దర్శకత్వం : అశ్వినీ అయ్యర్ తివారీ
తారాగణం : ఆయుష్మాన్ ఖురానా, కృతీ సానన్, రాజ్ కుమార్ రావ్, పంకజ్ త్రిపాఠీ, సీమా పహ్వా, స్వాతీ సెమ్వాల్, రోహిత్ చౌదరి తదితరులు
రచన : నీతేష్ తివారీ - శ్రేయాస్ జైన్ - రజత్ నోనియా, సంగీతం : తనిష్క్ బాగ్చీ తదితరులు, ఛాయాగ్రహణం : గవెమిక్ యూ ఆరే
బ్యానర్ : బీఆర్ స్టూడియోస్, జంగ్లీ పిక్చర్స్
నిర్మాతలు : రేణూ రవిచోప్రా, వినీత్ జైన్, రజత్ నోనియా
విడుదల : ఆగస్టు 18, 2017
***
హిందీ రోమాంటిక్ కామెడీలు మధ్యతరగతి పాత్రల గురించి వున్నప్పుడు ఎప్పుడూ హిట్టవుతున్నాయి : క్వీన్, టోటల్ సియపా, బ్యాండ్ బాజా బరాత్, తను వెడ్స్ మను, టూ స్టేట్స్ మొదలైనవి. పాత్రలు నిజ జీవితాలకి దగ్గరగా వుంటూ సున్నిత హాస్యాన్ని ఆశ్రయించడంతో చక్కిలిగింతలు పెడుతూంటాయి. పైగా ఈ రోమాంటిక్ కామెడీలు తెలుగులో లాగా సగం నుంచి ఏడ్పించే రోమాంటిక్ డ్రామాలుగా మారకుండా, జానర్ మర్యాదనెరిగి జాయ్ ఫుల్ గా హిట్టయినవే వుంటాయి. ప్రస్తుతం ఇలాటిది మరొకటి చేరింది. ‘బరేలీకీ బర్ఫీ’ స్వీట్ రోమాంటిక్ కామెడీ ఇప్పటికే స్లీపర్ హిట్ గా నిల్చి రిలీజైన పెద్ద సినిమాల్ని వెనక్కి నెట్టేసింది. స్లీపర్ హిట్ అంటే ఓ చిన్న సినిమా చాపకింద నీరులా తనపని తాను చేసుకుపోయి ఇతర సినిమాల కొంప ముంచడం. ఇలాటి స్లీపర్ హిట్ ‘బీబీ’ ఇతర బెర్తులన్నీ ఖాళీ చేయించి మొత్తం తనే ఎలా పాగా వేసిందో ఒకసారి కింద చూసుకుంటూ వెళదాం...
తారాగణం : ఆయుష్మాన్ ఖురానా, కృతీ సానన్, రాజ్ కుమార్ రావ్, పంకజ్ త్రిపాఠీ, సీమా పహ్వా, స్వాతీ సెమ్వాల్, రోహిత్ చౌదరి తదితరులు
రచన : నీతేష్ తివారీ - శ్రేయాస్ జైన్ - రజత్ నోనియా, సంగీతం : తనిష్క్ బాగ్చీ తదితరులు, ఛాయాగ్రహణం : గవెమిక్ యూ ఆరే
బ్యానర్ : బీఆర్ స్టూడియోస్, జంగ్లీ పిక్చర్స్
నిర్మాతలు : రేణూ రవిచోప్రా, వినీత్ జైన్, రజత్ నోనియా
విడుదల : ఆగస్టు 18, 2017
***
హిందీ రోమాంటిక్ కామెడీలు మధ్యతరగతి పాత్రల గురించి వున్నప్పుడు ఎప్పుడూ హిట్టవుతున్నాయి : క్వీన్, టోటల్ సియపా, బ్యాండ్ బాజా బరాత్, తను వెడ్స్ మను, టూ స్టేట్స్ మొదలైనవి. పాత్రలు నిజ జీవితాలకి దగ్గరగా వుంటూ సున్నిత హాస్యాన్ని ఆశ్రయించడంతో చక్కిలిగింతలు పెడుతూంటాయి. పైగా ఈ రోమాంటిక్ కామెడీలు తెలుగులో లాగా సగం నుంచి ఏడ్పించే రోమాంటిక్ డ్రామాలుగా మారకుండా, జానర్ మర్యాదనెరిగి జాయ్ ఫుల్ గా హిట్టయినవే వుంటాయి. ప్రస్తుతం ఇలాటిది మరొకటి చేరింది. ‘బరేలీకీ బర్ఫీ’ స్వీట్ రోమాంటిక్ కామెడీ ఇప్పటికే స్లీపర్ హిట్ గా నిల్చి రిలీజైన పెద్ద సినిమాల్ని వెనక్కి నెట్టేసింది. స్లీపర్ హిట్ అంటే ఓ చిన్న సినిమా చాపకింద నీరులా తనపని తాను చేసుకుపోయి ఇతర సినిమాల కొంప ముంచడం. ఇలాటి స్లీపర్ హిట్ ‘బీబీ’ ఇతర బెర్తులన్నీ ఖాళీ చేయించి మొత్తం తనే ఎలా పాగా వేసిందో ఒకసారి కింద చూసుకుంటూ వెళదాం...
