కథ - దర్శకత్వం
: రోహిత్ శెట్టి
తారాగణం : అజయ్ దేవగణ్, అర్షద్ వార్సీ, తుషార్ కపూర్,
శ్రేయాస్ తల్పడే, కుణాల్ ఖేమూ, పరిణీతీ చోప్రా, టబు, ప్రకాష్ రాజ్, నీల్ నితిన్ ముఖేష్,
జానీ లివర్, సంజయ్ మిశ్రా, ముకేష్ తివారీ, మురళీ శర్మ తదితరులు
స్క్రీన్ ప్లే : యూనస్ సజావల్, మాటలు : సాజిద్ - ఫర్హాద్, సంగీతం : ఆమాల్ మాలిక్, తమన్ తదితరులు, ఛాయాగ్రహణం : జోమన్ టి. జాన్
బ్యానర్ : రోహిత్ శెట్టి ప్రొడక్షన్స్, మంగళ్ మూర్తి ఫిలిమ్స్
నిర్మాతలు : రోహిత్ శెట్టి, సంగీతా ఆహిర్
విడుదల : అక్టోబర్ 20, 2017
***
స్క్రీన్ ప్లే : యూనస్ సజావల్, మాటలు : సాజిద్ - ఫర్హాద్, సంగీతం : ఆమాల్ మాలిక్, తమన్ తదితరులు, ఛాయాగ్రహణం : జోమన్ టి. జాన్
బ్యానర్ : రోహిత్ శెట్టి ప్రొడక్షన్స్, మంగళ్ మూర్తి ఫిలిమ్స్
నిర్మాతలు : రోహిత్ శెట్టి, సంగీతా ఆహిర్
విడుదల : అక్టోబర్ 20, 2017
***
మైండ్ లెస్ కామెడీల ‘గోల్
మాల్’ సిరీస్ లో నాల్గోది ‘గోల్ మాల్ ఎగైన్’ ఏడేళ్ళకి ప్రేక్షకుల్ని అలరించేందుకు
వచ్చేసింది. మొదటి మూడు సిరీస్ కామెడీలు రెండేళ్ళ గ్యాప్ తో వస్తే, ఈ నాల్గోది
చాలా సమయం తీసుకుంది. సిరీస్ లో
కొనసాగుతున్న హీరోల్లో ఒకరిద్దరి మార్పులు తప్ప మిగిలిన హీరోలంతా ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ సిరీస్ హీరోలలాగే ఒక
కుటుంబంగా పాపులరైపోయారు. హిందీలో ఐదుగురు హీరోలతో ఒక సిరీస్ గా మల్టీ స్టారర్ సినిమాలు రావడం ఇదే
ప్రథమం. పైగా ఇవన్నీ హిట్టవుతూ రావడం అలవాటుగా మారిపోయింది. పక్కా కమర్షియల్ దర్శకుడు
రోహిత్ శెట్టి ఎప్పటి కప్పుడు సిరీస్ ని అప్ డేట్ చేస్తూ ఒకదాన్ని మించి ఒకటిగా తీసుకుంటూ పోతున్నాడు. ప్రస్తుత మైండ్ లెస్
కామెడీని డిజైనర్ లుక్ తో ప్రెజెంట్ చేయడంతో అంతా కొత్త కొత్తగా, కన్నుల పండువగా
మారిపోయింది. పాత కథలకే డిజైనర్ లుక్
అద్దినప్పుడే అవి వొక ఫాంటసీ లాగా మారిపోయి హిట్టవగలవని దీంతో రుజువు చేశాడు.
