దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్
తారాగణం : పవన్ కళ్యాణ్, కీర్తీ సురేష్, అనూ ఇమాన్యుయేల్, ఖుష్బూ, బొమన్ ఇరానీ, ఆది పినిశెట్టి, రావు రమేష్, మురళీశర్మ, ప్రరాగ్ త్యాగీ, అజయ్, వెన్నెల కిషోర్ తదితరులు
కథ : జెరోమ్ సాల్ (‘లార్గో వించ్’), సంగీతం : అనిరుధ్, ఛాయాగ్రహణం : మణికందన్
బ్యానర్ : హారిక అండ్ హాసిని క్రియేషన్స్
నిర్మాత : ఎస్.రాధాకృష్ణ
విడుదల : జనవరి 10, 2018
***
ఇక ఇద్దరు హీరోయిన్లు కీర్తీ సురేష్, అనూ ఇమాన్యుయేల్ లు రాకుమారుడంత సహజ గ్లామర్ తో కాక, కృత్రిమ అందాలన్నట్టు కన్పిస్తారు. వీళ్ళని చూస్తే రాకుమారుడికి ఎలా రోమాన్సు పుడుతుందో అర్ధంగాదు. కానీ ఇదికూడా చల్తా హై పండగపూట. ఖుష్బూ కూడా జాతీయ ఛానెల్స్ డిబేట్స్ లో ఆదరగొట్టినంత స్ట్రాంగ్ వుమన్ గా కన్పించక విషాదమయిగా, బోరుగా కన్పించడం దేనికో అర్ధంగాదు. విలన్ ఆది పినిశెట్టి మాత్రం పవర్ఫుల్ పాత్రగా కన్పిస్తాడు తన కున్న కంపెనీని కాజెయ్యాలన్న బలమైన లక్ష్యంకొద్దీ. బొమన్ ఇరానీ ప్రారంభ సీనులో చనిపోయి ఫ్లాష్ బ్యాక్ లో కన్పించే పాత్ర. మిగతా సినిమా కంటే అతడి ఫ్లాష్ బ్యాక్, అతడి పాత్రే బావున్నాయి.
ఇకపోతే శర్మ, వర్మ అంటూ పాత అల్లురామలింగయ్య- సత్యనారాయణల జంటలా కాలం చెల్లిపోయిన కామెడీతో సింహ భాగం సినిమాని ఆక్రమించి, హింస పెట్టడంలో రావురమేష్, మురళీ శర్మలది ఆరితేరిన నటన. వీళ్ళు ఇలాటి పాత్రలు మళ్ళీ మళ్ళీ చేసి వెయ్యేళ్ళు వెనక్కి తీసికెళ్ళాలి.
సాంకేతికంగా అద్భుతంగా వుండకుండా ఎలావుంటుంది. రిచ్ గా తీశారు. లొకేషన్స్ గ్రాండ్ గా వున్నాయి. కళ్ళప్పగించి అలా అలా చూసేయడమే.
క్రియేటివిటీ తక్కువ వున్నప్పుడు ఎక్కువ ఆలోచన చెయ్యకూడదని తనికెళ్ళ పలికే పలాయన వాద డైలాగు వుందిందులో. కాబట్టి క్రియేటివిటీ తగ్గినప్పుడు పండగల్ని దృష్టిలో పెట్టుకుని పండగ సినిమాలు మాత్రమే తీస్తే బతికిపోతారు. ఇంకో డైలాగు వుంది – కొత్త ఐడియా రాకపోతే వచ్చిన అయిడియానే కొత్తగా చెయ్యాలని. ఈ కథా రచనతో తనపాట్లు తను పడాల్సిన పరిస్థితి డైలాగుల రూపంలో సినిమాలో కెందు కెక్కాలో అర్ధంగాదు. ఈ డైలాగులతో ప్రేక్షకుల కేం సంబంధం? హోటలతను ఇంత చాకిరీ చేసి మీకు తిండి పెడుతున్నానని చెప్పుకుంటాడా? సిల్వర్ లైనింగ్ ఏమిటంటే, ఇలా ఆఫ్ స్క్రీన్ డైలాగులు వాడిన సినిమాలు ఫ్లాపయ్యాయి.
