రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...
టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!
Monday, November 28, 2016
Sunday, November 27, 2016
స్క్రీన్ ప్లే సంగతులు!
సినిమా కథలో ఫ్లాష్ బ్యాక్ అవసరం
ఎంతన్నది హీరో పాత్ర కేర్పడే అవసరాన్నిబట్టి వుంటుంది. సినిమా కథ హీరో పాత్రలోంచే
పుడుతుంది కాబట్టి ఫ్లాష్ బ్యాక్ అవసరం కూడా హీరో పాత్రలోంచే రావాలి. ఈ రావాల్సిన అవసరమెలా
తెలుస్తుంది? పరిస్థితి తీవ్రతని బట్టి, డిమాండ్ ని బట్టి తెలుస్తుంది. బలహీన
పరిస్థితి ఫ్లాష్ బ్యాక్ ని డిమాండ్ చేయదు. స్క్రీన్ ప్లే ప్రారంభమే హీరో సముద్రం
దగ్గర నిలబడి ఎమోషనల్ గా చూడడం హీరోకి
సంబంధించినంత వరకూ తీవ్ర పరిస్థితే కావచ్చు,
అది ప్రేక్షకులు ఫీలయ్యే అవకాశం
లేదు. ఎందుకంటే అతను ఏ మానసిక స్థితిలో వున్నాడో
ఇంకా ఆ ప్రారంభ సీనులోనే ప్రేక్షకులకి మెంటల్ మేకప్ తెలీదు. ఇక అతను మెళ్ళో
తాయెత్తు తెంపి సముద్రంలోకి విసిరేస్తే దానికి కూడా ప్రేక్షకులు స్పందించలేరు. అదేమీ
తాళిబొట్టు తెంపి పారెయ్యడ మంత తీవ్ర సంఘటన కాదు – ఆ ఒక్క చర్యతో ప్రేక్షకులకి కుతూహలం
పుట్టించడానికి. అసలు తెంపింది తాయెత్తు అని కూడా అప్పటికి ప్రేక్షకులకి తెలీదు,
తర్వాత కథలో తెలుసుకుంటారు. కనుక ‘జయమ్ము
నిశ్చయమ్మురా’ లో ఇలా ఈ సీను విషయం లేని
సీనుగా తేలుతోంది. విషయంలేని సీనుతో
స్క్రీన్ ప్లే ప్రారంభాన్ని ముడి వేయడం కుదరనట్టే, ఫ్లాష్ బ్యాక్ కీ ఇంధనం ఇవ్వడం కుదరదని
ఇక్కడ సోదాహరణంగా గమనించవచ్చు. అంటే ప్రారంభ సీనే కనెక్ట్ అవకుండా తేలిపోతూ, పాసివ్ మూడ్ లోకి నెట్టేస్తోందన్న మాట ప్రేక్షకుల్ని!
హీరో కిటికీ దగ్గర నిలబడి బయటికి చూశాడు, బయట బస్సు పోతూ కన్పించింది. వెంటనే అతడి జ్ఞాపకాలు పదేళ్ళు వెనక్కి ఓ బస్సు మీదికి మళ్ళాయి...అతడి జీవితాన్ని ఆ బస్సు మార్చేసిన రోజు అది... అని ఫ్లాష్ బ్యాక్ ప్రారంభించడం ఎంతో, ‘జయమ్ము’ లో తాయెత్తు తెంపే ప్రారంభ సీను తో ఫ్లాష్ బ్యాక్ ప్రారంభించడం కూడా అంతే. ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళడానికి ఈ ఒక్క సీను సపోర్టు చేయదు. కనుక అదొక సీనే అని అన్పించుకోదు. పై ఉదాహరణలో బస్సు పోవడం తప్ప సీనులో ఇంకేమీ జరగలేదు. పైగా ఆ బస్సుని చూసిన హీరో ఎవరో ఏమిటో మనకి తెలీదు. కనుక అతడి గతం (ఫ్లాష్ బ్యాక్) పట్ల మనకి కుతూహలం పుట్టదు. అసలు అతణ్ణి కేర్ చెయ్యం. ఎలా కేర్ చేస్తాం, అతడి వర్తమానమే ప్రారంభం కానప్పుడు. వర్తమానం లేక గతంలేదు, భవిష్యత్తూ లేదు కదా?