చివరంటా ప్రేక్షకుల్ని కుదురుగా కూర్చోనివ్వని ‘గోల్ మాల్ ఎగైన్’ మైండ్ లెస్ కామెడీలకి వొక పరాకాష్ఠ. కామెడీ కోసం అశ్లీలాన్ని ఆశ్రయిస్తున్న రోజుల్లో, ఇబ్బంది పెట్టకుండా ఇంతకంటే ఎక్కువ డోసుతో ప్రేక్షకుల్ని సీట్లలో ఎగిరెగిరి పడేలా చేసే మైండ్ లెస్ కామెడీలే చాలా బెటరని కూడా దీంతో రుజువవుతోంది. కాకపోతే ఇది చాలా క్రియేటివిటీని డిమాండ్ చేస్తుంది అశ్లీల – ద్వంద్వార్ధాల కామెడీల కంటే. ఈ నేపధ్యంలో ఈ నాల్గో ప్రాంచైజ్ కథాకమామిషేమిటో ఓసారి చూద్దాం...
కథ
గోపాల్
(అజయ్ దేవగణ్), మాధవ్ (అర్షద్ వార్సీ), లక్కీ (తుషార్ కపూర్), లక్ష్మణ్ వన్
(శ్రేయాస్ తల్పడే), లక్ష్మణ్ టూ (కుణాల్
ఖేమూ) ఐదుగురూ ఊటీలో జమునాదాస్ (ఉదయ్ టికేకర్) నడిపే రాజభవనం లాంటి అత్యంత
విలాసవంతమైన అనాధాశ్రమంలో పెరుగుతారు. పెరుగుతున్నప్పుడు పసిపాపగా వున్న ఖుషీ (పరిణీతీ
చోప్రా) ని ఎవరో గేటుముందు వదిలేసి పోతారు. ఆ ఖుషీని ఆడిస్తూ పాడిస్తూ పెంచుతారు.
ఈ ఐదుగురూ కుదురుగా వుండే శాల్తీలు కావు. ఒక వెధవ పని చేసి గోపాల్, లక్ష్మణ్ టూ లు
అనాధాశ్రమం నుంచి అవుటయి పోతే, మిగతా ముగ్గురూ అలాగే గెటవుటై పోతారు. అలా మొదటి
ఇద్దరూ ఎక్కడో, తర్వాతి ముగ్గురూ ఇంకెక్కడో పదేళ్ళ తర్వాత పెద్దవాళ్ళయి తేల్తారు.
ముగ్గురు వసూలీ భాయ్ (ముఖేష్ తివారీ) అనే రియల్ ఎస్టేట్ దొంగ వెంట వుంటే, ఇద్దరు
ఖాళీగా తిరుగుతూంటారు. ఈ ఇద్దర్లో గోపాల్ చీకటిపడితే దెయ్యాలుంటాయని భయపడి
చచ్చేరకం. ఇతణ్ణి జోలపాడి
నిద్రపుచ్చుతూంటాడు లక్ష్మణ్ టూ. ఈ దెయ్యం భయాన్నే ఉపయోగించుకుని మిగతా ముగ్గురూ టెక్నికల్ గా దెయ్యపు చేష్టల్ని సృష్టించి, వాళ్లిద్దర్నీ ఫ్లాట్ ఖాళీ చేయిం చేస్తారు వసూలీ
భాయ్ కోసం.
అప్పుడు ఆ ఇద్దరికీ తమని పెంచిన జమునాదాస్ చనిపోయాడని తెలిసి ఊటీ వెళ్లి అనాధాశ్రమంలో మకాం పెడతారు. అప్పటికే రియల్ ఎస్టేట్ కోసం అనాధాశ్రమం ఆస్తులపైన కన్నేసిన బిగ్ షాట్ వాసూ రెడ్డి (ప్రకాష్ రాజ్) కి ఈ ఇద్దరి మకాం నచ్చక, ఖాళీ చేయించేందుకు వసూలీ భాయ్ కి ఆర్డరేస్తాడు. వసూలీ భాయ్ మళ్ళీ ఆ ముగ్గురికీ ఎసైన్ మెంటిచ్చి పంపుతాడు. అనాధాశ్రమం వచ్చిన మాధవ్, లక్కీ, లక్ష్మణ్ టూ ముగ్గురూ మళ్ళీ గోపాల్, లక్ష్మణ్ వన్ ల పనిబట్టడం మొదలెడతారు. అక్కడే ఇప్పుడు అందమైన యువతిగా ఎదిగిన ఖుషీని చూస్తారు. ఖుషీని ప్రేమిస్తున్న గోపాల్ నీ చూస్తారు. చిన్నప్పుడు తాము చూసిన ఆశ్రమ ఇంఛార్జి, లైబ్రేరియన్ ఆనా (టబు)నీ చూస్తారు. ఇంతలో ఖుషీ అమ్మాయి కాదనీ, ఆత్మ అనీ తెలిసి మొత్తమంతా ఠారెత్తి పోతారు.
