షార్ట్
ఫిలిమ్స్ ఫెస్టివల్స్ లో పాల్గొనాలని గుడ్డిగా ప్రయత్నించకూడదు. వాటి
నిర్వాహకులు సెలెక్టివ్ గా షార్ట్
ఫిలిమ్స్ ని ఎంపిక చేసుకుంటారు. కొన్ని కొన్నిరకాల సబ్జెక్టుల్ని మాత్రమే అనుమతిస్తారు. యూత్ కోసం ఎక్కువగా తీసే లవ్ సబ్జెక్టులు
అసలే తీసుకోరు. బలమైన సందేశాత్మకమైన షార్ట్స్
ఆ ఫెస్టివల్స్ లో చోటు సంపాదించుకుంటాయి. కాబట్టి టెక్నాలజీనంతా రంగరించి ఎంత సైన్స్ ఫిక్షన్ షార్ట్ తీసినా
ప్రవేశం లభించకపోవచ్చు. ఆ షార్ట్ ఫిలిమ్స్
ప్రదర్శనల్లో ప్రేక్షకులు పరిమిత టేస్టు
గల వారై వుంటారు. ఫెస్టివల్స్ ని పక్కన
బెట్టి, విస్తృత టేస్ట్స్ వున్న ప్రేక్షకుల కోసం షార్ట్స్ తీయడం ఉత్తమం.
వీటికి వేదికలుగా యూట్యూబ్, వీమియో,ఫన్నీ లాంటి ఆన్ లైన్ ప్లాట్ ఫామ్స్ వున్నాయి. విస్తృత పరిధిలో ప్రేక్షకుల్ని ఆకర్షించాలంటే, అలాటి కథల్నే ఎన్నుకోవాలి. ఐతే వీటిని తీశాక వెబ్ ప్రపంచంలో ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యే అసంఖ్యాక ఇతర షార్ట్స్ తో పోటీ పడాల్సి ఉంటుందని మరువకూడదు. ఎంటర్ టైన్ మెంట్ కోసం ప్రేక్షకులకి మిలియన్ల కొద్దీ ఛాయిసులు ఆన్ లైన్ లో ఊరిస్తూ వుంటాయి. ఒక హులూనో, ఒక నెట్ ఫ్లిక్స్ నో క్లిక్ చేస్తే చాలు. ఇంకా ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి వేదికలు కూడా వున్నాయి. ఓ షార్ట్ ఒకసారి ఆన్ లైన్ లో క్లిక్ అయిందంటే విస్తృత పరిధిలో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ అయిన ఫేస్ బుక్, ట్విట్టర్ లలో కూడా పెద్ద ప్రచారం లభిస్తుంది.
వెబ్ ప్రపంచంలో దృష్టి నాకర్షిం చాలంటే, షార్ట్ ని తీయడంలో చాలా మెళకువలు తెలిసి వుండాలి. వీటిలో ముఖ్యమైనది పేసింగ్. అంటే కథ నడక వేగం. వెబ్ లో లక్షలకొద్దీ షార్ట్స్ దర్శన మిస్తాయి. అందమైన ఛాయాగ్రహణం, నటనలు, గొప్ప కథ ఇవన్నీ వుంటాయి. కానీ ఒక్క పేసింగ్ అనే టెక్నిక్ ని నిర్లక్ష్యం చేయడం వల్ల అవి స్లోగా నడిచే కథలగా పరమ బోరు కొడతాయి. మొనాపలీ వాతావరణ పరిస్థితులు వుండే సినిమాలకి థియేటర్లలో ఇది చెల్లిపోతుంది. కానీ అనేక ప్రత్యాన్మాయలూ, పోటీ కూడా వుండే ఆన్ లైన్ వేదికల మీద షార్ట్స్ కి అలాకాదు. పేసింగ్ లేకపోతే అవి ఒక్క సెకండ్ లో ఫ్లాప్ అయిపోతాయి. షార్ట్ ఫిలిం ని లాప్ టాప్ లో ఎడిట్ చేసి వంద అడుగుల తెర మీద వేసి చూసుకుంటే పేసింగ్ ఎంత మందకొడిగా వుందో తెలిసిపోతుంది. కాబట్టి ఎంత స్మాల్ స్క్రీన్ వుంటే అంత ఫాస్ట్ పేసింగ్ అవసరం. ఇది జనరల్ ఫిలిం మేకింగ్ రూలు.
