడానికి బయల్దేరే కాలక్షేప బఠానీలుగా తీస్తూంటేనే ప్రేక్షకులు చెత్తబుట్టలో విసిరేసి పోతున్నారేమో ఆలోచించాలి క్రియేటివ్ భయస్థులు. ‘క్రియేటివ్ భయస్థులు’ భాష కరెక్ట్ కాదేమోగానీ, విషయం కూడా కరెక్ట్ కాదు. వాళ్ళ క్రియేటివ్ పరికల్పనల్లో స్వేచ్ఛ అనేదే పరదా తొలగించుకుని కాస్త తొంగి చూడదు. భయమే బుసలు కొడుతూవుంటుంది. ఈ గీత దాటితే ఏమవుతుందో ఏమో - నల్గురు పోతున్న అట్టర్ ఫ్లాపుల బాటలోనే మనమూ సామిరంగా అనుకుంటూ పోదామనే క్రియేటివ్ భయాలే స్వర్గసీమలా వుంటాయి. పైకి క్రియేటివ్ స్వేచ్ఛ గురించి చాలామాట్లాడతారు. చేతల్లో క్రియేటివ్ భయాలు వెండితెర మీద భాంగ్రా వేస్తూంటాయి. రోజురోజుకీ ముందు కెళ్ళిపోతున్న ఎంటర్ టైన్మెంట్ మెంట్ రంగం, దాంతో పాటూ ఈలేసుకుంటూ వలస వెళ్ళిపోతున్న ప్రేక్షకులూ, వున్నచోటే ఎక్కడేసిన గొంగళిలా వుండిపోతే, తమకెంత బాగుండునని కలలుంటాయి.
***
ఇందుకే క్రైం జానర్ కి కాస్తయినా సామాజిక గోడచేర్పు వుండాలంటే గొప్ప సందేహంలో పడిపోతారు.
ఒకడ్ని ఇంకొకడు చంపాడు, వాణ్ణి ఇంకొకడు పట్టుకుంటాడు చాలు, దీన్ని పిచ్చ కామెడీ చేయొచ్చుగా అనే చైల్డిష్
ఆలోచనలు. హిందీలో పింక్, షైతాన్ వంటివి, తమిళంలో 16 డి, సామాజిక గోడచేర్పు వల్లే నోయర్
థ్రిల్లర్స్ గా అంత కొత్తానుభూతినిచ్చాయి ప్రేక్షకులకి. కొత్తగా తెచ్చిపెట్టుకున్న
ఈ గ్లోబల్ సంస్కృతిలో రాత్రి పూట యూత్ ఏం చేస్తూంటారో, వాటి పరిణామాలేమిటో
చూపించిన ఈ నయా థ్రిల్లర్స్ కి అంతగా
కనెక్ట్ అయ్యారు యూత్. అల్లాటప్పా ఫార్ములా డ్రామా మూస కథలకి యూత్ కనెక్ట్ అయ్యే
రోజులుపోయాయి స్మార్ట్ ఫోన్ల కాలంలో. ఎప్పుడో ‘ఇది నిజంగా జరిగిన కథ’ అంటూ ఎవరైనా తీసినా
అవీ మూస ఫార్ములా టెంప్లెట్స్ గానే వుంటున్నాయి.

―సికిందర్