Q : ఫిలిం నోయర్ జానర్ గురించి మీరు రాసిన ఆర్టికల్స్ చదివాను. నేను
ప్లాన్ చేస్తున్న థ్రిల్లర్ ని ఈ జానర్ లో తీయాలనుకుంటున్నాను. మంచిదేనా?
―ఎం ఎన్ ఎస్, సహాయ దర్శకుడు
|
‘సిన్ సిటీ’ లోని ఈ దృశ్యంలో నోయర్ ఎలిమెంట్ ఏమిటో చెప్పుకోండి? |
A : సంతోషం.
తెలుగులో థ్రిల్లర్ తో ఇలా వొక కళాత్మక అనుభవాన్నిస్తే అంతకంటే కొత్తదనం కోరుకునేదుండదు.
కాకపోతే మీ థ్రిల్లర్ కథ నోయర్ జానర్ మర్యాదలకి లోబడాలి. ‘బ్రోచేవారెవరురా’ లాంటి
రెగ్యులర్ థ్రిల్లర్లు ఈ జానర్లో ఇమడవు. ‘మత్తువదలరా’ లాంటి కథల్ని ఇమడ్చవచ్చు. ఎక్కువగా ఇవి మర్డర్ మిస్టరీలతో
వుంటాయి. వీటికి సమకూర్చాల్సిన మేకింగ్ సంబంధమైన ఎలిమెంట్స్, కథా పాత్రల
తీరుతెన్నులూ వేరేగా వుంటాయి. వీటితో నోయర్
జానర్ ఆత్మని పట్టుకోగలగాలి. ఇందుకు చాలా స్టడీ చేయాలి. ఆచితూచి ఒక్కో సీనూ డైలాగూ
రూపొందించాలి. నోయర్ జానర్ డైలాగులు, కాయిన్ చేసిన పదాలూ వేరే వుంటాయి. హాలీవుడ్
లో ఈ పదాలతో డిక్షనరీయే వుంది. ఈ పదాల్ని తెలుగులోకి మార్చుకుంటే తప్ప ఫీల్ రాదు.
ఉదాహరణకి నోయర్ సినిమా భాషలో క్యాలీఫ్లవర్ అంటే డాలర్, హారన్ అంటే టెలిఫోన్, షికాగో ఓవర్ కోట్ అంటే శవ పేటిక...ఇలా
నవ్వు తెప్పించేలా పాత్రలు మాట్లాడతాయి. పచ్చిగా కూడా మాట్లాడతాయి. నోయర్ జానర్ మూడు
కాలాల్లో వుంది : బ్లాక్ అండ్ వైట్ హాలీవుడ్, కలర్ హాలీవుడ్. మొదటిదాన్ని ఫిలిం
నోయర్, రెండో దాన్ని నియో నోయర్ అన్నారు. ఇక కలర్ లోనే ఈ శతాబ్దం ప్రారంభంలో
కొత్తగా టీనేజీ నోయర్ అనే మూడోది వచ్చింది. మూడిటి సినిమాలూ స్టడీ చేయండి. తెలుగు
నేటివిటీకి ఎలా మార్చుకోవచ్చో ఆలోచించండి. హిందీలో వచ్చిన ‘మనోరమ సిక్స్ ఫీట్
అండర్’ చూడండి.
Q : Sir, we are waiting for your opinion on Oscar
winners, especially Parasite and Once upon a time in Hollywood.
―పేరు రాయలేదు
A : రెండూ
కళాఖండాలే. వీటి నిర్మాణాల వెనుక కొన్నేళ్ళ పరిశ్రమ వుంది. క్వెంటిన్ టరాంటినో తను
తీసిన 11 సినిమాలకి 7 ఆస్కార్ అవార్డు లందుకున్నాడు. ‘ఒన్స్ అపాన్ ఏ టైం ఇన్
హాలీవుడ్’ అతను తలపెట్టిన బృహత్ పీరియడ్ ప్రయత్నం. ‘పారసైట్’ కొరియన్ మూవీ ఎక్కువ
కళాత్మకంగా వుంటుంది. ఇది కుటుంబ కథా చిత్రం. ఆర్ధిక అసమానతలు, వర్గ పోరాటం,
ఆధునిక పెట్టుబడి దారీ వ్యవస్థ చుట్టూ కుటుంబ కథ. దర్శకుడు బాంగ్ జూన్ హో అపూర్వ సృష్టి.
మన ఫ్యామిలీ సినిమాలు ఇంకా అవే పాత మూస ఫార్ములా సెంటిమెంట్లతో, ఏడ్పులతో కాలంతో
సంబంధం లేకుండా ఎక్కడో విశ్రాంతి తీసుకుంటున్నాయి.