కథ
బిట్టీ మిశ్రా (కృతీ సానన్) బరేలీలో విద్యుత్ శాఖలో
పనిచేస్తూంటుంది. ఒక్కతే కూతురవడంవల్ల ఏం చేసినా తల్లిదండ్రులు (పంకజ్ త్రిపాఠీ, సీమా పహ్వా) చూసీ
చూడనట్టుంటారు. మందూ సిగరెట్లు నాన్ వెజ్ లాగిస్తుంది. బ్రేక్ డాన్స్ చేస్తుంది, ఇంగ్లీషు
సినిమాలు చూస్తుంది. పెళ్లి చేద్దామంటే ఒక్కరికీ ఈమె నచ్చదు. ఒక నచ్చినవాడు ఓవరాక్షన్ చేస్తే తను వర్జిన్
కాదు పొమ్మంటుంది. పారిపోతాడు. తనని తనలాగా అంగీకరించేవాడు దొరకడు. తల్లిదండ్రులకి
దిగులు పట్టుకుంటుంది. వాళ్ళ బాధ చూడలేక ఒకరోజు బిట్టీ ఇంట్లోంచి పారిపోతుంది. ఒక
నవల కొనుక్కుని ట్రైన్ లో చదువుకుంటూ పోతుంది. ట్రైను దిగి ఇంటి కొచ్చేస్తుంది. ఫ్రెండ్
రమ (స్వాతీ సెమ్వాల్) తో చర్చిస్తుంది. ‘బరేలీకీ బర్ఫీ’ అని ప్రీతమ్ విద్రోహి
అనేవాడు రాసిన గొప్ప నవల్లో హీరోయిన్ పాత్ర అచ్చం తనలాగే వుందని చెప్తుంది. తన
భావాలే వున్నాయనీ, అంటే ఈ రచయిత విద్రోహి అంత
అభ్యుదయభావాలు గల వాడనీ, ఇతణ్ణి ఓసారి కలుసుకోవాలనీ
అంటుంది. ఇద్దరూ ఆ నవల ప్రచురణకర్త చిరాగ్
దుబే (ఆయుష్మాన్ ఖురానా) దగ్గరికెళ్ళి, రచయిత ప్రీతమ్ విద్రోహి అడ్రసు అడుగుతారు.
ప్రచురణకర్త
చిరాగ్ దుబే ప్రేయసి ఇంకొకణ్ణి పెళ్లి
చేసుకుని చెక్కేసింది ఐదేళ్ళ క్రితం. దీంతో బాగా పిచ్చెక్కి ‘బరేలీకీ బర్ఫీ’ అని ప్రేమ నవల తనే రాసి పారేశాడు. కానీ
దీన్ని తన పేరుతో ఫోటో వేసుకుని ప్రచురిస్తే పెళ్ళయిన ప్రేయసి ఇబ్బంది పడుతుందని, ఒక బకరా కోసం చూశాడు. పిరికి పిరికిగా, బెదురు
బెదురుగా మాట్లాడే ఫ్రెండ్ ప్రీతమ్ విద్రోహి (రాజ్ కుమార్ రావ్) రూపంలో బకరా దొరికాడు. అతణ్ణి ఫోటో తీయించి అతడి పేరుతో నవల
వేసేశాడు. దీని పరిణామాలు వూహించుకుని బకరా
విద్రోహి వూరొదిలి పారిపోయాడు.
ఇప్పుడు
బిట్టీ వచ్చి నవల రాసింది విద్రోహియే అనుకుని
అడ్రసు అడిగేసరికి ఇరుకున పడతాడు చిరాగ్. బిట్టీ స్పష్టంగా చెప్పేస్తుంది,
విద్రోహి భావాలు తనకి నచ్చాయనీ, అతణ్ణి ప్రేమిస్తున్నాననీ.
కానీ నవల రాసింది తను. అంటే ఈమె తనతోనే ప్రేమలో పడిందని రూఢీ అయి తనూ ప్రేమలో పడతాడు
చిరాగ్. విద్రోహితో కలిపితే చిరాగ్ ని మంచి ఫ్రెండ్ లా చూస్తానంటుంది బిట్టీ. ఇక తప్పక – చిరాగ్
ఫ్రెండ్ మున్నా (రోహిత్ చౌదరి) తో కలిసి వెతికి వేరే వూళ్ళో చీరల షోరూంలో జోరుగా పనిచేస్తున్న విద్రోహిని పట్టేసుకుంటాడు.
