రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Thursday, September 6, 2018

682 : స్ట్రక్చర్ అప్డేట్స్



             M – Measurable: గోల్ కో కొలమానం నిర్ణయించడం ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్లో రెండో ఎలిమెంట్. కథల విషయానికి వస్తే ఇలా గోల్ ని కొలవడం కనిపించదు. ఎక్కడో అరుదుగా ‘ఎరిన్ బ్రొకొవిచ్’ లాంటి మూవీలో క్లయిమాక్స్ కొలమానంతో వుండొచ్చు. ఈ మూవీలో టౌన్ మీటింగ్ తర్వాత ఎరిన్, ఎడ్ లకి 150 మంది పౌరుల సంతకాలు అవసరపడతాయి. ఈ సంతకాలన్నీ గనుక సేకరించగల్గితే కోర్టులో కేసు గెలుస్తారు. 

          అన్ని కథల్లో క్లయిమాక్స్ ని అంకెల చట్రంలోకి తేలేం. అయినప్పటికీ కూడా ప్రధానపాత్ర విజయం సాధించిందనడానికి, లేదా అపజయం పొందిందనడనికి ఒక స్పష్టమైన సూచిక అవసరం. కనుక ఇప్పుడా ప్రధాన పాత్ర గోల్ కొలమానం చట్రంలోకి రాక తప్పదు. గోల్ కి ఈ కొలమానపు సూచిక లోపిస్తే,  గోల్ నిర్దుష్టంగా లేదనడానికి అది సూచనవుతుంది. క్యారెక్టర్ చోదిత కథల్లో ఇదొక పెద్ద లోపంగానే పరిణమిస్తోంది...

           ‘సిల్వర్ లైనింగ్ ప్లే బుక్’ నే తీసుకుంటే ఇది యిట్టే బోల్తా కొట్టాలి నిజానికి. కొద్దిలో తప్పించుకుంది. ఇందులో కథా ప్రారంభంలో హీరో ‘ఏ ఫేర్వెల్ టు ది ఆమ్స్’ నవలని కిటికీ లోంచి విసిరేస్తాడు. దాని ముగింపుని అతను భరించలేక పోతాడు. ఇక తల్లిదండ్రుల్ని నిద్రలేపి ఆ నవల మీద అక్కసంతా వెళ్ళగక్కుతూ చిందులేస్తాడు. ఇది అద్భుతమైన పంచ్ అతడి మానసిక లోకాన్ని పట్టించే చర్యకి సంబంధించి. హెమింగ్వే క్లాసిక్ ని అలా కిటికీ లోంచి బయటికి విసిరేసే చర్య హీరో పాత్రని కలర్ఫ్ఫుల్ గా మార్చేసే పర్ఫెక్టు చర్య. ఇది గొప్ప క్రియేషన్. ఇక్కడే చాలామంది రచయితలు ఘోరమైన పొటు చేయడానికీ అవకాశముంది. పాత్ర మానసిక లోకాన్ని తెలిపే ఇలాటి చర్యలతో స్క్రీన్ ప్లేని నింపేస్తే సరిపోతుందనుకుంటారు.

      తప్పకుండా ఇలాటి చర్యలు టాప్ స్టార్స్ ని ఆకర్షించడానికి పనికొస్తాయి. నిర్మాతలు ముందుకు రావడనికీ  తోడ్పడతాయి. కానీ రెండు గంటల పాటు ప్రేక్షకుల్ని సంతృప్తి పర్చడానికి మాత్రం చాలవు. 

          పైకి కన్పించే చర్యలతో వాళ్ళు సంతృప్తి పడరు.
          ఆ చర్యల్ని నమ్మడానికి ఇంకేదో కావాలి.
          వాళ్లకి ఒక గోల్ అంటూ వున్న ప్రధాన పాత్ర కావాలి.
          ఏదో వొక గోల్ కాదు. అది SMART గోల్ కావాలి.
          ప్రధాన పాత్ర సక్సెసో, ఫెయిల్యూరో -
          దానికో స్పష్టమైన సూచిక గల గోల్ కావాలి. 

          మీరు ‘సిల్వర్ లైనింగ్స్ ప్లే బుక్’ లాంటి కథ రాస్తూంటే, మీ ప్రధానపాత్ర గోల్ ని ‘పరివర్తన చెందడం’ గా మాత్రమే రాసి వూరుకోకండి. ఇది ఉపయోగంలోకి తేవడానికి చాలా అస్పష్టంగా వుండే గోల్. నిర్దుష్ట గోల్ ని రాయాలి. 

        ఈ నిర్దుష్టమైన గోల్ ఎప్పుడు సాధ్యపడుతుందంటే, అది దానికి సరిపడా పరిమాణంతో సాధించినప్పుడే. పై సినిమాలో హీరో పరివర్తన చెందే గోల్ కి చేరువవడానికి తనని తాను వూరడించుకోవడం, గతం తాలూకు గాయాల్ని మాన్పుకోవడం, అవిధేయంగా వున్న భార్యని స్వీకరించడం మొదలైనవి చేస్తాడు.

          దారితప్పిన భార్యని తిరిగి తన దాన్నిగా చేసుకోవడమే ఇక్కడ హీరోకున్న నిర్దుష్టమైన
Measurable గోల్.
          తిరిగి భార్యతో అతను కాపురం వెలగబెడుతున్న దృశ్యాలుంటేనే అతను
Measurable గోల్ ని సాధించాడని నమ్ముతారు ప్రేక్షకులు. 

         
ఇది కోరుకోకుండా కేవలం తనని తాను వూరడించుకోవడంగా, గతం తాలూకు గాయాల్ని మాన్పుకోవడంగా చూపిస్తూ పోతే ఇందులో గోల్ కన్పించదు. ఇవి  Measurable గోల్స్ కావు. Measurable గోల్ తిరిగి భార్యని తెచ్చుకోవాలని నిర్ణయానికి రావడమే. ఈ నిర్ణయాన్ని చూపించింతర్వాత, మిగతా వూరడింపులూ గాయాలూ చూపించవచ్చు. ఇవి Measurable గోల్ తో వున్న అనుబంధ ఫీలింగ్సే తప్ప, ఒక గోల్ అంటూ లేని స్వతంత్ర ఫీలింగ్స్ గా నిలబడ లేవు. 

        మరొకటేమిటంటే, ప్రేక్షకులు ఇది కూడా కోరుకోరు. అతను భార్యని తిరిగి పొందాలని నిర్ణయం తీసుకున్నాక, ఇక ఆమెని ప్రసన్నం చేసుకునే చర్యలకి పాల్పడాలనే కోరుకుంటారు. రోమాన్స్ ని కోరుకుంటారు. ఇవి చేస్తేనే హీరో గోల్ ని నమ్ముతారు. ఎందుకంటే ఇవి అతడి గ్రోత్ కి నిజమైన నిదర్శనాలు. 

          ఏదేమైనా అతడి
Measurable గోల్ భార్యని తిరిగి పొందాలనుకోవడంగానైనా వుంది. దీని నిర్వహణ వేరే రకంగా వుందనేది వేరే విషయం.

హెచ్ ఆర్ డికొస్టా
   
(రేపు A ఎలిమెంట్)