రెండోది- టైటిల్స్ సినిమా టైటిల్స్ లా చాంతాడంత సాగకుండా చూసుకోవాలి. కథని వెనువెంటనే ప్రారంభించేసి, మొదటి షాట్ లోనే ప్రేక్షకుడు ఇన్వాల్ అయ్యేలా చేసుకో గల్గాలి. పది నిమిషాల షార్ట్ లో చివరి నిమిషపు విషయం చెప్పడానికి సుదీర్ఘమైన ఉపోద్ఘాతం ఇస్తే ఎవరూ భరించలేరు. ఉపోద్ఘాతాలని కట్ చేయాలి. ఫ్లాష్ బ్యాక్స్ కి కూడా షార్ట్స్ లో స్థానం లేదు. ఒక నిమిషం దాటి విషయం లేకపోతే ఆడియెన్స్ చూసే అవకాశం లేదు. యాడ్ ఫిలిమ్స్ లాగే షార్ట్ ఫిలిమ్స్ కి అటేన్షన్ స్పాన్ తక్కువ. సినిమా హాళ్ళలో ప్రేక్షకుల్ని కంట్రోల్ చేయగలం. అది అక్కడి మోనాపలీ వాతావరణం, సినిమా మాధ్యమానికి లభించిన వరం. సమయం, స్థలం, చీకటి వాతావరణం, సౌండ్ వాల్యూం, కూర్చునే సీట్లు, తినే స్నాక్స్ అన్నీ కంట్రోల్ చేయగలరు . ప్రేక్షకుడు థియేటర్ లో సినిమా చూడడమంటే అది తన చేతిలో లేని పాసివ్ అనుభవం. ఆన్ లైన్ లో అలా కాదు. ప్రేక్షకుడు యాక్టివ్ గా వుంటాడు. ఏ మాత్రం కంట్రోల్ చేయలేం. ఒక్క సీను బోరు కొట్టినా, మూడ్ బాగా లేకపోయినా క్లిక్ చేసేసి మరో దా నికి వెళ్ళిపోతాడు. లేదా మ్యూట్ చేసి వేరే పని చూసుకుంటాడు. డిలీట్ కూడా చేసెయ్యొచ్చు. షార్ట్స్ మేకర్ ఎంతో గొప్పగా అనుకున్న కథని ప్రేక్షకుడు తన చేతులతో రకరకాలుగా చిత్ర హింసలు పెట్టగలడు.
అందుకే ఆన్ లైన్లో ప్రేక్షకులని కథలో ఇన్వాల్వ్ అయ్యేలా చేసుకోవాలి. కథలో పాలు పంచుకునేందుకు ఆహ్వానించాలి. అలాటి షార్ట్స్ కొన్ని – వెల్కం టు పైన్ పాయింట్, సోల్జర్ బ్రదర్, 3డ్రీమ్స్ ఆఫ్ బ్లాక్, వైల్డర్ నెస్ ఇన్ డౌన్ టౌన్ - అనేవి వు న్నాయి. వీటిని ఒకసారి పరిశీలించ వచ్చు. The Thomas Beale Cipher అనే షార్ట్ లో దాని దర్శకుడు ఉద్దేశపూర్వకంగా 16 ఎన్క్రిప్టెడ్ మేసేజిల్ని హైడ్ చేసి ఉంచాడు. ఆ ఫిలిం చూసే ఆన్ లైన్ ప్రేక్షకులు ఆసక్తితో వెనక్కొచ్చి వాటిని సెర్చ్ చేసి, కథని ఇంకా లోతుగా అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించేలా వుందది.