ఖుషీ ఆత్మ ఎలా అయింది? జమునాదాస్ ఎలా చనిపోయాడు? నిఖిల్ (నీల్ నితిన్ ముఖేష్) అనే ఎన్నారైతో కలిసి వాసూరెడ్డి ఏ ఘాతుకానికి పాల్పడ్డాడు? ఈ పరిస్థితికి ఐదుగురూ ఒకటై ఏం చేశారు? ... ఇవన్నీ మిగతా కథలో తేలే విషయాలు.
ఎలావుంది కథ
ఇది తెలుగులో పైశాచిక ఎమర్జెన్సీ
విధించుకుని యుద్ధప్రాతిపదికన ఉత్పత్తి చేస్తున్న, అరిగిపోయిన మూస దెయ్యాల కామెడీ కాదు. దెయ్యాల
కామెడీలనే సులభమైన పని పెట్టుకున్నాక, ఫాంటసీ అనే జానర్ నే మర్చిపోయారు. ‘గోల్
మాల్ ఎగైన్’ ఆత్మతో ఒక అందమైన ఫాంటసీ. ఈ ఆత్మ తెలుగు దెయ్యంలా భయపెట్టే దుకాణం
పెట్టుకోదు. భయపడే పాత్రలు కామెడీలు చేసే వ్యాపారం
పెట్టుకోవు. బరితెగించిన కామెడీ ఐదుగురు హీరోల కజ్జాలతోనే వుంటుంది. ఆత్మని ఫాంటసీ
చేసి, డిజైనర్ లుక్ తో కొత్తదనం తీసుకొచ్చిన వినోదాత్మక కథ ఇది.
ఎవరెలా చేశారు
ఐదుగురూ
టాప్ రేంజిలో తమతమ బఫూనరీలని ప్రదర్శిస్తారు. ఎక్కువ కామిక్ టైమింగ్ వున్న వాడు
శ్రేయాస్ తల్పడే. సమయస్ఫూర్తితోనే హాస్యం పండుతుంది. అజయ్ కి జోల పాడేటప్పుడు,
అజయ్ కి పరిణీతి కోసం హెల్ప్ చేసేటప్పుడు, శత్రుత్రయం ముగ్గురి తాటతీసే
సన్నివేశాల్లో, తల్పడే పాల్పడే మైండ్ లెస్ కామెడీ కి అంతుండదు. అజయ్ దేవగణ్
ప్రేమించే పరిణీతీ చోప్రా చిన్నప్పుడు
ఎత్తుకున్న పాప అని తెలిశాక తల్పడే ఒక డైలాగు కొడతాడు – ప్రతీ ఆడపిల్లా తనక్కాబోయే
వాడిలో ఫాదర్ ఫిగర్ని చూస్తుంది. ఆమెకి ఫిగరుంది, నువ్వు ఫాదర్ వి - అని! ఐయాం
నాటే ఘోస్ట్, ఐయాం యువర్ దోస్త్ అంటాడు. నెక్స్ట్ స్టెప్, బెస్ట్ స్టెప్, ఫినిష్ స్టెప్ అంటూ హడావిడి చేస్తూంటాడు.
