రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...
టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!
Saturday, April 18, 2020
Friday, April 17, 2020
929 : క్రైం థ్రిల్లర్ జానర్ మర్యాద -6
1. పోలీస్ డిటెక్టివ్ జానర్లో పోలీస్ స్టేషన్ వుండదు, క్రైం
బ్రాంచ్ వుంటుంది.
2. సీఐ, ఎస్సై లుండరు. డిటెక్టివ్ ఇన్స్ పెక్టర్, డిటెక్టివ్ ఎస్సై లుంటారు.
3. ఇవి పోలీస్ ప్రొసీజురల్ మూవీస్. వీటిని ప్రొఫెషనల్ గా రాసి, ప్రొఫెషనల్ గా తీస్తారు.
4. నేరపరిశోధనల్లో క్రైం బ్రాంచ్ పనితీరుని వాస్తవికంగా, విజ్ఞాన దాయకంగా చూపిస్తారు.
5. ఫోరెన్సిక్, అటోప్సీ ఆధారాలు, ఇతర సాక్ష్యాధారాల సేకరణా, సెర్చి వారెంట్లూ ఇంటరాగేషన్, లీగల్ విషయాలూ వగైరా ఈ కథల్లో భాగంగా వుంటాయి. నేరస్థల పరిశీలనా ప్రక్రియకి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ వుంటుంది. దీని పిడిఎఫ్ ని పరిశీలించుకోవాలి.
6. హత్యాస్థలంలో హంతకుడికి సంబంధించి వస్తు రూపంలో దొరికే క్లూసే కాకుండా, మెడికల్ ఆధారాలతో కూడా పట్టుకునే ప్రయత్నాలు చూపిస్తే కొత్తదనం వుంటుంది. డీఎన్ఏ, ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్, వైర్ టాప్స్, రూంబగ్స్, పాలీగ్రాఫ్, అండర్ కవర్ ఆపరేటర్స్, హిప్నాసిస్, సైకలాజికల్ ప్రొఫైలింగ్, కంప్యూటర్ ఎనలైజింగ్, శాటిలైట్ సర్వేలెన్స్, ఎంటమాలజీ మొదలైనవి కూడా అవసరాన్నిబట్టి కథలోకి తీసుకోవాలి.
7. లాజిక్ అనేది, అంటే కామన్ సెన్స్ అనేది, ఈ కథల్లో విడదీయలేని స్క్రిప్టింగ్ టూల్.
8. రియలిస్టిక్ రూపకల్పన తో యూత్ ఓరియెంటెడ్ గా చూపించొచ్చు.
9. రియలిస్టిక్ గా అన్పించే -జీవితంలో సహజంగా జరిగిపోయే సంఘటనల్ని- యూత్ జీవితాల్లోంచి, ప్రవర్తనల్లోంచి తీసుకుంటే ఎక్కువ కనెక్ట్ అయ్యే అవకాశముంటుంది.

11. పోలీస్ డిటెక్టివ్ కి నేరస్థుడెవరో (విలన్) తెలిసిపోయి, వాణ్ణి పట్టుకునే యాక్టివ్ - యాక్షన్ ప్రయత్నం వుండాలి.
12. అతి హింస కూడదు. యాక్షన్ థ్రిల్లర్ మాస్ మసాలా అయితే, పోలీస్ థ్రిల్లర్ క్లాస్ - మాస్ ఎంటర్ టైనర్.
13. విలన్ని తెరపైకి తెచ్చి, పోలీస్ డిటెక్టివ్
తో యాక్షన్ రియాక్షన్ల ఇంటర్ ప్లే ప్రారంభించాలి.
14. హత్య చుట్టూ కథ వుండాలి. ప్రధాన హత్యకి
అనుబంధంగా మరికొన్ని హత్యలు వుండొచ్చు.
15. ఒక హత్య సినిమాకి సరిపోదు. కనీసం
ఇంటర్వెల్ ముందు ఇంకో హత్య, సెకండాఫ్ లో ఇంకో హత్యా జరగాలి. 14. హత్య చుట్టూ కథ వుండాలి. ప్రధాన హత్యకి అనుబంధంగా మరికొన్ని హత్యలు వుండొచ్చు.
16. హత్యలు ఆషామాషీగా వుండకూడదు. ప్రధాన హత్య యజమాని హత్యయితే, అనుబంధ హత్య యజమాని ప్రియురాలిదై వుండాలి. ఇంకో అనుబంధ హత్యగా యజమాని భార్యని చంపెయ్యాలి. ఇలా తీవ్రత పెరగాలి. యజమాని హత్య తర్వాత పని వాణ్ణి, వాచ్ మన్ నీ చంపే తక్కువ స్థాయి హత్యలు కూడదు.
17. ఎంత బలమైన కారణమున్నా ఆ కారణంతో చంపుకుంటూ పోకూడదు. మనిషి ప్రాణాలకి విలువివ్వాలి. మనిషి ప్రాణాలెంత విలువైనవో ప్రేక్షకులు ఫీలయ్యేట్టు చేయాలి.
18. ఫ్లాష్ బ్యాకులు ఎక్కువైపోతే (మల్టిపుల్ ఫ్లాష్ బ్యాక్స్) ఇన్వెస్టిగేషన్ క్రోనాలజీ గజిబిజి అయిపోతుంది.
19. కాన్ఫ్లిక్ట్ గాభరా పుట్టించేట్టు వుండాలి. హంతకుడి మోటివ్ లేదా ప్లానింగ్ అంత గుబులు పుట్టించాలి.
20. పోలీస్ డిటెక్టివ్ హీరో తోబాటు, హంతకుడికి, అంటే విలన్ కి కూడా ఓ క్యారక్టరైజేషన్
ఇవ్వాలి. ఈ క్యారక్టరైజేషన్స్ లో వేర్వేరు దృక్పథాల్నివ్వాలి.
21. కరుణ, సానుభూతి, మానసిక చురుకుదనం, మానసిక దృఢత్వం, సమయస్ఫూర్తి, నిబద్ధత, సమయానుకూల కాఠిన్యం, ఊహాశక్తి, కమ్యునికేషన్ స్కిల్స్, క్రైసిస్ మేనేజ్మెంట్, కామన్ సెన్స్, బలమైన నైతిక విలువలు, చట్టాల పట్ల గౌరవమూ మొదలైనవి పోలీస్ డిటెక్టివ్ పాత్ర చిత్రణలో భాగమవ్వాలి.
22. హంతకుడికీ పోలీస్ డిటెక్టివ్ కీ మధ్య సంఘర్షణ హోరాహోరీని శాస్త్రీయంగా చూపాలనుకుంటే ‘ది ఆర్ట్ ఆఫ్ వార్’ గ్రంథాన్ని ని పరిశీలించ వచ్చు.
23. వాళ్ళ పోరాటంలో ప్రేక్షకులు సఫరవాలి. ప్రేక్షకుల్ని వీలైనంత సఫర్ చేయాలి.
24. . పాటలతో కామెడీలతో స్క్రీన్ స్పేస్ ని భర్తీ చేసే పని చేయకూడదు. యాక్షన్ తో కూడా భర్తీ చేయకూడదు. కథని కథతోనే నిలబెట్టాలి.
25. అత్యుత్సాహానికి పోయి లెక్కలేనన్ని క్లూస్ ఇవ్వకూడదు, వాటిని పట్టుకుని కథని ఫాలోఅవడం కష్టమై పోతుంది.

26. కథని టైం లాక్ తో కాకుండా, ఆప్షన్
లాక్ తో నడిపించాలి.
27. ఇన్వెస్టిగేషన్ ఆధారంగానే కేసు సాల్వ్ అవ్వాలి. ఇన్వెస్టిగేషన్ మీదే ఫోకస్ చేసి, ఇన్వెస్టిగేషన్
తోనే థ్రిల్ చేసి, ఇన్వెస్టిగేషన్ కే పట్టం గట్టాలి.
28.
పోలీస్ డిటెక్టివ్ పాత్ర పూర్తిగా సీరియస్ గా వుండనవసరం లేదు. కథలో వినోదాత్మక విలువకి కూడా చోటివ్వాలి. వీలైన చోటల్లా
నవ్వించాలి27. ఇన్వెస్టిగేషన్ ఆధారంగానే కేసు సాల్వ్ అవ్వాలి. ఇన్వెస్టిగేషన్ మీదే ఫోకస్ చేసి, ఇన్వెస్టిగేషన్ తోనే థ్రిల్ చేసి, ఇన్వెస్టిగేషన్ కే పట్టం గట్టాలి.
29. పోలీస్ డిటెక్టివ్ పాత్ర మాస్ యాక్షన్ సినిమాల్లో రొటీన్ గా పోలీస్ పాత్రలా వుండ కూడదు. హంతకుడు కూడా అలాటి విలన్ కాకూడదు.
30. ఇంటర్వెల్లో పోలీస్ డిటెక్టివ్ దెబ్బతినాలి, క్లయిమాక్స్ లో హంతకుడు దెబ్బ తినాలి.
31. హీరోయిన్ పాటల కోసం, ప్రేమల కోసం వుండ కూడదు. ఆమె డిపార్ట్ మెంట్ వ్యక్తి లేదా బాధితురాలు అయితే మంచిది.
32. డార్క్ మూవీలా కాకుండా, కలర్ఫుల్ గా, ప్లెజెంట్ గా చిత్రీకరణ జరపాలి.
***
Tuesday, April 14, 2020
928 : క్రైం థ్రిల్లర్ జానర్ మర్యాద - 6
క్రైం థ్రిల్లర్ జానర్ మర్యాద వ్యాసాల్లో అక్కడక్కడ
ప్రస్తావిస్తున్న జానర్ మర్యాదలు అన్నిటినీ కలిపి ఒక చోట లిస్టుగా ఇస్తే సౌకర్యంగా
వుంటుందని కొందరు కోరారు. ఈ వ్యాసం ముగించాక ఆ పని చేద్దాం. ఈ జానర్ ని రియలిస్టిక్ రూపకల్పన
కూడా చేసి యూత్ ఓరియెంటెడ్ గా చూపించొచ్చు. హిందీ ‘పింక్’ లో కొందరు యూత్ రిసార్ట్ లో పార్టీ
చేసుకుంటున్నప్పుడు, ఒకడు తాప్సీతో మిస్ బిహేవ్ చేస్తే, ఆమె బాటిలెత్తి
కొట్టేస్తుంది. ఇది హత్యాయత్నం కేసుకింద నమోదై ఆమె ఇరుక్కుంటుంది. ఇలా రియలిస్టిక్
గా అన్పించే -జీవితంలో సహజంగా జరిగిపోయే సంఘటనల్ని- యూత్ జీవితాల్లోంచి,
ప్రవర్తనల్లోంచి తీసుకుంటే ఎక్కువ కనెక్ట్
అయ్యే అవకాశముంటుంది. తమిళ డబ్బింగ్ ‘16 - డి’ ఇలాంటిదే. తెలుగు ‘మత్తు వదలరా’
జానర్ వేరైనా యూత్ ప్రవర్తనే పాయింటు. మరొకటేమిటంటే, నేటి సినిమాలకి మార్కెట్
యాస్పెక్ట్ రోమాంటిక్స్ లేదా ఎకనమిక్స్ అని చాలా సార్లు చెప్పుకున్నాం. ఈ యాస్పెక్ట్స్
తో కూడా ఈ జానర్ సినిమాలు తీసుకోవచ్చు. ప్రస్తుత కరోనా ముప్పువల్ల ఎకనమిక్స్ తో
బాటు రోమాంటిక్స్ కీ పెద్ద సమస్య వచ్చి పడింది. లాక్ డౌన్ వల్ల బాయ్ ఫ్రెండ్స్ - గర్ల్ ఫ్రెండ్స్ కలుసుకోలేక,
షికార్లు తిరగలేక నానా అవస్థలు
పడుతున్నారు. రోమాన్సులు రోకలి బండలయ్యాయి. క్రిమినల్స్ ఆర్ధిక నేరాలు చేయలేక పాపం
ఇబ్బంది పడుతున్నారు. దేశంలో ఏటా పోలీస్ స్టేషన్లలో మూడు కోట్ల ఎఫ్ఐఆర్ లు
నమోదవుతాయి. అంటే రోజుకి 80 వేలు. అలాంటిది ఇప్పుడు 80 కూడా నమోదు కావడం లేదు.
దేశంలో ప్రతీరోజూ 377 మంది రోడ్డు
ప్రమాదాల్లో మరణిస్తారు. అలాంటిది ఇప్పుడు ఒక్కరు కూడా మరణించడం లేదు.