కాబట్టి ఆన్ లైన్లో ప్రేక్షకులు మన అదుపులో వుండరు కదా అని బాధ పడనవసరం లేదు. ప్రేక్షకుల్ని కథలో ఇన్వాల్వ్ చేయగల టెక్నిక్స్ గురించి ఆలోచించాలి. ఇలా ఇంటరాక్టివ్ మూవీ మేకింగ్ ని అలవర్చుకుంటే ఆన్ లైన్ లోకూడా ప్రేక్షకుల మీద అదుపు సాధించ వచ్చు! ఇంటర్నెట్ కోసం తీసిన ఇంటరాక్టివ్ మూవీస్ ని నెట్ లో చూసుకోవచ్చు. వీకీ పీడియాలో లిస్టు లభిస్తుంది.
షార్ట్ ఫిలిమ్స్ కి ఐడియాలు ఆలోచించడం చాలా ఫన్ గా వుంటుంది. పనిలో ఫన్
ఫీలయితేనే ఫెంటాస్టిక్ గా వుంటుంది. షార్ట్ ఫిలిమ్స్ షార్ప్ గా ఆడియెన్స్
కి ఆలోచింప జేసే మెసేజ్ లు ఇవ్వగలవు. అంతే కాదు, పెద్ద పెద్ద సినిమాల్లో చూపలేని
విషయాలు వీటికే ప్రత్యేకం. మరి ఇంతటి వైవిధ్యాన్ని కలిగివుండే షార్ట్ ఫిలిమ్స్
తీయడానికి వెరైటీ ఐడియాలు ఎలావస్తాయి? అదే తెలుసుకుందాం.
ప్రతియేటా వివిధ కేటగిరీల్లో
సినిమాలకి ఆస్కార్ అవార్డులిచ్చే అకాడెమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్
వారు, షార్ట్ ఫిలిమ్స్ టైటిల్స్ వగైరా
అన్నిటితో కలుపుకుని 40 నిమిషాలు, లేదా అంతకు తక్కువ రన్నింగ్ టైం ని కలిగి
వుండాలని నిర్ణయించారు. ఐతే ఒక మూవీని షార్ట్ ఫిలిం అనిగానీ, ఫీచర్ ఫిలిం అని గానీ
నిర్ణయించడానికి ఫిక్సెడ్ క్రిటేరియా ఏదీ లేదు. అలా అనుకుంటే సినిమా చరిత్ర ప్రారంభమైన కాలంలో లఘు చిత్రాలే కథా ఫీచర్ ఫీచర్
సినిమాలుగా చెలామణి అయ్యాయి. అయితే రానురాను ఆ లఘు కథా చిత్రాలే నిడివి పెరిగిపోయి
సినిమాలు అంటూ అర్ధం చెప్పుకోవడంతో, లఘుచిత్రాలు కాన్సెప్ట్ వేరే దారి చూసుకోక
తప్పలేదు - అది సినిమాలకంటే భిన్నంగా కథల్ని చెప్పే ప్రయోగం! ఇందులో భాగంగానే ఆర్ట్ ఫిలిమ్స్ వచ్చాయి.ఇప్పుడు
ఆర్ట్ ఫిలిమ్స్ కూడా ఆదరణ కోల్పోయి నవ యువ మేకర్లతో భారీ ఎత్తున షార్ట్ ఫిలిం అనే
హైటెక్ కేటగిరీకి తెరతీశాయి.