హీరో పాత్ర పుట్టాకే ఫ్లాష్ బ్యాక్ లో కెళ్ళాలి. ‘యే దిల్ హై ముష్కిల్’ లో హీరో పాత్ర పుట్టాకే ఫ్లాష్ బ్యాక్ ప్రారంభమవుతుంది. పుట్టడమంటే వర్తమానం, వర్తమానంలో ఈ హీరో ఒక సింగర్ అని అతడి చేతే అన్పిస్తారు. సింగర్ గా ఎలా స్ట్రగుల్ చేసి ఈ రేంజికి వచ్చాడో పరిచయం చేస్తారు. అప్పుడు తనకి పరిచయమైన అమ్మాయిలతో ప్రేమలు ఎలాగెలా కొనసాగాయో చెప్పిస్తూ ఫ్లాష్ బ్యాక్ మొదలెట్టిస్తారు అతడి పాయింటాఫ్ వ్యూలోనే. ఇతనెందుకు ఫ్లాష్ బ్యాక్ మొదలెట్టుకున్నాడు? ఆ పరిస్థితి ఏమొచ్చింది? ఇతను మొదలెట్టుకోలేదు, పరిస్థితి డిమాండ్ అలా చేసింది. ఆ పరిస్థితి ఇంటర్వ్యూ ఇవ్వడం. ఇంటర్వ్యూ ఇవ్వడమనే పరిస్థితి, అవసరం, డిమాండ్ వగైరా అతడి చేత ఫ్లాష్ భ్యాక్ ప్రారంభించేలా చేసింది. కనుక ఈ స్క్రీన్ ప్లే ప్రారంభ సీనుకి అర్ధం, బలం, సపోర్టూ వగైరా చక్కగా ఏర్పడుతూ, ఫ్లాష్ బ్యాక్ పట్ల కుతూహలం కూడా పుట్టించడానికి కారణమయ్యింది. దేనికీ కారణం కాని సీను ఒక సీనే కాదు.
ఫ్యాక్షన్ సినిమాల్లో కూడా గంటన్నర సేపు హీరో వర్తమానమంతా చూపించి, అప్పుడు ఎక్కడ్నించో వచ్చిన కొత్త పాత్రని ప్రవేశ పెట్టి, అతను హీరోని గుర్తుపట్టి, ‘బాబూ నువ్విక్కడున్నావా?’ అని ఆశ్చర్యపోయేలా చేసి, ప్రేక్షకులకి కుతూహలం పుట్టిస్తారు. ఇంతసేపూ వర్తమానంలో ఇంత సాత్వికంగా కన్పిస్తున్న హీరో ఈ హీరో కాడా? ఇంకెవరోనా? ఎవరు? ఎక్కడ్నించి వచ్చాడు? ఎందుకొచ్చాడు? ఆ ఫ్ల్లాష్ బ్యాక్ కథాకమామిషేమిటి....అన్నవి తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ పెరుగుతుంది.
1915 లో డీ డబ్ల్యివ్ గ్రిఫిత్ అనే దర్శకుడు ‘ది బర్త్ ఆఫ్ ఏ నేషన్’ అనే మూడుగంటల మూకీ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ అనే దాన్ని కనిపెట్టి ప్రదర్శించాడు. కాకపోతే దాన్ని ‘స్విచ్ బ్యాక్’ అన్నాడు అప్పట్లో. అప్పటి నుంచీ ప్రారంభమైన ఫ్లాష్ బ్యాకులు రానురానూ అవసరమున్నా లేకపోయినా, కావాలని పెట్టేసే చాపల్యానికీ దారితీశాయి.