క్రైం థ్రిల్లర్ జానర్ అతి హింసని ఒప్పుకోదు. హత్యా పరిశోధనలతో వుండే పోలీస్ క్రైం థ్రిల్లర్ వేరు, మాఫియా లేదా ఇతర క్రిమినల్ చర్యలతో వుండే యాక్షన్ థ్రిల్లర్ వేరు. యాక్షన్ థ్రిల్లర్ లో ఎంతైనా హింస వుండొచ్చు. ఘోరంగా నరుక్కోవచ్చు, కాల్చుకోవచ్చు, పేల్చుకోవచ్చు, చీల్చుకుని చెండాడుకో వచ్చు, రక్తాలు పారిస్తూ అరుపులు అరుచుకోవచ్చు. ఇవన్నీ పక్కనబెట్టి, పోలీస్ క్రైం థ్రిల్లర్ నీటుగా వుంటుంది. యాక్షన్ థ్రిల్లర్ మాస్ మసాలా అయితే, పోలీస్ థ్రిల్లర్ క్లాస్ - మాస్ ఎంటర్ టైనర్. ఇందులో హింస మితిమీరితే అది ఇన్వెస్టిగేషన్ ని మింగేస్తుంది. అదికూడా యాక్షన్ థ్రిల్లరై పోతుంది తప్ప, క్రైం థ్రిల్లర్ అంటూ ట్రైలర్స్ వేసుకుని ప్రచారం చేసుకోవడానికుండదు. హింస ఎంత ఎక్కువైతే అంత తక్కువ క్రైం థ్రిల్లరవుతుంది.
ఈ
సందర్భంగా ఒక హాలీవుడ్ రచయిత తను చేపట్టిన క్రైం థ్రిల్లర్ స్క్రిప్టు గురించి
చెప్పుకొచ్చాడు...ఇందులో హంతకుడు 10 హత్యలు చేస్తాడు. రచయితగా తను ఈ 10 హత్యల్నీ
చిత్రిస్తూ పోతే, కథ హింసాత్మకంగా మారిపోతుంది. అంటే కాస్సేపటికి ఈ చేస్తున్న హత్యలు
బోరు కొట్టేస్తాయి కూడా ప్రేక్షకులకి. అందువల్ల తను ఇలా చేశాడు - హంతకుడు ఇప్పుడు
కథలో మూడు హత్యలే చేసుకుపోతాడు. పోలీస్ డిటెక్టివ్ కి దర్యాప్తు క్రమంలో ఆ హంతకుడు
గతంలో ఇంకో 7 హత్యలు చేశాడని తెలుస్తుంది. ఇలా 7 హత్యల్ని గతంలోకి సమాచార రూపంలో నెట్టేయడం
వల్ల, లైవ్ గా చూపించే ప్రమాదం, బోరు తప్పాయి.
మర్డర్ తో సస్పెన్స్ వుండదంటాడు. మర్డర్ జరిగేందుకు అవకాశమున్న కిడ్నాప్ తో సస్పెన్స్ వుంటుందంటాడు. ప్రేక్షకుల్ని కథనుంచి ఎమోషనల్ గా దూరం చేయాలనుకుంటే, హత్య తర్వాత హత్య తర్వాత హత్య... హింసాత్మకంగా నింపెయ్యవచ్చంటాడు. ఎమోషన్ తోబాటు టెన్షన్ తో ప్రేక్షకుల్ని కనెక్ట్ చేయాలనుకుంటే, హింస తగ్గించి, జరగబోయే హత్యగురించి ఉత్కంఠ పెంచాలంటాడు. అత్యంత భయపెట్టే సినిమాల్లో అతి తక్కువ హింస వుంటుందని గుర్తు చేస్తాడు.
క్రైం థ్రిల్లర్ లో చంపడానికి -
ఎంత బలమైన కారణమున్నా ఆ కారణంతో చంపుకుంటూ
పోకూడదు. మనిషి ప్రాణాలకి విలువివ్వాలి. మనిషి ప్రాణాలెంత విలువైనవో ప్రేక్షకులు ఫీలయ్యేట్టు
చేయాలి. మనిషి ప్రాణాలే చీప్ అన్నట్టు చంపుకుపోతే, చీప్ అయినదానికి ప్రేక్షకులు
ఫీల్ కారు. ఆ చంపడాల్ని కూడా కేర్ చెయ్యరు. మర్డర్ సీన్లు మార్కెట్ యాస్పెక్ట్ లేక
వేస్ట్ అయిపోతాయి. ‘ఈక్వలైజర్ 2’ అనే మాఫియా యాక్షన్లో, దర్శకుడు ఆంటన్ ఫుఖ్వా, హత్యా
దృశ్యాల్లో వాణ్ణి చంపవద్దంటూ మనం తల్లడిల్లేంత
ఎమోషన్ని రగిలిస్తాడు.
ఇక టెక్నికల్ గా చెప్పుకుంటే, క్రైం థ్రిల్లర్ డార్క్ మూవీ కాదు. దీన్ని డార్క్ మూడ్ క్రియేట్ అయ్యేలా బ్లూ లేదా బ్రౌన్ టింట్ ఇస్తూ డార్క్ లైటింగ్ తో చిత్రించడం పొరపాటు. క్రైం థ్రిల్లర్ బీభత్స భయానక రసం కాదు. బీభత్స రసానికి దేవత మహాకాలుడు. మహాకాలుడు ముదురు నీలం. ఈ రంగు హార్రర్ కి, వయొలెంట్ మూవీస్ కి సరిపోతుంది. క్రైం థ్రిల్లర్ అద్భుత రసం. అద్భుత రసానికి దేవత బ్రహ్మ. బ్రహ్మ పసుపు వర్ణం. అద్భుత రసం వర్ణం పసుపు. కాబట్టి క్రైం థ్రిల్లర్ ని కలర్ఫుల్ గా, ప్లెజెంట్ గా చిత్రీకరించాల్సి వుంటుంది. జేమ్స్ బాండ్ సినిమాలు అద్భుతరసంతో కలర్ఫుల్ గా, ప్లెజెంట్ గా, యూనివర్సల్ ఎంటర్ టైనర్లుగా వుంటున్నవి కాస్తా, ఇటీవల అతి హింసతో పిల్లలు చూడలేని విధంగా వుంటున్నాయని విమర్శలొస్తున్నాయి. ఇదే రసమో అర్ధంకాని వేషమైపోయింది.
క్రైం థ్రిల్లర్ అన్నాక ఇన్వెస్టిగేషన్ - ఆధారంగానే కేసు సాల్వ్
అవ్వాలి. ప్రేక్షకులు ఇన్వెస్టిగేషన్ మీదే ఫోకస్ అయి వుండి, ఇన్వెస్టిగేషన్ తోనే థ్రిల్లవుతూ
వుండి, ఇన్వెస్టిగేషన్ కే జేజేలు పలికేట్టు చేయడమే మేకర్ ప్రధాన కర్తవ్యం కావాలి. బయటికొచ్చిన
ప్రేక్షకుడు - భలే వుంది ఇన్వెస్టిగేషన్ - అని ఛానెల్ మైకులో పబ్లిక్ టాక్ చెప్పేటట్టు
వుండాలి.
ఇవన్నీ మిడిల్ కథనంలో-
పాటించవలసిన సంగతులు... క్రైం థ్రిల్లర్ కథనం సీన్ టు సీన్ సస్పెన్స్ తో వుంటుందని
చెప్పుకున్నాం. హంతకుడెవరో ప్రేక్షకులకి ఓపెన్ చేసి, తర్వాత పోలీస్ డిటెక్టివ్
హీరోకి హంతకుణ్ణి ఓపెన్ చేసి - ఇక వాడినెలా పట్టుకుంటాడన్న సస్పెన్స్ తో సీన్లు
నడిపించడం. ఈ బాపతు థ్రిల్లర్ కాన్ఫ్లిక్ట్ ఎంత గాభరా పుట్టించేట్టు వుంటే అంత
సక్సెస్ అవుతుంది. అంటే కాన్ఫ్లిక్ట్ లో హంతకుడి మోటివ్ లేదా ప్లానింగ్ అంత గుబులు
పుట్టించాలి. ఈ కాన్ఫ్లిక్ట్ తెలిసి ప్రేక్షకులు బిక్కచచ్చిపోయి కుర్చీకి అతుక్కుపోవాలి. ఇందుకే క్రియేటివ్ పార్టు రాయడం అత్యంత కష్టమైన వ్యవహారమని గత వ్యాసంలో
చెప్పుకున్నది. హంతకుడనే వాడు పోలీస్ డిటెక్టివ్ హీరోకి కి ముత్తాత అన్పించాలి. తను
చేయబోయే మర్డర్ ప్రపంచం దశాబ్దాల పాటు గుర్తుంచుకుంటుందని హంతక వెధవ అన్నాడనుకుందాం...లేదా - నీ బాడీ పార్టు లాగి నువ్వూహించని
ట్విస్టు ఇస్తానని పోలీస్ డిటెక్టివ్ కి వార్నింగ్ ఇచ్చాడనుకుందాం, ఇలాటివి
కాన్ఫ్లిక్ట్ ని టైం బాంబుగా మార్చేస్తాయి.
పోలీస్
డిటెక్టివ్ హీరోకి ఎలాగూ ఒక క్యారక్టరైజేషన్ ఇస్తారు. హంతకుడికి, అంటే విలన్ కి
కూడా ఓ క్యారక్టరైజేషన్ ఇవ్వాలి. ఈ క్యారక్టరైజేషన్స్ లో వేర్వేరు
దృక్పథాల్నివ్వాలి. పోలీస్ డిటెక్టివ్ హీరోకి - నేరస్థులు నేరాలతో శాంతిభద్రతల
సమస్య కాదు, పారిశుధ్య సమస్య సృష్టిస్తున్నారనీ, నేరాలు చేసి నేరస్థలాన్ని
చంఢాలంగా వదిలేసి పోతున్నారనీ, ఆ వెధవల్ని పట్టుకుని ఆ రక్తం, ఆ చెత్త, ఆ కంపు
తన్ని క్లీన్ చేయించాలన్న దృక్పథం ఇచ్చామనుకుందాం - అప్పుడు హంతకుణ్ణి అపరిశుభ్రత ఏమాత్రం
సహించని, పరమ నీట్ నెస్ ని కోరుకునే నీటుగాడి దృక్పథంతో చూపిస్తే, కాన్ఫ్లిక్ట్ కి
ఈ వ్యక్తిత్వాల వైరుధ్యం కూడా జతపడి ఇంకింత ఆసక్తి కల్గిస్తుంది.
కథని టైం లాక్ తో కాకుండా, ఆప్షన్ లాక్ తో నడిపిస్తే ఇన్వెస్టిగేషన్ బతుకుతుంది. యాక్షన్ థ్రిల్లర్ ని టైం లాక్ తో చూపించ వచ్చు. లేదా ‘మనసే మందిరం’ లాంటి ఫ్యామిలీ డ్రామాలో చూపించవచ్చు. 60 నిమిషాల్లో ఏదో జరగబోతోందని, ఆలోగా దాన్ని నివారించాలనీ, గడియారం ముల్లు చూపిస్తూ కథనాన్ని టెన్షన్ తో పరుగులు తీయించవచ్చు. కానీ ఇన్వెస్టిగేషన్ ప్రధానమైన క్రైం థ్రిల్లర్ లో ఇలా చేస్తే ఇన్వెస్టిగేషన్ కి చోటుండదు, యాక్షన్ ఆక్రమించేస్తుంది. జానర్ మర్యాద చెడుతుంది.
కౌంట్ డౌన్లూ, డెడ్ లైన్లూ-
అవసరమనుకుంటే ఇన్వెస్టిగేషనంతా పూర్తయ్యాక క్లయిమాక్స్ లో పెట్టుకోవచ్చు. క్లయిమాక్స్ లో హంతకుడితో టైం లాక్
యాక్షన్ నడిపించవచ్చు. అసలు ఈ జానర్ కథకి టైం లాక్ అనేది లేకుండా, కాలపరిమితి లేని
ఆప్షన్ లాక్ తో ఫ్రీగా వదిలేస్తేనే హాయి.
కరుణ, సానుభూతి, మానసిక చురుకుదనం, మానసిక దృఢత్వం, సమయస్ఫూర్తి, నిబద్ధత, సమయానుకూల కాఠిన్యం, ఊహాశక్తి, కమ్యునికేషన్ స్కిల్స్, క్రైసిస్ మేనేజ్మెంట్, కామన్ సెన్స్, బలమైన నైతిక విలువలు, చట్టాల పట్ల గౌరవమూ మొదలైనవి పోలీస్ డిటెక్టివ్ పాత్ర చిత్రణలో భాగమవ్వాలి.
