Friday, June 23, 2023
Tuesday, June 20, 2023
1347 : మినీ కాన్ఫ్లిక్ట్ సంగతులు
థియేటర్లు వుండాలా,మూతబడాలా? ప్రేక్షకులు థియేటర్లకి కి రావాలా, ఓటీటీలకి అంకితమైపోవాలా? మేకర్లు థియేటర్ సినిమాలు తీయాలా, వెబ్ సిరీస్ - మూవీస్ తో సరిపెట్టుకోవాలా? మేకర్లు మూవీ మేకర్లుగా కొనసాగాలా, మూవీ కిల్లర్స్ గా అవతార మెత్తాలా? వంద సినిమాల కాలం పోయి 250 సినిమాలు తీస్తున్నప్పుడు, విజయాల శాతం అదే 8% వుండాలా, పెరగాలా? ఈ ప్రశ్నలు వేసుకోవాలా, ప్రశ్నల్ని తొక్కేసి అవే స్క్రిప్టులు అలాగే రాసుకుంటూ పోవాలా? ఏం చేయాలి? ఇవన్నీ కాదు, సినిమాల పట్ల చాలా సిన్సియర్ గానే వున్నా, మార్పు కోసం ఇంకేం చేయాలో అర్ధంగావడం లేదా?
ఈ పరిస్థితుల మధ్య ‘కామన్ సెన్స్’ స్క్రిప్టు తయారీపై దృష్టి పెట్టి తీవ్ర కృషి చేయకపోతే, స్క్రిప్టుల సామర్ధ్యానికి కొత్త మార్గాలు అన్వేషించకపోతే, తెలుగు రాష్ట్రాల్లో కూడా థియేటర్లు మూతబడే కాలం ఎంతో దూరంలో లేదు. స్క్రిప్టు ఆరోగ్యం = థియేటర్ల ఆరోగ్యం. అయితే ఎంత త్రీ యాక్ట్స్ స్ట్రక్చర్లో పద్ధతిగా కథ చేసినా దానికి ఈ రోజుల్లో గ్యారంటీ లేదనేది కూడా వాస్తవం.
ఫస్ట్ యాక్ట్ ని అరగంట పరిమితికి మించి ఇంటర్వెల్ వరకూ సాగదీయాల్సి వస్తే- థియేటర్లు మూతబడకుండా కాపాడే 12 స్క్రీన్ ప్లే టిప్స్ గురించి ఆర్టికల్ 1312 లో తెలుసుకున్నాం. అంతదాకా ఎందుకు, అసలు 30 నిమిషాల పరిమితి తీసుకోవడం కూడా సోషల్ మీడియాల కాలంలో, యూట్యూబ్ షార్ట్స్ కి నవతరం అలవాటు పడిన కొత్త సన్నివేశంలో- ఫస్ట్ యాక్ట్ నే సెల్యూలాయిడ్ షార్ట్స్ గా ఎందుకు మార్చేయ కూడదు? సెల్యూలాయిడ్ వచ్చేసి సృజనాత్మకంగా సోషల్ మీడియాతో యుద్ధానికి దిగకపోతే ఇక సెల్ ఫోన్లే మిగిలి, థియేటర్లు మూతబడతాయి.
ఉదాహరణకి- ‘యశోద’ లోలాంటి హాస్పిటల్ వుందనుకుందాం. అక్కడ విలన్ డాక్టర్లు రోగుల మీద
ఏవో ప్రమాదకర ప్రయోగాలు చేస్తున్నారనుకుందాం. ఈ రోగుల్ని కాపా డాలంటే హీరో డాక్టర్ల కుట్ర రట్టు చేయాలి. అంటే
ఆ హీరో ఆ హాస్పిటల్లో జాబ్ చేస్తూండాలి. ఇదంతా రెగ్యులర్ గా వుండే ఫస్ట్ యాక్ట్.
