సినిమా అంటే ఇష్టం, కానీ సినిమా తీసే విద్యని శాస్త్రీయంగా అభ్యసించవచ్చు అని తెలీదు. హైదరాబాద్ ఎన్నో ఆశలతో వచ్చేయటం. ఇక్కడ సహాయకుడిగా పనిచేయటానికి కూడా అవకాశం దొరకదు. దానికి తోడు రాయటం రాదు, మనల్ని మనం చదవటంలో మొద్దు నిద్ర పోయే కాలం. సినిమా పట్ల శాస్త్రీయంగా అవగాహన వున్న కొందరు వాడే పదాలు అర్ధం కాక ప్రమోద్ అనే మిత్రుడ్ని అడిగితే ఆంధ్రభూమి - వెన్నెల అని చెప్పాడు. అది ఒక్క శుక్రవారమే బాగా అమ్ముడుపోయేది. ఆ ఒక్క రోజు కోసం వారమంతా పేపర్ వేయించుకునే స్థితి, స్తోమత లేదు. అవి దొరక్క పోతే కిలోమీటర్లకి కిలోమీటర్లు పత్రికాఫీసుకు తిరిగిన రోజులున్నాయి. చదువు మీద అంత ఆసక్తి ‘వెన్నెల’ సినిమా పేజీలో ఒకరి రచనా శైలి వల్ల కలిగింది. ఆ వాసనే అంటి ప్రస్తుతం ఇలా రాయగల్గుతున్నది. ఆయన పేరు సికిందర్. ఆయన పంచిన ఆ విఙ్ఞానమే ఈ రోజు విద్యని అభ్యసించి ఇంకొకరికి చెప్పగలిగే స్థాయినిచ్చింది. సికిందర్ గారికి సదా కృతఙ్ఞతలు. ఆయన వల్ల సిడ్ఫీల్డ్, జేమ్స్ బానెట్, రాబర్ట్ మెకీ లాంటి వాళ్ల పేరులు, ఇంటర్నెట్ వల్ల కొన్ని వివరాలు, వాల్డేన్, పంజాగుట్ట బుక్ స్టోర్ లాంటి వాటి వల్ల కొన్ని పుస్తకాలూ దొరికాయి. వి.బి చౌదరి గారు 15 రోజులు క్లాసులు చెప్పి, ఆయన దగ్గరున్న పుస్తక సంపద నుండి పుస్తకాలు జీరాక్స్ చేసుకునే అవకాశం ఇచ్చారు. ఆయనకి కృతఙ్ఞతలు. అప్పుడు కష్టం వుండేది. అదంతా ఇష్టపడిందే. చదువు మనిషికి అవసరం. పని చేయటం రాని వాడు పనికిమాలిన వాడు కావచ్చు, కానీ చదువు రాని వాడు అఙ్ఞాని. అలాంటి నన్ను అఙ్ఞానం నుండి తెలుసుకోవటం వైపు ప్రయాణించేలా చేసిన ఈ ఇద్దరు సీనియర్లకి మరొక్కసారి కృతఙ్ఞతలు.
‘షాషంక్ రిడెంప్షన్’ - ఏమిటి
ఈ సినిమా
గొప్పతనం. ఏముంది
అందులో? ఐ.ఎం.డి.బి
రేటింగ్లో
గాడ్ఫాదర్
సినిమాతో పోటీపడే స్థాయి ఆ
సినిమాకి ఎలా
వచ్చింది. ఆ చిత్రం
చర్చించిన విలువలేమిటి? విలువలు లేకుండా కథలు
రాయకూడదా? విలువలు లేకుండా మనిషి
బ్రతకొచ్చు - చచ్చే
లోపు వచ్చే
ఇబ్బంది వుండదు
కానీ విలువల
గురించి చర్చించకుండా సినిమా రాయడం
రచనకే ద్రోహం
చెయ్యడం అవుతుంది. మనిషికి జీవితం
పై నమ్మకం
కలిగించటమే రచన
ప్రధాన ఉద్దేశం. అలాంటపుడు విలువలు లేకుండా రాస్తే
దాన్ని మనం
మాత్రం బతకడానికే రాస్తున్నట్టు. విలువలున్న కథని మెచ్చని ప్రేక్షకుడు వుండడు. పోస్టర్ పైన
"నిరాశ/భయం
నిన్ను బందీని
చేస్తుంది, ఆశ/నమ్మకం
నీకు విముక్తినిస్తుంది" అని
థీం చెప్పేసారు. భయం
- నమ్మకం అనే
విలువల ఆధారంగా నిర్మితమైంది ఈ
చిత్ర కథ.
