రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Wednesday, August 8, 2018       రెండ్రోజులు ఆడే సినిమాకి రెండేళ్ళు రాసుకుంటూ కూర్చోనవసరం లేదు. రెండేళ్ళ పాటు రాసి రాసి, గీసి గీసి తీసిన సినిమా రెండ్రోజులాడక పోతే అ బాధ వర్ణనాతీతంగానే వుంటుంది. అది అర్ధం లేని బాధ. రెండేళ్ళు రాసి రాసి తీసిన సినిమా రెండ్రోజులు ఎందుకాడలేదో అర్ధంగాక పోతే ఆది అర్ధంపర్ధం లేని బాధే. రెండేళ్ళూ రాస్తున్నారంటే  ఏం రాస్తున్నారో, ఎందుకు రాస్తున్నారో, ఎలా రాస్తున్నారో తెలీని గుడ్డెద్దు చేలో పడ్డ చందం చమత్కృతి. రెండున్నర గంటల విస్తారమైన కథా సాగు భూమిలో రెండెకరాలు కూడా తెలీకపోతే దుక్కి దున్నడం దరిద్రమే. తన పొలం తనకే తెలీని కథారైతు నాగలిపట్టి దున్నితే రెండేళ్ళు కాదు, ఆరేళ్ళు కూడా పడుతుంది. ముందు పొలం తెలుసుకో, దాంట్లో ట్రాక్టర్ పెట్టి దున్ను....అప్పుడు ఎటూ రెండ్రోజులాడే సినిమా రెండ్రోజుల్లోనే రాసేయ్యొచ్చు. ఎలా? ఇదెలా?  ముందు సర్వే చేసి నీ పొలం హద్దులు, దిక్కులు తెలుసుకో. అప్పుడు ట్రాక్టర్ దాని పని అదే చేసుకుపోతుంది... I have to work from an outline. Every time I have not worked from an outline, I have been completely burned – Tony Gillory, Bourne Identity series screen writer. కానీ హద్దులు, దిక్కులు తెలుసుకోవడమంటే నే చిరాకు కదా, మరెలా? ఎంత జుట్టు పీక్కున్నా నాల్గు పేజీల్లో కథని సమగ్ర దర్శనం చేసుకోవడమే చేతగాదు కదా, మరెలా? నాగలి నాగయ్యల్ని ట్రాక్టర్ ఎక్కమంటే ఎలా? ఎలా? ఎలా?...


No comments: