నిన్న ‘బ్లడ్ సింపుల్’ బిగినింగ్
13 దృశ్యాల కథనం గురించి చెప్పుకోవడం మొదలెట్టాం. ఏ సినిమాకైనా మొత్తం బిగినింగ్
కి సీన్ల కలబోత వుంటుంది. బిగినింగ్ విభాగంలో ఏమేం కలపాల
న్నది బిగినింగ్ చివర్న అంటే ప్లాట్ పాయింట్ – 1 దగ్గర ఏర్పాటు చేసే సమస్యని బట్టి వుంటుంది. కాబట్టి బిగినింగ్ విభాగపు సీన్ల కలబోతని ప్లాట్ పాయింట్ వన్నే నిర్ణయిస్తుంది. ముందుగా ప్లాట్ పాయింట్ -1 దగ్గర సమస్యేమిటో నిర్ణయించకుండా బిగినింగ్ విభాగాన్ని రాయడం అసాధ్యం. గమ్యమేమిటో తెలీని ప్రయాణం లాంటిది. విజయవంతమైన సినిమాల సరళిని గమనిస్తే బిగినింగ్ లో పాత్రల్ని పరిచయం చేస్తూ జానర్ నీ, జానర్ సంబంధ నేపధ్య వాతావరణాన్నీ ఏర్పాటు చేశాక, అప్పుడు ప్లాట్ పాయింట్ –1 అనే బిగినింగ్ ముగిసే గమ్య స్థానాన్ని దృష్టిలో పెట్టుకుని, దానికి దారి తీసే పరిస్థితుల కల్పన చేసుకొస్తారు.
న్నది బిగినింగ్ చివర్న అంటే ప్లాట్ పాయింట్ – 1 దగ్గర ఏర్పాటు చేసే సమస్యని బట్టి వుంటుంది. కాబట్టి బిగినింగ్ విభాగపు సీన్ల కలబోతని ప్లాట్ పాయింట్ వన్నే నిర్ణయిస్తుంది. ముందుగా ప్లాట్ పాయింట్ -1 దగ్గర సమస్యేమిటో నిర్ణయించకుండా బిగినింగ్ విభాగాన్ని రాయడం అసాధ్యం. గమ్యమేమిటో తెలీని ప్రయాణం లాంటిది. విజయవంతమైన సినిమాల సరళిని గమనిస్తే బిగినింగ్ లో పాత్రల్ని పరిచయం చేస్తూ జానర్ నీ, జానర్ సంబంధ నేపధ్య వాతావరణాన్నీ ఏర్పాటు చేశాక, అప్పుడు ప్లాట్ పాయింట్ –1 అనే బిగినింగ్ ముగిసే గమ్య స్థానాన్ని దృష్టిలో పెట్టుకుని, దానికి దారి తీసే పరిస్థితుల కల్పన చేసుకొస్తారు.
ప్లాట్ పాయింట్ -1 దగ్గర ఏర్పాటు చేసే సమస్య –ప్రేమ ఇష్టంలేని ప్రవల్లిక ప్రఫుల్ ని కొండ మీంచి తోసి పారేద్దామని అనుకుందనుకుందాం- అప్పుడా కొండ మీదికి తీసికెళ్ళే ఉద్దేశంతో సీన్లు పడుతూంటాయి. సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పనకి ఇంతకి మించి ఏమీ లేదు- ప్లాట్ పాయింట్ -1 తెలిస్తే. మరొకటేమిటంటే, ఏ కథయినా ప్లాట్ పాయింట్ -1 దగ్గరే ప్రారంభమ
వుతుంది. కొండ మీంచి తోసిపారేసి ప్రవల్లిక చేతులు దులుపుకున్నాక, సమస్యలో పడ్డ ప్రఫుల్ ఏం చేశాడన్నదే కథ, అంతకి ముందుది కథకాదు. కేవలం కథకి సన్నాహం. బిగినింగ్ లో జరిగేదంతా కథకి సన్నాహాలే. అలాగే సమస్యంటూ- కథంటూ పుట్టాక - ఆ పుట్టిన చోటైన ప్లాట్ పాయింట్-1 కథని ముందుకి నెడుతూ నడిపిస్తుంది తప్ప, మరొకటి కాదు. కథని నెట్టుకుపోయే ప్లాట్ పాయింట్- 1 డ్యూటీ ప్లాట్ పాయింట్ -2 దగ్గర ముస్తుంది. తలెత్తిన సమస్యకి అక్కడో పరిష్కారం చూపించి క్లయిమాక్స్ కి వదిలేస్తుంది. కాబట్టి మొత్తం స్క్రీన్ ప్లేలో కథంటూ వుంటే అది ఈ రెండు ప్లాట్ పాయింట్ల మధ్యే వుంటుంది. అంటే మిడిల్ లో వుంటుంది.