విషయం చెప్పి, బిట్టీ తో గల్లీ గూండాలా ప్రవర్తించాలనీ,
ఆమె మనసు అడ్డంగా విరిచేసి, ఇంప్రెషన్ ని చెడగొట్టి, డిప్రెషన్ లో పడెయ్యాలనీ విద్రోహిని బ్లాక్
మెయిల్ చేస్తాడు చిరాగ్. ఇదీ విషయం.
ఎలావుంది కథ
‘ది ఇంగ్రెడియెంట్స్ ఆఫ్
లవ్’ (2012) అనే
ఫ్రెంచి నవల కాధారం. రోమాంటిక్
కామెడీ జానర్. పాత హృషికేష్ ముఖర్జీ, బాసూ భట్టాచార్యల మధ్యతరగతి
రోమాంటిక్ కామెడీల శైలిలో వుంది. అదే
సమయంలో సల్మాన్ ఖాన్ - మాధురీ
దీక్షిత్ - సంజయ్ దత్
లు నటించిన ‘సాజన్’ (1991) ని
గుర్తుకు తెచ్చే కథతో కూడా వుంది. ఒకరి పేరుతో ఇంకొకరు నవలో కవిత్వమో
రాస్తే ఏర్పడే మిస్టేకెన్ ఐడెంటిటీ
లాంటి అనేక సార్లు అనేక భాషల్లో వచ్చిన పాయింటుతోనే వుంది. సున్నిత హాస్యంతో సహజత్వానికి
దగ్గరగా వుంది. సోషల్ మీడియాలో
చూసుకుని
పెళ్ళిళ్ళు చేసుకుంటున్న ఈ రోజుల్లో ఓపిగ్గా
నవలంతా చదివి ప్రేమించడం పాత చాదస్తంలా వున్నా, ఫ్రెంచి నవల రాసిన
నికోలస్ బరో కథాకాలాన్ని ఈ నెట్
యుగంలో - 2012 లోనే పారిస్ నేపధ్యంగా ఏర్పాటు
చేశాడు. నవల పాపులరైంది. పాత అభిరుచుల పట్ల క్రేజ్ ఇంకా తగ్గలేదనీ, తగ్గబోదనీ తెలియజేయడం ఇలా రాసే ఉద్దేశం కావొచ్చు. ఇది
కనెక్ట్ అయింది.
ఎవరెలా చేశారు
‘నేనొక్కడినే’,
‘దోచేయ్’ లలో నటించిన కృతీ సానన్ హిందీలో పాపులరవుతోంది. స్లీపర్ హిట్ గా నిల్చిన
‘బీబీ’ లో ఆమెది హీరోల పక్కన డాన్సులేసే రొటీన్ గ్లామర్ డాల్ పాత్ర కాదు, ప్రధాన
పాత్ర. ఈ పాత్రలో బరేలీ గాళ్ గా జీన్సు కుర్తాల ఆహార్యంతో అతి సాధారణంగా వుంటుంది,
కానీ మానసికంగా బలమైన దృక్పథంతో వుంటుంది.
తన మాటే నెగ్గాలని ఎవర్నీ హర్ట్ చెయ్యదు, పేరెంట్స్ ని కూడా ఇబ్బంది పెట్టదు. పరిమితంగా
తాగుడూ తిండి విషయాల్లో తండ్రి కూడా అభ్యంతర
పెట్టడు. తండ్రినే సిగరెట్ అడుగుతుంది. ఒక్కతే
కూతురని మూస ఫార్ములా సినిమాల్లోలాగా అలరల్లరి చెయ్యదు. ఇలాటి పాత్ర
అందర్నీ నవ్వించాలనీ, చిలిపి పనులు చేయాలనీ మూస ఫార్ములా రూలుండే పాత్రచిత్రణ కాదు. ‘మిలి’
లో జయబాధురి ఒకటే అల్లరల్లరి చేస్తుంది. అందర్నీ నవ్విస్తూ ఆడిస్తూ పాడిస్తూ ఓవర్
గా తిరుగుతుంది. ‘మైనే కహా ఫూలోసే’ అని పూల
చెట్లతో పాట కూడా వేసుకుంటుంది. కృతీ సానన్ పాత్ర నేటి తరహా మధ్యతరగతి యువతుల భావాలని
ప్రతిబింబించే, నియంత్రించే, ఆకాశానికి నిచ్చెనలెయ్యని, కోరికలే గుర్రాలు కాని,
వ్యసనాల్ని దుర్య్వసనాలుగా చేసుకోని, ఒక సెన్సిబుల్ పట్టణ ప్రాంతపు హాస్య పాత్ర.