మరైతే ‘జయమ్ము’ ఫ్లాష్ బ్యాక్ ఇంకెలా ప్రారంభించాలి? అసలు ఫ్లాష్ బ్యాక్ అవసరముందా ఈ కథకి? తమ కథలో ఏదో గందరగోళం వుండి అదేమిటో అర్ధంగానప్పుడే ఫ్లాష్ బ్యాకులు మొదలెడతారని సిడ్ ఫీల్డ్ అంటాడు. కథమీద కమాండ్ లేనప్పుడు ఏ టెక్నిక్కుల జోలికీ వెళ్ళకుండా, ఉత్త సీదా సాదా స్ట్రెయిట్ నేరేషన్ లో సినిమా తీయడమే ఉత్తమం. ‘జయమ్ము’ దర్శకుడు రాంగోపాల్ వర్మ శిష్యుడైనప్పుడు, రాంగోపాల్ వర్మకి ఏ సినిమాలోనూ ఫ్లాష్ బ్యాక్ పెట్టే అలవాటు లేదని గమనించే వుంటారు. సినిమా కథ అనేది వెండి తెర మీద మున్ముందుకే దూసుకెళ్తూ కన్పించాలి లైవ్ గా. ముందుకీ, కాసేపు వెనక్కీ వెళ్ళకూడదు. బైక్ మీద హైదరాబాద్ నుంచి బెజవాడకి జామ్మని దూసుకెళ్తున్నప్పుడు ముందుకే వెళ్ళిపోతాం. మధ్యలో వెనక్కి సూర్యాపేట వచ్చి కాసేపు వూళ్ళో తిరిగి మళ్ళీ బయల్దేరం. రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు చెట్లన్నీ కూడా వెనక్కే పోతూ కన్పిస్తాయి. ఫ్లాష్ బ్యాక్ తో కథకి జరిగే నష్టం ఇదే. ముందుకు నడుస్తున్న కథని మధ్యలో ఆపేస్తుంది. ప్రేక్షకులకి ముందుకెళ్ళి కథ తెలుసుకోవాలన్న ఉత్సాహాన్ని చంపేస్తుంది. ఒక కథలో కొంత భాగం గతంగా చూపాలనుకోవడం చద్దన్నం పెట్టడం లాంటిదే. పూర్తి కథ వర్తమానంలో నడుస్తూ ఫ్రెష్ గా లైవ్ గా వున్నప్పుడే ప్రేక్షకుల ఇన్వాల్వ్ మెంట్ ఎక్కువ వుంటుంది. ఎప్పటిదో రికార్డెడ్ ఐటెం చూపిస్తున్నట్టు మధ్యలో ఫ్లాష్ బ్యాక్ కి కావాలని వెళ్తే అదో సహన పరీక్షే అవుతుంది. ఇది ఫ్లాష్ బ్యాకులు అవసరంలేని లీనియర్ కథల సంగతి. కొన్ని కథల్ని ఫ్లాష్ బ్యాక్స్ తో నాన్ లీనియర్ గా చూపిస్తేనే నిలబడతాయి. ‘ఖైదీ’ లాంటి యాక్షన్ సినిమాలు, ఫ్యాక్షన్ సినిమాలు అన్నీ నాన్ లీనియర్ గా చూపించకపోతే నిలబడవు.
ఇంకోటేమిటంటే, ఫ్లాష్ బ్యాక్ ఎప్పుడూ
ప్రధాన కథ అంటే- మెయిన్ స్టోరీ కాదు. అది మెయిన్ స్టోరీకి కావలసిన సందర్భంలో,
కావాల్సిన సమాచారాన్ని తవ్వి అందించే వనరు మాత్రమే. జస్ట్ డేటా బ్యాంక్. ‘బాబూ
నువ్విక్కడ వున్నావా?’ అని హీరోని చూసి
పాత్ర ఆశ్చర్య పడ్డప్పుడు, ఆ బాబు ఇక్కడున్న కారణాన్ని తెలిపే గత సమాచారాన్ని
అందిస్తూ ఓపెన్ అయ్యేదే ఫ్లాష్ బ్యాక్ అనే
డేటా బ్యాంక్- కాల్ సెంటర్- సమాచార కేంద్రం ఏదైనా.
ఈ సమాచారాన్ని గంటల తరబడీ ఇస్తూ కూర్చోలేరు, బోరు కొడుతుంది. ఫ్యాక్షన్ సినిమాల్లో అరగంటకి మించి ఫ్లాష్ బ్యాక్స్ వుండవు. ‘జయమ్ము’ లో సినిమా ప్రారంభంలోనే మొదలయ్యే ఫ్లాష్ బ్యాక్, ఇంటర్వెల్ కూడా దాటేసి, ఇంకో ఇరవై నిమిషాలకి గానీ ముగింపుకి రాదు! అంటే ఇంతసేపూ ప్రధాన కథని మింగేసిందన్న మాట. ఇదేలాగో ఈ కింద చూద్దాం.