ఈ మిడిల్ విభాగంలో జరిగే బిజినెస్ ప్రకారం హంతకుడికీ పోలీస్ డిటెక్టివ్ కీ మధ్య వుండే యాక్షన్ - రియాక్షన్ల (సంఘర్షణ) కథనంలో హోరాహోరీని శాస్త్రీయంగా చూపాలనుకుంటే ఒకపని చెయ్యొచ్చు : 2500 ఏళ్ల క్రితం చైనీస్ సైనిక జనరల్, యుద్ధ వ్యూహ కర్త సుంజీ రాసిన సుప్రసిద్ధ గ్రంథం, ‘ది ఆర్ట్ ఆఫ్ వార్’ ని పరిశీలించ వచ్చు. ఇందులో పోలీస్ డిటెక్టివ్ కీ హంతకుడికీ మధ్య పోరాటంలో కావాల్సిన అనేక టిప్స్ దొరుకుతాయి. పీడీఎఫ్ లింక్ వ్యాసం చివర వుంది. ఆసక్తి వుంటే డౌన్ లోడ్ చేసుకోవచ్చు. హంతకుడితో పోరాటంలో పోలీస్ డిటెక్టివ్ సమయానుకూలంగా పాసివ్ అవచ్చు (“He will win who knows when to fight and when not to fight.”అంటాడు సుంజీ, “The best way to fight is not to fight at all.”అని కూడా అంటాడు. మనం మనకి తోచింది, వూహించి ఏవో అర్ధంలేని పోరాటాలు రాసేకన్నా, అసలు యుద్ధ కళేమిటో తెలుసుకుని చిత్రిస్తే బావుండొచ్చు).
స్క్రిప్టు రాయడం రోజుల్లో పూర్తయ్యే పనికాదు. కథలో ఎక్కడ దేనికి ఏది అవసరమో నిత్యం కథని ప్లాన్ చేసేప్పుడు గుర్తిస్తూ, ఆ మేరకు సమాచారం పొంది -రీసెర్చి చేసి, కథలో చిత్రణ చేసుకోవాలి. సినిమాలు చూసి మనకే అంతా తెలుసనీ రాసెయ్యకూడదు. ఆ సినిమాలు అలా తీయడానికి తెరవెనుక ఏం రీసెర్చి చేశారో, ఎన్ని మల్లగుల్లాలు పడ్డారో ఎవరికి తెలుసు. డిస్కషన్స్ లో తేలిక భావం కన్పిస్తూంటుంది. కారణం ఇవ్వాళా అరచేతిలో ప్రపంచ సినిమాలన్నీ వుండడంతో - ఆ సినిమాల సీన్లు షాట్లు మనసులో ఫిక్స్ అయిపోయి, ఇతరులేంటి చెప్పేదని డిస్కషన్స్ ని బేఖాతరు చేస్తున్న సంస్కృతి కన్పిస్తోంది. చూసిన సినిమాల్లోంచి షాట్లు సీన్లు ఆ పళంగా తెచ్చి పెట్టుకోలేరు. అవి ఏ సందర్భంగా ఏ సన్నివేశానికి ఏ ఉద్దేశంతో సృష్టించారో తెలుసుకోకుండా కాపీ కొట్టుకోలేరు. నీ బిడ్డని నువ్వే పుట్టించగలవ్, ఇతరుల వీర్యదానంతో కాదు.
పోలీస్ డిటెక్టివ్ కీ హంతకుడికీ-
మధ్య పోరాటంలో
ప్రేక్షకులు సఫరవాలి. ప్రేక్షకుల్ని
వీలైనంత సఫర్ చేయాలంటాడు హిచ్ కాక్. ఐతే పోలీస్ డిటెక్టివ్ పూర్తిగా
సీరియస్ గా వుండనవసరం లేదు. కథలో
వినోదాత్మక విలువకి కూడా చోటివ్వాలి. వీలైన చోటల్లా నవ్వించాలి. ఫన్నీ పోలీస్
క్యారక్టరైనా ఫర్వాలేదు, ఒక పార్శ్వంలో హంతకుడి చేతిలో అతడి సఫరింగ్ ని చూపిస్తూనే.
ఫన్నీ పోలీస్ క్యారక్టర్ కి పీటర్ సెల్లర్స్ నటించిన ‘పింక్ పాంథర్’ సిరీస్ సినిమాలు
చూస్తే ఒక ఐడియా వస్తుంది. ఈ సిరీస్ లో
అతను తెలివితక్కువ ఇన్స్ పెక్టర్ జాక్స్ క్లూసో గా ఎంటర్ టైన్ చేస్తాడు. పోలీస్
డిటెక్టివ్ పాత్ర మాస్ యాక్షన్ సినిమాల్లో పోలీస్ పాత్రలా వుండ కూడదని ఎలా
అనుకున్నామో, హంతకుడు కూడా అలాటి విలన్ కాకూడదు.
కథనంలో డైనమిక్స్ ముఖ్యం. ఒకటనుకుంటే ఇంకోటి జరగడం. పోలీసులు డాగ్ స్క్వాడ్ తో బాంబుని నిర్వీర్యం చేయడానికి వెళ్ళారనుకుందాం. అప్పుడు బాంబుని నిర్వీర్యం చేస్తూంటే అకస్మాత్తుగా భూకంపం రావడం లాంటిది. అనూహ్య సంఘటనలతో కథనం చేస్తే చైతన్య వంతంగా వుంటుంది కథ.
క్రైం థ్రిల్లర్ కథ నిర్వహించలేక పాటలతో కామెడీలతో స్క్రీన్ స్పేస్ ని భర్తీ చేసే పని చేయకూడదు. యాక్షన్ తో కూడా భర్తీ చేయకూడదు. యాక్షన్ కూర్చోబెట్టే సస్పెన్స్ కాదు. అది పే ఆఫ్. సస్పెన్స్ సెటప్. ఆయా సీన్లలో సస్పెన్స్ ని సెటప్ చేసినప్పుడు, ఇప్పుడేం జరుగుతుందా అని ఎదురు చూస్తారు ప్రేక్షకులు. ఆ సస్పెన్స్ కి ఇప్పుడేం జరగాలా అని ఆలోచించకుండా, రివర్స్ లో ఇంకేం జరిపించాలా అని ఆలోచించాలి. పైన చెప్పుకున్నట్టు, బాంబు తీసేయబోతే భూకంపం వచ్చినట్టు.
బేసిగ్గా చెప్పుకోవాలంటే, కథలనేవి సంఘటనలకి సమాచార రిపోర్టింగులు కావు. కథలనేవి మార్పుని చూపించేటివి. ఒక సిట్యుయేషన్, ఒక పాత్ర, లేదా పాత్రల మధ్య సంబంధాలు ఎలా మార్పుకి లొనయ్యాయో చూపించేవే కథలు. కనుక సస్పెన్స్ కథనం మార్పు ని దృష్టిలో పెట్టుకుని సాగాలి. అప్పుడే కథ డైనమిక్ గా వస్తుంది.
మామూలుగా కథనమంటే ఏమిటి -
ఒక సీన్లో ఒక ప్రశ్న
విసిరి, ఇంకో సీన్లో దానికి జవాబు చెప్పడమేగా? ప్రశ్నలు జవాబులేగా కథనమంటే? ప్రతీ
సీనూ ప్రేక్షకులకి చేస్తున్న ఒక వాగ్దానం కావాలి. హీరోయిన్ అందాల్ని తెరనిండా
చూపిస్తూంటే, ఇది దేనికో లీడ్ కావాలి తప్ప, కేవలం యూత్ అప్పీల్ కోసమని వృధా
చేయకూడదు. ఈ జానర్లో ప్రతీ సీనూ ఆడిటింగ్ జరుగుతుంది. ప్రతీ సీనూ సస్పెన్స్ కి
లింకై వుంటుంది. వృధాగా వుండదు.
ఇక ఇంటర్వెల్, క్లయిమాక్సులు. ఇంటర్వెల్లో పోలీస్ డిటెక్టివా - హంతకుడా -ఎవరు ట్విస్ట్ ఇవ్వాలి? ఇలాటి జానర్ కథలో పరీక్షకి గురయ్యేది పోలీస్ డిటెక్టివ్, పరీక్షపెట్టేది హంతకుడు. పోలీస్ డిటెక్టివ్ స్కిల్స్ కి పరీక్ష. ఇలాటి కథని పోలీస్ యంత్రాంగపు పనితీరుకి మోడల్ గా చూపిస్తాం. హంతకుల పనితీరుకి మోడల్ గా హంతకులకి చూపించం. అందుకని ప్రేక్షకులు పోలీస్ డిటెక్టివ్ హీరోనే ఫాలో అయ్యేలా పరీక్షలన్నీ అతడికే వుంటాయి. ఇంటర్వెల్లో అతనే పెద్ద దెబ్బ తింటాడు హంతకుడి చేతిలో. క్లయిమాక్స్ లో పోలీస్ డిటెక్టివ్ హీరో దెబ్బకి, హంతకుడు పుంజాలు తెంపుకుని పారిపోతూ వుంటాడు, దట్సాల్.
ఈ జానర్ సినిమాలు హాలీవుడ్ లోలాగా పెద్ద హీరోలు
చెయ్యరు. చిన్న హీరోల మీద ఆధారపడాలి. చిన్న హీరోలతో ఈ జానర్ కి మైలేజీ సంబంధమైన లోటు
లుంటాయి. దీన్ని క్రియేటివ్ యాస్పెక్ట్ ని మరికొంత విస్తరించుకుని సరిచేసుకోవాలి. ప్రేక్షకులు
సినిమా సాంతం అదే చిన్న హీరో మొహం, అదే హంతకుడి మొహం చూస్తూ కూర్చోలేరన్పిస్తే, క్లయిమాక్స్
లో ఈలలు పడేలా ఇంకో పెద్ద నోటెడ్ విలన్ ఆర్టిస్టుని అదనంగా దిగుమతి చేసుకోవాలి. లేదా ఇతర సీన్లలో బడ్జెట్ మిగుల్చుకుని క్లయిమాక్స్ లో బిగ్ యాక్షన్ ని ప్లాన్ చేసుకోవాలి.
ఇలాటి క్రియేటివ్ యాస్పెక్టులు అన్వేషించుకోవాలి. క్రియేటివ్ స్టేజి అంటే ఒకసారి రాసేసేది
కాదు. రాస్తూ రాస్తూ రాస్తూ తిరగ రాస్తూ గీస్తూ పూస్తూ వుండేది.
ఈ
జానర్ కథ పది నిమిషాల్లో వినిపించడాని కుండదు. పది నిమిషాల్లో ప్రేమ కథనో, యాక్షన్ కథనో విన్పించ వచ్చు. ఇలాటి ఇన్వెస్టిగేషన్
ఆధారిత క్రైం థ్రిల్లర్ విన్పించాలంటే పది నిమిషాల్లో విషయమేమీ వుండదు. కనీసం అరగంటైనా
పడుతుంది. స్క్రీన్ ప్లే బేస్డ్ అని ఏదో పదం వాడేస్తూంటారు కదా, అలాటి స్క్రీ ప్లే
బేస్డ్ జాతికి చెందుతుంది ఈ క్రైం థ్రిల్లర్ గొడవ. అంటే కథనం చెప్పుకుంటూ పోతే తప్ప
అర్ధమవడం కష్టమన్న మాట. ఈ కథనాన్ని అరగంట లోపు కుదించడం సాధ్యం కాదు. ఒక అసోసియేట్
వున్నాడు. రెండేళ్ళుగా ఇలాటి కథని విన్పించీ విన్పించీ - వెనుక నుంచి ముందుకూ, ముందు
నుంచి వెనక్కీ, ఎలాపడితే అలా - ఎప్పుడు పడీ అప్పుడు - ఎంత సేపంటే అంత సేపూ -విన్పించే
స్థితి కొచ్చాడు.
కథ రాసేశాక క్రాస్ చెకింగ్ చేసుకోకుండా హీరోకో నిర్మాతకో విన్పించ కూడదు. ఒకవేళ అది లోపరహితంగా వుండి ఓకే అయితే ఫర్వాలేదు. లోపాలుంటే మాత్రం ఇరుక్కుని పోతారు. వాళ్ళు ఓకే చేశాక క్రాస్ చెకింగ్ మొదలు పెట్టుకుంటే, అప్పుడు లోపాలు బయట పెడితే, వాటిని మార్చడానికి వాళ్ళు అంగీకరించక పోతే (అవి లోపాలని తెలీక), ఇంకేం చెయ్యడానికి వీలుండదు. కాబట్టి ముందే క్రాస్ చెకింగ్ చేయించుకుని, పూర్తి సంతృప్తి కలిగాకే విన్పించాలి.
(ఐపోయింది)
Sunday, April 12, 2020
927 : క్రైం థ్రిల్లర్ జానర్ మర్యాద - 5
క్రైం థ్రిల్లర్ కథలతో వుండే సౌలభ్యం ఏమిటంటే ఇవి రాయడానికి హత్య చేసి చూడాల్సిన అవసరం లేదు. కనీసం ఒక హత్యకి గురైన శవం చూసిన అనుభవం వుండాల్సిన అవసరం కూడా లేదు. పోలీసుల్ని తోసుకుంటూ వెళ్లి మర్డర్ సీన్ ని కళ్ళారా చూడాల్సిన అవసరం కూడా లేదు. ప్రేమ కథలు రాయాలంటే, కుటుంబ కథలు రాయాలంటే ఎంతో కొంత జీవితానుభవం వుండాలేమో. క్రైం థ్రిల్లర్ కథలు రాయడానికి జీవితానుభవం కోసం ప్రయత్నిస్తే జైల్లో వుంటారు. అక్కడ తోటి కిల్లర్స్ ఆటలు పట్టిస్తారు. కామెడీ అయిపోతుంది కెరీర్. కనుక ఎంత కొత్త రైటరైనా, మేకరైనా రియల్
లైఫ్ అనుభవం లేకుండా మర్డర్ల సినిమాలు శుభ్రంగా రాసుకోవచ్చు, తీసుకోవచ్చు. ప్రపంచంలో
ప్రతీ క్రైం థ్రిల్లర్ రచయితా / దర్శకుడూ ఈ అనుభవం లేకుండా రాసిన వాడే / తీసిన వాడే.
