మీ బోరింగ్ మూవీని హిచ్ కాక్ థ్రిల్లర్ లా మార్చడమెలా’ అని దర్శకుడు జెఫ్రీ మైకేల్ బేస్ కొన్ని టిప్స్ ఇచ్చారు. సినిమా తీయడంలో హిచ్ కాక్ సూక్ష్మ దృష్టిని ఆవిష్కరించే ఈ టిప్స్ తెలుగు దర్శకులకి మార్గ దర్శకాలు కావొచ్చు. థ్రిల్లర్స్ అనే కాకుండా అన్ని జానర్స్ కీ అన్వయించుకోగల ఈ టిప్స్ ని ఓ సారి చదువుకుంటే అసలు సినిమా అంటే ఏమిటో, ప్రేక్షకులు దాన్నెలా దర్శిస్తారో ఒక సైకలాజికల్ అవగాహన కూడా ఏర్పడుతుంది. ఎందుకంటే హిచ్ కాక్ ఎప్పుడూ తన కళని తాను ప్రేమించుకుంటూ, ప్రేక్షకుల ఇన్వాల్వ్ మెంట్ కి దూరంగా, తనలోకంలో తానుండిపోయే సబ్జెక్టివ్ పోకడలకి చోటివ్వలేదు. కెమెరాని కూడా ఆయన ప్రేక్షకుడిగా మార్చి దాని వెంట ప్రేక్షకులని తిప్పుకునే, ప్రేక్షక లోకంలోంచి చిత్రీకరణని చూసే, ప్రేక్షకులని ప్రేమించడం మొదటి ప్రాధాన్యంగా పెట్టుకునే ఆబ్జెక్టివ్ ధోరణులకి అవకాశమిచ్చారు. ఇంకో మాటలో చెప్పాలంటే, తెర మీది దృశ్యాల్ని ప్రేక్షకులు నిజంగా తమ చుట్టూ జరుగుతున్న సంఘటనల్లాగే భ్రమిస్తూ తదనుగుణ స్పందనలతో నీరాజనాలు పట్టడమన్న మాట. నీరాజనాలందుకోని కళ కూడా ఓ కళేనా అనే మౌలిక ప్రశ్న వేసుకుంటే, ఎవరు పడితే వాళ్ళు దర్శకులై పోయే తొందరపాటు తగ్గుతుంది. మరి అలా నీరాజనాలందుకో గల్గాలంటే, సాంకేతికంగా ఏం చేయాలనేది తెలుసుకోవాలి...ఈ కింద తెలుసుకుందాం...
జెఫ్రీ మైకేల్ బేస్ ఇలా అంటున్నారు... తాము
రాసుకున్న కథ హీనంగా వుందనీ,
దీన్నెవరూ చూడరనీ డిప్రెషన్ కీ,
బాధకీ లోనయ్యే అశేష దర్శకులకోసం ఈ పేజీ రాస్తున్నాను
దీన్నెవరూ చూడరనీ డిప్రెషన్ కీ,
బాధకీ లోనయ్యే అశేష దర్శకులకోసం ఈ పేజీ రాస్తున్నాను
...మీరు
దుఖించడం మాని విషయం
మీద దృష్టిపెట్టండి.
ఇక్కడ నేను రాస్తున్నది మీ వృత్తిని కాపాడొచ్చు.
మీద దృష్టిపెట్టండి.
ఇక్కడ నేను రాస్తున్నది మీ వృత్తిని కాపాడొచ్చు.
1. అది ప్రేక్షకుల మైండ్.
మీ స్క్రీన్ ప్లేలో ప్రతీదీ ప్రేక్షకుల కోసమన్నట్టుగా
మార్చెయ్యండి. ఏ సీనుతో అయినా ప్రేక్షకుల్ని ఎలా ప్రభావితం చేయవచ్చన్న
ఒక్క అంశం మీదే దృష్టిపెట్టి మేధో మధనం చేయండి. మీఋ రాసుకున్న పేజీల్లోని కంటెంట్ తో ప్రేక్షకులు కనెక్ట్
అయ్యేలా చూడండి, వాళ్లకి ముకుతాడు వేసి లాక్కెళ్లేలా సీన్లని మార్చుకోండి. ఇందుకు సాధనాలుగా
పాత్రల్ని ఉపయోగించుకోండి. ప్రేక్షకులకి పాత్రలు కొసరి కొసరి వడ్డిస్తూంటే ఇంకా
ఇంకా కావాలని వాళ్ళు వెంటపడి వచ్చేలా చిత్రించండి.
