దర్శకత్వం
: విక్రం సరికొండ
కథ : వక్కంతం వంశీ, టెంప్లెట్ : దీపక్ రాజ్, మాటలు : శ్రీనివాస రెడ్డి , అడిషనల్ డైలాగ్స్ : రవి రెడ్డి, కేశవ్
తారాగణం : రవితేజ, రాశీ ఖన్నా, సీరత్ కపూర్, ఫ్రెడ్డీ దారూవాలా
సంగీతం : జామ్ 8, ఛాయాగ్రహణం : ఛోటా కే నాయుడు
బ్యానర్ : శ్రీ లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్
నిర్మాత : నల్లమలుపు బుజ్జి, వల్లభ నేని వంశీ
విడుదల : ఫిబ్రవరి 2, 2018
***
కథ : వక్కంతం వంశీ, టెంప్లెట్ : దీపక్ రాజ్, మాటలు : శ్రీనివాస రెడ్డి , అడిషనల్ డైలాగ్స్ : రవి రెడ్డి, కేశవ్
తారాగణం : రవితేజ, రాశీ ఖన్నా, సీరత్ కపూర్, ఫ్రెడ్డీ దారూవాలా
సంగీతం : జామ్ 8, ఛాయాగ్రహణం : ఛోటా కే నాయుడు
బ్యానర్ : శ్రీ లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్
నిర్మాత : నల్లమలుపు బుజ్జి, వల్లభ నేని వంశీ
విడుదల : ఫిబ్రవరి 2, 2018
***
ఇక త్వరత్వరగా సినిమాలు చేసెయ్యాలనుకుంటున్న
రవితేజ మూడు నెలలకల్లా మరో సినిమాతో వచ్చాడు. దీనికి కొత్త దర్శకుడికి అవకాశమిచ్చాడు.
పాత్రలు, నటన, కథలు కూడా మారకుండా అవే రిపీట్ చేస్తూ చేస్తూ మాస్ మహారాజా అన్పించుకుంటున్న
రవితేజకి, ఈ వ్యూహం ఇంకెంత కాలం వర్కౌటవుతుంది?
రవితేజ అంటే ఇదేనా, ఇంకేమైనా వుందా? మాస్ మహారాజా
మూస మహారాజాగా వుండి పోవాల్సిందేనా? ఇలా వుంటేనే చూస్తారా ప్రేక్షకులు? ఇప్పుడు ఇదే
వ్యూహంతో మళ్ళీ టచ్ చేసి చూడ మంటున్నాడా? ఏ
సంగతి ఈ కింద రివ్యూలో చూద్దాం ...
కథ
కార్తికేయ (రవితేజ) పాండిచ్చేరిలో వ్యాపారం చేస్తూంటాడు. కుటుంబం
వుంటుంది. కుటుంబం మీద ఈగ వాలనివ్వడు. పెళ్లి చేద్దామనుకుంటారు తల్లిదండ్రులు.
పెళ్లి చూపుల్లో పుష్ప (రాశీ ఖన్నా) ని చూస్తాడు. ఆమె కాదన్నా వెంటపడి తనకి పడేలా
చేసుకుంటాడు. ఆమె ఎందుకో అలుగుతుంది. వేరే పెళ్లి చూపులని నాటకమాడతాడు. ఆమె పూర్తిగా దూరమవుతుంది. ఇంతలో అతడి చెల్లెలు ఒక హత్య
చూస్తుంది. సాక్ష్యం చెప్పమని పోలీసుల దగ్గరికి తీసుకుపోతాడు. ఆమె చూసిన హంతకుడు
ఇర్ఫాన్ లాలా (ఫ్రెడ్డీ దారూవాలా) అని కార్తికేయకి తెలుస్తుంది. అంతలో అట్నుంచి పోతున్న ఇర్ఫాన్ లాలా వెంట పడతాడు. ఇర్ఫాన్
లాలా తప్పించుకుంటాడు. కార్తికేయ కమీషనర్ ( మురళీ శర్మ) కి ఫోన్ చేసి, ఐదేళ్ళ క్రితం చనిపోయిన ఇర్ఫాన్ లాలా ఎలా
బతికున్నాడని నిలదీస్తాడు. ఇక ఏసీపీ క్యాప్ పెట్టుకుని పోలీసు ఆఫీసర్ గా ఇంటర్వెల్
కి బయల్దేరతాడు. మనం కూడా బయల్దేరతాం.
ఇంతకీ ఎవరీ ఇర్ఫాన్ లాలా? ఇతడికీ కార్తికేయకీ ఏమ సంబంధముంది? గతంలో అసలేం జరిగింది? ఇవి తెలుసుకోవడానికి ఇంటర్వెల్ తర్వాత లోపలి కెళ్ళాలి.
