రచన –దర్శకత్వం : జి. శ్రీనివాసన్
తారాగణం: విజయ్ ఆంథోనీ, డయానా చంపిక, మహిమా, జ్వెల్ మారీ, రాధా రవి, కాళీవెంకట్ తదితరులు
మాటలు- పాటలు : భాష్యశ్రీ
సంగీతం : విజయ్ ఆంథోనీ, ఛాయాగ్రహణం: కె.దిల్ రాజ్
బ్యానర్స్ : ఎన్.కె.ఆర్.ఫిలింస్, ఆర్.స్టూడియోస్, విజయ్ ఆంటోని ఫిలిం కార్పొరేషన్
నిర్మాతలు: రాధిక శరత్‌కుమార్, ఫాతిమా విజయ్ ఆంటోని, నీలం కృష్ణారెడ్డి
విడుదల : నవంబర్ 30, 2017
***
నటుడు - సంగీత దర్శకుడు విజయ్ ఆంథోనీ ‘బిచ్చగాడు’ హిట్ తర్వాత చేసిన రెండూ - యమన్, బేతాళుడు – అనే సైకలాజికల్ లు వర్కౌట్ కాకపోవడంతో, తిరిగి ‘బిచ్చగాడు’ టైపు సెంటిమెంట్ల పంట వైపు యూ టర్న్ తీసుకుని ‘ఇంద్రసేనుడు’ నటించాడు. ‘బిచ్చగాడు’ మదర్ సెంటి మెంటయితే, ఇది ఫ్యామిలీ సెంటిమెంటు. పైగా ద్విపాత్రాభినయం. జి. శ్రీనివాసన్ అనే దర్శకుడు. తమిళంలో ‘అన్నదురై’ గా విడుదలైన ఇది ఏమాత్రం తెలుగు ప్రేక్షకులకి దగ్గరగా వుందో చూద్దాం...
తారాగణం: విజయ్ ఆంథోనీ, డయానా చంపిక, మహిమా, జ్వెల్ మారీ, రాధా రవి, కాళీవెంకట్ తదితరులు
మాటలు- పాటలు : భాష్యశ్రీ
సంగీతం : విజయ్ ఆంథోనీ, ఛాయాగ్రహణం: కె.దిల్ రాజ్
బ్యానర్స్ : ఎన్.కె.ఆర్.ఫిలింస్, ఆర్.స్టూడియోస్, విజయ్ ఆంటోని ఫిలిం కార్పొరేషన్
నిర్మాతలు: రాధిక శరత్‌కుమార్, ఫాతిమా విజయ్ ఆంటోని, నీలం కృష్ణారెడ్డి
విడుదల : నవంబర్ 30, 2017
***
నటుడు - సంగీత దర్శకుడు విజయ్ ఆంథోనీ ‘బిచ్చగాడు’ హిట్ తర్వాత చేసిన రెండూ - యమన్, బేతాళుడు – అనే సైకలాజికల్ లు వర్కౌట్ కాకపోవడంతో, తిరిగి ‘బిచ్చగాడు’ టైపు సెంటిమెంట్ల పంట వైపు యూ టర్న్ తీసుకుని ‘ఇంద్రసేనుడు’ నటించాడు. ‘బిచ్చగాడు’ మదర్ సెంటి మెంటయితే, ఇది ఫ్యామిలీ సెంటిమెంటు. పైగా ద్విపాత్రాభినయం. జి. శ్రీనివాసన్ అనే దర్శకుడు. తమిళంలో ‘అన్నదురై’ గా విడుదలైన ఇది ఏమాత్రం తెలుగు ప్రేక్షకులకి దగ్గరగా వుందో చూద్దాం...
