‘లేడీ బర్డ్’ లో దృశ్యం
|
తెలుగులో హీరో కృష్ణ పెద్ద
కుమారుడు రమేష్ బాబుతో దాసరి నారాయణ రావు బ్లాక్ అండ్ వైట్ లో తీసిన ‘నీడ’ కమింగ్
ఆఫ్ ఏజ్ మూవీ. అప్పుడప్పుడే యవ్వనపు గడప తొక్కిన కుర్రాడు, రతి క్రీడ పట్ల కుతూహలంతో వేశ్యల
పాలబడి దారితప్పే కథ. ఈ వయస్సంటేనే వివిధ విషయాల పట్ల కుతూహలం. తెలుసుకోవాలన్న కుతూహలం
ఎదుగుదలకి సంకేతం. టీనేజీ సహజాతమైన ఈ జిజ్ఞాసని, కుతూహలాన్నీ చంపేస్తూ ప్రేమించడం,
ప్రేమలో పడ్డంగా చూపడం ఎదుగుదలని ఆపేసే అపరిపక్వత. చిత్రం, టెన్త్ క్లాస్ లాంటివి అప్పుడే
పెళ్లి చేసుకుని పిల్లల్నికనే ఇలాటి సహజాత వ్యతిరేక సినిమాలుగా వుంటాయి. ఇవి
కమర్షియల్ కోణాన్ని మాత్రమే చూస్తాయి. హాలీవుడ్ నుంచి కూడా ఇలాటి సినిమాలొచ్చినా,
ఎక్కువ సినిమాలు ఎదుగుదల గురించే వుంటాయి. మనం ఇప్పుడున్న తీరులో వున్నామంటే ఎలా పరిణామం
చెంది ఇలా తయారయ్యామో చెప్తాయి ఈ రకం సినిమాలు. మానసిక పునాదిని వయస్సొచ్చాక అయిన అనుభవాలే వేస్తాయి. ‘బోర్న్ టు
విన్’ అనే గ్రంథంలో సైకాలజిస్టులు ఒక మాట అంటారు : కడుపులో వున్నప్పుడు బిడ్డ
తలరాత దేవుడు రాస్తాడో లేదో గానీ, పుట్టాక తల్లిదండ్రులు మనసు మీద రాస్తారని. వయస్సొచ్చాక
ఈ మనసు మీద రాతతోనే సంఘర్షణ వుంటుంది స్వేచ్ఛకోసం. తమ రాత, తమ చేత తామే నిర్ణయించుకోవాలనుకుంటారు
రెబెల్ మనస్తత్వంతో.
కమింగ్ ఆఫ్ ఏజ్ సినిమాల నిర్వచనం హాలీవుడ్ ఇలా ఇస్తుంది : అప్పుడే యవ్వనంలోకి అడుగుపెట్టిన యువ పాత్ర, మానసికాభివృద్ధికీ మార్పుకూ దోహదపడే సంఘర్షణని చిత్రించేవే కమింగ్ ఆఫ్ ఏజ్ సినిమాల కథలు. వీటిని సున్నితంగా డీల్ చేయాలి. లేత టీనేజర్లు అప్పుడే గూడు వదిలిన పక్షి పిల్లల్లాంటి వాళ్ళు.
ఈ సినిమాలకి ఇతర సినిమాల కథలకి లాగే కాన్ఫ్లిక్టే (సంఘర్షణే ) ఆధారం. ఉన్నట్టుండి యువపాత్రకి ఎదురు చూడని అనుభవం ఎదురవుతుంది. దాంతో సంఘర్షించి రేపటి వ్యక్తిగా ఎదగడమే ఈ కథల స్వభావం.