రోమాంటిక్ కామెడీలు జానర్ మర్యాదతో వుంటే పాత్రలెంత డైనమిక్ గా వుంటాయంటే – రొటీన్ అపార్థాలుండవు, రొటీన్ విడిపోవడాలుండవు, రొటీన్ మానసిక సంఘర్షణలూ, ప్రేమల్లో ఫీల్ కోసం ప్రయత్నాలూ, గజిబిజి పాత్రచిత్రణలూ – నస అంతా వుండదు. నిజానికివన్నీ రోమాంటిక్ డ్రామాల కుండాల్సిన లక్షణాలు. తెలీక రోమాంటిక్ కామెడీల్లోఇరికించేసి జానర్ మర్యాదని దెబ్బ తీస్తూంటారు. సినిమాలంత అడ్డగోలు కళ మరొకటి కన్పించదు. గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటూ పోయే స్వేచ్ఛ వున్నా ‘ఖళ!’ ఇదొక్కటే (ఈ శతాబ్దంలో తెలుగులో జానర్ మర్యాదని దెబ్బ తీయని ఒకే ఒక్క రోమాంటిక్ కామెడీ ‘అమీతుమీ’. మిగిలినవన్నీ రోమాంటిక్ కామెడీలని పొరబడి తీసిన సోకాల్డ్ రోమాంటిక్ డ్రామాలే).
రోమాంటిక్ కామెడీల్లో ప్రేమలకోసం పోటాపోటీలుంటాయి. ఎత్తుకు పై ఎత్తులుం
టాయి, చేతగాక ఏడ్పు లుండవు. రోమాంటిక్ కామెడీలు జీవితంలో గెలవడం గురించి చెప్తాయి. అందుకే పాశ్చాత్య దేశాల్లో సైకాలజీ స్టూడెంట్స్ కి ఎన్నో హాలీవుడ్ రోమాంటిక్ కామెడీలు పాఠ్యాంశాలుగా వున్నాయి. రోమాంటిక్ కామెడీలు ఆరోగ్యకర మానసిక స్థితికి సూచికలుగా వుంటాయి. ప్రేమికులిద్దరూ ఒకరు ఎక్కువా ఇంకొకరు తక్కువా అన్నట్టు వుండరు. సమ వుజ్జీలుగా వుంటారు. పరస్పరం ఐయాం ఓకే – యూఆర్ ఓకే అన్న సమానస్థాయి ఆరోగ్యకర ‘అడల్ట్’ మెంటాలిటీతో వుంటారు. ఐయాం ఓకే - యూఆర్ నాట్ ఓకే అన్న ఒకరు పెత్తనం చెలాయించే ‘పేరెంట్’ మెంటాలిటీతో వుండరు. అలాగే యూఆర్ ఓకే – అయాం నాట్ ఓకే అన్న ఆత్మవిశ్వాసం లేని ‘చైల్డ్’ మెంటాలిటీతో అసలుండరు.
రోమాంటిక్ కామెడీల్లో అసలు ప్రేమల గురించి కథ నడపకుండా, ప్రేమల కోసం ప్రయత్నాల గురించి, ఎత్తుగడల గురించీ వీలైనంత హాస్యంగా కథ నడపడం వుంటుంది. ఎత్తుగడలు ప్రేమికుల మధ్య వుండవచ్చు, లేదా ప్రేమికులిద్దరూ కలిసి ఇతర పాత్రలతో తలపడొచ్చు. రోమాంటిక్ కామెడీల్లో యాక్టివ్ పాత్రలే వుంటాయి. చిట్ట చివర్లో - చిట్ట చివర్లో మాత్రమే – చిట్ట చివర్లో మాత్రమే – ఈ యాక్టివ్ పాత్రలు కాస్త ఫీలవడం, డ్రామా పండించడం వుంటాయి, అంతే. దీంతో అపార్థాలు, విడిపోవడాలు, మానసిక సంఘర్షణలూ, ప్రేమ ఫీలింగులు, బలహీన పాత్రచిత్రణలూ, ఏడ్పులు, ప్రేక్షకుల కళ్ళల్లో గిరగిరా కన్నీళ్ళూ అంతా కొట్టుకుపోయి – మళ్ళీ కొత్తగా నీరొచ్చిన హుసేన్ సాగర్ లా చైతన్యంగా వుంటాయి రోమాంటిక్ కామెడీలు. హృషికేష్ ముఖర్జీ, బాసు భట్టాచార్య, జంధ్యాల, ఈవీవీ సత్యనారాయణ, ఇటీవల మోహనకృష్ణ ఇంద్రగంటి ఇలాగే తీశారు జానర్ మర్యాద చెడకుండా.
ఈ కోవలో కృతి పోషించిన బిట్టీ పాత్ర లక్ష్య సాధనకి - ఇంకా జానర్ ప్రకారం - హాస్య
రస పోషణకీ అడ్డుపడే ఎలాటి ఫీలింగ్స్, బరువైన సన్నివేశాలకీ తావివ్వదు. ప్రేమలో పడి ఫీలవుతూ, బాధపడుతూ, విరహగీతాలు పాడుతూ కూర్చుంటే, రోమాంటిక్ కామెడీలో ఫన్నీ ఎత్తుగడలతో ప్రేమ అనే లక్ష్యాన్ని సాధించడం కుదరదు. ఒక ఎత్తుగడ ఫెయిలయితే ఇంకేం చేయాలా అని ఫన్నీ గా ఆలోచించి అది చేసేస్తుంది.
