రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...
టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!
Sunday, October 27, 2019
Friday, October 25, 2019
886 : స్క్రీన్ ప్లే సంగతులు -2
సైరా మిడిల్ విభాగం బ్రిటిషర్లపై తిరుగుబాటు,
నేరస్థుడుగా ముద్ర, పోరాటం, లొంగు బాటుగా వుంటే - ఎండ్ ఉరితీతతో వుంటుంది. కొన్ని ముగింపులకి
ప్లాట్ పాయింట్ వన్ మాత్రమే కాకుండా కథనంలో ఎక్కడో ఇంకో ప్రారంభముంటుంది. ఆ ప్రారంభాన్ని గుర్తించి కథ
నడిపినప్పుడు ఆ కథ ఫోకస్డ్ గా వుంటుంది. ఈ ఫోకస్ కి అడ్డుపడే సన్నివేశాల కత్తిరింపు
జరిగిపోతుంది. గత వ్యాసంలో గమనించినట్టు సైరా ప్లాట్ పాయింట్ వన్ వచ్చేసి జూనియర్ బ్రిటిష్
అధికారిని సైరా తరిమి కొట్టడంగా వున్నప్పుడు, ఇదే నేరుగా ముగింపుకి దారి తీయలేదు.
దీని పర్యవసానంగా సైరా ఆ జూనియర్ బ్రిటిష్ అధికారి తలనరికే ఇంటర్వెల్ సీను కూడా
నేరుగా ముగింపుకి దారితీయలేదు. మళ్ళీ ఈ ఇంటర్వెల్ సీను పర్యవసానంగా సైరా తలపై
ప్రకటించే బహుమానం సీను మాత్రమే నేరుగా ముగింపుకి, అంటే ఉరితీతకి దారితీసింది.
ఇలా ‘సైరా’ ముగింపుకి ‘సైరా తలపై బహుమానం ప్రకటన’ అనే సీను ప్రారంభంగా వుంది. ఈ ప్రారంభాన్ని గుర్తించి దీనిపై ఫోకస్ చేసివుంటే, ఇక సైరాని పట్టుకునే వేటగా ఇక్కడనుంచీ కథనముండి సాఫీగా, సూటిగా, బలంగా సెకండాఫ్ నడిచిపోయేది. ఈక్వలైజర్ - 2 లో సెకండాఫ్ ప్రారంభమైన పదినిమిషాలకే క్లయిమాక్స్ మొదలైపోతుంది. దీనికి ట్రిగ్గర్ డైలాగు- హీరో డెంజిల్ వాషింగ్టన్ హంతకుల్ని పిల్చి- ఇక మీరు చావుకి సిద్ధం కండని చెప్పడం. సైరాలో సైరా తలపై బహుమానం ప్రకటించడం లాగే ఇదీ వుంది. ఇలా క్లయిమాక్స్ కి ఎజెండా నిర్ణయమైపోయింది ఈక్వలైజర్ -2 లో లాగే సెకెండాఫ్ ప్రారంభమైన పది నిమిషాల్లో సైరాలో కూడా. మరి ఇంకెందుకాలస్యం వేట ప్రధానంగా సెకెండాఫ్ కథనం కొనసాగడానికి?
ఈక్వలైజర్ -2 లో యాక్షన్ కథని మొక్కుబడిగా నడిపారు. సబ్ ప్లాట్స్ తో ఒక స్టార్ గా డెంజిల్ వాషింగ్టన్ క్యారక్టర్ ని పరోపకారం చేసే మహోన్నత వ్యక్తిగా, బలమైన ఫీల్ తో నిలబెట్టే ప్రయత్నమే ఎక్కువ చేశారు. చివరికి చిట్టిపొట్టి యాక్షన్ కథ ముగిశాక, ఈ పరోపకార గుణం మీదే ఫోకస్ చేసి, డెంజిల్ వాషింగ్టన్ ని మరింత ఎలివేట్ చేస్తూ మర్చి పోలేని విధంగా, వెంటాడే ఫీల్ తో అత్యంత హృద్యంగా ముగించారు.
సైరా లో ఒక స్టార్ గా చిరంజీవి పాత్రకుండాల్సిన ఈ ఫీల్ బదులు ఏకోన్ముఖ ఎమోషన్ (రౌద్రం) - యాక్షనే ప్రధానమైపోయింది. రసపోషణలో తేడా కొట్టడం వల్ల రిపీట్ ఆడియెన్స్ కి నోచుకోలేకపోయింది. మిడిల్ అంతా ఫోకస్ లేని బరువైన సన్నివేశాల ద్రోహాల కథనాలు వచ్చేసి, అసలైన పాయింటు వేట కథ అడ్డుపడి పోయాయి. అడుగున తోసేశాయి. ముగింపుకి స్పష్టమైన ప్రారంభం మీద ఫోకస్ చెదిరి పోయింది. డ్రామా అనేది వేటకి గురయ్యే సైరాకీ, బ్రిటిషర్లకీ మధ్య కాక - బోలెడు పాలెగాళ్ళ, అన్నదమ్ముల పాత్రల గొడవ వైపు మళ్ళింది. ఇది మార్కెట్ యాస్పెక్ట్ కాలేదు. మార్కెట్ యాస్పెక్ట్ కి ఇలాటి పురాతన డ్రామాలు రుచించే అవకాశం లేదు. ఎంతసేపూ చిరంజీవిని చుట్టూ బోలెడు పాత్రల మధ్య ఇరికించి, క్రౌడ్ లో చూపించడం కూడా మార్కెట్ యాస్పెక్ట్ కాలేదు. కాస్సేపైనా విడిగా వదిలెయ్యాలి. విడిగా యాక్షన్ చేసుకోవడానికి వదిలెయ్యాలి. అప్పుడే ఆ సోలో యాక్షన్ తో హైలైట్ అయ్యేందుకు అవకాశముంటుంది.
ఈ సోలో యాక్షన్ మళ్ళీ అటు బ్రిటిష్ గుంపుతో కాకుండా, బహుమానం ప్రకటించిన సీనియర్ బ్రిటిష్ అధికారికీ, సైరా కీ వన్ టు వన్ గా, వాళ్ళిద్దరి మధ్యే ఎక్స్ క్లూజివ్ పోరాటంగా వున్నప్పుడు ఒక అడ్వెంచర్ కి వీలవుతుంది. ఫారెస్ట్ లో వేటాడే బ్రిటిష్ అధికారిని, గెరిల్లా దాడులతో ముప్పుతిప్పలు పెట్టే సైరా అడ్వెంచర్ గా ఒక థ్రిల్లింగ్ ఎక్స్ పీరియెన్స్ ని ఒక ఎపిసోడ్ గా సృష్టించి వుండవచ్చు. ఇలా ముగింపుకి ప్రారంభాన్ని పట్టుకుని, ఆ ప్రారంభం మీద కథనం నడపకపోవడంతో, సెకండాఫ్ లో ఇరువైపులా అవే మూక దాడులు రిపీట్ చేసుకోవడమే సరిపోయింది.
చారిత్రక వ్యక్తి జీవితంలోంచి వేరు చేసి చూస్తే, ఏ కీలక ఘట్టం మొత్తం జీవితాన్నీ ప్రభావితం చేసిందో ముందు గుర్తించాలంటారు నిపుణులు. మనకి తెలిసినంత వరకూ, సైరా తల మీద చివరికి అతడి ప్రాణాలు తీసే బహుమానం ప్రకటనే అతడి జీవితాన్ని ప్రభావితం చేసిన ఘట్టం కావాలి. అప్పుడు ఈ ఘట్టం చుట్టూ కథ నడపమంటారు నిపుణులు. చిరంజీవి ‘ఖైదీ’ లో చూసినా పరారీలో వున్న నిందితుడి చుట్టూ కథేగా? సైరాని కూడా పరారీలో వున్న నిందితుడి కథగానే చూడాలి. అప్పుడు ఈ ఘట్టాన్ని పాయింటాఫ్ నో రిటర్న్ గా చూడాలంటారు నిపుణులు. పాయింటుతో ఇక అమీ తుమీ తేల్చుకోవాల్సిందే. అంటే ఈ పాయింటే ఇక కథవుతుందన్న మాట.
అదృష్టవశాత్తూ ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి చరిత్ర మహాత్మా గాంధీ జీవితంలా గాథ కాలేదు. మహాత్మా గాంధీకి నాథూ రాం గాడ్సే తనని చంపుతాడని ముందు తెలియదు. కనుక సర్ రిచర్డ్ అటెన్ బరో ‘గాంధీ’ తీస్తే అది గాథ అయింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కి తన తలకి బహుమానం విషయం, తనకోసం గాలింపూ ముందే తెలుసు. కనుక ఈ పాయింటు (సమస్య) చుట్టూ అతడి చరిత్ర కథ అయింది. కానీ కథగా వున్న ఈ పాయింటు మరుగునపడి పోయి గాథలా తయారయింది సైరా. తెలుగులో చాలా సినిమా కథలు గాథలుగా మారిపోయి తేలిపోవడాన్ని చూస్తూనే వున్నాం.
చరిత్రలో ఉయ్యాలవాడకి స్పష్టమైన బిగినింగ్ మిడిల్ ఎండ్ లున్నాయి. అదే మహాత్మా గాంధీకి లేవు. స్క్రీన్ ప్లే గురు సిడ్ ఫీల్డ్ ప్రకారం, రిచర్డ్ అటెన్ బరో తీసిన ‘గాంధీ’ స్క్రీన్ ప్లేకి ఇదో సమస్య అయింది. గాంధీ జీవితాన్ని సినిమాగా తీయాలంటే జీవితం ఎన్నో శాఖలుగా విస్తరించి వుంది. అందుకని సినిమాగా నిలబెట్టేందుకు పనికొచ్చే ముఖ్యమైన మూడు ఘట్టాల్ని స్క్రీన్ ప్లే కి అధ్యాయాలుగా నిర్ణయించాడు. అవి దక్షిణాఫ్రికాలో న్యాయవాదిగా అనుభవాలు, ఇండియాలో సహాయ నిరాకరణోద్యమం, హిందూ ముస్లిం సమస్య. ఈ అధ్యాయాలకి ముగింపుగా హత్య. ఇవి స్క్రీన్ ప్లే పరిభాషలో బిగినింగ్ మిడిల్ ఎండ్ లనే మూడు విభాగాలు కాకపోయినా, సినిమాకి మూడు విభాగాలుండాలని మూడు అధ్యాయాలు చేశాడు. మొత్తంగా చూస్తే ఇది కథ కాదు, గాథ. అధ్యాయాలతో వున్నది గాథే అవుతుంది.
