నటుడు డేనియల్ డే లెవిస్ తో దర్శకుడు పాల్ థామస్ ఆండర్సన్ |
Wednesday, February 10, 2021
Tuesday, February 9, 2021
1013 : స్క్రీన్ ప్లే సంగతులు
కాలచక్రం తిరిగిపోతుంది. డానీ కంపెనీ విస్తరణకి ప్రజల సహకారం కోరుతూ
సమావేశాలు నిర్వహిస్తూంటాడు. తమ చమురు భూముల్ని అమ్మాలన్నా,
లీజుకివ్వాలన్నా ప్రజలు వెనుకాడుతారు. కుటుంబం లేని తను విశ్వసనీయత కోసం పదేళ్ళ హెచ్ డబ్ల్యీవ్ ని కొడుకుగా చూపించుకుంటాడు. వ్యాపారానికి
కొడుకుని సెంటిమెంటల్ గా వాడుకుంటాడు. సరేలే గానీ,
మీ ఆవిడ ఏదని ఒకావిడ అడిగితే, వీణ్ణి కని, పురిట్లోనే పోయిందని అబద్ధం చెప్తాడు. డబ్బేతప్ప కుటుంబం గురించి అతడాలోచించ లేదు.
ఈ సమావేశాలు
విఫలమవుతున్నాక, ఒక రోజు పాల్ సండే అనే అతను డానీని
కలుస్తాడు. కలిసి, లిటిల్ బోస్టన్ లో వున్న తమ కుటుంబ
భూముల్ని అమ్మకానికి పెడతాడు. చమురు నిల్వలున్నాయనీ, వచ్చి
చూసుకోమనీ ఆహ్వానిస్తాడు.
***
గాథల్లో
ప్రధాన పాత్ర యాక్టివ్ పాత్రగా వుండదు,
ప్రత్యర్ధి పాత్రే అసమంజస కోర్కెలతో యాక్టివ్ గా వుంటుంది- వుంటేనే ప్రధాన పాత్ర
నైతిక బలం తేలుతుంది. రామాయణం ఒక గాథనుకుంటే, ‘రామాయణం’ లో రఘువంశమంతా పాసివ్ క్యారక్టర్ల మయమే, కైకేయితప్ప. ఈమె యాక్టివ్ గా తన లక్ష్య దృష్టితో
దశరధుడి మీద కోర్కెల బాణం విసరకపోతే, రామాయణమే లేదు. గాథల్లో యాక్టివ్ పాత్రలు నిప్పు రాజెయ్యకపోతే
పాసివ్ పాత్రలకి ఉనికే లేదు, ట్రాజడీల్లేవు, వాటి త్యాగాలూ గొప్పతనాలూ తేలవు.
***
అందుకని
ఐదే సీన్లు. సనల్ శశిధరన్ అనే మలయాళ దర్శకుడు 2015 లో ఒకటి చెప్పాడు : మెయిన్ స్ట్రీమ్
సినిమాలకీ, ఇతర సినిమాలకీ మధ్య విభజన
రేఖ చెరిగిపోయే కాలం రానే వస్తుందని. ఆ కాలం ఇప్పుడొచ్చేసింది. ఇప్పుడు ఓటీటీ
సినిమాలే మెయిన్ స్ట్రీమ్ సినిమాలు. ఓటీటీలో ప్రేక్షకుల్ని ఆకర్షిస్తున్న విభిన్న
ప్రయోగాలే మెయిన్ స్ట్రీమ్ సినిమాలు. దీన్ని థియేటర్ విండో సినిమాలు ఒప్పుకుని
మారాల్సిన సమయం వచ్చేసింది...ఇక అల్లుడు అదుర్స్, రెడ్, బంగారు బుల్లోడు, జాంబీ రెడ్డి, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, 3 రోజుల్లో సరీగ్గా తన్నుకు
చావడమెలా - లాంటి ఆమ్ల వర్షాలు కురిపించే చిలుము పట్టిన రీసైక్లింగ్ మిల్లుని మూసెయ్యాలి.
2021 ఋతువు మారి,
క్రతువు మార్చుకో మంటోంది.
***
డానీ క్యారక్టర్
ని అతడి చర్యల ద్వారానే బయట పెట్టారు. యాక్షన్ స్పీక్స్ క్యారక్టర్ అన్నమాట.