ఇలా అరగంటకి హీరో కుట్ర రట్టు చేసి ప్లాట్ పాయింట్ వన్ ని సృష్టిస్తాడు. ఈ అరగంట
సేపూ న్యూట్రల్ గానే వుంటాడు.
ఈ ఫస్ట్ యాక్ట్ మొదటి అరగంట ఏదో ఒక సమయంలో, మెయిన్
కాన్ఫ్లిక్ట్ కి సంబంధించిన క్లూలు వేసుకుంటూ పోవచ్చు. అక్కడి రోగులతో డాక్టర్ల
వ్యవహారం హీరోకి అనుమానాలు రేకెత్తించ వచ్చు. ఇంతలో మదర్ కి విజయవంతంగా సర్జరీ
పూర్తవుతుంది. తీసుకుని బయల్దేరుతూంటే, అకస్మాత్తుగా రోగుల కుటుంబాల ఏడ్పులు వినిపిస్తాయి. ఏమిటా అని చూస్తే, హాస్పిటల్లో
జరుగుతున్న మరణాలు మీడియాకి అందితే మన
ఉద్యోగాలు గల్లంతంటూ నర్సుల మాటలు విన్పిస్తాయి. అంతే, హీరో మదర్ ని
వదిలేసి పూర్తయిన మినీ కాన్ఫ్లిక్ట్ లోంచి మెయిన్ కాన్ఫ్లిక్ట్ లోకి ఒక్క దూకు
దూకి, దుష్ట డాక్టర్ల పీకలు పుచ్చుకుంటాడు. ఫస్ట్ యాక్ట్ పూర్తయి హీరోకి
అసలు సమస్యతో సంఘర్షణగా కథ ప్రారంభమై పోతుంది. ఈ మోడల్ ని ఏ జానర్ కథకైనా దానికి
సంబంధించిన మినీ కాన్ఫ్లిక్ట్ ని మెయిన్
కాన్ఫ్లిక్ట్ తో అనుసంధానించ వచ్చు. ప్రయత్నించి చూడండి, ప్రయోజనం మీకే తెలుస్తుంది కథకి ముందు కథతో.
—సికిందర్
Monday, June 19, 2023
ఎజెండాకి మనోభావా లుండవు
కాశ్మీరు కేరళ అబద్ధపు సినిమాలకి వాళ్ళ
మనోభావాలు గాయపడ్డాయి
ఆదిపురుష్ అక్రమాలకి వీళ్ళ మనోభావాలు గాయపడ్డాయి
సౌత్ లో ఏమోగానీ నార్త్ లో భరించలేకపోతున్నారు
నా మతం, నీ మతం- నా కులం, నీ
కులం అని వుండదెక్కడా
సీతమ్మని గొంతుకోసి చంపినట్టు చూపిస్తే అందరి మనోభావాలూ గాయపడతాయి
బూటకపు లవ్ జిహాద్ లాభాల కోసం గడ్డం సాయెబు రావణాసురుడొచ్చాడు
వాడు వెల్డింగ్ చేస్తాడు. పంక్చర్లు వేస్తున్నట్టు చూపిస్తే ఇంకా బాగా
అర్ధమయ్యేదిగా
ఎజెండాకి మతం లేదు, పురాణాల్ని కూడా వదలరు
అప్పుడు వాళ్ళ మనోభావాలు గాయపడితే ఆనందించారు
ఇప్పుడు తమ వంతు వస్తే మౌనం వహించారు
ఫాస్టర్ నీమెల్లర్ కవిత్వపు జాడలేనా ఇవీ...
ఇస్లామోఫోబియాకి ఇక ఓట్లు పడవని వాళ్ళ సర్వేలే చెప్తూంటే
ఇంకా ఎజెండా పూనకాలేమిటి!
