ఎంపైర్ మేగజైన్ ఎంపిక చేసిన 500 గొప్ప చలన చిత్రాల్లో 449 వ స్థానం సంపాదించుకున్న ‘బ్రిక్’ కథ టీనేజి నోయర్ అనే కొత్త జానర్ ని ప్రతిపాదించింది. అంతవరకూ తొలితరం ఫిలిం నోయర్, మలితరం నియోనోయర్ సినిమాలన్నీ సీనియర్ పాత్రలతో థ్రిల్లర్స్ గా వుండేవి. ‘బ్రిక్’ వచ్చేసి టీనేజి పాత్రలతో, టీనేజర్ల ప్రపంచాన్ని ఆవిష్కరించే, టీనేజి థ్రిల్లర్ గా యౌవనాన్ని సంతరించుకుంది. ఇందులో బ్రెండన్ హై స్కూల్ విద్యార్థి. అక్కడ హై స్కూల్ అంటే ఇక్కడ మన జ్యూనియర్ కాలేజి. ఇతను తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎమిలీ మృత దేహాన్ని కనుగొనడంతో కథ ప్రారంభమవుతుంది. ఈమె చనిపోక ముందు ఒక కాల్ చేసి, ప్రమాదంలో వున్నాననీ, రక్షించమనీ కోరింది. బ్రిక్ అనీ, టగ్ అనీ, పిన్ అనీ, పూర్ ఫ్రిస్కో అనీ ఏవో మాటలు పలికి అర్ధాంతరంగా కట్ చేసింది. బ్రెండాన్ ఆమె శవాన్ని దాచిపెట్టి, ఈ నాలుగు మాటల కర్ధాన్నీ, వాటితో ఆమె మరణానికి గల సంబంధాన్నీ కనుగొనాలని అన్వేషణ మొదలెడతాడు.
ఈ అన్వేషణలో హైస్కూల్లో ఐదుగురు అనుమానితులుగా కనిపిస్తారు. హైస్కూల్లో డ్రగ్స్ సరఫరా చేసే ‘పిన్’ కి ఏజెంట్లుగా పనిచేస్తున్న విద్యార్ధులు లారా, కారా, టగర్, బ్రాడ్, డోడ్ అనే వాళ్ళు. వీళ్ళ ప్రమాదకరమైన నెట్ వర్క్ ల్ తలదూర్చి ఎమిలీ హత్యకి కారణాలు తెలుసుకుని, ప్రతీకారం తీర్చుకుంటాడు. క్లాస్ మేట్ బ్రయిన్ తోడుగా వుంటాడు.
పాత్రలు
బ్రెండన్ – ఎమిలీ – లారా – కారా
|
1. బ్రెండన్ :
కథానాయకుడు. ఒంటరి టీనేజర్. సీనియర్ నోయర్ హీరోలకి తీసిపోని టీనేజి నోయర్
హీరో, టీనేజి డిటెక్టివ్. సిగరెట్లు, మందు తాగని పాత్ర ఇతనొక్కడే. ఇతడి పాత్రోచిత
చాపం (క్యారక్టర్ ఆర్క్) చూస్తే - ఇతను వేసుకునే ఫ్రెష్ గా వుండే వైట్ షర్టు పోనుపోనూ
మాసిపోతుంది, చివరికి రక్తంతో ఎర్రబారిపోతుంది. డిటెక్టివ్ ల కుండే మెళకువలతో
ఫ్రెండ్ బ్రయిన్ ఇచ్చే సమాచారంతో ఎమిలీ హత్యా శోధన చేస్తూంటాడు. కఠినంగా మాట్లాడతాడు.
2. బ్రయిన్ : బ్రెండన్ ఫ్రెండ్. మాస్టర్
బ్రెయిన్. స్కూల్లో ఎవరేమిటో క్షుణ్ణంగా
తెలిసినవాడు. బ్రెండన్ కి సమాచారం చేరవేస్తూ, అనుమానితుల మీద నిఘా వేసి
వుంటాడు.
3. ఎమిలీ : కథానాయిక. బ్రెండన్ కి బ్రేకప్ చెప్పేసే, డ్రగ్ రాకెట్ లో ఇరుక్కుని ప్రాణాల మీదికి తెచ్చుకునే టీనేజర్.
4. లారా : వాంప్ పాత్ర. దుర్బుద్ధితో కథానాయకుడిని తప్పుదోవ పట్టిస్తూ వుండే తేనే పూసిన కత్తి.
5. కారా : డ్రగ్ గ్రూపులో గ్లామర్ గర్ల్.
6. టగ్ అలియాస్ టగర్ : స్కూల్లో డ్రగ్ ఏజెంట్, పిన్ కుడి భుజం.
7. డోడ్ : ఎమిలీ కొత్త బాయ్ ఫ్రెండ్.
