ఇక ఎలాగూ గుడ్ రైటింగ్ కి
భరోసా ఇచ్చే సినిమాలుండవని మరోసారి తేలిపోయాక, బ్యాడ్ రైటింగ్ సినిమాలతోనే సర్దుకుపోయి -
బాక్సాఫీసు భరోసాకి బాధ్యత తీసుకుంటూ సినిమాలు చూడాలి. బ్యాడ్ రైటింగ్ సినిమాల్ని బతికిస్తూ
‘లో – నాలెడ్జి’ ని ప్రోత్సహించాలి. బ్యాడ్ రైటింగ్ కి వేసుకునే కథ - మాటలు -
స్క్రీన్ ప్లే లలోంచి స్క్రీన్ ప్లే తీసేసి, టెంప్లెట్ అని, ఆ పైన దర్శకత్వం బదులు
చాదస్తం అని క్రెడిట్స్ మార్చుకుని సినిమాలు చూడాలి. తెలుగు సినిమా కథ @ టెంప్లెట్
అని ఈజీగా సినిమా ఎలా వుంటుందో గుర్తుపట్టేసి, కుటుంబంతో ఓ వెయ్యి రూపాయలు త్యాగం
చేసి, ఓవర్సీస్ లోనైతే ఇంకెక్కువ డాలర్లు ధారపోసి వూహించిన అకృత్యాలే చూసొచ్చి మర్చిపోవాలి.
అవేవో వ్యాధుల పేర్లతో సినిమాలని చెప్పి రెచ్చగొట్టినా ఫర్వాలేదనుకుని చూసి, అంటు
వ్యాధులతో తిరిగి రావాలి. సినిమా ప్రారంభంలోనే చాదస్తంగా భస్మాసుర హస్తం కథ చెపుతూ
క్రూయెల్ జోకులాడినా అంతర్యం పసిగట్టలేక ఫూల్స్ అవాలి. సినిమా జానర్ మర్యాదతో
సంబంధం లేకుండా మధ్యలో ఉన్నట్టుండి సుభద్రా పరిణయమంటూ నాటకం జొప్పించినా ఆ
చోద్యమంతా చూసి ఆనందించాలి!
స్క్రీన్ ప్లేలనేవి అంతరించిపోయాక
టెంప్లెట్ తో బాటు సింగిల్ విండో స్కీము వుండేది. స్టార్లందరికీ అదే స్కీము. అందులో
ఏ స్టార్ అయినా ఆ సింగిల్ విండో లోంచి జారుడు బల్ల మీదుగా బర్రున జారుకుంటూ వెళ్లి,
సెకండాఫ్ లో అదే విలన్ ఇంట్లో అలాగే దభీల్మంటూ పడి, అవే ‘కన్ఫ్యూజ్ కామెడీలు’ చేసేలా
ఆడిందే ఆటగా ఆడించారు. ఈ క్రియేటివ్ రైటింగ్ రేటింగుల్లేక మూతబడినా టెంప్లెట్
వదలడం లేదు. ఏ కథయినా ఈ టెంప్లెట్ లో వుండాల్సిందే. ఎవరైనా ప్రముఖ రాజకీయ నాయకుడి బయోపిక్
అంటూ తీసినా, అదే టెంప్లెట్ లో ఆ రాజకీయ నాయకుడు బిగ్ యాక్షన్ తో ఎంట్రీ ఇస్తాడు.