కాబట్టి ఈ జానర్లోకి వచ్చే కొత్త రైటర్లు, మేకర్లు అధైర్య పడాల్సిన పని లేదు. రాయడానికీ
తీయడానికీ తమకేం తెలుసని గాకుండా, ఏం రాస్తున్నారో, ఎలా తీస్తున్నారో చెక్ చేసుకుంటే చాలు...
ఈ బేస్ స్ట్రక్చర్ మీద కథనంతో చేసే క్రియేటివిటీయే కథకి రక్తమాంసాలు సమకూర్చి పెడుతుంది. అంటే ముందుగా బేస్ స్ట్రక్చర్ లో కథని రేఖామాత్రంగా ప్లాన్ చేసుకోవాలి. అంటే ఐడియాతో మొదలెట్టాలి. ఇక్కడ చెప్తున్న విధంగా స్టెప్ బై స్టెప్ రేఖామాత్రమైన బేస్ స్ట్రక్చర్ చేసుకుంటే, ఇంకే అనుమానాలూ వేధించవు. ముందుగా ఐడియా ని వర్కౌట్ చేసుకోవాలి. ఒక బిజినెస్ మాన్ ని ఇంకో బిజినెస్ మాన్ హత్య చేస్తే, పోలీస్ డిటెక్టివ్ చనిపోయిన బిజినెస్ మాన్ ని బతికించి, చంపిన బిజినెస్ మాన్ ని పట్టుకున్నాడు - అని ఒక ఐడియా ఏదో తట్టిందనుకుందాం - ఈ ఐడియాలో స్ట్రక్చర్ వుండేట్టు చూసుకోవాలి. ఒక బిజినెస్ మాన్ ని ఇంకో బిజినెస్ మాన్ హత్య చేస్తే (బిగినింగ్), పోలీస్ డిటెక్టివ్ చనిపోయిన బిజినెస్ మాన్ ని బతికించి (మిడిల్), చంపిన బిజినెస్ మాన్ ని పట్టుకున్నాడు (ఎండ్) - స్ట్రక్చర్ వచ్చేసింది. బిజినెస్ మాన్ హత్య ప్లాట్ పాయింట్ వన్ సీను, చనిపోయిన బిజినెస్ మాన్ ని బతికించడం ప్లాట్ పాయింట్ టూ సీను - స్ట్రక్చర్ వచ్చేసింది.
ఇప్పుడు స్క్రీన్ ప్లేకి రెండు మూలస్థంభాల్లాంటి ఈ రెండు ప్లాట్ పాయింట్ సీన్లని దగ్గర పెట్టుకుని, వీటి మధ్య రేఖామాత్రపు మిడిల్ కథ నల్లుకోవాలి. అల్లుకున్నతర్వాత, ఇక రేఖామాత్రపు మిడిల్ కథకి, క్రియేటివిటీకి పని పెడుతూ పూర్తి స్థాయి ఆర్డర్ (సీన్లు) వేసుకుంటూ పోవాలి. ఆర్డర్ వేసుకున్నాక, ఆర్డర్ లో వున్న సీన్లని విస్తరిస్తూ, క్రియేటివిటీని తారాస్థాయికి తీసికెళ్తూ ట్రీట్ మెంట్ రాసుకుంటూ పోవాలి. ట్రీట్ మెంట్ రాసుకున్నాక క్రియేటివ్ సత్తువ కొద్దీ, డైలాగ్ వెర్షన్ కూడా రాసి స్క్రిప్టు ముగించెయ్యాలి. ఇప్పుడు రక్తమాంసాలతో షూటింగుకి రెడీ.
ఇంత సులభమా? కాదు. క్రియేటివ్ దశ కొచ్చేసరికి వుంటుంది అసలు సంగతి. రాత్రింబవళ్ళు మతిచెడే పరిస్థితి. క్రియేటివ్ దశలోనే జానర్ మర్యాదలుంటాయి, క్రియేటివ్ దశలోనే సస్పెన్స్, టెంపో నిర్వహణ వస్తాయి, క్రియేటివ్ దశలోనే అన్నినేర పరిశోధనా పద్ధతుల అమలూ వుంటుంది. క్రియేటివ్ దశలోనే...ఈ కింద చెప్పుకునే చాలా వుంటాయి-
ఈ సందర్భంగా రెండు సినాప్సిస్ లు అందాయి. ఈ క్రైం థ్రిల్లర్స్ లో ఏం రాశారంటే, ఒక హత్యతోనే కథంతా రాశారు. ఒక హత్య సినిమాకి సరిపోదు. కనీసం ఇంటర్వెల్ ముందు ఇంకో హత్య, సెకండాఫ్ లో ఇంకో హత్యా జరిగితే గానీ సినిమా అనే రెండు గంటల వ్యవహారం మాట వినదు. ఇలాంటి క్రియేటివిటీలు తెలుసుకోవాలి. పైన ఉదాహరణకి చెప్పుకున్న ఐడియా ఒకే హత్యతో వుందంటే, పాయింటు ఒక హత్యతోనే వుంటుంది. ఐడియాని విస్తరించినప్పుడు కథనంలో మరికొన్ని హత్యలు వస్తాయి. ఆ హత్యలు కూడా ఆషామాషీగా వుండకూడదు. ప్రధాన హత్య యజమాని హత్యయితే, అనుబంధ హత్య యజమాని ప్రియురాలిదై వుండాలి. ఇంకో అనుబంధ హత్యగా చూసి చూసి యజమాని భార్యని చంపెయ్యాలి. ఇలా తీవ్రత పెరగాలి. అంతేగానీ యజమాని హత్య తర్వాత పని వాణ్ణి, వాచ్ మన్ నీ చంపుకుంటూ కూర్చుంటే సినిమా ససేమిరా అంటుంది.
ఇక్కడ అర్ధమవడం కోసం -
గత వ్యాసాల్లో పేర్కొన్న క్రైం రచయితల సలహాదారైన మాజీ పోలీస్ డిటెక్టివ్ గేరీ రాడ్జర్స్ ఇంకేమంటున్నాడంటే, స్టోరీ సైన్స్ ని అర్ధం జేసుకోమంటున్నాడు. క్రైం థ్రిల్లర్లు చదివే పాఠకులు ఎందుకు విడువకుండా రాత్రంతా మేల్కొని చదువుతారు? (తెలుగు డిటెక్టివ్ నవలలు గంట రెండు గంటల్లో ఏకబిగిన చదివేసే పాఠకులుండే వాళ్ళు). ఆ రచయితలు ప్రయోగించే పదాలు అలా వుంటాయి. ఆ పదాలకి మెదడులో ఎండార్ఫిన్లు విడుదలవుతాయంటున్నాడు గేరీ. ఇక ఆ పుస్తకం విడిచిపెట్ట లేరు. అదన్నమాట సంగతి. దీనికి సంబంధించి లీసా క్రాన్ రాసిన పుస్తకాన్ని సిఫార్సు చేశాడు (ఈ పుస్తకం కొనలేం గానీ, ఆవిడ వెబ్సైట్ లింక్ వ్యాసం చివర ఇస్తున్నాం. ఇందులో ఆవిడ స్టోరీ సైన్స్ గురించి విస్తృత సమాచారం పొందుపర్చింది).
అంటే మెదడులో ఎండార్ఫిన్లు పిచికారీ కొట్టినట్టు విడుదలవుతూ వుండాలంటే వెండితెర మీద కథనం ముందుకు పరిగెడుతూ వుండాలన్న మాట. ఆ కథనంలో క్షణం క్షణం థ్రిల్లో సస్పెన్సో వుండాలి. అలా ముందుకు పరిగెడుతున్న కథనం ఆగి, వెనక్కి తిరిగి ఫ్లాష్ బ్యాకులేసుకుందా, ఇక మెదడులో ఎండార్ఫిన్ల స్రావం ఆగిపోతుంది. వెనక్కి తిరిగి ఫ్లాష్ బ్యాకుల్ని అర్ధం జేసుకోవడానికి మెదడు బిజీ అవడంవల్ల ఎండార్ఫిన్లని విడుదల చేయదు. ముందుకు పరిగెడుతున్న కథనం ఒకసారి ఆగి ఫ్లాష్ బ్యాక్ వచ్చినా, లేదా ముందుకు పరిగెడుతున్న కథనం పదేపదే ఆగుతూ మల్టీపుల్ ఫ్లాష్ బ్యాక్స్ వచ్చినా, ఎండార్ఫిన్లు విడుదల కానే కావు. ఎందుకిలా? ఫ్లాష్ బ్యాకుల్లో వుండేది కథ కాదు. నడుస్తున్న కథకి పూర్వ సమాచారం మాత్రమే. ఫ్లాష్ బ్యాకులతో వుండే సినిమా అంతా కథ కాదు. ఫ్లాష్ బ్యాకులు తీసేస్తే మిగిలుండేదే కథ. ఫ్లాష్ బ్యాకుల వల్ల ఎంత కథ కోల్పోతారో దీన్నిబట్టి అర్ధంజేసుకోవాలి. ఇలా ఫ్లాష్ బ్యాక్ అంటే సమాచారమే గనుక, సమాచారం కథకాదు గనుక, కథ కాని దానికి ఎండార్ఫిన్ల తోడ్పాటు వుండదు. హార్మోన్లు రిలాక్స్ అయిపోతాయి. ఈ సైన్స్ ని అర్ధం జేసుకోవాలి.
లీనియర్ స్క్రీన్ ప్లేలని చూస్తే, ఈ సైన్స్ ఆధారంగానే క్యారక్టర్ ఆర్క్, టైం అండ్ టెన్షన్ గ్రాఫ్ అనే రెండు స్క్రిప్టింగ్ టూల్స్ ఏర్పాటైనట్టు గమనించగలం. ఇవి లీనియర్ స్క్రీన్ ప్లేలకే వుంటాయని సినిమాల్ని చూసి కనుగొన్నారు పండితులు. ఫ్లాష్ బ్యాక్స్ తో వుండే నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేలకి వుండవు. వీటిని బోధించడం కూడా లీనియర్ స్క్రీన్ ప్లేలకే భోదిస్తారు. కథనం ఫ్లాష్ బ్యాకుల వల్ల వెనక్కీ ముందుకూ అవుతునప్పుడు, మనం హీరో క్యారక్టర్ ఆర్క్ (పాత్రోచిత చాపం) గానీ, కథనంలో కాలంతో అనులోమంగా వుండే టెన్షన్ ని గానీ ఫీల్ కాం. ఈ రెండు టూల్స్ ని ఫ్లాష్ బ్యాక్స్ రహిత ఎడతెగని కథనం వున్నప్పుడే ఫీలవుతాం, థ్రిల్లవుతాం..
అసలీ ఫ్లాష్ బ్యాకుల ఫ్యాషనేంటి, లీనియర్ కథనంతో చక్కటి క్లీన్ లైన్ ఆఫ్ యాక్షన్ చూపించకుండా. 84 యాక్షన్ సినిమాలు తీసిన రాం గోపాల్ వర్మ, ఒక్కటి కూడా ఫ్లాష్ బ్యాక్స్ తో తీయలేదు.
క్రైం థ్రిల్లర్ మిడిల్ కథనం క్రియేటివిటీ గురించి ఇంకా చెప్పుకుంటే - గేరీ రాడ్జర్స్ ఏమని సలహా ఇస్తాడంటే, మూస లోంచి బయటికి రావాలంటాడు. ఇంకా ఈ కాలంలో అవే పోస్ట్ మార్టం, టాక్సికాలజీ, బాలస్టిక్ మ్యాచింగ్, డాక్యుమెంట్ ఎగ్జామినేషన్ అంటూ అక్కడే ఆగిపోకుండా, వీటితో బాటూ - డీఎన్ఏ, ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్, వైర్ టాప్స్, రూంబగ్స్, పాలీగ్రాఫ్, అండర్ కవర్ ఆపరేటర్స్, హిప్నాసిస్, సైకలాజికల్ ప్రొఫైలింగ్, కంప్యూటర్ ఎనలైజింగ్, శాటిలైట్ సర్వేలెన్స్, ఎంటమాలజీ మొదలైనవి కూడా అవసరాన్నిబట్టి కథలోకి తీసుకోవాలంటాడు.
(మిగతా రేపు)
గత వ్యాసం ‘క్రైం థ్రిల్లర్ రాయడమెలా?’ లో (వ్యాసం కింద లింక్ ఇచ్చాం), శాంపిల్ కథలో హత్యతో
క్రైం సీన్ ని స్థాపించడం గురించి తెలుసుకున్నాక, ఇప్పుడు దాని తాలూకు ఇన్వెస్టిగేషన్
కథనం ఎలా వుంటుందో చూద్దాం. ఇతర అన్ని జానర్లకి వుండే స్ట్రక్చరే దీనికీ వుంటుంది.