హిట్లర్ హిట్లర్ అవడానికి ఇలాటి సినిమాలేగా తీయించాడు
—సికిందర్
(పదేళ్ళ బ్లాగు చరిత్రలో ఏ పోస్టుకీ రానన్ని వ్యూస్ (4500) పై పోస్టుకి రెండు గంటల్లో రావడం రికార్డు. దేశ విదేశ పాఠకులకి ధన్యవాదాలు. విషయంపై ఇంత వేదనతో స్పందించినందుకు. ఫేస్బుక్ పోస్టుకి 12 వ్యూసే వచ్చాయి షరా మామూలుగా. మొదట్నుంచీ ఫేస్బుక్ మన ప్రాంగణం కాదు, ధన్యవాదాలు)
Friday, June 16, 2023
1346 : రివ్యూ!
దీంతో ఖిన్నుడైన రాఘవుడేం చేశాడు? జానకీ విముక్తి కోసం అతను అనుసరించిన మార్గాలేమిటి? ఆ ప్రయత్నంలో సుగ్రీవుడు, హనుమంతుడు తదితర వానర సైన్యం ఎలా తోడ్పడ్డారు? మరణం లేకుండా బ్రహ్మ నుంచి వరాలు పొందిన లంకేష్ ఎలా రాఘవుడి చేతిలో అంతమయ్యాడు? ఇదీ మిగతా కథ.
ఐతే దర్శకుడు ఓం రౌత్ 1990ల నాటి జపనీస్ యానిమేషన్ రామాయణం చూసిన ప్రేరణతో ఆధునిక టెక్నాలజీ రామాయణం తీయాలనుకున్నాడు. ఇలా తీస్తున్నప్పుడు ఇందులో ఆధునిక టెక్నాలజీ ఎక్కువైపోయి రామాయణ భక్తి భావం తగ్గింది. తగ్గడం కాదు, పూర్తిగా తుడిచి పెట్టుకు పోయింది.
అసలు పేర్ల మార్పు దగ్గరే మాస్ అప్పీల్ గాలిలో కలిసింది. రాఘవ, జానకి పేర్లు సినిమాటిక్ గా వాడకంలో ఎప్పుడూ లేవు. రాముడు, సీత అంటేనే ప్రేక్షకుల ప్రాణాలు లేచొస్తాయి. సినిమాలో పాత్రలు ఈ పేర్లు పలుకుతూంటే వుండే వైబ్రేషన్స్, రెస్పాన్స్ రాఘవ, జానకిలతో వుండవు. సీత పేరు కూడా కలిపి జై సియారాం అనే పిలుపుని రాజకీయాల కోసం జై శ్రీరాంగా మార్చేసి పాపులర్ చేసినప్పుడు -ఎందుకో దర్శకుడు రాముడు పేరు వినపడకుండా చేశాడు.
అయితే సైఫలీఖాన్ రావణ పాత్రతో ఎజెండాని టచ్ చేశాడు. వూహాజనిత లవ్ జిహాద్ నింద ప్రతిఫలించేందుకు, రావణుడి పాత్రలో సైఫలీ ఖాన్ అనే సాయెబుని తీసుకుని, ముస్లిం రాజు గెటప్ ఇచ్చి- ‘పద్మావత్’ లో అల్లావుద్దీన్ ఖిల్జీని సంజయ్ లీలా భన్సాలీ చూపించినంత కిరాతకుడిగా (ఖిల్జీ కిరాతకుడు కాదనేది వేరే సంగతి) చూపించి ఎజెండాని చాటాడు. పవిత్ర పురాణాలని కూడా రాజకీయాలకి ఉపయోగించుకోక తప్పదేమో. ఇక ఈ పాత్రకి కూడా రావణుడు అంటే వుండే గాంభీర్యాన్ని, మాస్ అప్పీల్ నీ లంకేష్ అనే పేరుతో తగ్గించేశాడు.