థీంని కనిపెట్టటం ఒక అసాధారణమైన పని. అది
బయటికి చెప్పటం అంటే ఆ
రచన మీద
ఎంత నమ్మకం.
కథా ప్రారంభం
- మొదటి
అంకం (బిగినింగ్):
కథానాయకుడు ఆండీ డుఫ్రెన్ భార్యని, ఆమె ప్రియుడ్ని హత్య చేసిన నేరం కింద న్యాయ విచారణకి హాజరవుతాడు. అతడు తాను నిర్దోషిని అంటాడు, న్యాయస్థానం అతన్ని దోషిగా పరిగణించి రెండు జీవితకాలాలు కారాగారంలో ఉండేలా శిక్ష విధిస్తారు. భార్య ఆమె ప్రియుడు పాల్పడిన పని తాప్పే అయినా, హత్య అంతకన్నా పెద్ద నేరం కనుక అతనికి ఆ శిక్ష విధిస్తారు. న్యాయస్థానం ముందు మనం అల్పులం. దాన్ని ఎదురించే శక్తి మనకి వుండదు. అలా కథ ప్రారంభం అవుతుంది.
రెడ్ జైల్లో ఖైదీలకి కావల్సిన సిగరెట్లు లాంటి ఏ వస్తువైనా సరఫరా చేస్తాడు. అతని విడుదల అర్జీ నిరాకరించబడుతుంది. ఏరియల్ షాట్లో ఆండీ ఇతర ఖైదీలు జైలు ప్రవేశం సన్నివేశం. ఆండీ జైలుకి వచ్చినపుడు నన్ను "రీటా హేవర్త్ని జైలుకి పట్టుకు రాగలవా అని అడిగాడు, అది సమస్యే కాదని" చెప్పానని చెప్తాడు రెడ్. బయట ఆండీ బాంక్ వైస్ ప్రెసిడెంట్ అని చెప్తాడు రెడ్, ప్రస్తుతం ఖైదీ.
నేరం
చేసిన ఆండీ
తను నేరస్తుడ్ని కాదని చెప్తాడు కానీ కోర్టు
విధించిన శిక్షని అతను మౌనంగా
అంగీకరిస్తాడు. అతనిపై
ఒక జాలి
భావం మొదలవుతుంది. ఇదే
పాత్రపై మంచి
వాడని భావన
కలిగించాల్సిన సమయం...క్రమంగా ఆ
మంచి ఏ
స్థాయిలో
వుందో పరీక్షలు ఎదురవటం ద్వారా
మనకి అర్ధం
అవుతుంది. మంచి
అంటే కథా విలువల్ని అనుసరించి - దీన్నే కన్సర్న్ అంటారు - తర్వాత
ఆసక్తి కలిగించే సన్నివేశం రావాలి. క్యూరియాసిటీ (కథపై ఆసక్తి ) + కన్సర్న్ (హీరో
ధీరుడు లేక
అమాయకుడు, గొప్పవాడు మొత్తానికి మంచివాడు అనే భావన) కలిస్తే సస్పెన్స్ (ఉత్కంఠ) ఏర్పడుతుంది - . క్యూరియాసిటీ ఒకటే మిస్టరీని (రహస్యం), కన్సర్న్ డ్రమెటిక్ ఐరనీని (నాటకీయ విపర్యయం) కలుగజేస్తుంది.