ఆ వెంటనే వచ్చి పడిన డాన్సర్స్ తో గ్రూప్ సాంగేసుకుంటాడు. ఆ వెంటనే హీరోయిన్
కన్పించి లవ్ ట్రాక్ వేసుకుంటాడు. ఓ టీజింగ్ సాంగేసుకుంటాడు. లవ్ లో పడేసే
కామెడీలు చేస్తాడు. హీరోయిన్ లవ్ లో పడ్డాక ఆమెతో డ్యూయెట్ వేసుకుంటాడు. ఇప్పటికి
ఎంత టైము గడిచింది? గంట దాటింది. మూడు సాంగులు, ఓ ఫైట్, లవ్ ట్రాకు, కామెడీ
వచ్చాయా? వచ్చేశాయ్. ఇంటర్వెల్ కి ఇంకెంత టైముంది? ఐదు నిమిషాలే. అయితే విలన్ ని
దింపే టైమొచ్చింది. అప్పుడు విలన్ దిగి రాజకీయనాయకుడికి ఓ ఛాలెంజి విసురుతాడు.
రాజకీయ నాయకుడు ఏవో పంచ్ డైలాగులు కొడతాడు. ఇంటర్వెల్.
ఇంటర్వెల్లో రాజకీయ నాయకుడికీ విలన్ కీ మధ్య పుట్టిన యాక్షన్ కథ సెకండాఫ్ లో మొదలవుతుంది. రాజకీయ నాయకుడు విలన్ గ్రూపుతో ఫైట్ చేస్తాడు. హీరోయిన్ తో కామెడీ చేస్తాడు. హీరోయిన్ తో ఎడారిలాంటి కొండ ప్రాంతంలో బ్లాక్ కాస్ట్యూమ్ లో మెలోడీ సాంగేసుకుంటాడు. విలన్ గ్రూపుతో ఇంకో ఫైట్ చేస్తాడు. హీరోయిన్ తో ఇంకో సాంగేసుకుంటాడు. విలన్ గ్రూపుతో ఇంకో ఫైట్ చేస్తాడు. హీరోయిన్ తో జానపద కాస్ట్యూమ్స్ తో ఫోక్ సాంగేసుకుంటాడు. విలన్ తో క్లయిమాక్స్ ఫైట్ మొదలెడతాడు...
ఏ కథయినా, ఎలాటి కథయినా, ఈ వరసలో, ఇలాటివే స్లాట్స్ తో వుండాల్సిందే. ఇడ్లీ అయినా, దోశ అయినా, పూరీ అయినా, అదే ఇడ్లీ కుక్కర్లో వేసి అలాగే ఉడికించేయాల్సిందే. ఆల్రెడీ ఇలా కనిపెట్టేసిన ఇడ్లీ కుక్కర్ టెంప్లెట్ వుండగా, ఇక కథ రాయడానికి ఆలోచనలతో పనేలేదు. స్టార్ కో కొత్త గెటప్ సృష్టించి ఇందులోకి వదలడమే. మరి ఇలాటి టెంప్లెట్ మూస కథ ఇంటర్వెల్ దగ్గర చెప్పి మొదలెట్టేదైతే, ఫస్టాఫ్ అంతా వృధాగా హీరోయిన్ తో ఆ లవ్ ట్రాకుతో, ఇదే కథ అన్నట్టుగా ప్రేక్షకులని మిస్ లీడ్ చేయడమెందుకు? ఎందుకంటే ఫస్టాఫ్ ఖాళీని పూరించాలి కాబట్టి. ఇంటర్వెల్ దగ్గర మొదలయ్యే మూస కథనే ఓ గంట సినిమాగా చేసి చూపిస్తే నిడివి లేదని సెన్సార్ వాళ్ళు తిప్పి కొడతారు కాబట్టి. సెన్సార్ నిడివి కోసం ఫస్టాఫ్ స్పేస్ ఫిల్లర్ గా ఉత్తుత్తి లవ్ ట్రాక్ తో ప్రేక్షకులని మిస్ లీడ్ చేయక తప్పదన్న మాట. ఇలా సినిమాని రెండు ముక్కలు చేసి చూపించడం స్క్రీన్ ప్లే పేరుతో జరుగుతున్న స్కామ్ కాదా? స్క్రీన్ ప్లేలు ఎక్కడున్నాయి? ఏ ముక్కకా ముక్క ఏ స్లాట్ కా స్లాట్ లో వేసుకునే ఇడ్లీ కుక్కర్ టెంప్లెట్ వుండగా? అయితే హడావిడి పడి సినిమాకెళ్ళకుండా తీరిగ్గా ఇంటర్వెల్ టైముకి వెళ్లి కూర్చుంటే ఫస్టాఫ్ స్కామ్ ని, మన టైం వేస్టునీ తప్పించుకోవచ్చా? తప్పించుకుని సెకండాఫ్ లో ఆ మూస కథేంటోచూసి మనమూ బతికి, సినిమాల్నీ బతికించ వచ్చు. లివ్ అండ్ లెట్ లివ్. సినిమాలు మారి స్క్రీన్ ప్లేలు వస్తాయని ఎప్పుడూ ఆశించవద్దు. కొత్త టాలెంటులు కూడా టెంప్లెట్ నారాయణులే.
