Thursday, January 11, 2024
1398 : స్క్రీన్ ప్లే టిప్స్
Monday, January 8, 2024
1397 : రివ్యూ
కన్నప్పన్ (సతీష్) గేమ్ డిజైనర్ గా ఉద్యోగ ప్రయత్నాల్లో వుంటాడు. తండ్రి ఆంజనేయన్ (విటివి గణేష్) పెన్షన్ తో ఇల్లు గడుస్తూంటుంది. తల్లి లక్ష్మి (శరణ్య) యూట్యూబ్ వీడియోలు తీస్తూంటుంది. పెళ్ళి కాని మామ శేఖర్ (నమో నారాయణ్) ఇంట్లో పడి తింటూ వుంటాడు. ఒకరోజు ఇంట్లో నీళ్ళు రాకపోతే పక్కన పాడుబడి మూసిపెట్టిన బావి మీద రేకులు తీసి నీళ్ళు తోడుతాడు కన్నప్పన్. ఆ బకెట్టుకి చిక్కుకుని ఒక శిథిలావస్థలో వున్న డ్రీమ్ క్యాచర్ వస్తుంది. పీడ కలలు రాకుండా పడగ్గదిలో పెట్టుకునే దిష్టి బొమ్మ లాంటిది అది. దానికి ఈకలుంటే ఒక ఈక పీకుతాడు. అంతే, పీకల్లోతు ప్రమాదంలో ఇరుక్కుపోతాడు. రాత్రి నిద్రపోతే కలలో ఒక కోట కనిపిస్తుంది. ఆ కోటలో తనపాటు ఒక ఆడ దెయ్యం వుంటుంది. తప్పించుకుని బయటపడతాడు. మెలకువొఛ్చేస్తుంది. ఇలా ప్రతీరాత్రీ జరుగుతుంది. కలలో ఆడ దెయ్యం కొడితే ఆ దెబ్బ తెల్లారి వొంటి మీద కన్పిస్తుంది.
ఇలా వుండగా, డెవిల్ ఆర్మ్ స్ట్రాంగ్ (ఆనంద్ రాజ్) అనే రౌడీకి డబ్బులు బాకీ పడతాడు కన్నప్పన్. ఆ రౌడీ వేధిస్తూంటాడు. కన్నప్పన్ పీడకలలకి సంబంధించి ఎళుమలై (నాజర్) అనే భూత వైద్యుణ్ణి సంప్రదిస్తాడు. డ్రీమ్ క్యాచర్ వల్ల పీడకలలొస్తున్నాయంటే ఈ కోటలో ‘డ్రీమ్ కీ’ వెతికి పట్టుకోవడం ఒక్కటే మార్గమని చెప్తాడు ఎళుమలై. పీడకలలో ఆ కోట 1930లలో బ్రిటిష్ కాలపు నాటిదని, అందులో రాబర్ట్- మెక్డలీన్ అనే ప్రేమికులు హత్యకి గురయ్యారనీ, ఆ ఆడ దెయ్యం మెక్డలీన్ దేననీ చెప్తాడు.
ఇప్పుడు కన్నప్పన్ ఏం చేశాడు? పీడకలల్ని వదిలించుకోవడానికి కోటలో ‘డ్రీమ్ కీ’ ని వెతికి పట్టుకున్నాడా? ఆ ప్రయత్నంలో ఆడ దెయ్యంతో ఎన్ని ప్రమాదాలెదుర్కొన్నాడు? డెవిల్ ఆర్మ్ స్ట్రాంగ్ పీడ ఎలా వదిలించుకున్నాడు? డాక్టర్ జానీ (రెడిన్ కింగ్ స్లే) అనే సైకియాట్రిస్టు కూడా దిష్టి బొమ్మ ఈక పీకితే అతడికే జరిగింది? కన్నప్పన్ ఇంట్లో కూడా తెలియక అందరూ ఈకలు పీకితే వాళ్ళకేం జరిగింది? అంతా కలిసి పీడకలలో కోటలో దెయ్యం పాలబడ్డారా? ఈ కేసులో భూతవైద్యుడు ఎళుమలైకి పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ డార్క్ డేవ్స్ (రెజీనా) ఎలా తోడ్పడింది? ఇదీ మిగతా కథ.
పీడకలల్లో వచ్చే హార్రర్ సీన్లు కాసేపటికే తేలిపోతాయి. భయపెట్టే హర్రర్ కంటే కామెడీలు ఎక్కువుంటాయి. ఈ కామెడీలు భయం చుట్టే రొటీన్ గా వుంటాయి. రౌడీతో, సైకియాట్రిస్టుతో కామెడీలు కొన్ని నవ్వించినా- అసలు పాయింటు ‘డ్రీమ్ కీ’ రహస్యం గురించి కథ సాగదు. ఆ ‘డ్రీమ్ కీ’ కోసం పోటాపోటీలతో ఆడ దెయ్యంతో తలపడే కథగా వుంటే పాత్రలు నేర్చుకునే పాఠాలుగా వుండేది. రొటీన్ గా ఆడ దెయ్యానికి జరిగిన అన్యాయం గురించే కథ చేయడంతో- కొత్త ఐడియా కాస్తా పాత పచ్చడియే అయింది.
