రచన -దర్శకత్వం : రాకేష్ శశి
తారాగణం : అల్లు శిరీష్, అనూ ఇమ్మాన్యుయేల్, వెన్నెల
కిషోర్, సునీల్
కథ : ఏలన్, సంగీతం: అనూప్ రూబెన్స్ (పాటలు),అచ్చు రాజమణి (నేపథ్య సంగీతం); ఛాయాగ్రహణం : తన్వీర్ మీర్
బ్యానర్స్ : శ్రీ తిరుమల ప్రొడక్షన్
ప్రైవేట్ లిమిటెడ్, GA2 పిక్చర్స్
సమర్పణ: అల్లు అరవింద్
నిర్మాతలు: ధీరజ్ మొగిలినేని, విజయ్ ఎమ్
విడుదల : నవంబర్ 4, 2022
***
2013లో ‘గౌరవం’ తో హీరోగా
ప్రవేశించిన అల్లు శిరీష్ ఆ తర్వాత నటించిన 4 సినిమాలూ కలిసిరాలేదు. మార్పు
లేకుండా రోమాంటిక్ సినిమాలు నటించడం ఒకటైతే, అల్లు అర్జున్
తమ్ముడిగా అభిమానుల్ని సృష్టించుకోక పోవడం రెండో కారణం. అయినా తిరిగి 2019 తర్వాత
ఇప్పుడు మరో రోమాంటిక్ నటిస్తూ ‘ఊర్వశివో రాక్షసివో’ తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. హీరోయిన్ అనూ ఇమ్మాన్యుయేల్ తో కొత్త తరహా
యూత్ రోమాన్స్ గా దీన్ని అభివర్ణించాడు దర్శకుడు రాకేష్ శశి. ఇతను 2018 లో
చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ తో ‘విజేత’ అనే సెంటిమెంటల్ తీశాడు. ఇది ఆడకపోయినా నిర్మాత అల్లు అరవింద్ ఇంకో
అవకాశమిచ్చారు. దీన్ని దర్శకుడు నిలబెట్టుకున్నాడా? ఈసారి శిరీష్
కి సక్సెస్ దక్కిందా? ఇవి తెలుసుకుందాం...
మధ్య తరగతికి చెందిన శ్రీకుమార్ (అల్లు శిరీష్) సాఫ్ట్ వేర్ ఇంజనీర్.
టైలరింగ్ చేసే తల్లి, ఎలక్ట్రికల్ షాపు నడిపే తండ్రీ
వుంటారు. తొందరగా పెళ్ళి చేయాలని తల్లి (ఆమని) ప్రయత్నాల్లో వుంటుంది. కానీ కుమార్
ఆఫీసులో సింధుజ (అనూ ఇమ్మా న్యూయెల్) ని వెంటపడి ప్రేమకి ఒప్పిస్తాడు. ఆమె ప్రోత్సాహంతో
ఆమెతో ఒక రాత్రి గడిపాక, పెళ్ళంటే ఇష్టం లేదని, పెళ్ళి లేకుండా కలిసి వుండచ్చని చెప్పేస్తుంది. దీంతో హర్ట్ అయిన కుమార్
ఆత్మహత్యాయత్నం చేస్తాడు. తర్వాత ఆమెతో సహ జీవనానికి ఒప్పుకుని ఇంటికి దగ్గర్లోనే ఆమెతో
మకాం పెడతాడు.
ఇప్పుడు తల్లిదండ్రులకి తెలియకుండా
సాగిస్తున్న వ్యవహారం ఎలా బయటపడింది? అప్పుడు తల్లిదండ్రులేం
చేశారు? తల్లి కోసం కుమార్ సింధుజని పెళ్ళికి
ఒప్పించుకోగల్గాడా? పెళ్ళి కంటే పారిస్ లో రెస్టారెంట్ తెరవాలనుకుంటున్న
సింధుజ ఏం నిర్ణయం తీసుకుంది? ఇదీ మిగతా కథ.