ఇంత కీలక పాత్ర వహించే ప్లాట్ పాయింట్ -1 నియో డార్క్ మూవీ ‘బ్లడ్ సింపుల్’ లో ఎలా ఏర్పాటయ్యిందో తెలుసుకుంటున్నాం. నిన్నటి వ్యాసంలో గమనించిన బిగింగ్ వన్ లైన్ ఆర్డర్లో, చివరి సీను- అంటే పదమూడోది- ప్లాట్ పాయింట్ -1 ని నిర్ణయిస్తోంది. బార్ ఓనర్ మార్టీ, తన భార్యనీ ఆమె ప్రియుణ్ణీ చంపమని డిటెక్టివ్ విస్సర్ కి ‘సుపారీ’ ఇచ్చే సీను. ఇదీ సమస్య ఏర్పాటు. కాబట్టి ఈ సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన – సీన్ల కలబోత ఇప్పుడు చూడబోతున్నాం. నిన్నటి వ్యాసంలో మొదటి రెండు సీన్లు తెలుసుకున్నాం. జానర్ ఏర్పాటుకీ, పాత్రల పరిచయానికీ రెండు సీన్ల సమయమే తీసుకున్నారు కోయెన్ బ్రదర్స్. ఇది చాలా గ్రేట్. ఆ తర్వాత మూడో సీను నుంచి సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పనేమిటో ఇప్పుడు చూద్దాం...
3. మోటెల్ లో ఎబ్బీ , రే లు శృంగారంలో పాల్గోవడం.
ఎబ్బీ, రే లు బెడ్ మీద శృంగారం
జరుపుకుంటున్నప్పుడు వెంటనే ప్రారంభమయ్యే
సీనుకి, పుల్ బ్యాక్ అని రాశారు కోయెన్
బ్రదర్స్. కెమెరాని ఎందుకు పుల్ బ్యాక్ చేయాలి? అంటే అటు వెనకాల వీళ్ళని గమనిస్తున్న
నేత్రాలున్నాయా? ఇలా ఒక మిస్టరీని
క్రియేట్ చేశారు పుల్ బ్యాక్ తో.
ఇప్పుడు రెండు నిగూఢార్ధాలు రాశారు - స్క్రిప్టులో హైలైట్స్ చూడండి :
1. బయట హైవే మీద పోతున్న కార్ల హెడ్ లైట్స్ వెలుతురు మాత్రమే అప్పుడప్పుడూ రూంలో పడుతున్నట్టూ, వెలుతురు పోగానే చీకటి ఆక్రమిస్తున్నట్టూ రాశారు. ఇది సహజమే హైవే అంటూ వున్నాక. కానీ ఈ చీకటి వెలుగుల సయ్యాటకి ఇంకో అర్ధమేమైనా వుందా?
2. పుల్ బ్యాక్ వైడ్ షాట్ వరకూ సాగుతుంది. చివరి కారు వెళ్ళగానే చీకటి కమ్ముతుంది. ఏమిటిది? కెమెరా భాషలో చెప్పాలంటే పుల్ బ్యాక్ వైడ్ షాట్ వరకూ సాగిందంటే, బెడ్ మీద వాళ్ళ శృంగారం సువిశాలంగా ప్రపంచానికి రట్టవుతున్నట్టా?
అప్పుడు టెలిఫోన్ రింగవుతుంది. ఇదేమిటి? ఇప్పుడెవరు కాల్ చేస్తున్నారు?
చాలా మిస్టీరియస్ వాతావరణం తెర వెనుక జరుగుతున్నదాని గురించి...
ఇదే వైడ్ షాట్ నైట్ సీన్, మార్నింగ్ ఎఫెక్ట్ కి మారుతుంది. అంటే గుట్టు రట్టవడం సువిశాలంగానే కాక, పట్టపగలు కూడా నన్నమాట.