ఈ మూవీ సౌండ్ డిజైన్, యువన్ శంకర్ రాజా సంగీతం, యువ సమకూర్చిన ఛాయాగ్రహణం హార్రర్ వాతావారణాన్ని సమృద్ధిగా సృష్టిస్తాయి. అయితే చూసి భయపడేంత కాదు. కొత్త దర్శకుడు జేవియర్ కొత్త ఐడియాలో వున్న నిగూఢార్ధాన్ని పట్టుకోగలిగివుంటే ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాగా వుండేది. దీన్ని కొంచెం తేడాగా పీడ కలల్లో జరిగే కథగా రొటీన్ హార్రర్ కామెడీ అనుకుని పైపైన చూసేస్తే ఏ బాధా వుండదు.
—సికిందర్
Friday, January 5, 2024
1396 : సందేహాలు- సమాధానాలు
―మకరందం, AD
A : ముందు తెలుగు సినిమా దర్శకుడో రచయితో కావాలనుకుంటే 1910 నుంచీ కనీసం తెలుగు సినిమా చరిత్ర విధిగా చదువుకుని రావాలి. సినిమా చరిత్రలో నిర్మాణాల పరంగా ఎక్కడెక్కడ ఏమేం జరిగాయి, పరిణామాలూ పర్యవసానాలూ వాటి పరిష్కారాలూ ఏమేం చోటు చేసుకున్నాయో తెలుసుకుని వుండాలి. ఇండియాలో వుంటూ ఇండియా చరిత్ర తెలియక పోవడం ఎలాటిదో, సినిమాల్లో వుంటూ సినిమా చరిత్ర తెలియక పోవడం అలాటిది. కనీసం మనం ఓ కంపెనీలో చేరాలన్నా దాని పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకుని గానీ చేరం. సినిమాల్లో చేరాలంటే మాత్రం ఏమీ తెలుసుకోకుండా రెక్కలు కట్టుకుని వాలిపోవడమే.
—సికిందర్
Tuesday, January 2, 2024
1395 : 2023 రౌండప్
2023 లో కూడా తెలుగు చలన చిత్ర సీమ టాలీవుడ్ పానిండియా కలలతోప్రయాణించింది. కానీ ప్రయాణపు బడలిక స్పష్టంగా కనిపించింది. ‘ఏ స్టార్లు’, ‘బీ స్టార్లు’ కలిసికట్టుగా పానిండియా మీద దండయాత్ర చేశారు. కానీ పల్లెకు పోదాం పారును చూద్దాం ఛలో ఛలో అని తిరిగొచ్చేశారు, ఒకరు తప్ప. మిగిలిన 8 మందీ బయల్దేరిన చోటుకే తిరిగొచ్చి, టౌను పక్కకెళ్ళొద్దురా డింగరీ డాంబికాలు పోవద్దురా అని లోకల్ గా సెటిలై పనులు చూసుకోసాగారు. రవితేజ, నాని, విజయ్ దేవరకొండ, కళ్యాణ్ రామ్, రామ్ పోతినేని, నిఖిల్ సిద్ధార్థ, సమంతా ... నటించిన తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో పానిండియా సినిమాలు తెలుగులోనే సక్సెస్ కి దూరంగా వుండిపోయాయి- ఒక్క నాని ‘దసరా’ తప్ప. తెలుగులో అదే పాత మూసని ఉత్పత్తిచేస్తూ దాన్ని పానిండియాలో విక్రయించాలనుకోవడం అత్యాశే అయింది. ఈ ప్రయాణంలో ఒక్క ప్రభాస్ కే ‘సాలార్’ తో పానిండియా పతకం దక్కింది.
ఇక పానిండియా + లోకల్ సినిమాలన్నీ కలిపి చూస్తే 2023 లో మొత్తం ‘ఏ స్టార్లు’ నటించినవి 17 పెద్ద సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో ఏడే హిట్టయ్యాయి. చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ ‘వీర సింహా రెడ్డి’, ‘భగవంత్ కేసరి’, నాని ‘హాయ్ నాన్నా’, ‘దసరా’, ధనుష్ ‘సార్’, ప్రభాస్ ‘సాలార్’ 7 మాత్రమే హిట్టయి- చిరంజీవి నటించిన మరొకటి ‘భోళాశంకర్’, పవన్ కళ్యాణ్ ‘బ్రో’ ఒకటి నటిస్తే ఈ ఒకటీ, రవితేజ నటించిన ‘రావణాసుర’, ‘టైగర్ నాగేశ్వరరావు’ రెండూ, విజయ్ దేవరకొండ ‘ఖుషీ’ ఒకటి నటిస్తే ఆ ఒకటీ, రామ్ పోతినేని ‘స్కంద’ ఒకటి నటిస్తే ఇదీ, కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’, ‘డెవిల్’ రెండు నటిస్తే రెండూ, నితిన్ ‘ఎక్స్ ట్రా ఆర్డినరీ’ ఒకటి నటిస్తే ఈ ఒకటీ, సమంత ‘శాకుంతలం’ ఒకటి నటిస్తే ఇదీ, మొత్తం కలిపి 10 ఫ్లాపయ్యాయి. అంటే ఈ సంవత్సరం పవన్ కళ్యాణ్, రవితేజ, విజయ్ దేవరకొండ, రామ్ పోతినేని, కళ్యాణ్ రామ్, నితిన్, సమంతా ‘ఏ స్టార్లు’ ఏడు గురూ సక్సెస్ ని పట్టుకోలేకపోయారు. 7 హిట్లు, 10 ఫ్లాపులతో ‘ఏస్టార్లు’ 41 శాతం సక్సెస్ నిచ్చారు.
