రచన- దర్శకత్వం : మారుతి
తారాగణం: నాని, లావణ్యా త్రిపాఠి, నరేష్, మురళీ శర్మ, అజయ్, ప్రవీణ్, వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డి,
సితార, స్వప్న మాధురి తదితరులు
సంగీతం: గోపీ సుందర్, ఛాయాగ్రహణం: నిజార్ షఫీ, బ్యానర్ : జీఏ2 పిక్చర్స్, యువి క్రియేషన్స్
సమర్పణ : అల్లు అరవింద్,
నిర్మాత : బన్నీ వాస్
విడుదల : సెప్టెంబర్ 4, 2015
సితార, స్వప్న మాధురి తదితరులు
సంగీతం: గోపీ సుందర్, ఛాయాగ్రహణం: నిజార్ షఫీ, బ్యానర్ : జీఏ2 పిక్చర్స్, యువి క్రియేషన్స్
సమర్పణ : అల్లు అరవింద్,
నిర్మాత : బన్నీ వాస్
విడుదల : సెప్టెంబర్ 4, 2015
దర్శకుడు
మారుతీ సరైన దారిలో పడ్డారు. 5d నుంచి 6k కి
సాగించిన ప్రయాణంలో ‘కొత్త జంట’ ప్రేమాయణం బ్రేకేసినా, ఇప్పుడు ‘భలే భలే
మగాడివోయ్’ తో సెన్సిబుల్ కామెడీకి ప్రయత్నించి నిలదొక్కుకున్నారు. ఇక్కడ్నించీ
పెద్ద హీరోల వైపు గనుక ప్రయాణం వుంటే, ఇలాటి
క్లీన్ కామెడీని నమ్ముకున్నప్పుడే టేస్టున్న
ప్రేక్షకుల అభిమానం కూడా పొందేందుకు అప్ గ్రేడ్ అయినట్టవుతుంది.
హీరో నాని అటూ
ఇటూ దారి తప్పి ఇప్పుడు సరైన మార్గంలో పడ్డట్టయింది. పెద్ద హీరోలకి యాక్షన్
సినిమాలు తప్పవు. తనలాంటి యంగ్ హీరోలకే చాలా వెరైటీని అందించే అవకాశముంటుంది. ఈ
అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మూస నుంచి ఉపశమనం కల్గిస్తే, బ్రహ్మరధం పడతారు
ప్రేక్షకులు - ఇప్పుడు తనకి పడుతున్న బ్రహ్మరధం లాగే.
సైంటిస్టుల
మతిమరుపు పైన చాలా జోకులే వున్నాయి. వాళ్ళు సైంటిస్టు లయ్యాక మతిమరుపు
మహానుభావులుగా తయారై వుంటారు. కానీ పుట్టుకతో మతిమరుపు వున్నవాడే సైంటిస్టు అయిన
దృష్టాంతం ప్రపంచంలో ఎక్కడా ఉండక పోవచ్చు. చిన్నప్పట్నించీ ఏదీ గుర్తుండని వాడు
సైంటిస్టు ఎలా అయ్యాడబ్బా అన్న అనుమానం పీడించకుండా, దర్శకుడు మొదటే ఒక హిచ్ కాక్
కొటేషన్ వేశాడు- డ్రామా అంటూ మొదలయ్యాక లాజిక్ అనేది అంతమవుతుందని. నిజమే,
ఏ లాజిక్కూ ఉండనవసరం లేనిది కామెడీకే.
అబ్సర్డ్ ( అసంబద్ధ) కామెడీ అనే ఉపశాఖ ఇలాగే పుట్టింది. ‘గోల్ మాల్’
సిరీస్ సినిమాలు ఇలాగే వచ్చాయి. అసంబద్ధమని కాదుగానీ, వ్యాపారబద్ధంగా, రొటీన్ యాక్షన్
కామెడీలకి దూరంగా - ఈ కాలక్షేప కామెడీ ఎలా
వుందో ఓసారి చూద్దాం..
మతిమరుపుతో ప్రేమాట!
పాండురంగారావు
ఒక సైంటిస్టు. కూతురి కోసం సంబంధాలు చూస్తూంటాడు. స్నేహితుడు ఆంజనేయులు ( నరేష్)
కొడుకు లక్కీయే ఉన్నాడని తెలుసుకుని అతణ్ణి కలవడానికి ప్రయత్నిస్తాడు. ఒక వ్యవసాయ
క్షేత్రంలో జూనియర్ సైంటిస్టు అయిన లక్కీ (నాని) మతిమరుపు కుర్రాడు. మెమరీకీ
అటెన్షన్ కీ మధ్య లింకులేక ఏదీ గుర్తుండదు. ఒక పని చేస్తున్నప్పుడు ఫోన్ కాల్
వచ్చిందంటే ఆ చేస్తున్న పని మీంచి డైవర్ట్ అయిపోయి కాల్ తీసుకుని ఎటో వెళ్ళిపోతాడు. ఇవతల ఆపనీ , ఆ పనికోసం
వచ్చిన వాడూ దిక్కులు చూడాల్సిందే. పాండురంగా రావుకి రెండు సార్లూ ఇదే అనుభవమై విరక్తి
పుడుతుంది. జన్మలో మొహం చూపించొద్దని వెళ్ళిపోతాడు. అలా బంగారం లాంటి సంబంధం
తప్పిపోతుంది.