ఇలా కాకుండా ఉయ్యాలవాడకి కథయ్యేందుకు అతడి తలకి ప్రటించిన బహుమానమనే అంశం సెంట్రల్ పాయింటుగా వుంది. ఇది కథా చక్రాలకి ఇరుసు కాలేదు. అలాంటప్పుడు సైరా తలకి బహుమానం ప్రకటన ప్రస్తావనే తేకుండా వుండాల్సింది. దాడులు ప్రతి దాడులతో నడుపుతున్నప్పుడు, ఆ దాడుల ఫలితంగా పట్టుబడ్డాక నేరుగా ఉరితీత కార్యక్రమం పెట్టేయాల్సింది. ప్రకటన అనే సెటప్ కి ఉరితీత పే ఆఫ్ అయినప్పుడు, ఆ సెటప్ కి తగ్గ కథనానికి వీల్లేక పోయాక, ప్రకటన అనే సెటప్పే అవసరం లేదు. ‘లయన్ ఆఫ్ ది డెజర్ట్’లో రెబెల్ పాత్ర ఒమర్ ముఖ్తార్ కి ప్రకటన అనే సెటప్ వుండదు. పట్టుబడ్డాక నేరుగా ఉరి తీస్తారు. ప్రకటన అనే సెటప్ ఏర్పాటు చేస్తే, అది కోరే కథనం లేకపోతే, చివర ఉరితీత అనే ముగింపుని ముందే రివీల్ చేసినట్టయి సస్పెన్స్ పోతుంది. సెటప్ కి తగ్గ కథా పాలన చేసినప్పుడు, అదే ఉరి వరకూ సీన్ టు సీన్ సస్పెన్స్ క్రియేట్ చేయడానికి పనికొస్తుంది
మొత్తం సైరాని లోపించిన దాని ఫీల్ దృష్ట్యానే చూసి ఈ సంగతులు చెప్పుకుంటున్నాం. సినిమాని అంతర్జాతీయ స్థాయి చేయడమంటే అంతర్జాతీయ ఫైటర్స్ తో యాక్షన్ కొరియోగ్రఫీ చేయడం కాదుకదా? సార్వకాలిక కథని సార్వజనీనం చేయడం కూడా అంతర్జాతీయం అవుతుంది. ఆలోచనాత్మకంగా వున్నప్పుడే అవుతుంది. సైరా కనీసం ముగింపయినా ఆలోచనాత్మకంగా లేకపోవడంతో, చిట్ట చివరికైనా ఓ బొట్టు ఫీల్ కి కూడా ఆస్కారం లేకుండా చేసింది. ఏదైనా ఆలోచింప జేస్తేనే ఫీల్ వుండేది. సైరా మొత్తం మీద ఆలోచింపజేసే ఒక్క సన్నివేశం లేదు. అంతా రుద్రరౌద్ర యాక్షన్ హడావిడియే. ముగింపు కూడా రెగ్యులర్ తెలుగు యాక్షన్ సినిమా ఫార్ములాయే. ఉరికంబం మీద ఉరిని తప్పించుకుని సైరా శత్రు సంహారం గావించడం. దీంతో పాత్ర పట్ల సానుభూతీ, ఫీల్ పూర్తిగా మాయమైపోయాయి.
ఇలా సాగుతుంది సంభాషణ. ఇక ఇతణ్ణి లొంగదీయలేమని, ‘నీకు దృష్టి తగ్గింది’ అంటూ కళ్ళ జోడు తీసిస్తాడు జనరల్ గ్రజియానీ. అది పోరాటంలో దొరికిన ముఖ్తార్ కళ్ళజోడే. ఆ తర్వాత కోర్టు విచారణ జరుగుతుంది. తను చేసిన తిరుగుబాటుని ఒప్పుకుంటాడు ముఖ్తార్. అతణ్ణి రెబెల్ గా ప్రకటించి, బహిరంగ ఉరి శిక్ష విధిస్తుంది కోర్టు. బహిరంగ ప్రదేశంలో వందలాది ప్రజల సమక్షంలో ఉరికి సిద్ధం చేస్తారు. ప్రజలు రోదిస్తూంటారు. మిలిటరీ ట్యాంకర్ లతో, తుపాకులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లుంటాయి. ముఖ్తార్ ని ఉరికంబం ఎక్కిస్తారు. అతను ప్రశాంత చిత్తంతో వుంటాడు. మిలిటరీ అధికారి ఉరిశిక్ష ఉత్తర్వులు చదివి వినిపిస్తాడు. పక్కనే జనరల్ గ్రజియానీ విచారంగా వుంటాడు. ముఖ్తార్ పక్కకు తిరిగి నిశ్శబ్దంగా ప్రార్ధన చేసుకుంటాడు. కళ్ళ జోడు తీసేస్తాడు. తలారి దాన్ని తీసుకుని కింద పెడతాడు. ఇది సమూహంలో ఒక బాలుడు గమనిస్తాడు. తలారి ముఖ్తార్ చేతులు వెనక్కి కట్టేసి ఉరిని బిగించాక, అధికారి గ్రీన్ సిగ్నలిస్తాడు. జనరల్ గ్రజియానీ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. తలారి ముఖ్తార్ కాళ్ళకింది బల్లని తన్నేస్తాడు. ముఖ్తార్ ఉరికి వేలాడి ప్రాణాలు వదిలేస్తాడు. ప్రజల రోదనలు మిన్నంటుతాయి. బాలుడు ఆ కళ్ళజోడు తీసుకుంటాడు. దిసీజ్ యూనివర్సల్ అప్పీల్ వున్న ఫీల్!
-సికిందర్
Friday, October 18, 2019
885 : స్క్రీన్ ప్లే అప్డేట్స్
స్టోరీ అయిడియాలు అనేక ప్రాప్తి స్థానాల నుంచి
లభిస్తూంటాయి. చదివిన వార్తో, చూసిన సంఘటనో, విన్న సంభాషణో... ఏదైనా కావొచ్చు.
ఆర్ట్ గ్యాలరీలలో పెయింటింగ్స్ ని తదేకంగా చూస్తూ దీని అర్ధమేమిటాని దీర్ఘంగా ఆలోచిస్తూంటాం.
ఏదో అర్ధమవచ్చు, ఏదో అర్ధమవక పోవచ్చు. అంతటితో వదిలేస్తాం. కానీ వీటిని కూడా
స్టోరీ ఐడియాల కోసం పరికిస్తే? వీటి ఆధారంగా కథ చెప్పాలన్పిస్తే? అప్పుడు వొరిజినల్
ఐడియాలు తట్ట వచ్చు. ప్రతీ పెయింటింగ్ ఒక కథ చెప్తుంది. ఆ పెయింటింగ్ లో వుండే డిటెయిల్స్
ని కలుపుకుని కథ అల్లుకోవచ్చు. ఏ పెయింటింగైనా కొన్ని జ్ఞాపకాల్ని తట్టిలేపుతుంది.
ఆ జ్ఞాపకాల్లో డామినేటింగ్ ఫీలింగ్ ఏదైతే వుంటుందో దాంతో కనెక్ట్ అయి పెయింటింగ్
ని ఆస్వాదిస్తాం. జ్ఞాపకాల్లో బాధాకరమో, సంతోషకరమో, స్ఫూర్తి దాయకమో, ఏదో ఒక
ఫీలింగ్ నిచ్చిన సన్నివేశముండొచ్చు. వీటిలో ఏది డామినేటింగ్ గా వుంటే ఆ ఫీలింగ్ తో పెయింటింగ్ తో కనెక్ట్ అవుతాం. పక్క
పెయింటింగ్ చూస్తే, మనం గడిపిన ఎన్నో రైల్వే స్టేషన్లు జ్ఞాపకాల పొరల్ని దొల్చుకుని
రావొచ్చు. ఎన్నో అనుభవాలు మెదలొచ్చు. వీటిలో ఒక స్టేషన్లో అయిన బాధాకర అనుభవమే మిగతా
స్టేషన్లలో అయిన అనుభవాల్ని మరిపించే డామినేటింగ్ ఫీలింగ్ గా వుంటే, ఈ బాధాకరమైన
ఫీలింగ్ తో పెయింటింగ్ ని చూస్తాం. సంతోషకరమైన ఫీలింగ్ డామినేటింగ్ గా వుంటే దాంతో చూస్తాం. ఈ డామినేటింగ్ ఫీలింగ్సే
పెయింటింగ్స్ లో స్టోరీ ఐడియాలని నిర్ణయిస్తాయి.
పై పెయింటింగ్ చూడగానే ఆహ్లాదకర ఫీలింగ్ తో
కనెక్ట్ అయ్యామనుకుందాం, అప్పుడీ పెయింటింగ్ చెబుతున్న కథేమిటా ఆలోచిస్తాం. ఇది
ఎప్పుడో అప్పటి ‘బొంబాయి’ స్టేషన్ దృశ్యం. పొగలు గ్రక్కుతూ ఆగిన రైలు. అది ప్లాట్
ఫాంలా లేదు. జనం తిరిగే రోడ్డులా వుంది. డిటెయిల్స్ లోకెళ్తే, ముందుగా మెయిన్ ఫిగర్.