బిగినింగ్ మిడిల్ ఎండ్ విభాగాల్లో అవే బిజినెస్సులుంటాయి. బిగినింగ్ లో కథ తాలూకు సెటప్,
మిడిల్లో సమస్యతో సంఘర్షణ, ఎండ్ లో పరిష్కారం వుంటాయి. ప్లాట్ పాయింట్ వన్ సమస్యని
ఏర్పాటు చేస్తే, ప్లాట్ పాయింట్ టూ ఆ సమస్యకి పరిష్కారాన్ని చూపిస్తుంది. ఇప్పుడు శాంపిల్
కథలో హత్యతో వివరించుకున్న క్రైం సీన్ అనేది బిగినింగ్ తాలూకు సెటప్ వల్ల వచ్చిన
ప్లాట్ పాయింట్ వన్ సీను. అంటే సమస్య ఏర్పాటు. అంటే పోలీస్ డిటెక్టివ్ హీరోకి గోల్
ఏర్పాటు. హంతకుణ్ణి పట్టుకోవాల్సిన గోల్ ఏర్పాటు.
దీంతో
మిడిల్ విభాగం మొదలవుతుంది. మిడిల్ విభాగమంటే గోల్ కోసం సంఘర్షణ గనుక, ఆ సంఘర్షణ పోలీస్
డిటెక్టివ్ కి హంతకుడి (విలన్) తో వుంటుంది. ఈ సంఘర్షణ ప్లాట్ పాయింట్ టూ వరకూ
కొనసాగి, అంతిమంగా పోలీస్ డిటెక్టివ్ కి అక్కడొక పరిష్కార మార్గం లభించి, ఎండ్
విభాగం ప్రారంభమవుతుంది. ఇక్కడ ఫైనల్ గా హంతకుణ్ణి పట్టుకుంటాడు. ఇంతకి మించి బేస్
స్ట్రక్చర్ ఇంకేమీ లేదు.
ఈ బేస్ స్ట్రక్చర్ మీద కథనంతో చేసే క్రియేటివిటీయే కథకి రక్తమాంసాలు సమకూర్చి పెడుతుంది. అంటే ముందుగా బేస్ స్ట్రక్చర్ లో కథని రేఖామాత్రంగా ప్లాన్ చేసుకోవాలి. అంటే ఐడియాతో మొదలెట్టాలి. ఇక్కడ చెప్తున్న విధంగా స్టెప్ బై స్టెప్ రేఖామాత్రమైన బేస్ స్ట్రక్చర్ చేసుకుంటే, ఇంకే అనుమానాలూ వేధించవు. ముందుగా ఐడియా ని వర్కౌట్ చేసుకోవాలి. ఒక బిజినెస్ మాన్ ని ఇంకో బిజినెస్ మాన్ హత్య చేస్తే, పోలీస్ డిటెక్టివ్ చనిపోయిన బిజినెస్ మాన్ ని బతికించి, చంపిన బిజినెస్ మాన్ ని పట్టుకున్నాడు - అని ఒక ఐడియా ఏదో తట్టిందనుకుందాం - ఈ ఐడియాలో స్ట్రక్చర్ వుండేట్టు చూసుకోవాలి. ఒక బిజినెస్ మాన్ ని ఇంకో బిజినెస్ మాన్ హత్య చేస్తే (బిగినింగ్), పోలీస్ డిటెక్టివ్ చనిపోయిన బిజినెస్ మాన్ ని బతికించి (మిడిల్), చంపిన బిజినెస్ మాన్ ని పట్టుకున్నాడు (ఎండ్) - స్ట్రక్చర్ వచ్చేసింది. బిజినెస్ మాన్ హత్య ప్లాట్ పాయింట్ వన్ సీను, చనిపోయిన బిజినెస్ మాన్ ని బతికించడం ప్లాట్ పాయింట్ టూ సీను - స్ట్రక్చర్ వచ్చేసింది.
ఇప్పుడు స్క్రీన్ ప్లేకి రెండు మూలస్థంభాల్లాంటి ఈ రెండు ప్లాట్ పాయింట్ సీన్లని దగ్గర పెట్టుకుని, వీటి మధ్య రేఖామాత్రపు మిడిల్ కథ నల్లుకోవాలి. అల్లుకున్నతర్వాత, ఇక రేఖామాత్రపు మిడిల్ కథకి, క్రియేటివిటీకి పని పెడుతూ పూర్తి స్థాయి ఆర్డర్ (సీన్లు) వేసుకుంటూ పోవాలి. ఆర్డర్ వేసుకున్నాక, ఆర్డర్ లో వున్న సీన్లని విస్తరిస్తూ, క్రియేటివిటీని తారాస్థాయికి తీసికెళ్తూ ట్రీట్ మెంట్ రాసుకుంటూ పోవాలి. ట్రీట్ మెంట్ రాసుకున్నాక క్రియేటివ్ సత్తువ కొద్దీ, డైలాగ్ వెర్షన్ కూడా రాసి స్క్రిప్టు ముగించెయ్యాలి. ఇప్పుడు రక్తమాంసాలతో షూటింగుకి రెడీ.
ఇంత సులభమా? కాదు. క్రియేటివ్ దశ కొచ్చేసరికి వుంటుంది అసలు సంగతి. రాత్రింబవళ్ళు మతిచెడే పరిస్థితి. క్రియేటివ్ దశలోనే జానర్ మర్యాదలుంటాయి, క్రియేటివ్ దశలోనే సస్పెన్స్, టెంపో నిర్వహణ వస్తాయి, క్రియేటివ్ దశలోనే అన్నినేర పరిశోధనా పద్ధతుల అమలూ వుంటుంది. క్రియేటివ్ దశలోనే...ఈ కింద చెప్పుకునే చాలా వుంటాయి-
ఈ సందర్భంగా రెండు సినాప్సిస్ లు అందాయి. ఈ క్రైం థ్రిల్లర్స్ లో ఏం రాశారంటే, ఒక హత్యతోనే కథంతా రాశారు. ఒక హత్య సినిమాకి సరిపోదు. కనీసం ఇంటర్వెల్ ముందు ఇంకో హత్య, సెకండాఫ్ లో ఇంకో హత్యా జరిగితే గానీ సినిమా అనే రెండు గంటల వ్యవహారం మాట వినదు. ఇలాంటి క్రియేటివిటీలు తెలుసుకోవాలి. పైన ఉదాహరణకి చెప్పుకున్న ఐడియా ఒకే హత్యతో వుందంటే, పాయింటు ఒక హత్యతోనే వుంటుంది. ఐడియాని విస్తరించినప్పుడు కథనంలో మరికొన్ని హత్యలు వస్తాయి. ఆ హత్యలు కూడా ఆషామాషీగా వుండకూడదు. ప్రధాన హత్య యజమాని హత్యయితే, అనుబంధ హత్య యజమాని ప్రియురాలిదై వుండాలి. ఇంకో అనుబంధ హత్యగా చూసి చూసి యజమాని భార్యని చంపెయ్యాలి. ఇలా తీవ్రత పెరగాలి. అంతేగానీ యజమాని హత్య తర్వాత పని వాణ్ణి, వాచ్ మన్ నీ చంపుకుంటూ కూర్చుంటే సినిమా ససేమిరా అంటుంది.
ఇక్కడ అర్ధమవడం కోసం -
బిగినింగ్ - మిడిల్ -ఎండ్ వరస క్రమంలో లీనియర్
కథనమే చూస్తున్నాం. ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్ పోలీస్ కథ నాన్ లీనియర్ గానూ వుండొచ్చు.
అంటే ఫ్లాష్ బ్యాక్స్ తో వుండొచ్చు. ఫ్లాష్ బ్యాకులు ఎక్కువైపోతే (మల్టిపుల్
ఫ్లాష్ బ్యాక్స్) ఇన్వెస్టిగేషన్ క్రోనాలజీ గజిబిజి అయిపోతుంది, ప్రేక్షకులు ఫాలో
అవడం కష్టమైపోతుంది. ప్రేక్షకులు ఫాలో అవడం కష్టంగా వుందంటే, ఆ కథనం విఫలమైనట్టే.
ఆ కథనం జానర్ మర్యాద తప్పినట్టే. క్రైం థ్రిల్లర్ జానర్ మర్యాదల్లో ప్రేక్షకుల
హర్మోన్ల ప్రేరేపణ కూడా ఒకటి.
గత వ్యాసాల్లో పేర్కొన్న క్రైం రచయితల సలహాదారైన మాజీ పోలీస్ డిటెక్టివ్ గేరీ రాడ్జర్స్ ఇంకేమంటున్నాడంటే, స్టోరీ సైన్స్ ని అర్ధం జేసుకోమంటున్నాడు. క్రైం థ్రిల్లర్లు చదివే పాఠకులు ఎందుకు విడువకుండా రాత్రంతా మేల్కొని చదువుతారు? (తెలుగు డిటెక్టివ్ నవలలు గంట రెండు గంటల్లో ఏకబిగిన చదివేసే పాఠకులుండే వాళ్ళు). ఆ రచయితలు ప్రయోగించే పదాలు అలా వుంటాయి. ఆ పదాలకి మెదడులో ఎండార్ఫిన్లు విడుదలవుతాయంటున్నాడు గేరీ. ఇక ఆ పుస్తకం విడిచిపెట్ట లేరు. అదన్నమాట సంగతి. దీనికి సంబంధించి లీసా క్రాన్ రాసిన పుస్తకాన్ని సిఫార్సు చేశాడు (ఈ పుస్తకం కొనలేం గానీ, ఆవిడ వెబ్సైట్ లింక్ వ్యాసం చివర ఇస్తున్నాం. ఇందులో ఆవిడ స్టోరీ సైన్స్ గురించి విస్తృత సమాచారం పొందుపర్చింది).
అంటే మెదడులో ఎండార్ఫిన్లు పిచికారీ కొట్టినట్టు విడుదలవుతూ వుండాలంటే వెండితెర మీద కథనం ముందుకు పరిగెడుతూ వుండాలన్న మాట. ఆ కథనంలో క్షణం క్షణం థ్రిల్లో సస్పెన్సో వుండాలి. అలా ముందుకు పరిగెడుతున్న కథనం ఆగి, వెనక్కి తిరిగి ఫ్లాష్ బ్యాకులేసుకుందా, ఇక మెదడులో ఎండార్ఫిన్ల స్రావం ఆగిపోతుంది. వెనక్కి తిరిగి ఫ్లాష్ బ్యాకుల్ని అర్ధం జేసుకోవడానికి మెదడు బిజీ అవడంవల్ల ఎండార్ఫిన్లని విడుదల చేయదు. ముందుకు పరిగెడుతున్న కథనం ఒకసారి ఆగి ఫ్లాష్ బ్యాక్ వచ్చినా, లేదా ముందుకు పరిగెడుతున్న కథనం పదేపదే ఆగుతూ మల్టీపుల్ ఫ్లాష్ బ్యాక్స్ వచ్చినా, ఎండార్ఫిన్లు విడుదల కానే కావు. ఎందుకిలా? ఫ్లాష్ బ్యాకుల్లో వుండేది కథ కాదు. నడుస్తున్న కథకి పూర్వ సమాచారం మాత్రమే. ఫ్లాష్ బ్యాకులతో వుండే సినిమా అంతా కథ కాదు. ఫ్లాష్ బ్యాకులు తీసేస్తే మిగిలుండేదే కథ. ఫ్లాష్ బ్యాకుల వల్ల ఎంత కథ కోల్పోతారో దీన్నిబట్టి అర్ధంజేసుకోవాలి. ఇలా ఫ్లాష్ బ్యాక్ అంటే సమాచారమే గనుక, సమాచారం కథకాదు గనుక, కథ కాని దానికి ఎండార్ఫిన్ల తోడ్పాటు వుండదు. హార్మోన్లు రిలాక్స్ అయిపోతాయి. ఈ సైన్స్ ని అర్ధం జేసుకోవాలి.
లీనియర్ స్క్రీన్ ప్లేలని చూస్తే, ఈ సైన్స్ ఆధారంగానే క్యారక్టర్ ఆర్క్, టైం అండ్ టెన్షన్ గ్రాఫ్ అనే రెండు స్క్రిప్టింగ్ టూల్స్ ఏర్పాటైనట్టు గమనించగలం. ఇవి లీనియర్ స్క్రీన్ ప్లేలకే వుంటాయని సినిమాల్ని చూసి కనుగొన్నారు పండితులు. ఫ్లాష్ బ్యాక్స్ తో వుండే నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేలకి వుండవు. వీటిని బోధించడం కూడా లీనియర్ స్క్రీన్ ప్లేలకే భోదిస్తారు. కథనం ఫ్లాష్ బ్యాకుల వల్ల వెనక్కీ ముందుకూ అవుతునప్పుడు, మనం హీరో క్యారక్టర్ ఆర్క్ (పాత్రోచిత చాపం) గానీ, కథనంలో కాలంతో అనులోమంగా వుండే టెన్షన్ ని గానీ ఫీల్ కాం. ఈ రెండు టూల్స్ ని ఫ్లాష్ బ్యాక్స్ రహిత ఎడతెగని కథనం వున్నప్పుడే ఫీలవుతాం, థ్రిల్లవుతాం..