ఒంటరిగా వెండి బావితీసి ఒక్కడే ఒంటరిగా పని చేయడంలో అతడి సంకుచిత మనస్తత్వం
తెలుస్తుంది. ఇతరులతో సంబంధం లేకుండా తన కృషి తానే చేసుకుని, తన సంపాదన తానే సంపాదించుకుని, తానే
అనుభవించాలన్న మనస్తత్వం. కృషిని ఎంత సాహసించి, ఎంత ఓపికగా, ఎంత పట్టుదలగా, ఎంత నైపుణ్యంగా, నిశ్శబ్దంగా చేస్తాడో వెండి తీసే చర్యల్లోనే కన్పిస్తుంది. బావిలోంచి
బయటి కొచ్చి, చలిమంట వేసిన చోట మూత్రం పోస్తాడు. తానే ఒక మంట, ఇంకో మంట ఎదురుగా వుండకూడదన్న భావం. ఈ మంట సీను రాబోయే మంటలాంటి ఇలై
పాత్రతో ఫోర్ షాడోయింగ్ సీను. ప్రత్యర్ధి ఇలైని ఆర్పేస్తాడన్నమాట డానీ. ప్రతీ
చర్యకీ, ప్రతీ షాటుకీ కథతో, పాత్రతో
సంబంధముంది. మన స్టార్ అయితే ఇవన్నీ కామెడీ కోసం చేసి పోతాడు, అంతకంటే క్రియేటివ్ ఆర్ట్ తో ఏం చేయాలో అర్ధంగాక. పనైపోయాక డానీ తన ఖాళీ
సమయాన్ని తనే ఎంజాయ్ చేస్తాడు. పిల్లవాడ్ని వ్యాపారంలో సెంటి మెంటల్ గా
వాడుకుంటున్న డానీ, ఆ పిల్లాడితో ఎంత సెంటిమెంటల్ గా వుంటున్నాడో
పాలల్లో మద్యం కలిపి తాగించినప్పుడే బయట పడింది.
***
పాతిక నిమిషాలూ వృధా కాకుండా నాల్గైదు
సీన్లలో ఇంత కథవుంటే,
ఇంత పాత్ర వుంటే, ఇంకెక్కడికి పోతారు ప్రేక్షకులు? ఈ పాత్ర నటించిన బ్రిటిష్ నటుడు డానియేల్ డే లెవిస్ కి, 2007 ఆస్కార్ ఉత్తమ నటుడి అవార్డు లభించింది.
ఈ బిగినింగ్ విభాగంలో వుండాల్సిన బిజినెస్
వుంది. 1. ఆయిల్ ఉత్పత్తితో కథా నేపథ్యపు
ఏర్పాటు,
2. డానీ, పిల్లవాడు, పాల్ సండే కీలక
పాత్రల పరిచయాలు, 3. విఫల సమావేశాలతో సమస్యకి దారితీసే
పరిస్థితుల కల్పన, 4. భూముల ఆఫర్ తో పాల్ సండే రాకతో సమస్య
ఏర్పాటు.
ఆసక్తి పరులు తమ క్రియేటివ్ అప్డేట్స్
కోసం ముందుగా ఈ బిగినింగ్ విభాగాన్ని క్షుణ్ణంగా స్టడీ చేసుకుంటే, ఆ తర్వాత మిడిల్-1
కెళ్దాం. సినిమా నెట్ ఫ్లిక్స్ లో వుంది.
―సికిందర్
Wednesday, February 3, 2021
సినిమా అంటే ఒక
హీరో - ఒక విలన్, సినిమా అంటే ఒక యాంటీ హీరో - ఒక
పోలీసు, సినిమా అంటే ఒక మంచి మాఫియా - ఒక చెడ్డ మాఫియా... సినిమా
అంటే ఇద్దరూ విలన్లే అయితే? పెట్టుబడి దారు - మత ప్రచారకుడు? సంపద కోసం సంఘర్షణ? దేర్ విల్ బి బ్లడ్ - భూమాత దేహ
నాళాల్లో చమురు కోసం?...ఇద్దరు విలన్ల ఇంటర్ ప్లేతో స్క్రీన్
ప్లే ఏమిటి? కథనా, గాథనా? రేపటి నుంచి...
Sunday, January 31, 2021
1012 : సందేహాలు - సమాధానాలు
A : ‘అర్జున్ రెడ్డి’ రోమాంటిక్ డ్రామా జానర్. రోమాంటిక్ డ్రామా గోల్ లేకపోయినా ఒక్కోసారి చెల్లుతుంది. ఇదే రోమాంటిక్ కామెడీ అయితే చెల్లదు. రోమాంటిక్ డ్రామాలు, ఇంకెవైనా ఫ్యామిలీ డ్రామాలు గాథల కిందికొస్తాయి. గాథలు తప్ప కథలనే వాటికి గోల్ వుండాల్సిందే. జీవితంలో గోల్ లేకుండా ఏ మనిషి వుంటాడు. వుంటే ఇంట్లోంచి వెళ్ళగొడతారు. వెళ్ళ గొట్టించుకునే గాథలు రాసుకోవచ్చు. సినిమా తీయాలన్న గోల్ తో వచ్చి, హీరోకి గోల్ ని ఎలా కాదంటారు. దర్శకుడికి కెరీర్ గోల్ వుండాలి గానీ హీరోకి, నిర్మాతకి బాక్సాఫీసు గోల్ వుండ కూడదా? కథ కి చక్రాల్లాంటిగి గోల్. చక్రాల్లేకుండా కథెలా డిజైన్ చేస్తారో తెలియదు. ఆర్ట్ సినిమాల గురించి శివాజీ గణేశన్ ఒకసారి చెప్పారు : నదిలో పడవ పోతూ వుంటుంది…ఇంకా పోతూ వుంటుంది ... పోతూనే వుంటుంది…కథలో ఏమీ జరగదని! పడవకి చక్రాలుండవు. అలలు ఎటు తోస్తే అటు వెళ్ళి పోవాల్సిందే. గాథ చేయాలనుకున్నప్పుడు గోల్ లేకుండా రాసుకోవచ్చు. కథ చేయాలంటే చాలా ప్లస్ లు, మైనస్ లు దృష్టిలో పెట్టుకోవాల్సి వుంటుంది. గోల్ ఒక ప్లస్.