ఇదొచ్చేసి సైకిలు పట్టుకుని ఆగిన వ్యక్తి. ఇతను ఆఫీసులకి లంచ్ బాక్సులు మోసే డబ్బావాలా. బొమ్మలో
కొట్టొచ్చినట్టు కనబడుతున్నది నీడలు. ఇవే ఆ డబ్బా వాలా కథ చెప్తున్నాయి. నీడలు ఇటు
ఫోర్ గ్రౌండ్ లో పడుతున్నాయి. అంటే సూర్యుడు అటు వెనకాల వున్నాడు నీడల్ని బట్టి. ఆ
వెనుక భవనం కన్పిస్తోంది. ఆ భవనం వెనకాల సూర్యుడు కన్పించకపోయినా, సూర్యుడు
అటువైపే వున్నాడు. అది ఉదయించే సూర్యుడా, అస్తమించే సూర్యుడా? ఎందుకంటే నీడలు
పొడవుగా పడుతున్నాయి, మధ్యాహ్నపు సూర్యుడై వుండడు. ఇక ఉదయం వేళ కూడా అయి వుండదు. ఎందుకంటే
డబ్బావాలాలు లంచ్ అవర్ కల్లా బాక్సులు ఆఫీసులకి చేరేస్తారు. అందుకు ఇంత ఎర్లీగా
బయలేదేరరు. కనుక ఇది సాయం వేళ. అయితే సాయం వేళ తిరిగి ఖాళీ బాక్సులు ఇళ్ళకి చేరేయరు
డబ్బావాలాలు. ఉద్యోగులే తీసికెళ్ళిపోతారు. అంటే ఈ డబ్బావాలా లంచ్ బాక్సులతో ఎప్పుడో బయల్దేరినా,
సాయంత్రమవుతున్నా ఇంకా ఆఫీసులకి చేరుకోలేదన్నమాట!
ఇదీ బొమ్మ చెప్పే కథ. ఇంకా డిటెయిల్స్ లో కెళ్దాం. చిత్ర కారుడు వ్యూహాత్మకంగా బొమ్మ వేశాడు. ఎక్కడా డబుల్ డిటెయిల్స్ ఇవ్వలేదు. ఆపరేటింగ్ డిటెయిల్స్ మీంచి దృష్టి చెదిరే ఎలాటి సెకండరీ డిటెయిల్స్ ఇవ్వలేదు. వాటిని ఎడిట్ చేశాడు. చెప్పాలనుకున్న థీమ్ వచ్చేసి, సాయంత్ర మవుతున్నా డబ్బావాలా ఆఫీసులకి చేరుకోలేదని. దీనికి సమయాన్ని సూచించే ఎండ తీవ్రతని, నీడల దిశనీ మాత్రం చూపిస్తే చాలు. ఇంకా భవనం వెనకాల సూర్యుడి జాడ కూడా చూపించాల్సిన అవసరం లేదు. అలాగే ఈ నీడల్ని డిస్టర్బ్ చేస్తూ వెళ్తున్న వాహనాల్ని చూపించలేదు. ఇటు ఒకవైపే వస్తున్న వాహనాలని చూపించాడు. ఇంకా అటూ ఇటూ తిరిగే మనుషులతో కూడా నీడల్ని డిస్టర్బ్ చేయలేదు. మనుషుల్ని రైలు కటు వైపున్న ఫ్లాట్ ఫాం మీద చిత్రించాడు. ఇద్దరు మనుషుల్ని ఇటు చూపించినా నీడల్ని డిస్టర్బ్ చేయలేదు.
వాహనాల మీద మనుషులందరూ డబ్బా వాలాకి ఎదురొస్తున్న వాళ్ళే. వాళ్లకి ఎదురె ళ్తూ డబ్బావాలా ఒక్కడే హైలైట్ అవుతున్నాడు. ఇంకెవరితోనూ థీమ్ ని డిస్టర్బ్ చేయలేదు. అయితే అతను వెళ్తున్న దిశకే రైలింజను పొగ కూడా చూపిస్తూ సెకండరీ డిటెయిల్ ఇచ్చినా ఇది డిస్టర్బ్ చేయడం లేదు. ఇదింకో అర్ధాన్నిస్తోంది. ఇది తర్వాత చెప్పుకుందాం.
డబ్బావాలాకి ఎదురొస్తున్న వాళ్ళు బైక్స్ మీద వున్న వాళ్ళే. ఎవరూ సైకిల్ మీద
లేరు. సైకిలుతో డబ్బావాలా ఒక్కణ్ణి చూపించినప్పుడే మన మైండ్ కథని పట్టుకుంటుంది. ఆ
కథ పరుగులు దీస్తున్న కాలంతో ఇంకా సైకిలు మీద పోటీ పడుతున్నాడని. ఇప్పుడతను సైకిలు
తొక్కుతూ ఎదురు వెళ్ళడం లేదు. ఆగిపోయి ఆలోచనలో పడ్డాడు. వీళ్ళందరూ బుర్రుమని మోటారు
బళ్ల మీద ఆఫీసుల నుంచి వచ్చేస్తూంటే, ఇప్పుడు తను సైకిలు తొక్కుతూ వెళ్ళి పీకేదేంటని.
ఆ
వెనుక ఎత్తైన భవనం ఇంకో సింబాలిజం. సమయానికి ఆఫీసుకి చేరుకోలేకపోయాక అది భూతంలా కన్పించడం
సహజమే. రైలు పొగో, పొగ మంచో కూడా ఆ భవనాన్ని ఆవరించి మిస్టీరియస్ లుక్ నిస్తోంది. ఈ
డిటెయిల్ చెదరకుండా వుండేందుకు కూడా భవనం వెనకాల సూర్యుడి ఉనికి ఏమీ ఇవ్వలేదు. నీరెండని
భవనం మీద వేయకుండా, ఆపరేటింగ్ డిటెయిలుగా రైలు మీద వేసి రైలుని హైలైట్ చేశాడు.
ఈ రైలేం చెప్తోంది? రైలంటే వేగం, మహా వేగం. అటుపక్క మోటారు వాహనాల వేగం. మధ్యలో వేగం లేని సైకిలుతో డబ్బా వాలా. రైలుని అవిరింజనుతో ఎందుకు చూపించడం? అంటే ఆ కాలంలోనే జీవన వేగం పెరిగిపోయిందని సైకిలుకి సాపేక్షంగా చూపించడానికి. ఇక రోడ్డేమిటి నీళ్ళు పడకపోయినా అద్దంలా తళతళ లాడుతూ స్పష్టమైన నీడల్నిస్తోంది? ఇక్కడ రోడ్డుని కూడా హైలైట్ చేయడం. రైలు పక్కన ప్లాట్ ఫాం వుంటుంది. రోడ్డు వుండదు. అంటే రైలంత వేగంగా ఇప్పుడు రోడ్ల మీద పరుగులు దీస్తున్నారు....మహా యంత్రపు రైలు మార్గాలూ, మోటారు వాహనాల రోడ్లూ ఒక్కటే, మధ్యలో నువ్వేంటి ఇంకా సైకిలు మీదా...అన్న సెన్స్. ఇదీ సంధికాలంలో డబ్బావాలా స్ట్రగుల్.

ఈ పెయింటింగ్ ఫ్రేం అవతల కూడా కథ వుంటుంది. అటు లంచ్ బాక్సులందక ఇళ్ళకి ఫోన్లు చేసే ఉద్యోగుల ఆకలి కేకలుంటాయి. అక్కడింకెన్ని కథలు నడుస్తున్నాయో తెలీదు.
పెయింటింగ్ చెప్పే కథ, దాని ఫ్రేం అవతల వుండే కథలు కలిపి ఆలోచిస్తే స్టోరీ ఐడియాలు రావచ్చు. మనకి డబ్బా వాలాలుండరు. పాల వాడు కావచ్చు, ట్రాఫిక్ సమస్యని అధిగమించడానికి బైసికిల్ రైడ్ చేస్తున్న సాఫ్ట్ వేర్ అతను కావచ్చు. ఇంకెవరైనా కావచ్చు. ఒక క్యారెక్టర్ పుట్టడానికి కూడలి.
ఈ
పోస్టులో మరికొన్ని పెయింటింగ్స్ ఇచ్చాం ఎక్సర్ సైజుకి. ఈ ఎక్సైర్ సైజులో ఈ ప్రశ్నలు
వేసుకుంటే చాలు : పెయింటింగ్ కల్గిస్తున్న ఫీలింగ్ ఏమిటి? ఏ జ్ఞాపకాల్ని తట్టి లేపుతోంది?
పెయింటింగ్ ఏదైనా రహస్యం చెబుతోందా? ఫ్రేం అవతల కథలో ఏం జరుగుతూండొచ్చు? పెయింటింగ్ లో వున్న దృశ్యం కంటే
ముందు ఏం జరిగి వుండొచ్చు? ఈ దృశ్యం తర్వాత ఇంకేం జరగొచ్చు?
దృశ్యంలో మెయిన్ ఫిగర్ స్థానే క్యారక్టర్నే వూహించుకుంటే? క్యారక్టర్ కి ఇంతకి ముందే ఏదో జరిగి వుంటే దానికేం ఆలోచిస్తున్నాడు? ఎలా రియాక్ట్ అవబోతున్నాడు? క్యారక్టర్ కి ఈ సన్నివేశం తర్వాత ఏదో జరిగి జీవితం తలకిందులవబోతోందా? క్యారక్టర్ ఇప్పుడేదైనా రహస్యం బట్ట బయలు చేయబోతోందా? లేదా ఈ పెయింటింగ్ లో కన్పిస్తున్న దృశ్యమే క్యారక్టర్ కి ప్రతీ రాత్రి కలలోకి వస్తూ వెన్నాడుతోందా? దీనికేం కథ వుంది?...ఇలా ఎన్ని ప్రశ్నలైనా వేసుకోవచ్చు. ఈ ప్రశ్నల్లోంచి ఒరిజినల్ ఐడియాతో సినిమా కథకి పునాది పడొచ్చు. కావాలంటే ఇంటర్నెట్ లో ఇంకా చాలా పెయింటింగ్స్ వుంటాయి, ప్రాక్టికల్స్ కి వాడుకోవచ్చు.
―సికిందర్
Thursday, October 17, 2019
884 : సందేహాలు -సమాధానాలు
Q : యాక్షన్, థ్రిల్, రోమాన్స్
లాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ ఏవీ
పెద్దగా లేని ‘జోకర్’
అనే హాలీవుడ్ డ్రామా ఇక్కడ ఈ స్థాయిలో సక్సెస్ అవ్వడానికి కారణం
ఏంటి సర్? వీలైతే ఆ సినిమా
స్క్రీన్ ప్లే సంగతులు రాస్తారా? అలాంటి సీరియస్
డ్రామాలు మన దగ్గర వర్కవుట్ అవుతాయా?