కానీ బంగారం
లాంటి అమ్మాయి నందన (లావణ్యా త్రిపాఠి) కంట పడుతుంది. డాన్స్ స్కూల్లో పిల్లలకి
డాన్సు నేర్పే నందన తో ప్రేమలో పడ్డాకా తన మతిమరుపు బయటపడకూడదని నానా తిప్పలు
పడుతూంటాడు లక్కీ. ప్రతిసారీ మతిమరుపుని కప్పి పుచ్చుతూ అతడిచ్చే వివరణల్ని నమ్మేస్తూంటుందామె. ఆమె సంఘ
సేవిక కూడా. ఓ చిన్న పిల్ల ప్రాణాలు కాపాడిన అతడిమీద అప్పుడే ప్రేమ పుడుతుంది.
ప్రేమ పుట్టాక తండ్రికి చెప్పేస్తుంది. ఆ తండ్రి ఎవరో కాదు, ఏ లక్కీ పేరెత్తితే
ఒంటి కాలి మీద లేస్తాడో ఆ సైంటిస్టు పాండు రంగారావే.
ఇది తెలుసుకున్న లక్కీ గుండెల్లో
రైళ్ళు పరిగెత్తి పాండురంగారావుని తప్పించుకుని, తన ఫ్రెండ్ ( వెన్నెల కిషోర్ ) ని
లక్కీ పేరుతో ముందుకు తోసి కొత్త డ్రామాకి తెర తీస్తాడు. ఈ ఫ్రెండే లక్కీ
అనుకుంటున్న పాండురంగారావు, కూతురి రికమెండేషన్ తో ఇక తప్పక లక్కీని తన దగ్గర
పనిలో పెట్టుకుంటాడు. ఇంకోవైపు నందనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్న ఎస్సై అజయ్ ( అజయ్) లక్కీ
ఆడుతున్న గేమ్ ని రట్టు చేయాలని రంగంలోకి దిగుతాడు. ఈ గందరగోళం రానురానూ లేనిపోని
మలుపులకి దారితీసి - పాపం పండే ఘట్టం వస్తుంది
లక్కీకి...
కామెడీ ఆఫ్
ఎర్రర్స్, తెలుగులో అంటున్న ‘కన్ఫ్యూజ్ కామెడీ’- ఏదైనా కావొచ్చు- వీటి ఆధారంగా
నడిపిన ఈ కామెడీ ఇలాటి మరికొన్ని క్యారక్టర్ ఓరియెంటెడ్ కామెడీలకి దారితీయొచ్చు.
ఎవరెలా చేశారు
కామెడీకి డిమాండ్ పెరిగిపోయి హీరోలే కమెడియన్ లైపోయాక పూర్తి స్థాయి కామెడీ పాత్రలు కాక యాక్షన్ కామెడీల్లో భాగంగా, ఓ కమెడియన్ని వెంటేసుకుని కామెడీ చేయడంతో సరిపెట్టేస్తున్నారు. కామెడీ పాత్ర అంటే యాక్టివ్ పాత్ర మాత్రమే కాక - అదనంగా భౌతికంగా టైమింగ్, మానసికంగా అబ్ నార్మల్ బిహేవియర్ అనే విలువలూ జోడించి వుంటాయి కాబట్టి- యాక్షన్ హీరో పాత్రలకంటే కూడా సంక్లిష్టం గా వుంటాయి కామెడీ పాత్రలు. ఈ దృష్ట్యా ఒక హీరో యాక్షన్ కామెడీల్లో నటించడం వేరు- ఒక పూర్తి స్థాయి కామెడీ పాత్ర నటించడం పూర్తిగా వేరు. నాని ఈ రెండోది సాహసోపేతంగా చేశాడు. చేసిన దాంతో చివరంటా సినిమాని నిలబెట్టాడు.
అతని టైమింగ్, మతిమరుపు పాత్రలో పరకాయ ప్రవేశం -ఈ రెండూ మొట్ట మొదటిసారిగా అతడిలో టాలెంట్ ఏ స్థాయిలో వుందో బయటపెట్టాయి. అతడి మతిమరుపు తో కూడిన ఏ సిట్యుయేషనూ మామూలుగా లేదు. ఏ బిట్ కూడా పెద్ద యెత్తున ప్రేక్షకుల నుంచి కేరింతల్ని రాబట్టకుండా వృధా పోలేదు. సాధారణంగా అలాటి ఓ రెండు మూడు సన్నివేశాలు పే లాక, అక్కడ్నించీ రిపీటీషన్ బారిన పడి తేలిపోతూంటాయి అలాటి కామెడీ దృశ్యాలు. కానీ ఇక్కడ కథనం రిపీటెడ్ యాక్షన్ ప్లాట్ గా వుంది, ‘గ్రౌండ్ హాగ్ డే’, ‘రన్ లోలా రన్’ ల లాంటి పాపులర్ సినిమాల ధోరణిలో.
అంతేగాక, నాని పాత్ర చేతిలో ప్రతీ పది
నిమిషాలకో ‘వామ్మో’ ప్రేక్షకుల్లో హోరేత్తిస్తూనే పోతుంది. హాలీవుడ్
కంపెనీ ‘సినీమోబైల్’ బాస్, ‘బేవర్లీ
హిల్స్ కాప్’ హిట్ సిరీస్ సినిమాల నిర్మాత,
ఫువాద్ సయీద్ తరచూ ఒక మాట వాడుతూండే వాడు.
ఆయనకి అంతగా సినిమా పరిజ్ఞానం వుండేది కాదు. కానీ సినిమాలో ఏముంటే హిట్టవుతుందో
బాగా తెలుసు- అదే వామ్మో( Whammo = immense energy; vigor). సినిమాలో
ప్రతీ పది నిమిషాలకోసారి ఈ ‘వామ్మో’ తో
కూడిన సీను పడాలని పట్టుబట్టేవాడు. సరీగ్గా
ఇలాటి ‘వామ్మో’ తో కూడిన సీన్లే ఏంతో.. ఏంతో.. కాలం తర్వాత, ఓ తెలుగు సినిమాలో అదీ నానీ చేతిలో- ప్రతీ పది నిమిషాలకో సారి ఎడాపెడా పేలింది!