బాగా డబ్బు గడించాక కొత్త ఐడియాలే రాని వాళ్ళుంటారు. డబ్బు దెబ్బ వడదెబ్బ లాంటిది. అక్కడ డబ్బు కళకి అడ్డుపడ్డం మొదలెడుతుంది. అప్పుడు కెరీర్ ప్రారంభ దినాల్లో తన కళని హీరోలు, నిర్మాతలు ఎందుకు చంపేసేవారో తెలిసివస్తుంది. అదే చక్రభ్రమణంలో తనూ పడిపోతాడు. అప్పుడు ఇలాటి డైలాగులే బయటపడతాయి. కొత్త అయిడియాలు రాకపోతే పదికోట్లు తీసుకోవడమెందుకన్న సందేహం ప్రేక్షకులకి రాకుండా వుంటుందా ఇలాటి డైలాగులకి. అందరూ వందలకోట్లు గడించిన రాజూ హిరానీలా వుండలేరు, రాజమౌళిలా వుండలేరు.
కొత్త అయిడియా రాకపోతే వచ్చిన అయిడియానే కొత్తగా చెయ్యవచ్చు- కనీసం ఈ కాలం చెల్లిన పాత మూస కామెడీ డ్రామా విషయంలో. కొత్తగా మైండ్ లెస్ కామెడీ చేసి – ‘గోల్ మాల్ -4’ లో రోహిత్ శెట్టి చేసినట్టు, సినిమా సాంతం పడీపడీ నవ్వేలా చేసి బైటికి వెళ్ళ గొట్టచ్చు ప్రేక్షకుల్ని ఎంతో ఆధార్టీగా. ‘అజ్ఞాత వాసి’ లో వచ్చిన ఐడియాని కొత్తగా ఏం చేశారు. కాబట్టి పండగ సినిమాకి ఏ శ్రమా అవసరం లేదు. ఓ పది సీన్లు ప్రేక్షకుల్ని అలరిస్తే చాలు మొత్తం బ్రహ్మాండంగా కన్పిస్తుంది. అది కార్పొరేట్ ఆఫీసు అన్న స్పృహ లేకుండా దుకాణం పెట్టి, సైకిల్ మీద తిరుగుతూ బెల్టుతో కొట్టే ఓ దృశ్యం, కొడకా అనే ఓ పాటా, హీరో కోసం హీరోహీరోయిన్లు జుట్లు పట్టుకుని కొట్టుకునే ఇంకో దృశ్యం, ప్రారంభంలో పవన్ ఎంట్రీ సీను, రావు రమేష్ కి చెయ్యి పడిపోతే అతను చేసే కామెడీ ...ఇలా ఓ పది సీన్లతో బాటు, పదికోట్లు- కొత్త నోట్లు, సింహం పార్టీ ఇస్తే జింక జీన్స్ ప్యాంటు వేసుకెళ్ళిందట – లాంటి ఓ నాల్గైదు డైలాగులూ ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. మిగిలిన కథ లేని సీన్లు ఎంత బోరు కొట్టినా, హీరోయిన్లతో లవ్ ట్రాకులు ఎంత చప్పగా వున్నా, తండ్రిని చంపిన పగ హీరో మర్చిపోయినా, పవన్ కళ్యాణ్ ట్రాకు తప్పి చంటబ్బాయ్ లా నటించినా కవరై పోయాయి. ఇదీ పండగ సినిమా టెంప్లెట్. పండక్కి సినిమా చూశామా లేదా ముఖ్యం, మిగతా క్వాలిటీ గ్వీలిటీ అనవసర విషయాలు.