మధ్యతరగతి
తల్లి పాత్రలో సీమా పహ్వా ఒక ప్రత్యేకాకర్షణ. తన హాస్య పాత్రని కన్న బిడ్డలా
ముద్దు చేసుకుంటూ పోషించింది. చాలా స్వీట్ ఛార్మ్ వున్న లేడీ. ఇంటికెవరైనా కుర్రాడొస్తే
ముందు పెళ్లయిందా అనడుగుతుంది. అయిందంటే వెంటనే వెళ్లిపొమ్మంటుంది. కాలేదంటే
కూర్చో బెట్టి షర్బత్ ఇచ్చి కబుర్లాడుతుంది, కూతురికి ఏ కోణంలో సరిపోతాడా అని.
తండ్రి పాత్రలో పంకజ్ త్రిపాఠీ తిరుగుతున్న ఫ్యానుతో మాట్లాడి కూతురి పెళ్లి బెంగ తీర్చుకుంటూ వుంటాడు. హీరో ఫ్రెండ్ పాత్రలో రోహిత్ చౌదరి ఇంకో మంచి హాస్యపాత్ర. ఇక సామాన్యంగా కన్పించే హీరో పాత్రలో ఆయుష్మాన్ ఖురానా టాలెంటెడ్ నటుడు. ఒక ప్రేమకి పెళ్ళయిపోయి, రెండో ప్రేమ ఇలా వచ్చీ తనదిగా చెప్పుకోలేని ఇరకాటాన్ని డీసెంట్ గా పోషించాడు. పెళ్ళయిపోయిన ప్రేయసిని గుర్తు చేసుకుంటూ అంతటి నవల రాసినా, ఈ అయిదేళ్ళల్లో చదివి ఫిదా అయిపోయింది హీరోయిన్ ఒక్కతే. మిగిలిన కాపీలన్నీ చాట్ బళ్ల దగ్గర పొట్లాలు చుట్టడానికీ, ఇళ్ళల్లో ఆడవాళ్ళు రద్దీలో విసిరి పారెయ్యడానికీ పనికొచ్చాయి. తన ప్రేమ కథ అంత చెత్తగా వుందన్న మాట. ఇప్పుడు హీరోయిన్ తో విద్రోహి గాడు తన ఫ్రెష్ ప్రేమని కూడా కొల్లగొట్టేయకుండా పడే పాట్లు అన్నీఇన్నీ కావు. పిరికి విద్రోహిని గల్లీ గూండాలాగా ట్రైనింగ్ ఇచ్చి తయారు చేసి, అతడి మీద హీరోయిన్ ప్రేమని చెడగొట్టించే ప్రయత్నాలు చేత్సే, ఆవి తన మెడకే చుట్టుకుని, విద్రోహిగాడు నిజంగానే విద్రోహిగా మారిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. తట్టుకోలేక తన్నుకు చస్తాడు.
ఐతే
ఆయుష్మాన్ ది కుట్రలు చేసే యాంటీ హీరోగా మారిపోయే పాత్ర. పిరికి రాజ్ కుమార్ రావ్ జాలీగా
హీరోయిన్ ని ప్రేమలో పడేసుకుని హీరోగా మారిపోయే పాత్రగా కొనసాగుతుంది. కథ ఎలా
ముగుస్తుందో అంతుపట్టకుండా వుంటుంది. ఈ సస్పెన్స్ కాస్తా చివర ఆయుష్మాన్ మీద శాడ్
సాంగ్ పెట్టి, ఫీల్ కల్గించడంతో చెడిపోయి, హీరోయిన్ ఇతడికే దక్కుతుందని స్పష్టమైపోతుంది. ఇతడి మీద శాడ్
సాంగ్ బదులు, రాజ్ కుమార్ మీద హీరోయిన్ తో రోమాంటిక్ సాంగ్ వుండి వుంటే, అతడి విజయయాత్రకి పెప్ వచ్చి, సస్పెన్స్ మరింత
పెరిగేది- ముగింపు తెలిసిపోకుండా.
