ఎక్కువగా డెషెల్ హెమెట్ రాసిన డిటెక్టివ్
సాహిత్యం డార్క్ మూవీస్ (ఫిలిం నోయర్ - నియో నోయర్) జానర్ కి స్ఫూర్తి అని చెప్పుకున్నాం.
ప్రతీసారీ హెమెట్ నవలల్నే తీయకపోయినా, ఆ
స్పూర్తితో ఎన్నో తీశారు. కోయెన్ బ్రదర్స్ కూడా హెమెట్ నవలల్లోని పాత్రల తీరుతెన్నుల్ని,
వాతావరణాన్నీ రీక్రియేట్ చేస్తూ ‘బ్లడ్ సింపుల్’ తీశారు. అప్పటికి ఎప్పుడో ఎనభై ఏళ్లక్రితం రాసిన
పాత్రల్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు
కోయెన్ బ్రదర్స్ సినిమాలుగా తీస్తే చూస్తారా అంటే, చూస్తారు. అరవై ఏళ్ల క్రిందటి
‘దేవదాసు’ని ఇప్పుడు ‘అర్జున్ రెడ్డి’ గా తీస్తే చూస్తున్నారు. ఇతర డిటెక్టివ్ నవలలకీ హెమెట్ డిటెక్టివ్ నవలలకీ
తేడా ఏమిటంటే, హెమెట్ అపరాధ పరిశోధక నవలలు రాయలేదు, అపరాధ పరిశోధకుల
(డిటెక్టివ్స్) గురించి రాశాడు. ఇలా ‘బ్లడ్ సింపుల్’ లో డిటెక్టివ్ విస్సర్ అనే
వాడు నేర పరిశోధనలతో తన వృత్తేదో తాను చేసుకోక, తానే నేరానికి పాల్పడ్డాడు. తన కథ లోకానికి
చెప్పాల్సిన అగత్యాన్ని కథకులకి కల్పించాడు. నీతి కథలు రాసుకునే రచయిత తనే
నీచానికి పాల్పడితే, ఎలా తనే ఒక కథగా మారి
లోకాన్ని ఎంటర్ టైన్ చేస్తాడో అలాగన్న మాట. అయితే హెమెట్ రాసినవన్నీ నీచ
డిటెక్టివ్ ల గురించే కాదు, నేరకపోయి ఇరుక్కునే మంచి డిటెక్టివ్ ల కథలూ రాశాడు. హెమెట్
ఏం చెప్పాడో ఆయన మాటల్లోనే -"What I try to
do is write a story about a detective rather than a detective story. Keeping
the reader fooled until the last, possible moment is a good trick and I usually
try to play it, but I can't attach more than secondary importance to it. The puzzle
isn't so interesting to me as the behavior of the detective attacking it."
డెషెల్ హెమెట్ (1894 – 1961) |
మిడిల్ టూ ప్రారంభిస్తే, ఇందులో 13 సీన్లు వున్నాయి. ఇంటర్వెల్ తర్వాత మొదటి సీను
ఇంటర్వెల్ సీనుకి కొనసాగింపే. అదే విషాదమయ మూడ్ ని క్యారీ చేస్తూ...