Q : మీరు
డ్రమెటిక్ క్వశ్చన్ అని తరచూ అంటారు. అంటే ఏమిటి? కథలో అదెలా
వుంటుంది?
―అశోక్ గౌడ్, అసోషియేట్
A : మనం బ్లాగులో హాలీవుడ్ పదాలు వాడడంతో ఇలాటి సందేహాలు వస్తూంటాయి. ఏదైనా
తెలుసుకోవడానికి మనకి హాలీవుడ్ తప్ప దిక్కులేదు. వాళ్ళు శాస్త్రాల్ని నిత్యం
అభివృద్ధి చేసుకుంటూ వుంటారు కాబట్టి. డ్రమెటిక్ క్వశ్చన్ అంటే మరేమీ కాదు
పాయింటు. కథలో పాయింటు. అయితే గమనించాల్సిందేమిటంటే, రెండిటి
అర్ధం ఒకటే అయినా సైకాలజికల్ గా రచయిత మీద వేర్వేరుగా పనిచేస్తాయి. పాయింటు అనే
పదం జడంగా వుండే భావం కల్గిస్తుంది. అదే డ్రమటిక్ క్వశ్చన్ చలనంలో వుండే ఉత్సాహం
కల్గిస్తుంది. పాయింటు గురించి - పాయింటా? ఆఁ... కథలో అలా
పడుంటుందిలే పాయింటు అన్పిస్తుంది తేలిగ్గా. దాంతో రచయిత కూడా పాసివ్ గా పడుంటాడు.
అదే డ్రమెటిక్ క్వశ్చన్ అనుకుంటే - అమ్మో ఏదో చేయాలనుకుంటాడు. క్వశ్చన్, అంటే ప్రశ్న తలెత్తిందంటే అది కార్యాచరణకి సిద్దం చేస్తుందిగా? యాక్టివ్ గా మారతాడు. అప్పుడా కథలో డ్రమెటిక్ క్వశ్చన్ కి జవాబు వెతికే ఎజెండాతో, క్వశ్చన్ ని ఫోకస్ చేస్తూ కథని ఉరుకులు
పెట్టిస్తాడు.
Wednesday, January 27, 2021
1011 : రివ్యూ
రచన -దర్శకత్వం : ప్రవీణ్
వర్మ
తారాగణం : నవీన్ చంద్ర, చాందినీ చౌదరి, రాకేందు
మౌళి, అజయ్ తదితరులు
సంగీతం : సన్నీ ఎంఆర్, ఛాయాగ్రహణం : దివాకర్ మణి,
నిర్మాత : సుధీర్ వర్మ
విడుదల : ఆహా
***
ఇందులో క్రికెట్ బెట్టింగ్ నెట్ వర్క్ ఎలా పనిచేస్తుందో ఆపరేషన్స్ వివరంగా చూపించారు. ఇదొక అండర్ వరల్డ్ దందా. బెట్టింగ్ ఏజెంట్లు, బుకీలు, హవాలా దార్లు, డబ్బు చెల్లింపులు, అదును చూసి మోసాలు, పోలీసులతో సంబంధాలూ ఇవన్నీ ఒక రాత్రి కథలో చూపించారు. ఇది చూస్తే మర్యాదగా బతకాలనుకునే వాళ్ళు క్రికెట్ బెట్టింగ్స్ జోలికి పోరనేది దర్శకుడి ఉద్దేశమైతే అది నెరవేరుతుంది. డ్రగ్ మాఫియా మీద అదే పనిగా సినిమాలొచ్చి విలువ కోల్పోయాయి. కొత్తగా క్రికెట్ బెట్టింగ్ మాఫియా గురించి ఇదొక రౌండప్.
―సికిందర్
Tuesday, January 26, 2021
Friday, January 22, 2021
1010 : రివ్యూ
***
***