అసలీ ఫ్లాష్ బ్యాకుల ఫ్యాషనేంటి, లీనియర్ కథనంతో చక్కటి క్లీన్ లైన్ ఆఫ్ యాక్షన్ చూపించకుండా. 84 యాక్షన్ సినిమాలు తీసిన రాం గోపాల్ వర్మ, ఒక్కటి కూడా ఫ్లాష్ బ్యాక్స్ తో తీయలేదు.
క్రైం థ్రిల్లర్ మిడిల్ కథనం క్రియేటివిటీ గురించి ఇంకా చెప్పుకుంటే - గేరీ రాడ్జర్స్ ఏమని సలహా ఇస్తాడంటే, మూస లోంచి బయటికి రావాలంటాడు. ఇంకా ఈ కాలంలో అవే పోస్ట్ మార్టం, టాక్సికాలజీ, బాలస్టిక్ మ్యాచింగ్, డాక్యుమెంట్ ఎగ్జామినేషన్ అంటూ అక్కడే ఆగిపోకుండా, వీటితో బాటూ - డీఎన్ఏ, ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్, వైర్ టాప్స్, రూంబగ్స్, పాలీగ్రాఫ్, అండర్ కవర్ ఆపరేటర్స్, హిప్నాసిస్, సైకలాజికల్ ప్రొఫైలింగ్, కంప్యూటర్ ఎనలైజింగ్, శాటిలైట్ సర్వేలెన్స్, ఎంటమాలజీ మొదలైనవి కూడా అవసరాన్నిబట్టి కథలోకి తీసుకోవాలంటాడు.
(మిగతా రేపు)
―సికిందర్
Friday, April 10, 2020
926 : స్పెషల్ ఆర్టికల్
సామెతలు అబద్ధంగా
పుట్టలేదు. శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలు నిజంగానే వుంటాయి బద్ధకం
వదిలించుకుని కాస్త వెతికితే. ఊహకందని ఉపాయాలు కూడా బుట్టలో పడతాయి. కరోనా ఐతే ఏంటి,
అది కోరల వైరస్ ఐతే ఏంటి- దాని దిమ్మదిరిగే ఐడియాలు సినిమాలు తీయడానికి తన్నుకొస్తూనే
వుంటాయి. తైమూర్ బక్మంబెతోవ్ అంటే తమాషా కాదు. షూటింగు ఆపేసి స్టూడియోలోనే లైవ్
వీడియో గేమ్ లో సినిమా తీసేయగలడు. తైమూర్ ఇంకెవరో కాదు, ఎంజలీనా జోలీతో హాలీవుడ్
యాక్షన్ ‘వాంటెడ్’ తీసిన రష్యన్ దర్శకుడే. తిరిగి ఆమెతోనే రెండో ప్రపంచ యుద్ధ యాక్షన్ ‘వీ2 -ఎస్కేప్ ఫ్రమ్
హెల్’ తీస్తూంటే కరోనా హెచ్చరికలు షూటింగుకి బ్రేకేశాయి. ప్యాకప్ చెప్పేసి వచ్చేసి
స్టూడియోలో కూర్చుని తీయడం మొదలెట్టాడు. సినిమా చరిత్రలో మొట్టమొదటి లైవ్ వీడియో
గేమ్ లో తీసిన కమర్షియల్ మూవీ సీనుగా రికార్డు స్థాపించేశాడు.
నిజానికి ఈ సీను యుద్ధ విమానాలతో రియల్ లొకేషన్ గగనతలంలో తీయాలని ప్లాన్ చేస్తే కోరల వైరస్ కాదు పొమ్మంది. దీంతో లొకేషన్ లో సోషల్ మిక్సింగ్ ని వీలైంత తగ్గించాలని, అతి తక్కువ మంది యూనిట్ సభ్యుల్ని పిట్స్ బర్గ్ లొకేషన్లో వుంచి, ల్యాండ్ చేసిన యుద్ధ విమానం కాక్ పిట్ లో హీరో పావెల్ ప్రిలచ్నీని కూర్చోబెట్టి, తను 1200 కిమీ దూరంలోని కజాన్ స్టూడియోలో కూర్చుని, రిమోట్ డైరెక్షన్ మొదలెట్టాడు... సీను ఎలా పూర్తి చేశాడన్నది వేరే కథ. ఇంకోసారి చెప్పుకుందాం. పాయింటేమిటంటే, కరోనా కూడా సినిమాల్ని ఆపలేదని. కరోనా ఒక విషమ చారిత్రక ఘట్టం నిజమే, ఐతే దీన్నుంచి ఆర్ధికంగా పుంజుకుంటామనీ, ఇంకా బెటర్ బిజినెస్సులు అభివృద్ధి చెందుతాయనీ, రాజకీయ వ్యవస్థ కూడా రూపాంతీకరణ చెందుతుందనీ, ఇవి కాదని ఇంకేవో నెగెటివ్ వూహాగానాలు చేయడం వొట్టి బుల్ షిట్టనీ... తేల్చేస్తున్నాడు తైమూర్.
సినిమాలు చాలా తట్టుకున్నాయి. వీడియో కేసెట్స్ ని తట్టుకున్నాయి, టీవీ సీరియల్స్ ని తట్టుకున్నాయి, పైరసీనీ తట్టుకున్నాయి. సినిమాలంటేనే తట్టుకునే క్రియేటివిటీ. అందుకే అమెరికాలో ఒకప్పుడు సీఐఏ సంస్థ దేశానికేదైనా కఠిన సమస్య ఎదురైనప్పుడు పరిష్కారం కోసం హాలీవుడ్ రచయితల్ని సంప్రదించేది. క్రియేటివ్ పరిష్కారాలు చెప్తారని. రాజకీయ పక్షాలు కుయుక్తుల పరిష్కారాలు చెప్తాయి. ఆ రచయితల్నిసంప్రదించే సాంప్రదాయమిక లేదు. ప్రభుత్వాలే అయోమయం సృష్టిస్తాయి. సినిమాలే డీఫాల్టుగా వుండే క్రియేటివిటీతో వాటి దారి అవి చూసుకుని బయటపడాలి. నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజా కూడా, ఈ సంక్షోభంలోంచి ఇతర రంగాలకంటే తాము వేగంగా బయట పడతామన్నారు. సీఎన్ఎన్ పాత్రికేయుడు అడిగిన డజను కఠిన ప్రశ్నలకి సమాధానమివ్వ లేని అమెరికా అధ్యక్షుడి చేతిలో - దేశంతో బాటు హాలీవుడ్ కరోనా కాటుకి విలవిల్లాడుతున్నాయి. లాక్ డౌన్ విషయంలో ఇక్కడ అనావృస్టి అయితే, మనకి ఇండియాలో అతివృష్టి!
ప్రణాళిక లేకుండా నాల్గు గంటల గడువిచ్చి రాత్రికి రాత్రి దేశవ్యాప్త లాక్ డౌన్ ప్రకటించేస్తే, తెల్లారేకల్లా తిండి లేక రోడ్డున పడ్డారు జనాలు. జనజీవితం అస్తవ్యస్తమై పోయింది. దీనికి ముందు ఆదివారం ఒక రోజు లాక్ డౌన్ కి రెండు రోజులు గడువు. మూడువారాల దేశవ్యాప్త లాక్ డౌన్ కి మాత్రం నాల్గే నాలుగు గంటలు గడువు! దీని ప్రభావం మామూలుగా లేదు. ఒక అంతర్జాతీయ రిపోర్టు ప్రకారం దేశంలో 40 కోట్ల మంది ప్రజలు ఆర్ధిక పతనం చెందుతారు. మధ్య తరగతి కింది మధ్యతరగతికి, కింది మధ్యతరగతి పేద తరగతికి, పేద తరగతి దారిద్ర్య రేఖ దిగువకీ జారిపోతారు. ఈ రిపోర్టే నిజమైతే రేపు లాక్ డౌన్ ఎత్తేశాక థియేటర్లు తెరిస్తే, ప్రేక్షకులెవరుంటారో చూడాలి. మాస్ ప్రేక్షకుల శాతంలో ఎంత కోత పడుతుందో చూడాలి. ఈ నలభై కోట్ల మందికి కాస్తో కూస్తో డబ్బు చేతిలో పడితే ముందు బతకడానికి కావాలి.
ఇంతకాలం తిరిగి ప్రేక్షకులు సినిమాలకి రావడానికి కరోనా ఫోబియా కొంత కాలం వెన్నాడుతుందనుకున్నారు. నిర్మాత దిల్ రాజు కూడా, సినిమాలకెళ్ళి రోగం తెచ్చుకోవాలని ఎవరు కోరుకుంటారన్నారు. పీవీఆర్ గ్రూపు చైర్మన్ తమ మల్టీ ప్లెక్సుల్లో సీటు విడిచి సీటు బుకింగ్ ఇస్తామన్నారు. కానీ షో ప్రారంభమై పోయాక వచ్చే ఆగంతకుడు, చీకట్లో మన పక్క ఖాళీ సీట్లో ధడాలున కూలబడితేనో? అప్పుడేంటి? ఇలా ఫోబియా బహు కోణాల్లో భయపెడుతోంటే, దీనికి ఆర్ధిక లేమి కూడా తోడైతే, సినిమాలకి రావడానికి ప్రేక్షకులు ఇంకెన్నాళ్ళు పడుతుంది? ప్రస్తుతానికి లాక్ డౌన్ పొడిగింపే వుంటుంది. మరో రెండు వారాలకో ఎప్పుడో లాక్ డౌన్ దశల వారీగా ఎత్తేసినా, సినిమా థియేటర్ల వంతు చివరి దశలో వస్తుంది. ఆర్ధిక లేమి కాసేపు పక్కన బెడితే, అప్పుడైనా ఫోబియా వుండదా? అసలు అప్పటికైనా థియేటర్లు తెరచుకుంటాయా? అప్పటికి అసలు లాక్ డౌన్ ఎత్తేసే పరిస్థితి వుంటుందా?
తాజా రిపోర్టు ప్రకారం-

అమెరికాలో కరోనా మే ఒకటవ
తేదీకి పతాక స్థాయికి చేరుకుంటుంది. ఇండియాలో జూన్ ఒకటిన పతాక స్థాయికి
చేరుకుంటుంది. పతాక సన్నివేశం చూడకుండా అది వదిలి పెట్టదని అంటున్నారు. 1918 లో కోట్ల
మందిని పొట్టన బెట్టుకున్న స్పానిష్ ఫ్లూతో అనుభవాల్నిబట్టి, ఇప్పటి పతాక
సన్నివేశాన్ని వూహిస్తున్నారు. అప్పట్లో ఫిలడెల్ఫియాలో మొదటి ఫ్లూ కేసు ఇలా
బయటపడిందో లేదో, అలా శరవేగంగా వ్యాపించి పదిరోజుల్లో నగరంలో 20 వేల మందిని
ఆస్పత్రుల పాల్జేసింది. దీంతో న్యూయార్క్ నగరంలో తక్షణ చర్యలు తీసుకుని, లాక్ డౌన్
చేస్తే స్వల్ప మరణాలతో బయటపడ్డారు. అప్పటి ఫ్లూ హెచ్చుతగ్గుల ప్రవర్తనని అధ్యయనం
చేసిన మెకిన్సే సంస్థ రిపోర్టు ఇచ్చింది. దీని ప్రకారం, ఒక వ్యాధి గ్రస్తుడి నుంచి
ఒకరికి లేదా ఇద్దరికీ, ఆ ఇద్దరి నుంచి నల్గురికి, ఆ నల్గురి నుంచి ఎనమండుగురికీ
...ఇలా వ్యాప్తిస్తూ పోయిందంటే, ఇక విజృంభించి పతాక స్థాయికి వెళ్ళిపోతుంది. వెళ్ళాక
అక్కడ్నించీ తగ్గు ముఖం పట్టడం ప్రారంభిస్తుంది. ఎలాగంటే, ప్రజల రోగనిరోధక శక్తి
పెరగడమో, లేదా అసంఖ్యాక మరణాలు జరగడమో సంభవించి, కబళించడానికి కరోనాకి ఇక మనుషులు
కరువైపోతారు. ఇందుకే దానికి మనుషులు దొరక్కుండా భౌతిక దూరం పాటించాలనేది. బలాదూర్లు
తిరక్కుండా ఇంట్లో కూర్చోవాలనేది. ఇలా చేస్తే తక్కువ పాజిటివ్ కేసులతో ఇండియా జూన్
ఒకటికల్లా పీక్కెళ్ళి ఆ తర్వాత వైరస్ పీడా విరగడైపోతుంది. దానికి దొరక్కుండా
దాక్కోవడమే మార్గం. వూళ్ళో సీరియల్ కిల్లర్ తిరుగుతున్నాడంటే చప్పున వెళ్లి దాక్కుంటాంగా?