ఇలాగే
ఒక సమోసా కోసం తినే బల్ల దగ్గర కామెడీని ఎక్కడికో తీసికెళ్ళి పోయే కుణాల్ ఖేమూ. ఒకచోట
డైలాగు – వీడికి సాయం చేయడమంటే, యాక్స్ (గొడ్డలి) తో కాళ్ళు నరుక్కోవడమే, బ్లాక్
మనీ మీద టాక్స్ వేయడమే, ఇంటర్వెల్ కే క్లయిమాక్స్ రావడమే!
గోల్ మాల్ సిరీస్ లో మూగవాడి పాత్ర వేస్తున్న తుషార్ కపూర్ ఒక బిగ్ ఎట్రాక్షన్. నోటితో ఏదేదో అరుస్తాడు కానీ ఎక్స్ ప్రెషన్స్ తో విషయం చెప్తాడు. మూగ పాత్రని ఒక కల్ట్ క్యారక్టర్ లా తయారు చేసిపెట్టాడు తను.
అజయ్ దేవగణ్ ది సీరియస్ కామెడీ. ఎవరైనా తన వైపు వేలు చూపిస్తూ మాట్లాడితే వేలు విరిచేస్తాడు. పది వేళ్ళతో తుషార్ కపూర్ ఓవర్ యాక్షన్ చూసి, పది వేళ్ళూ వెనక్కి వంచేస్తాడు. వెనక్కి వంగిన వేళ్ళతో తిరుగుతూంటాడు తుషార్. అజయ్ ఎవర్నయినా కొడితే, దెబ్బ తగిలిన వాడు రెండు మూడు సార్లు కట్ షాట్స్ లో బంతి కొట్టుకున్నట్టు ఎగిరెగిరి నేలకి కొట్టుకోవాల్సిందే.
అర్షద్
వార్సీ ది పైకి నవ్వుతూనే వాతలు పెట్టే కామెడీ. పరిణీతీ చోప్రా ఆత్మ అని ఎవరూ
అనుకోరు. ఒకమ్మాయి లాగానే కలిసిమెలిసి వుంటుంది. ఈమె పాత్ర ఆశ్రమంలో పనిమనిషి. ఆత్మగా
రివీలయ్యాక కొత్త విషాదం తోడవుతుంది పాత్రకి. చివర్లో పగ దీర్చుకుంటుంది. ఈ పగదీర్చుకోవడంలో కూడా
దెయ్యంలా భీకరంగా మారదు. ఒకమ్మా యిలాగే వుంటుంది. ఈ పాత్రని తీర్చిదిద్దడంలో
ఫాంటసీ జానర్ దెబ్బతినకుండా చూశారు.
ఆనా పాత్రలో టబుకి ఆత్మలు కన్పిస్తాయి, వాటితో మాట్లాడుతుంది. ఈమె పెద్దదిక్కుగా తిరుగుతూంటుంది. టబూ మీద కోల్డ్ క్రీం అంటూ మంత్రాలు చదివే సీను పెద్ద కామెడీ. హీరోలందరూ తన కళ్ళ ముందు పెరిగిన బచ్చాగాళ్ళు. ఇక చాలా కాలానికి జానీ లివర్ కన్పిస్తాడు. పప్పీ భాయ్ పాత్రలో ఒక సన్నివేశంలో హైదరాబాదీ ఉర్దూతో అల్లకల్లోలం రేపుతాడు.