చీకటి గుయ్యారాలైన సినిమా హాళ్ళకి ప్రేక్షకులు ఎందుకు విరగబడి వచ్చి గంటలతరబడి కూర్చుండి పోతారో ఆల్ ఫ్రెడ్ హిచ్ కాక్ కి బాగా తెలుసు. వాళ్ళు ఫన్ కోసం వస్తారు. జనం రంగుల రాట్నమెక్కి అది గిర్రున తిప్పేస్తున్నా భయపడకుండా ఎలా సేఫ్ గా ఫీలవుతారో, సినిమా కొచ్చిన ప్రేక్షకులకి కూడా తాము అలా సేఫ్ గా వుంటామని తెలుసు. ఒక సినిమా దర్శకుడిగా మీరు వాళ్ళ పైన ఎడా పెడా అస్త్రాల్ని విసరాలి, కొండ చివరకి తీసికెళ్ళి తోసేయ్యాలి, లేదా ఒక డేంజరస్ లవ్ స్టోరీలోకి దిగలాగాలి. ఏం జరిగినా తమ కేమీ కాదని వాళ్లకి తెలుసు. అంతా అయిపోయాక గేట్లలోంచి బయటి కెళ్ళి, తమ జీవితాల్ని తాము నార్మల్ గా గడుపుకోగలమన్న నమ్మకంతో వాళ్ళుంటారు. వాళ్లకి ఎంత ఎక్కువ ఫన్ ని ఇవ్వగల్గితే అన్ని ఎక్కువ సార్లు రిపీట్ ఆడియెన్స్ గా మీ సినిమా కొస్తారు.
3. కెమెరా కెమెరాయే కాదు
మనిషి లాగా కెమెరా, ఏదో అనుమానంతో గదిలో శోదిస్తున్నట్టు తిరుగాడుతూ వుండాలి. కథని పొరలు పొరలుగా విప్పి చూడ్డంలో ప్రేక్షకులు తామూ ఇన్వాల్వ్ అవుతున్నట్టు ఫీలయ్యేలా ఇది చేస్తుంది. సీన్లని రూమ్ లో పాన్ చేస్తూ, క్లోజప్ లో ఆయా వస్తు సామాగ్రిని ఎస్టాబ్లిష్ చేస్తూ ప్రారంభించవచ్చు. ఇది మూకీ సినిమాల కాలంలో హిచ్ కాక్ దర్శకత్వ తీరు. సౌండ్ సౌకర్యం లేని ఆ రోజుల్లో బొమ్మలతో కథని చెప్పే పద్ధతుల్ని దర్శకులు అవలంబించారు. 1930 లలో ఎప్పుడైతే మూకీలు అంతరించి శబ్దంతో టాకీలు ప్రారంభంయ్యాయో, మూకీల నాటి కథ చెప్పే టెక్నిక్ దెబ్బ తినిపోయిందని ఒకసారి హిచ్ కాక్ అన్నారు. అకస్మాత్తుగా సినిమాలు డైలాగు ఆధారిత ప్రొడక్షన్లుగా మారిపోయి మాటలతో కథ చెప్పడం ప్రారంభించాయి బొమ్మలతో కాక. నాటకాల్లాగా సినిమాలు నటుల డైలాగుల మీద ఆధారపడడం మొదలెట్టాయి. బొమ్మలతో కథ చెప్పడం పూర్తిగా మరుగున పడిపోయింది.
