రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Monday, September 10, 2018

684 : స్ట్రక్చర్ అప్డేట్స్


      A – Actionable: ప్రధాన పాత్ర ఏం సాధించాలనుకుంటోందో గోల్ విస్పష్టంగా వుండాలి. లేకపోతే మీ ఫ్యాన్స్ కి ప్రధాన పాత్ర బోరు కొడుతుంది. గోల్ కి స్పష్టత లోపిస్తే,  గోల్ కోసం ప్రధాన పాత్ర వివిధ చర్యలు (యాక్షన్) తీసుకోవడానికి కూడా ఏమీ వుండదు. ఇందుకే గోల్ నిర్దుష్టంగా వుండాలని  SMART     గోల్ లో మొదటి ఎలిమెంట్ S ప్రాధాన్యం గురించి అంతగా చెప్పుకున్నాం. గోల్ నిర్దుష్టంగా వుంటే యాదృచ్ఛికంగా కొన్ని చర్యలు వాటంతటవే మెదులుతాయి. ఇవే కథనంలో కొన్ని సంఘటనలని సృష్టిస్తాయి. సంఘటనలని నిర్మించుకుంటూపోతే మీ కథకి బలమైన వెన్నెముక డెవలప్ అవుతుంది

         
న్ ది లైన్ ఆఫ్ ఫైర్లో ఎలా వుందో చూద్దాం. హత్యా కుట్రలోంచి అమెరికా అధ్యక్షుణ్ణి కాపాడ్డం సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ గోల్. దీనికి చర్యల పరంపర ఇలా వుంది: కుట్ర జరుగుతోందని కనిపెట్టడం, దీన్ని అధ్యక్షుడికి తెలపడం, అధ్యక్షుడు కొట్టి పారేయడం, ఏజెంట్ కుట్రని ఎలా ఆపాలని కొలీగ్స్ తో చర్చిండం. ఇవీ SMART లో  మూడో ఎలిమెంట్ అయిన A ని ప్రతిబింబిస్తాయి

         
సిల్వర్ లైనింగ్స్లాంటి కథలో, ప్రధాన పాత్ర బాహ్యంగా కోరుకుంటున్నది ఒకటి, అంతరంగంలో అభిలషిస్తున్నదొకటి. రెండూ కథనంలో మిళితమై వుంటాయి. ఇలాటి సందర్భాల్లో చర్యల పరంపరని సృష్టించాలంటే చాలా జాగ్రత్త తీసుకోవాలి

         
కొన్ని చర్యలు మొదటి దాని బాటలో వుంటాయి : ప్రధాన పాత్ర తన భార్య చిన్నప్పటి పాఠ్యపుస్తకాలు చదవాలనుకోవడం, ఆమె గురించి ఇద్దరికీ తెలిసిన ఫ్రెండ్స్ ని అడిగి తెలుసుకోవడం లాంటివి

         
రెండో దాని విషయానికొస్తే, భార్యని రెస్టారెంట్ కి తీసికెళ్ళడం, పోకిరీల బారి నుంచి ఆమెని కాపాడ్డం లాంటివి వస్తాయి. ఏది జరిగినా తీసుకునే ప్రతీ చర్యకీ ప్రతిచర్య వుండేలా చూడాలి. చర్యా దాని ప్రతిచర్యలే కథని ముందుకు నడిపిస్తాయి. పరంపరతో  కథనంలో టెన్షన్ ని పెంచుతూ పోవాలి.  

          R – Realistic : మీ ప్రధాన పాత్ర గోల్ కి ఎదురయ్యే అవాంతరాల్ని విశ్వసనీయంగా అధిగమించాలి. సులభంగా గోల్ సాధించేస్తే మీ ప్రధాన పాత్రని ఫ్యాన్స్ నమ్మరు. అలాగే చిట్టచివరికి అంతిమంగా సాధించే విజయం ప్రశ్నార్ధకం కూడా కాకూడదు. గోల్ సాధన ఇంకే ప్రశ్నలూ రేకెత్తించకుండా లాజికల్ గా, వాస్తవికంగా అన్పించాలి