మెగా క్యాంపు స్టార్లు సాయి ధరమ్ తేజ్ (పవన్ తో కలిసి ‘బ్రో’), వైష్ణవ్ తేజ్ (ఆది కేశవ) వరుణ్ తేజ్ (గాండీవ ధారి అర్జున) లు మూడు నటిస్తే మూడూ ఫ్లాపయ్యాయి. నాగార్జున వారసులు నాగచైతన్య (కస్టడీ), అఖిల్ (ఏజెంట్) రెండు నటిస్తే రెండూ ఫ్లాపయ్యాయి. సుధీర్ బాబు నటించిన (హంట్, మామా మశ్చీంద్ర) రెండూ ఫ్లాపయ్యాయి. విశ్వక్ సేన్ నటించిన (దాస్ కా ధమ్కీ, బూ) రెండూ ప్లాపయ్యాయి. శ్రీసింహా కోడూరి రెండు నటిస్తే (భాగ్ సాలే, ఉస్తాద్ ) రెండూ ఫ్లాపయ్యాయి.
ఇక ఒక్కొక్కటి నటిస్తే ఫ్లాపయిన హీరోలు : నాగశౌర్య (రంగబలి), జగపతిబాబు (రుద్రాంగి), కార్తికేయ (బెదుర్లంక), నిఖిల్ సిద్ధార్ధ (స్పై), సందీప్ కిషన్ (మైకేల్), గోపీచంద్ (రామబాణం), అల్లరి నరేష్ (ఉగ్రం), సునీల్ (భువన విజయం), నరేష్ (మళ్ళీ పెళ్ళి), ఆది (సి ఎస్ ఐ సనాతన్), అజయ్ (చక్రవ్యూహం), బెల్లంకొండ గణేష్ (నేను స్టూడెంట్ ని సార్), తిరువీర్ (పారేషాన్), రాహుల్ రామకృష్ణ (ఇంటింటి రామాయణం), నవీన్ చంద్ర (మంత్ ఆఫ్ మధు), హన్సిక (మై నేమ్ ఈజ్ శృతి).
ఇలా 26 మంది ‘బీ స్టార్లు’ 34 ఫ్లాపులిస్తే, ఒకటి నటించి ఆ ఒకటి హిట్టిచ్చిన ‘బీ స్టార్లు’ ఆరుగురు - శ్రీవిష్ణు (సామజవర గమన), నవీన్ పోలిశెట్టి -అనూష్కా శెట్టి (మిస్ శెట్టి- మిస్టర్ పోలిశెట్టి), సాయి ధరమ్ తేజ్ (విరూపాక్ష), శ్రీకాంత్ (కోట బొమ్మాళి), తరుణ్ భాస్కర్ (కీడా కోలా), పాయల్ రాజ్పుత్ (మంగళవారం). అంటే 6 హిట్లు, 34 ఫ్లాపులతో 32 మంది ‘బీ స్టార్లు’ 15 శాతం సక్సెస్ నిచ్చారు.
ఇక చిన్న సినిమాలు 113 విదుదలయ్యాయి. వీటిలో 95 శాతం కొత్త వాళ్ళతో వూరూ పేరూ లేనివే. మొత్తం 113 చిన్న సినిమాల్లో ‘బలగం’, బేబీ’, ‘మ్యాడ్’, ‘మావూరి పొలిమేర 2’ అనే 4 మాత్రమే హిట్టయ్యాయి. సక్సెస్ రేటు 3.5 శాతమే. మొత్తం అన్ని సినిమాలూ కలిపి 160 విడుదలైతే, 7 ‘ఏ స్టార్’ హిట్లు, 6 ‘బీ స్టార్’ హిట్లు, 4 చిన్న హిట్లు తేలాయి. మొత్తం 17. సక్సెస్ రేటు 10 శాతం.
ఈ పది శాతం సక్సెస్ దశాబ్దాలుగా మెయింటైన్ అవుతున్నదే టాలీవుడ్ లో. ఇంతకి మించి ఎదగడానికి ప్రయత్నించడం లేదు. అనూహ్యంగా అందివచ్చిన పానిండియా అవకాశాలతో కూడా. ‘ఏ సినిమాలు’ పానిండియా’ వైపు చూస్తూంటే, ‘బీ సినిమాలు’ ఆ ఖాళీలో ‘ఏ సినిమాలు’ గా ఎదగాలి. ‘బీ సినిమాల’ ఖాళీలోకి ‘సి సినిమాలు’ చేరుకోవాలి. ఈ అభివృద్ధి ప్రణాళిక ఎవరి దగ్గరా లేదు. ఎందుకు లేదో ఆగి ఆలోచించుకోవాలి.