సహకార దర్శకుడు రవి అడిగిన 5 ప్రశ్నలు :
Q : మీరు ఫలానా
కథ ఎందుకు చెప్పాలనుకుంటున్నారు అంటే,
చాలామంది దగ్గర
సమాధానం
దొరకడం
లేదు. రచనా సహకారం
కోసం
నాకు
కథలు
చెబుతున్న నా
స్నేహితులు అవ్వచ్చు, లేదా
నేను
ఇంతకు
ముందు
పని
చేసిన
కొంతమంది దర్శకులు అవ్వచ్చు. అలాగే ఈ
కథ
ద్వారా
మీరు
ఏం
చెప్పదలుచుకున్నారని అడుగుతున్నా, ఆ
ప్రశ్నకి సమాధానం
చెప్పడంలేదు. ఇది థ్రిల్లర్ అంతే,
నేను
థ్రిల్లర్ చేయాలని అనుకుంటున్నాను
- అని ఇలా సమాధానాలు
చెప్తున్నారు. మీరు ఒకసారి
ఒక
కథను
అనుకున్నప్పుడు ఆ
కథను
ఎందుకు
చెప్పాలి, దాంట్లో
ఏం
చెప్పాలి, కథా ప్రయోజనాన్ని ఎలా
ఆలోచించాలి, అన్న
విషయాన్ని ఏదైనా
ఒక
సినిమాని ఎగ్జాంపుల్ గా
ఇస్తూ
వివరించగలరు.
A : ఈ కథ ద్వారా మీరేం చెప్తున్నారని అడిగే వ్యక్తులు వుంటారనుకోలేం. చెప్పిన కథ అర్ధం గాక పోతే
విసుగెత్తి అడగొచ్చు. చెప్పిన కథ అర్ధమైతే ఈ ప్రశ్నేరాదు. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ కథ
విజయ్ దేవరకొండకి చాలా బాగా అర్థమైవుంటుంది కాబట్టి అసలీ కథ ద్వారా మీరేం
చెప్పదల్చుకున్నారని జుట్టు పీక్కుని దర్శకుణ్ణి అడిగి వుండక పోవచ్చు. మనకి మాత్రం
ప్రాణాలర చేతిలో వున్నాయి సినిమా చూస్తూంటే. కథాకథనాల గురించి కాదు, ఈ కథాకథనాల
మీద ఇంత బడ్జెట్ పెట్టేశారేనని ప్రాణాలర చేతిలో పెట్టుకోవడం. బాగా అర్ధమయ్యే కథ
వుంటే ఈ ప్రశ్నే అర్ధ రహితం. ఎందుకంటే కామెడీ కథ చెప్తే ఎంటర్ టైనర్, ప్రేమ కథ
చెప్తే ఎంటర్ టైనర్, యాక్షన్ కథ చెప్తే ఎంటర్ టైనర్...సినిమా అంటే ఫక్తు ఎంటర్
టైన్మెంట్ అన్న అర్ధంలో చెలామణి అవుతున్నాక నీతులు చెప్తారా, సందేశాలు ఇస్తారా?
అయినా ఎవరైనా అడిగితే, ‘ఈ కథతో నేను ఎంటర్టైన్ చేద్దామనుకుంటున్నాను, కలెక్షన్లు
వస్తాయి’ అని నిర్భయంగా చెప్పేయడమే. ఇంతకంటే సంతోషించే నిర్మాత వుంటాడనుకోలేం. ఎంటర్
టైన్మెంట్ అంటేనే హుండీ కలెక్షన్స్ .
విషయమేమిటంటే,
ఎలా ఎంటర్ టైన్ చేసినా అందులో చెప్పకుండా నీతి వచ్చేస్తుంది. అంతర్లీనంగా ఏదోవొక
నీతి లేకుండా ఏ కథా వుండదు. ‘మత్తువదలరా’ అనే ఎంటర్ టైనర్ లో నీతి ఏమిటి?
చేస్తున్న ఉద్యోగాన్ని అడ్డ మార్గంలో సంపాదనకి వాడుకుంటే ఇంకా అడ్డంగా ఇరుక్కుంటారనే
కదా. ఇది చాలదా? కాబట్టి ఏదో నీతులు చెప్పాలని పనిగట్టుకుని కథ చేయనవసరం లేదు. చేసేసి
వదిలేస్తే అందులోనే నీతులన్నీ కన్పిస్తాయి, కథా ప్రయోజనం సహా. స్క్రీన్ ప్లే
పండితుడు జేమ్స్ బానెట్ తన ప్రసిద్ధ పుస్తకం Stealing Fire from the Gods లో ‘క్రియేటింగ్ ది షుగర్ కోట్’ అని ఏకంగా చాప్టరే
రాశాడు. డౌన్ లోడ్ చేసుకుని చదవండి. పిల్లల్ని ఆడుకోవడానికి పంపిస్తే ఆ ఆటల్లో
నీతేమిటి? వ్యాయామమే. ఉట్టి వ్యాయామం చేయమంటే ఛస్తే చెయ్యరు. ఆడుకోమంటే ఉత్సాహంగా
ఆడుకుని వస్తారు. ఇందులో ఆటలు పైకి కన్పించే, ఆకర్షించే ఎంటర్ టైన్మెంట్. ఈ ఎంటర్
టైన్మెంట్ మాటున దాగివున్నది ఎక్సర్ సైజ్ - వ్యాయామం అనే ప్రయోజనం, నీతి...ఇలా
చాలా వివరిస్తాడు బానెట్. చెప్పిన కథ అర్ధమయ్యేలా వుండక పోతే తప్ప, ఈ కథ ద్వారా మీరేం
చెప్తున్నారని అడగడం నాన్ ప్రొఫెషనల్. ఆ
కథ ద్వారా నేటి సినిమా మార్కెట్ యాస్పెక్ట్ అయిన ఎంటర్ టైన్మెంటే చెప్తాడు ఏ
సినిమా కథకుడైనా.