అదే రూటులో తెలుగు
కానీ
తెలుగులో దీనికి భిన్నంగా, హైస్కూలు - ఇంటర్ పిల్లల ప్రేమలే వర్కౌటవుతాయని అవే కాలక్షేపంగా
తీయడం. తాజాగా మలయాళంలో హిట్టయిన ఇలాటి దొకటి ‘తన్నీర్ మథన్ దినంగళ్’ (పుచ్చకాయల
రోజులు) తెలుగు రీమేక్ హక్కులు కొనే పోటీ కూడా మొదలైందని తెలుస్తోంది. ఒక దర్శకుడు
దీని మీద ఆసక్తి పెంచుకుని రీమేక్ చేస్తే ఎలా వుంటుందని అడిగారు. తెలుగులో
రెగ్యులర్ గా వస్తున్న రోమాంటిక్ కామెడీలకి గత కొన్ని నెలలుగా ప్రేక్షకుల్లేక, నానీస్ ‘గ్యాంగ్
లీడర్’ లాంటి సస్పెన్స్ థ్రిల్లర్సే వరసగా చూస్తున్న మార్పు కన్పిస్తోంది. ఇప్పుడీ
రీమేక్ తలపెడితే రిజల్ట్ ఏమిటో చెప్పడం కష్టం. పైగా అది మలయాళ కొత్త దర్శకుడు తన
పర్సనల్ డైరీలాగా ఫీలై తీశాడు. ఎవరివో పర్సనల్ డైరీలూ, ముచ్చటైన ఫోటో ఫ్రేమ్ కథలూ,
పోయెట్రీలూ రీమేక్ చేసేకంటే, అలాటివి స్వయంగా
ఫీలై క్రియేట్ చేసుకోలేరా అన్నది ప్రశ్న.కమింగ్ ఆఫ్ ఏజ్ సినిమాల నిర్వచనం హాలీవుడ్ ఇలా ఇస్తుంది : అప్పుడే యవ్వనంలోకి అడుగుపెట్టిన యువ పాత్ర, మానసికాభివృద్ధికీ మార్పుకూ దోహదపడే సంఘర్షణని చిత్రించేవే కమింగ్ ఆఫ్ ఏజ్ సినిమాల కథలు. వీటిని సున్నితంగా డీల్ చేయాలి. లేత టీనేజర్లు అప్పుడే గూడు వదిలిన పక్షి పిల్లల్లాంటి వాళ్ళు.
ఈ సినిమాలకి ఇతర సినిమాల కథలకి లాగే కాన్ఫ్లిక్టే (సంఘర్షణే ) ఆధారం. ఉన్నట్టుండి యువపాత్రకి ఎదురు చూడని అనుభవం ఎదురవుతుంది. దాంతో సంఘర్షించి రేపటి వ్యక్తిగా ఎదగడమే ఈ కథల స్వభావం.
అదే రూటులో తెలుగు
హాలీవుడ్ లో ప్రేమలొక్కటే కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్ కావు. వాళ స్పాన్ వైవిధ్యంతో విశాలమైనది. ఇంకోటేమిటంటే, ఈ తరహా కథలకి వరల్డ్ మూవీస్ కి ఏ స్ట్రక్చర్ వుండదో, హాలీవుడ్ కథలకి ఆ త్రీ యాక్ట్ స్ట్రక్చర్ వుంటూ, కమర్షియల్ ప్రదర్శనలకి విశాల ప్రాతిపదికన నోచుకుంటాయి. తెలుగు మేకర్లు ఈ తేడా గమనిస్తే, నాన్ కమర్షియల్ వరల్డ్ మూవీస్ కి ఇన్స్పైర్ అయ్యే పొరపాటు చేయకుండా జాగ్రత్తపడొచ్చు.
సంధికాలంలో ఎదుగుదల కోసం టీనేజర్ల సంఘర్షణాత్మక హాలీవుడ్ మూవీస్ కి కొన్ని ఉదాహరణలు : ‘రెబెల్ వితౌట్ కాజ్’ లో బాధాకర గతమున్న టీనేజర్ కొత్త టౌనుకి వచ్చి, కొత్త స్నేహితులతో బాటు, కొత్త శత్రువుల్ని సృష్టించుకుంటాడు. ‘స్టాండ్ బై మీ’ లో ఒక రచయిత అదృశ్యమైన ఒక బాలుడి మృతదేహాన్ని కనుగొనే ప్రయాణంలో, తన టీనేజీలో చనిపోయిన తన మిత్రుడి జీవితం గురించి చెప్పుకొస్తాడు. ‘లేడీ బర్డ్’ ర్ లేత టీనేజర్, తను కోరుకుంటున్న భవిష్యత్తుని హై స్కూలు ఇవ్వడం లేదని, తనలోని కళాభినివేశం కోసం సంఘర్షిస్తుంది. ‘ది బ్రేక్ ఫాస్ట్ క్లబ్’ లో పోలీసులు రోజూ ఉదయం ఒక టీనేజర్ ని తెచ్చి లాకప్ లో పడేస్తూంటారు. వీళ్ళేం చేశారనేది వీళ్ళు చెప్పుకునే కథలు. ‘మస్టాంగ్’ లో ఐదుగురు అనాథలైన టీనేజీ అక్క చెల్లెళ్ళు యువకులతో తిరుగుతున్నారని బంధిస్తారు. అమ్మాయిల స్వేచ్ఛమీద మోరల్ పోలీసింగ్ ఈ కథ. ‘రివర్స్ ఎడ్జ్’ లో లేత టీనేజర్ తను చేసిన ఘోర నేరాన్ని క్లాస్ మేట్స్ కి గొప్పగా చెప్పుకుంటే, క్లాస్ మేట్స్ ఇంకా మతిపోయేలా కామెడీ చేస్తారు. ‘హేవెన్లీ క్రీచర్స్’ లో ఇద్దరు టీనేజీ అమ్మాయిలు సన్నిహితంగా గడపడాన్ని సహించలేక తల్లిదండ్రులు విడదీస్తే, ఆ అమ్మాయిలు తల్లిదండ్రుల మీద పగ దీర్చుకుంటారు...