―పి ఏ, AD
A : ‘జోకర్’ సైకలాజికల్ సబ్జెక్టు, పైగా యాంటీ హీరోతో డార్క్ మూవీ. తెలుగులో వర్కౌట్ కాదు. చూస్తున్నప్పుడు సాంతం దీన్నెంత ఏ స్టార్ ని వూహిస్తూ చూసినా ఇలాటి సబ్జెక్టు తెలుగులో బెడిసి కొడుతుందన్పించింది. ఇండియన్ ప్రేక్షకులు హాలీవుడ్ సినిమాల్ని చూసే దృష్టి వేరు. అందుకని ‘జోకర్’ ఇండియాలో కూడా హిట్టయ్యింది. దీని స్క్రీన్ ప్లే సంగతులు పనికిరావు. ప్లాట్ పాయింట్స్ నుంచి మాత్రం నేర్చుకోవచ్చు. ప్లాట్ పాయింట్ వన్, దీనికి పరిష్కారంగా ప్లాట్ పాయింట్ టూ రూల్స్ ని పాటిస్తాయి. సంఘటనల ఆధారంగా విజువల్ గా, కథని సుడిగాలిలా మలుపు తిప్పేవిగా - బలంగా, చిరస్మరణీయంగా రిజిస్టరవుతాయి (సిడ్ ఫీల్డ్ సూచించినట్టుగా). ప్లాట్ పాయింట్ వన్ మెట్రోలో రిచ్ యూత్ ని జోకర్ కాల్చి చంపే సీను, ప్లాట్ పాయింట్ టూ లో లైవ్ షోలో ఈ హత్యల్ని ఒప్పుకుంటూ యాంకర్ ని కాల్చి చంపే సీను. రెండూ షాకింగే, రెండూ అద్భుతాలే. నోట్ చేసుకోవాలి, నేర్చుకోవాలి.
Q : ‘సైరా’ గురించి స్క్రీన్ ప్లే సంగతులు చదువుతున్నాను. మీరన్నట్టు ఫీల్ లోపించడమే ప్రధాన సమస్య అని నాకూ అన్పించింది. కనీసం ఉరి తీసేటప్పుడైనా ఝాన్సీ లక్ష్మీబాయి చేత వ్యాఖ్యానం చేయించి వుంటే, చివర్లోనైనా ఫీల్ తో ముగిసేదని నా అభిప్రాయం. మామూలు రివెంజి యాక్షన్ సినిమా లాగానే ముగిసింది.
―కె. త్రినాధ్, దర్శకుడు
A : కంగనా రణౌత్ ఝాన్సీ లక్ష్మీ బాయిగా నటించిన ‘మణికర్ణిక’ లో అంతవరకూ లేని భావోద్వేగాల్ని, ఆమె పోరాట తంత్రాన్నీ ఉన్నట్టుండి చివర్లో తెచ్చి కలిపినా, పక్క పాత్రల చేత ఆమెని ఎంత కీర్తించినా కలిసిరాలేదు. కథలో అంతర్వాహినిగా వుండాల్సిన కథాంగాల్ని చివర్లో కలిపినంత మాత్రాన తప్పులు ఒప్పులై పోవు. బూతంతా చూపించి చివర్లో నీతి చెప్పే సినిమాల్లా వుంటుంది. ‘మణికర్ణిక’ లో కునారిల్లిన ఝాన్సీ లక్ష్మీ బాయి ‘సైరా’ తో ఫీలయ్యేంత కోలుకోలేదు. లేక ఫీలయ్యేట్టు ‘సైరా’ ఫ్లాష్ బ్యాక్ చెప్పడానికి ప్రాంతీయేతురాలైన ఆమెకి ఇక్కడి ఫీలింగ్స్ తెలియకపోయి వుండాలి. ‘సైరా’ లో ఫీల్ మిస్సవడానికి కథ చెప్పిన ఝాన్సీ లక్ష్మీ బాయే కారణం తప్ప, మేకర్స్ కే సంబంధంలేదు.
Q : చాలామంది యంగ్ దర్శకులు ఏం సినిమా తీయాలో తెలియక కంగారు పడుతున్నారు. అయోమయంలో వున్నారు. రోమాంటిక్ థ్రిల్లర్, రోమాంటిక్ థ్రిల్లర్ అంటూ కొందరు హడావిడి చేస్తున్నారు. ఒకలాంటి స్తబ్దత ఏర్పడింది. ఏం సినిమా తీయాలో తెలియనంత అమాయకంగా తయారయ్యారు.
―దర్శకుడు
A : చేసుకున్న వారికి చేసుకున్నంత అనుకోవచ్చు. గత ఇరవై ఏళ్లుగా ఇంకో టాలెంట్ లేకుండా రోమాంటిక్ కామెడీలే తీయడానికి వస్తూ రోమాంటిక్ కామెడీల చేపల మార్కెట్ తయారు చేశారు. ఇప్పుడు మార్కెట్ విసిగి సస్పెన్స్ థ్రిల్లర్స్ వైపు, లేదా ఇంకేదైనా ఔటాఫ్ బాక్స్ రియలిస్టిక్ వైపు చూస్తూంటే చేష్టలుడిగి చూస్తున్నారు. ఉన్నవాళ్లకి వీటిని తీసే టాలెంట్ లేదు, కొత్తగా వచ్చేవాళ్ళు ఇంకా రోమాంటిక్ కామెడీలే అనుకుంటూ వచ్చి చూసి ఆగిపోతున్నారు. లేదా మీరన్నట్టు రోమాంటిక్ థ్రిల్లర్స్ అంటున్నారు. మళ్ళీ వీటితో కూడా తమకి తెలిసిన రోమాంటిక్ కామెడీల్ని రుద్దడానికే. రోమాంటిక్ థ్రిల్లర్ వేరు, సస్పెన్స్ థ్రిల్లర్ వేరని తెలుసుకోలేరు. ఏమైనా ఈ పరిణామం చెత్తని ఊడ్చేయడానికే జరుగుతోంది. ఈ చెత్త తొలగిపోతే చైతన్య వంతులకి అవకాశాలు మెరుగవుతాయి. రోమాంటిక్ కామెడీల గుంపు వల్ల అవకాశాల్లేక ఇంతకాలం నష్టపోయారు. నిన్న ఇంకో దర్శకుడు కూడా ఇదే మాటన్నారు ఒక సీనియర్ నిర్మాత చెప్పినట్టుగా - డిఫరెంట్ గా ఆలోచించే తనకి ద్వారాలు తేర్చుకునే కాలం వచ్చేసిందని.

Tuesday, October 15, 2019
883 : స్క్రీన్ ప్లే సంగతులు -2
సైరా కాల్పనిక డిజైనర్ చారిత్రక
పాత్ర ప్రయాణం ఈ క్రమంలో వుంటుంది : పుట్టుక, పెరుగుదల, రేనాడు బాధ్యత, ప్రేమ,
పూర్వపు పెళ్లి, బ్రిటిష్ దౌర్జన్యాలు, బ్రిటిషర్లపై తిరుగుబాటు, నేరస్థుడుగా
ముద్ర, పోరాటం, లొంగు బాటు, ఉరితీత. ఈ 11 దశల్లోని మొదటి 5 ఐదు దశల్లో బిగినింగ్ విభాగం
వుంటుంది. ఎప్పుడైతే కరువు కాటకాల్లో శిస్తు వసూళ్ళకి బ్రిటిష్ దొరలు దౌర్జన్యాలు
చేస్తూంటారో, సైరా తిరగబడతాడు. ఈ సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పనలో భాగంగా, ఎప్పుడైతే
ఒక పేద రైతు భూమిని ఆక్రమించుకోవడానికి బ్రిటిష్ దొర ఎత్తుగడ వేస్తాడో, అప్పుడు
సైరా ముఖా ముఖీ అయి అతణ్ణి తరిమికొట్టి గట్టి వార్నింగ్ ఇస్తాడో, అప్పుడు ప్లాట్
పాయింట్ వన్ వస్తుంది. సైరాకి బ్రిటిషర్లతో అమీతుమీకి గోల్ ఏర్పడుతుంది. దీంతో బిగినింగ్
విభాగం ముగుస్తుంది. ఇది ఝాన్సీ లక్ష్మీ బాయి పాత్ర ఫ్లాష్ బ్యాకుగా చెప్పడం
ప్రారంభించిన బిగినింగ్ విభాగపు కథ.
ఈ స్క్రీన్ ప్లే సంగతుల్ని రిపీట్ ఆడియన్స్ ని రాబట్టడానికి వలసిన డైనమిక్స్ దృష్ట్యా మాత్రమే చెప్పుకుందాం. ఇది సుప్రసిద్ధ పరుచూరి బ్రదర్స్ కి, ప్రసిద్ధ సురేందర్ రెడ్డికీ తెలియదని కాదు. ఇంకేదో తెలియజెప్పాలనీ కాదు. అంత సీన్ మనకి లేదు. అయితే సైరా తో కొట్టొచ్చినట్టు కన్పిస్తున్న దృశ్యం ఏమిటంటే రిపీట్ ఆడియెన్స్ సమస్యే. ఒకసారి చూసిన ప్రేక్షకులు ఇంకోసారి చూసేందుకు రాకపోవడం. సైరాకి రిపీట్ ఆడియెన్స్ అవసరమెందుకుందో రెండు కారణాలు కిందటి వ్యాసంలో చెప్పుకున్నాం. ఇప్పుడా రిపీట్ ఆడియెన్స్ మైనస్ అవడానికి కారణమైన మేరకు స్క్రీన్ ప్లే సంగతులు చూద్దాం. దీనికి కొంతమందిని ఓరల్ సర్వే చేస్తే, రెండో సారి ఎందుకు చూడలేమో చెప్పలేక పోతున్నారు. ఫీలైతేగా చెప్పగల్గడానికి. ఫీల్ కల్గిస్తే మళ్ళీ చూడాలనే అంటారు.