మార్నింగ్ ఎఫెక్ట్ లో వాళ్ళిద్దరూ బెడ్ మీదే నిద్రలో వుంటారు. ఫోన్ రింగ్ కంటిన్యూ అవుతుంది...
రే తీసి మాట్లాడి స్థాణువవుతాడు. ఎవరది?- అని ఎబ్బీ అంటే, మీ ఆయన- అంటాడు.
ఇది డిస్టర్బింగ్ డైలాగు. ఈ ఒక్క డైలాగుతో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దెబ్రా భర్త మార్టీ సరీగ్గా మోటెల్ కి కాల్ చేయడ మేమిటి? అతడికెలా తెలిసింది? ఆ రహస్య నేత్రాలు అతడివేనా? వర్షంలో కారులో వున్నది అతనేనా? అది మార్టీయే అయితే అతనెందుకు అలాటి స్వగతం వేసుకుంటూ వచ్చాడు? అతను మోటెల్ కే వస్తే ఎందుకు రెడ్ హేండెడ్ గా పట్టుకోలేదు? తీరిగ్గా వెళ్ళిపోయి తెల్లారి ఫోన్ చేయడమేమిటి? ఏమాశిస్తున్నాడు?
ఎవరో బ్లాక్ మెయిలర్ కాల్ చేయాల్సింది నిజానికి. మనం మొదట్నించీ అజ్ఞాతంగా వున్నాడని భావిస్తున్న కన్నింగ్ ఫెలో నుంచి ఇలాటిది ఎక్స్ పెక్ట్ చేస్తున్నాం. వాడు కాల్ చేసి బ్లాక్ మెయిల్ చేయాలి నిజానికి. వాడు కాకుండా భర్త మార్టీ కాల్ చేశాడంటే, అసలేం జరుగుతోంది తెర వెనకాల? ఈ స్క్రీన్ ప్లేలో మనం ఎక్స్ పెక్ట్ చేస్తున్నదాన్ని ఉల్టా పల్టా చేసేస్తూ జరగడమేనా అన్నీ?
ఇలా మూడో సీనుకల్లా మార్టీని లాగి, పాత్రల సమీకరణలతో సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పన వెంటనే ప్రారంభమయ్యింది.
‘మీ ఆయన ’ – అన్నప్పుడు రే కిటికీ దగ్గర నిలబడి వుంటాడు. కిటికీ చువ్వల బ్యాక్ డ్రాప్ లో ట్రాప్ అవుతున్నట్టు వుంటాడు. డార్క్ నోయర్ లో ఇదొక ఎలిమెంట్ : బార్స్ డయాగోనల్, ఫ్రేమ్స్ వితిన్ ఫ్రేమ్స్ షాట్స్ : పాత్రలు పరిస్థితులకి బందీలై నట్టు, కర్మఫలం అనుభవిస్తున్నట్టూ ఫీల్ కలగడానికి ఇలాటి షాట్స్ తీస్తారని చెప్పుకున్నాం.
***
4. డిటెక్టివ్ విస్సర్ ఆ ఫోటోలని మార్టీకి చూపించి డబ్బు తీసుకుని పోవడం.
క్రితం రాత్రి బార్ లో జరిగే ఈ సీను
ఫ్లాష్ బ్యాక్ గా ఓపెనవుతుంది. టేబుల్ ముందు కూర్చున్న మనిషిని పాస్ అవుతూ
ట్రాకింగ్ షాట్ వేస్తామని రాసుకున్నారు కోయెన్ బ్రదర్స్. అప్పుడొక ఫోటో వచ్చి
టేబుల్ మీద ఆ మనిషి ముందు పడుతుందని పేర్కొన్నారు. కానీ చిత్రీకరణలో ఆ మనిషి
టేబుల్ మీద కాళ్ళు జాపుకుని కూర్చుని వుంటాడు. అప్పుడు ఫోటో కాకుండా ఫోటో వున్న
కవరు వచ్చి కాళ్ళ పక్కన పడుతుంది. దాని పక్కనే ఒక హేటు పెడుతూ ఎదురుగా కుర్చీలో
ఒకతను కూర్చుంటాడు. ఇతడి ఫేస్ ఫ్రేములోకి రాదు- గొంతు వరకే కన్పిస్తూంటాడు. ఇది
డైనమిక్స్. ఈ క్షణంలో సీను ప్రాధాన్యం ఆ ఫోటోకే. ఈ కూర్చున్నతనెవరో ఫేసు చూపించి దృష్టి
మరల్చకూడదు. ఇతన్ని సస్పెన్స్ లో వుంచి ప్రీక్షకుల దృష్టి ఫోటో మీదే కేంద్రీకరింప జేయాలి.