స్క్రీన్ ప్లే స్ట్రక్చర్
మిడిల్ : హీరో సముద్రం ముందు నిలబడి ఎమోషనల్ గా
చూస్తూ మెళ్ళో వున్న తాయెత్తు తెంపి సముద్రంలోకి విసిరేస్తాడు
బిగినింగ్ : 2013 లో కరీంనగర్లో హీరో జీవితం,
జాతకాల మీద నమ్మకాలు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వగైరా. తన శక్తి సామర్ధ్యాల్ని
గుర్తించకుండా బాబా చెప్పే జోస్యాల మీద ఆధారపడి చెప్పినట్టల్లా చేస్తూంటాడు. ప్రభుత్వ ఉద్యోగం కోసం పదేళ్లుగా పరీక్షలు
రాస్తూ నిరుద్యోగిగానే వుంటాడు. చీరలు నేసి సంపాదించే తల్లి వుంటుంది. ఇక ఒక
రాత్రి హీరో స్మశానంలో పడుకుంటే తప్పకుండా ఉద్యోగం వస్తుందని బాబా చెబితే, అది
నమ్మి స్మశానంలో పడుకుంటాడు హీరో.
తెల్లారే ఉద్యోగం వస్తుంది. ఉద్యోగానికి ఇంటర్వ్యూ కోసం వెళ్తున్నప్పుడు మార్కెట్
లో మొదటిసారిగా హీరోయిన్ ని చూస్తాడు. అలా హీరోయిన్ అనే ‘అద్భుత శక్తి’ ఎదురు
పడింది కాబట్టే ఉద్యోగం వచ్చిందని బాబా అంటాడు. ఆమె హీరో జీవితంలోకి వస్తే కోరికలన్నీ
నెరవేరుతాయని కూడా జోస్యం చెప్తాడు. కాకినాడ మున్సిపాలిటీలో పోస్టింగ్ వస్తుంది. మళ్ళీ
ఇక్కడికే బదిలీ చేయించుకుని వస్తానని తల్లితో చెప్పి వెళ్ళిపోతాడు.
కాకినాడ మునిసిపాలిటీ ఆఫీసు వాతావరణం. ఉద్యోగంలో చేరుతూనే బదిలీకి పెట్టుకుంటాడు. జేసీ అనే పై అధికారి, అడపా అనే కింది అధికారీ అలాగే చూస్తామంటారు. ఆఫీసు పక్కనే మీ సేవా కేంద్రంలోనే తను కరీంనగర్లో చూసిన హీరోయిన్ ని చూస్తాడు హీరో. ఈమె ఇక్కడే పనిచేస్తూంటుంది. హీరోకి బాబా చెప్పిన జోస్యం గుర్తుకొచ్చి ఈమెతో ప్రేమలో పడతాడు. కానీ ఆమెకి చెప్పే ధైర్యం వుండదు.
మున్సిపాలిటీలో బ్రోకర్ గా తిరిగే తత్కాల్ అనే వాడిద్వారా హీరోయిన్ వివరాలు తెలుసుకుంటూ ప్రేమని బలీయం చేసుకుంటాడు హీరో. ఎలాగైనా ఈమెని పెళ్లి చేసుకుని, కరీంనగర్ కి బదిలీ చేయించుకుని వెళ్లిపోవాలన్న ఆలోచనతో వుంటాడు. ఈ మునిసి పాలిటీలోనే తాను పెట్టబోయే నర్సరీకి అప్లికేషన్ పెట్టుకుంటుంది హీరోయిన్. అది హీరో దగ్గరికే రావడంతో ఆమెకు దగ్గరయ్యే అవకాశం లభిస్తుంది హీరోకి.
మునిసిపాలిటీలో ఇంకా రకరకాల మనుషులు వుంటారు, ఇల్లు కట్టుకోవడానికి తిరిగే ఒక పేద బ్రాహ్మడు, పైరవీలు చేసే తాత్కాల్ అనే బ్రోకర్, గాసిప్స్ చెప్పుకునే చిరుద్యోగులూ వగైరా.
హీరో పై అధికారి జేసీ, అమ్మాయిలకి వలేసి వాడుకుని వదిలేస్తూంటాడు. వాడుకోవడానికి హీరో అద్దెకుంటున్న పోర్షన్ కే వస్తూంటాడు. అలాగే హీరో కింది అధికారి అడపా కూడా ఆఫీసులో ఓ ఉద్యోగినికి లైనేసి హీరో పోర్షన్ కే తెచ్చుకుంటాడు. ఈ సమయాల్లో హీరో ఏమీ చేయలేక బయటే గడుపుతూంటాడు. ఈ రంకుల్ని చూసి ఇంటి ఓనర్ కూడా లైట్ గా తీసుకుంటాడు.