Q : స్ట్రక్చర్ గురించి
ఎంత
చెప్పినా నాకు
తెలిసిన
కొంత
మంది
ఫ్రెండ్స్ అసలు
పట్టించుకోవడం లేదు,
ఎంతసేపూ
వచ్చిన
ప్రతి
సీన్
రాద్దామని తప్పా,
స్ట్రక్చర్ ఫాలో
అవ్వాలన్న ఆలోచన
రావడం
లేదు. స్ట్రక్చర్
ఫాలో
అవలేనప్పుడు ఎటువంటి
జానర్
కథలు
ఎంచుకోవాలి? దాంట్లో
ఎలాంటి
ప్రయోగాలు చేయాలి?
A : స్ట్రక్చర్ నాలెడ్జిని
మీవరకే వుంచుకోవాలి. ఎవరైనా కథలు చెపితే స్ట్రక్చర్ పదాలూ సూత్రాలూ చెప్పకుండా,
ఇలా చేస్తే బావుంటుందని వాళ్ళ భాషలోనే చెప్పాలి. మీ నాలెడ్జిని ప్రదర్శించుకుంటూ
వాదోప వాదాలకి దిగకూడదు. వాళ్లకి ఆసక్తి పుడితే స్ట్రక్చర్ గురించి వాళ్ళే అడిగి
తెలుసుకుంటారు. స్ట్రక్చర్ పరిజ్ఞానం ఏ కాస్తయినా వున్న వాళ్ళతో పని సులభమై
పోతుంది. వాళ్ళే మీనుంచి మరిన్ని ఇన్ పుట్స్ కోరుకుంటారు. అప్పుడు మీరు రూపాయికి
రెండ్రూపాయల పని చేసి పెట్టేస్తారు.
ఇక
స్ట్రక్చర్ ఫాలో
అవలేనప్పుడు ఎలాంటి జానర్ కథలు
ఎంచుకోవాలంటే, ఎలాంటి ప్రయోగాలు చేయాలంటే,
స్ట్రక్చరాశ్యత లేకుండా ఏ జానర్ కథలైనా చేసుకోవచ్చు, ఏ ప్రయోగాలైనా చేసుకోవచ్చు. స్ట్రక్చరాశ్యులకి
భయం వుంటుంది. ఏం చేస్తే ఏమవుతుందో తెలిసి వుంటుంది కాబట్టి. స్ట్రక్చరాశ్యులు
కాని వాళ్లకి ఏ భయమూ వుండదు. ఏం చేస్తే ఏం జరుగుతుందో తెలీదు కాబట్టి. సొంత
ఆలోచనలతో ఎలా పడితే అలా రాసుకు పోవడమే. కాబట్టి వాళ్ళ కథల్ని వాళ్ళ ఆలోచనా
ధోరణిలోకే వెళ్లి చేసెయ్యాలి. ఒక నోటెడ్ హీరో సినిమాకి దర్శకత్వ శాఖలో పనిచేస్తున్న
సీనియర్, దర్శకుడితో ఇదే సమస్య వుందని పదేపదే ఫోన్ చేసి బాధపడుతున్నాడు. ఎలా పడితే
అలా కథ చేస్తున్నారని. ఐతే మీకొచ్చిన నష్టమేంటి - దర్శకుడి ఆలోచనా ధారలో అలాగే పుణ్యస్నానం
చేసి వచ్చేయండని పదే పదే ఈ పాలసీనే వర్తింపజేయాల్సి వస్తోంది.
Q : జానర్
మర్యాద
ల
గురించి
అన్నిజానర్ మర్యాదలు ఒకే
అర్టికల్ కింద
మీరు
పోస్ట్
పెడితే
అది
ప్రింట్
తీసుకోవడం ఈజీ
అవుతుంది మాకు.
A : పీడీఎఫ్ కాపీ త్వరలో బ్లాగు సైడ్ బార్ లో చూడవచ్చు.