Monday, January 1, 2024
Sunday, December 24, 2023
1394 : స్క్రీన్ ప్లే సంగతులు
1. బిగినింగ్ (ఫస్టాఫ్) :
2. మిడిల్-1 : విషయం తెలుసుకుని విరాజ్ కాఫీ షాప్ కొస్తే, ఇక్కడ కూతురితో యష్ణ వుంటుంది. పరిచయాలవుతాయి. ఇక తప్పక, యష్ణ ప్రోద్బలంతో కూతురికి అమ్మ కథ చెప్పడం ప్రారంభిస్తాడు. ఈ కథలో అమ్మగా యష్ణని వూహించుకుంటానంటుంది కూతురు. అలా కూనూరు (తమిళనాడు) లో యష్ణ లాగా అమ్మని ఊహించుకుంటున్న వర్ష (మృణాల్ ఠాకూర్) కథ అంటే ఫ్లాష్ బ్యాక్ -1 ప్రారంభమవుతుంది.
వర్ష సింగర్. ఈమెని చూడగానే ప్రేమలో పడతాడు విరాజ్. కీచులాడుకునే తల్లిదండ్రులతో మనశ్శాంతి వుండదు వర్షకి. ఆమెకి ఒక తమ్ముడుంటాడు. ఆమె విరాజ్ తో ప్రేమలో పడుతుంది. కానీ విరాజ్ తో పెళ్ళికి వర్ష తల్లి అంగీకరించదు. అంతస్తుల తారతమ్యం. ఆమెకి భరోసా ఇచ్చి వర్షని పెళ్ళి చేసుకుంటాడు.
అయితే పిల్లలు వద్దని ముందే చెప్పి పెళ్ళికి ఒప్పుకుంటుంది వర్ష. మూడేళ్ళు గడిచాక పిల్లలు కావాలంటాడు. ఇక్కడ గొడవపడుతుంది. తర్వాత ఒప్పుకుంటుంది. మహిమ పుడుతుంది. పుట్టగానే సిస్టిక్ ఫైబ్రోసిస్ తో పుట్టిందని చెప్తాడు డాక్టర్ రంజన్ (నాజర్). ఇద్దరూ షాక్ అవుతారు. ఈ ఫ్లాష్ బ్యాక్-1 ఇక్కడి వరకు చెప్పి ఆపుతాడు.
తర్వాత ఇంట్లో లాప్ టాప్ ఓపెన్ చేసి యష్ణ ఫోటోనే చూస్తాడు. ఈమె యష్ణ కాదు. కథలో తల్లి పాత్రని యష్ణ లాగా ఊహించుకుంది కూతురు. కాబట్టి ఈ పాత ఫోటోలో వున్నది యష్ణ కాదు, ఈమె వర్ష అయుంటుంది. అంటే యష్ణే వర్ష. విరాజ్ చెప్పింది యష్ణ కథే. తనకిప్పుడు యష్ణ లాగా పరిచయమైంది మెమరీ లాస్ అయిన వర్షే. ఈ డిక్లరేషన్ తో మిడిల్ -1 అంటే ఫస్టాఫ్ ముగుస్తుంది.
ఇప్పుడు విరాజ్ తండ్రి (జయరాం) వచ్చి యష్ణ తల్లి చేసిన కుట్రని బయటపెడతాడు. అతను విరాజ్ తండ్రి కాదనీ, యష్ణ తల్లితో పడక వెళ్ళిపోయిన యష్ణ తండ్రేననీ ఇప్పుడు బయటపడుతుంది. చాలా గొడవల తర్వాత యష్ణని విరాజ్ కే వదిలేస్తాడు డాక్టర్ అరవింద్. ఇప్పుడు కూతురికి అకస్మాత్తుగా అనారోగ్యం చేస్తుంది. ఈ సంఘటనతో ప్లాట్ పాయింట్- 2 వస్తుంది. అంటే మిడిల్ -2 ముగుస్తుంది.
4. ఎండ్ : కూతురికి ఆపరేషన్ ఏర్పాట్లు జరుగుతాయి. యష్ణ తల్లి ఈ కూతురికి యష్ణ గురించి నిజం చెప్పేస్తుంది -ఈమే మెమరీ లాస్ అయిన నీ తల్లి వర్ష అని. మెమరీ లాస్ తోనే వున్న యష్ణ తనని తల్లిగా అంగీకరిస్తుందో లేదోనని మహిమని అడిగి చూస్తుంది. తలూపుతుంది మహిమ. దీంతో ఈ సినిమా కథ ముగుస్తుంది.
క్రియేటివ్ యాస్పెక్ట్ : ఈ కాన్సెప్ట్ కి క్రియేటివ్ యాస్పెక్ట్ తికమక పెట్టేస్తుంది. హాయ్ నాన్నా అనడంలో ఇది విరాజ్ సమస్యతో కూడిన విరాజ్ కథ అనిపిస్తుంది. కానీ వర్ష/యష్ణ సమస్య కేంద్రంగా కథ సాగుతుంది. అలాగే కూతురు మహిమ అమ్మ కథ కోసం విరాజ్ ని ఇబ్బంది పెడుతూ వుంటుంది. కాబట్టి తల్లి కోసం మహిమ కథలా కూడా అనిపిస్తుంది. ఇంతకీ ఎవరి కథ? ఎవరి కథ ఆధారంగా ఐడియాని విస్తరించి ఈ కథ చే శారు?