ఎంత టెక్నాలజీని జోడించినా పురాణం భక్తి పారవశ్యం కలిగించకపోతే అది విఫలమైనట్టే. నవతరంలో కూడా మత స్పృహ, దైవ భక్తి పెరిగిపోయిన ఈ రోజుల్లో కేవలం టెక్నికల్ హంగామా చేసి డ్రైగా రామాయణం తీసి హిట్ కొడతామనుకుంటే పొరపాటే. దీనికంటే వంద రెట్లు ఎక్కువ (కృష్ణ) భక్తితో నార్త్ లో కూడా సూపర్ హిట్టయ్యింది నిఖిల్ నటించిన ‘కార్తికేయ2’ అనే తెలుగు స్పిరిచ్యువల్ థ్రిల్లర్. రౌత్ సినిమాలో రాఘవ ప్రేక్షకుల చేత జై శ్రీరామ్ అన్పించుకోనట్టే, హనుమంతుడు కూడా జై బజరంగ్ బలీ అన్పించుకోలేదు. ఇక మనం జానకిని చూసి- మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ - అని వేడుకోవాల్సిందే దోసిట్లో కాస్తంత భక్తి రస ధార కోసం.
ప్రపంచ పురాణాల్ని పరిశోధించి సినిమాల కోసం ఇంత లావు పుస్తకం రాసిన జోసెఫ్ క్యాంప్ బెల్- అసలు పురాణ పురుషుడి పాత్ర ప్రయాణం అదొక స్పిరిచ్యువల్ జర్నీ అంటాడు. ఈ స్పిరిచ్యువల్ జర్నీలో 12 మజిలీలుంటాయి. రామాయణంలో కూడా ఈ 12 మజిలీలుంటాయి. ఒక్కో మజిలీ ఒక్కో అధ్యాత్మిక లక్ష్యాన్ని సాధిస్తూ సాగుతుంది. చివరి మజిలీ మోక్షం పొందడం. అప్పుడే కథ పాఠకులతో/ప్రేక్షకులతో స్పిరిచ్యువల్ గా కనెక్ట్ అయి ఎనలేని భక్తి పారవశ్యాలకి లోనుజేస్తుంది.
ఈ పుస్తకం ముందు పెట్టుకునే జార్జి లూకాస్ ‘స్టార్ వార్స్’ అనే సైన్స్ ఫిక్షన్ హిట్ సినిమాలు తీస్తూ పోయాడు. హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాలు ఉత్త టెక్నాలజీ హంగామా సినిమాలు కావు- టెక్నాలజీ మాటున కథా కథనాలు, పాత్ర చిత్రణలూ ప్రేక్షకుల ఆత్మిక దాహాన్ని తీర్చే స్పిరిచ్యువల్ జర్నీలుగా వుంటాయి.
ఇవేవీ లేకుండా రామాయణంలో పది ఘట్టాలు తీసుకుని, టెక్నికల్ హంగామా చేస్తే నవతరం పానిండియా అయిపోతుందా అనేది ఆలోచించాల్సిన విషయం.
నటనలు- సాంకేతికాలు
రాఘవ కాక రాముడుగా ఫీలైవుంటే ప్రభాస్ ఇంకా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చేవాడేమో. కానీ పాత్ర చిత్రణలోనే మర్యాద పురుషోత్తముడి ఏ లక్షణాన్ని మెయింటెయిన్ చేయాలో దర్శకుడికి స్పష్టత లేదు. సాత్వికంగా చూపిస్తూనే రౌద్రంగా చూపిస్తాడు. రాముడు రౌద్రంగా వుంటాడా? అతను స్థితప్రజ్ఞుడు, ఉదాత్తంగా వుంటాడు ఏ పరిస్థితుల్లో నైనా. శత్రువుతో చలించకుండా ఉదాత్త చిత్తంతో బాణాలేస్తూంటే వచ్చే దైవత్వం, మసాలా హీరోలాగా మారిపోతే వస్తుందా? ఆద్యంతం ఒకే ఉదాత్త గుణంతో నడుచుకుని వుంటే ప్రభాస్ పాత్రని పూజనీయం చేసేవాడు.