Q : హీరో తనంతట
తానుగా
ఏ
పనీ
చేయకుండా పక్క
క్యారెక్టర్స్ చెబుతున్న పనులు
చేస్తూ
పోవడమంటే అది
ఖచ్చితంగా ప్యాసివ్ క్యారెక్టర్. మరి అలాంటిది ‘మత్తు
వదలరా’
సినిమాలో తన
ఇమాజినేషన్ లో
అయినా
ఫ్రెండ్
పాత్రలు
వచ్చి
హీరోను
అలా
చెయ్,
ఇలా
చేయమని
చెప్పడమంటే హీరో పాత్రను
ప్యాసివ్ క్యారెక్టర్ గా
మార్చడమే కదా? కొత్త ఐడియాలతో వస్తున్న కొత్త
ఫిలిం
మేకర్స్
కూడా
ఇలాంటి
అత్యంత
ముఖ్యమైన విషయాలలో కూడా
ఎందుకు
ఫెయిలవుతున్నారు? స్ట్రక్చర్
గురించి
నేర్చుకోకపోవడమా లేక
అసలు
దాని
గురించి
అవగాహన
లేకపోవడం కారణమా? లేదా ఒక పెద్ద ప్రొడక్షన్
కంపెనీ
ఇలాంటి
స్క్రిప్ట్ ను
ఓకే
చేసి
కూడా
అందులో
లోపాలను
గుర్తించ లేకపోవడమా?
A : యాక్టివ్, పాసివ్
క్యారక్టర్స్ ని పట్టుకోవాలంటే ఒక్కటే గుర్తు. ఇగో అయినది యాక్టివ్ క్యారక్టర్,
ఇగో కానిది పాసివ్ క్యారక్టర్. చాలా సింపుల్. సినిమాల్లో ప్రధాన పాత్ర మనలోని
ఇగోకి సింబల్. బలహీన పాత్ర (పాసివ్) ఇగోకి సింబల్ కాలేదు, బలమైన పాత్ర (యాక్టివ్) మాత్రమే
ఇగోకి సింబల్ అవుతుంది. ఇగో ప్రయాణమెలా వుంటుందో పురాణాల ఆధారంగా జోసెఫ్ క్యాంప్
బెల్ రూపొందించిన మోనో మిథ్ స్ట్రక్చర్ లోకెళ్ళండి : పురాణాలంటే కొట్టి పడేస్తారు
గానీ, అసలు పురాణాల్లోనే వుంది మన సైకో ఎనాలిసిస్ అంతా, కథల రహస్యమంతా.
ఇగో
ఒక సమస్యలో పడి పోరాటం ప్రారంభించినప్పుడు, తొలి దశలో ‘ద్వార పాలకుడు’ అనే
అడ్డుపడే పాత్రని ఎదుర్కొంటుంది. మరోవైపు ‘మాయగాడు’ అనే ఆటలు పట్టించే పాత్ర నెదుర్కొంటుంది.
ఎందుకిలా? ఈ రెండు పాత్రలూ మనలోని ఎమోషన్స్ కి సింబల్స్. ఏ కథయినా తెర మీద మన
మానసిక ప్రపంచాన్ని సృష్టిస్తుంది. సృష్టించకపోతే ఫెయిల్ అవుతుంది. మనమేదైనా పని మొదలెట్టినప్పుడు,
‘ఈ పని చెయ్యకు, నీకు డబ్బులు రావు’ లాంటి మాటలతో మనసు అడ్డుపడుతూంటుంది. మరో వైపు,
‘ఈ పని నువ్వు చేస్తావా? అంతుందా నీకూ, నీ మొహంలే’ లాటి వెటకారాలతో ఇంకోవైపు
లాగుతుంది. ఇవి వెండితెర మీద థ్రెషోల్డ్ క్యారక్టర్ (ద్వారపాలకుడు) గా, ట్రిక్
స్టర్ (మాయగాడు) క్యారక్టర్ గా అనువాదమవుతాయి. ఈ తొలి దశలో ఇగో, అంటే ప్రధాన పాత్ర,
పని నేర్చుకునే క్రమంలో, ఈ రెండు ఎమోషన్స్ ఇచ్చే ఇన్ పుట్స్ ని పరిశీలిస్తూ
వుంటుంది. పరిశీలిస్తూ పరిశీలిస్తూ పట్టు సాధించి, ఈ రెండు ఎమోషన్స్ నీ జయించి,
ముందుకు రెండో దశ కెళ్లిపోయి - స్వతంత్ర పోరాటం ప్రారంభిస్తుంది. స్థూలంగా
చెప్పాలంటే ఇగో మెచ్యూర్డ్ ఇగోగా మారడమే మంచి సినిమా కథ.
తొలిదశలో
ఈ రెండు ఎమోషన్స్ (పాత్రలు) మధ్య సతమత మవడమంటే పాసివ్ అయిపోయినట్టు కాదు. ఈ తేడా గమనించండి.
పై పంక్తిని ఇంకోసారి మననం చేసుకోండి. ఇది ఇన్ క్యుబేషన్ పీరియడ్ (పొదిగే దశ)
మాత్రమే. పిండం పొదిగే దశలో పిండం లాగే వుండిపోదు కదా? ఎదుగుతుంది. ఒక రూపాన్ని
పొందుతుంది. ఇగో కూడా ఇక్కడ్నించీ స్వతంత్ర జీవిగా ఎదుగుతుంది. ఎదగకపోతే మృత పిండం
(పాసివ్ క్యారక్టర్) అవుతుంది. సినిమాకి ఎంచక్కా అబార్షనై, దిగ్విజయంగా చేతులు దులుపుకోవడమవుతుంది. ఇదీ కథలకి వుండే సైకలాజికల్, స్పిరిచ్యువల్ బ్యాక్ డ్రాప్. కథల
సెటప్పంతా మన మానసిక లోకపు సార్వజనీన సెటప్పేనని సినిమా కథకులు గ్రహిస్తే
బావుంటుంది. ఇదంతా కూడా స్ట్రక్చర్ ఉపకరణాల్లో భాగమే.