4. డైలాగులెందుకు
సీనులో కనీసం ఒక పాత్ర మాట్లాడుతున్నప్పుడు ఇంకేదో చేస్తూండాలి- ఎదుటి పాత్రలు గమనించని విధంగా కళ్ళు అటూ ఇటూ తిప్పి చూస్తూంటే, అప్పుడా పాత్ర ఏదో విషయం దాస్తున్నట్టు అన్పించి దాని నిగూఢ లోకంలోకి ఎంటరై పోతారు ప్రేక్షకులు. మనుషులు తమ మనసులో మాట ఇతరులకి అంత సులభంగా వ్యక్తం చెయ్యరని హిచ్ కాక్ అంటారు. పైకి ఏదో మాట్లాడుతున్నా వాళ్ళ కళ్ళు ఇంకేదో చెప్తూంటాయి- దీనితో కనెక్ట్ చేసేయాలి ప్రేక్షకుల్ని. పాత్రలు ఏం మాట్లాడుతున్నాయో దాని మీద సీను ఫోకస్ పెట్టకూడదు. అసలు ఏంతో అవసరమనుకుంటే తప్ప డైలాగుల జోలికి పోకూడదు. ‘మనం పేజీల్ని నింపాల్సిన అవసరమే లేదు, థియేటర్లో దీర్ఘ చతురస్రాకారంలో ఒక వెండితెర వుంటుంది - దాన్ని బొమ్మల కదలికలతో’ నింపాలి’ అని హిచ్ కాకే అన్నారు.
5. పాయింటాఫ్ వ్యూ ఎడిటింగ్
జిమ్మీ స్టీవార్ట్ కుక్కని చూస్తాడు, స్మైల్ ఇస్తాడు. జిమ్మీ స్టీవార్ట్ డ్రెస్ చేంజ్ చేసుకునున్న ఆవిణ్ణి చూస్తాడు, స్మైల్ ఇస్తాడు. ఈ రెండు స్మైల్స్ ఒకలాగే వున్నా వాటి అర్ధాలు పూర్తిగా వేర్వేరుగా వుంటాయి. డైలాగులతో వివరించకుండా పాత్ర మనుసులో ఒక ఐడియా పుట్టించడాన్ని పాయింటాఫ్ వ్యూ షాట్ సీక్వెన్స్ ద్వారా సాధించవచ్చు. దీన్ని సబ్జెక్టివ్ సినిమా అని అంటారు. నటుడి కళ్ళని చిత్రీకరించి, అవి చూసేందుకు ఓ దృశ్యాన్ని కలపడం...
-నటుడి క్లోజప్ తో మొదలెట్టండి.
-కట్ టు- నటుడు దేన్ని చూస్తున్నాడో దాని షాట్ చూపించండి.
-కట్ బ్యాక్ టు- నటుడి రియాక్షన్ షాట్ చూపించండి.
-వీటిని అవసరమైనన్ని సార్లు రిపీట్ చేయండి.
టెన్షన్ ని బిల్డప్ చేయడానికి ఎడిటింగ్ లో వీలైనన్ని సార్లు నటుణ్ణీ, దృశ్యాన్నీ మార్చి మార్చి ఎడిట్ చేయండి. ప్రేక్షకులకి బోరు కొట్టదు. ఇది చాలా శక్తివంతమైన సినిమా రూపం, నటన కంటే కూడా. ఇంకో మెట్టు పైకి తీసి కెళ్తూ - ఆ నటుణ్ణి చూస్తున్న దృశ్యం కేసి నడిపించండి. ట్రాకింగ్ షాట్ తో ఇది చూపిస్తే, అప్పుడు ప్రేక్షకులు ఆ నటుడి పర్సనల్ విషయమేదో షేర్ చేసుకోబోతున్నమని నమ్ముతారు. దీన్ని హిచ్ కాక్ ప్యూర్ సినిమా అన్నారు.