ఫస్టాఫ్ అమ్మ కథ కోసం /అమ్మ కోసం మహిమ కథగా సాగి, సెకండాఫ్ మహిమ కథ అదృశ్యమై, ఆ అమ్మ వర్ష/యష్ణ మెమరీలాస్ కథగా మారుతుంది. అంటే ఫస్టాఫ్ కంటిన్యూటీ లేక సెకండాఫ్ -సెకండాఫ్ సిండ్రోమ్ లో పడింది. ఇక్కడ విరాజ్ కథ అదృశ్యమయిపోయింది. ఫస్టాఫ్ తో సంబంధం తెగి సెకండాఫ్ తెగిన గాలి పటంలా ఎలా పడితే అలా సాగింది. ఇలా క్రియేటివ్ యాస్పెక్ట్ ఏక సూత్రత లోపించడంతో బోలెడు కన్ఫ్యూజన్.
అంటే అనుకున్న ఐడియా స్ట్రక్చర్ లో లేదు. స్ట్రక్చర్ అంటే త్రీ యాక్ట్ స్ట్రక్చర్. ముందు తట్టిన ఐడియాకి స్ట్రక్చరుందా లేదా చూసుకోకపోవడం వల్ల స్క్రీన్ ప్లేకీ స్ట్రక్చర్ లేక గజిబిజి కథలా తేలింది. ముందుగా ప్రధాన పాత్ర ఎవరో తేల్చుకుని, దాన్ని బేస్ చేసుకుని, దాని కథగా ఐడియాని విస్తరించినప్పుడే స్క్రీన్ ప్లేకి తగిన బలమైన పునాది పడుతుంది.
ఇక రెండో పాత్ర వర్షకి పాటలంటే ఇష్టం. నిర్ణయాలు చప్పున మార్చుకుంటుంది. అలాగని స్థిరత్వం లేకపోవడం ఈమె స్వభావమన్నట్టు పాత్ర చిత్రణ వుండదు. కాబట్టి కన్నీళ్ళు వర్షించినప్పుడు సానుభూతి ఏర్పడదు. పైగా పాటలు పాడే వర్షగా గతాన్ని మర్చిపోయిన తను, యష్ణగా పాటలు పాడుతుంది.
మూడో పాత్ర యష్ణ అంటే ప్రార్థించడం, తెల్ల గులాబీ, స్వచ్ఛత, దయ, ఆధ్యాత్మికం అనే అర్ధాలున్నాయి. వర్షగా గతాన్ని (విరాజ్ ని) మర్చిపోయి యష్ణగా విరాజ్ ప్రేమకోసం ప్రయత్నిస్తూ వుంటుంది. ఈమె ఒక్కతే ఒక లక్ష్యం, గమ్యం, ప్రయత్నం అంటూ వున్న యాక్టివ్ లక్షణాలున్న పాత్రగా కన్పిస్తుంది. కానీ కాదు. కథకుడు విరాజ్ ని కథ నడుపుకొనిస్తే యష్ణ పాత్రే వుండదు. ఇదెలాగో చివర్లో తెలుసుకుందాం. అయితే .పేరుకున్న అర్ధాలకి తగ్గట్టే పాత్ర వుంది.
నాలుగో పాత్ర మహిమ అమ్మ కథ కోసం ఫస్టాఫ్ లో యాక్టివ్ గా వుంటూ, అదే యాక్టివ్ నెస్ తో కథలో అమ్మలాగా వూహించుకున్న యష్ణని నాన్నతో కలిపే కార్యక్రమం చేపట్టకుండా, సెకండాఫ్ లో పాసివ్ గా మారిపోతుంది. పేరుకి తగ్గ మహిమల్నేం మెరిపించదు. విరాజ్ ఈమెకి ఇలాటి కథలు చెప్పకుండా ‘ముత్యాలముగ్గు’ సినిమాని చూపించాల్సింది. అద్భుత రసంతో ఎంటర్ టైన్ చేస్తూ పిల్లలు తల్లిదండ్రుల్ని కలిపే సూపర్ హిట్ ఫ్యామ్ జానర్ సినిమా.
పాత్రల తీరుతెన్నులు ఇలావుంటే కథ తిన్నగా ఎలా వుంటుంది. ఏ కథ కైనా పాత్రలతో బలాబలాల సమీకరణ వుంటుంది. అప్పుడే సరైన, ఏకోన్ముఖ సంఘర్షణ పుడుతుంది. కౌరవులెవరో, పాండవులెవరో, కృష్ణుడెవరో, అర్జునుడెవరో గీత గీసి ఆట మొదలెట్టక పోతే అది కురుక్షేత్రమవదు.