ఇంకోటేమిటంటే, పక్క పాత్రలు పూజిస్తే, భక్తి భావంతో పాడితే ప్రభాస్ రాముడి పాత్ర ప్రేక్షకుల మెదళ్ళలో బలంగా నాటుకుపోయే అవకాశముంటుంది. ‘సంపూర్ణ రామాయణం’ లో ‘రామయ తండ్రీ! ఓ రామయ తండ్రీ!’ అని బృందగానం చేస్తేనే కదా రాముడి పాత్ర పైకి లేచింది. ఆఖరికి ‘అల్లూరి సీతారామ రాజు’ లో కూడా ఇలాటి కీర్తి గానాలే. 150 కోట్లు తీసుకుంటున్న స్టార్ ని చూపిస్తూ పైకి లేపకపోతే ఎలా? ఇది లేక పోవడంతో హనుమంతుడ్ని పైకి లేపాల్సి వచ్చింది ప్రేక్షకులు.
పాత్ర చిత్రణ ఎలా వున్నా, పోరాటాల్లో ప్రభాస్ శభాష్ అన్పించుకున్నాడు దర్శకుడు టార్గెట్ చేసిన నవతరం ప్రేక్షకులతో. ఇక జానకిగా కంటే సీతగా వుండుంటే కీర్తీ సానన్ ప్రేక్షకులకి ఇంకా దగ్గరయ్యేది. సాధ్యమైనంత సౌకుమార్యంగా, సున్నితంగా కన్పిస్తూ గౌరవం పొందే ప్రయత్నం చేసింది గానీ, లంకలో శోక రసమనేది తగిన పాళ్ళలో పాత్రకే లేకుండా పోయింది. హనుమంతుడి పాత్రలో దేవదత్తా నాగే భంగిమల్లో రాముడిపట్ల వుండే అణకువ, మెలో డ్రామా లేక పాత్ర నిలబడలేదు. రాముడితో హనుమంతుడి కుండే బాండింగ్ అదొక ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు. ఇలాటి ఎమోషనల్ కనెక్ట్ కూడా కట్ అయింది నవతరం పౌరాణికంలో.
ఇక లంకాదహనం దృశ్యంలో చేసే అల్లరిని కూడా కట్ చేశాడు దర్శకుడు. అశోక వనంలో జానకిని తల్లిలా ఫీలవడం కూడా చేయకుండా తోక కత్తిరించాడు దర్శకుడు. ఫీల్, మెలో డ్రామా, భావోద్వేగాలు, సెంటిమెంట్లు వంటి మానవ సహజ లక్షణాలకి వీలైనంత దూరంగా వుంచాడు ‘ఆదిపురుష్’ ని. లక్ష్మణుడ్ని శేషు అని పిలిచాడు దర్శకుడు. ఇలా పాత్రల పాపులరైన పేర్లు పక్కన పెట్టేయడం ఏదో కొత్తదనమనుకున్నాడు. శేషుగా సన్నీ సింగ్ సరిగా రిజిస్టర్ కాడు సినిమాలో.
ఇక లంకేష్ గా (ఏ లంకేష్, గౌరీ లంకేషా?) సైఫలీ ఖాన్ అతి క్రూరత్వం హైలైట్. చివరికి జానకితో లవ్ జిహాద్ కుదరక రాఘవ బ్రహ్మాస్త్రానికి మట్టికరిచే సన్నివేశంలో కూడా ఓకే. రావణుడి గా అతను పాడే ‘శివోహం’ వీణ పాటలో జీవించాడు ఎమోషనల్ గా.
సినిమాలో భక్తిని రగిలించే ఒక పాటే వుంది బ్యాక్ గ్రౌండ్ సాంగ్ - రాం సీతా రాం (హిందీలో- రాం సియా రాం). రాఘవ - జానకిలతో వచ్చే రెండు పాటలు పూర్తిగా లేవు. పాటల పరంగా, నేపథ్య సంగీత పరంగా ఫర్వాలేదన్పించుకుంటుంది.