6. మాంటేజ్ తో కంట్రోల్
యాక్షన్ ని కొన్ని క్లోజప్స్ సిరీస్ గా విభజించండి. ఈ బేసిక్ టెక్నిక్ ని నిర్లక్ష్యం చేయకండి. ఇది ఫైట్ సీక్వెన్స్ లో కన్ఫ్యూజ్ క్రియేట్ చేయడానికి ఎడాపెడా షాట్లు వేయడం లాంటిది కాదు. జాగ్రత్తగా అరచేతి క్లోజప్, పూర్తి చెయ్యి క్లోజప్, ముఖం క్లోజప్, గన్ కింద పడిపోతున్న క్లోజప్ మొదలైనవి తీసుకుని, విషయం చెప్పడానికి తగువిధంగా వాటిని పేర్చండి. ఈ విధానంలో సంఘటనా క్రమంలోని వివిధ భాగాల్ని చూపుతూ టైం మీద కూడా కంట్రోల్ ని సాధించవచ్చు. అలాగే కొన్ని భాగాల్ని దాచిపెట్టి ప్రేక్షకుల్ని ఎక్కువ ఎంగేజ్ చేయవచ్చు కూడా. దీన్ని వెండి తెర మీంచి ప్రేక్షకుల మనస్సుల్లోకి భయాన్ని బదిలీ చేయడంగా గా హిచ్ కాక్ పేర్కొన్నారు. దీని కుదాహరణ ఆయన తీసిన ‘సైకో’. ఇందులో ప్రసిద్ధిపొందిన బాత్రూం మర్డర్ సీన్ లో, హింసని మరుగు పరచడానికి హిచ్ కాక్ మాంటేజ్ విధానాన్ని అనుసరించారు. హీరోయిన్ కి కత్తి తగలడం మన కెక్కడా కన్పించదు. క్విక్ ఎడిటింగ్ తో హింస జరిగిపోతోందన్న భావాన్ని క్రియేట్ చేశారు- దీంతో తెర మీద కనిపించని హత్య, ప్రేక్షకుల మనస్సులో జరిగిపోతూంటుంది – వాళ్ళూ
హించుకుని గజగజలాడి పోతారు (ఆడియెన్స్ కనెక్ట్ గురించి ఇంత గొప్ప రహస్యం చెప్పిన హిచ్ కాక్ కి చేతులు జోడించి నమస్కరిద్దాం- సి.) !!
బేసిక్ రూల్ : ఎప్పుడైనా ఏదైనా ముఖ్య సంఘటన జరుగుతున్నప్పుడు దాన్ని క్లోజప్ లో చూపించండి. ప్రేక్షకులు తప్పనిసరిగా చూసేలా దాన్ని హైలైట్ చేయండి.
7. కథ సింపుల్ గా చెప్పండి
మీ కథ కన్ఫ్యూజింగ్ గా వుంటే, లేదా కథలో చాలా విషయాల్ని కలుపుకుని జ్ఞాపకం ఉంచుకోవాల్సిన భారం మోపితే, మీ కథలో సస్పెన్స్ ని ఎన్నడూ మీరు నిర్వహించ లేరు. హిచ్ కాక్ చాలా సింపుల్ గా, ప్రేక్షకులు సులభంగా ఫాలో అయ్యేలా లీనియర్ కథలు (అంటే ఫ్లాష్ బ్యాకులు వుండని కథలు) తో సినిమాలు తీశారు. మీ స్క్రీన్ ప్లేలో సంఘటనా క్రమం ఒకదాని తర్వాత ఒకటిగా క్రమపద్ధతిలో వేగంగా, వీలైనంత ఎక్కువ డ్రమెటిక్ ఎఫెక్ట్ ని సాధించేలా తీర్చి దిద్దుకోండి. మీ స్క్రీన్ ప్లేలో కలుపు మొక్కల్ని ఏరి పారేసి సరళీకరించుకోండి. చెత్తనంతా తొలగించుకుని క్రిస్ప్ గా తయారు చేసుకోండి. ప్రతీ సీనులో ప్రేక్షకుల్ని కట్టిపడేసే అంశమొకటి వుండేలా చూసుకోండి.
8. మూస పాత్రలకి నో
ప్రేక్షకులు ఏం ఊహిస్తారో దానికి విరుద్ధంగా మీ పాత్రల్ని ప్రవేశపెట్టండి. పల్లెటూరి అమ్మాయిల్ని స్మార్ట్ గర్ల్స్ గా చూపించండి. క్యూబాకి చెందిన వాడికి ఫ్రెంచి యాస పెట్టండి. క్రిమినల్స్ ని రిచ్ ఫెలోస్ గా, సక్సెస్ ఫుల్ వ్యక్తులుగా చూపండి. మళ్ళీ వీళ్ళ ప్రవర్తనే దీనికి విరుద్ధంగా వుండేలా చెయ్యండి. అంటే ఒక క్రిమినల్ రిచ్ గా వుంటే, ఆ రిచ్ క్రిమినల్ రిచ్ మనుషుల్లాగా వేగంగా నిర్ణయాలు తీసుకోకుండా, మీన మేషాలు లెక్కించే వెధవలా పాత్ర చిత్రణ చేయండి. దీనివల్ల పాత్రలు మూస ఫార్ములా పాత్రల సంకెళ్ళు తెంపుకుని స్వేచ్ఛగా, స్వచ్ఛంగా వాస్తవికంగా కన్పిస్తూ ప్రేక్షకుల్ని ఎక్కువ ఎంగేజ్ చేస్తాయి. హిచ్ కాక్ క్రిమినల్స్ ని బాగా డబ్బున్న అప్పర్ క్లాస్ పెద్ద మనుషులుగా చూపించే వారు. దీంతో వీళ్ళ మీద ఎవరికీ అనుమానం వచ్చే అవకాశం వుండదు. హిచ్ కాక్ సినిమాల్లో పోలీసులూ పోలీటీషియన్లూ వెర్రి వెంగళప్పల్లా వుంటారు. అమాయకులు నిందితులై పోతారు. విలన్లు తప్పించుకునే వేషాలేస్తారు. కథనంలో ప్రతీ చోటా ఇలాటి పాత్రలు ఆశ్చర్య చకితుల్ని చేస్తూంటాయి మనల్ని.