24. సమాధి దగ్గర నుంచి రే బయల్దేరడం
24. సమాధి దగ్గర నుంచి రే బయల్దేరడం
25. ఎడారిలా వున్న రోడ్డు మీద డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళడం
26. ఫోన్ బూత్ నుంచి ఎబ్బీకి కాల్ చేసి కుశలమడగడం
27. అమాయకంగా మాట్లాడే ఎబ్బీతో రే తికమక పడడం
26. ఫోన్ బూత్ నుంచి ఎబ్బీకి కాల్ చేసి కుశలమడగడం
27. అమాయకంగా మాట్లాడే ఎబ్బీతో రే తికమక పడడం
28. విస్సర్ కి లైటర్ గుర్తుకొచ్చి కంగారు
పడడం
29. ఎబ్బీ బ్యాగులో విస్సర్ లైటర్ వెతకడం
30. మార్టీ శవాన్ని తొలగించానని, ఇక
ఫర్వాలేదనీ రే అంటూంటే ఎబ్బెకి అర్ధంగాకపోవడం 31. సేఫ్ లో డబ్బంతా రే
దోచుకెళ్లాడని మార్టీ అన్నాడని, రేని మారిస్ దూషించడం
32. ఎబ్బీ బార్ కెళ్ళి పరిశీలించడం, అక్కడ
దాక్కున్న విస్సర్ గమనించడం
32. ఎబ్బీకి మార్టీ తో పీడకల రావడం
32. ఎబ్బీకి మార్టీ తో పీడకల రావడం
33. మార్టీ హత్య గురించి ఎబ్బీ రేలు
మాటామాటా అనుకోవడం
34. ఎబ్బీ వెళ్లి మారిస్ కి ఫిర్యాదు చేయడం
35. రే వెళ్లి బార్ లో సేఫ్ తెరిస్తే ఫేక్ ఫోటో బయట పడడం
34. ఎబ్బీ వెళ్లి మారిస్ కి ఫిర్యాదు చేయడం
35. రే వెళ్లి బార్ లో సేఫ్ తెరిస్తే ఫేక్ ఫోటో బయట పడడం
***
24. సమాధి దగ్గర నుంచి రే బయల్దేరడం
ఇలా రాశారు : తెల్లవారుతున్న
నేపధ్యంలో సమీపంలో ఒక ఇల్లు. ఇంటి ముందు పర్ఫెక్ట్ గా దీర్ఘ చతురస్రాకారంలో లాన్. ఆ
ఎడారి లాంటి మైదానంలో ఆ ఇల్లు పొసగకుండా వుంటుంది.
రే
మీద ఫోకస్ : ఏ ఎమోషనూ లేకుండా చూస్తూంటాడు.
చివరిదాకా సిగరెట్ దమ్ము పీల్చి పారేస్తాడు.కారెక్కుతాడు. స్టార్ట్ చేస్తాడు.
స్టార్ట్ అయి ఆగిపోతుంది. మళ్ళీ ప్రయత్నిస్తాడు. మళ్ళీ ఆగిపోతుంది ఇంజన్. మరోసారి
ప్రయత్నిస్తే, వూగిసలాడుతూ ఎలాగో అందుకుని రెడీ అవుతుంది. బయల్దేరి సమాధి మీదుగా
దూరాన హైవే కేసి సాగిపోతుంది.
ఇంటర్వెల్లో సమాధి చేసే సీను రాత్రి జరుగుతుంది. ఇంటర్వెల్ తర్వాత ఈ సీను చూస్తే ఇంకా అక్కడే వున్నాడు రే తెల్లారినా. ఇంతసేపు అతను ఆలోచనలతో గడిపినట్టే. ఏమాలోచించి వుంటాడో వూహించవచ్చు. మార్టీ చనిపోయాడు, మార్టీ ని చంపిన ఎబ్బీని తను కాపాడేడు, కానీ తనే అంతిమంగా మార్టీని చంపాల్సి వచ్చింది. సమాధి చేసి చేతులు దులుపుకున్నాడు. ఇప్పుడేమిటి? సుఖమేనా? ఎబ్బీతో సుఖవంతమైన జీవితమేనా> ఇలాటి ఆలోచనలతో గడిపివుంటాడు...