***
బిగినింగ్ విభాగమనేది మిగతా కథకి ముఖచిత్రం లాంటిది. దీన్ని
సెట్ చేస్తేనే మిగతా కథ దీని సరళిలో సాగిపోతుంది. దీని ఎత్తుగడే భారంగా వుంటే,
మిగతా కథా బోలెడు బ్యాగేజీతో భారంగా సాగుతుంది. సైరా పాత్రకి చాలా బ్యాగేజీ వుంది.
పుట్టుకకి సంబంధించిన వృత్తాంతం సహా. చుట్టూ బోలెడు పాత్రలు సహా. సోలోగా కాకుండా
ఎప్పుడూ క్రౌడ్ లో ఇరుక్కుని వుండడం సహా. ఎవేగా సింగిల్ ఫేస్ టు ఫేస్ యాక్షన్
కాకుండా, గుంపు పోరాటాలు సహా. ప్రారంభ దృశ్యాలతో ఎత్తుగడ ఏదో పౌరాణిక సినిమా
చూస్తున్న జానరేతర ఫీలింగ్ నిస్తుంది. ‘ముత్యాల ముగ్గు’ కూడా ఉత్తర రామాయణం కథే.
దాన్ని అద్భుత రసం (అడ్వెంచర్) తో ఎంత ఎవర్ గ్రీన్ గా తీశారు. సైరా చరిత్రని ఈ
తరానికి చెబుతున్న కథగా చెబుతున్నప్పుడు యూత్ అప్పీల్ అందులో భాగమవుతుంది. యూత్
అప్పీల్ ని భాగం చేసుకున్నప్పుడు ఎత్తుగడ డైనమిక్స్ ని కోరుకుంటుంది, నస లేకుండా నేరుగా
కథలోకి వెళ్ళిపోవడాన్ని డిమాండ్ చేస్తుంది.
ఉదాహరణకి లక్ష్మీబాయి తన వ్యాఖ్యానంతో సైరా ఫ్లాష్ బ్యాక్ ప్రారంభించినప్పుడు, డైనమిక్స్ కి రెండు పార్శ్వాలుంటాయి. ఒక పార్శ్వంలో బ్రిటిష్ అధికారి, ఇంకో పార్శ్వంలో ఎదుగుతున్న సైరా. ఎక్కడో వున్న బ్రిటిష్ అధికారి డేగ కన్నుతో క్రూరంగా విహంగ వీక్షణం చేస్తూంటే, ఇంకెక్కడో ఎదుగుతున్న నునులేత సైరా, గురువు గోసాయి వెంకన్నతో కత్తి తిప్పుతూ శిక్షణ పొందే దృశ్యాలు. ఎందుకిలా? ఎందుకంటే జానర్ మర్యాద. డల్ గా ప్రారంభించకుండా, చైతన్యాన్ని నింపే డైనమిక్స్ తో హిస్టారికల్ కథకి ఓపెనింగ్ ఇమేజి. ఈ ఒక్క ఓపెనింగ్ ఇమేజిలోకి మొత్తం కథ ఇంకిపోతుంది. ఈ బిందువులో ఇంకిన కథ ఎక్కడ బిగ్ బ్యాంగ్ తో ఎలా బ్లాస్ట్ అయి బహుముఖాలుగా విస్తరిస్తుందన్న సస్పెన్స్ ని సృష్టిస్తుంది. ఇది యూత్ అప్పీల్, నేటి తరానికి చెప్పేకథ, మార్కెట్ యాస్పెక్ట్ తో క్రియేటివ్ యాస్పెక్ట్.

ఓపెనింగ్ ఇమేజి ఇలాగే ఎందుకుండాలి? ఎందుకంటే బ్రిటిష్ అధికారి సైరాని వెంటాడి వేటాడి ఉరి తీయించాడు. అందుకని అతను పులి, సైరా మేక. అందుకే అతడి విహంగ వీక్షణం - మేకపిల్లలా సైరా శిక్షణ. ఎంత ఐరనీ. ఎంత డేంజర్ ఫీలవుతారు ఈ ఓపెనింగ్ ఇమేజితో.
ఏకంగా యాక్షన్ సీన్ తో హిస్టారికల్ కథని ఎత్తుకోవడం. వివిధ పోరాట కళల్లో గురువుతో శిక్షణ పొందుతున్న సైరా, మాంటేజెస్ తో క్రమంగా ఎదుగుతూ, చిరంజీవి రూపం ధరించగానే -అటున్న అమితాబ్ బచ్చన్ తో కత్తిపోరాటం చేస్తూంటే - ఎత్తుగడే ఈ ఇద్దరు సూపర్ స్టార్స్ కి ఎటాచ్ మెంట్ ఇచ్చేస్తూ ఓపెనింగ్ ఇమేజిని పరాకాష్టకి తీసికెళ్ళి అచ్చు గుద్దితే, ఇక ఫ్యాన్స్ నుంచి వచ్చే రెస్పాన్స్ ఎలావుంటుందో వూహించుకోవచ్చు. దిసీజ్ డైనమిక్స్. అంటే బ్రిటిష్ అధికారి వర్సెస్ సైరాగా, హిస్టారికల్ పోరాట కథగా, కాన్సెప్ట్ విజువలైజ్ అయిపోయే ఈ ఓపెనింగ్ షాట్స్ తో, వెంటనే ప్రేక్షకుల్ని లాక్ చేసేసే మ్యాథమేటిక్స్. ఇది నేటి కాలపు సినిమాకి స్క్రీన్ ప్లే రచన. ‘శంకరాభరణం’ లో ఎంత విజువల్ స్టోరీ టెల్లింగ్ వుంటుంది వెర్బల్ స్టోరీ టెల్లింగ్ గాకుండా?
క్లుప్తతే చారిత్రిక కథకి ఆభరణం. దీనివల్ల కొన్ని పాత్రలకి, సంఘటనలకి చోటు దక్కకపోవచ్చు. ఫర్వాలేదు. కథలో తలెత్తబోయే సంక్షోభంతో సంబంధంలేని పాత్రలు, సంఘటనలు వాటికవే ఎడిట్ అయిపోతాయి. ఏ వ్యక్తికీ పుట్టిందగ్గర్నుంచీ జీవితం చరిత్ర కాదు. జీవితాన్ని మార్చేసే సంఘటన దగ్గర్నుంచే చరిత్ర. మహాత్మా గాంధీని దక్షిణాఫ్రికాలో రైల్లోంచి తోసేసినప్పట్నుంచే చరిత్ర. ఆయన ఎక్కడ పుట్టాడు, ఎలా పెరిగాడు, అమ్మ ఏం చెప్పింది, నాన్న ఏం చెప్పాడూ చరిత్ర కాదు. అది వేరే ఫ్యామిలీ డ్రామా. హిస్టారికల్ జానర్ కాదు. దీన్ని దృష్టిలో పెట్టుకోకపోవడం వల్ల తెరమీదికి చిరంజీవి రావడం బాగా అలస్యమైపోయింది, ఆలస్యమయ్యాక వచ్చినప్పుడు కూడా ఎంట్రీ ఫ్యాన్స్ కి హుషారివ్వ లేకపోయింది. ధ్యానం చేసుకుంటున్న శివభక్తుడిగా సాత్విక దర్శనం. ఈ భక్తి ఇంకెక్కడా పాత్రవహించలేదు. ఉరితీసేప్పుడు కూడా శివనామ స్మరణ లేదు. అక్కడ కూడా శాంతంలేదు. అదే రౌద్రం, అదే యాక్షన్. సింగిల్ ఎమోషన్. ‘లయన్ ఆఫ్ ది డెజర్ట్’ లో గిరిజన యోధుడు ఒమర్ ముఖ్తార్ ని ఉరి తీసేప్పుడు దైవాన్నిస్మరించుకుంటాడు. ఇది సహజ ప్రక్రియ. ఫీల్. కళ్ళు చెమర్చడానికి వీలిచ్చే, కదిలించే అంతిమ విషాదం.
***
ఇలా రెండొందల
యాభై కోట్ల సినిమా ఎలా తీయాలో కంప్యూటర్ ముందు కూర్చుని ఒకటే రాసేస్తున్నాడన్పించవచ్చు.
ఇలా రాయడానికైనా బోలెడు చూడాలి, చదవాలి. ఆ చూసింది, చదివింది అప్లయి చేసి రాయాలి. రాయడమంటే సొంత అభిప్రాయాలని
రుద్దడం కాక, నిదర్శనాల్ని ఏకరువు పెట్టడం.
సైరాకి ఇద్దరు అతివలతో మొదటి డైనమిక్స్ బావున్నాయి. ఒక అతివకి తాళి కట్టాక, ఇంకో అతివతో ఎప్పుడో చిన్నప్పుడు పెళ్ళయిందని తెలియడం. తెలిశాక ఆమే వుంటుంది, నువ్వూ వుంటావని ఇద్దరికీ బలంగా చెప్పలేకపోవడం మాత్రం డైనమిక్స్ ని బలహీనపర్చింది. ఫీల్ ని పోగొట్టింది. ఇక ఇరుగు పొరుగు పాలెగాళ్ళ డైనమిక్స్ సరిగ్గా కుదరకపోవడానికి వాళ్ళ పాత్రల్ని కలుపు మొక్కల్లా భావించడం కారణం. పెరగనిస్తే సైరాని మింగేస్తాయని.
ఇక ఈ బిగినింగ్ విభాగంలో తర్వాతి కథకోసం అనేక లీడ్స్ ఇచ్చారు. సైరా జలాసనం సీను ఒకటి. ఇది ఎందుకంటే, క్లయిమాక్స్ లో బ్రిటిష్ దళాల్నుంచి తప్పించుకునే సీనుకి లాజిక్ కోసం. అలాగే కార్తీక పౌర్ణమి నాడు దీపం వెలిగించే ఆచారంతో ఇంకో సీను. ఇదెందుకంటే, క్లయిమాక్స్ లో మళ్ళీ దీపం వెల్గించ డానికి వెళ్ళినప్పుడు పట్టుబడే సీన్‌ని కన్విన్స్ చేయడానికి. ఒక దర్శకుడున్నారు. ఏదైనా చెప్తే వెంటనే ఆయన ముందు కథతో పోల్చి చూసుకుంటారు - అక్కడ మ్యాచ్ అవుతుందా లేదా అని. ఆయన ముందు కథ దృష్ట్యానే కథ ఆలోచిస్తారు. అక్కడ మ్యాచ్ కాకపోతే, స్పూన్ ఫీడింగ్ లా వుంటే, వ్యతిరేకంగా వుంటే, తీసేస్తారు. ఇదొక విధమైన ఎడ్యుకేషన్.