ఇంతకీ ఎవరీ ఇర్ఫాన్ లాలా? ఇతడికీ కార్తికేయకీ ఏమ సంబంధముంది? గతంలో అసలేం జరిగింది? ఇవి తెలుసుకోవడానికి ఇంటర్వెల్ తర్వాత లోపలి కెళ్ళాలి.
ఎలా వుంది కథ
కథా?
అదేమిటి? కథేమైనా వుంటుందా తెలుగు సినిమాకి? వున్నా అదే పురాతన అరగదీసిన మూస
ఫార్ములా టెంప్లెట్ కాక వేరే ఏదైనా వుంటుందా? కథ ఎలా వుందని అడగడమంటే అమాయకత్వాన్ని వెళ్ళబోసుకోవడమే. అయితే
ఇక్కడ ఈ టెంప్లెట్ గురించే కొంత
చెప్పుకోవాలి. టెంప్లెట్ ని కూడా స్టార్
హీరోతో ‘బి’ గ్రేడ్ టెంప్లెట్ గా తీసేసిన ధైర్యానికి మెచ్చుకుని తీరాలి. టెంకాయ కొట్టక ముందే ఫస్టాఫ్ ఫ్లాప్, సెకండాఫ్
అట్టర్ ఫ్లాప్ అని తెలిసిపోయే 'బి' గ్రేడ్ టెంప్లెట్ ని, ‘ఏ’ గ్రేడ్ స్టార్ తో నిర్లక్ష్యంగా తీసి అవతల
పడేసే స్థాయికి చేరుకోవడమంటే మామూలు మాట కాదు. కోటప్పకొండ తిరునాళ్ళ ల్లో
రికార్డింగ్ డాన్స్ నాటకాల స్థాయికి టెంప్లెట్ కూడా పడిపోయింది. ఈ వ్యాసకర్త
ఇంటర్వెల్ కల్లా పారిపోయే ప్లానేస్తే, అవతల బండి తీయరాక మళ్ళీ బందీ అయిపోవాల్సివచ్చింది హారిబుల్
మహారాజాకి! ఇక శివరాత్రికి
కోటప్పకొండ కెళ్ళి నాల్గు రికార్డింగ్ డాన్సులు
టచ్ చేసి చూస్తేనే బూజు వదిలేది!
ఎవరెలా చేశారు
‘బి’ గ్రేడ్ లో ఎవరైనా బేకారుగానే కన్పిస్తారు. మాస్
మహారాజా మనసు పెట్టి నటించలేదు. అది బిగుసుకుపోయిన ముఖ భావాల్లోనే స్పష్టంగా తెలిసిపోతూంటుంది. పైగా వయసు కూడా
తెలిసిపోతూం
డడంతో ఫైట్లూ, పాటల్లో డాన్సులూ తప్ప, మిగతా హీరోయిన్లతో రెగ్యులర్ కామెడీలు, టీజింగులూ వగైరాలు ఇదివరక
టంతటి గ్లామరస్ గా కన్పించవు. ఎక్కడో వ్యాపారం చేసుకునే పాత్ర, పోలీసు ఆఫీసర్ గా బయటపడే ఫ్లాష్ బ్యాక్ లాంటి ఫ్యాక్షన్ వయా బాషా క్యారెక్టర్లకి ఇది కాలమా అని ఆలోచించకుండా నటించిన రవితేజ, అభిమానులకి కూడా ‘అజ్ఞాత వాసి’ తో పవన్ కళ్యాణ్ ఇచ్చినంత షాకు నిచ్చాడు. రవితేజ కెరీర్ లోనే ఇది అట్టడుగు స్థాయి ప్రయత్నం.
డడంతో ఫైట్లూ, పాటల్లో డాన్సులూ తప్ప, మిగతా హీరోయిన్లతో రెగ్యులర్ కామెడీలు, టీజింగులూ వగైరాలు ఇదివరక
టంతటి గ్లామరస్ గా కన్పించవు. ఎక్కడో వ్యాపారం చేసుకునే పాత్ర, పోలీసు ఆఫీసర్ గా బయటపడే ఫ్లాష్ బ్యాక్ లాంటి ఫ్యాక్షన్ వయా బాషా క్యారెక్టర్లకి ఇది కాలమా అని ఆలోచించకుండా నటించిన రవితేజ, అభిమానులకి కూడా ‘అజ్ఞాత వాసి’ తో పవన్ కళ్యాణ్ ఇచ్చినంత షాకు నిచ్చాడు. రవితేజ కెరీర్ లోనే ఇది అట్టడుగు స్థాయి ప్రయత్నం.