9. హాస్యంతో టెన్షన్
ఓ కథ చెప్పాలంటే హాస్యం తప్పనిసరి అని హిచ్ కాక్ భావించే వారు. మీ హీరో మీద మీరే ప్రాక్టికల్ జోకు ప్లే చేస్తున్నట్టు భావించుకోండి. దాంతో చాలా ఇబ్బందికర పరిస్థితిలో అతణ్ణి ఇరికించండి. అది టెన్షన్ ని సృష్టిస్తుంది. హిచ్ కాక్ తీసిన ‘మార్నీ’ అనే థ్రిల్లర్ లో టిప్పీ హెడ్రెన్ ఆఫీసులో డబ్బు దొంగిలించి జారుకోబోతూ, పక్క రూంలో పని మనిషి వున్నట్టు గమనించి ఆగిపోతుంది. ఆ పని మనిషి గనుక చూస్తే తను దొరికిపోవడం ఖాయం. ఎటూ తోచక టిప్పీ అలా నిలబడిపోయి వుంటే, వంగి వంగి ఫ్లోర్ ని తుడుస్తూ పని మనిషి ముందు ముందుకు వచ్చేస్తూంటుంది. ఈ సన్నివేశంలో పుట్టే నవ్వే విపరీతమైన టెన్షన్ ని కూడా పుట్టిస్తుంది!
హిచ్ కాక్ వయసుమళ్ళిన స్త్రీ పాత్రల అమాయకత్వంతో చాలా హాస్యాన్ని నూరిపోసే వారు. ఆ వయసుమళ్ళిన స్త్రీ పాత్రలది ఎంత అమాయకత్వమంటే, ఎంచక్కా నేరం చేస్తున్న వాడికే ఓ చెయ్యేసి సాయపడతారు
10. ఇంటర్ కట్స్ తో టెన్షన్
పరస్పరం సంబంధం లేని రెండు సంఘటనల్ని ఒకేసారి ఇంటర్ కట్స్ లో
చూపిస్తూ టెన్షన్ పుట్టించండి. ప్రేక్షకుల
దృష్టి ఒకదాని మూవ్ మెంట్ పైనే కేంద్రీకృతమయ్యేట్టు చూడండి. దీని పైనుంచి దృష్టి చెదిరేట్టు రెండో దాని మూవ్ మెంట్స్ ని ఇంటర్ కట్స్ వేస్తూ
పోండి. సాధారణంగా రెండో సంఘటన ఇంటర్ కట్స్ కామెడీతో కూడుకుని వుంటాయి. దీనికి కథాపరమైన మొదటి సంఘటన ఇంటర్ కట్స్ తో ఏ
సంబంధమూ వుండదు. ‘మాన్ హూ న్యూ టూ మచ్’ లో
హోటల్ గదిలోకి అనుకోని అతిధులు
వచ్చినప్పుడు జిమ్మీ స్టీవార్ట్, డొరిస్ డే లు టెన్షన్ తో ఫోన్ లో మాట్లాడుకుంటూ
వుంటారు. జోకులేసుకుంటూ నవ్వుకుంటూ వచ్చే ఆ అనుకోని అతిధులతో ఈ సీన్లో రెండు
పరస్పర విరుద్ధ ఇంటర్ కట్స్ బిజినెస్ లు జరుగుతూంటాయి : ఒకటి సీరియస్ పరిస్థితితో,
రెండోది కామెడీ తో. ‘స్పెల్ బౌండ్’ లో ఇంగ్రిడ్ బెర్గ్ మాన్ తలుపు కింద నుంచి
వచ్చిన ఒక నోట్ తన కాళ్ళ కింద వున్నట్టు గమనిస్తుంది. ఆమె వంగి దాన్ని
అందుకోబోతూండగా, ఆమె ఫ్రెండ్ లోపలి కొచ్చి కన్పించకుండా పోయిన గ్రెగరీ పేక్
గురించి మాట్లాడుతూంటుంది. ఇద్దరి కాళ్ళూ ఆ నోట్ మీదే వుంటాయి. ఆ నోట్ గ్రెగరీ
పేక్ పంపిందే అని వాళ్ళు తెలుసుకోరు! చివరికేమిటంటే-- ప్రేక్షకులు వాళ్ళు
మాట్లాడుకుంటున్న మాటల మీదే ఎక్కువ దృష్టి
పెడతారు.