పోస్టరేమో నమ్మకం బలమైనది అని చెప్తుంది. ఇక్కడ బయటపడతామనే ఆశ కనిపించదు. జైలు ప్రధానాధికారి నార్టన్ (వార్డెన్) క్రూరుడు, మతగ్రంధం - క్రమశిక్షణ తప్ప మరొక ఊసొద్దు అంటాడు. సాటి మనిషిని చిన్న విషయాలకే హింసిస్తూ, భక్తి భోదించడమేంటి, హింసించే వాడు భగవంతుడ్ని ఎలా ఆరాధించగలడు, అది భక్తి కాదు కేవలం ఆర్భాటం. అభేద్యమైన రక్షణ కలిగిన జైలు, విడుదలకి అనుమతివ్వని అధికారుల్ని తప్పించుకుని లేదా విడుదలయి హీరో ఎలా బయటకొస్తాడు? నేరస్తులు క్రూరులైన వ్యక్తుల మధ్య అతనెంత కాలం వుండగలడు...ఇది క్యూరియాసిటీ.
జైల్లో స్వలింగ సంపర్కులు ఆండీ పై బలాత్కారం చేస్తారు, రెడ్ ఒక్కడ్నే ఆండీ నమ్ముతాడు. అతడ్ని రాళ్లు కొట్టే సుత్తి అడుగుతాడు. జైల్లో సొరంగం తవ్వాలంటే 600 ఏళ్లు పడుతుంది ఆ పని మానుకోమని చెప్తాడు రెడ్. జైల్లో ఖైదీలకి కావల్సిన వస్తువులెలా రెడ్ సరఫరా చేస్తాడో చూస్తాం. జైలు జీవితం రోజువారీ విధులు విసుగుని కలిస్తాయి అని రెడ్ చెప్తాడు.
రెండో అంకం (మిడిల్ -1) :
రెడ్
పరిచయాల వల్ల
ఆండీ, కొందరు
ఖైదీలు భవనం
పై కప్పుని బాగు చేసే
పనిలో ఎంపిక
చేయబడతారు. జైలు ప్రధాన
రక్షణాధికారి హాడ్లీకి (ఛీఫ్ గార్డ్) టాక్స్ చెల్లింపు పట్ల అవగాహన కలుగజేసి అతని
నమ్మకం చూరగొంటాడు. అతని
వల్ల మొదటిసారి జైల్లో స్వేఛ్చని అనుభవిస్తారు అతని
తోటి ఖైదీలు.
జైల్లో గిల్డా అనే సినిమా చూస్తుండగా, ఆండీ రెడ్ని రీటా హేవర్త్ని(హీరోయిన్) జైలుకి తీసుకురాగలవా అంటాడు. రీటాహేవర్త్ అనేది ఆశకి సంకేతంగా వాడారు. సిస్టర్స్ అనే స్వలింగ సంపర్కులు ఆండీ పై అత్యాచారం చేయబోతారు...ఆ సందర్భంలో గొడవ జరిగి ఆండిని కొడతారు. ఆండీతో సహా అందరిని చీకటిగదిలో ఉంచుతారు. హాడ్లీ అనే అధికారికి విషయం తెలిసి సిస్టర్స్ని దండిస్తాడు. చీకటిగది నుండి ఆండీ రాగానే అతనికి చదరంగం దళాలు (పీసెస్) తయారు చేయటానికి కావల్సిన రాళ్లని, రీటా హేవర్త్ పోస్టర్ని రెడ్ బహుకరిస్తాడు.
జైలు
వార్డన్ తనిఖీ
చేయటానికి వచ్చినపుడు ఆండీ చెప్పే
మార్క్ 13:35,
నార్టన్ చెప్పే
జాన్ 8:12 వాక్యాలు సందర్భోచితం.