***
“సార్,
న్యూ కాన్సెప్ట్ సర్, ఎక్కడా రాలేదు”
“ఏంటీ?”
“ఈఈ సిండ్రోం మీద స్టోరీ సార్”
“ఈఈ సిండ్రోమా?”
“ఎడం కాలితో ఎనక్కి తంతాడు సార్”
“ఈజిట్? ఎక్కడుంది?”
“జంబుకా దేశంలో”
“అదెక్కడ?”
“కన్ఫ్యూషియా పక్కన”
“ఓ...సమ్మర్ కి నేనెళ్ళొచ్చాలే... సరే చెప్పు”
“లాలిపాటతో బుజ్జి బాబు పుడతాడు సార్...”
“ఇంకా పుట్టుక కాణ్ణించీ లాలిపాటల స్టోరీ లెందుకయ్యా?”
“చావు పుట్టుకలు ప్రతీ ప్రేక్షకుడి జీవితంలో వుంటాయి సార్, మీ ఫ్యాన్స్ తో కలుపుకుని. బాగా ఐడెంటిఫై చేసుకుంటారు”
“పుట్టుక వాళ్ళ చేతుల్లో లేదు, చావు నీ చేతుల్లో వుంది. నన్ను చూపించకుండా ఎవరో పిల్లల మీద టైం వేస్ట్ చేస్తే నాకెందుకు. సర్లే చెప్పు”
“టైటిల్ వచ్చేసి సవ్య పాదం సార్. టైటిల్స్ లో వామనుడు బలి చక్రవర్తి నెత్తి మీద కాలెట్టి పాతాళానికి తొక్కేసే సీనుంటుంది సార్. ఆ తర్వాత మీరు - అంటే - హీరో పుడతాడు. పుట్టగానే ఎడం కాలితో ఎనక్కి డాక్టర్ని తంతాడు. డాక్టర్ పరీక్షించి ఈఈ సిండ్రోం అని తేలుస్తాడు. బుజ్జిబాబు స్కూల్లో చేరి ఎడం కాల్తో తంతుంటాడు. హీరోగా ఎదిగి మాఫియా గ్యాంగ్ తో ఫైట్ చేసి గ్రూప్ సాంగ్ తో సెలెబ్రేట్ చేసుకుంటాడు. ఈఈ సిండ్రోం మీద ర్యాప్ సాంగ్ సార్, సిడ్నీలో తీస్తాం. కాలేజీలో చేరి హీరోయిన్ని తంతుంటాడు. కామెడీ చేస్తాడు. తంతూనే టీజింగ్ సాంగేసుకుంటాడు. కామెడీ చేసి లవ్ లో పడేసుకుంటాడు. ఒక డ్యూయెట్ యేసుకుంటాడు. ఇక తన్నడం మానేస్తాడు. దూరంగా ఈదుర్లంక హీరో వూరు సార్. అక్కడ ఫ్యామిలీని మాఫియా ఎటాక్ చేసి చంపేస్తాడు. హీరో మరదల్ని కిడ్నాప్ చేస్తాడు. ఇంటర్వెల్ సార్”
“ఇందులో కథెక్కడుంది?”
