ఓ కొత్త దర్శకుడు వెళ్లి
కథ చెప్తే నమ్మేస్తారు హీరోలు, నిర్మాతలు. అదే ఒక కొత్త రచయిత వెళ్లి కథ చెప్తే
నమ్మరు. కొత్త దర్శకుడికి తెలిసిందేమిటి, కొత్త రచయితకి తెలియని దేమిటి? రచన
చేయడానికి కొత్త దర్శకుడికి వున్న
అర్హతలేంటి, కొత్త రచయితలకి లేని అర్హతలేంటి? కొత్త దర్శకుడు కొత్త రచయితతో ఎందులో
గొప్పవాడు? కొత్త దర్శకుడొచ్చి గందరగోళంగా ‘వీరభోగ వసంత రాయలు’ కథ చెప్పేస్తే
అద్భుతమైన వాడా? ఒకరు కాదు, ముగ్గురు హీరోలు పోటీలు పడి నటించేస్తారా? కొత్త
దర్శకుల కథల టాలెంట్ కి ‘వీరభోగ వసంతరాయలు’ పరాకాష్ట! దీనికి రేటింగ్ 1 కాదు, జీరో
ఇచ్చినా ఎక్కువే. కొత్తవాళ్ళు దర్శకుడి లేబిల్ తగిలించుకుంటే రచయితలై పోతారా? అన్ని
హక్కులు, అధికారాలు వచ్చేస్తాయా? హీరోలు,
నిర్మాతలు రచయితల కథలు తీసుకునే సాంప్రదాయం ఇరవై ఏళ్ల క్రితమే ముగిసిపోయింది, అదివేరు.
ప్రత్యాన్మాయంగా ఆ స్థాయి కథలు వింటున్నారా అంటే అంత ఓపిక లేదు. అదే 90 % అట్టర్ ఫ్లాపులతో
దశాబ్దాలు గడిపేస్తున్నారు. అట్టర్ ఫ్లా పులకి కారణం రచనలా, దర్శకత్వాలా? రచయితల్ని
చంపేసిన ఈ ట్రెండ్ లో కొత్త బచ్చా దర్శకుడు కూడా రచయితల్ని చులకనగా చూస్తున్నాడు. రాసుకోలేక
తను తీసేది అట్టర్ ఫ్లాపే. అది తెలుసుకోడు. మరిన్ని వీరభోగ వసంత రాయళ్ళు
తీయాల్సిందే. ఎన్ని తీస్తే అన్ని బండారాలు బయటపడి మూతబడతారు. ‘కథ – మాటలు –
స్క్రీన్ ప్లే – చాదస్తం’ అని వేసుకోలేక
వాళ్ళే పారిపోతారు.
***