కథ
నూజివీడులో ఇంద్రసేన, రుద్రసేన కవల
సోదరులు. ఇంద్రసేన ప్రియురాలు చనిపోయిన
బాధతో తాగుతూంటాడు. రుద్రసేన స్కూల్లో పీఈటీగా పనిచేస్తూంటాడు. తండ్రికి బట్టల షాపు
వుంటుంది. అతను స్థానిక వర్తక సంఘం అధ్యక్షుడు. తల్లి ఇంద్రసేనని పెళ్లి చేసుకోమని
పోరుతూంటుంది. రుద్రసేన కి ఓ వ్యాపారి కూతురి సంబంధం వస్తుంది. ఇంద్రసేనకి కూడా
సంబంధం చూడాలని తమ్ముడి కూతుర్ని అడిగి అవమాన పడుతుంది తల్లి. పెళ్లి ఇష్టం లేని ఇంద్రసేన
తల్లి బాధ పట్టించుకోడు. వూళ్ళో అతడికి మంచి పేరుంటుంది. ఒక స్నేహితుడికి అప్పు
కావాల్సి వస్తే హామీగా వుండి వడ్డీ వ్యాపారి దగ్గర ఆరు లక్షలు ఇప్పిస్తాడు. తీరా తనే
ఇరుక్కుంటాడు. ఓ రోజు తాగుడు మానేసి పెళ్లి చేసుకుంటానని తల్లికి మాటిచ్చి,
చివరిసారిగా బార్ కి వెళ్తాడు. అక్కడ తాగిన మత్తులో ప్రమాదవశాత్తూ ఒకడు తన చేతిలో
చనిపోతాడు. శిక్షపడి ఏడేళ్ళు జైలుకి పోతాడు.
విడుదలై వచ్చి చూస్తే, కుటుంబం చెల్లా చెదురై పోయి వుంటుంది. తండ్రి షాపు వడ్డీ వ్యాపారి లాగేసుకున్నాడు. తమ్ముడు రుద్రసేన చైర్మన్ కోటయ్య తరపున హత్యలు చేసే గూండా లీడర్ గా కనిపిస్తాడు. తల్లిదండ్రులు తలెత్తుకోలేక బతుకుతూంటారు. దీనికంతటికీ కారకుడు తనే అని గ్రహిస్తాడు. ఈ పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు పూనుకుంటాడు...
ఎలావుంది కథ
ఎక్కడా
రాజీపడకుండా వాస్తవిక ధోరణిలో సాగే కథ. సరైన బాధ్యతతో ప్రవర్తించకపోతే, ఒక్కడి వల్ల మొత్తం కుటుంబమెలా
అధోగతి పాలవుతుందో తెలిపే కథ. ఇంట్లో మంచి – బయట మంచి రెండూ బ్యాలెన్స్ అవకపోతే
బయటి మంచి కొంప ముంచేస్తుందని చెప్పే కథ. సొంత బాధ సాకు చూపి తనపట్ల తనకే బాధ్యత
లేనట్టు తిరిగితే, అది మొత్తం కుటుంబానికే శని పట్టేలా చేస్తుంది. దీనికి ఎలాటి మూస
ఫార్ములా చిత్రణల జోలికిపోకుండా, టౌను వాతావరణంలో కల్పించిన రాజకీయ, పోలీసు
యంత్రాంగ వాస్తవిక నేపధ్యం బలమైన నిర్ణాయక శక్తిగా అమరింది. సొంత బాధ్యతలు
మర్చిపోతే ఇతర శకట్లు నిర్ణయిస్తాయి జీవితాల్ని.
ఎవరెలా చేశారు
అన్న
దమ్ముల రెండు పాత్రల్లో విజయ్ ఆంథోనీ రూపంలో కాస్త మార్పు తప్ప, ఆలో చనల్లో తేడా
తప్ప - మాట, చూపు, ముఖభావాలు ఒక్కటే. ఇదంతా సీరియెస్సే. అన్న అనుకోకుండా ఒకడి
చావుకి కారణమై జైలుకి పోయాడు, దాని పరిణామాల్లో తమ్ముడు నేరస్థుడయ్యాడు. ఐతే ఈ
పరిస్థితిని చక్క దిద్దే అన్న ప్రయత్నం ఏకపక్షమై పోయింది. దీంతో తమ్ముడికే సంబధం
లేకుండా, ఇద్దరి మధ్య వైరుధ్యాల సమరం లేక,
అమితాబ్ బచ్చన్ – శశి కపూర్ ల మధ్య వున్నట్టు
ఒక ‘దీవార్’ మూమెంట్ లాంటిది లేకుండా, చప్పగా
సాగిపోతుంది. తమ్ముడికి తెలియకుండా అతడి
కోసం అన్న చేసి పోయే త్యాగంతో ఆ పాత్ర ముగుస్తుంది. పాత్ర చిత్రణ లెలా వున్నా,
ఫార్ములా కమర్షియల్ పాత్రల్లాగా కృత్రిమ, పైపై భావోద్వేగాలతో కాకుండా, పాత్రల
లోతుల్లోంచి సహజ నటనతో, బలమైన ముద్ర వేస్తాడు ఆంథోనీ. అతడి బలం ఇలాటి
పాత్రలే, మూస కమర్షియల్ పాత్రలు కాదు.