ఇలాటి స్పూన్ ఫీడింగ్ సీన్లలో కొన్ని ఈ బిగినింగ్ విభాగం లోని పైన చెప్పుకున్న రెండు సీన్లు. వీటిని తీసేసి నేరుగా క్లయిమాక్స్ లోనే పెట్టుకోవచ్చు. అక్కడ అప్పుడవి కొత్తగా అన్పిస్తాయి. మూవీ రన్ మొనాటనీ అన్పించకుండా రీఫ్రెష్ అవుతుంది కూడా. ఇలాటి చాలా సీన్లు లీడ్ గా ఇవ్వడం వల్ల ఏమయిందంటే, సైరా పాత్రని పరిచయం చేయడానికి, లేదా నిర్వచించడానికి, ఒక స్పష్టత లేకుండా క్యారక్టరైజేషన్ కి చాలా చాలా విషయాలు చెప్పడం, సమాచారమివ్వడం, చాలా చాలా బ్యాగేజీ తగిలించడమయింది.
సుమారు గంటపాటు సాగే ఈ బిగినింగ్ విభాగంలో, హిస్టారికల్ జానర్ లక్షణమైన సస్పెన్స్ ని క్రియేట్ చేసే ఒక్క సీనూ లేదు. ఒక్క సీను ప్రిమానిషన్ గా లేదా ఫోర్ షాడోయింగ్ గా వేసి వుంటే, అది అప్పటికపుడు ఆ క్షణాన సస్పెన్స్ ని క్రియేట్ చేస్తూ బోల్డు ఫీల్ తో, ఆందోళనతో ప్రేక్షకుల్ని కూర్చోబెట్టేసేది. కథనమంటే ప్రశ్న రేకెత్తించడం, జవాబు నాపడమే. ఈ బిగినింగ్ విభాగంలో వృధా అయిన కార్తీక పౌర్ణమి నాడు సైరా దీపం వేల్గించే సీనుతో దీన్ని సాధించవచ్చు. సైరా దీపం వెల్గించాక అది టప్పున ఆరిపోవడంతో.
వెల్గించిన దీపం ఆరిపోవడం సైరాకి అపశకునం (ప్రిమానిషన్), కథనానికి పరిణామాల హెచ్చరిక (ఫోర్ షాడోయింగ్). ఇది సృష్టించే సస్పెన్స్, ఫీల్ మామూలైనవి కావు. మళ్ళీ క్లయిమాక్స్ లో ఇదే దీపం వెల్గిస్తున్నప్పుడు ఆ సస్పెన్స్ టెర్రర్ గా మారి ఉత్కంపఠ రేపే ఫీల్ కి దారితీస్తుంది. ఒక సీను వేస్తే అది కథకుపయోగాపడాలి, లీడ్ కోసం స్టేల్ గా వేసుకోవడం కాదు, వృధా చేసుకోవడం కాదు. ఆలోచించి కథనం చేసినప్పుడు, ఆలోచిస్తూ అనుభవిస్తూ కథనం చూడ్డం సాధ్యమవుతుంది. ఆలోచనకి తావివ్వని, అనుభవానికి వీలివ్వని కథనం జవజీవాల్లేని యాంత్రికమే.
***
ప్రతినాయకులైన బ్రిటిష్ పాత్రలలో కూడా ఫీల్ కన్పించదు.
కమర్షియల్ సినిమా విలన్ అరుపులే, వీరంగాలే. సైలెంట్ గా సైరా చాపకిందికి నీళ్ళు
తెచ్చే కుయుక్తులు కన్పించవు. దొంగదెబ్బ తీసే సస్పెన్స్ వుండదు. ఓపెన్ గా - వెళ్ళండి
వాళ్ళని తన్నండి - లాంటి డైలాగులతో
నిస్సారంగా అరవడంగానే వుంది ఎంతసేపూ. వాళ్ళు తెలుగు సినిమా విలన్స్ కాదు, బ్రిటిషర్స్.
బ్రిటిష్ మిలిటరీ పెద్దల ప్రవర్తన ఎలా వుంటుందో తెలుసుకోవడానికి ఆ బ్రిటిష్,
హాలీవుడ్ సినిమాలున్నాయి.
ప్లాట్ పాయింట్ వన్ సీనుగా సైరా ముఖాముఖీ సవాలు విసిరి జూనియర్ బ్రిటిష్ అధికారిని తోకముడిచి పారిపోయేలా చేసే ఘట్టంగా వచ్చింది. కానీ చరిత్రలో ఉయ్యాలవాడని ముందుగా పిల్చి మాట్లాడినట్టుగా వుంది. ఇది సహజ ప్రక్రియ. చర్చలు విఫలమైతేనే పోరాటాలు మొదలవుతాయి. అలా బ్రిటిష్ సీనియర్, జూనియర్ అధికారులకీ సైరాకీ ముందుగా ఒక చర్చల ఘట్టం వుండాల్సింది. అప్పుడు ఎలాగూ విఫలమయ్యే చర్చల ఘట్టంలో సైరా పాత్రకి గోల్ ఎలిమెంట్స్ సమకూరి కథ బలీయమయ్యేది. కోరిక, పణం, పరిణామాల హెచ్చరిక, ఎమోషన్ అనే గోల్ ఎలిమెంట్స్. బ్రిటిషర్లతో ముఖాముఖీ చర్చల ఘట్టం వల్ల సైరాలోని దౌత్య, నేతృత్వ, రాజనీతి లక్షణాలు వ్యక్తమయ్యేవి. రాజకీయంగా పాత్రేమితో అర్ధమయ్యేది. కరువు కాటకాల్లో కూడా పన్నులు ఎందుకు కట్టాలో, కట్టకూడదో, ఈ సమావేశపు ఎజెండా. ఆ నాటి నుంచీ రాయలసీమ కరువు సీమేనన్నబ్రతుకు చిత్రం ప్రేక్షకులకి ఎస్టాబ్లిష్ అవ్వాలి, ఫీలవ్వాలి. (..the hardest part is making a story set in the past resonate with today’s audiences …Ironically, however, what makes a period picture commercially viable in today’s market, whether it’s a TV mini-series or feature movie, is not covering the same old story but finding something new ― Jon James Miller). ఈ సమావేశంలో కూడా రౌద్రంగా మాస్ అరుపులు అరవకుండా,హూందాతనంతో ఆనాటి రేనాడు రాచమర్యాదలెలా వుండేవో చిత్రించి, చర్చల్ని విఫలం చేస్తే, దీని ఫలితంగా బ్రిటిషర్లతో పరిణామాలెలా వుంటాయో, సైరా తీసుకుంటున్న రిస్క్ ఎంత అపాయకరమో ప్రేక్షకులు ఫీలయ్యేట్టు చేస్తే, సైరా గోల్ ఎలిమెంట్స్ సమకూరి బలమైన కథ పుట్టేది. ఈ నేపధ్యంలో యాక్షన్, జూనియర్ అధికారిని తరిమికొట్టడం వగైరా సైరా తెగింపుతో రియల్ అడ్వెంచర్ కి అద్భుతంగా తెరతీసేది.
(సశేషం)
―సికిందర్
Sunday, October 13, 2019
882 :
హాలీవుడ్ మెగా దర్శకుడు క్రిస్టఫర్ నోలన్ సర్ప్రైజ్ ఇచ్చాడు. అక్టోబర్ 2 న
విడుదలైన ‘జోకర్’ చూసేందుకు వెళ్ళిన ప్రేక్షకులకి తన రాబోయే ‘టెనెట్’ టీజర్ తో
ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఆన్ లైన్లో విడుదల చేయకుండా, లీక్ కానివ్వకుండా, థియేటర్లకే
పరిమితం చేసిన ఈ టీజర్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. “Time has come for a new protagonist”, “Time has come for a new kind of mission.” అని రెండు క్యాప్షన్ లిస్తూ కంటెంట్ పరంగా మూవీ పట్ల చాలా కుతూహలం
రేకెత్తించాడు. కొత్త కథానాయకుడు రావాల్సిన సమయం వచ్చిందంటూ, కొత్త లక్ష్యాన్ని
చేపట్టే సమయం కూడా వచ్చిందంటూ జాన్ వాషింగ్టన్ నడిచి వస్తూండగా చూపించాడు. గన్ షాట్
రంధ్రమున్న అద్దం వెనకాల వాషింగ్టన్... ఈ టీజర్ ని ఇంతకంటే రివీల్ చేస్తే
స్పాయిలర్ అవుతుంది. థియేటర్ కెళ్ళి చూసి తెలుసుకోవాల్సిందే. నోలన్ విసిరిన పై రెండు
సవాళ్లు మాత్రం వెంటాడేవే. కొత్త కథానాయకుడా? అతనెలా ఎలా వుంటాడు? కొత్త లక్ష్యమా?
అదెలా వుంటుంది? మూస కథా నాయకుల్నీ, మూస కథల్నీ తెగ చూసి వున్న మనకి రిలీఫ్ గా సంభవామి
యుగే యుగే అన్నట్టు సమ్ థింగ్ ఏదో గట్టిగా జరగాలనే ఎదురుచూస్తున్నాం...నోలన్
జరిపిస్తాడని ఆశిద్దాం.