ఈమధ్య ఇతర స్టార్ల కంటే ఎక్కువ వార్తల్లో వుంటున్న పవన్ కళ్యాణ్ పండగ సీజన్లో కొత్త సినిమాతో రావడం ఇంకా ఎక్కువ క్రేజ్ ని సృష్టించింది. గత మూవీ ‘కాటమరాయుడు’ కి లేనంత పవన్ మేనియాతో తెలుగు రాష్ట్రాలు వూగిపోతున్నాయి. అర్ధరాత్రి నుంచే థియేటర్లు కిటకిట లాడిపోతున్నాయి. ‘అజ్ఞాత వాసి’ తప్ప ఇంకేమీ జీవితంలో లేనట్టు ప్రేక్షకులు మైమరచిపో
తున్నారు. హిట్ సూపర్ హిట్ మెగా హిట్ అంటూ కేరింతలు కొడుతున్నారు. ఒక స్టార్ ఇంతకంటే ఆనందం ఏమివ్వగలడు. ఇంత ఆనందాన్ని పంచిస్తున్న పవన్ కళ్యాణ్ కింకేం కావాలి. థియేటర్ల ముందు విజయ బాజాలు ఢమా ఢమా మోగుతూంటే దారినపోయే పండగ జనం ఉలిక్కిపడి టికెట్ల కోసం పరుగులు తీస్తున్నారు. ఆగకుండా రేయింబవళ్ళూ షోలతో సంక్రాంతికే శివరాత్రిని రప్పించిన పవన్ కళ్యాణ్ ఇంతకంటే హిట్ ఏం కొట్టాలి.

ఇటీవల త్రైమాసిక సీరియల్ గా హల్చల్ చేసిన ఓ వివాదంలో కూడా అజ్ఞాతంగా వుంటూ, నిజమైన అజ్ఞాత వాసి అన్పించుకున్న తను, ఆఖరికి ‘అజ్ఞాతవాసి’ లో ఏ కళలు బైట పెట్టుకున్నారో ఓసారి
చూద్దాం...
కథ
విందా
(బొమన్ ఇరానీ) అనే కార్పొరేట్ బాస్ ని, అతడి కొడుకునీ పాత పగతో సీతారాం (ఆది పినిశెట్టి)
చంపేస్తాడు. చంపేసి కంపెనీని హస్తగతం చేసుకునే
పథకమేస్తాడు. దీంతో విందా భార్య ఇంద్రాణి (ఖుష్బూ) హంతకుల్ని పట్టుకోవడానికి అజ్ఞాతంలో
పెరిగిన భార్గవ్ (పవన్ కళ్యాణ్) ని రప్పిస్తుంది.
ఇతను విందా మొదటి భార్య కొడుకు. ఒక ఉద్దేశంతో విందా, భార్గవ్ ని అప్పాజీ (తనికెళ్ళ) కిచ్చి సుదూరంగా అస్సాంలో
పెంచాడు. ఇప్పుడు భార్గవ్ వచ్చి కంపెనీలో చేరి, తండ్రిని చంపిందెవరో తెలుసుకునే ప్రయత్నాలు
మొదలెడతాడు. కంపెనీ మేనేజర్లు శర్మ, వర్మ (మురళీ శర్మ, రావు రమేష్) ల కూతుళ్ళు (కీర్తీ సురేష్, అనూ ఇమాన్యుయేల్) తో ప్రేమలో పడతాడు.
ఈనేపధ్యంలో సీతారాం ఏం కుట్రలు చేశాడు, భార్గవ్ తను విందా కొడుకేనని నిరూపించుకుని, సీతారాం ని ఎలా శిక్షించాడనేది మిగతా కథ.