పేలిన ప్రతీసారీ క్యారక్టర్ ఆర్క్ లేస్తూ పోయింది.
ఈ మధ్యకాలంలో ఏ
హీరో కూడా వన్ మాన్ షోగా సినిమా మొత్తాన్నీ ప్రేక్షకుల్ని అన్ లిమిటెడ్ గా ఎంటర్ టైన్ చేస్తూ లాక్కు పోలేదు. బెగ్గర్
కి బైక్ తాళా లిచ్చేయడం, కారు బంపర్ డ్యామేజి చేసిన వాడికే ఎదురు డబ్బిచ్చేయడం, హీరోయిన్ ని సినిమాకి
రమ్మని క్యారమ్స్ ఆడుతూ కూర్చుండి పోవడం, పక్కనున్న
హీరోయిన్ ని మర్చి పోయి ఐస్ క్రీమ్ లాగించెయ్యడం, హీరోయిన్ పేరే మర్చిపోవడం
..లాంటి మతిమరుపు చేష్టలెన్నో.
ఒకటి రెండు చోట్ల కామెడీకి ద్వంద్వాల
పోషణ కూడా లేకపోలేదు- అవి ఇంటర్వెల్ కి ముందు, క్లయిమాక్స్ కి ముందూ వచ్చే రెండు సీన్లు.
ఇంటర్వెల్ కి ముందు అర్జెంటుగా హీరోయిన్ వదినని
డెలివరీకి తీసుకుపోతూ, వేరే విషయం మీదకి డైవర్ట్ అయిపోయి ఎవడితోనో బాతాఖానీ
వేసుకుంటూ నిలబడిపోవడం; క్లయిమాక్స్ కి ముందు ఫ్యామిలీని శ్రీశైలం తీసి కెళ్తూ దారి మర్చిపోయి ఇరకాటంలో పడిపోవడం..ఇలా
ఎక్కడో ఒక చోటయినా, కామెడీ సీరియస్ గా మారి ద్వంద్వాల పోషణ చేయకపోతే ప్రాణం
వుండదు.
నానీ పాత్రకి మతిమరుపు నయం చేసుకోవాలన్న
ధ్యాస వుండదు- ‘వినాయకుడు’ లో కృష్ణుడికి
సమస్యగా మారే స్థూలకాయాన్ని
తగ్గించుకోవాలన్న ఆలోచన వుండనట్టే. వుంటే రసభంగమవుతుంది. కామెడీలా వుండదు. ఎలా
వున్నవాడు అలా కంటిన్యూ అవుతూంటేనే కామెడీ. తర్వాత ఆ శారీరక/మానసిక సమస్యని క్లయిమాక్స్
లో సీరియస్ గా పాయింటుకి తీసుకురావచ్చు. అంతవరకూ ఫన్నీగా దాగుడుమూతలే వుంటాయి. ‘బర్ఫీ’
లాంటి సినిమాలో హీరో రణబీర్ కపూర్ పాత్ర మూగ- చెవిటి సమస్యకి పరిష్కారమే వుండదు. వీటి
పరిష్కారాల గురించి కథ కాదు కాబట్టి, ఎక్కడా సీరియస్ అవకుండా- ఒక అంగవైకల్య
పాత్రతో మనోభావాలు దెబ్బ తీయకుండా, క్రిమినల్ యాక్టివిటీతో అనితర సాధ్య కామెడీని
పండించాడు రణబీర్.
అలాగే పొట్టి కమెడియన్ రాజ్ పల్ యాదవ్ నటించిన చందన్ మిత్రా దర్శకత్వంలో ‘మై మేరీ పత్నీ ఔర్ వో’ అనే సూపర్ హిట్ కామెడీ వుంది. డబ్బా స్కూటరు పొట్టి లెక్చరర్ గా పొడుగు భార్యతో అతను పెంచుకునే ఆత్మనూన్యతా భావంతో పడే బాధ- ఆ బాధలోంచి కామెడీ ని పుట్టించే ద్వంద్వాల పోషణతోనే సినిమా సాంతం సాగుతుంది.
అలాగే పొట్టి కమెడియన్ రాజ్ పల్ యాదవ్ నటించిన చందన్ మిత్రా దర్శకత్వంలో ‘మై మేరీ పత్నీ ఔర్ వో’ అనే సూపర్ హిట్ కామెడీ వుంది. డబ్బా స్కూటరు పొట్టి లెక్చరర్ గా పొడుగు భార్యతో అతను పెంచుకునే ఆత్మనూన్యతా భావంతో పడే బాధ- ఆ బాధలోంచి కామెడీ ని పుట్టించే ద్వంద్వాల పోషణతోనే సినిమా సాంతం సాగుతుంది.
కాబట్టి పై మూడు ఉదాహరణల్లో
ఎక్కడా పాత్ర మానసిక/ శారీరక లోపాలని సవరించే దిశగా కథల్లేవు. ఇదే కామెడీ. సవరించే
దిశగా వెళ్తే ట్రాజెడీ. అలాగే ఆ లోపాలని ఎత్తి చూపుతూ ఇతర పాత్రలు ఆటలు పట్టిస్తే అది సెటైర్. ‘పోయెటిక్స్’
అని అరిస్టాటిల్ రాసిన థియరీలో- కామెడీని కామెడీ లాగానే ఉంచాలనీ, సెటైర్ తో కలగాపులగం చేస్తే కామెడీ ఫ్లాప్
అవుతుందనీ జాగ్రత్త చెప్పాడు. కామెడీ అంటే, పాత్రకుండే లోపాలతో హాస్యం
పుట్టించడమనీ; అదే సెటైర్ అంటే, పాత్ర వ్యక్తిత్వాన్ని హాస్యం పట్టించడమనీ నిర్వచించాడు.