“మరదలి కోసం సెకండాఫే కథ సార్”
“కథ ఈఈ సిండ్రోం మీద కాదా?”
“ఈఈ సిండ్రోం మీ క్యారక్టర్ ఇంట్రడక్షన్ కోసం వాడి వదిలేస్తాం సార్. ఎవరైనా ఇంతే చేస్తారు”
“ఇంటర్వెల్లో వాడు మాఫియా అని తెలీక నేను డాంకీలా వాణ్ణి ఎడం కాల్తో లాగి ఎనక్కి రెండుసార్లు కిక్కివ్వడమే కథైతే? వాడు నా మీద పగబడితే? ఈఈ సిండ్రోంతో లెఫ్ట్ లెగ్గు సెకండాఫ్ లో ప్లే అవుతూంటుంది కదా? పైగా డాంకీ లైవ్ గా ఎంటర్టైన్ మెంట్ ప్లస్సవుతుంది. ఆలోచించు. సింపుల్ గా చెప్తా, ‘జో సమ్ బడీ’ చూశావా? అందులో బలహీనుడైన టిమ్ అలెన్ తన కూతురి ముందు బలవంతుడు కొట్టాడని అవమానం తట్టుకోలేక, కూతురి ముందే వాణ్ణి కొట్టాలని బలవంతుడుగా మారేందుకు స్ట్రగుల్ చేస్తాడు...కష్టపడి రకరకాల విద్యలు నేర్చుకుని వాణ్ని పబ్లిక్ లో కొట్టి పడగొడతాడు. ఎత్తుకున్న పాయింటు మీద నడిచే ఈ ఎమోషనల్ మూవీ సూపర్ హిట్టయ్యింది. ఎత్తుకున్న పాయింటుని వదిలేస్తా నంటావేంటి? మరోసారాలోచించు”
“కష్టం సార్. లోకల్ ఆడియెన్స్ కిది సరిపోతుంది. వాళ్ళు ఫస్టాఫ్ ఒకలా, సెకండాఫ్ డిఫరెంట్ గా ఇంకోలా వుండాలని ఎందుకో కోరుకుంటారు. సెకండాఫ్ లో అంతకన్నా ఇంటరెస్టింగ్ ప్లే వుంటుంది...మరదల్ని కిడ్నాప్ చేసిన మాఫియా ఎవరో తెలీక హీరో స్ట్రగుల్ అవుతూంటాడు. హైడింగ్ లో వున్న మాఫియా మైండ్ గేమ్స్ మొదలెడతాడు. కురుక్షేత్రం సార్. లేకపోతే చక్రవ్యూహం. మైండ్ గేమ్స్ తో మాఫియా సైంధవ వ్యూహం పన్నుతాడు. దీన్నిహీరో సూపర్ బ్రెయిన్ తో టాకిల్ చేసి మాఫియాని క్యాచ్ చేస్తాడు. మరదల్ని సేవ్ చేసుకుంటాడు”
“రియల్లీ? ఇప్పుడు మైండ్ బ్లోయింగ్ గా వుంది. బోయింగ్ - 747 ఫ్లయిట్ లా హాట్ హాట్ గా వుంది”
“థాంక్యూ సార్”
“బౌండెడ్ స్క్రీన్ ప్లే రాస్కో!”