(స్క్రీన్ ప్లేలో, ఆ తర్వాత డైలాగ్ వెర్షన్ లో ఇలా గ్రాఫికల్ గా రాసుకుంటేనే రచయితకీ, దర్శకుడికీ వెండి తెర మీద జరిగే బిజినెస్ పట్ల ఒక స్పష్టత వుంటుంది షూట్ చేయడానికి. హిచ్ కాక్ రచయితతో కలిసి కూర్చునే ఇలా గ్రాఫికల్ గా స్క్రిప్టు తయారుచేసుకునే వారు. మనలాగా రచయితని వెళ్ళ గొట్టి, దర్శకుడిగా అది తన హక్కు అన్నట్టు ఇష్టానుసారం రాసుకోలేదు హిచ్ కాక్. మన దగ్గర లాగా రచయిత చేతులు కట్టుకుని తలూపే బాసిజం కూడా ప్రదర్శించే వారు కాదు హిచ్ కాక్. సెట్ లో ఏది ఎలా జరగాలో టేబుల్ పైనే పూర్తి చేసేవారు. అందుకే స్క్రిప్టు పూర్తవగానే 90 శాతం సినిమా పూర్తయ్యిందనే వారు, తీయడం 10 శాతం పనే అన్నట్టుగా. చివరి శ్వాస వరకూ ఈ పద్ధతిని దాటి పోలేదు - సి.)
11. సస్పెన్స్ అంటే ఇన్ఫర్మేషన్
సస్పెన్స్ కి ఇన్ఫర్మేషన్ చాలా అవసరమని హిచ్ కాక్ ఉవాచ. తెరమీద నటీనటులు చూడనిది ప్రేక్షకులకి చూపడమన్న మాట. కనుక తెరమీద నటీనటులకి ఏదయినా ప్రమాదం జరగబోతూంటే, దాన్ని సీను ప్రారంభంలోనే ప్రేక్షకులకి చూపించెయ్యండి. ఆ తర్వాత మామూలుగా సీను నడపండి. మధ్య మద్యలో ప్రమాద సూచనల్ని చూపిస్తూ పోతున్నప్పుడు సస్పెన్స్ పెరుగుతుంది. ఆ సస్పెన్స్ సదరు నటీనటులు ఫీలవ కూడదనే విషయం గుర్తు పెట్టుకోండి. ‘ఫ్యామిలీ ప్లాట్’ లో కారు బ్రేక్ ఫ్లూయిడ్ లీక్ అవుతోందని నటీనటుల కంటే ముందు ప్రేక్షకులకి చూపించేస్తారు. ‘సైకో’ లో విపరీత పోకడలున్న తల్లి గురించి ప్రేక్షకులకి తెలియజేస్తారు- విచారణ జరుపుతున్న డిటెక్టివ్ కి ఈ సమాచారం వుండదు. అప్పుడు ఆ ఇంట్లోకి డిటెక్టివ్ అడుగు పెట్టినప్పుడు విపరీతమైన సస్పెన్స్ ఏర్పడుతుంది- హిచ్ కాక్ మొత్తం కెరీర్ లో ఇది అత్యంత సస్పెన్స్ తో కూడుకున్న సీనుగా ప్రఖ్యాతి చెందింది. రియల్ సస్పెన్స్ ని పిండాలంటే మొదట ఆడియెన్స్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి తీరాలన్నది హిచ్ కాక్ పధ్ధతి.