ఎలావుంది కథ
ఎలావుంది కథ
2018 లో తమిళంలో వచ్చిన ‘ప్యార్ ప్రేమ కాదల్’ కి
రీమేక్ ఇది. అతను పెళ్ళి అంటాడు, ఆమె పెళ్ళి లేకుండా ప్రేమ
అంటుంది. సాధారణంగా ప్రేమించిన హీరోయిన్ తో గడిపి హీరో మోసం చేసే సినిమాలుంటాయి. ఇందులో
రివర్స్ చేశారు. సింధుజ తనని ప్రేమిస్తున్న కుమార్ తో ఓ రాత్రి గడిపి ఇక చాలు
పొమ్మనే సినిమా ఇది. సెక్స్ ని క్యాజువల్ గా తీసుకోవాలంటుంది. ఆమె అమెరికాలో
పెరిగింది కాబట్టి ప్రేమా గీమా తెలియవనే సంజాయిషీ ఇచ్చుకున్నారు. ఐతే అమెరికాలో సెక్స్
ని ఎంజాయ్ చేసిందా అన్న ప్రశ్న వస్తుంది. కుమార్ తో గడిపి సెక్స్ చాలు పొమ్మందంటే ఆమె
క్యారెక్టరే సందేహాస్పదమవుతుంది. లోతుగా ఆలోచించకుండా పైపైన రాసేసి, కెమెరా పెట్టి బెడ్రూంలో తీసేస్తే ఇలాగే తయారవుతుంది పాత్ర.
ఇలా అమెరికాలో పెరిగింది కాబట్టి ప్రేమా గీమా తెలియవనే తెలివిలేని వివరణ ఇస్తూనే, ఆమెకి పారిస్ లో రెస్టారెంట్ తెరవాలన్నది కల కాబట్టి దానికోసం పెళ్ళీ పిల్లలూ సంసారం పక్కన బెట్టినట్టు మళ్ళీ చెప్పారు. ఇలా రెండు కారణాలెలా వుంటాయి. మొదటి కారణాన్ని బైపాస్ చేసి రెండో కారణం మీద నిలబడ్డారు. ప్రాబ్లం ఏమిటంటే ఇది కుమార్ కి తెలియదు. కథలో జరుగుతున్న విషయాలు ప్రధాన పాత్రయిన కథానాయకుడికే తెలియకపోతే కథెలా నడపుతాడు. సినిమా ఏం నిలబెడతాడు.
అంటే కథకుడు కథానాయకుడికి విషయం తెలియకుండా అడ్డు పడుతున్నాడు. తెలిస్తే కథ వేరే అయిపోతుంది. తెలిస్తే ఆమె పారిస్ కల నిజం చేయడానికే పూనుకుంటాడు తప్ప పెళ్ళి కోసం పట్టుబట్టడు. కాబట్టి కథానాయకుడ్ని హీరోయిన్ విషయాలు తెలియకుండా వుంచేశాడు. కథలో కథకుడు తలదూర్చి కథానాయకుడి కథ తను నడపడమంటే కథా నాయకుడ్ని పాసివ్ క్యారక్టర్ గా మార్చడమే. ఇలా కుమార్ పాసివ్ పాత్ర.
సరే, ఇంత రాడికల్ గా వున్న సింధుజకి ఎదుటి పాత్రగా కుమార్ సకల సుగుణాలతో కన్సర్వేటివ్ గా వుంటేనే కదా కథకి సంవాదం (కాన్ఫ్లిక్ట్) అనేది పుడుతుంది.
అలా హీరో కుమార్ ది అంత దేవదాసు ప్రేమో, అర్జున్ రెడ్డి ప్రేమో కాదు. అతను మ్యాడ్ లవర్ ఏమీ కాదు. ప్రేమలో మోసపోయి ప్రేక్షకుల సానుభూతి పొందగల్గేంత పాత్ర చిత్రణేమీ లేదు. టైటిల్ ప్రకారం సింధుజ వరకూ రాక్షసిగా బాగానే వుంది. కుమారే అమాయక చక్రవర్తిలా లేడు. సినిమాలో మొదటి నలభై నిమిషాల సేపు ఆమెని ప్రేమలో పడెయ్యడానికి సాఫ్ట్ వేర్ ఆఫీసు అనికూడా లేకుండా చేసే అల్లరి, కామేడీ, పోకిరీతనం ఇవన్నీ అతడ్ని క్లాసిక్ లవర్ గా, తర్వాత సున్నిత మనస్కుడైన ఓ భగ్న ప్రేమికుడిగా మనం ఫీలయ్యే అవకాశాన్ని లేకుండా చేశాయి.