కాబట్టి పై మూడు సినిమాల్లో కామెడీ పాత్రల వ్యక్తిత్వాల్ని ఇతర పాత్రలేవీ ఎత్తిపొడిచి
నవ్వులపాలు చేసే దృశ్యాలు వుండవు. డిటో నాని సినిమా.
ఇదంతా
ఎందుకంటే- నాని పాత్ర తనకి సమస్యగా వున్న మతిమరుపుని నయం చేసుకోవడానికి ఏమాత్రం ప్రయత్నించకపోవడం
గురించి వ్యాఖ్యలు చేస్తున్న వాళ్ళకోసం- అలా నయం చేసుకోవాలంటే, ఏవో పాత్రలు అతడి
లోపాన్ని ఎత్తి చూపాలి, లేదా హీరోయినే- వెళ్ళవయ్యా,
నయం చేసుకు రా, పెద్ద ప్రేమ కావాలిట- అని ఎత్తిపొడవాలి. ఎత్తి చూపితే
ట్రాజెడీ అయినట్టే, ఎత్తి పొడిస్తే సెటైర్ అవుతుంది కథ! అప్పుడు పది నిమిషాలకో వామ్మో
లుండవు, వాయ్యో లుంటాయి! నానీ, మారుతీ, నిర్మాతలూ అసలే వుండరు!
పాత్రకో లక్ష్యం, ఆ లక్ష్యం కోసం
స్ట్రగుల్, లక్ష్య సాధన- అనేకథా గమన రేఖ
మీద లోసుగుల్లేని పాత్ర ప్రయాణం వల్ల, ప్రేక్షకులకి గుర్తుండిపోయే లాండ్ మార్క్ కామెడీ
నానీ అందించినట్టయ్యింది. అతను గొప్ప ఆర్టిస్టు అవుతాడు.
***
‘అందాల రాక్షసి’
ఫేమ్ హీరోయిన్ లావణ్యా త్రిపాఠీ డాన్స్
స్కూల్ టీచరుగా, సంఘ సేవికగా మూస ఫార్ములా పాత్ర పోషించినప్పటికీ- ఆ రెండు మధ్య తరగతి కుటుంబాల హాస్య ప్రహసనంలో తన సాధారణ
అమ్మాయి ఫీచర్స్ తో పాలూనీళ్ళలా కలిసిపోయింది. ఇది సినిమా ప్రాజెక్ట్ చేస్తున్న
హోమ్లీ లుక్ కి న్యాయం చేసింది. లేకపోతే ఏ ప్లాస్టిక్ అందచందాల హైఫై హీరోయినో
అయివుంటే వ్రతం చేడేది. లావణ్య సెలెక్షన్ నూటికి నూరు పాళ్ళూ సరైన నిర్ణయం. కింది
తరగతి ప్రేక్షకులకి కూడా తన పాత్రతో, నటనతో కనెక్ట్ అయిపోయింది.
అయితే క్లయిమాక్స్
లో పాత్ర దిగజారింది. ఆ మొత్తం మతిమరుపుని దాచిపెట్టి హీరో నాటక మాడాడన్న చిన్న కారణంతో వేరే పెళ్లికి ఆమె పాత్ర సిద్ధపడడం ఫార్ములా
టర్నింగ్ కోసమే పెట్టినట్టుంది. అతడి నాటకం వల్ల ఎవరూ నష్టపోలేదు. పైగా ఆమె వదిన
ప్రాణాలు కాపాడి, సుఖప్రసవం అయ్యేలా చూశాడు. ఆ వదిన కూడా ఈ సందర్భంలో అతడికి
సపోర్టుగా రాకపోవడం ఒకలోపం. హీరోని హీరోయిన్ నిరాకరించడం ఆమె కీలుబొమ్మగా మారడానికే దారితీసింది. వేరే పెళ్ళికి సిద్ధపడిన
హీరోయిన్, హీరో వచ్చి డిస్టర్బ్ చేస్తూంటే
కూడా అభ్యంతరం చెప్పకుండా చూస్తూ వుండి పోయి- ఆ పెళ్లి కొడుకు పీచమణిచిన హీరోతోనే మళ్ళీ
పెళ్ళికి సిద్ధపడడం కీలుబొమ్మ తనమే.
ఆమె తండ్రిపాత్ర పోషించిన హిందీ నటుడు మురళీ శర్మ ఒక సర్ప్రైజ్ ఆఫర్. హిందీ- తెలుగు సిన్మాల్లో పచ్చి విలన్ గా పాపులరైన తను చాలా సౌమ్యుడైన మధ్యతరగతి తండ్రి పాత్రలో హైలైట య్యాడు. ముగింపులో ఇచ్చిన ట్విస్టుతో మరింత రాణించాడు.
ఆమె తండ్రిపాత్ర పోషించిన హిందీ నటుడు మురళీ శర్మ ఒక సర్ప్రైజ్ ఆఫర్. హిందీ- తెలుగు సిన్మాల్లో పచ్చి విలన్ గా పాపులరైన తను చాలా సౌమ్యుడైన మధ్యతరగతి తండ్రి పాత్రలో హైలైట య్యాడు. ముగింపులో ఇచ్చిన ట్విస్టుతో మరింత రాణించాడు.