      రెడ్, టేకెన్, ది బోర్న్ ఐడెంటిటీ మొదలైన మూవీస్ లో ప్రధాన పాత్రలు తీసుకునే చర్యలు ఎంతో వాస్తవికంగా వుంటాయి. ఎందుకంటే పాత్రలు సీఐఏ శిక్షణ పొందిన ప్రొఫెషనల్ పాత్రలు. ఇదేగాక, ఇంకే జానర్ పాత్రయినా దాని వృత్తి వ్యాపకాలతో ప్రొఫెషనల్ గానే గోల్ సాధించాలని మరువకూడదు. SAMRT లో చెప్పే ముఖ్య పాఠమిది

         
కథనం మిడిల్ విభాగంలో, మీ ప్రధాన పాత్ర గోల్ కవసరమైన ప్రత్యేక స్కిల్స్ పొందాలన్నా, లేదా తానున్న స్థితినుంచి పూర్తిగా మార్పు చెందాలన్నా కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయి. మార్పు, లేదా స్కిల్స్ కి టైం ఫ్రేం తక్కువుంటే పొందే మార్పు లేదా స్కిల్స్ నమ్మశక్యంగా వుండవు. అంతలోనే అనుకుని అంతలోనే పోరాట యోధుడిగా మారడం పాత్రకి సహజత్వాన్నివ్వదు. అలాగే రాత్రికి రాత్రి పాత్రకి సైబర్ స్పెషలిస్టు స్కిల్స్ వచ్చేశాయని చూపించడం నమ్మదగ్గ కథనమన్పించుకోదు

         
ఇలా మీ ప్రధాన పాత్ర దాని చర్యలకి విశ్వసనీయంగా పాల్పడే పరిస్థితి లేనప్పుడు, క్లయిమాక్స్ పరిధికి కూడా పరిమితు లేర్పడతాయి. ఇలాటి సమస్యల్నిఅధిగమించాలంటే ఒకటే చేయాలి.  

      స్కిల్స్ లేని పాత్ర స్కిల్స్ వున్న పాత్రతో జత కట్టేలా చూడాలి –‘లివ్ ఫ్రీ ఆర్ డై హార్డ్లో లాగా. అలాగే స్క్రీన్ ప్లేలో సెటప్ విభాగం, అంటే బిగినింగ్ లో కల్పన చేయడం ద్వారా ఇలాటి సమస్యని  అధిగమించవచ్చు. ‘కమింగ్ టు అమెరికాలో బిగినింగ్ విభాగంలో ప్రిన్స్ అకీమ్ ని మార్షల్ ఆర్ట్స్ తో చూపిస్తారు. తర్వాత మిడిల్ కథనంలో, సాయుధుడుగా వచ్చే దొంగని కేవలం మాపింగ్ హేండిల్ నుపయోగించి దెబ్బ తీస్తాడు ప్రిన్స్. ఒక సాధారణ పాత్రకి మార్షల్ ఆర్ట్స్ తెలుసని ముందే చూపించడంతో, ఇప్పుడు అదే సాధారణ పాత్ర సాయుధ దుండగుడ్ని సులభంగా ఎదుర్కోవడం సమస్య కాలేదు

         
రోమాన్స్ విషయానికొస్తే, ఇక్కడ కూడా టైట్ టైం ఫ్రేంతో ప్రేమికులు ప్రేమని సఫలం చేసుకునే క్లయిమాక్స్ వాస్తవికంగావుండదు. ‘ది ప్రపోజల్లోలాగా, హీరో హీరోయిన్లకి పూర్వ పరిచయమే వుండి,  ఇప్పుడు కథాకాలంలో ప్రేమలో పడితే, క్లయిమాక్స్ కి టైం ఫ్రేమ్ సమస్య ఎదురు కాదు

         
అలాగే హీరో హీరోయిన్లు ఇప్పుడు కథాకాలంలోనే పరిచయమై ప్రేమలో పడ్డారంటే,  వాళ్ళెంత మేడ్ ఫర్ ఈచ్ అదరో మీ ఫ్యాన్స్ నమ్మేలా ముందు చిత్రీకరించుకొస్తే, అప్పుడు టైం ఫ్రేమ్ ఎంత వున్నా క్లయిమాక్స్ కి అభ్యంతరాలుండవు.

హెచ్ ఆర్ డికొస్టా
(రేపు T ఎలిమెంట్)