అసలు
రాజ్ కుమార్ రావ్ దే కామెడీ అంతా. పిరికి వాడైన తనకి గూండాలాగా ట్రైనింగ్
ఇప్పించిన హీరో ముందు నంగినంగి గా పిల్లిలా మాట్లాడి, హీరోయిన్ దగ్గరికి వెళ్ళే
సరికి మాంచి బేస్ వాయిస్ తో పులిలా మాట్లాడే
డబుల్ యాక్షన్ కామెడీ ఆయువుపట్టు సినిమాకి. నిజానికి అతడి ఫేసుకి ఏ అమ్మాయీ
ప్రేమలో పడదు – మొహం చూసి అమ్మాయిలు పెళ్లి చేసుకుంటే ఈ దేశంలో సగం మంది కుర్రాళ్ళు సన్నాసులుగా మిలిపోతారని అంటాడు
- బాగా ధైర్యవంతుడిగా గ్లామర్ పెరిగాక. హీరోయిన్ తండ్రి దగ్గరికి రిచ్ మాన్ లా
వచ్చి- నేనెంత రిచ్ అంటే, ధన్తేరాస్ కి మీ స్వీట్ షాపు కొనేసి మీకే
గిఫ్టుగా ఇచ్చేంతగా – అని కోతలు కోస్తాడు. తను రచయిత అనుకుని ప్రేమిస్తున్న
హీరోయిన్ని హీరో కోసం దూరం చేయడానికి గూండాలా షాకింగ్ దృశ్యాలు చూపిస్తాడామెకి. ట్రాఫిక్
లో అడ్డంగా బైక్ ఆపేసి, పాన్ షాపు దగ్గర దర్జాగా సిగరెట్ కాలుస్తూ - గోలెడుతున్న
వాహనదారుల్ని గూండాగిరీతో - అరేవో - అనే ఒక్క గంభీరమైన డైలాగుతో అవాక్కయ్యేలా చేసే
సీను -
ఇవన్నీ, ఇలాటి వింకెన్నో సిట్యుయేషన్స్ హైలైట్ గా వుంటాయి. నవల్లో అంత శృంగార రసం ఒలకబోసి, ఇలా గంభీరరసం పలికిస్తున్నావేంటని హీరోయిన్ ఒకటే ఆందోళన.
దర్శకురాలు అశ్వినీ అయ్యర్ తివారీ ‘దంగల్’ దర్శకుడు నీతేష్ తివారీ భార్య. మొదటిసారిగా 2012 లో ‘వాట్స్ ఫర్ బ్రేక్ ఫాస్ట్’ అని తీసిన షార్ట్ ఫిలిం కి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది. తర్వాత ‘నిల్ బటే సన్నాటా’ (సున్నాని సున్నాతో భాగిస్తే సున్నా) అనే హిట్ మూవీ తీశారు. దీన్నే తమిళంలో అమలా పౌల్ – సముద్రకని లతో ‘అమ్మా కణుక్కు’ గా ధనుష్ నిర్మాతగా రీమేక్ చేశారు. ప్రస్తుత కామెడీకి నీతేష్ తివారీ రచన చేశారు మరో ఇద్దరితో కలిసి. టైటిల్ లాగే తన దర్శకత్వం బర్ఫీ తిన్నంత స్వీట్ గా వుంది. మధ్యతరగతి మందహాసాన్ని మనోహరంగా తెరకెక్కించారు.
‘జిగార్తండా’ ఫేమ్ గవెమిక్ యూ ఆరే ఛాయాగ్రహణంలో యూపీలోని బరేలీ పట్టణం చాలా కనువిందుగా దృశ్యం కట్టింది. తనిష్క్ బాగ్చీ సహా ఇంకో ముగ్గురు సంగీతదర్శకుల పాటలు ఫర్వాలేదు. హాస్యంగా జావేద్ అఖ్తర్ వాయిసోవర్ అప్పుడప్పుడు వస్తూ కథకి ఇంకింత కిక్ నిస్తూంటుంది.
చివరికేమిటి
జానర్
మర్యాద! జానర్ మర్యాదో రక్షితి రక్షితః - అంతే. జానర్ మర్యాద తప్ప ప్రేక్షకుల నాడిని
ఇంకేదీ పట్టేసుకోదు. ఇడ్లీ ఇడ్లీ లాగే వుండాలిగానీ, సగం తిన్నాక పిండిలా
వుండకూడదు. ఇది కుకింగ్ మర్యాద. సినిమా కథలకి
వాటి జానర్ మర్యాద ఎందుకు వుండకుండా పోతోందంటే, కుకింగ్ తెలీని కింగులు గరిటెలూ
కత్తిపీటలూ పట్టుకు తిరగడంవల్ల. ఇంటి దగ్గర కూరేదో దాని జానర్ మర్యాదతో కుకింగ్
చేయలేదని విసిరి కొట్టే తామే, సినిమాల్ని అజానరీయంగా కుకింగ్ చేసి, అనాగరికంగా తీసి
ప్రేక్షకుల మెప్పు పొందగలమనుకోవడం వల్ల.
ఈ పరిస్థితుల్లో ‘బరేలీకీ బర్ఫీ’ రోమాంటిక్ కామెడీ జానర్ లో ఏం నేర్పుతుందో పైన తెలుసుకున్నాం. ఇక స్క్రీన్ ప్లే సంగతుల విషయానికొస్తే, విద్యుత్ శాఖలో ఉద్యోగినిగా హీరోయిన్ పాత్ర, ఆమె స్వభావం, పెళ్లి సమస్యా పరిచయమయ్యాక, ఆమె నవల చదివి రచయితతో ప్రేమలో పడి హీరోని కలుసుకునే ఘట్టంతో ప్లాట్ పాయింట్ వన్ వస్తుంది. ఇక్కడామె తన లక్ష్య సాధన కోసం రచయితతో కలపమని హీరోని కోరుతుంది.