ఇందుకే ఇంటర్వెల్ తర్వాత మిడిల్ టూ ప్రారంభిస్తూ ఓపెనింగ్ షాట్ గా ఆ ఇల్లు కనపడుతుంది...ఆకుపచ్చటి దీర్ఘ చతురస్రాకార లాన్ తో ముచ్చటగా వున్న ఇల్లు. దీర్ఘ చతురస్రాకార లాన్ అని రాశారు, త్రికోణమో – వర్తులమో అని రాయలేదు. ఎందుకు రాయలేదు? అతడి ఆలోచనలతో సరిపోవాలి. దీర్ఘ చతురస్రాకారానికి అర్ధమేమిటి? కలలకర్ధం చెప్పే నిఘంటువు చూస్తే – “To see a rectangle in your dream, represents permanence, materialism and stability. Because of its four corners and four sides, it is also symbolic of the number 4”
ఇదన్నమాట!
చీకూచింతా లేని, బాగా డబ్బూ దస్కమున్న హంగుతో లైఫ్ పర్మనెంట్ గా సెటిల్ అన్నమాట.
ఇక నాల్గు మూలలు 4 అంకెని సూచిస్తున్నాయి. న్యూమరాలజీలో 4 అంకె కలిసిన వాళ్ళు
మొనగాళ్ళయి వుంటారన్న మాట. రే ఇక మొనగాడన్న మాట. ఎబ్బీతో పర్మనెంట్ గా లైఫ్ సెటిల్
అన్నమాట. ఇలా ఇతడి ఆలోచల్ని బలపర్చే విధంగా తెల్లవారిన వెలుగులో ఈ ఇల్లు కనపడింది.
‘లా ఆఫ్ ఎట్రాక్షన్’ అని ఒక ‘సైన్స్’ చెప్తూంటారు (రోండా బైర్న్స్ చాలా చెప్పి
వందలకోట్లు గడించింది), దీని ప్రకారం- మనం దేన్నైతే వూహించుకుంటూ వుంటామో- అదే
భౌతిక రూపంలో నిజమై ఎదురవుతుందని. కాసేపు దీని ప్రకారం చూస్తే, రే కిదే జరిగిందనుకోవాలి.
మళ్ళీ ఇంతా అర్ధం చెప్పి ఒక అడ్డుపుల్ల వేశారు – ఈ ఇల్లు ఎడారి లాంటి మైదానంలో పొసగకుండా వుందని రాశారు. నిజమే, ఆ ఎడారిలాంటి మైదానమేమిటి, దాని మధ్య అందమైన ఇల్లేంటి? అంటే – మర్డర్ చేసి భౌతికంగా శ్మశానాన్ని సృష్టించుకున్నాక, అందమైన కలలు ఎలా సాధ్యమవుతాయని! రే ఇలాటి ఆలోచనలు గనుక చేస్తే అది మూర్ఖత్వమని హెచ్చరికగా మరుభూమిలో పొదరిల్లు.
ఇక కారు ఇంజన్ స్టార్ట్ కాకపోవడం – కారు స్టార్ట్ అవడానికి మొరాయిస్తోందంటే - నువ్వు మార్టీని చంపి సమాధిని చేసి ఎక్కడికీ వెళ్ళలేవు, ఎంజాయ్ చేయలేవు, ఇక్కడే నీకు కూడా ఇలాగే చావుందని కారు చెప్తోంది దాని భాషలో. పైగా కారుని సమాధి మీంచి పోనిచ్చే తప్పో, అపచారమో కూడా చేశాడు...
ఈ ఒక్క సీనుతో- ఎబ్బీతో రే కి జీవితముండదని, అతనూ చనిపోతాడనీ ఎస్టాబ్లిష్ చేస్తూ- సెకండాఫ్ ఎత్తుగడతోనే ఒక్క సీనుతో విపరీతమైన సస్పెన్స్ - టెన్షన్ - టెర్రర్ సృష్టించి, ముందు జరగబోయే దానిపట్ల మనం నిటారుగా కూర్చునేట్టు చేశారు. లేజీగా ప్రేక్షకులు సినిమా చూడకుండా, అనుక్షణం ఇన్వాల్వ్ చేయడం కూడా ఆర్టే!
(సశేషం)
-సికిందర్
-సికిందర్
-
.