విచిత్రమైన కౌబాయ్ డ్రెస్సులో బాబ్లీ భాయ్ గా సంజయ్ మిశ్రా ది ఇంకో సందడి. సినిమాలతో కలిపి మాట్లాడి పరువు తీస్తూంటాడు- ఏం బ్యాండ్ వాయించావురా నా అపస్వరాల జస్టిన్ బీబర్ అంటాడు. రేయ్ కుందేలులా అరవకు అంటాడు. ఇక్కడ భూతముంటే వెళ్లి భూతానికి చెప్పు గెస్ట్ అప్పీరియన్సుగా బబ్లీ వచ్చాడని అని అర్డరేస్తాడు. ఘోస్ట్ - జి ఎస్ టి ఘోస్ట్ అని స్పెల్లింగ్ చెప్తాడు. షో హిమ్ యువర్ మూవ్స్ ఖుషీ బేటీ ఎంటీవీ మూవ్స్ అని ఆత్మని ఎంకరేజి చేస్తాడు. క్యాకరే క్యా నాకరే డూ వాట్ విల్ డూ స్కూబీ డూ అంటూ చిత్రవిచిత్రంగా మాట్లాడే క్యారక్టర్ ఇది. కామిక్ విలన్ ప్రకాష్ రాజ్, సీరియస్ విలన్ నీల్ నితిన్ ముఖేష్.
రోహిత్ శెట్టి రెగ్యులర్
రైటర్స్ సాజిద్ – ఫర్హాద్, యూనస్ సజావల్ లు మరోసారి మైండ్ లెస్ కామెడీని ఆద్యంతం
వినోదభరితం చేశారు కొత్త పద ప్రయోగాలతో. సంగీతం, ఛాయాగ్రహణం, గ్రాఫిక్స్,
నృత్యాలు, పోరాటాలు టికెట్టు కొన్న ప్రేక్షకుడికి పూర్తి సంతృప్తి నిస్తాయి.
చివరికేమిటి
రీ సైక్లింగ్ కథల రోహిత్ శెట్టి ఈసారి డిజైనర్ లుక్ సమర్పిం
చడంతోపాతకథేచూస్తున్నామన్పించదు. గతంలో అవే ఫ్యామిలీ డ్రామాలు తీస్తున్న సూరజ్ బర్జాత్యా పంథా మార్చి ‘మై ప్రేమ్ కీ దీవానీ హూఁ’ కి డిజైనర్ లుక్ ఇస్తే రాణించలేదు. అప్పట్లో ఆ కొత్తకి ప్రేక్షకులు అలవాటు పడలేదు. ఇతరులు ‘అశోకా’ లాంటి చరిత్రకాల్ని డిజైనర్ చరిత్రలుగా తీసినా హిట్టవలేదు. చరిత్రల్ని వాటి పురాతన తత్వ్తంతోనే తీయాలి. కానీ ఒక రెగ్యులర్ మూస కమర్షియల్ కథని చిత్రీకరణ పరంగా అదే మూసలో ఇంకా తీస్తున్నప్పుడు పాత వాసనేసి పై స్థాయికి తీసికెళ్ళదు. సినిమాల్లో ఇంకా అనాధాశ్రమం అనే సెటప్ అరిగిపోయిన ఫార్ములా. దీన్ని ఎప్పటిలాగే ఓ పాత బిల్డింగులో చింపిరి పిల్లలతో ఈసురోమని తీస్తూపోతే విజువల్ అప్పీల్ వుండదు. అన్ని అప్పీల్స్ తో బాటు విజువల్ అప్పీల్ కూడా చాలా ముఖ్యం. ఎందుకు ముఖ్యమో ప్రొడక్షన్ డిజైనర్ పీటర్ లార్కిన్ చెప్తాడు – మూడు కారణాలు : 1. సినిమాలు పలాయనవాద వినోదాలుగా మారడం, 2. టీవీ, లాప్ టాప్, స్మార్ట్ ఫోన్ ల వంటి బహువిధ స్క్రీన్స్ తో పోటీ నెదుర్కోవడం, 3. ఎప్పటికప్పుడు కొత్తగా వస్తున్న దర్శకులతో పోటీ పడాల్సి రావడం.