ఇప్పుడు
‘మత్తువదలరా’ సందర్భం చూద్దాం. హీరో శవంతో ఇరుక్కున్న ఈ సందర్భం, స్క్రీన్ ప్లేలో
మిడిల్ విభాగం తొలి దశలోనే వస్తుంది. శవంతో ఇరుక్కోవడమనే సమస్యలో పడ్డాక, ఈ తొలి
దశలో ఎటూ తోచక, సాయానికి తన ఇద్దరు ఫ్రెండ్స్ ని ఆహ్వానిస్తాడు. వీళ్ళు ఒకరు
కమెడియన్, ఇంకొకరు షెర్లాక్ హోమ్స్. ఈ ఆహ్వానించడం తన మానసిక ప్రపంచంలోనే,
ఇమాజినేషన్ లోనే. ఇప్పుడు ఈ ఇద్దరూ ఇందాక పైన చెప్పుకున్న మానసిక ప్రపంచంలో, ఆ రెండు
ఎమోషన్స్ కి సింబల్స్ - థ్రెషోల్డ్ క్యారక్టర్ (ద్వారపాలకుడు), ట్రిక్ స్టర్
క్యారక్టర్ (మాయగాడు). వీళ్ళిద్దరూ ఏం చేస్తారో సీన్లో చూడొచ్చు : ద్వారపాలకుడుగా షెర్లాక్ హోమ్స్ హీరోని తప్పుదోవ పట్టిస్తూంటే,
మాయగాడుగా కమెడియన్ దెప్పి పొడుస్తూంటాడు. ఇంత మాత్రాన హీరో పాసివ్ అయిపోయినట్టు
కాదు. సమస్యని అర్ధంచేసుకునే పొదిగే దశలో వున్నట్టు. తొలి దశలో హీరో మనఃస్థితిని
ప్రతిబింబించే ఈ ఫాంటసికల్ ఇమాజినేషన్ బ్యూటిఫుల్ క్రియేషన్ సినిమాలో. పైపెచ్చు వినోదాత్మక
విలువ వున్నది కూడా.
Q : హిందీ సినిమా ‘బాలా’
గురించి
ఏమైనా
విశ్లేషణ రాయగలరా? ప్రస్తుతం
సమాజంలో
యువతని
పట్టిపీడిస్తున్న హెయిర్
లాస్
లాంటి
కాంటెంపరరీ సబ్జెక్టును తీసుకుని కూడా
సినిమాలో మొదటి
గంటలో
చెప్పిన
విషయాన్ని మళ్లీ
మళ్లీ
చెప్తూ
కాలయాపన
చేశారు.
ఇంతా
చేసి
సినిమాలో కొత్తదనం ఏమైనా
చూపించారా అంటే
మళ్లీ
హీరో
తనకి
బట్టతల
ఉన్న
విషయం
దాచిపెట్టి హీరోయిన్ ని
మోసం
చేసి
పెళ్లి
చేసుకోవడం - అన్న పాయింట్ దగ్గర ఆగిపోయారు. ఇలాంటి
కాంటెంపరరీ పాయింట్స్ తీసుకున్నప్పుడు కథ
విషయంలో
ఎలాంటి
జాగ్రత్తలు పాటించాలి? హీరో పాత్ర
లక్ష్యాలు ఆశయాలు
ఎలా
ఉండాలి? వీటి గురించి ఏవైనా సినిమాలు భాష
ఏదైనా
సరే, వుంటే ఉదాహరణలతో వివరించగలరు.