8. బ్రాడ్ : ఫుట్ బాల్ ప్లేయర్, డ్రగ్స్ బానిస.
9. ది పిన్ : విలన్. డ్రగ్ రాకెట్ బాస్.
10. ట్రూమన్ : హై స్కూల్ వైస్ ప్రిన్సిపాల్.
3. ఎమిలీ : కథానాయిక. బ్రెండన్ కి బ్రేకప్ చెప్పేసే, డ్రగ్ రాకెట్ లో ఇరుక్కుని ప్రాణాల మీదికి తెచ్చుకునే టీనేజర్.
4. లారా : వాంప్ పాత్ర. దుర్బుద్ధితో కథానాయకుడిని తప్పుదోవ పట్టిస్తూ వుండే తేనే పూసిన కత్తి.
5. కారా : డ్రగ్ గ్రూపులో గ్లామర్ గర్ల్.
6. టగ్ అలియాస్ టగర్ : స్కూల్లో డ్రగ్ ఏజెంట్, పిన్ కుడి భుజం.
7. డోడ్ : ఎమిలీ కొత్త బాయ్ ఫ్రెండ్.
8. బ్రాడ్ : ఫుట్ బాల్ ప్లేయర్, డ్రగ్స్ బానిస.
9. ది పిన్ : విలన్. డ్రగ్ రాకెట్ బాస్.
10. ట్రూమన్ : హై స్కూల్ వైస్ ప్రిన్సిపాల్.
బ్రయిన్ - టగ్ - ది పిన్ - డోడ్ - బ్రాడ్
|
***
‘బ్రిక్’ స్క్రీన్ ప్లే 111 పేజీలుంది. ఈ షూటింగ్ స్క్రిప్టులో ‘బ్లడ్
సింపుల్’ లో వున్నట్టు నిగూఢార్థాల వివరం లేదు. పాత్రల స్థితిగతులు, స్థల వర్ణనలు,
వాతావరణ సృష్టి మాత్రమే వున్నాయి. ఈ టీనేజి నోయర్ లో సాంప్రదాయ నోయర్ ఎలిమెంట్స్ అన్నిటినీ
వాడుకోలేదు. అంటే, 1. చారుస్కూరో లైటింగ్, 2. హై కాంట్రాస్ట్ , లాంగ్ షాడోస్, 3. డీప్ ఫోకస్, 4. ఎక్స్ ట్రీం హై, ఎక్స్ ట్రీం లో- యాంగిల్స్, 5. టైట్ క్లోజప్స్, 6. కాంప్లెక్స్ షాట్స్, 7. కాంప్లెక్స్ మీసాన్సెన్ షాట్స్, 8. ఎసెమిట్రికల్ కంపోజిషన్, 9. బార్స్, డయాగోనల్, ఫ్రేమ్స్ వితిన్ ఫ్రేమ్స్, 10. లాంగ్ ట్రాక్ షాట్స్, 11. అబ్ స్క్యూర్ సీన్స్, 12. డచ్ యాంగిల్స్, ఇన్వర్టెడ్ ఫ్రేమ్స్, 13. వాటర్ అండ్ రిఫ్లెక్షన్స్, 14.మిర్రర్స్, 15. మోటిఫ్స్ మొదలైనవన్నీ లేవు.
ఇక్కడ క్లిక్ చేయండి చిత్రీకరణ
పరంగా ఈ కాలానికి కూడా సరిపోయే కొన్ని ఎలిమెంట్స్ నే వాడుకున్నారు. నోయర్ సాంప్రదాయంలో
నేరస్థ ప్రపంచాన్ని చిత్రించదానికి వాడుకునే లో- యాంగిల్ షాట్స్, హై యాంగిల్ షాట్స్
నీ, కొన్ని చోట్ల ఆందోళనకర పరిస్థితికి డచ్
యాంగిల్స్ నీ వాడారు. లైటింగ్ తో నీడల్ని సృష్టించే
టెక్నిక్ అనేక చోట్ల వుంది. పాత్రలతో చారుస్కూరో లైటింగ్ కూడా వుంది. చీకటిని ఎక్కువ
ఆశ్రయించకుండా, ఎక్కువగా ప్రకాశవంతమైన వాతావరణంతో
వుండడం నోయర్ రూల్స్ ని బ్రేక్ చేయడమే. నోయర్ మూవీస్ నగర వాతావరణంలో, సంపన్న వర్గాలు
రాత్రి వేళల్లో పాల్పడే అనైతిక బాగోతాలతో వుంటాయి. ఎలాటి మాస్ పాత్రలు గానీ, వాతావరణం
గానీ కన్పించవు. రిచ్ క్యారక్టర్స్ తో క్లాస్ లుక్ తో వుంటాయి. ‘బ్రిక్’ కూడా టీనేజికి
మారినప్పటికీ అదే రిచ్ క్యారక్టర్స్ తో క్లాస్ లుక్ తో వుంటుంది గానీ, నగర వాతావరణానికి
బదులు టౌను వాతావరణానికి మారుతుంది. అదీ సాంప్రదాయ సెటప్ అయిన సంపన్న నివాస భావనాల్నుంచి
హై స్కూలుకి మారిపోతుంది. ఈ ప్రొడక్షన్ డిజైన్ నోయర్ జానర్ మర్యాదల్ని జాగ్రత్తగా పునర్నిర్వచించినట్టు
వుంటుంది.