ఇతర పాత్రల్లో అందరికీ మంచి మార్కులే
పడతాయి. ఈ కామెడీ మ్యూజికల్ కామెడీ కూడా. గోపీ సుందర్ సంగీతంలో పాటలు కథకి
అడ్డుపడకుండా కథకి మరింత అలంకారాన్నిచ్చాయి. నిజార్ షఫీ ఛాయాగ్రహణం దర్శకుడి ‘ఈ
రోజుల్లో’ లాంటి 5d వండర్ లా లేదుగానీ, ఫర్వాలేదు.
***
స్క్రీన్ ప్లే సంగతులు.
ఇది
ఫస్టాఫ్- సెకండాఫ్ బాపతు స్క్రీన్ ప్లే. అంటే ఇంటర్వెల్ దగ్గర పాయింటు కొచ్చి, ఇంటర్వెల్ తర్వాత సెకండాఫ్ లో కథ ప్రారంభ మవడమన్నమాట.
కాస్త సహన పరీక్షే. పదినిమిషాల కోసారి ‘వామ్మో’ ఉండబట్టి బతికిపోయింది అంతసేపూ (గంటా
పదినిమిషాలు) పాయింటు లేని ఫస్టాఫ్. ఇంకోలా చెప్పుకోవాలంటే, ఇంటర్వెల్ వరకూ
బిగినింగ్ విభాగమే నడిచి, ఇంటర్వెల్ తర్వాత మాత్రమే మిడిల్ విభాగం ప్రారంభమై, ఆ
సెకండాఫ్ నిడివిలోనే ఎండ్ విభాగంతో పంచుకోవడమన్నమాట. ఈ స్ట్రక్చర్ ని యూనివర్సల్
కి తీసుకొస్తే, ఇంటర్వెల్ లోపే సుమారు ముప్పావు గంటలో బిగినింగ్ విభాగం ముగిసిపోయి,
అక్కడ్నించీ ఇంటర్వెల్ మీదుగా సెకండాఫ్ లో క్లయిమాక్స్ వరకూ మిడిల్ విభాగం
సుదీర్ఘంగా సాగాల్సి వుంటుంది. దీనితర్వాత ఎండ్ విభాగంతో క్లయిమాక్స్ ప్రారంభమవ్వాలి.
అప్పుడు ప్రామాణికంగా ఈ విభాగాల నిష్పత్తి (బిగినింగ్) 1 : (మిడిల్) 2 : (ఎండ్) 1
గా వుంటుంది. కానీ ఈ సినిమా లాంటి ఫస్టాఫ్- సెకండాఫ్ బాపతు స్క్రీన్ ప్లేల్లో - ఈ విభాగాల నిష్పత్తి (బిగింగ్) 2 : (మిడిల్) 1 :
(ఎండ్) 1 గా మారిపోతుంది. అంటే సినిమాకి వెన్నెముక అయిన మిడిల్ విభాగం బలహీన
పడుతుంది. ఐనా ఈ సినిమా సెకండాఫ్ కాస్త బాగాలేదు అనే టాక్ రావడానికి కారణం ఇలా
మిడిల్ విభాగానికి ప్రామాణిక నిష్పత్తి లభించకపోవడం వల్ల కాకపోవచ్చు. ఒక్క ముక్కలో
చెప్పాలంటే, ఈ నిష్పత్తుల్ని, స్ట్రక్చరల్ రూల్స్ నీ, అన్నిటినీ ఒక్క దెబ్బతో హీరో పాత్ర బ్రేక్ చేసి పారేసింది!
నిజానికి స్ట్రక్చర్ పరిమితుల్లో-
దాని చట్రంలో కథ చెయ్యడం నరకయాతన. ముఖ్యంగా బిగినింగ్ విభాగాన్ని సెటప్
చేయడం. ఎందుకంటే కథలన్నీ ఒకే పోతలో
పోసినట్టు వస్తాయి. ఈ దృష్ట్యా కథకుడి సృజనాత్మకతకి అడ్డొచ్చే ఈ
స్ట్రక్చర్ శృంఖలాల్ని తెంచి పారెయ్యడం ఒక్క హీరో పాత్ర వల్లే సాధ్యమవుతుందని
ఇలా నాని పాత్ర చిత్రణ నిరూపిస్తోంది.
కథకులు పాత్రని పట్టుకునే ప్రయాణిస్తారు సాధారణంగా. పాత్రని కాక కథని పట్టుకుని ప్రయాణించినప్పుడు బలహీన ( పాసివ్) పాత్రలు పుట్టుకొస్తాయి. కానీ ప్రస్తుత కామెడీలో కథకుడు పాత్ర ని పట్టుకుని ప్రయాణించడమే కాదు, ఆ పాత్ర పాల్పడే చర్యలు పరాకాష్టగా ఉండేలా చూడ్డంతో, దాని ఫలితంగా పది నిమిషాల కోసారి థియేటర్లు ప్రేక్షకుల కేరింతలతో దద్దరిల్లి పోవడంతో- ఒకటే రుజువవుతోంది : ఇలాంటప్పుడు ప్రేక్షకులు బిగినింగ్ - మిడిల్- ఎండ్ అని స్ట్రక్చర్ ని చూడనే చూడరని! కేవలం తమని అన్ లిమిటెడ్ గా అలరిస్తున్న పాత్రని పట్టుకుని అదేపనిగా సాగిపోతారనీ!