ఎలావుంది కథ
పండగ
పూట కథ జోలికి పోకుండా వుంటే మంచిది, పండగ మూడ్ పోతుంది. కథ ఎవరిక్కావాలి. పవన్ సినిమా చూశామా లేదా
కావాలి. కాబట్టి పైపైన కొంత పరిచయం
చేసుకుని వదిలేద్దాం. ఇది సినిమా తీశాక 10 కోట్లు ఇచ్చి కొనుక్కున్న కథ అని
తెలిసిందే. అందుకే ఇలా తీశారు. తీయక ముందు 10 కోట్లతో ఆ హక్కులేవో కొనుక్కుని
వుంటే చాలా జాగ్రత్తలు తీసుకునే వారేమో. ఓ లక్ష ఇస్తే ఇలాటి 10 కథలు ఎడం చేత్తో రాసిచ్చే
వాళ్ళుండగా, ఫ్రెంచి సినిమా కథకి 10
కోట్లు దండగ పెట్టాల్సిన అవసర మేమొచ్చిందో తెలీదు. ఫ్రెంచి వాడు ఫిలింనగర్ కంటే
ఎక్కువా? వాడు తన మానాన వరల్డ్ మూవీస్ తీసుకునే జోన్ వదులుకుని హాలీవుడ్ బాటలో
నడవాలని వేసిన తప్పటడుగులు ‘లార్గో వించ్’. ఇది పవనోవిచ్ కి, అందునా తెలుగుకి
సూటయ్యే ఛాన్సే లేదు. అది కార్పొరేట్ గూఢచార కథ. దాంట్లోకి తెలుగు సలాడ్ కూరి శాండ్ విచ్ చేసి రిచ్ అవాలనుకోవడం
చాలా ఖరీదైన 10 కోట్ల తప్పవుతుంది. లార్గో
విచ్ 1970 లనాటి ఫ్రెంచి కామిక్ బుక్ పాత్ర. అది టీవీ సిరీస్ గా కూడా పాపులరైంది. ఇరవై
ఏళ్ల నాడు దాని హక్కులు ఓ ఫ్రెంచి నిర్మాత కొనుక్కుని ఫ్రెంచ్ జేమ్స్ బాండ్
సినిమాలు తీయాలనుకున్నాడు. కానీ చనిపోయాడు. 2008 లో జెరోమ్ సాల్ దాన్ని సినిమాగా తీశాడు - ఫక్తు యాక్షన్
థ్రిల్లర్ గా. అక్కడి చిన్న మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని తక్కువ బడ్జెట్లో.
హాంగ్ కాంగ్ లో తీసిన యాక్షన్ సీన్లు లొకేషన్ పర్మిషన్ తీసుకోకుండా, పోలీసులు వస్తూంటే
ఎలర్ట్ చేయడానికి మనుషుల్ని పెట్టుకుని మరీ లాగించేశారు. ఈ మూవీ మీద వెలువడ్డ
రివ్యూలు ఏమంత బాగా కూడా లేవు.
ఎవరెలా చేశారు
పవన్ కళ్యాణ్ వైభోగం అనుభవించారు. అసలే
ప్రిన్స్ ఇన్ ఎగ్జైల్ అని ట్యాగ్ లైన్ కాబట్టి, అందుకు తగ్గట్టుగానే రాకుమారుడి
అందచందాలతో సుకుమారంగా కన్పిస్తూ, అదిరిపోయే
విజువల్స్ తో రాజభోగా లనుభవించారు. పవర్ స్టార్ ని ఇలా చూపెట్టిన కెమెరా మాన్
నిజంగా గొప్పవాడు. పాటల్లో అలా అలా పైపైన స్టెప్పు లేసినా, ఫైట్స్ లో చెమట
పట్టకుండా అలా అలా కొట్టేసినా, హీరోయిన్లతో రోమాన్సు పైపైన అలా టచ్ చేసి వదిలేసినా,
చివరి దృశ్యంలో ఖుష్బూ తో పొడిపొడి మదర్ సెంటిమెంటు డైలాగులు పైపైన చెప్పేసినా, అదే పదివేలు అభిమానులకి. ఇక పాత్ర తీరుకొస్తే,
తండ్రిని చంపిందెవరో తెలుసుకోమని అజ్ఞాతంలో వున్న తనని మారు తల్లి ఖుష్బూ
పిలిపిస్తే వచ్చి- డామినేటింగ్ గా, అందర్నీ దడదడ లాడించాల్సిన పవర్ స్టార్ ఇమేజిని
పూర్తిగా పక్కన బెట్టేసి, సీన్లని క్రేజీ సీన్లుగా మార్చెయ్యడం మానేసి, ఎంతో అందమైన రాంగ్ స్ట్రాటజీ తో ఆడపిల్లలా
అభినయించారు దాదాపు సినిమా అంతా. ఆడపిల్లలా సిగ్గులుపోవడం, కోపం తెచ్చుకోవడం, వంకర్లుపోతూ,
హొయలు పోతూ ముద్దుముద్దుగా, గోముగా మాట్లాడ్డం...చేస్తూ చాలా కొత్తగా కన్పించారు సినిమా అంతా.