A : సైంటిఫిక్, సైకలాజికల్,
మెడికల్ సబ్జెక్టులతో నిజాయితీగా వుండలేక, లేదా విషయ సేకరణ పట్ల అలసత్వం వల్ల చెడగొట్టే
అవకాశాలుంటాయి. ‘డిస్కో రాజా’ లో, ‘సవ్యసాచి’ లో సైంటిఫిక్ పాయింట్స్ ని ఇలా చెడగొట్టుకోవడం
వలన భారీగానే ఫ్లాప్స్ నెదుర్కొన్నారు. ‘సైజ్ జీరో’ లో మెడికల్ పాయింటుతోనూ ఇంతే. ఇప్పుడు
‘వరల్డ్ ఫేమస్ లవర్’ లో సైకలాజికల్ పాయింటుతోనూ ఇంతే. ఇవి కొన్ని మాత్రమే
ఉదాహరణలు. చెప్పుకుంటే చాలా వున్నాయి. ఈ సబ్జెక్టులకి వాటివైన జానర్
మర్యాదలుంటాయి. ఇది తెలుసుకోకుండా సెకండాఫ్ కొచ్చేసరికి మూస మాస్ కథలుగా
మార్చేస్తున్నారు. ఒక అసోషియేట్ డయాబెటిస్ కథతో వచ్చాడు. అందులో డయాబెటిస్ తో పాత్ర
బాధపడుతూ, బాధపడుతూ, బాధపడుతూనే చివరికి చచ్చూరుకుంటుంది. ఇదేం కథండీ బాబూ అంటే- ఇదింతే, చావడంతో సానుభూతి వస్తుందన్నాడు. డయాబెటిస్
బాధితులు చచ్చిపోవాలా? ఇలాక్కాదు, డయాబెటిస్ బాధితులకి స్ఫూర్తి నిచ్చే సినిమా
చెయ్యాలి; పరాజయం కాదు, విజయం గురించి వుండాలి - ఇందుకు బాగా రీసెర్చి చేయాలి, నిపుణుల్ని
సంప్రదించాలి -మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ తో డయాబెటిస్ ని జయించిన ఫైటర్స్ వున్నారు
తెల్సా? బ్రిటన్లో ఒక డయాబెటిస్ బాధితుడు నూరు మైళ్ళు పరుగెత్తి పరుగెత్తి,
ఇన్సులిన్ ని ప్రేరేపింప జేసుకుని డయాబెటిస్ విజేత అయ్యాడు తెల్సా? ఇవీ కావాలి
సినిమాకి- అంటే విన్పించుకోలేదు. ఆ కథ తెర కెక్కలేదు. ఇంకో చోట, కీలక సన్నివేశంలో
ఒక యంత్రానికి సంబంధించి టెక్నికల్ గా ఎదురైన ఒక జటిల సమస్యకి పరిష్కారం నెట్ లో ఎక్కడా
దొరకలేదు. ఇక సంబంధిత నిపుణుల్ని కలవాలని డిసైడ్ అయ్యారు దర్శకుడు. ఇలాటి కథలకి
విశ్వసనీయత ఇలాటి ప్రయత్నాల వల్ల చేకూరుతుంది. గదిలో కూర్చుని కల్పనలు చేస్తే
కాదు. గది అనేది మూసుకున్న మదితో సమానం. పై ఫ్లాప్స్ గదిలో కూర్చుని తోచింది రాసుకుని
తోచినంత (ఫస్టాఫ్ వరకూ) తీసినవే అనుకోవాలి. ఇలా తోచినంత కథ కులుంటారు, తోచీతోచని
కథకులుంటారు, తోచకుండా తోచే కథకులుంటారు.
‘బాలా’ బట్టతల సమస్య గురించి.
బట్టతల అనేది శారీరకంగా బాధించే సమస్య కాదు, మానసికంగా వేధించే సమస్య. ఇది ఎమోషనల్
కామెడీ జానర్ లోకి వస్తుంది - ‘భలే భలే మగాడివోయ్’ లో మతి మరుపు సమస్యలాగా. ‘మై
మేరీ పత్నీ ఔర్ వో’ (2005) లో పొట్టితనం సమస్య లాగా. పొట్టి వాడైన రాజ్ పల్ యాదవ్,
పొడుగు భార్య రీతూపర్ణా సేన్ తో తిరగలేక పడే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ బాధ. ఇదెంత
బాగా హిట్టయిందో తెలిసిందే. ఇలాటి వాళ్ళ మానసిక లోకంలోకి లోతుగా వెళ్లి డీప్ గా
కనెక్ట్ చేసిన ఎమోషనల్ కామెడీ ఇది. ఎంత నవ్విస్తుందో, అంత కన్నీళ్లు
తెప్పిస్తుంది.
‘బాలా’
లో డైనమిక్స్ సరిగా లేవు, అందువల్ల మీరన్నట్టు మొదటి గంటలో చెప్పిన విషయాన్నే
మళ్లీ
మళ్లీ
చెప్తూ
కాలయాపన
చేశారు. అసలతను ఫస్టాఫ్ లో బట్టతల మీద జుట్టు మొలిపించే
మందులు అమ్ముతూ తిరగాలి. బట్ట తల వాళ్ళతో కామెడీలు చేయాలి, అమ్ముతున్న మందులు
పనిచేయక తన్నులు తినాలి. హీరోయిన్ ని ప్రేమించాలి. తీరా ఇంటర్వెల్లో నిశ్చితార్ధం
జరిగాక విగ్గు వూడిపడి బట్టతల బైట పడాలి. అప్పటివరకూ అతను బట్టతల వాడని
ప్రేక్షకులకి కూడా తెలియకూడదు. ఇలాటి కథలకి డైనమిక్స్ తో సస్పెన్సుని వాడాలి.
వాడకపోతే ఫస్టాఫ్ నుంచీ బట్టతలనే చూపిస్తూంటే, సినిమా చివరి వరకూ అదే చూపిస్తూ
మొనాటనీ బారిన పడేసి బోరు కొట్టించే వాళ్ళవుతారు. అసలు సగం సినిమాకే పాయింటు
తెల్లారిపోతుంది.