కథకులు పాత్రని పట్టుకునే ప్రయాణిస్తారు సాధారణంగా. పాత్రని కాక కథని పట్టుకుని ప్రయాణించినప్పుడు బలహీన ( పాసివ్) పాత్రలు పుట్టుకొస్తాయి. కానీ ప్రస్తుత కామెడీలో కథకుడు పాత్ర ని పట్టుకుని ప్రయాణించడమే కాదు, ఆ పాత్ర పాల్పడే చర్యలు పరాకాష్టగా ఉండేలా చూడ్డంతో, దాని ఫలితంగా పది నిమిషాల కోసారి థియేటర్లు ప్రేక్షకుల కేరింతలతో దద్దరిల్లి పోవడంతో- ఒకటే రుజువవుతోంది : ఇలాంటప్పుడు ప్రేక్షకులు బిగినింగ్ - మిడిల్- ఎండ్ అని స్ట్రక్చర్ ని చూడనే చూడరని! కేవలం తమని అన్ లిమిటెడ్ గా అలరిస్తున్న పాత్రని పట్టుకుని అదేపనిగా సాగిపోతారనీ!
కాబట్టి
ఇంటర్వెల్ వరకూ పాయింటులోకి (కథలోకి) ప్రవేశించకపోయినా బోరు ఫీలవకుండా
ఎంజాయ్ చేస్తున్నారు ప్రేక్షకులు. మరి సెకండాఫ్ కాస్త బాగాలేదు అనే టాక్ రావడానికి
కారణమేమిటి? అది దర్శకుడి అభద్రత.
***
సెకండాఫ్ లో కూడా ఇలా సూపర్
యాక్టివ్ హీరోతో ‘వామ్మో’ లు కంటిన్యూ
అయ్యాయి. కానీ ‘వామ్మో’ కీ ‘వామ్మో’ కీ మధ్య నడిపించిన కథే, ఫస్టాఫ్ లో వున్న నావెల్టీకి
న్యాయం చేయలేకపోయింది.
మొదట్నించీ వద్దాం...
ఫస్టాఫ్ ( బిగినింగ్)
ప్రారంభంలో కథకి ఓ ముడి వేసి, ఇంటర్వెల్ తో
దానికి ఎటాచ్ చేశారు. ఆ ముడి హీరో మతిమరుపు చేష్టల వల్ల హీరోయిన్ తండ్రితో (పెళ్ళిసంబంధం గురించి) చెడడం. ఇలా ముడివేసి కొనసాగించారు. ఆ తర్వాత
హీరోయిన్ని చూసి ప్రేమలో పడ్డం. ఆమె ఆ తండ్రి కూతురే అని తెలీదతడికి. ఈ డైనమిక్ అతడామెని
తొలిచూపు చూసినప్పుడే ప్రేక్షకుల్ని హోరేత్తించింది. ఆమె ఎవరో ప్రేక్షకులకి
తెలుసు, హీరోకి తెలీదు కాబట్టి. ఇలాటి డైనమిక్సే ‘వామ్మో’ లకి కారణమయ్యాయి సినిమా
సాంతం. మతిమరుపు బయటపడకుండా హీరోయిన్ తో దోబూచు లాడుతున్నాడు హీరో. ఇది బిగినింగ్
విభాగం. కాబట్టి ఈ విభాగం ముగింపులో సమస్య ఏర్పాటుకి దారితీసే పాత్రలవరకూ మాత్రమే పరిచయాలు జరిగాయి. మిడిల్ విభాగం లో అవసరపడే
వెన్నెల కిషోర్ పాత్రతో సమస్య ఏర్పాటుకి సంబంధం లేదు కాబట్టి దాన్ని బిగినింగ్ లో
పరిచయం చేయలేదు. ఏ నేపధ్యంగా కథ నడుస్తోందో
అది ఎష్టాబ్లిష్ అయ్యింది, ముఖ్య పాత్రల పరిచయాలూ అయ్యాయి.. ఇక సమస్యకి దారి తీసే
పరిస్థితుల కల్పన చేయాలి. ఇదే ఆలస్య మవుతోంది. ఆలస్యమవుతోందంటే ఇంటర్వెల్ లోపు
సమస్య ఏర్పాటు కాదని వూహించెయ్యొచ్చు. కనుక హీరో మతిమరుపు ఎపిసోడ్లతో పైన
చెప్పుకున్నట్టు, రిపీటెడ్ యాక్షన్ ప్లాట్ గా కథనాన్ని నడిపారు. ఇలా చేసి సమస్య
ఏర్పాటుని ఆలస్యం చేయడానికి ముఖ్య కారణం ఒకటుంది. దీనిగురించి తర్వాత
చెప్పుకుందాం.
ఇలా హీరో టక్కుటమారాలతో రిపీటెడ్
యాక్షన్ ప్లాట్ గా ఎంటర్ టైన్మెంట్ ని పొడిగిస్తూ సాగదీసిన కథనం- సడెన్ గా స్వరం మార్చుకుంటుంది. పానకంలో
పుడకలా, లేదా ఉరుములేని పిడుగులా, హఠాత్తుగా
హీరోయిన్ ని ఎస్సై వ్యభిచార కేసులో ఇరికించే పోలీస్ స్టేషన్ ఎపిసోడ్ వస్తుంది (చాలా
బ్యాడ్ గా దీన్ని జీర్ణించుకోవడం కష్టమవుతుంది మనబోటి వాళ్లకి). దీనికి
ఇంటర్ కట్స్ లో హీరోయిన్ వదినని హీరో ప్రసవం కోసం హాస్పిటల్ కి తీసికెళ్ళే ఎపిసోడ్
వస్తుంది. ఈ రెండూ హఠాత్తుగా సినిమా స్వరాన్ని ( టోన్ ని) ఎలా
మార్చేస్తాయంటే, ఆ హోరెత్తి పోయే లౌడ్ రీరికార్డింగ్ తో, ఎక్కడో క్లయిమాక్స్ లో ఉండాల్సిన ముక్కలు ఇక్కడ కలిసిపోయాయా అన్నట్టు వుంటుంది. కానీ
ఇప్పుడు సినిమా రీళ్ళు లేవు, రీళ్ళు తారుమారు అయ్యాయనుకోవడానికి!