ఇక్కడొక తేడా వుంది. సమస్య హీరోయిన్ ది, ప్రధాన పాత్ర తనూ, సమస్యని సాధించుకునే లక్ష్యం ప్రత్యక్షంగా తనకే వుండాలి, ఇలా కాకుండా ఇంకో పాత్రకి అప్పజేప్పేస్తే ప్రధాన పాత్రగా తనేమైపోవాలి?
‘మనుషులు మారాలి’ లో ఫ్యాక్టరీ యాజమాన్యంతో లక్ష్యం కోసం పోరాడే శోభన్ బాబు ప్రధాన పాత్ర సగంలో చనిపోతుంది. అప్పుడిది హేండాఫ్ పాత్రయింది. అంటే, కథలో తన లక్ష్య సాధన దిశగా ఓ మజిలీ చేరుకుని, మరో పాత్రకి బాధ్యతని అప్పగిస్తూ నిష్క్రమించడమన్న మాట. శోభన్ పాత్ర చనిపోయాక భార్య పాత్రలో శారద ఆ లక్ష్యాన్ని అందిపుచ్చుకుని పోరాడుతుంది.
ఇలా ‘బర్ఫీ’ లో హీరోయిన్ ది కూడా హేండాఫ్
పాత్రయింది. ఆమె కథ నడిపిస్తే ఈ కథ రాణించదు. ఆమే వెళ్లి నవల రాశాడనుకుంటున్న
సెకెండ్ హీరోని కలుసుకుంటే అప్పుడే కథ ముగిసిపోతుంది,
అతను కాదని తెలిసి. ఇందులో కథెక్కడుంది? హేండాఫ్ పాత్రగా మారితేనే హీరో ఉనికిలో
కొచ్చి, అతడి టక్కుటమరాలతో నాటకీయతా, కథా, కామెడీ అన్నీ పుట్టుకొస్తాయి.
ఇక్కడ
ఇంకో గమ్మత్తేమిటంటే, ‘బ్లడ్ సింపుల్’ లాంటి ప్లాట్ పాయింట్ వన్ ట్విస్టు ఏర్పడడం.
హీరోయిన్ నవల అచ్చేసిన హీరో దగ్గరికి వచ్చింది. నవల రాసిన వాణ్ణి కలపమంది. హీరో
కలపడు. ఎందుకంటే, నవల తనే రాసి వాడి పేర
అచ్చేశాడు ఖర్మ కొద్దీ. ‘బ్లడ్ సింపుల్’ లో మార్టీ, విస్సర్ ని కలుసుకుని
తనభార్యనీ, ఆమె ప్రియుణ్ణీ చంపమన్నాడు. విస్సర్ చంపడు. వాళ్ళని చంపితే ఏమొస్తుంది, మార్టీనే చంపితే చాలు. మార్టీ
వల్ల ఏర్పడిన ఈ ప్లాట్ పాయింట్ వన్ లోంచి విస్సర్ తనదైన ప్లాట్ పాయింట్ వన్ ని లాగాడు. పైకి
వాళ్ళని చంపుతానని చెప్పి, మార్టీ నే చంపే రహస్య ఎజెండాతో వెళ్ళాడు.
ఇలాగే
‘బర్ఫీ’ లో హీరోయిన్ వల్ల ఏర్పడిన ప్లాట్
పాయింట్ వన్ లోంచి హీరో తనదైన ప్లాట్ పాయింట్ వన్ ని లాగాడు. సెకండ్ హీరోని నేరుగా
హీరోయిన్ తో కలపకుండా, ఆమె మనసు విరిచేసే టాస్క్ సెకెండ్ హీరోకి ఇస్తూ, సీక్రెట్ ఎజెండా పెట్టుకుని ముందుకు
కొనసాగాడు. కాకపోతే ఇది ముందే మనకి తెలుస్తుంది, విస్సర్ మనకి తెలియనివ్వడు.
ఇలా హేండాఫ్ పాత్ర అయిన హీరోయిన్ నుంచి కథని తను తీసుకుని, వర్కింగ్ కథా నాయకుడయ్యాడు హీరో. రానురానూ ఈ వర్కింగ్ హీరో యాంటీ హీరోగా మారిపోతాడు. ఇది క్యారక్టర్ గ్రోత్.
ప్లాట్ పాయింట్ వన్ తర్వాత ప్రారంభమయ్యే మిడిల్ లో అతడి యాక్షన్ ప్లాన్ ఇలా వుంటుంది : మొదట విద్రోహి అడ్రసు, ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడీ, సోషల్ మీడియాలో సొల్లు రాయడం ఏవీ లేవని బుకాయించి, లెటర్స్ రాయడం ఒక్కటే మార్గమని - తను మెసెంజర్ లా వుంటాననీ ఆమెతో అంటాడు. ఆమె రాసే ఉత్తరాలు తీసుకుని, తనే విద్రోహి పేర అందమైన కవిత్వంతో జవాబులు రాసి అందిస్తూంటాడు. చీర కట్టి దిగిన ఆమె ఫోటో ఒకటి అడిగి తీసుకుని, ముందు పెట్టుకుని వర్ణనలు రాస్తాడు.