నోలన్ చర్యతో ప్రపంచవ్యాప్తంగా జవాబు దొరకని ఇంకో ప్రశ్నేమిటంటే, ఎప్పుడో ఒక జీవిత కాలం తర్వాత జులై 17, 2020 న విడుదల పెట్టుకుని, ‘టెనెట్’ కి ఇప్పట్నించే టీజర్ ఏమిటాని! పోతే, గత నెలే ముంబాయిలో కొంత షూటింగ్ ముగించుకున్నాడు. ఆ షూటింగులో భాగంగా రాత్రి పూట ఎత్తయిన భవనం మీంచి దూకే దృశ్యాన్ని ఒక ముంబయికార్ వీడియో తీసి ఇన్స్టాగ్రామ్ లో పెట్టేశాడు. టీజర్ లీక్ కాలేదు, మూవీ లీకైంది? అన్నట్టు ఈ ‘టెనెట్ ‘ టీజర్ తో ‘జోకర్’ కి ప్లస్ అయిందా, లేక ‘జోకర్’ తో ‘టెనెట్’ కి పబ్లిసిటీ వచ్చిందా? ఈ వ్యూహ మేమిటో టాలీవుడ్ కూడా అమలు చేయొచ్చేమో...ప్రెస్ మీట్ పెట్టి టీజర్స్ ని మీట నొక్కి యూట్యూబ్ లో వూరూ వాడా చేసేయకుండా? ఆన్ లైన్ కోలాహలంలో ఏ టీజర్ అడ్రసు ఎక్కడ గల్లంతో ఎవరికీ తెలియడం లేదు. ఫలానా ‘సైరా’ తో ‘వెంకీమామ’ స్వీట్ టీజర్ థియేటర్లో మాత్రమే చూడండి...అంటే ఎలా వుంటుందో నోలన్ ఫార్ములాతో ఒక ట్రయల్ లాంటిది వేసి చూడొచ్చేమో...
‘జోకర్’ కథాకాలం 1981 అయినా నేటి వ్యవస్థకి కూడా అద్దం పడుతుంది దేశాల కతీతంగా. ఇతను నవ్వించే జోకర్ కాదు, నవ్వకూడని సమయాల్లో నవ్వొచ్చి నవ్వుకునే, తన్నులు తినే జోకర్. ఒక మెడికల్ కండిషన్ వల్ల. ఆ నవ్వు వెనకాల వ్యవస్థ మీద కసి వుంది. 1980 ల నాటి మన సినిమాల్లో యాంగ్రీ యంగ్ మాన్ లాంటి వాడే ఇతను. కాకపోతే ఇతడి నవ్వు వెనకాల యాంగ్రీ వుంది. మన యాంగ్రీ యంగ్ మాన్ సినిమాల్లో లాగే ఇతను అక్రమ సంతానం. చిన్నప్పుడు ఇతడి తండ్రి తల్లిని మోసం చేసి వెళ్ళిపోయాడు. ఆ తల్లి గురించి కూడా ఒక రహస్యం తెలిసింది. వీళ్ళిద్దర్నీ ఎలా డీల్ చేశాడన్నది ఒక పక్క. ఇంకోపక్క కామెడీ షోలలో తనని అవమానపరుస్తున్న యాంకర్ అంతు ఎలా చూశాడన్నది. “అరె బాబూ యాంకర్, బయట లోకమెలా వుందో చూశావా? నువ్వెప్పుడైనా స్టూడియో వదిలి బయటికొచ్చావా? స్టూడియోలో నల్గుర్ని కూర్చోబెట్టుకుని లడాయిపెట్టి ఒకటే అరిపిస్తావా? డీసెన్సీ అనేదే చచ్చి పోయింది...అందరూ నీలాగే ఆలోచించాలా? నా లాగా నువ్వు ఆలోచించవా?” అని గన్ తీసి ఢామ్మని షూట్ చేసి పారేస్తాడు యాంకర్ని. అదే అతడి చివరి లైవ్ షో!
చివరికి సైకియాట్రిస్టు ఎందుకు నవ్వుతున్నావని అడిగినప్పుడు, జోకు గుర్తొచ్చి అంటాడు. చెప్పమంటుంది. నీ కర్ధంగాదంటూ ఫినిషింగ్ టచ్ ఇస్తాడు. అంటే ప్రజల మనసులో ఏముందని కాదు, తాము అనుకుంటున్నది ప్రజల మీద రుద్దాలనే పాలకులు. నగర పరిస్థితి సామాజికంగా, ఆర్ధికంగా బాగాలేదు. ఉపాధిలేక ఆ కోపాన్ని యువకులు ఇతరుల మీద మూక దాడులు జరుపుతూ తీర్చుకుంటున్నారు. అలాటి బాధితుల్లో ఒకడు జోకర్ కూడా. సామాజిక, ఆర్ధిక న్యాయాలు లేని నగరమెంత కుళ్ళి కంపు కొడుతోందో సింబాలిక్ గా స్తంభించిపోయిన పారిశుద్ధ్య పనులు. నగరమే ఒక చెత్తకుండీ. భరించలేక ఇక పౌరులు ప్రభుత్వాన్ని వెక్కిరిస్తూ జోకర్ మాస్కులు తగిలించుకుని హేళనగా ప్రదర్శనలు. ఇది ప్రభుత్వం మీద కాదు, సంపన్నుల మీద జరుగుతున్న దాడులని యాంకర్ మసిపూసే ప్రయత్నం. ఒక సంపన్నుడు నగర మేయర్ గా పోటీకి దిగుతాడు. జోకర్ ఒక సోషల్ కామెంట్. నాటి కథాకాలాన్నిచూపిస్తూ సింబాలిక్ చేశారు. ‘జోకర్’ గా నటించిన జోక్విన్ ఫీనిక్స్ ఆస్కార్ మెటీరియల్. యాంకర్ గా నటించిన రాబర్ట్ డీ నీరో సీనియర్ స్టార్. దర్శకుడు టాడ్ ఫిలిప్స్. ఎబిపి ఛానెల్ మాజీ యాంకర్ పుణ్య ప్రసూన్ బాజ్ బాయ్, ‘జోకర్’ పై హిందీలో చేసిన లోతైన విశ్లేషణ కోసం ఇక్కడ యూట్యూబ్ క్లిక్ చేయండి. ‘జోకర్’ ఇప్పుడు గ్లోబల్ టాపిక్.
గతవారం కొత్త హీరో హీరోయిన్లతో ‘ఎవరికీ చెప్పొద్దు’ అనే ఇంకో పాత ప్రేమ డ్రామా విడుదలైంది. ఇందులో కొత్త దర్శకుడికి కులాలతో పాత కథ గుర్తొచ్చింది. యువత కోసం ఎలాటి సినిమా తీస్తున్నాడో గుర్తుకు రాలేదు. దిల్ రాజు విడుదల చేస్తూంటే దిల్దార్ గా యువత చూసేస్తారనుకున్నట్టున్నాడు. యువతకి కొత్త వాళ్ళతో ఏ చిన్నసినిమా అందం చందం ఏమిటో చూడకుండానే మోకాలొడ్డే యాంటీ వైరస్ సాఫ్ట్ వేర్ ప్రోగ్రామై వుంది. దాంతో వాళ్ళు ‘ఎప్పటికీ రానే రాము ఫో’ అని భీష్మించేసుకున్నారు. ఇలాటి చిన్న సినిమాల రిపోర్టు కార్డెలా వుందంటే, నూటికి 99 శాతం రివ్యూలకే నోచుకోవు. అన్నీలాలీ పాప్ సినిమాలే రివ్యూలతో ప్రమోట్ చేద్దామంటే. ఈ కులాల కథ చెప్పడానికి యూత్ అప్పీల్ ని మంటగలిపి, లాలిస్తూ హీరోయిన్ పుట్టిందగ్గర్నుంచీ ఎత్తుకున్నాడు. కథని ఇలా లాలిస్తూనే, పాలు పట్టిస్తూనే, అన్నప్రాసనాలు చేయిస్తూనే, అక్షరాలు దిద్దిస్తూనే, ఉ ళు ళు ళూ హాయీ అంటూ ఉయ్యాల్లో జోకొడుతూనే, అరగంట లాగాడు. దీనికి కొత్త హీరోనే నిర్మాత. హీరోయిన్ తండ్రికి బాగా మందమైన కులం కండువా. అక్కడ హీరో గారికి మండువా లోగిలి లేదు. ఎలా? ఏమో మనకి తెలీదు. మనం దర్శకుడంత సామాజిక ఇంటలెక్చువల్స్ ఏమీ కాము. ఇంటర్వెల్లో ఇంటి కొచ్చేస్తాం. ముందు రివ్యూలకైనా నోచుకునేట్టు తీయండ్రా నాయనా చిన్న సినిమాలు! వీటిలో కొత్త హీరో హీరోయిన్లతో, కొత్త నిర్మాతలతో, కొత్త దర్శకులకి ఎలాటి క్రియేటివ్ ఆటంకాలుండవు. సృజనాత్మకంగా ఇంత స్వేచ్ఛ ననుభవించే చోట్ల నుంచి కూడా ఈ మార్కెట్ వ్యతిరేక పాత రోతేమిట్రా బాబూ...

Saturday, October 12, 2019
881 : స్క్రీన్ ప్లే సంగతులు - 1
ఈ స్క్రీన్ ప్లే సంగతుల జాప్యానికి కారణం ‘సైరా’
పానిండియా స్పందనల వరకూ వేచి చూడాల్సి
రావడం. ‘సైరా’ స్క్రీన్ ప్లే సంగతుల్లో సినిమా కలెక్షన్స్ ని కూడా భాగం చేసి చెప్పుకోక
తప్పడం లేదు. సినిమా కలెక్షన్స్ ట్రేడ్ పండితులు
విశ్లేషించే సెక్షనే. కానీ స్క్రీన్ ప్లేలకి క్రియేటివ్ యాస్పెక్ట్ తోబాటు
మార్కెట్ యాస్పెక్ట్ ని కూడా ముందు చూడాలని చాలా స్క్రీన్ ప్లే సంగతుల్లో చెప్పుకుంటూనే
వున్నాం. అయితే ఇప్పుడు పానిండియా మూవీ అనే కొత్త ‘జానర్’ తెలుగులో మొదలవడంతో
ఇప్పుడు స్క్రీన్ ప్లేలకి మార్కెట్ యాస్పెక్ట్ ని కేవలం తెలుగు మార్కెట్ కే
పరిమితం చేసేయకుండా, ఇతర భాషల మార్కెట్లకి సైతం విస్తరించి చూడాల్సి వచ్చేలా
వుంది. 2015 లో ‘బాహుబలి’ 4 భాషల్లో విడుదలైనప్పుడు
పానిండియా మూవీ పదం వాడకంలోకి రాలేదు. 2017 లో ‘బాహుబలి -2’ కి కూడా పానిండియా
మూవీ పదం వాడలేదు. 2015 లో ‘కంచె’ నైతే దాని పానిండియా మార్కెట్ ని కూడా గుర్తించకుండా
కేవలం తెలుగులోనే విడుదల చేశారు. ఇటీవల ‘సాహో’ తోనే పానిండియా మూవీ అన్నపదం
పాపులరైంది. దీని తర్వాత ఇప్పుడు తెలుగు పానిండియాగా ‘సైరా’ ఐదు భాషల్లో
విడుదలైంది. ‘సాహో’ వేరు, అది యాక్షన్ మూవీ. దాని పానిండియా మార్కెట్ కి నేటివిటీ
సమస్య వుండదు. అది హిందీలో సేఫ్ అయింది. ‘సైరా’
లాంటి చారిత్రాత్మకం విషయం వేరు, దీనికి నేటివిటీ సమస్య వస్తుంది. దక్షిణాది
చరిత్రలు పానిండియా మూవీస్ గా ఉత్తరాది ప్రేక్షకులకి కనెక్ట్ కాలేవని ‘సైరా’ చెబుతోంది.