ఇదో పెద్ద పరిశ్రమ
టీనేజిలో తమ మనసేమిటో తమకే తెలీక గందోరగోళంగా వుంటుంది. ఈ గందరగోళాన్ని తీరుస్తాయి ఈ తరహా కమింగ్ ఆఫ్ ఏజ్ సినిమాలు. హాలీవుడ్ లో కమింగ్ ఆఫ్ ఏజ్ సినిమాలు దానికదే ఒక పెద్ద పరిశ్రమ. ఏడాదికి ఇరవై ముప్ఫై తీస్తూంటారు. 2018 లో 35 తీశారు. ఈ సంవత్సరం ఇప్పటికే 22 తీశారు. వీటిలో అన్ని జానర్లూ వుంటున్నాయి. ఎదుగుదల గురించే కాక, లవ్, కామెడీలే కాకుండా, యాక్షన్, అడ్వెంచర్, హార్రర్, హిస్టారికల్, సైన్స్ ఫిక్షన్, అన్ని జానర్లతో ప్రయోగాలు చేస్తున్నారు. అసలు హేరీ పోటర్ సినిమాలన్నీ ఈ జానర్వే.
తెలుగులో
ఈ తరహా కమింగ్ ఆఫ్ ఏజ్ (16 -19 ఏజి గ్రూపు) సినిమాల సెగ్మెంట్ ఖాళీగా పడివుంటోంది.
దీన్ని క్యాష్ చేసుకుంటూ ఇంతవరకు లేని కొత్త ట్రెండ్ ని సృష్టించే ఆలోచన చేయడం
లేదు. ఎంత సేపూ ఇరవై పైబడిన హీరోహీరోయిన్లతో అవే ముదురు రోమాంటిక్ కామెడీలు.
థ్రిల్లర్ తీసినా గడ్డాలు పెంచుకున్న హీరోల హీరోయిజాలే. హాలీవుడ్ లో ‘బ్లడ్
సింపుల్’ తీసిన కోయెన్ బ్రదర్స్ ఇంకో ప్రయోగం చేశారు. నియో నోయర్ జానర్లో ‘బ్రిక్’
అనే నూనూగు మీసాల టీనేజీ జ్యూనియర్ కాలేజీ మర్డర్ మిస్టరీ తీసి సంచలనం
సృష్టించారు. ‘బ్లడ్ సింపుల్’ లాగే ఇది కూడా యూనివర్సిటీల్లో కోర్సుగా నమోదైంది.
నియో నోయర్ జానర్లో కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీ!
మనమేకర్లు ఆ వరల్డ్ మూవీస్ అనే ఆర్ట్ మూవీస్ అడ్డాలోంచి, కాఫీ షాపు చర్చల్లోంచి బయట పడితే తప్ప ఇవన్నీ అర్ధం గావు. కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్ పదం కూడా తెలియని వాళ్ళు మేకర్లుగా వున్నారు. యాక్షన్ కామెడీలు, రోమాంటిక్ కామెడీలు తప్ప ఇంకోరకం సినిమా తెలీదు. వూరూరా ఆధునికంగా వెలిసే మల్టీప్లెక్సులు గొప్ప, వాటిలో వేసే సినిమాలు దిబ్బ.
మనమేకర్లు ఆ వరల్డ్ మూవీస్ అనే ఆర్ట్ మూవీస్ అడ్డాలోంచి, కాఫీ షాపు చర్చల్లోంచి బయట పడితే తప్ప ఇవన్నీ అర్ధం గావు. కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్ పదం కూడా తెలియని వాళ్ళు మేకర్లుగా వున్నారు. యాక్షన్ కామెడీలు, రోమాంటిక్ కామెడీలు తప్ప ఇంకోరకం సినిమా తెలీదు. వూరూరా ఆధునికంగా వెలిసే మల్టీప్లెక్సులు గొప్ప, వాటిలో వేసే సినిమాలు దిబ్బ.