ఇక ఇద్దరు హీరోయిన్లు కీర్తీ సురేష్, అనూ ఇమాన్యుయేల్ లు రాకుమారుడంత సహజ గ్లామర్ తో కాక, కృత్రిమ అందాలన్నట్టు కన్పిస్తారు. వీళ్ళని చూస్తే రాకుమారుడికి ఎలా రోమాన్సు పుడుతుందో అర్ధంగాదు. కానీ ఇదికూడా చల్తా హై పండగపూట. ఖుష్బూ కూడా జాతీయ ఛానెల్స్ డిబేట్స్ లో ఆదరగొట్టినంత స్ట్రాంగ్ వుమన్ గా కన్పించక విషాదమయిగా, బోరుగా కన్పించడం దేనికో అర్ధంగాదు. విలన్ ఆది పినిశెట్టి మాత్రం పవర్ఫుల్ పాత్రగా కన్పిస్తాడు తన కున్న కంపెనీని కాజెయ్యాలన్న బలమైన లక్ష్యంకొద్దీ. బొమన్ ఇరానీ ప్రారంభ సీనులో చనిపోయి ఫ్లాష్ బ్యాక్ లో కన్పించే పాత్ర. మిగతా సినిమా కంటే అతడి ఫ్లాష్ బ్యాక్, అతడి పాత్రే బావున్నాయి.
ఇకపోతే శర్మ, వర్మ అంటూ పాత అల్లురామలింగయ్య- సత్యనారాయణల జంటలా కాలం చెల్లిపోయిన కామెడీతో సింహ భాగం సినిమాని ఆక్రమించి, హింస పెట్టడంలో రావురమేష్, మురళీ శర్మలది ఆరితేరిన నటన. వీళ్ళు ఇలాటి పాత్రలు మళ్ళీ మళ్ళీ చేసి వెయ్యేళ్ళు వెనక్కి తీసికెళ్ళాలి.
సాంకేతికంగా అద్భుతంగా వుండకుండా ఎలావుంటుంది. రిచ్ గా తీశారు. లొకేషన్స్ గ్రాండ్ గా వున్నాయి. కళ్ళప్పగించి అలా అలా చూసేయడమే.
చివరికేమిటి
ఈ
స్ట్రాటజీయే కరెక్టు. పండగ సినిమా ఇంతకంటే గొప్పగా వుండనవసరం లేదు. పండగ సీజన్ ని
దృష్టిలో పెట్టుకుని తీసే స్టార్ సినిమాలకి ఈ స్థాయి సరిపోతుంది. విషయం గురించి పెద్దగా
పట్టించుకోకుండా, పాత విషయంతోనే విజువల్ హంగామా చేస్తే చాలు. పండగ రోజుకూడా పాత మొగుడేనా
అని ప్రేక్షకులనుకోరు. ఓ పదికోట్లున్న తెలుగు ప్రజల్లో పండగ రోజుల్లో ఓ కోటి మంది
చూసినా 100 కోట్లు వచ్చేస్తాయి. పండగ రోజుల్లో సినిమా చూడకపోతే పండగ పూర్తయినట్టు
కాదు కాబట్టి - ఒకవేళ స్టార్ సినిమాలు
కాక, చిన్న సినిమాలు విడుదలైనా
బ్రహ్మాండంగా ఆడేస్తాయి. ఇదే ‘అజ్ఞాతవాసి’ ని ‘కాటమ రాయుడు’ లా అన్ సీజన్లో విడుదల
చేస్తే అట్టర్ ఫ్లాపవుతుంది. విషయం లేని పండగ సినిమాలతో బయ్యర్లు కూడా బయటపడతారు. ఏమిటీ
ఇలాటి ఫూలిష్ సినిమా తీశామా అని ఫీలవనవసరం లేదు. ఆ యెత్తున చూస్తున్న పండగ ప్రేక్షకులు
ఫూల్స్ ఏమీ కారు. పండగ సినిమాకి క్రియేటివ్ యాస్పెక్ట్ అవసరం లేదు, మార్కెట్ యాస్పెక్ట్ సరిపోతుంది. కాబట్టి ఈ బ్యాడ్ రైటింగ్ ని చూసి ఆశ్చర్య పడనవసరం లేదు.

-సికిందర్