కాళ్ళు
జాపుకున్న మనిషి నిదానంగా ఆ కవరు అందుకోబోతున్నప్పుడు, బ్యాక్ గ్రౌండ్ లో పాట
వస్తూంటుంది : నీ తియ్యటి పెదాలు
ఫోనుకి ఇంకా దగ్గరగా రానీయ్... మనిద్దరం కలిసి వున్నామన్న భావన రానీయ్ ...విడివిడిగా...ముందా
జ్యూక్ బాక్సు సొద తగ్గించమని చెబుదూ...
కవరు లోంచి ఫోటో లాగి చూస్తాడు. కానీ అతడి ఫేసు రివీలవదు, ఎదురుగా కూర్చున్నతని ఫేస్ ఇప్పుడు రివీలవుతుంది. ఇది డైనమిక్స్. ఇతను భారీ మనిషి, ఎల్లో సూటులో వుంటాడు. తమాషాగా చూస్తూంటాడు.
ఇతను రివీలైన తర్వాత, ఇప్పుడు ఫోటో చూస్తున్న మనిషి రివీల్ అవుతాడు. ఇది డైనమిక్స్. ఇతను ఎబ్బీ భర్త మార్టీ! చాలా మిశ్రమ అనుభూతుల దృశ్యమిది!
ఎందుకంటే, ఓపెనింగ్ లో టేబుల్ మీద కాళ్ళు జాపి దర్జాగా ఒంటరిగా కూర్చుని వున్నాడు. అంటే పరిస్థితి తన కంట్రోల్లోకి వచ్చిందన్న ధీమా. ఇక దెబ్రా, రే లతో ఓ ఆటాడు కోవచ్చన్న విశ్వాసం. ఈ అనుభూతికి శృంగారానుభూతితో అదే భార్య ఎబ్బీ ని గుర్తుకు తెచ్చే పాట! ఏం చెయ్యాలి? వేటు వెయ్యాలా, చేపట్టాలా?
ఆ ఫోటోలో మోటెల్ లో బెడ్ మీద వున్న ఎబ్బీ, రే లని చూస్తాడు. అప్రయత్నంగా చేతి వేలితో ఫోటోలో రే పక్కన పడుకున్న ఎబ్బీని స్పృశిస్తాడు. అంటే ప్రేమ వున్నట్టే!
అప్పుడు ఎదురుగా కూర్చున్నతను మాట్లాడతాడు.
ఈ గొంతు ప్రారంభంలో స్వగతం పలికిన గొంతే అని, ఇతడి పేరు విస్సర్ అనీ, ఇప్పుడు తెర పైకి తెస్తూ రాశారు కోయెన్ బ్రదర్స్.
ఇప్పుడా అజ్ఞాత కన్నింగ్ ఫెలో పూర్తిగా మన కళ్ళెదుట వున్నాడన్న మాట. చూస్తే వీడు కన్నింగ్ గానే వున్నాడు. పైగా ఈ కథకి ప్రధాన పాత్ర ఇతనే అని తెలుస్తోంది!
ఇక్కడ ఇద్దరి మధ్య విషయమేమిటంటే, చూసి రమ్మంటే కాల్చి వచ్చావెందుకని (ఫోటోలు తీసుకుని)మార్టీ అడగడం. దీనికి వంకరటింకరగా విస్సర్ చెప్పడం.
ఇప్పుడు వెనక సీనులో మోటెల్ లో ఆ వెలుగు నీడ సయ్యాటల అర్ధం తెలుస్తోంది!
అవి పోతున్న కార్ల హెడ్ లైట్స్ వెలుగులే కావచ్చు. దాన్ని అంత హంగామాగా చిత్రీ కరించడ మెందుకు? ఎందుకంటే అది ఫోటోలు తీస్తున్నాడనేందుకు సింబాలిజం!