(స్క్రీన్ ప్లేలో, ఆ తర్వాత డైలాగ్ వెర్షన్ లో ఇలా గ్రాఫికల్ గా రాసుకుంటేనే రచయితకీ, దర్శకుడికీ వెండి తెర మీద జరిగే బిజినెస్ పట్ల ఒక స్పష్టత వుంటుంది షూట్ చేయడానికి. హిచ్ కాక్ రచయితతో కలిసి కూర్చునే ఇలా గ్రాఫికల్ గా స్క్రిప్టు తయారుచేసుకునే వారు. మనలాగా రచయితని వెళ్ళ గొట్టి, దర్శకుడిగా అది తన హక్కు అన్నట్టు ఇష్టానుసారం రాసుకోలేదు హిచ్ కాక్. మన దగ్గర లాగా రచయిత చేతులు కట్టుకుని తలూపే బాసిజం కూడా ప్రదర్శించే వారు కాదు హిచ్ కాక్. సెట్ లో ఏది ఎలా జరగాలో టేబుల్ పైనే పూర్తి చేసేవారు. అందుకే స్క్రిప్టు పూర్తవగానే 90 శాతం సినిమా పూర్తయ్యిందనే వారు, తీయడం 10 శాతం పనే అన్నట్టుగా. చివరి శ్వాస వరకూ ఈ పద్ధతిని దాటి పోలేదు - సి.)
11. సస్పెన్స్ అంటే ఇన్ఫర్మేషన్
సస్పెన్స్ కి ఇన్ఫర్మేషన్ చాలా అవసరమని హిచ్ కాక్ ఉవాచ. తెరమీద నటీనటులు చూడనిది ప్రేక్షకులకి చూపడమన్న మాట. కనుక తెరమీద నటీనటులకి ఏదయినా ప్రమాదం జరగబోతూంటే, దాన్ని సీను ప్రారంభంలోనే ప్రేక్షకులకి చూపించెయ్యండి. ఆ తర్వాత మామూలుగా సీను నడపండి. మధ్య మద్యలో ప్రమాద సూచనల్ని చూపిస్తూ పోతున్నప్పుడు సస్పెన్స్ పెరుగుతుంది. ఆ సస్పెన్స్ సదరు నటీనటులు ఫీలవ కూడదనే విషయం గుర్తు పెట్టుకోండి. ‘ఫ్యామిలీ ప్లాట్’ లో కారు బ్రేక్ ఫ్లూయిడ్ లీక్ అవుతోందని నటీనటుల కంటే ముందు ప్రేక్షకులకి చూపించేస్తారు. ‘సైకో’ లో విపరీత పోకడలున్న తల్లి గురించి ప్రేక్షకులకి తెలియజేస్తారు- విచారణ జరుపుతున్న డిటెక్టివ్ కి ఈ సమాచారం వుండదు. అప్పుడు ఆ ఇంట్లోకి డిటెక్టివ్ అడుగు పెట్టినప్పుడు విపరీతమైన సస్పెన్స్ ఏర్పడుతుంది- హిచ్ కాక్ మొత్తం కెరీర్ లో ఇది అత్యంత సస్పెన్స్ తో కూడుకున్న సీనుగా ప్రఖ్యాతి చెందింది. రియల్ సస్పెన్స్ ని పిండాలంటే మొదట ఆడియెన్స్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి తీరాలన్నది హిచ్ కాక్ పధ్ధతి.
12. సర్ ప్రైజ్ ట్విస్టు
ప్రేక్షకుల్ని సస్పెన్సుతో కట్టి పడేశాక వాళ్ళూహించే ముగింపు
ఇవ్వకండి. బాంబుతో సస్పెన్స్ సృష్టిస్తే ఆ బాంబు పేలకూడదు. ప్రేక్షకులు
ఊహించుకున్తున్నట్టే దగ్గరిదాకా తీసికెళ్ళి తలకిందులు చేయండి – ఇది సర్ ప్రైజ్
ట్విస్టు.
***సమాప్తం***