చడంతోపాతకథేచూస్తున్నామన్పించదు. గతంలో అవే ఫ్యామిలీ డ్రామాలు తీస్తున్న సూరజ్ బర్జాత్యా పంథా మార్చి ‘మై ప్రేమ్ కీ దీవానీ హూఁ’ కి డిజైనర్ లుక్ ఇస్తే రాణించలేదు. అప్పట్లో ఆ కొత్తకి ప్రేక్షకులు అలవాటు పడలేదు. ఇతరులు ‘అశోకా’ లాంటి చరిత్రకాల్ని డిజైనర్ చరిత్రలుగా తీసినా హిట్టవలేదు. చరిత్రల్ని వాటి పురాతన తత్వ్తంతోనే తీయాలి. కానీ ఒక రెగ్యులర్ మూస కమర్షియల్ కథని చిత్రీకరణ పరంగా అదే మూసలో ఇంకా తీస్తున్నప్పుడు పాత వాసనేసి పై స్థాయికి తీసికెళ్ళదు. సినిమాల్లో ఇంకా అనాధాశ్రమం అనే సెటప్ అరిగిపోయిన ఫార్ములా. దీన్ని ఎప్పటిలాగే ఓ పాత బిల్డింగులో చింపిరి పిల్లలతో ఈసురోమని తీస్తూపోతే విజువల్ అప్పీల్ వుండదు. అన్ని అప్పీల్స్ తో బాటు విజువల్ అప్పీల్ కూడా చాలా ముఖ్యం. ఎందుకు ముఖ్యమో ప్రొడక్షన్ డిజైనర్ పీటర్ లార్కిన్ చెప్తాడు – మూడు కారణాలు : 1. సినిమాలు పలాయనవాద వినోదాలుగా మారడం, 2. టీవీ, లాప్ టాప్, స్మార్ట్ ఫోన్ ల వంటి బహువిధ స్క్రీన్స్ తో పోటీ నెదుర్కోవడం, 3. ఎప్పటికప్పుడు కొత్తగా వస్తున్న దర్శకులతో పోటీ పడాల్సి రావడం.
భావోద్వేగాలు
ఎప్పుడూ ఒకలాగే వుంటాయి, భావోద్వేగాల కారణాలు కాలంతో బాటు మారిపోతూంటాయి. ఉమ్మడి
కుటుంబంగా కలిసి వుండాలనుకోవడం ఒకప్పటి భావోద్వేగం, ఇప్పుడు కాదు. మగ కుర్రాళ్ళు
చేయి చేయి పట్టుకుని తిరగడం ఒకప్పటి స్నేహాన్ని ప్రకటించుకునే భావోద్వేగం, ఇప్పుడు
కాదు. అలాగే ఫార్ములా సెటప్స్ పైన
చెప్పుకున్న మూడు కారణాల వల్ల మారాల్సిందే. కథలూ అదే మూస, వాటి సెటప్సూ అదే మూసలో
వుంటే ఆధునిక ప్రేక్షకులు అఫెండ్ అవుతారు. ఇండియాలో ప్రేక్షకులిప్పుడు ఉన్నదాంతో
సంతృప్తి పడే స్థితిలో లేరు. ఉన్నత వర్గాలని చూసి మధ్య తరగతి వర్గాలు, మధ్యతరగతి వర్గాలని
చూసి కింది వర్గాలూ పోటీలుపడి అనుకరిస్తున్నారు. అనుకరణల మోజులో లేమి లేనట్టే
ప్రవర్తిస్తున్నారు. వీళ్ళకి బిగ్ బడ్జెట్ సినిమా అందమైన ప్రపంచాల్ని
చూపించాల్సిందే. డిజైనర్ లుక్ అంటే ఉన్నదాన్ని ఎక్కువ చేసి చూపించడమే. చిన్న బడ్జెట్
సినిమాలకి సెటప్స్ మూసలో వుండక తప్పదు. కానీ పెద్ద బడ్జెట్ సినిమాలకీ అవే వుంటే
వాటి విజువల్ అప్పీల్ లో తేడా ఏమీ వుండదు.