"ఇంటి యజమాని ఏ పొద్దు వస్తాడో తెలీదు కనుక జాగ్రత్త వహించు. వాస్తవానికి ఇది ఆధ్యాత్మికంగా చెప్తే శరీరం ఇల్లు అది నాశనమయ్యేది, దాని యజమాని మరణం కనుక అది వచ్చేలోపు భగవంతునిపై దృష్టి పెట్టు అని అర్ధం. మతమేదైనా భోదించేది మంచినే. రెండో చెప్పేది ఒకటి అధికారి మాటల్లో శ్లేష మనకి ఇంకో అర్ధాన్ని స్ఫురింపజేస్తుంది. ఆండీని లాండ్రీ నుండి లైబ్రరీకి మారుస్తారు. జైలు అధికారులు ఆర్ధిక విషయాల్లో ఆండీ సలహాలు స్వీకరిస్తారు. లైబ్రరీలో పని చేసే ముసలి వ్యక్తి (బ్రూక్స్) జైలు నుండి విడుదలవుతాడు. విడుదల అవటాన్ని జీర్ణించుకోలేని అతను తోటి ఖైధీపై హత్యాయత్నం చేయబోతాడు...అంతకు ముందు సన్నివేశంలోనే ఆరుగురు వార్డెన్లని చూచున ఖైదీ తను అని తెలుస్తుంది. విడుదలయ్యాక కొత్త వ్యక్తులు, కొత్త ప్రపంచంలో బతకలేక ఆత్మహత్య చేసుకుంటాడు. మనుషులు తాముండే ప్రదేశాలు, సాటి వ్యక్తులని ఒదిలి వెళ్లలేరు....బంధాలు అంత బలమైనవి మనల్ని బందీలు చేస్తాయి. ఆండీ
విన్నపాన్ని మన్నించి అతనికి లైబ్రరీకి పుస్తకాలు, డబ్బు జైళ్ల
శాఖ జైలుకి
పంపిస్తుంది.
గ్రాంఫోన్లో రికార్డ్ పెట్టి వార్డెన్ ఆగ్రహానికి గురవుతాడు. రికార్డ్ ప్లేయర్ నిన్ను తీసుకెళ్లనిచ్చారా అని వ్యంగ్యంగా అడిగిన ఖైదీతో సంగీతం హృదయంలో వుంది దాన్నెవరూ తీయలేరు అంటాడు. జైల్లో సంగీతం వినడం అర్ధమ్ లేనిదంటాడు రెడ్, ఇక్కడ అది అత్యంత అవసరం అంటాడు ఆండీ, ఆశని ఎవరూ అడ్డుకోలేరు అంటాడు. నమ్మకం అత్యంత భయంకరమైనది అని లేచి వెళ్లిపోతాడు రెడ్. మళ్లీ అతని విడుదల నిరాకరించబడుతుంది.