ఇలా వెంటనే అమ్మ ప్రస్తావన దేనికి? దాన్ని వాయిదా వేసి, తండ్రీ కూతుళ్ళ అనుబంధాన్ని జాలీ లైఫ్ గా ఎంటర్ టైన్ చేస్తూ చూపించ వచ్చుగా? ఈ ఎంటర్ టైన్మెంట్ లో తల్లి కనిపించక పోతే తల్లి ఏమైందన్న ప్రశ్న, సస్పెన్స్ అంతర్లీనంగా మనకుంటే సరిపోతుందిగా? పాత్రల చేత కన్ఫమ్ చేసి రసభంగం కల్గించడం దేనికి? అమ్మ లేదనే అర్ధంలో అప్రస్తుత డైలాగులతో థియేటర్ లో లో- వైబ్రేషన్ ప్రసారం చేయడం దేనికి? పరమ హేపీ లైఫ్ చూపిస్తూ ప్రేక్షకులకి- బాక్సాఫీసుకీ హై ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్ అందించొచ్చుగా హుషారొచ్చేలా? సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోరు కూడా - ప్రారంభించింది మొదలు ముగించే వరకూ ఒకటే లో- వైబ్రేషన్ తో పాథోస్ తోనే వుంటుంది భారంగా. కఠినమైన స్ట్రక్చర్ స్కూల్ అవసరం ఫీలవక పోయినా, క్రియేటివ్ స్కూల్ తోనైనా స్కిల్స్ కనబర్చి వుంటే బావుండేది.
అయితే ఆరేళ్ళ క్రితం విరాజ్ కి భార్యతో జరిగిన ట్రాజడీ దృష్ట్యా ఇప్పుడతను హేపీగా ఎలా వుంటాడనొచ్చు. వుండొచ్చు. స్టీవ్ హార్వే అనే లా ఆఫ్ ఎట్రాక్షన్ హోస్ట్ టీనేజీలో తల్లిని కోల్పోయి డిప్రెషన్ లోకి వెళ్ళి పోయాడు. అప్పుడొక చర్చి మినిస్టర్, నీ మదర్ నీకు చేసిన మంచి పనులు తల్చుకోమన్నాడు. తల్చుకుంటే స్టీవ్ ముఖంపై నవ్వు వెలసింది. అంతే, ఇక మదర్ తోవున్న అలాటి తియ్యటి జ్ఞాపకాలతో హేపీగా గడప సాగాడు. తమవాళ్ళు ఏడుస్తూంటే వెళ్ళిపోయిన ఆత్మలకి నచ్చదు, ఆత్మలంటూ వుంటే. అవి సంతోషంగా వుండాలనే కోరుకుంటాయి.
మరొకందుకు కూడా విరాజ్ కూతుర్ని సంతోష పెడుతూ గడపాలి. ఎందుకంటే విరాజ్ కి తన ట్రాజడీ కంటే ఎక్కువ కూతురికి పుట్టుకతోనే ప్రాణాంతక సిస్టిక్ ఫైబ్రోసిస్ అనే ఊపిరితిత్తుల వ్యాధి వుంది. ఈ వ్యాధి ఇప్పుడు కాకపోయినా టీనేజీలో తిరగబెట్ట వచ్చు. కనుక కూతుర్ని వీలైనంత సంతోష పెడుతూనే గడపక తప్పదు.
ఈ వ్యాధికి చికిత్స లేదు. సినిమాలో చూపించినట్టు ఆపరేషన్ గీపరేషన్ ఏమీ వుండదు. ఎందుకంటే జెనెటిక్ థెరఫీ సాధ్యం కాదు. మందులతో నియంత్రించ వచ్చు, నివారణ లేదు. పూర్వం ఈ వ్యాధితో 30 ఏళ్ళు బ్రతికే వారు. ఇప్పుడు మందులు అభివృద్ధి చెందడం వల్ల ఆయుప్రమాణం 50 ఏళ్ళకి పెరిగింది. ఆ తర్వాత బతకడం కష్టం. మందులు వాడుతూ అరుదుగా 80 ఏళ్ళు బ్రతికిన వారున్నారు. కూతురికి ఇంత శిక్ష దేనికి? ఈ ప్రశ్న వేసుకుంటే కూతురికి ఈ వ్యాధి అంటగట్టి వుండడు కథకుడు.
కథలో ఆడ పాత్రలకి ట్రాజడీలే కాక శిక్షలు కూడానా? లేక- ‘సంతోషంగా వుండే కుటుంబాలన్నీ ఒకే సంతోషాన్ని కలిగివుంటాయి, కానీ సంతోషంగా లేని కుటుంబాల అసంతోషానికి చాలా కారణాలుంటాయి’- అన్న టాల్ స్టాయ్ భావాన్ని కథకుడు ఇలా చూపించ దల్చుకున్నాడా- ఇన్ని పాయింట్లూ సమస్యలూ కలిపేసి? విరాజ్ కుటుంబం అసంతోషానికి భార్యకున్న మెమరీ లాస్ కారణం ఒక్కటి చాలు. ఈ మెమరీ లాస్ కారణంగా పుట్టే సమస్యలు ఎన్నయినా చూపిస్తే -అసంతోష కుటుంబాలకి టాల్ స్టాయ్ నిర్వచనం సరిపోవచ్చు.
మరొకటి : విరాజ్ కి భార్యంటే కోపమెందుకు? ఆమె ఏం తప్పు చేసింది? ఫ్లాష్ బ్యాక్ లో కారు యాక్సిడెంట్ చేసి ఆమె మెమరీ హరీ మనేలా చేసింది తను. అలాటిది కూతురు అమ్మ కథ చెప్పమన్నప్పుడల్లా చిరాకు పడతాడెందుకు? అసలు కథలు చెప్తూంటే ఆమెకి అమ్మ గుర్తొస్తున్నప్పుడు కథలు చెప్పడమెందుకు? చెప్పినా చక్కగా అమ్మ గురించి కట్టుకథలు చెప్పి ఎంటర్టయిన్ చేయొచ్చు. కథకి ఏ నష్టం రాదు. నాన్న కథలు చెప్పడానికి అతను సాధించిందేమీ లేదు- భార్యకి మెమరీ లాస్, కూతురికి వ్యాధి తెచ్చి పెట్టడం తప్ప!