కనుక ‘గోల్ మాల్ ఎగైన్’ లో ఎక్కువభాగం అనాధాశ్రమంలో నడిచే కథ కావడంతో, ఆ అనాధాశ్రమాన్ని ఊటీలాంటి అందమైన ప్రదేశంలో అత్యంత రిచ్ భవనాల్లో చూపించడంతో మొత్తం కథే పాత మూసని మరిపించేట్టు తయారయ్యింది. పైగా రెగ్యులర్ దెయ్యం కామెడీ చేయకుండా ఫాంటసీకి మార్చడంతో విజువల్ అప్పీల్ మరింతగా పెరిగింది. ఇంతే గాకుండా, కామెడీని ఈ సిరీస్ మెయింటెయిన్ చేస్తున్న మైండ్ లెస్ కామెడీనే కంటిన్యూ చేయడంతో ఫాంటసీ విభిన్నంగా తయారయ్యింది. ఇక ఈ సిరీస్ లో ఎప్పుడో పాపులరైన హీరోలని చూపించిన విధానాన్ని హాలీవుడ్ హై కాన్సెప్ట్ పద్ధతిలో చూపించడం వల్ల కూడా ఫాంటసీ మరింత ఎంటర్ టైనర్ గా మారింది.
ఇలా డిజైనర్ లుక్, ఫాంటసీ, మైండ్ లెస్ కామెడీ, హై కాన్సెప్ట్ స్టార్ ప్రెజెంటేషన్ అనే నాల్గు ప్రత్యేక హంగులతో మార్కెట్ యాస్పెక్ట్ ఉట్టి పడేలా ప్రొడక్షన్ ని డిజైన్ చేశారు.
***
ఒకప్పుడు
మల్టీ స్టారర్ లు కథాబలంతో బరువుగా వుండేవి. పాత్రచిత్రణలూ, సంఘర్షణలూ సంక్లిష్టంగా
వుండేవి. కాలం మారింది. హాలీవుడ్ లో బిగ్ బడ్జెట్స్ కి హై కాన్సెప్ట్ కథే వుంటుంది.
దాన్ని సింపుల్ గా చెప్పేస్తున్నారు. విజువల్ యాక్షన్ భారీగా వున్నప్పుడు కథకూడా
భారంగా వుండకూడదనే బ్యాలెన్సింగ్ యాక్ట్ ప్రదర్శిస్తున్నారు. అదే చిన్న బడ్జెట్స్ లో- కాన్సెప్ట్ కథల్ని సంక్షుభితం చేసి
చూపిస్తున్నారు. వీటికి విజువల్ యాక్షన్ వుండదు కాబట్టి పాత్రలూ వాటి సంఘర్షణలూ అనేక
పొరలు కమ్మి వుంటాయి. మూల సూత్రం : ప్రేక్షకుల మీద ఏదో వొక భారాన్ని మాత్రమే వేయాలి.
పై
సూత్రాన్ని అనుసరిస్తున్నట్టు, అలరించడానికి మల్టీ స్టారర్ గా భారీ విజువల్
ఎరీనా వున్న ప్రస్తుత ‘గోల్ మాల్ ఎగైన్’ కి కథని నామమాత్రం చేశారు. పైగా పాత రొటీన్ కథ. ప్రేక్షకులకి ఈ లోటు తెలీదు.
ఇక్కడ స్టార్స్ కోసం కథ లేదు, స్టార్స్ చేసే మెదడు తక్కువ టక్కుట మారాలకోసం కథ
వుండాలి కాబట్టి ఏదో వుంది. ఐతే నామ మాత్రపు కథకి తెగ నవ్వించి ఎంత ఎంటర్ టైన్
చేసినా, చివరికొచ్చేసరికి ‘సో వాట్?’