ఐతే సమస్య ఏమిటంటే ఈ రోజుల్లో సినిమాలకే సరైన కథల్లేక ఫ్లాప్ అవుతున్నాయి. అలాటి సమస్య షార్ట్ ఫిలిమ్స్ కి లేదని కాదు. షార్ట్ ఫిలిమ్స్ కి సమస్య సినిమా కథల్ని అనుసరిస్తేనే వస్తుంది. సినిమాల్లో చూసేదే షార్ట్ ఫిలిం లో కూడా చూపిస్తే ఇక షార్ట్ ఫిలిమ్స్ ప్రత్యేకత ఏమిటి?వాటిని ఎందుకు చూడాలి? కాబట్టి సినిమాల మీద మోజుతో షార్ట్ ఫిలిమ్స్ ని క్రియేటివ్ పరంగా బలి చేయకుండా బతికించుకుంటే, అలా ఈ కేటగిరీని కాపాడుకుంటున్న వాళ్ళుగా పేరు తెచ్చుకుంటే, గ్రేట్ అన్పించుకుంటారు.
కాబట్టి ఇకనుంచి షార్ట్ ఫిలిమ్స్ కి
కథల్ని ఇలా విభిన్నంగా ఆలోచించడానికి ప్రయత్నించ వచ్చేమో :
1. ఫ్రెండ్ షిప్పే శాశ్వతమని చెప్పే ఐడియా
ఈ సింపుల్ కథ తీయడానికి మంచి గ్రాహ్య శక్తి, నైపుణ్యం,
రాసేటప్పుడు తీసేటప్పుడు అంకిత భావంతో టీం వర్క్ వుంటే ఎక్కడికో వెళ్ళిపోతారు.
స్నేహమే శాశ్వతం అని చెప్పే ఈ స్టోరీ ఐడియాని పరిశీలించండి:
ఇద్దరబ్బాయిలు, ఒకమ్మాయి ( అజయ్-నాగ్-నవ్య అనుకుందాం) ముగ్గురూ ఇంటర్ అప్పటి నుంచే మంచి ఫ్రెండ్స్. అజయ్, నాగ్ లకి నవ్య తన మాజీ బాయ్ ఫ్రెండ్ ద్వారా పరిచయమైంది. ఆ మాజీ బాయ్ ఫ్రెండ్ ఆమెతో విడిపోయాక కూడా, అతను పరిచయం చేసిన అజయ్, నాగ్ లతో ఆమె ఫ్రెండ్ షిప్ ని కంటిన్యూ చేస్తూనే వుంది. ఐతే ఈ ముగ్గురూ ఎప్పుడూ తమమధ్య లవ్ గురించి ఆలోచనే రానీయ లేదు. ఆది ఫ్రెండ్ షిప్ ని డిస్టర్బ్ చేస్తుందని భావించారు. కాకపోతే అజయ్ వేరే కావ్య అనే అమ్మాయితో లవ్ లో పడ్డాడు. కావ్యకి అజయ్- నవ్యల ఫ్రెండ్ షిప్ గురించి తెలిసినా దాన్ని అర్ధం జేసుకుని అడ్జస్ట్ అయింది.
ఇలావుంటే, కొంతకాలానికి నవ్య తను నాగ్ ని ప్రేమిస్తున్నట్టు గ్రహించింది. ఆ విషయం నాగ్ కి చెప్పడానికి వెళ్లి నప్పుడు అతను తన గర్ల్ ఫ్రెండ్ సౌమ్య గురించి చెప్పాడు. నవ్య వెంటనే ఫ్రెండ్ షిప్ నటిస్తూ అతడికి కంగ్రాట్స్ చెప్పింది. అయితే నాగ్ ని ప్రేమిస్తున్న సౌమ్యకి, అతడితో నవ్య ఫ్రెండ్ షిప్ చేయడం నచ్చలేదు. ఇది గ్రహించిన నవ్య, నాగ్ తోబాటు - అజయ్ కీ దూరంగా ఉండసాగింది.