టిమ్ అలెన్ నటించిన ‘జో సంబడీ’
చూద్దాం : ఇందులో అమాయకుడైన టిమ్ అలెన్ ని పార్కింగ్ దగ్గర గొడవపడి ఒక బలవంతుడు
కొడతాడు కూతురి ముందు. టిమ్ అలెన్ చాలా అవమానం ఫీలై పోతాడు, కూతురి ముందు పరువు
పోయినందుకు. ఇక ఎలాగైనా కూతురి ముందే ఆ బలవంతుడ్ని కొట్టాలని డిసైడ్ అయిపోతాడు.
ఇంతే పాయింటు, చాలా చిన్న పాయింటు. చిన్న పాయింట్లతో సంక్లిష్ట కథనం చేస్తారు
హాలీవుడ్ లో, అదే పెద్ద పాయింట్స్ తో తేలికైన కధనం. అలా బ్యాలెన్స్ చేస్తారు. దీనికి
వ్యాపార ప్రాతిపదిక వుంటుంది. వ్యాపార ప్రాతిపదిక అంటే ప్రేక్షకుల మైండ్ కంట్రోల్.
చిన్న పాయింట్లకి తేలికైన కథనం, లేదా లైటర్ వీన్ కథనం చేస్తే- పాయింటూ తేలికై,
కథనమూ తేలికైపోయి మైండ్ సంతృప్తి చెందదు. పెద్ద పాయింట్లకి భారీ కథనం చేస్తే -
అంటే ఎక్కువ మలుపులు తిప్పుతూ సంక్లిష్టం చేస్తే - అసలే పాయింటు భారీగా వుంటే,
కథనమూ బరువై పోయి భరించదు మైండ్. ఇలా వ్యాపార ప్రాతిపదిక వుంటుంది. వ్యాపార ప్రా దిపదికన
డిస్కషన్స్ జరుగుతాయి. అంతేగానీ, వ్యాపార ప్రాతిపదిక గాలికొదిలేసి, ఎవరికి వారే
తమదే గొప్ప క్రియేటివిటీగా పై చేయి సాధించాలని డిస్కషన్స్ జరగవు.
ఇక
టిమ్ అలెన్ తనని కూతురి ముందు కొట్టిన వాణ్ణి కూతురి ముందే కొట్టాలని డిసైడ్
అయిపోతాడు. అంత బలవంతుడ్ని కొట్టడమెలా? ఇదే ఇక్కడ్నించీ అనేక మలుపులు తిరిగే
సింపుల్ పాయింటు కథ. చివరికి కొట్టడా, లేదా? కొడితే క్యారక్టర్ ఏంటి? కొట్టకపోతే
క్యారక్టర్ ఏంటి? ఇగోని మంచి ఇగోగా మార్చడమే మంచి కథగా? ఇలాగే ముగుస్తుంది ఈ ఎమోషనల్
కామెడీ. ఇక హీరో
పాత్ర
లక్ష్యాలు, ఆశయాలు
ఎలా వుండాలో ఎలా చెప్పగలం? ఆయా కథల్లో ఏర్పాటు చేసే సమస్యని
బట్టి లక్ష్యం, ఆశయం వుంటాయి. సమస్యని సాధించడమే లక్ష్యం, ఆశయం.
(ఒకరే ఇన్ని ప్రశ్నలు
పంపితే ఇతరులకి చోటుండదు, గమనించగలరు)
Q : సినిమా రివ్యూలు, విశ్లేషణల్లో
తరచూ
వినిపించే మాట - పాత్రలు బలంగా
లేవు
అని.
బలమైన
పాత్ర
అంటే
ఏంటి ? ఏయే లక్షణాలుంటే
అది
బలమైన
పాత్ర
అవుతుంది. దానికి
అంతర్గత, బహిర్గత లక్షణాలు ఏమై ఉండాలి, వివరిచగలరు. బలమైన
పాత్రలకు కొన్ని
ఉదాహరణలు చెప్పగలరు. మరో
ప్రశ్న- empathy అనే మాట
ఈ
మధ్య
తరచూ
వింటున్నాం. దాని గురించి వివరిచగలరు.