ప్రేమల్ని కామెడీల్ని కాసేపు పక్కనబెడదాం. ఎదుగుదల గురించిన
కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్ లో యాక్షన్ ఎంటర్ టైనర్ జానర్లో ‘హోం ఎలోన్’ వుంది. ‘బ్యాక్
టు ది ఫ్యూచర్’ వుంది. మొన్న వచ్చిన సైన్స్ ఫిక్షన్ ‘అలీటా’ కూడా కమింగ్ ఆఫ్ ఏజ్
మూవీనే అంటున్నారు. ‘ఫారెస్ట్ గంప్’ లో ఫ్లాష్ బ్యాక్ కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీ
ప్రమాణాలతో వుంటుంది. హిందీలో వచ్చిన ‘కయీ పోచే’ కూడా కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీనే. ఇండియన్
కథతో డానీ బాయల్ తీసిన ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ ఇంకొకటి.
చుట్టూ వయోలెంట్ లోకం
ఈ నేపథ్యంలో ఎదుగుదల లేని,
యాక్షన్, అడ్వెంచర్, హిస్టారికల్, సైన్స్ ఫిక్షన్ అనే ఏ వెరైటీలేని, మరో ఉత్త
హైస్కూలు ప్రేమల మలయాళ ‘తన్నీర్ మథన్
దినంగళ్’ ని రీమేక్ చేయడం ఎంత వరకు అవసరమో వాళ్ళకే వదిలేద్దాం. కానీ తాము ఎలాటి
ప్రపంచంలో వున్నారో టీనేజర్లకి తెలుసు. తియ్యటి అమాయక ప్రేమ సినిమాలు వాళ్ళనింకా మభ్య
పెట్టలేవు. ప్రపంచం అతి సంక్లిష్టంగా, కన్ఫ్యూజింగ్ గా వుంది. పరమ వయోలెంట్ గా
వుంది. ఇంకా చెప్పాలంటే అరచేతిలో విజువల్స్ కి దిగి వయోలెంట్ గా వుంది. వీడియో
గేమ్స్ దగ్గర్నుంచీ సెల్ఫీల వరకూ. టిక్ టాక్ ల వరకూ. పబ్ జీ ల వరకూ. పోర్న్ వరకూ.
టీనేజర్ల గ్యాంగ్ రేపుల వరకూ. పిల్లల కిడ్నాపుల వరకూ. తమతో ఆడుకునే పిల్లల రేపుల
వరకూ. మార్కుల రేసుల వరకూ. కారు రేసుల వరకూ. బైక్ చోరీల వరకూ. చైన్ స్నాచింగుల వరకూ.
బెట్టింగుల వరకూ. మాదక ద్రవ్యాల వరకూ. సోషల్ మీడియాల్లో వయోలెంట్ కామెంట్స్ వరకూ.
వయోలెంట్ కానిదేదీ లేదు. ఒక విషయంపై ఎవ్వడూ వినడం లేదు. మాట్లాడ్డం లేదు. సమాచార
మివ్వడం లేదు. అరుస్తున్నాడు. తిడుతున్నాడు. ఎవర్ని అడగాలి? ఎవర్ని అడిగి మార్గం
నిర్దేశించుకోవాలి? ఈ ముళ్ళ చక్రం అనే ప్రపంచంలో ఇరుక్కోకుండా ఎలా వుండాలి?
ఇరుక్కుంటే ఎలా బయట పడాలి?చుట్టూ వయోలెంట్ లోకం
రమేష్ బాబు ‘నీడ’ కాలంలో ప్రపంచమిలా లేదు. అరచేతిలో ఇన్ని తలలతో విచ్చుకోలేదు. చెడు కన్పిస్తే, వూరిస్తే, కుతూహలం కల్గిస్తే, ఎక్కువలో ఎక్కువ రోడ్డు పక్క వేశ్య రూపంలోనే. ఇవ్వాళ ఇలా లేదు. ఇప్పుడున్న వయోలెంట్ ప్రపంచాన్ని మనం దాటేశాం. అదృష్టవశాత్తూ మనం గడిపిన ప్రపంచం వేరు. కానీ మన వెనక వచ్చిన టీనేజర్లకి మనం కాకపోతే ఇంకెవరు చేతనయింది చేస్తారు?
చుట్టూ ఈ కొత్త వయోలెంట్ ప్రపంచంతో కూడా ఏం చేయాలా అని మనసు పెట్టి ఆలోచిస్తే, టీనేజర్లని ఇంకా పల్లీ బఠానీలతో మభ్యపెట్టకుండా వాళ్ళ వాయిస్ ని విన్పించే కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్ తో పుణ్యం కట్టుకోవచ్చు. ఖాళీగా వున్న ఈ సెగ్మెంట్ ని భర్తీ చేయవచ్చు. కళా సేవ కాదు, కాసు లొచ్చేదే. హాలీవుడ్ జానర్లు క్యాష్ కౌంటర్లే, డోంట్ వర్రీ! ఈ వ్యాసం మేసేజీలా వుందేమో, ఇదొక వ్యాసమంతే!
next : కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్ రాయడమెలా?
―సికిందర్
―సికిందర్