భావనా మాలి బాలీవుడ్ లో-
యంగ్ డాన్సర్. ఎడ్యుకేటెడ్. ఆమె
తన లాక్ డౌన్ కష్టాలు ఎబిపి ఛానెల్ కి తేలికగానే చెప్పుకుంది : ఫ్లాట్ అద్దె
పదిహేడున్నర వేలు కట్టాలి, ఖర్చులకి ఇంకా చాలా కావాలి. దినభత్యంతో పనిచేసే తను ఏ
నెలకా నెల గడుపుకొ స్తోంది. వచ్చేనెల అద్దె ఎలా కట్టాలో తెలీదు. యూనియన్ నుంచి
మాటామంతీ లేదు. అసలు షూటింగులు తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలీదు. ప్రారంభమైతే
కరోనా ఎఫెక్ట్ తో బ్యాక్ గ్రౌండ్ ఆర్టిస్టుల భవితేమిటో తెలీదు. భౌతిక దూరం
అంటున్నారు. క్రౌడ్ సీన్లు వుండక పోవచ్చంటున్నారు...
తమ్మారెడ్డి
భరద్వాజ కూడా క్రౌడ్ సీన్లే కాదు, ఫైటింగ్ సీన్లూ, ఫారిన్ షూట్లూ ఇంకా చాలా కాలం
పాటు మర్చిపోవాలన్నారు. సినిమా కథలు కూడా మారిపోతాయన్నారు. తమిళ సినిమాలకి ఫారిన్ షూట్లు ఏర్పాటు చేసే రాంజీ కూడా,
ఇప్పుడు విదేశాల్లో షూటింగ్స్ అసాధ్యమై పోయాయని అంటున్నారు. ఎవ్వరూ విమానాల్లో ప్రయాణించడాని
కిష్టపడ్డం లేదనీ, బడ్జెట్లు కూడా అదుపు తప్పుతున్నాయనీ ఆందోళన వ్యక్తం చేశారు.
అయితే నిన్న రాత్రి ఇది టైపు కొడుతున్న సమయానికి ఒక దర్శకుడు ఫోన్ చేసి, మాటల
సందర్భంగా, రచయితలకీ దర్శకులకీ ఢోకా వుండదన్నారు. ప్రజలు ఇంట్లో కూర్చుని సినిమాలు
చూసే డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో డిమాండ్ వుంటుందన్నారు. డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లోకి
భావనా లాంటి వాళ్ళు వెళ్ళాలనుకుంటే ఏ నటిగానో వృత్తి మార్చుకోవాలి.
మార్చుకుంటానంటోంది. మార్పిళ్లు సర్దుబాట్లు చాలా జరుగుతాయి. ఒక న్యూ నార్మల్
పుట్టు కొస్తుంది. పనిలోపనిగా లిప్ లాకులు కూడా నిన్నటి చరిత్రే ఐపోవచ్చు.
స్ట్రగుల్ నిర్మాణ రంగంలోనే కాదు, ప్రదర్శనా రంగంలోనూ వుంది హాలీవుడ్ సహా. కాకపోతే అమెరికాలో ప్రభుత్వాన్ని అర్ధిస్తున్నట్టు మన దగ్గర జరగడం లేదు. ఇంతే తేడా. అమెరికాలో జాతీయ థియేటర్ యాజమాన్యాల సంఘం, తమ లక్షా 50 వేల సిబ్బందికి బెయిల్ అవుట్ ప్రకటించండి మొర్రో అంటోంది. ఢిల్లీలో థియేటర్లు మూత బడ్డా ఖర్చులు తప్పడం లేదు. విద్యుత్ చార్జీలతో, సిబ్బంది జీతనాతాలతో నెలకి రెండు లక్షలు చేతి చమురు వదిలిస్తున్నాయి మూతబడ్డ థియేటర్లు. తమిళనాడులో తమ ఆదాయాలపై టీడీ ఎస్ ఎత్తేసి, రూరల్ సెంటర్స్ లో వినోదపు పన్ను రద్దు చేయాలంటున్నారు ఎగ్జిబిటర్లు.
ఐతే హాలీ వుడ్ రచయితల సంఘం, నటుల సమాఖ్యలతో బాటు; టీవీ, రేడియో ఆర్టిస్టుల సంఘాలు అన్ని స్టోరీ - ఇతర కంటెంట్ సమావేశాలన్నీ రద్దు చేశాయి. టాలీవుడ్ లో కూడా ఇదే జరిగితే డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో కూడా రచయితలూ దర్శకులూ ఇప్పుడప్పుడే బిజీ కాలేకపోవచ్చు. బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ సిఎన్ఎన్ - ఐబిఎన్ ఛానెల్లో రాజీవ్ మసంద్ కిచ్చిన ఇంటర్వ్యూలో, అసలు డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేయాలన్నా భౌతిక దూరం సమస్య వుండనే వుందిగా అన్నారు. షూటింగు లెలా చేస్తారు? ఇప్పుడు ఇంట్లో బందీలైన ప్రేక్షకులు డిజిటల్ కి అలవాటు పడుతున్నారనేది నిజమే, కానీ కొత్త కంటెంట్ ఎక్కడ్నించి వస్తుందిప్పుడు?
చెన్నైలో కూడా నిత్యం జరిగే 50 టీవీ సీరియల్స్ షూటింగులు ఆగిపోయాయి. ఇక వెబ్ సిరీస్ చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో అమెరికా, చైనాలు అతి పెద్ద సినిమా పరిశ్రమలు. లక్షల మంది ప్రజలు ఇళ్ళకి పరిమితమైపోయాక, అక్కడి నిర్మాతలు తమ కొత్త సినిమాలు ఎలా విడుదల చేయాలా అని తల బద్దలు కొట్టుకుంటున్నారు. అయిష్టంగానే స్ట్రీమింగ్ (డిజిటల్) వైపు చూస్తున్నారు. చైనాలో జనవరి నుంచి 70 వేల థియేటర్లు మూతబడ్డాయి. అక్కడ ఆన్ లైన్లో ఒక బిగ్ బడ్జెట్ సినిమా ‘లాస్ట్ ఇన్ రష్యా’ ని విడుదల చేస్తే 6 కోట్ల మంది చూశారు. అమెరికాలో కరోనా ఎఫెక్ట్ తో టీవీకి 6 శాతం, స్ట్రీమింగ్ కి 13 శాతం ప్రేక్షకులు పెరిగారని నీల్సన్ రిపోర్టు చెబుతోంది. అయితే హాలీవుడ్ కొత్త సినిమాలని స్ట్రీమింగ్ కివ్వడానికి ముందుకు రావడం లేదు. చిన్నచిన్న సినిమాలు వర్కౌటవుతా యేమో గానీ, పెద్ద సినిమాలు కావని భావిస్తున్నారు. విడుదల కావాల్సిన జేమ్స్ బాండ్ కొత్త సినిమా ‘నో టైం టు డై’ ని కూడా నవంబర్ కి వాయిదా వేశారు. చిన్న సినిమాల గ్లోబల్ రీచ్ కి ఈ గ్యాప్ లో స్ట్రీమింగ్ తో మంచి అవకాశాలుంటాయని అంటున్నారు. చిన్న సినిమాల డిజిటల్ రిలీజులు పెట్టుబడుల్ని వెనక్కి తెస్తాయని చెప్తున్నారు.
అసలు గ్లోబల్ బాక్సాఫీసుకి -
చైనాలో జనవరి నుంచి థియేటర్ల
మూతతో గట్టి దెబ్బ పడింది. 200 కోట్ల డాలర్ల థియేటర్ వసూళ్లు చైనాలో గాలిలో
కలిసిపోయాయి. హాలీవుడ్ అంటే గ్లోబల్ మార్కెట్. ఉత్తర దక్షిణ కొరియాలు, జపాన్,
యూరప్ లతో బాటు చైనా బిగ్ మార్కెట్. చైనా నుంచే అధిక రాబడి. అయినా సరే, ఇన్ని
మార్కెట్లు మూతబడుతున్నాయి కదాని, పెద్ద సినిమాలని స్ట్రీమింగ్ కిచ్చేసే ఆలోచన చేయడం లేదు. ఇవ్వాళా ఒక
పెద్ద సినిమాని ఇంట్లో కూర్చుని చూసిన ప్రేక్షకుడు, ఇంకో పెద్ద సినిమా కోసం
ఇంట్లోనే కూర్చుని ఎదురు చూస్తాడు. థియేటర్ కి ఎంత మంది కుటుంబ సభ్యులు వెళ్తే అంత
మందికి టికెట్లు కొంటారు. ఇంట్లో ఇలా కుదరదు. స్ట్రీమింగ్ లో 20 డాలర్లు ఒక
సినిమాకి ఫీజు పెడితే, ఆ 20 డాలర్లే ఇంట్లోంచి వస్తాయి. వంద మంది చూసి
పారేస్తారు...ఇలా లెక్క లేసుకుని వెనుకాడుతున్నారు హాలీవుడ్ నిర్మాతలు.
డిస్నీసంస్థ మార్చి 27న విడుదలకి
సిద్ధం చేసిన చైనీస్ యాక్షన్ థ్రిల్లర్ ‘ములన్’ ని జులై 24 కి వాయిదా వేసింది. ఎట్టి
పరిస్థితిలో స్ట్రీమింగ్ కి వెళ్ళల్చుకోలేదు. దీన్ని గనుక తమ డిస్నీ ప్లస్ లోనే విడుదల
చేస్తే, ఈ యాక్షన్ వండర్ ని ఇంట్లో కూర్చుని చూసిన ప్రేక్షకులు, ఇలాటివి ఇక
స్ట్రీమింగ్ లోనే వస్తాయిలే అనుకునే నెగెటివ్ రిజల్టు వచ్చే ప్రమాదముందని డిస్నీ
అధికారులంటున్నారు.
ఇంకా బ్లాక్ విడో, వండర్ వుమన్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9, ఏ క్వయిట్ ప్లేస్ 2 సహా 34 పెద్ద సినిమాల విడుదలల్నీ, ఇంకో 24 చిన్న సినిమాల విడుదలల్నీ జులై తర్వాత నుంచి వచ్చే సంవత్సరం దాకా వాయిదా వేసేశారు. పరిస్థితి చక్కబడి థియేటర్లు ప్రారంభమైనా, వెంటనే కొత్త సినిమాలు విడుదల చేయాలనుకోవడం లేదు. ముందుగా కొంతకాలం ప్రేక్షకుల స్పందనని పరీక్షించేందుకు, విడుదల కాని పాత సినిమాల్ని దుమ్ము దులిపి వేద్దామనుకుంటున్నారు. చైనాలో మార్చి చివరి వారంలో ప్రయోగాత్మకంగా 500 థియేటర్లు తెరిచి, ఇలాటి ఫార్ములానే అమలు చేస్తే ప్రేక్షకులు లేరు. ఒక థియేటర్ కి ఇద్దరు మాత్రమే వచ్చి మొహమొహాలు చూసుకున్నారు. ప్రాణాలు పణంగా పెట్టి పాత సినిమాలెవడు చూస్తాడని ఒకడు పోస్టు పెట్టాడు.
చైనాలో మార్చి చివరి వారంలో థియేటర్లు తెరవడానికి అనుమతిచ్చిన చైనా ఫిలిం అడ్మినిస్ట్రేషన్, అంతలోనే మూసేయాలని ఆదేశాలిచ్చింది. ఒక కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడమే కారణం. థియేటర్ల యాజమాన్యాలు కూడా థియేటర్లు తెరవడానికి సందిగ్ధంలో వున్నారు. ఎవరైనా ప్రేక్షకులు థియేటర్లో కరోనా బారిన పడి కేసువేస్తే నష్టపరిహారం చెల్లించడానికి ఇన్సూరెన్సు కవర్ కూడా లేదంటున్నారు. పైగా ప్రతివొక్క ప్రేక్షకుడికీ మాస్కు, చేతి గ్లవ్స్ ఉచితంగా అందించాలని ప్రభుత్వం పెట్టిన నిబంధనలకి బెంబేలెత్తు తున్నారు. మన దేశంలో కూడా రేపు ఇదే నిబంధన పెడితే థియేటర్లకి కష్టమే. ఇప్పటికే బయట తిరిగే ప్రతివొక్కరూ మాస్కు ధరించాలని ఉత్తర్వు లిచ్చింది ప్రభుత్వం.