దక్షిణాది రాజకీయ ప్రాతినిధ్యాన్ని నార్తిండియా ఎప్పుడు గుర్తించింది గనుక. ఆ మాట
కొస్తే ‘సైరా’ కి దక్షిణాదిలో కూడా తమిళ
మలయాళ కన్నడ వెర్షన్స్ కనెక్ట్ కాలేదని కలెక్షన్లు చెబుతున్నాయి. అంటే దక్షిణాదిలో
కూడా చారిత్రక సినిమాలకి ఏ రాష్ట్రానికా రాష్ట్రం వరకే పరిమితమయ్యే నేటివిటీ సంకెళ్ళు
వుంటాయన్న మాట. ఒకప్పుడు శివాజీ గణేశన్ తో ‘వీర పాండ్య కట్ట బ్రహ్మన’ తెలుగులో డబ్
చేస్తే ఆడలేదు. శివాజీ గణేశన్ ఎంత గొంతు చించుకుని వీరత్వం ప్రదర్శించినా ఆడలేదు. దక్షిణాదిలో కూడా ఏ రాష్ట్రం వీరుడు ఆ రాష్ట్రంలోనే
అరచుకోవాలన్న మాట. అయ్యప్ప, భక్త కన్నప్ప, భక్త సిరియాళ లాంటి దేవుళ్ళ సినిమాలతో దక్షిణాది రాష్ట్రాలలో నేటివిటీ
సమస్య రాలేదు, రాబోదు కూడా. దైవ భక్తికి ప్రాంతాలతో పనిలేదు. స్థానిక వీరులకి
ప్రాంతాలే పరిమితులు. పానిండియా కాలేరు. ‘సైరా’ కాలేదు. దీంతో ‘ఆర్ ఆర్ ఆర్’ అనే పానిండియా తీస్తున్న ఎస్ ఎస్ రాజమౌళి వెంటనే స్క్రిప్టుని కొంత
‘నార్తీ కరిస్తున్నట్టు’ వార్తలు వచ్చాయి. అందులో అల్లూరి సీతారామ రాజు, కొమురం భీం
పాత్రలు ఢిల్లీలో కలుసుకున్నట్టు నార్తీ కరణ!
సౌతీకరణకే స్థానిక చరిత్రల మార్కెట్ లొంగడం లేదు. కొంత కథని నార్తిండియాకి బదలాయించినంత మాత్రాన ఇతర భాషల్లో నేటివిటీ వచ్చేస్తుందా? ఒక్కో భాష నుంచి ఒక్కో పాపులర్ నటుడ్ని పెట్టుకున్నా స్థానిక వీరుడితో ‘సైరా’ పానిండియా నేటివిటీ కష్టమైనట్టు కన్పిస్తూనే వుంది. సైరా పానిండియా కనెక్ట్ అవడానికి ఒక ప్రయత్నం చేశారు : ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి చరిత్రని ఝాన్సీ లక్ష్మీ బాయి చెబుతున్నట్టు కల్పన చేసి, ఫ్లాష్ బ్యాకుగా చూపించారు. ఆమె రికమెండ్ చేస్తోంది కాబట్టి మనం చూడాలన్నట్టుగా పానిండియా ఆడియెన్స్ ని బుజ్జగించాలని చూశారు. ఇది వర్కౌట్ కాలేదు. మూలంలో సార్వజనీనత లేనప్పుడు ఉపరితలంలో ముస్తాబులు ఊపిరి పోయలేవు. ఈ సమస్యకి పరిష్కారం ఇక లోకల్ చరిత్రలకి కొత్తగా పానిండియా జానర్ మర్యాదలేముంటాయో వాటిని కనుగొని, టేకప్ ఇండియా అంటూ దేశం మీదికి వదలడం. తెలుగు జానర్ మర్యాదలతో తీస్తే ఆలిండియా జానర్ మర్యాద అయిపోదు. కానీ ‘సైరా’ చరిత్రకి హిస్టారికల్ మూవీస్ జానర్ మర్యాదలతో చూసినా లోపాలున్నాయి. పానిండియాగా విఫలమైతే, తెలుగు మార్కెట్ కైనా సేఫ్ అవడానికి దీనికి పెట్టిన భారీ బడ్జెట్ భారమంతా ఒక్క తెలుగు మార్కెట్ పైనే ఇప్పుడు పడుతోంది. ఇంత మెగా బడ్జెట్ ని తెలుగు మార్కెట్ ఒక్కటే లాగ గలదా? లాగలేదు. అయినా ప్రయత్నించాలంటే రిపీట్ ఆడియెన్స్ వుండాలి. ఇంత ప్రతిష్టాత్మక చలన చిత్ర రాజం తీసినప్పుడు ప్రేక్షకులకి మళ్ళీ మళ్ళీ చూడాలన్పించేలా రసాత్మకంగా వుండాలిగా?
తెలుగు మార్కెట్ కైనా మళ్ళీ మళ్ళీ చూడాలన్పించేలా రసాత్మకంగా లేకపోవడమే ప్రధాన సమస్య. యాక్షన్, ఎమోషన్ తప్ప, ఫీల్ అనే అమృతపానీయం జాలువారలేదు. దీన్నెలా అధిగమించ వచ్చు? పైన చెప్పుకున్నట్టు ఇంకా ఇప్పుడే చెప్పలేని పానిండియా జానర్ మర్యాదలు కాకపోయినా (టేకప్ ఇండియా), కనీసం హిస్టారికల్ జానర్ మర్యాదల్ని పాటించి అధిగమించవచ్చు. ‘సాహో’ లాంటి యాక్షన్ సినిమాలకి పానిండియా జానర్ మర్యాదలు చెప్పుకోవచ్చు. కానీ స్థానిక వీరుల చరిత్రల్ని పానిండియా చేయడానికి ఆ వీరులే అడ్డు. కనుక కొత్తగా వీటి పానిండియా జానర్ మర్యాదలు నిర్ణయించడం అంత సులభం కాదు. హిస్టారికల్ మూవీస్ జానర్ మర్యాదల్ని ఆపాదించినా నేటివిటీ సమస్య తొలగదు. ఉత్తరాది రాష్ట్రాల్లో ఎవరికీ తెలీని, కాలగర్భంలో కలిసిన, పంజాబ్ కి చెందిన, హవల్దార్ ఇషార్ సింగ్ చరిత్రతో ‘కేసరి’ లాంటివి తీసినా చూస్తారు. తెలుగు నుంచి ఎంత ప్రముఖ చరిత్ర తీసినా ఉత్తరాదికే కాదు, ఇతర దక్షిణాది రాష్ట్రాలకీ పట్టదని ‘సైరా’ పానిండియా బాక్సాఫీసు రిపోర్టులు తేల్చి చెప్తున్నాయి. ఇప్పుడు రాబోయే ‘ఆర్ ఆర్ ఆర్’ తప్ప, స్థానిక చరిత్రతో ఇంకే పానిండియా మూవీస్ రాకపోవచ్చు కూడా. కనుక, వీటి జానర్ మర్యాదల (టేకప్ ఇండియా) చర్చ ఇప్పుడవసరం లేదు.
తెలుగు మార్కెట్ కే హిస్టారికల్ జానర్ మర్యాదల ప్రకారం ‘సైరా’ చూసినప్పుడు పెద్ద పెద్ద కందకాలు కన్పిస్తున్నాయి. రివ్యూ రాయడానికి ఈ సినిమా చూస్తున్నప్పుడే ఒక ‘లారెన్స్ ఆఫ్ అరేబియా’, ఇంకో ‘లయన్ ఆఫ్ ది డెజర్ట్’ రేంజికి ఫీల్ తో తీసికెళ్ళాలి కదా అన్పించక మానలేదు. ఎందుకు రోటీన్ తెలుగు మూస యాక్షన్ - ఎమోషన్ చట్రంలో పెట్టి తీసేశారు? పరుచూరి బ్రదర్స్ ఇచ్చిన స్క్రిప్టుని, ఈ తరం వారికి చెబుతున్న కథలా మార్చుకుని తీశానని దర్శకుడు సురేందర్ రెడ్డి చెప్పినప్పుడు, యాక్షన్ జానరేనా ఈ చరిత్రకి ఈ తరం కనెక్టయ్యే మార్గం? వీరుల చరిత్రలు తీయాలనుకున్నప్పుడు వాళ్ళ మీద ఏళ్లకేళ్ళు పరిశోధనలు మాత్రమే చేస్తే చాలదు, ఆ చరిత్రల్ని దృశ్యాత్మకంగా ఏవిజన్లో పెట్టి తీయాలన్న దానిపై కూడా బోలెడు చారిత్రక సినిమాల రీసెర్చి జరగాలి. మనకి తోచిన, మనకి తెలిసిన చట్రంలో పెట్టి తీసేస్తే కాదు. ఓపెనింగ్స్ వుంటాయి, రిపీట్ ఆడియెన్స్ వుండరు.

(స్క్రీన్
ప్లే సంగతులు సోమవారం)
―సికిందర్
―సికిందర్
Subscribe to:
Posts (Atom)