నోయర్
మూవీస్ డిటెక్టివ్ ప్రధాన పాత్రగా వుంటాయి. అతను దారితప్పిన సంపన్నుల భరతం పట్టడమో,
లేక ఆ సంపన్నులే తన భరతం పడితే పీక్కోలేక పోవడమో జరుగుతుంది. ‘బ్రిక్’ లో హీరో డిటెక్టివ్ అంటే వృత్తిగతంగా కాదు, డిటెక్టివ్
లా పనిచేసుకుపోయే పాత్ర మాత్రమే. ఇబ్బందుల్లో పడే హీరోయిన్, ఇబ్బందులు పెట్టే వాంప్
హీరోయిన్, ఒక విలన్, అతడి అనుచరులూ అనే సాంప్రదాయ సెటప్ అంతా వుంది. ఇక నోయర్ కథనాల్లో
వాడే స్వగతం అనే వాయిసోవర్ ఇక్కడ లేదు. కలర్స్ విషయానికొస్తే లైట్ బ్లూ, గ్రే, వైట్ టింట్స్ కనిపిస్తాయి. ముదురు రంగులు లేకపోవడంతో యూత్ ఫుల్
లుక్ తో వుంటుంది. లొకేషన్స్ నిర్జనంగా వుంటూ ఒకలాంటి మిస్టీరియస్ ఫీల్ ని కలగజేస్తూంటా
యి. ఇక డైలాగుల విషయానికొస్తే సాంప్రదాయ హార్డ్ కోర్ నోయర్ డైలాగులే వుంటాయి, కాకపోతే
ఇప్పుడు వాడే మాటలు కలిసివుం
టాయి. ఫిలిం నోయర్ డైలాగుల ఒక డిక్షనరీయే వుంది. నాటి 1930- 40 కాలపు హాలీవుడ్ ‘మహా రచయితలు’ సృష్టించిన గమ్మత్తైన పదాలు. అలాటి భాష నేటి హై స్కూలు పాత్రలు మాట్లాడడాన్ని జాగ్రత్తగా సింక్ చేశాడు దర్శకుడు - రచయిత రియాన్ జాన్సన్. దీంతో ఈ భాషే ఒక ఆకర్షణ అయింది ఈ టీనేజి నోయర్ కి.
టాయి. ఫిలిం నోయర్ డైలాగుల ఒక డిక్షనరీయే వుంది. నాటి 1930- 40 కాలపు హాలీవుడ్ ‘మహా రచయితలు’ సృష్టించిన గమ్మత్తైన పదాలు. అలాటి భాష నేటి హై స్కూలు పాత్రలు మాట్లాడడాన్ని జాగ్రత్తగా సింక్ చేశాడు దర్శకుడు - రచయిత రియాన్ జాన్సన్. దీంతో ఈ భాషే ఒక ఆకర్షణ అయింది ఈ టీనేజి నోయర్ కి.
టీనేజి నోయర్ యూనివర్సల్. ఈ గ్లోబలైజేషన్ యుగంలో హద్దులు చెరిగిపోయాయి. ఎక్కడైనా ఏ భాషలో నైనా తీయవచ్చు. కాకపోతే అభిరుచి అవసరం. ఏ రుచీపచీ లేని పోసుకోలు కబుర్ల సినిమాలు తీయడానికి అలవాటు పడ్డ వాళ్లకి ఇదెలా తీయాలో ఎక్కదు. తీస్తే మాత్రం చుక్కెదురు లేదు. లేకపోతే ఇంకెన్నాళ్ళు ఇలా వొట్టి పోయిన రోమకామాలతో, దెయ్యం కేకలతో దివాలా తీయిస్తూ పోతూంటారు. తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతూపోతున్న ఆధునిక థియేటర్లలో అవే లేకి ప్రేమలు! అవే వెకిలి దెయ్యాలు!! పల్లెటూళ్ళలో కూడా పనికిరాని పోకడలతో సినిమాలు తీసి ఆధునిక కాలపు థియేటర్ల పరువు మట్టిపాలు చేయడం !!!
(సశేషం)
―సికిందర్