ఆ
వెలుగు నీడల్ని కెమెరా ఫ్లాషెస్ గా పసిగట్టమని నివేదన. ఆ పుల్ బ్యాక్, వైడ్ షాట్,
ఒక పాయింటాఫ్ వ్యూలో దృశ్యం, వెలుగు నీడలు- ఇదంతా ఫోటోలు తీస్తున్న కుట్రకి
అర్ధాలే! ఇంత బ్యూటిఫుల్ రైటింగ్ ఎక్కడైనా
వుంటుందా?
మనోడు
ముందు నుంచీ వాళ్ళని కార్లో వెంటాడి వస్తూనే వున్నాడు, ఫోటోలు తీశాడు, మార్టీ
ముందు హాజరై పోయాడిప్పుడు. ఇక మోటెల్ కి మార్టీ ఎందుకు ఎలా ఫోన్ చేశాడో ఇప్పుడు స్పష్టమైపోయింది. అప్పటికే విస్సర్ నుంచి అతడికి సమచార ముందన్నమాట. మీ గుట్టు నాకు తెలిసిపోయిందని చెప్పడానికే కాల్ చేశాడు తప్ప మరొకందుకు కాదు.
ఇలా ఈ నాల్గవ సీనులో 2, 3 సీన్లలోని సస్పెన్స్ తో కూడిన అంశాల్ని, సందేహాలనీ ఇంకేం పెండింగులో వుంచకుండా ఓపెన్ చేసేశారు. ఎందుకంటే ఇంకా ఇవి కొనసాగిస్తే, ఇక్కడ్నించీ వేరే టాపిక్ తో నడిచే సీన్లు గజిబిజి అవుతాయి. ఆ వేరే టాపిక్ ఇప్పుడా జంటని మార్టీ ఏం చేస్తాడనేది.
మార్టీ తో ఈ మాటల మధ్యలో విస్సర్ సిగరెట్ కేస్ తీసి సిగరెట్ వెల్గించుకుని, ఆ కేస్ ని టేబుల్ మీద పెడతాడని రాశారు కోహెన్ బ్రదర్స్. అలాగే దాని క్లోజ్ షాట్ లో చూపించారు. ఎందుకు దీన్ని ఇంత ప్రత్యేకంగా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు? ఎందుకంటే పైకి కన్పిస్తూ నడిచే పాత్రల కథే గాక, అంతర్గతంగా వాటి సైకలాజికల్ ట్రాక్ ని కూడా ఏర్పాటు చేస్తున్నారు ఈ దర్శకులు.
ఈ సైకలాజికల్ ట్రాక్ లో భాగం గానే ఈ సిగరెట్ కేస్ ని ఎస్టాబ్లిష్ చేయడం. దీనర్ధమేమిటి? తెలుసుకుందాం.
ఇక్కడ మార్టీ అనే ఒక మాట అతిపెద్ద క్యారక్టర్ రివర్సల్ కి దారితీస్తుంది. అలాటి ఫోటోలో కూడా భార్యని స్పృశించి ప్రేమని చాటుకున్న అతడికి, కీడు తలపెట్టే ఆలోచనే తొలగిపోయిందేమో. అందుకే, ‘ఇలాటి చెడు వార్త మోసుకొచ్చే వాణ్ణి గ్రీస్ లో తల తీసేస్తారు!’ అనేస్తాడు.
చెడు జరుగుతోందని తెలిసినప్పుడు చెడు వార్త కాకుండా ఎలా వుంటుంది? అంటే ఇప్పుడది చెడు కాదని నమ్ముతున్నాడా? భార్య గురించి మనసు మార్చుకున్నాడా? మనం ఆశిస్తున్న దానికి భిన్నంగా తిరగబడింది ఇంతలోనే పాత్ర.
మార్టీ ఇలా అన్నాక, ఇంకో నిగూఢార్ధం రాశారు- ఆఫ్ స్క్రీన్ లోంచి సిగరెట్ పొగ ఫ్రేములోకి వస్తుందని (స్క్రిప్టు 8 వ పేజీలో హైలైట్ చూడండి)- నువ్వు మారాలనుకున్నా పరిస్థితులు అందుకనుమతించవు - అనే అర్ధంలో. ఆ సిగరెట్ పొగ మేఘం కమ్మేయడం ఆ డిటెక్టివ్ కంట్రోల్లోకి తను వెళ్ళబోతున్న సంకేతం. నిత్య జీవితంలో మనకిలాటివి జరుగుతూంటాయి- కానీ మనం తెలుసుకోం. బయటికెళ్ళి పొగ వూదురా వెళ్ళు- అని నెట్టి పారేస్తాం, వాడి బాడీ లాంగ్వేజికి అర్ధం గ్రహించకుండా. మార్టీ ధోరణీ ఇదే.