1991 లో కమల్ హాసన్ నటించిన క్లాసిక్ ‘గుణ’ లో హీరోయిన్ ప్రేమ కోసం పిచ్చివాడై ఆమెని కిడ్నాప్ చేసేదాకా వెళ్ళే భావోద్వేగాలతో భగభగ మండిస్తాడు కమల్. ఇలా కుమార్- సింధుజల మధ్య ఇంటర్వెల్లో కాన్ఫ్లిక్ట్ కి, కుమార్ పాత్రేతర పాత్ర చిత్ర ణతో బలం లేకపోయాక, సెకండాఫ్ లో కుమార్ ఆమెతో సహజీవనానికే ఒప్పుకునే ప్లేటు ఫిరాయింపుతో, పూర్తిగా కాన్ఫ్లిక్టే లేకుండా చేశారు కథకి. హీరో మంచోడు, విలన్ మంచోడైతే ఇక కథేముంటుంది.
ఇలా ఇంటర్వెల్లోని కాన్ఫ్లిక్ట్ కూడా క్యాన్సిలై పోయాక, సెకెండాఫ్ లో వేరే కాన్ఫ్లిక్ట్ పుట్టించి ఇంకో నష్టం చేసుకున్నారు. ఫస్టాఫ్ ఒరిజినల్ కాన్ఫ్లిక్ట్ క్యాన్సిలై, సెకండాఫ్ డూప్లికేట్ కాన్ఫ్లిక్ట్ రావడం వల్ల స్క్రీన్ ప్లే అనే మధ్యకి ఫ్రాక్చరై, సెకండాఫ్ సిండ్రోమ్ అనే సుడిగుండంలో పడ్డాక, ఇక ఈ సినిమా ఫ్లాపవకుండా కాపాడే నాథుడే లేకుండా పోయాడు.
ఈ ఎత్తుకున్న తాజా కాన్ఫ్లిక్ట్ ఏమిటంటే, కుమార్ రహస్యంగా సాగిస్తున్న సహజీవనం తల్లిదండ్రులతో ఘర్షణగా మారిపోవడం. ఈ రోమాంటిక్ డ్రామా కాన్ఫ్లిక్ట్ ప్రేక్షకులాశించే విధంగా హీరోహీరోయిన్ల మధ్య కొనసాగాల్సింది పోయి- తల్లిదండ్రుల మీదికి షిఫ్ట్ అయి- జానర్ మర్యాదకీ, ఫీల్ కీ, యూత్ అప్పీల్ కీ, బాక్సాఫీసు అప్పీల్ కీ, మొత్తంగా మార్కెట్ యాస్పెక్ట్ కే దెబ్బ కొట్టేసే దుశ్చర్యగా మారింది. ఒక కథకి ఒకే కాన్ఫ్లిక్ట్ అన్న కామన్ సెన్సు కూడా లేకపోతే ఎలా? ఈమధ్య ఒక మేకర్ తో ఇలాంటిదే సమస్య- ‘సర్దార్ ‘లో లాంటి సమస్య. చెప్తే వినిపించుకోకపోతే ఏం చేస్తాం. కథలో ఒక కాన్ఫ్లిక్ట్ ఏర్పడిందంటే అదెన్నో భావోద్వేగాలతో ముడిపడి వుంటుంది. దాన్ని కొల్లగొట్టి ఇంకో కాన్ఫ్లిక్ట్ తో ఇంకేవో భావోద్వేగాలు సృష్టిస్తామంటే- ఇదేమన్నా పేకాటా? పేకాటాడుకుంటే ఒకే కాన్ఫ్లిక్ట్ కి కట్టుబడి ఆడుకోవాలి.
సెకండాఫ్ లో ఇంటికి దగ్గర్లోనే రహస్యంగా సహజీవనం మకాం పెట్టి, పేరెంట్స్ ని ఇంట్లోనే వున్నట్టు నటిస్తూ, కిటికీ గుండా రాకపోకలు సాగించే టైపు కామెడీ ఎన్ని సినిమాల్లో చూడలేదు. ఈ కాలం చెల్లిన టెంప్లెట్ కామెడీ- అబద్ధం చెప్పి ఆడుకునే పాత ఆటతో- గత రెండు నెలల్లోనే వికృత టైటిల్ తో ‘కృష్ణ వ్రింద విహారి’, పాత టైటిల్ తో ‘స్వాతిముత్యం’ వచ్చి ఫ్లాపయ్యాయి.
