తారాగణం: రామ్, రాశి ఖన్నా, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, జయప్రకాష్‌రెడ్డి, అభిమన్యు సింగ్, వినీత్ కుమార్, శ్రీనివాసరెడ్డి, ఫిష్ వెంకట్, సప్తగిరి, సురేఖావాణి
తదితరులు
సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఛాయాగ్రహణం : రసూల్ ఎల్లోర్, ఎడిటింగ్ : 'కేరింత' మధు
బ్యానర్: శ్రీ స్రవంతి మూవీస్, నిర్మాత : 'స్రవంతి' రవికిషోర్
రచన- దర్శకత్వం: శ్రీనివాస రెడ్డి
విడుదల: అక్టోబర్ 2, 2015, సెన్సార్ : U/A
***

శ్రీ
స్రవంతి
మూవీస్ బ్యానర్ 30 వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రామ్ హీరోగా రవికిషోర్ ప్రతిష్టాత్మకంగా
నిర్మించిన ‘శివమ్’ అట్టహాసంగా విడుదలయ్యింది. భారీ తారాగణంతో, కాస్ట్ లీ నిర్మాణ
విలువలతో ప్రేక్షకులని అలరించడానికి ముందుకొచ్చింది. నిజానికి ప్రేక్షకులేం
కోరుకుంటున్నారు, నిర్మాతలూ హీరోలూ ఏం కోరుకుంటున్నారు - అనే గ్యాప్ ని
పూడ్చడానికి ఈ బిగ్ కమర్షియల్ ఏమైనా ప్రయత్నం చేసిందా, లేక తనూ షరా మామూలుగా ఆ
పూడ్చలేని అగాథం లో పడిపోయి తల్లడిల్లిందా
ఈ కింద చూద్దాం..
లైటర్ చాలా లైట్ గురూ!
శివ (రామ్) ప్రేమించుకుని పెళ్లి చేసుకోలేక పోతున్న జంటలకి ఎంతయినా రిస్క్ చేసి పెళ్ళిళ్ళు చేస్తూంటాడు. ఓపెనింగ్ లోనే ఓ కేంద్ర మంత్రి కూతురుని ఇష్టం లేని పెళ్లి నుంచి తప్పించి ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించేస్తాడు. ఆ కేంద్ర మంత్రి మనుషులకి దొరక్కుండా ట్రైనెక్కి పారిపోతాడు. మధ్యలో ట్రైన్ ఆగినప్పుడు సిగరెట్ తాగుదామని వెళ్లి లైటర్ కోసం ఓ గ్యాంగ్ తో ఘర్షణ పడతాడు. ఆ గ్యాంగ్ లీడర్ అక్కడి వూళ్ళో ప్రజల్నిబాధిస్తున్న భోజిరెడ్డి (వినీత్ కుమార్) అనే అతడి కొడుకు. లైటర్ కోసం జరిగే ఆ ఘర్షణలో భోజిరెడ్డి కొడుకుని గాయపర్చి తిరిగి ట్రైనెక్కి వెళ్ళిపోతాడు శివ. అలా పొలాల్లో ఒకమ్మాయి తనూజా ( రాశి ఖన్నా) ఐ లవ్యూ అని పెద్దగా అంటూ వెంటబడుతూంటే ట్రైన్ దూకేసి ఆమె వెంటపడతాడు. ఆమె ఛీత్కరించుకుంటుంది. అయినా ఆమెకోసం దగ్గరలోని కర్నూలులో సెటిలవుతాడు. ఆమె ఐలవ్యూ అన్నది ఓ నాటకానికి రిహార్సల్ లో భాగంగా. అదీ ట్రైన్ని చూసి అనే ఘట్టం. అయినా వదిలిపెట్టకుండా ప్రేమించమని వెంటపడతాడు శివ.
ఇలా వుండగా తన కొడుకుని కొట్టినందుకు ఊళ్ళో ఘోర పరాభవంగా ఫీలైన భోజి రెడ్డి, శివని సజీవంగా పట్టుకు రమ్మనీ, వాణ్ని ఇక్కడే జనం ముందు చంపి పరువు నిలబెట్టుకుంటాననీ ముఠాని పంపిస్తాడు. మరోవైపు ఎప్పుడో తనూజాని చూసి మనసుపారేసుకున్న అభి ( అభిమన్యు సింగ్) అనే ఇంకో రౌడీ కూడా శివ కోసం వెతుకు తూంటాడు. ఈ రెండు గ్యాంగు లేకాక, పాత కక్ష తో శివని చంపాలని ప్రభ ( బ్రహ్మానందం), శివ ప్రవర్తన నచ్చక చంపాలని వెతుకుతున్న శివ తండ్రీ (పోసాని)..ఇలా ఇన్ని గ్యాంగుల్ని తప్పించుకుంటూ తనూజా ప్రేమకోసం ప్రయత్నిస్తూంటాడు శివ. చివరికి ఆమె ప్రేమని ఎలా పొందాడు, ప్రత్యర్ధుల్ని ఎలా మట్టి మట్టికరిపించాడూ అనేది మిగతా కథ.