ఇలా వుండగా ఓ హేపీ న్యూ ఇయర్ నాడు, నాగ్ పార్టీ ఇచ్చి నవ్యని కూడా ఆహ్వానించాడు. ఇది తెలుసుకున్న సౌమ్య రావద్దని నవ్య ని హెచ్చరించింది. ఫోన్ లో ఇలా హె చ్చరిస్తూంటే అది విన్న నాగ్ ఇంకొక్క క్షణం ఆలస్యం చేయకుండా సౌమ్యని వదిలేసి, నవ్య దగ్గరికి వెళ్ళిపోయాడు. అప్పుడు గానీ తను అసలు లవ్ చేస్తున్నది నవ్య నే అని తెలుసుకోలేకపోయాడు. దీంతో అజయ్-కావ్య, నాగ్ - నవ్య కపుల్స్ ఇద్దరికీ వాళ్ళమధ్య ఫ్రెండ్ షిప్ దెబ్బతినకుండా సమస్య పరిష్కారమై పోయింది.
2. అపరిచితుల్ని నమ్మడం డేంజర్ అని చెప్పే ఈ స్టోరీ
ఐదేళ్ళ వినీత్ మదర్ తో ఉంటున్నాడు. ఫాదర్ లేడు. మదర్ ఓవర్ టైం చేసి కష్టపడి సంపాదిస్తూ, వినీత్ కి ఏ లోటూ రాకుండా చూసుకుంటోంది. ఒక్కోసారి ఆమె నైట్ షిఫ్ట్ కి వెళ్ళినప్పుడు ఒక టీనేజి కుర్రాడు ఆది వచ్చి వినీత్ కి తోడుగా ఉంటున్నాడు.
ఐదేళ్ళ వినీత్ మదర్ తో ఉంటున్నాడు. ఫాదర్ లేడు. మదర్ ఓవర్ టైం చేసి కష్టపడి సంపాదిస్తూ, వినీత్ కి ఏ లోటూ రాకుండా చూసుకుంటోంది. ఒక్కోసారి ఆమె నైట్ షిఫ్ట్ కి వెళ్ళినప్పుడు ఒక టీనేజి కుర్రాడు ఆది వచ్చి వినీత్ కి తోడుగా ఉంటున్నాడు.
టీవీలో వినీత్ ముందే ఆది చూడకూడని ప్రోగ్రాములు చూస్తాడు. అసభ్యంగా మాట్లాడతాడు. స్మోక్ చేస్తాడు. డ్రింక్ కూడా చేస్తాడు. కులపరంగా వినీత్ దూషిస్తాడు. అలా ఒక రోజు వినీత్ పాలు తాగుతున్న గ్లాసు చేతిలోంచి జారి పగిలింది. దాంతో ఏడవ సాగాడు. అది చూసి ఆది కోపం పట్టలేక, వినీత్ మెడ బట్టుకు లాగి బీరువాలోకి తోసి లాక్ చేసేశాడు. వినీత్ లోపలి నుంచి గట్టిగా అరుస్తూంటే, ఏడుస్తూంటే ఆది వాడి నోట్లో గుడ్డలు కుక్కి, కాళ్ళు చేతులు కట్టేసి మళ్ళీ బీరువాలోకి తోశాడు.
తెల్లారి డ్యూటీ నుంచి మదర్ వచ్చి చూస్తే,
ఇద్దరూ కన్పించలేదు. ఇంట్లో విలువైన
వస్తువులూ పోయాయి. బీరువా తెర్చి చూస్తే నిర్జీవంగా కొడుకు...
ఈ సింపుల్ కథల్ని ఎలా విజువలైజ్ చేస్తే ఎఫెక్టివ్ గా ఉంటాయో బాగా గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి. ఏ కథ చెప్పినా అది ఏదో ఒక మెసేజ్ పాస్ చేసినట్లయితే మంచి షార్ట్ గా గుర్తుంది పోతుంది.
ఈ సింపుల్ కథల్ని ఎలా విజువలైజ్ చేస్తే ఎఫెక్టివ్ గా ఉంటాయో బాగా గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి. ఏ కథ చెప్పినా అది ఏదో ఒక మెసేజ్ పాస్ చేసినట్లయితే మంచి షార్ట్ గా గుర్తుంది పోతుంది.
-సికిందర్