ఫస్టాఫ్ లో సింధుజని ప్రేమలో పడెయ్యడానికి నలభై నిమిషాలు కామెడీలతో గడిపి ఇంటర్వెల్లో సీరియస్ చేసినట్టు, తిరిగి సెకండాఫ్ లో దొంగచాటు సహజీవనంతో ఇంకో 40 నిమిషాలు కామెడీలు నడిపి, ముగింపు సీరియస్ చేశారు. దీంతో కొసరు కథతో ఎమోషన్ లేకుండా పోయింది. కథ లేకపోయినా, సహజీవనం పేరుతో అనేక లిప్ లాక్ సీన్లు, ఎరోటిక్ సీన్లు, డబుల్ మీనింగు డైలాగులు - వీటితో ఏమాత్రం నిలబడలేదు సినిమా.
నటనలు - సాంకేతికాలు
ఈసారి నటనాపరంగా, లుక్స్ పరంగా ఇంప్రూవ్ అయ్యాడు హీరో శిరీష్. మంచి కాస్ట్యూమ్స్ తో స్టయిలిష్ లవర్ బాయ్ గా వెండి తెరకి గ్లామర్ తీసుకొచ్చాడు. పాటల్లో మాస్ డాన్సులు, స్టెప్పులు వంటివి లేకుండా చూసుకున్నాడు. ఇక అల్లు శిరీష్ ఇంప్రూవ్ చేసుకోవాల్సింది సినిమాల క్వాలిటీనే. తన క్యారక్టర్స్ కి డెప్త్ తో కూడిన భావోద్వేగాల చిత్రణే. చేసేవి ప్రేమ సినిమాలైనప్పుడు ప్రేమలో బలం చూపించే, కదిలించే సన్నివేశాలే.
హీరోయిన్ అనూ ఇమ్మాన్యుయేల్ తన మాట
నెగ్గించుకునే రాడికల్ పాత్రలో బాగానే వుంది. అయితే తన పుట్టిన రోజు తనకే
తెలియకుండా ఎలా చదువుకుంది, ఎలా జాబ్ లో చేరింది? ఇందుకే శిరీష్ ఆమె పుట్టిన రోజు ఆమెకి తెలియజేసే అద్భుతంగా తీసిన సీనుకి అర్ధం
లేకుండా పోయింది. దాంతో ఆమె మారడం కూడా కన్విన్సింగ్ గా లేకుండా పోయింది. శిరీష్
తో లిప్ లాక్స్ కి, మిగతా అడల్ట్ సీన్సుకీ మాత్రం కెమిస్ట్రీ
తగ్గకుండా చూసుకుంది.
ఆమె తండ్రి పాత్రలో పృథ్వీ, అతడి
తల్లి పాత్రలో ఆమని కన్పిస్తారు. ఆఫీసులో కొలీగ్ గా వెన్నెల కిషోర్ కామెడీ చేస్తే, మేనమామగా సునీల్ కామెడీ చెయ్యడు. మేనల్లుడికి ప్రేమ సలహాలిస్తాడు.
మళ్ళీ ఈసారి అనూప్ రూబెన్స్
సంగీతంలో హిట్ సాంగ్స్ లేవు. చిత్రీకరణతో మాత్రం పాటలు కనువిందుగా వున్నాయి. 80
నిమిషాలు కామెడీ దృశ్యాలే వుండడంతో అచ్చు రాజమణి నేపథ్య సంగీతం గోలగోలగా వుంది అంత
సేపూ. తన్వీర్ మీర్ కెమెరా వర్క్ క్లాస్ గా వుంది. సెట్స్ కి బాగా బడ్జెట్
ధారబోయడంతో విజువల్స్ అంతే రిచ్ గా వచ్చాయి. గత సినిమాలకంటే శిరీష్ కిది
ప్రొడక్షన్ పరంగా క్వాలిటీ మూవీ, కంటెంట్ పరంగా కాదు. GA2 పిక్చర్స్ బ్యానర్ కి కథల ఎంపికతో కాన్ఫ్లిక్ట్ వున్నట్టుంది.
—సికిందర్