ఈ పౌరాణికం ఎలా వుంటుందంటే, రోమన్ సామ్రాజ్యంపై వచ్చిన హాలీవుడ్ సినిమాలకి రామాయణాన్ని అతికించినట్టు వుంటుంది. లేదా గ్లాడియేటర్, ఎక్సడస్, 300, ట్రాయ్ వంటి హాలీవుడ్ హిస్టారికల్స్ లో వుండే అవే పాత్రలు, వాటి ఆహార్యాలు, భవనాలు, లొకేషన్స్, లేజర్ ఆయుధాలు, వికృత సముద్ర జీవులు, వాయు జీవులు, రాక్షసులు, యుద్ధాలు మొదలైనవి కాపీ చేసి ఓ ఇండియన్ సైన్స్ ఫిక్షన్ తీసినట్టు వుంటుంది. దృశ్యాలు కూడా కంటికింపుగా లేక, బ్యాక్ గ్రౌండ్ డార్క్ షేడ్స్ తో వుంటాయి ఇబ్బంది కల్గిస్తూ. పురాణాలతో నవతరం ప్రేక్షకుల అభిరుచి ఇలా వుంటుందంటే వాళ్ళకో నమస్కారం పెట్టాల్సిందే. రామాయణ పాత్రలు ఇలాగే వుంటాయని కూడా నమ్మేస్తారేమో! ఫేక్ న్యూస్ సినిమాలు కూడా ఇస్తాయని చెప్పడం దర్శకుడు రౌత్ ఉద్దేశమేమో!
Tuesday, June 13, 2023
1345 : రివ్యూ!
ఆ హోటల్ కే వచ్చిన ఇంకో నార్కోటిక్స్ ఉద్యోగిని అదితీ రావత్ (డయానా పేంటీ) సుమైర్ డ్రగ్స్ బ్యాగుతో రావడాన్ని చూసి, ఆ బ్యాగుని కొట్టేసి పై అధికారి సమీర్ సింగ్ (రాజీవ్ ఖండేల్వాల్) ని పిలుస్తుంది. ఇద్దరూ సుమైర్ మీద కన్నేసి వుంచుతారు. బ్యాగు పోగొట్టుకున్నట్టు తెలుసుకున్న సుమైర్ ఇరకాటంలో పడతాడు. ఇంకోవైపు ఆ డ్రగ్స్ కోసం హమీద్ షేక్ (సంజయ్ కపూర్) అనే ఇంకో స్మగ్లర్ వచ్చి సికిందర్ చౌదరి గొంతు మీద కూర్చుంటాడు.
డ్రగ్స్ వున్న బ్యాగుని పోగొట్టుకున్న సుమైర్ మైదా పిండి ప్యాకెట్స్ తీసికెళ్ళి సికిందర్ చౌదరికి అంట గట్టడంతో అది బయటపడి మొత్తం అభాసవుతుంది- ఇక సుమైర్ ని పట్టుకోవడానికి సికిందర్ చౌదరి గ్యాంగ్స్ వెంట పడతారు. మరోవైపు సమీర్, అదితీలు వెంటబడతారు. ఈ రెండు గ్రూపులకి దొరక్కుండా, స్టార్ హోటల్లోనే ఎక్కడో బందీగా వున్న కొడుకుని ఎన్సీబీ అధికారి సుమైర్ ఆజాద్ ఎలా విడిపించుకున్నాడన్నది మిగతా కథ.