ఇదంతా ఈమెకి బోరు కొట్టి అతణ్ణి కలిపి తీరాల్సిందే నని పట్టుబడుతుంది. అప్పుడు రెండో సీక్వెన్స్ మొదలవుతుంది. ఫ్రెండ్ తో కలిసి విద్రోహి ఇంటికి వెళ్తే, సిటీలో హై - ఫై జాబ్ చేస్తున్నాడని మదర్ అంటుంది. ఒక చిన్న టీవీ, ఒక ఫ్యానూ హై - ఫై జాబ్ చేస్తూ పంపినవే నని గర్వంగా చూపిస్తుంది. కంపెనీ అడ్రసు అడిగితే విజిటింగ్ కార్డు చూపించి చటుక్కున దాచేసుకుంటుంది. ఆ కంపెనీకి వెళ్తే హై - ఫై జాబ్ చెస్తూన్న విద్రోహి వుండడు. ఇంకా వెతికి
తే చీరల షోరూంలో వుంటాడు.
ఇదంతా
ఫస్టాఫ్ కథ. ఇక సెకండాఫ్ మిడిల్ టూలో విద్రోహిని బ్లాక్ మెయిల్ చేస్తాడు. తనకి
సహకరించకపోతే జాబ్ సంగతి మదర్ కి చెప్పేస్తానని బెదిరించి, అమాయక ప్రాణిని గల్లీగూండాలాగా
తయారు చేసి హీరోయిన్ మీదికి ఎగదోస్తాడు. ఇదొక
సీక్వెన్స్. తర్వాతి సీక్వెన్స్ లో అటు హీరోయిన్ తో, ఇటు వర్కింగ్ హీరోతో
నలిగిపోయి ఇక తిరగబడతాడు విద్రోహి. గుట్టు విప్పేస్తానని వర్కింగ్ హీరోనే బ్లాక్
మెయిల్ చేసి తనని ప్రేమిస్తున్న హీరోయిన్ ని సెట్ చేసుకుని సవాలు విసురుతాడు.
ఇదంతా మిడిల్ విభాగం బిజినెస్ ప్రకారం వర్కింగ్ హీరోగా వున్న హీరోకి ప్రత్యర్ధితో సహజంగా
జరిగే – జరిగి తీరాల్సిన యాక్షన్ రియాక్షన్ ల ఇంటర్ ప్లేనే (సంఘర్షణ). మిడిల్ వన్
లో హీరోయిన్ తో ప్లే, మిడిల్ టూ లో విద్రోహితో ప్లే.
ఇలా యాంటీ హీరోగా మారిన వర్కింగ్ హీరోకి చివరికేం జరగాలో అదే జరుగుతుంది. ఓడిపోతాడు. అప్పుడు హీరోగా మారిన సపోర్టింగ్ క్యారక్టర్ విద్రోహి ఏం నిర్ణయం తీసుకుని సమస్యని కొలిక్కి తెచ్చాడనేది ఎండ్ విభాగం. కథల్లో గేమ్ ప్రారంభించే యాంటీ హీరో చేతుల్లో ముగింపు వుండదు. ఇంకో పాత్ర చేతిలోనో, చట్టం చేతుల్లోనో వుంటుంది. అలా వర్కింగ్ హీరో అయినప్పటికీ యాంటీ హీరోగా మారడం వల్ల ముగింపు అతడి చేతిలో లేకుండా పోయింది. ఇక్కడ హీరో చివరికి పాసివ్ అయ్యాడని కన్ఫ్యూజవకూడదు. ఇతను హీరోయే (ప్రధాన పాత్రే) కాదనీ, కేవలం వర్కింగ్ హీరోయేననీ, అందులోనూ యాంటీ హీరోగా మారేడనీ గుర్తిస్తే కన్ఫ్యూజనుండదు.
ప్రధాన పాత్ర (హీరోయిన్) హేండాఫ్ పాత్రగా మారి, తన లక్ష్యాన్ని వర్కింగ్ హీరోకి అప్పగిస్తే, ఆ వర్కింగ్ హీరో మానిప్యులేట్ చేస్తూ యాంటీ హీరోగా మారిపోయి, లక్ష్యాన్ని దెబ్బతీసే కథలు తక్కువ వుంటాయి. ఇలాటి అరుదైన పాత్రచిత్రణని పట్టుకోవడంతో ఈ రోమాంటిక్ కామెడీ మోస్టు డైనమిక్ గా తయారయ్యింది.
-సికిందర్
cinemabazaar.in
cinemabazaar.in