పోనీ ఈ రెండూ
సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పనలో భాగమా అంటే అదీ కాదు. హీరో హాస్పిటల్
ఎపిసోడ్ కథకి అవసరమే కావొచ్చు గానీ, హీరోయిన్ తో పోలీస్ స్టేషన్ ఎపిసోడ్
అనవసరమైనది. హీరోయిన్ వదినని హీరో హాస్పిటల్ కి తీసికెళ్ళే ఎపిసోడ్ మున్ముందు కథకి
అవసరమే కావొచ్చు. ఈ ఎపిసోడ్ నడపాలంటే, హీరోయిన్
ఇంటికి హీరో వచ్చినప్పుడు, అక్కడ నొప్పులు పడుతున్న హీరోయిన్ వదిన తప్ప మరెవరూ
వుండకూడదు. అందుకే హీరోయిన్ ని సడెన్ గా పిడుగుపాటులా వ్యభిచార కేసులో పోలీస్
స్టేషన్ కి ఎక్కించి, ఆమె తండ్రిని కూడా అక్కడికి పరుగెత్తించి, హీరోకి లైన్
క్లియర్ చేసినట్టుంది కథనం.
ఈ ఎపిసోడ్లు అయిపోయాక, ఇక అప్పుడు ఒకే సీను తో సమస్యకి దారితీసే పరిస్థితిని కల్పించారు. అది తన తండ్రిని తో కలవమని హీరోయిన్ హీరోకి చెప్పే సీను. హుషారుగా ఆమె తండ్రిని కలవడానికి బయల్దేరిన హీరో, అతన్ని గుర్తుపట్టి షాక్ అవుతాడు. ఇప్పుడేం చేయాలి? ఇదీ సమస్య. ఇదీ ఇంటర్వెల్. ఇలా ప్రారంభంలో వేసిన ముడిని ఇక్కడ ఇంకా గట్టిగా బిగించారు.
ఈ ఎపిసోడ్లు అయిపోయాక, ఇక అప్పుడు ఒకే సీను తో సమస్యకి దారితీసే పరిస్థితిని కల్పించారు. అది తన తండ్రిని తో కలవమని హీరోయిన్ హీరోకి చెప్పే సీను. హుషారుగా ఆమె తండ్రిని కలవడానికి బయల్దేరిన హీరో, అతన్ని గుర్తుపట్టి షాక్ అవుతాడు. ఇప్పుడేం చేయాలి? ఇదీ సమస్య. ఇదీ ఇంటర్వెల్. ఇలా ప్రారంభంలో వేసిన ముడిని ఇక్కడ ఇంకా గట్టిగా బిగించారు.
ఇలా ప్రారంభంలో, ఇంటర్వెల్లో ఒకే సమస్య రిపీటయ్యే కథనాలు అరుదుగా వుంటాయి.
ఇక- సెకండాఫ్ లో కెళ్ళే ముందు ఇక్కడే ఇంకో విషయాన్ని ప్రస్తావించుకుంటే, ఈ హాస్పిటల్ ఎపిసోడ్ దగ్గర్నుంచీ సెకండాఫ్ లో హీరో తెరలేపే కొత్త డ్రామా అంతా తనకి తెలుసని- ముగింపులో హీరోయిన్ తండ్రి బయట పెట్టి తనే సుఖాంతం చేస్తాడు కథని. అంటే ఇంటర్వెల్ సీను కంటే ముందు, హాస్పిటల్ దగ్గిర హీరో- హీరోయిన్లు కౌగిలించుకునే దృశ్యం అతను చూశాడు. దీని తర్వాతే ఏమీ తెలీనట్టు హీరోని కలవడానికి వెళ్ళాడు. హీరో పారిపోయాడు. ముగింపులో రివీలయ్యే ఈ వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకుని సెకండాఫ్ కెళ్దాం..
ఇక- సెకండాఫ్ లో కెళ్ళే ముందు ఇక్కడే ఇంకో విషయాన్ని ప్రస్తావించుకుంటే, ఈ హాస్పిటల్ ఎపిసోడ్ దగ్గర్నుంచీ సెకండాఫ్ లో హీరో తెరలేపే కొత్త డ్రామా అంతా తనకి తెలుసని- ముగింపులో హీరోయిన్ తండ్రి బయట పెట్టి తనే సుఖాంతం చేస్తాడు కథని. అంటే ఇంటర్వెల్ సీను కంటే ముందు, హాస్పిటల్ దగ్గిర హీరో- హీరోయిన్లు కౌగిలించుకునే దృశ్యం అతను చూశాడు. దీని తర్వాతే ఏమీ తెలీనట్టు హీరోని కలవడానికి వెళ్ళాడు. హీరో పారిపోయాడు. ముగింపులో రివీలయ్యే ఈ వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకుని సెకండాఫ్ కెళ్దాం..
***
సెకండాఫ్
ప్రారంభంలో మిడిల్ విభాగం ప్రారంభమవుతుంది. ఈ విభాగంలో పాత్ర తన కెదురైన సమస్యతో
స్ట్రగుల్ పడాలి. అలా ఇక్కడ హీరోకి ఎదురైన సమస్య, హీరోయిన్ తండ్రి ఎవరో తెలియడం. దాంతో
హీరోయిన్ తో ప్రేమా పెళ్ళీ రిస్కులో పడ్డం!