కమల్ హాసన్ కి కొడుకు కోసం ఫిజికల్ యాక్షన్, మాజీ భార్య కారణంగా ఎమోషనల్ యాక్షన్ - ఈ రెండిటి మధ్య నలిగే పాత్రగా రక్తి కట్టిస్తే, షాహిద్ కపూర్ కి ఈ రెండు షేడ్స్ లేక ఉపరితలంలోనే వుండిపోయాడు. కమల్ హాసన్ థ్రిల్లర్ కలర్ఫుల్ గా వుండడానికి పాపులర్ స్టార్స్ నటించడం ఇంకో కారణం. కమల్ కి యాంటీగా నార్కోటిక్స్ ఉద్యోగినిగా స్టార్ హీరోయిన్ త్రిష నటించడం, ఆమెతో కమల్ చేసే ఫైట్ ఒక ఎట్రాక్షన్ కావడం కలిసొచ్చాయి. హిందీలో ఎవరికీ తెలియని డయానా పేంటీతో ఈ మ్యాజిక్ వర్కౌట్ కాలేదు. కమల్ సినిమాలో విలన్ గా ప్రకాష్ రాజ్ బలం వుంటే, హిందీలో రోణిత్ రాయ్ అనే పెద్దగా పేరు లేని పాత ఆర్టిస్టుతో విలన్ పాత్ర మామూలుగా వుంది. ఇంకో విలన్ గా ఒకప్పటి హీరో సంజయ్ కపూర్ ది ఓవరాక్షన్.
ఈ కథని కోవిడ్ -2 మహమ్మారి ముగిసిన సమయంలో స్థాపించారు. కోవిడ్-1, 2 లతో ఎంతో మంది చనిపోయి, మరెంతో మంది ఉపాధి కోల్పోయి నేరాల వైపు మళ్ళారని చెబుతూ కథ ప్రారంభించారు. నేరాల వైపు ఏ సామాన్యులు మళ్ళారో చూపించకుండా, డ్రగ్ స్మగ్లర్స్ అనే ప్రొఫెషనల్స్ తో కథ ప్రారంభిస్తే- ఆ డ్రగ్ స్మగ్లర్స్ కొత్తగా నేరాలకి పాల్పడేదేముంటుంది - అది వాళ్ళ నిత్య కార్యక్రమమే.
ఇక కోవిడ్ జాగ్రత్తలంటూ ప్రారంభ దృశ్యాల్లో మాస్కూలు వేసుకుని తిరగడం చూపించి, ఆ తర్వాత మర్చిపోయాడు దర్శకుడు. ఈ మాత్రం దానికి కోవిడ్ బిల్డప్ ఎందుకో అర్థంగాదు. ఆ హోటల్లో దాగుడు మూతలప్పుడు మాస్కు లేసుకుని వుంటే, ఎవరు ఎవరో తెలియక కన్ఫ్యూజన్ తో చాలా కామెడీగా యాక్షన్ వుండేది.
ఎన్సీబీ ఉద్యోగినిగా వేసిన డయానా పేంటీ ఫార్ములా సినిమా పాత్రే. పై అధికారి పక్కన కరివే పాకు పాత్ర. వెబ్ సిరీస్ లో స్త్రీ పాత్రలు- హీరోయిన్ పాత్రలూ ఎంత శక్తిమంతంగా వుంటున్నాయో గుర్తిస్తున్నట్టు లేదు సినిమా దర్శకులు.
రిచ్ విలన్ గా రోణిత్ రాయ్, అతడి పక్క వాద్యంగా సంజయ్ కపూర్ పాత విలన్లుగా వుంటారు. సాంకేతికంగా ఉన్నతంగా తీర్చి దిద్దాడు దర్శకుడు. ప్రారంభంలో ఔట్ డోర్ యాక్షన్ సీన్స్ బావున్నాయి. అయితే ఈ మేకింగ్ క్వాలిటీ అంతా పాపులర్ నటీనటులతో వుండుంటే సినిమా పై లెవెల్లో వుండేది. ఇంకోటేమిటంటే, ఎప్పుడో 2011 నాటి కాలపు ఫ్రెంచి థ్రిల్లర్ ని ఇప్పుడు రీమేక్ చేయడం విజ్ఞత అన్పించుకోదు. ఫ్రెంచి థ్రిల్లర్ ఫ్రెష్ గా వున్నప్పుడు, అప్పుడప్పుడే 2015 లో కమల్ హాసన్ రీమేక్ చేయడం వేరే విషయం.