రెండో అంకం (మిడిల్ -2) :
లైబ్రరీని అభివృద్ధి చేస్తారు. ఆండీ ప్రయత్నాల వల్ల అదనపు
నిధులు సమకూరతాయి. jనార్టన్ అవినీతి. అతని
అవినీతి సొమ్ముని బాంక్లో
దాయటానికి ఆండీ
ఉపయోగపడతాడు. టామీ
పరిచయం. ఆండీ
టామీకి చదువు
నేర్పిస్తాడు. జైలు
జీవితం అత్యంత
నిదానంగా గడుస్తుంది, కాలాన్ని ఎవరి ఇష్టానికి తగినట్టు వారు
గడుపుతారు ఆండీ
లైబ్రరీ అభివృద్ధి చేసాడు, మళ్లీ టామీకి
చదువు నేర్పే
పనిలో పడ్డాడు అని రెడ్
చెప్తాడు - అతను
తన దారిలో
ఎదురైన ప్రతి
దాన్నీ సంస్కరిస్తూ వెళ్తున్నాడు. టామస్టన్ జైల్లో వున్నపుడు చివర్లో ఎల్మో బాచ్ సహ ఖైదీగా ఒకే గదిలో వున్నాం అప్పుడతను బాంకర్ భార్యని అతని ప్రియుడితో వున్నపుడు హత్య చేసానని చెప్పాడని టామీ చెప్తాడు. నార్టన్ అది నమ్మడానికి నిరాకరించి - అది కథని కొట్టి పడేస్తాడు, తాను నిరపరాధినని బలంగా వాదిస్తాడు - విడుదలయి బయటికి వెళ్ళాక నార్టన్ అవినీతి గురించి ఏమీ మాట్లాడనని చెప్తాడు - అది నార్టన్కి కోపం తెప్పిస్తుంది. ఆండీకి ఒక నెల ఏకాంతవాస శిక్ష విధిస్తాడు. టామీ చదువులో ఉత్తీర్ణుడవుతాడు. టామీ వాస్తవం ఎక్కడ బయటపెడతాడోనని అతన్ని చంపించేస్తాడు నార్టన్. ఆండీని కలిసి టామీ తప్పించుకోబోతుంటే కాల్చారని చెప్తాడు, ఆర్ధిక సలహాలు ఇవ్వనని ఆండీ అంటాడు, శిక్ష మరొక నెల పొడిగిస్తారు.
తన
భార్య తన
మనఃతత్త్వం వల్లే
చనిపోయిందని,
ఆమె మరణానికి కారణం తనే
అని భావిస్తుంటాడు ఆండీ. నువ్వు ప్రత్యక్షంగా ఆమెని చంపనపుడు హంతుకుడివి కాదు
అంటాడు రెడ్. ఇక్కడ నుండి
విడుదలైతే ఎక్కడికి వెళ్తాడో చెప్తాడు ఆండీ. రెడ్
మెక్సికో ఇక్కడ
లేదు అంటాడు, సరే
నువ్వు విడుదలైతే బక్సటన్ దగ్గర
ఓక్ చెట్టు
సమీపంలో రాయి
కింద ఒకటి
దాచిపెట్టి వుంది
అది కనిపెట్టు అంటాడు.
మధ్యాహ్నం భోజనాల సమయంలో ఆండీ అయోమయంలో వున్నట్టున్నాడు పిచ్చిగా మాట్లాడుతున్నాడు అంటే, అతనూ బ్రూక్స్లా ఆత్మహత్య చేసుకుంటాడేమో అంటారు కొందరు..ఒక ఖైదీ ఆండీ ఎప్పటికీ అలా చెయ్యడు అంటాడు. ఇంకో ఖైదీ అతను 6 అడుగుల తాడు అడిగితే ఇచ్చాను అంటాడు....ఆత్మహత్య చేసుకుంటాడని వాళ్లు భావిస్తూ ఆండీని జాగ్రత్తగా గమనించాలని అనుకుంటారు.
మూడో అంకం (ఎండ్) :
నార్టన్ అప్పజెప్పిన పని చేస్తాడు, అతని బూట్లకి పాలిష్ చేస్తాడు....ఆరడుగుల తాడు చేత్తో పట్టుకుంటాడు ఆండీ. రెడ్ అది తన జీవితంలో ఆ రాత్రి భారంగా గడిచిందని చెప్తాడు. యధావిధిగా గార్డ్లు పొద్దున ఖైదీల గదులు తెరుస్తారు. రెండో అంతస్తులో 245 వ గదిలో ఖైదీ కనపడటంలేదని చెప్తాడు గార్డ్. నార్టన్ తెల్లారి వచ్చి శుభ్రం చేసిన బూట్ల
అట్టపెట్టె తెరుస్తాడు.