దీంతో ఆ తండ్రికి ఎదురుపడే ధైర్యం
లేక ఫ్రెండ్ ( వెన్నెల కిషోర్) ని తనలా ముందుకు తోసి నాటకం ప్రారంభించాడు. ఈ నాటకం
తెలుగులో చెప్పుకునే కన్ఫ్యూజ్ కామెడీ. అంటే ఏ కథ కైనా సెకండాఫ్ లో బ్రహ్మానందాన్ని
దింపి, నడిపించే కోన వెంకట్ మార్కు సింగిల్ విండో స్కీము అనబడు కన్ఫ్యూజ్ కామెడీ స్క్రీన్ ప్లే అన్నమాట!
ఈ సింగిల్ విండో స్కీమునే సెకండాఫ్ కథనం కోసం దర్శకుడు మారుతి ఆశ్రయించాల్సి వచ్చింది విధివశాత్తూ. ఈ స్కీము ఫస్టాఫ్ లో అమలు కాదు కాబట్టి, ఫస్టాఫ్ లో సమస్య ఏర్పాటుని ఆ విధంగా ఆలస్యం చేసి ఇంటర్వెల్ కి జరపాల్సి వచ్చింది. సమస్య ఏర్పాటు ఆలస్యం చేయడానికి ఇదీ కారణం. లేకపోతే ‘కిక్ -2’ లో రవితేజ హైపర్ యాక్టివ్ క్యారక్టర్ తో ఇంటర్ వెల్ లోపే 45 నిమిషాల్లో బిగినింగ్ ని ముగించినట్టూ- మారుతి కూడా ముగించాలి నిజానికి. అక్కడే ముగిస్తే వాట్ నెక్స్ట్ ? అన్న ప్రశ్న తలెత్తి వుంటుంది. అది తప్పించుకోవడానికి అలా బిగినింగ్ ని పొడిగించి ( ఘోరమైన రీరికార్డింగ్ తో పోలీస్ స్టేషన్, హాస్పిటల్ ఎపిసోడ్లతో) - సెకండాఫ్ లో తాననుకుంటున్న సింగిల్ విండో స్కీము సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయారు.
ఈ సింగిల్ విండో స్కీమునే సెకండాఫ్ కథనం కోసం దర్శకుడు మారుతి ఆశ్రయించాల్సి వచ్చింది విధివశాత్తూ. ఈ స్కీము ఫస్టాఫ్ లో అమలు కాదు కాబట్టి, ఫస్టాఫ్ లో సమస్య ఏర్పాటుని ఆ విధంగా ఆలస్యం చేసి ఇంటర్వెల్ కి జరపాల్సి వచ్చింది. సమస్య ఏర్పాటు ఆలస్యం చేయడానికి ఇదీ కారణం. లేకపోతే ‘కిక్ -2’ లో రవితేజ హైపర్ యాక్టివ్ క్యారక్టర్ తో ఇంటర్ వెల్ లోపే 45 నిమిషాల్లో బిగినింగ్ ని ముగించినట్టూ- మారుతి కూడా ముగించాలి నిజానికి. అక్కడే ముగిస్తే వాట్ నెక్స్ట్ ? అన్న ప్రశ్న తలెత్తి వుంటుంది. అది తప్పించుకోవడానికి అలా బిగినింగ్ ని పొడిగించి ( ఘోరమైన రీరికార్డింగ్ తో పోలీస్ స్టేషన్, హాస్పిటల్ ఎపిసోడ్లతో) - సెకండాఫ్ లో తాననుకుంటున్న సింగిల్ విండో స్కీము సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయారు.
కానీ ఇది ప్రేక్షకులకి ఎప్పుడో
బోరు కొట్టే జోన్ గా మారిపోయింది. ఇందుకే సెకండాఫ్ కాస్త బాలేదు అన్పించుకుంది. కొత్తదనానికి
దూరంగా, అరిగిపోయిన అదే సింగిల్ విండో కన్ఫ్యూజ్ కామెడీనే పెట్టేయడం వల్ల, ఫస్టాఫ్ లో వున్న నావెల్టీ నశించింది. ఈ రొటీన్
స్కీములోనే అప్పుడపుడు హీరో ఇచ్చే ‘వామ్మో’
లతో, గోపెసుందర్ పాటలతో సరిపోయింది గానీ లేకపోతే - సినిమా భవిష్యత్తు
ప్రశ్నార్ధకంగా మారేది.
ఈ సెకండాఫ్ హీరో ఆడే నాటకమంతా హీరోయిన్
తండ్రికి తెలిసిందే. అది ముగింపులో వెల్లడిస్తాడు. అలాంటప్పుడు ఈ పాత్ర పాయింటాఫ్
వ్యూలో కన్ఫ్యూజ్ కామెడీ ఏం లేదు. ఎవడేంటో, ఎవడేం చేస్తున్నాడో అంతా చూస్తూ గమ్మున
ఉన్నాడన్న మాట. ఈ లేయర్ కథ ముగించడానికి మంచి టూల్ గా ఉపయోగపడింది. హీరో మీది
అపార్ధాలు తొలగాలంటే ఇంతకంటే తెలివైన కథనం లేదు.
మొత్తానికి ‘భలే
భలే మగాడివోయ్’ అనే ఈ విజయవంతమైన కమర్షియల్ ఈ సంవత్సరం స్క్రీన్ ప్లే పరంగా నేర్పుతున్న కొత్త
పాఠం- ఎడాపెడా ‘వామ్మో’ లిచ్చే హీరో పాత్ర
వుంటే, స్ట్రక్చర్ తో పనిలేదని! అనితర సాధ్యమైన ‘వామ్మో’ లని క్రియేట్
చేసినందుకు దర్శకుడు మారుతికి హేట్సాఫ్ చెపుదాం.
మతిమరుపుని నిర్లక్ష్యం చేస్తే
అల్జిమీర్స్ వస్తుంది- సీక్వెల్ గా నానీకి దీన్ని తగిలిస్తే సరిపోవచ్చు!
―సికిందర్