―పీఏ,
సహకార దర్శకుడు
A : బలమైన పాత్రంటే
యాక్టివ్ పాత్ర - బలమైన సంఘర్షణ పడేది, లేదా పోరాటం చేసేది. సంఘర్షణ, పోరాటం
అర్ధవంతంగా లేకపోతే ఆ పోరాటం లేదా సంఘర్షణ చేసే పాత్ర కూడా అర్ధ రహితంగా
మారుతుంది. అంటే బలహీన పాత్ర, లేదా పాసివ్ క్యారక్టరై పోతుంది. బలమైన పాత్రకి ఏఏ
లక్షణాలుండాలంటే, ప్రధానంగా సమస్య సాధనకి వినూత్న వ్యూహాలు పన్నే సునిశిత దృష్టి
గలదై వుండాలి. అందులో యూత్ అప్పీల్ దండిగా వుండాలి. భలే వున్నాడ్రా హీరో గాడూ అని
చూడగానే యూత్ కి అన్పించేలా వుండాలి. ‘బ్రహ్మోత్సవం’ అనే కథ కాదు - నాన్ కమర్షియల్
గా వుండే గాథలో, మహేష్ బాబు లక్ష్యంలో యూత్ అప్పీల్ వుందా? లేదు. ఏడు తరాల
బంధువుల్ని వెతకడమనే ముసలి లక్ష్యంలోనే యూత్ అప్పీల్ లేదు. ఇక ప్రయత్నంలో అసలే
లేదు. అదే ఏడు తరాల బంధువుల ‘అమ్మాయిల్ని’ వెతకడంగా లక్ష్యం వుంటే ఈ కుర్ర
లక్ష్యంతో యూత్ అప్పీల్ తన్ను కొచ్చేస్తుంది. ఏడు తరాల బంధువుల్ని వెతికినా ఆ
లక్ష్య సాధనలో యూత్ అప్పీల్ వుండాలంటే ప్రయత్నాలు వినూత్న వ్యూహాలతో యూత్ ని
ఆకర్షించేలా వుండాలి. ఏ సినిమా కథ ఆలోచించినా వ్యాపార ప్రాతిపదిక - లేదా
అప్పుడున్న మార్కెట్ యాస్పెక్ట్ తోనే ఆలోచించాలి. గాలిలో ఇగోల క్రియేటివిటీలు
చేసుకుంటే ఇంతే సంగతులు. వ్యాపార నష్టం.
Pride and Prejudice లో కీరా
నైట్లీది అందమైన బలమయిన పాత్ర. ఈ పాత్రతో మనం చాలా ప్రేమలో పడిపోతాం. తన మనసులో
ఏముందో తేటతెల్లంచేసే, కుటుంబాన్ని పరిరక్షించే, ఎన్ని సామాజిక అవరోధాలున్నా ప్రేమ
కోసం పెళ్ళాడే సున్నితమైన బలమున్నపాత్ర. ఇక అంతర్గత, బహిర్గత లక్షణాలంటే, ఇవి పాత్రకి
లక్ష్యం ఏర్పడక ముందే, అంటే ప్లాట్ పాయింట్ వన్ కి ముందే బిగినింగ్ విభాగంలో
పాత్రని పరిచయం చేసేప్పుడే ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడు ముందుగా పాత్రేమిటో
అర్ధమవుతుంది. అంతర్గతంగా అతడి మనస్తత్వం ఏమిటి, ఆ మనస్తత్వంతో బయటి ప్రపంచాన్ని
ఎలా చూస్తున్నాడు సీన్లు పడాలి. దీన్ని పీఓవీ (పాయింటాఫ్ వ్యూ) అంటారు. ఒక పీఓవీ
అంటూ ఏర్పడ్డాక, ఆ పీఓవీ ప్రకారం దారి తప్పకుండా కథ నడిపే సులువు రచయిత కంది
వస్తుంది. బలమైన పాత్రలకి హాలీవుడ్ లో దాదాపూ అన్ని సినిమాలూ వుంటాయి. ఎక్కడో గానీ
బలహీన, పాసివ్ ఫ్లాప్ మాస్టర్ జనరల్స్ వుండరు. తెలుగులో పాత సినిమాలు, ముఖ్యంగా
జానపద సినిమాలు చూడొచ్చు. తర్వాత చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లు
నటించిన సినిమాలన్నీ బలమైన పాత్రలే. తర్వాత అరుదై పోయాయి.
Q : మేం వివిధ
భాషల సినిమాలు ఎక్కువ చూసి డిస్కస్ చేసుకుంటాం. దీనివల్ల ఉపయోగముంటుందా? టైం
వేస్టా?
―వినయ్, కెమెరా అసిస్టెంట్
A : రెండూ
వుంటాయి. డిస్కషన్ మంచిదే, దాని స్థాయి ఎంత? కాబట్టి వివిధ రివ్యూలూ అవీ కూడా చదివి
మరింత మేధో వికాసం కోసం డిస్కస్ చేసుకుంటే ఉపయోగ ముంటుంది. ఇక అదే పనిగా సినిమాలు
చూడ్డం, డిస్కస్ చేయడం వ్యసనంగా మారితే నష్టమే. అప్పుడు మూవీ మేకర్స్ అవడం పోయి,
మూవీ లవర్స్ క్లబ్ ఏర్పాటు చేసుకుని సెటిలై పోవాల్సి వస్తుంది చక్కగా. సినిమాలు
చూడ్డం ఒక పరిధిలో వుంచుకుంటూ పని కూడా చేసుకోవాలి. యూట్యూబ్ లో మూవీ మేకింగ్
వీడియోలు చాలా వుంటాయి షాట్స్ తీయడంలో అప్డేట్స్ సహా. వీటి మీద దృష్టి పెడితే
మంచిది. అసలు ఏ షాట్ ఎందుకు తీస్తారో బేసిక్స్ తెలుసుకోవాలి.
―సికిందర్