హీరో బ్యాక్ స్టోరీని సరిగ్గా వర్కౌట్ చేయకుండా, బిగినింగ్ విభాగం చేయడంతో ఈ 20 నిమిషాల బిగినింగ్ విభాగం ఇలా ఇన్ని లోపాలతో తయారయింది- పాత్రచిత్రణలతో, కథనంతో. సినిమా హిట్టవుతుందా లేదా తర్వాతి సంగతి, ముందు స్టార్ ని నమ్మి టికెట్ డబ్బులు పెట్టిన ప్రేక్షకులకి తగిన నాణ్యమైన వస్తువు అందించడం ఉత్పత్తిదారుడి బాధ్యత. ఈ సినిమాకి 65 కోట్లు బడ్జెట్ అయిందంటున్నారు- ఆ స్థాయి కంటెంట్ మాత్రం కనిపించడం లేదు. చూస్తూంటే అనుకున్న ఐడియాని విస్తరించి ముందుగా సినాప్సిస్ రాయలేదన్పిస్తోంది. క్రియేటివ్ స్కూల్ తో ఇదే జరుగుతుంది.
ఇలాకాక, అతను కూతుర్ని కసురుకుని, కుక్క ఏదో డిస్టర్బ్ చేసిందని, దాన్ని ఎత్తుకెళ్ళి గుమ్మంలో వదిలి పెడతాడు. అలా కుక్క బయటికెళ్ళిందని, దానికోసం బయటికి పరిగెడుతుంది కూతురు. అంటే ఆమె అతను కథ చెప్పలేదని అలిగి ఇంట్లోంచి వెళ్ళిపోకుండా- కుక్క కోసమే బయటికి పరుగెట్టిందన్న అర్ధంలో రాంగ్ గా తేలింది ఈ సీను!!
కథని పాత్రలు నడుపుకో నివ్వకుండా అడ్డుపడి తను కథ నడుపుతున్నాడు కథకుడు. ఎలాగంటే కథ చెప్పలేదని కూతురు ఇంట్లోంచి బయటికెళ్ళి పోవాలి, అలా వెళ్ళి పోవాలంటే కావాలని అతను కుక్కని ఎత్తుకెళ్ళి గుమ్మంలో వదిలిపెట్టి రావాలి- అన్నట్టు వుంది ఈ సీను క్రియేటివిటీ. ఇలా కాక-
అతను కథ చెప్తూ వుంటే, ఆమెకి అతను చేసిన ప్రామీస్ ప్రకారం కథ చెప్పించుకున్నట్టూ వుంటుంది, ఇంతలో కుక్క బయటికెళ్తే దానికోసం వేరే బయటికెళ్ళినట్టూ వుంటుంది. రెండూ వేర్వేరు విషయాలకి చెందిన సరైన చర్యలు. అప్పుడు అమ్మ కథ చెప్పడమనే బిగినింగ్ విభాగం సెటప్, పే ఆఫ్ అవుతునట్టూ వుంటుంది, అలాగే ప్లాట్ పాయింట్ వన్ ఘట్టానికి ఫ్రెష్ లీడ్ పడినట్టూ వుంటుంది. ఆమె అలగడం, కుక్క కోసం బయటికెళ్ళడం రెండూ ఒకే కారణంగా జరగడం సాధ్యం కాదు. అతను కథ చెప్పకపోతే, ఆమె అలిగి బయటికి వెళ్ళిపోతే, కుక్క వుండకూడదు మధ్యలో.
నిజానికిది సీనస్ ఇంటరప్టస్ (దృశ్య భంగం) సీను కావాలి. ఎలాగంటే అమ్మ కథ చెప్పడమనే బిగినింగ్ విభాగం సెటప్ ఏదైతే వుందో అది, అతను కథ చెప్తూ వుండగా పే ఆఫ్ అవుతూ వుండి- ఇంతలో కుక్క బయటికెళ్ళడంతో కూతురి దృష్టి మళ్ళి- దాని వెంట పరిగెత్తడంతో- పూర్తిగా పేఆఫ్ అవకుండా సీనస్ ఇంటరప్టస్ అయి, బయట ఫ్రెష్ సీనుకి లీడ్ పడాలి. అతను కథే చెప్పకపోతే ఇది సీనస్ ఇంటరప్టస్ సీను కాదు. అర్ధం లేకుండా వుంటుంది.
అంటే పైన చెప్పినట్టు సీనస్ ఇంటరప్టస్ జరిగితే, ప్రకృతి కల్పించుకుని ఆమెకి ఇలా చెప్తున్నట్టు అర్ధం - ఈ నాన్న చెప్పే కథలో ఫిక్షనల్ అమ్మ కాదుగానీ, బయట నీ రియల్ మమ్మీని మీటవుదువు గానీ పదా- అని కుక్క రూపంలో ప్రకృతి లాక్కెళ్ళినట్టూ వుంటుంది. లాజిక్ లేకుండా డ్రామా పండదు, ఎమోషన్స్ కూడా పండవు. సీన్లు ఫ్లాట్ గా వుంటాయి.