మార్టీ సేఫ్ దగ్గరకి వెళ్తాడు. అప్పుడు గ్రీస్ సంగతి తనకి తెలీదనీ, ఇక్కడ నిర్దుష్టమైన చట్టాలున్నాయనీ అంటూ, తను వార్తలు మోసుకొచ్చే మెసెంజర్ కాదనీ, ప్రైవేట్ డిటెక్టివ్ ననీ చెప్తాడు విస్సర్. ఇలా ఇతను డిటెక్టివ్ అన్న సంగతిని సీను చివరి వరకూ అట్టి పెట్టారు దర్శకులు. దీన్ని గమనించాలి. ఏ విషయం ఎక్కడ ఎప్పుడు చెప్తే థ్రిల్ చేస్తుందో తెలుసుకోవాలి.
డిటెక్టివ్ అయ్యుండీ బ్లాక్ మెయిల్ ఎందుకు చేస్తున్నాడు క్రిమినల్ లా? చూసి రమ్మంటే ఫోటోలు తెచ్చి? డార్క్ మూవీస్ లో కొన్నిసార్లు నీతి లేని డిటెక్టివ్ పాత్ర లుంటాయి. అలాంటిదే ఇదీ.
అప్పుడు మార్టీ డబ్బున్న కవరు తెచ్చి విస్సర్ కేసి విసురుతాడు.
ఇక్కడ మరో నిగూఢార్ధం రాశారు ప్రత్యేకించి...(స్క్రిప్టు 9 వ పేజీలో హైలైట్చూడండి). ఆ కవరు విస్సర్ కేసి విసిరినప్పుడు, వెళ్లి ఛాతీకి కొట్టుకుని రివర్స్ లో వచ్చి కింద పడుతుందనీ.
విస్సర్
కి కూడా లాక్ పడబోతోంది ఈ ఆటలో! దుర్నీతితో
అతను గుంజుతున్న డ బ్బు, తపిస్తున్న గుండెలకి
తగిలింది గానీ, నేలపాలయ్యింది. ఏ మాత్రం అతడికి దుష్కర్మ ఫలాలు దక్కబోవని హెచ్చరిక.
మళ్ళీ
రావద్దంటాడు మార్టీ. విస్సర్ పెద్దగా నవ్వేస్తూ కిందపడ్డ కవర్ని తీసుకుని వెళ్ళిపోతూ
వెనక్కి వస్తాడు. ఇక్కడ ఇంకో నిగూఢార్ధం (9 వ పేజీ)...వెనక్కి వచ్చి టేబుల్ మీద
పెట్టిన సిగరెట్ కేస్ తీసుకుని వెళ్ళిపోతాడని... దీన్ని క్లోజప్ తో రిజిస్టర్ చేస్తారు.
ఇది విస్సర్ సైకలాజికల్ ట్రాక్ కొనసాగింపు. ముందు టేబుల్ మీద సిగరెట్ కేస్ పెట్టేయడం, వెళ్తూ మర్చిపోయి వెళ్ళబోవడం, వెనక్కి వచ్చి తీసుకోవడం...ఇదంతా అతడి సైకలాజికల్ ట్రాక్. ఈ ప్లేస్ లో సిగరెట్ కేస్ వదిలెయ్యకుండా భద్రంగా తీసికెళ్ళగల్గిన విస్సర్, ఇంకోసారి ఏదైనా మర్చిపోయి వెళ్తాడా? అలా మర్చిపోయి వెళ్ళడం పీకల మీదికి తెస్తుందా? ముందు ముందు సీన్లలో చూద్దాం...ఈ నాల్గవ సీను ముగిసింది. ఈ సీన్ స్ట్రక్చర్ ని స్టడీ చేసి, ఈ ఒక్క సీనులో చిన్న చిన్న మాటల ద్వారా, చర్యల ద్వారా ఎన్నెన్ని విషయాలు వెల్లడై, వల్లో పడి, కథనం ఎంత లోతుగా, చిక్కగా రూపొందుతోందో ఒకటికి పదిసార్లు పరిశీలించుకోవాలి.
-సికిందర్