దాన్లో
ఆండీ పాత
బూట్లు వుంటాయి. సైరన్
మోగుతుంది. నార్టన్ వింటాడు. ఆండీ
తప్పించుకున్నాడు. గదిలోకి వెళ్లినవాడు వెళ్లినట్టే వున్నాడు. ఎలా
మాయమయ్యాడు. అంతుచిక్కదు. ముగింపు ఇంత ఆసక్తికరంగా వుంటే ఎంత
థ్రిల్లింగ్గా
వుంటుంది. ఊహించని మలుపు ఇది. చనిపోతాడనుకున్నవాడు కనపడట్లేదు. కథని
ఎప్పుడు విప్పి
చెప్పాలో అప్పుడు చెప్తే కలిగే
ఆనందానికి పరాకాష్ఠలాంటి సినిమాల్లో ఇదొకటి. అత్యంత
అద్భుతమైన ముగింపు.
ముగింపు థ్రిల్ పోగొట్టకుండా వుండాలని రివీల్
చేయటం లేదు. రీటా హెవర్త్ లో రహస్యం
దాగుంది. వెతుకులాట ప్రారంభం అవుతుంది. దొరికేది అరిగిన
సబ్బు, మడ్డి గుడ్డలు, సుత్తి. 600 సంవత్సరాల్లో పూర్తయ్యే పని
అతను 20 ఏళ్లలో చేసాడు
అని చెప్తాడు రెడ్, ఎలా విమోచనం చెందాడో వివరిస్తాడు. వెళ్తూ
వెళ్తూ జైలుని
సంస్కరిస్తాడు. బ్యాంక్లో
దాచిన నార్టన్ అవినీతి సొమ్ము
ఏమైంది? నార్టన్ జీవితం ఏమైంది? చూచి
తీరాల్సిందే.
తప్పు
చేసినవాడు మాత్రమే శిక్ష అనుభవించడు, తప్పు
చేసామనే భావన
కూడా శిక్షిస్తుంది. అపరాధం
చేసామని భావించినంత కాలం మనం
శిక్ష అనుభవిస్తూనే వుంటాం. పాపం - బయటి
నుండి మనలోకి
ప్రవేశిస్తుంది,
అది అసహజమైనది. కాబట్టి మనల్ని
బందీని చేస్తుంది. నీలో సహజంగా
నిలిచి వున్న
నమ్మకం నిన్ను
విముక్తుడ్ని చేస్తుంది. సాటి మనిషిని హింసించేవాడు ఎన్ని
పూజలు చేసినా
విముక్తుడు కాడు, సాటి
మనిషికి మేలు
చేసేవాడే నిజమైన
మనిషి, అతడి
పైనే భగవంతుడి దృష్టి వుంటుంది. అతడే బంధం
నుండి విముక్తుడవుతాడు. స్వేచ్ఛని పొందుతాడు. ప్రతినాయకుడు బైబిల్ పట్టుకు తిరగటం, ఆ గ్రంధంలో వాక్యాలు ఉదహరించటం, కథానాయకుడు జైల్లో ఖైదీలని సంస్కరించటం, లైబ్రరీ అభివృద్ధి చేయటం, కష్టాలెదురైనా ఎదుర్కొని మంచిగా మెలగటం
యాదృఛ్ఛికం కాదు, కల్పితమే. ఈ కల్పనకి రచయితల మేధలో ఎంతో
మధనం జరిగి
వుండాలి . అదీ
కథ సారాంశం (Substance).
అదే థీం. ఇలాంటి
విషయ వస్తువునే రచయితలు ఎంచుకొని రాయాలి. ప్రేక్షకులు గ్రహించాలి. ఇది
గ్రహించాలంటే సినిమాని శాస్త్రీయంగా అభ్యసించాలి. చదవకుండా ఙ్ఞానం అబ్బదు. చదవకుండా, సాధన చేయకుండా డాక్టర్లు అవనట్టే - రచయిత అవ్వాలన్నా, దర్శకులవ్వాలన్నా సినిమాని శాస్త్రీయంగా అభ్యసించి, కఠోర
సాధన చేయాలి. నిరంతర శ్రమ
ద్వారానే లక్ష్యం సిద్ధిస్తుంది.
ముల్పూరి. ఆదిత్య చౌదరి