టెంప్లెట్ హీరోయిన్లు ఇద్దరి గురించీ నో కామెంట్. ఇతర నటుల గురించి కూడా చెప్పుకోవడానికి లేదు. విలన్ గా నటించిన ఫ్రెడ్డీ దారూవాలాకి విలన్ కి సరిపోయే సీను లేదు.
ఎందుకనో ఛోటా కే నాయుడు ఈసారి తనదైన మార్కు కెమెరా పనితనం చూపెట్ట లేకపోయారు. పెద్ద సినిమాలు తీసే నల్లమలుపు శ్రీనివాస్ ప్రొడక్షన్ విలువలు ‘బి’గ్రేడ్ గా వున్నాయి. బాలీవుడ్ ప్రీతమ్ గ్రూపు జామ్ 8 సంగీతంలో పాటలు కుదరలేదు. మణిశర్మ నేపధ్య సంగీతం మొదట్లో కుదిరి, తర్వాత ఆయనా చేతులెత్తేశారు. రవితేజకి మాటలేం రాశారు – అవే అటు ఇటు మార్చిన టెంప్లెట్ డైలాగులు. ఇవ్వాళ్టి హీ- మాన్ డైలాగుల సరళిని ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ – 8’ చూసి ఎప్పుడు నేర్చుకుంటారో!
చివరికేమిటి
కొత్త దర్శకుడు విక్రం దృష్టిలో
సినిమా అంటే తలపోటు తెప్పించే షాట్లు
అన్నట్టుంది. ఆ షాట్లకీ నేపధ్య సంగీతానికీ లంకె కుదరకపోతే తలపోటే వస్తుంది. ఇది
గతంలో బాలకృష్ణ నటించిన ‘లక్ష్మీ నరసింహా’ తోనే స్పష్టమయింది. మైక్రో షాట్లతో
పరుగులెత్తే ‘బోర్న్ సుప్రమసీ’ కి డీఐనే
చేయలేక చేతులెత్తేశారు టెక్నీషియన్లు. అది డీఐ లేకుండానే విడుదలయ్యింది. ఇక
అందులోని మైక్రో షాట్లతో చిన్న చిన్న బిట్లుగా వేగంగా మారిపోయే సీన్లకి ఎఫెక్ట్సూ,
మ్యూజిక్కూ ఇవ్వడం దుస్సాధ్యమై పోయింది.
కొత్త దర్శకుడు సినిమాలో కంటెంట్ సరీగ్గా వుండేట్టు చూసుకోవాలి గానీ, కంటెంటే లే ని విషయం కప్పిపుచ్చుతూ ఇలాటి టెక్నికల్ హంగామాలు చేస్తే తలపోటు వచ్చే కాలుష్యమే మిగులుతుంది. టెంప్లెట్ సినిమాలు ఫ్లాపవుతున్నాయని తెలిసి కూడా టెంప్లెట్ నే ఆశ్రయించాడంటే, తీస్తున్నది టెంప్లెట్ అని తెలియక తీశాడనుకోవాలా? చిన్న పిల్లలు కూడా నవ్విపోయే కంటెంట్ ఒక కంటెంటేనా స్టార్ హీరోకి? ఎవరైనా పాత మూస కంటెంట్ తో సెకండాఫ్ లో గంటపాటు ఫ్లాష్ బ్యాక్ పెడతారా? అసలు స్క్రీన్ ప్లే అంటే ఏమిటి? తోచినట్టూ తోసేసే సొంత క్రియేటివిటీలా? స్క్రీన్ ప్లే అని వేసుకోకూడదు దాని విలువ తీస్తూ – టెంప్లెట్ అని వేసుకోవాలి.
రవితేజయినా టెంప్లెట్ ఇప్పుడిక మాస్ మహారాజా స్టేటస్ కి కష్టమని గ్రహించి, కాస్త ఈడియెట్ మార్కు నటనలు కూడా మార్చుకుని, పదిహేనేళ్ళ క్రిందటి ప్రేక్షకులు ఇప్పుడు లేరని గ్రహించి, ఇప్పటి మార్కెట్ కి ఏది సూటవువుతుందో అదిచ్చే ప్రొఫెషనల్ దర్శకులని చేరదీస్తే, ఇంకో పదేళ్ళు నిలదొక్కుకోగలిగే అవకాశముంటుంది. లేకపోతే ఇంకా క్వాలిటీ పడిపోయి ‘సి’ గ్రేడ్ కి చేరుకోవాల్సి వస్తుంది.
―సికిందర్