10. మిడిల్-1:
ఫ్లాష్ బ్యాక్ 2 అక్కడితో ఆపాక ఇంటికొచ్చి లాప్ టాప్ లో చూసుకుంటాడు. యష్ణ ఫోటో వుంటుంది. ఇదెలా సాధ్యం, యష్ణ అతడికి ఇంతకి ముందు తెలీదు. ఈ ఫోటోలో వున్నది వర్ష అయుంటుందని ఒక అద్భుతమైన ట్విస్టు ఇక్కడ ప్లే అవుతుంది. అంటే విరాజ్ చెప్తున్న కథలో తల్లి పాత్రని యష్ణ లాగా ఊహించుకుంటానంది మహిమ - కానీ ఈ యష్ణే తన కన్న తల్లి వర్ష అని ఆమెకి తెలీదు. అంటే యష్ణ లాగా విరాజ్ తో కథ చెప్పించుకుంది మెమరీ లాస్ అయిన వర్షే నన్న మాట!
ది బెస్ట్ ఇంటర్వెల్ ట్విస్ట్. అయితే ఇది తొందరపడి విప్పేసిన సస్పెన్స్. దీంతో సెకండాఫ్ కి కథ లేకుండా పోయింది. మెమరీ లాస్ పాత్రగా యష్ణ - విరాజ్ ఎలా ఇప్పుడు ఒకటవుతారన్న అరిగిపోయిన పాత కథే తప్ప, సెకండాఫ్ లో ఏమీ లేకపోవడానికి దారితీసిందీ ఇంటర్వెల్ ట్విస్టు. ముందు కథ మొత్తాన్నీ ఇంటర్వెల్ ముందు రెండు ఫ్లాష్ బ్యాకుల్లో కుక్కడం వల్ల సెకండాఫ్ కి సెకండాఫ్ సిండ్రోమ్ అనే రుగ్మత పట్టేసింది. తల్లీ కూతుళ్ళకి రెండు రుగ్మతలతో బాటు.
కేవలం క్రియేటివిటీతో సినిమా రైటింగ్ చేయలేరు. అసలు రైటింగ్ పనికిరాదు. క్రియేటివిటీకి స్ట్రక్చర్ తోడై స్టోరీ మేకింగ్ చేస్తే సినిమా కథ! స్క్రిప్టు రచనలో కొత్త డెవలప్ మెంట్స్ తెలుసుకోవాలి.
12. గోల్స్ ఎలిమెంట్స్ మిస్ : పాసివ్ పాత్ర విరాజ్ కి ఒక గోలే లేకపోవడంతో పైన చెప్పుకున్న 1. కోరిక, 2. పణం, 3. పరిణామాల హెచ్చరిక, 4. ఎమోషన్ అనే కథని పరిపుష్టం చేసే గోల్ ఎలిమెంట్స్ లేకుండా పోయాయి.
అంటే అప్పటివరకూ అసలేం జరిగిందో చెప్పకుండా మెమరీ లాస్ అన్న విషయాన్ని దాచిపెట్టాలి. దీని వల్ల సెకండాఫ్ లో మెమరీ లాస్ అనే భారమైన అరిగిపోయిన పాత కథే నడిపే ప్రమాదం తప్పుతుంది.
ఫ్లాష్ బ్యాక్ 1 తో కథ చెప్పడం ఆపేసి- యష్ణని విరాజ్ ఫాలో అవుతూ- ఆమెని వర్షా అని పిలిస్తే, వర్షా ఎవరు అని ఆమె అంటే- నువ్వే కదా వర్షా అని అతనంటే- షటప్, నేను వర్షా ఏమిటి, నీ కూతురికి కథ చెప్పి చప్పి బ్రెయిన్ డ్రెయిన్ అయిందా, భేజా ఖాళీ అయిందా, చెక్ చేయించుకో ఫో - అనేసి ఆమె వెళ్ళిపోతే- ఇక్కడ ఇంటర్వెల్ కి డ్రమెటిక్ క్వశ్చన్- విరాజ్ యష్ణని వర్షగా ఎందుకు పిలిచాడు? బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు లాగా. ఇలా సెకండాఫ్ కి కుతూహలం రేపే లీడ్ ఏర్పాటవుతుంది.
సినిమాలో ఈ విధంగా లేదు. యష్ణా వర్షా ఒకరేనని ఇప్పుడే చెప్పేస్తే సెకండాఫ్ కి లీడ్ లేకుండా పోయింది. సినిమా కథకి డ్రమెటిక్ క్వశ్చన్ ఏర్పాటు చేసేది ఇంటర్వెల్. డ్రమెటిక్ క్వశ్చన్ లోంచి పుట్టే లీడ్ అనేది కథ తెగిపోకుండా, ఫస్టాఫ్ - సెకండాఫ్ లని కలిపి వుంచి కుతూహలం కల్గిస్తుంది. అప్పుడు స్క్రీన్ ప్లే సెకండాఫ్ సిండ్రోమ్ లో పడడం గానీ, ఫ్రాక్చర్ అవడం గానీ జరగదు. ఈ సినిమాలో రెండూ జరిగాయి.