ఇండియాలో ప్రస్తుతానికి స్ట్రీమింగ్ ఆలోచన చేయడం లేదు. చిన్న సినిమాలకి స్ట్రీమింగ్ కి పెద్దగా అవకాశాల్లేవు. యూట్యూబ్ ఛానెళ్లని ఆశ్రయించాల్సిందే. తెలుగులో తెలుగుకే ప్రత్యేకమైన ‘ఆహా’ ఓటీటీ స్ట్రీమింగ్ సర్వీస్ లో విడుదల చేసుకోవచ్చు. హిందీలో, కరణ్ జోహార్ విడుదల ఆగిపోయిన ‘సూర్య వంశీ’ ని తిరిగి థియేటర్లలో ఎలా విడుదల చేయాలా అని ఆలోచిస్తున్నారే తప్ప, స్ట్రీమింగ్ ఆలోచన చేయడం లేదు. తమిళంలో విడుదలైన సినిమాల్ని రెండు నుంచి నాల్గు వారాల్లోనే స్ట్రీమింగ్ కిచ్చేయడం పైన ఇప్పటికే థియేటర్ల యాజమాన్యాల ఆందోళన రెండేళ్లుగా కొనసాగుతోంది. ఇక కొత్త సినిమాల్ని నేరుగా స్ట్రీమింగ్ లోనే విడుదల చేసేస్తే తామేం కావాలని ప్రశ్నిస్తున్నారు. చిన్న సినిమాలైనా, స్టార్ సినిమాలైనా విడుదలయ్యాక ఎనిమిది వారాల గడువు పెడితే ఓటీటీ విండోకి ఒప్పుకుంటామంటున్నారు. దక్షిణాదిన నిర్మాత అల్లు అరవింద్ స్థాపించిన ‘ఆహా’ ఓటీటీతో బాటు, నెట్ ఫ్లిక్స్, అమెజాన్, హాట్ స్టార్, జీ5, సన్ ఎన్ ఎక్స్ టీలు పనిచేస్తున్నాయి.
స్ట్రీమింగ్ బిజినెస్ కూడా-
ప్రజలు ఎంత కాలం గృహలకి
పరిమితమై వుంటారనే దాని మీద, అలాగే వాళ్ళ వ్యక్తిగత
ఆర్ధిక పరిస్థితి మీద కూడా ఆధారపడి వుంటుందని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతానికి అమెరికాలో
చాలా మంది వర్కర్ల ఆదాయాలు ప్రశ్నార్ధక మవుతున్న సమయంలో, కుటుంబ సమేతంగా ఒక సినిమాకెళ్ళి
టికెట్లకి, పాప్ కార్న్ కీ, సోడాకీ 100 డాలర్లు వెచ్చించే కన్నా, 119 డాలర్లు
రుసుము చెల్లించి ఏడాది పొడవునా ఇంట్లో సినిమాలు చూసుకోవడం లాభసాటి అన్పిస్తుందని
నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ లెక్కలు కూడా మారిపోతాయంటున్నారు. మొన్న
మంగళవారం న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ కూమో, నగరంలో వైరస్ మే ఒకటిన పతాక స్థాయికి
చేరుతుందని చెప్పారనీ, అయితే ఇతర రాష్ట్రాల్లో ఇంకా ఎక్కువ సమయం తీసుకోవచ్చనీ,
దాంతో హాలీవుడ్ సహా ప్రతీ పరిశ్రమా డైలమాలో పడతాయనీ, అప్పుడేం జరగబోతుందో ఎవరూ చెప్పలేరనీ
విశ్లేషిస్తున్నారు. ట్రెండ్స్ ని అంచనా వేసి రికార్డు చేయడంలో దిట్ట అయిన నీల్సన్
కి చెందిన కట్ సింగ్రిస్ కూడా, ఈ విషయంలో చేతులెత్తేశారు. మీడియా పరిశ్రమకి దారులు
మూసేసింది వైరస్ - అని మాత్రం చెప్పగల్గుతున్నారు.
లైట్ షెడ్ కి చెందిన మీడియా ఎనలిస్టు రిచర్డ్ గ్రీన్ ఫీల్డ్ కూడా, సాధారణ పరిస్థితు లెప్పుడు నెలకొంటాయో ఎవ్వరికీ తెలీదంటున్నారు. ఒకవేళ పరిస్థితులన్నీ చక్కబడి థియేటర్లు తెర్చుకున్నప్పుడు, కిటకిట లాడితే అదికూడా నమ్మరాదంటున్నారు. ఇళ్ళల్లో కుటుంబ సభ్యుల మధ్య, స్నేహితుల మధ్యా వుండీ వుండీ వూపిరాడక బయటపడి సినిమాలకొస్తే, అది పొంగు మాత్రమేనని, అది ఇట్టే చల్లారిపోయి - వాళ్ళు తిరిగి సినిమాలు చూసుకుంటూ ఇళ్ళ దగ్గరా, వాళ్ళు లేక హాళ్ళు తిరిగి వెలవెల బోతూ భయానకంగా వుండక తప్పదనీ గ్రీన్ ఫీల్డ్ అంటున్నారు.
ఇండియాలో ప్రేక్షకుల్ని తిరిగి థియేటర్లకి రప్పించాలంటే ఒకటే మార్గమంటున్నారు కొందరు బాలీవుడ్ వ్యక్తులు. అది బిగ్ స్టార్ సినిమాలు తీసి విడుదల చేయడం. అయితే హిందీకైనా, తెలుగుకైనా, తమిళానికైనా ఓవర్సీస్ మార్కెట్ కూడా వుంటుంది. అక్కడ పరిస్థితి అసలే బాగా లేదు. అక్కడ ఆపుకుని ఇండియాలోనే విడుదలలు చేసుకోవాలి. లేదా గ్రీన్ ఫీల్డ్ థియరీని ఎదుర్కోవడానికి తెగించాలి.
ఇదంతా సరే, అసలు 1918 లో-
ఏం జరిగింది? అప్పటి స్పానిష్ ఇన్ ఫ్లూయెంజా మహమ్మారిని సినిమాలెలా
ఎదుర్కొన్నాయి? నూరేళ్ళ క్రితం తీసుకున్న చర్యలు ఇప్పుడేమైనా పనికొస్తాయా? ఈ
ప్రశ్న మెదిలి వీకీపీడియా చూస్తే అందులో మహమ్మారి గురించి వుంది తప్ప, సినిమాల
గురించి లేదు. సర్ఫింగ్ చేస్తూంటే రెండే రెండు చోట్ల సమాచారం. అది కూడా గతవారమే
ఇచ్చిన తాజా సమాచారం. టైమ్ మేగజైన్లో ఒకటి, బిబిసి వెబ్సైట్లో ఒకటి.
ఈ
తాజా కథనాల ప్రకారం, 1918 లో స్పానిష్ ఫ్లూ విజృంభణకి ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల
మంది రాలిపోయారు. అందులో అమెరికన్లు ఆరులక్షల 75 వేలు. అన్ని దేశాల కంటే
అత్యధికంగా మన దేశంలో కోటీ 20 లక్షల మంది చనిపోయారు. ఇది మొదట బొంబాయిని సోకింది. అందువల్ల
బాంబే ఫ్లూ అన్నారు. 1918 -20 మధ్య రెండేళ్ళ పాటు గడగడ లాడిం చింది. అమెరికాలో
ప్రభుత్వం వెంటనే అన్ని థియేటర్లనీ, పబ్లిక్ స్థలాలనీ మూసేయించింది. హాలీవుడ్
స్టూడియోల యాజమానులు మూడు వారాలపాటు షూటింగులాపుకుని, స్టూడియోలు మూసేశారు.
పరిస్థితి చక్కబడ్డాక అతి తక్కువ థియేటర్లు మాత్రమే తెరవగల్గారు. పారమౌంట్
పిక్చర్స్ అధినేత ఆర్ధిక సమస్యలతో మూతబడే వున్న థియేటర్లని కొనేశాడు. అమ్మకపోతే నీ
థియేటర్ ముందు థియేటర్ కడతామని అతడి మనుషులు బెదిరించి మరీ లొంగదీసుకున్నారు.
స్టూడియోలే థియేటర్లని గుప్పెట్లో వుంచుకునే వ్యవస్థ అప్పట్నుంచీ ప్రారంభమైంది.
1948 లో థియేటర్లపై స్టూడియోల ఈ గుత్తాధిపత్యాన్ని సుప్రీం కోర్టు బద్దలు
కొట్టింది.
ఫ్లూతో ఇంత బీభత్సం జరుగుతున్నా అనేక దేశాల్లో థియేటర్లని మూసివేయనే లేదు. అవి ప్రజలకి పాపులర్ అడ్డాలుగా మారాయి. థియేటర్లలో పడి సినిమాలు చూడడం, ఫ్లూ అంటించుకుని చావడం. సినిమాలు పుట్టిందే అప్పుడప్పుడే. తెరమీద కదిలే బొమ్మలంటేనే మైండ్ బ్లోయింగ్ మేటర్. చూడకుండా ఏ శక్తీ ఆపలేదు. చూపించే వాళ్ళకీ అదే పిచ్చి ఆనందం. బ్రిటిష్ ప్రభుత్వానిది మరీ చోద్యం. ప్రజారోగ్యానికి సినిమా అనేది నిత్యావసర వస్తువు అని తేల్చింది. ప్రజల్ని ఇది బిజీగా, ప్రశాంతంగా వుంచుతుందనీ, ముఖ్యంగా తాగుడికి దూరం చేస్తుందని సిద్ధాంతాలు చేసింది. ఫ్లూ వీరవిహరంలో ఇంగ్లాండ్ వ్యాప్తంగా ఒకచోట కాకపోతే ఇంకో చోట సినిమాలు ఆడుతూనే వుండేవి. లండన్ హాళ్ళలో ప్రతీ మూడు గంటల కోసారి, అరగంట పాటు కిటికీలూ తలుపులూ తెరిచి, హాళ్ళని రీఫ్రెష్ చేసేవాళ్ళు. పిల్లల్ని తీసుకుని రానిచ్చే వాళ్ళు కాదు. ఫ్లూ కారణం చూపించి థియేటర్లు మూసేయడం నాన్సెన్స్ అని, సినిమా ట్రేడ్ వ్యక్తులు థియేటర్ ఓనర్లకి ఉత్తరాలు రాసేవాళ్ళు.
అమెరికాలో థియేటర్ల మూసివేత రాష్ట్రాలని బట్టి జరిగింది. స్టూడియోలున్న లాస్ ఏంజిలిస్ లో వ్యాధి తీవ్రత అధికంగా వుండడంతో థియేటర్లు పూర్తిగా మూసేశారు. కాలిఫోర్నియాలో కూడా ఏడు వారాల పాటు మూసేశారు. సినిమా నిర్మాణాలు సహా, కొత్త సినిమాల విడుదలలు ఆపేశారు. ఈ పరిణామాల్లో చిన్న నిర్మాణ సంస్థలు తుడిచి పెట్టుకు పోయాయి. పెద్ద సంస్థలు మరింత బలమైన పెద్ద సంస్థలుగా ఎదిగాయి. నిర్మాణ- పంపిణీ – ప్రదర్శనా రంగాలు వాటి చేతిలో కెళ్ళి పోయాయి. అక్కడినుంచీ హాలీవుడ్ మెగా హాలీవుడ్ గా అవతరించి, ప్రపంచాన్ని ఏలుకోవడం మొదలెట్టింది సూపర్ మెగా సినిమాల పరంగా.
1918 లో అంత బీభత్సంలోనే నామరూపాల్లేకుండా పోలేదు అప్పుడప్పుడే పుట్టిన సినిమా - అలాంటిది ఇప్పుడేదో అయిపోతుందనుకోవడం భ్రమంటున్నారు. వీడియో కేసెట్ నే ఎదుర్కొని ముందుకు సాగింది, ఇప్పుడు స్ట్రీమింగ్ ఓ లెక్క కాదంటున్నారు. టీవీల్లో, కంప్యూటర్స్ లో సినిమాలు చూసి చూసి విసుగెత్తి, థియేటర్లలో వైడ్ స్క్రీన్ మీదే చూసేందుకు కదులుతారనీ, థియేటర్లో తెరమీద పడే బొమ్మ టెక్నికల్ నాణ్యత, హోం స్క్రీన్ మీద ఎప్పుడూ వుండదనీ, వివరిస్తున్నారు. థియేటర్లో ప్రేక్షక సమూహంలో కూర్చుని సినిమా చూసే కలెక్టివ్ అనుభవానికి, థ్రిల్ కీ మరేదీ సాటి రాదని అంటున్నారు. స్పానిష్ ఫ్లూనే కాదు, దాంతో బాటు మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రాపంచ యుద్ధం కూడా చప్పరించి అవతల పారేసింది సినిమా అనీ గుర్తు చేస్తున్నారు.
ఇప్పుడొక్కటి : తెలుగు సినిమాల విడుదలలు ప్రారంభమైతే, రివ్యూ రైటర్లు పండగ చేసుకోకుండా, వెబ్సైట్ల హిట్ల కోసం తెల్లారే పోటా పోటీగా పరుగులు తీయకుండా, రేటింగుల ప్రతాపం చూపించకుండా, కొన్నాళ్ళు సినిమాలని అలా బతకనియ్యాలి. సినిమాలు ఇప్పుడు బతికితే సినిమా రంగం తిరిగి బతుకుతుంది. ప్రకృతి ఎందుకో న్యూ నార్మల్ ని స్థాపించే దిశగా నెట్టేసింది మనల్ని...ఇది నోట్ చేసుకోవాలి.
―సికిందర్
Subscribe to:
Posts (Atom)