అనుకుంటాడు ప్రేక్షకుడు. అప్పుడు కాస్త ఫీల్ లోకి దింపుతారు సన్నివేశాల్ని. క్లయిమాక్స్
లో హీరోయిన్ పగదీర్చుకునే సన్నివేశాలు ఇవే.
ఒక
లైనుగా చెప్పుకుంటే, తాము పెరిగిన అనాధాశ్రమం యజమానినీ, తాము పెంచిన అమ్మాయినీ శత్రువులు
చంపేస్తే, వాళ్ళని రప్పించి అమ్మాయి
ఆత్మకి అప్పజెప్పడం మాత్రమే కథ. ఈ సింపుల్ లైనుని మల్టీ స్టారర్ ని దృష్టిలో పెట్టుకుని, ఘోరమైన
ఏడ్పులతో, ఆత్మ ప్రతీకారాలతో, అరుపులతో, భయపెట్టడాలతో, అది చెప్పుకునే భయంకర
ఫ్లాష్ బ్యాకులతో సంక్షుభితం చేసి తలబొప్పి కట్టించకుండా, అంతే సింపుల్ గా, ఫన్నీగా
లైట్ రీడింగ్ మెటీరియల్ లాగా అందించేశారు.
ఎంత మైండ్ లెస్ కామెడీ అయినా లాజిక్ పునాదిగానే వుండాలి. లేకపోతే నవ్వలేం. పరిస్థితి లాజికల్ గా వుండాలి, ఆ పరిస్థితికి రియాక్టయ్యే పధ్ధతి ఎంత ఇల్లాజికల్ గా వున్నా ఫర్వాలేదు. సిగరెట్లు కొనాలనుకోవడం లాజికల్ పరిస్థితి. దానికోసం విమానమెక్కి వెళ్ళడం ఇల్లాజికల్ ప్రవర్తన. ఈ ఇల్లాజికల్ ప్రవర్తనే మైండ్ లెస్ కామెడీ, లేదా అసంబద్ధ కామెడీ అవుతుంది. ఇది అరిస్టాటిల్ సూత్రం. ప్రస్తుత కథలో హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్ లో లోపమిదే. ఎత్తుకుని లాలించిన పిల్లనే హీరో ప్రేమించడం, దాన్ని కామెడీ చేయడం ఇబ్బంది కల్గించేదే. ఎంత మెదడు లేని వాడు కూడా ఈ పనిచెయ్యలేడు. ఆమెకి అన్నగానో, తండ్రిగానో ఫీలవుతాడు. ఇది చూసి శ్రేయాస్ తల్పడే – బీవీసే బేటీ బన్ గయీ, బేటీ సే భూత్నీ బన్ గయీ – అని జోకులేసినా ఎంజాయ్ చేయలేం. బచ్పన్ ( పసితనం) – పచ్పన్ (ముసలితనం) అని హీరోహీరోయిన్ల నుద్దేశించి కామెంట్లు చేసినా బలవంతపు కామెడీగానే వుంది. చీకటి పడితే దెయ్యాలుంటాయని భయపడేవాడు తెలీక ఆత్మనే ప్రేమించడం మంచి డైనమిక్కే గానీ, ఇందులో రోమాన్సుకీ, తద్వారా మైండ్ లెస్ కామెడీ కీ లాజిక్కే అడ్డుపడుతుంది. మానవసంబంధాలని లాజికల్ గాచూపించాలనేది ఇందుకే.
‘గోల్
మాల్ ఒన్స్ ఎగైన్’ అని మళ్ళీ తీస్తే అదెలా
వుంటుందనేది ఆసక్తి రేపే ప్రశ్న. ఈ గోల్ మాల్ గ్యాంగ్ అంతా ఇక ఫారిన్లో అల్లరి
చేస్తారేమో.
www.cinemabazaar.in