హీరోయిన్లు వున్నారు గానీ బాగా లావై పోయారు. మళ్ళీ నమితని చూస్తున్నామా అన్నట్టున్నారు. విలన్ ఎమ్మెల్యేగా రాధారవి ఇలాటి రియలిస్టిక్ సినిమాలకి ఒక ఎసెట్ గా మారాడు. మిగిలిన అన్ని పాత్రల్లో అందరూ మూస నటననల పాలవకుండా తమ ప్రతిభల్ని కాపాడుకున్నారు. ఇందులో రియలిస్టిక్ యాక్షన్ దృశ్యాలు అత్యంత బలంగా –షాకింగ్ గా వున్నాయి. పాటల్ని ఒక డ్రీం సాంగ్ కి, ఒక థీమ్ సాంగ్ కి పరిమితం చేశారు. కెమెరా వర్క్ డార్క్ షేడ్స్ తో డెప్త్ ని తీసుకొచ్చింది.
చివరికేమిటి
రియలిస్టిక్
అంటే అన్నీ రియలిస్టిక్ గా వుండాలని కాదు. ఒక్క ఫైట్స్ లలో మాత్రమే పంచ్ వుండి, ఇతర సన్నివేశాల్లో పంచ్ మిస్ అయి, పాత ఆర్ట్ సినిమాల చిత్రీకరణలా వుండాలని కాదు. కథ మాత్రమే పవర్ఫుల్ అన్పిస్తూ, కథనంలో
సన్నివేశాలు పవర్ పంచ్ తో లేకపోతే టీవీ సీరియల్
అవచ్చు. ఇదేమీ మతిమాలిన ‘లైటర్ వీన్’ ప్రేమకథ కాదు. బార్ లో హీరో చేతిలో ఒకడు అనుకోకుండా
చనిపోయే దృశ్యం, సరైన ఎఫెక్టివ్ షాట్స్ తో
లేక – ఓ క్లోజప్ వేసి తీసేస్తే, పేలవంగా తయారయ్యింది. ఇంత ‘లైటర్ వీన్’ ప్లాట్ పాయింట్
వన్ తో కథనానికి ఏం బలం వస్తుంది. సన్నివేశాల్లో
పంచ్ లేకపోవడం వల్ల ఇంకో నష్టమేమిటంటే, కథనం
స్పీడు తగ్గి, చాలా నిదానంగా ఒక్కో సన్నివేశం
కదలడం. రియలిస్టిక్ కథకైనా స్పీడుగా సాగే డైనమిక్సే అవసరం.
ఇది పూర్తిగా ఆలోచనాత్మక కథ, ఎలాటి వినోదాన్నీ ఆశించకూడదు. కుటుంబ దృశ్యాల్లో శోకమైనా, అందరి జీవితాల్లో విషాదమైనా యాక్షన్ అనే కమర్షియల్ ఎలిమెంట్ తోనే చూపించారు. ఈ మొత్తం వ్యవహారంలో అర్ధం లేని పాత్ర చిత్రణలు, కథనం లేవు. స్ట్రక్చర్ ని, జానర్ మర్యాదని గౌరవించారు. ముఖ్యంగా ద్వితీయార్ధం కథ సాంద్రత పెరుగుతుంది. ముగింపూ గుర్తుండేలా వుంటుంది.
-సికిందర్
https://www.cinemabazaar.in
https://www.cinemabazaar.in