బౌం
‘డెడ్’ స్క్రీన్ ప్లే, బ్రెయిన్ డెడ్ టెంప్లెట్ గా రూపం దాల్చి అవతరించింది. వెయ్యి
థియేటర్లలో వెలుగు చూసింది. వెలుగు చూసేది సినిమాలు కాదు, టెంప్లెట్ బైండింగుల బ్యాడ్
రైటింగ్ బండారాలే. పొద్దున్నే టాక్ బాంబ్ ఎటాక్ లా వచ్చింది. హిట్టవ్వాల్సింది
హిరోషిమా ఎందుకయ్యిందో అర్ధంగాలేదు. ఎలా అర్ధమవుతుంది, బోయింగ్ -747 లా వేడి వేడిగా
అన్పించిన స్టోరీలో తను నటించింది ఫక్తు చల్లారిన పాసివ్ పాత్ర అని స్టార్ కి తెలిస్తేగా?
స్టార్ కేం తెలుసు - పాసివ్ పాత్రంటే ఏమిటో, యాక్టివ్ పాత్రంటే ఏమిటో; ఏది తన విజయానికి
అవసరమో ఏం తెలుసు? పాసివ్ పాత్రలతో పదుల సంఖ్యలో సినిమాలు అట్టర్ ఫ్లాపవుతున్నాయని
ఎప్పుడు తెలుస్తుంది? యాక్టింగ్ స్కూల్లో యాక్టింగే నేర్పుతారు గానీ, యాక్టివ్
పాత్రలే వుండేలా చూసుకోవాలనీ, పాసివ్ పాత్రల్ని తిప్పి కొట్టాలనీ చెప్పరుగా? యాక్టింగ్
కోర్సులకి స్క్రీన్ ప్లే సంగతులతో సమన్వయం వుంటేగా?
అసలు ఇంటర్వెల్లో విలన్ వచ్చి ఛాలెంజి చేస్తే, హీరో ఎదురుగా వుండకపోవడమే కదా పాసివ్ పాత్రకి చక్కగా పడిన ముళ్ళ బాట. ఇంటర్వెల్లో విలన్ పాయింటు చెప్పకుండా, ఈ కథేమిటో చెప్పకుండా, ఎందుకు ప్రతీకారం తీర్చుకుంటానంటున్నాడో విప్పకుండా ఇంటర్వెల్ వేసుకుని వెళ్లిపోయినప్పుడే కదా, కథ ఇంకా మొదలవలేదని తేలింది. ఇంటర్వెల్లో కూడా కథేమిటో తెలీకపోతే ప్లాట్ పాయింట్ వన్ ఇంకా రానట్టే కదా? అంటే మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే –టెంప్లెట్ - అనే కదా? క్లయిమాక్స్ లో ఆ విలనే చెప్పే వరకూ ఇదంతా ఎందుకు జరుగుతోందో కారణం తెలీదు, కథా తెలీదు హీరోకి. ఏదీ తెలీక దిక్కుతోచని పరిస్థితుల్లో సెకండాఫ్ మొత్తం విలన్ ఆడించినట్టూ ఆడే ‘గొప్ప కథానాయకుడు’ అయ్యాడు.
అంటే టెంప్లెట్స్ కి కథ కూడా చేతకాదన్న మాట. తన పాసివ్ పాత్రతో బాటు, ఎండ్ సస్పెన్స్ బాపతు అట్టర్ ఫ్లాప్ చేసే కథా తన ఆశల్ని హిరోషిమా చేశాయని ఎలా తెలుస్తుంది స్టార్ కి? ఉన్న పాసివ్ పాత్రల ఫ్లాప్స్ కి తోడూ, ఎండ్ సస్పెన్స్ కథలూ డజన్ల సినిమాల్ని మట్టి కరిపించాయనీ ఇంకెప్పుడు ఎలా తెలుస్తుంది?
ఇంత బ్యాడ్ రైటింగ్ కి భరోసాగా బిగ్ కమర్షియల్స్ కూడా కోట్లు పోగొట్టుకుంటూ వుంటే, వంద రూపాయల టికెట్ ఓ లెక్కా? బ్యాడ్ రైటింగుకు ఇలాగే వుండాలి, టికెట్లూ ఇలాగే తెగాలి.
―సికిందర్