ఎవరెలా చేశారు
రామ్ కిది వరుసగా అదే మార్పులేని మూస మాస్ పాత్ర. ‘ఒంగోలు గిత్త’, ‘మసాలా’, ‘పండగ చేస్కో’ ల తర్వాత నాల్గో మాస్ సినిమా. అవే చుట్టూ వుండే పాత్రలతో అవే రొటీన్ డ్రామాలు. ఇవేవీ అంతకి ముందు సూపర్ హిట్టయిన ‘కందిరీగ’ దరిదాపులకి రావడం లేదు. ‘కందిరీగ’ లాంటి కథాబలంవున్న సినిమా ఇక రామ్ నుంచి ఆశించకూడదేమో. ప్రస్తుత సినిమా సమస్య అంతా కథలో దమ్ము లేకపోవడమే. మెచ్యూరిటీ కన్పించని ఈ మాస్ మేనియా నుంచి బయటికొస్తే తప్ప రామ్ కి వెరైటీ పాత్రలు పడవు. ప్రస్తుత సినిమాలో నటించేందుకు కథా లేదు, పాత్రకూడా లేదు. వూరికే అర్ధంలేని కామెడీలతో, పది నిమిషాలకో ఫైట్ తో, బలం లేని ప్రేమ సన్నివేశాలతో నడిపించేశారు. తను కోరుకుంటున్న మాస్ ఇమేజీ ఇలా సాధ్యం కాదు. కేవలం తన ఇమేజియే సినిమాని కాపాడుతుందనుకోవడం కూడా పొరపాటే. వెంటనే రామ్ ఈ ధోరణి నుంచి బయట పడితే మంచిది.
హీరోయిన్ రాశి ఖన్నా కీ సరైన పాత్రేలేదు. పైగా లావెక్కి రామ్ కి సరిజోడీ అన్పించుకోలేదు. ఆమె లావుని కప్పిపుచ్చడానికి ఎక్కడా జీన్స్, పంజాబీలు లాంటివి వేయించకుండా జాగ్రత్త పడినట్టుంది. ఒక పాటలో షార్ట్ డ్రెస్ వేసినప్పుడు ఆమె ఎంత లావో బయట పడిపోయింది. హీరోయిన్ రాంగ్ సెలెక్షన్ ఈ సినిమాకి.
ఇతర పాత్రల్లో నటించిన బ్రహ్మానందం, శ్రీనివాసరెడ్డి, జేపీ, పోసాని, వినీత్ కుమార్ మొదలైన వాళ్ళు వీలైనంత కామెడీ చేసి సీన్లని నిలబెట్టడానికి ప్రయత్నించారు, అయితే కథలేని కామెడీ సీన్లేమిటన్న ప్రశ్న, వెలితి వెంటాడుతూంటాయి.
ఒక్క దేవీ శ్రీప్రసాద్ సంగీతం, రసూల్ ఎల్లోర్ ఛాయాగ్రహణం -ఈ రెండే సినిమాకి ప్లస్. అయితే సమస్య ఎక్కడ వచ్చిందంటే సినిమా చాలా బోరుకొట్టడంతో పాటలు బావున్నప్పటికీ భరించడం కష్టమైపోతుంది. ఇక ‘కేరింత’ మధు చేసిన ఎడిటింగ్ సినిమా స్పీడునేమీ పెంచలేదు సరికదా- నిడివి సాగి సాగి 2 గంటల 45 నిమిషాలకి చేరింది. యాక్షన్ వైపు చూస్తే పీటర్ హెయిన్స్ మంచి పోరాట దృశ్యాలు కంపోజ్ చేశారు.

స్క్రీన్ ప్లే సంగతులు
(to be
concluded..)