హీరోకి పోటీగా కాంతారావనే రోమియో వుంటాడు. వీడు బైక్ మీద హీరోయిన్ ని షికార్లకి ఎగరేసుకు పోతూంటే ఏమీ చేయలేకపోతాడు. ఒకరోజు పౌరుషానికి పోయి సెకండ్ హేండ్ బైకి కొని హీరోయిన్ ని ఎక్కించుకుంటే అది పాడవుతుంది. అప్పుడూ రోమియో వచ్చేసి ఆమెని ఎక్కించుకుని వెళ్ళిపోతాడు. ఈ బైక్ అమ్మిన మెకానిక్, అతడి అసిస్టెంట్ కూడా వేరే కామెడీలు చేస్తూంటారు. ఒకసారి హీరో బాబాకి ఫోన్ చేస్తే, ఆ అమ్మాయిని ప్రేమిస్తే నీ ఉద్యోగం పోతుందంటాడు.
ఒకరోజు సాయంత్రం రెస్టారెంట్ కి వస్తానన్న హీరోయిన్ రాదు. కాల్స్ కి రెస్పాన్స్ కూడా ఇవ్వదు. ఇంతకి ముందు ఆమె తను పక్కనే వున్నా ఎవరితోనో కాల్స్ మాట్లాడుతూ వుండడాన్ని గమనిస్తాడు. ఇప్పుడు రెస్టారెంట్ కి వస్తానని రాలేదంటే ఎక్కడికి వెళ్లి వుంటుందని ఆందోళన చెందుతూంటే ఇంటర్వెల్ పడుతుంది...
ఇంటర్వెల్ తర్వాత బిగినింగ్ కంటిన్యూ : ఒక కామెడీ సీనుతో ప్రారంభం. తిరిగి హీరోని చూస్తే ఇంకా హీరోయిన్ గురించిన ఆందోళనతో వుంటాడు. ఆమె రోమియో కాంతారావుతోనే వెళ్లి వుంటుందని అనుకుంటాడు. ఇంతలో జేసీ రూమ్ కావాలంటాడు. అప్పుడు హీరోకి హీరోయిన్ మీద అనుమానం వేసి చాటుగా చూస్తాడు. హీరోయిన్ జేసీతోనే రూమ్ కి వస్తుంది. హీరో కుమిలిపోతాడు. ఏం చేయాలో పాలుపోదు. లోపల జేసీ హీరోయిన్ ని లొంగదీసుకునేందుకు ప్రయత్నిస్తూంటాడు. ఇతను ప్రేమించడం లేదని అప్పుడర్ధం అవుతుందామెకి. కానీ తప్పించుకునే మార్గం కన్పించదు. అవతల ఏం చేయాలో పాలుపోని హీరో బాబాకి కాల్ చేస్తాడు. రెస్పాన్స్ వుండదు. అప్పుడు జ్ఞానోదోయం అవుతుంది. తను బాబా మీద ఆధారపడకూడదనీ, తన జీవితం తనదనీ, ఆత్మవిశ్వాసంతో తన నిర్ణయాలు తనే తీసుకోవాలనీ, జోస్యాలతో బ్రతికే మూఢత్వం వద్దనీ డిసైడ్ అయిపోయి- వెళ్లి రూమ్ డోర్ తీసి తప్పుకుంటాడు. అక్కడ్నించి హీరోయిన్ తప్పించుకుంటుంది, డోర్ తీసి కాపాడింది హీరోయేనని తెలుసుకోకుండా.
మిడిల్ కంటిన్యూ : సముద్రం ముందు నిలబడి ఎమోషనల్ గా చూస్తూంటాడు హీరో. బాబాని నమ్మి కట్టుకున్న తాయెత్తుని తీసి సముద్రంలోకి విసిరేస్తాడు. ఇక బాగా ధైర్యం వచ్చేసి, తనని ఏడ్పించిన వాళ్ళ పని పడతాడు. కాంతారావుకి తడాఖా చూపిస్తాడు. బైక్ అమ్మిన వాడికీ బుద్ధి చెప్తాడు, జేసీనీ, అడపానీ ఎదుర్కొంటాడు. హీరోయిన్ తనకి లొంగకుండా తప్పించుకుందని ఆమె నర్సరీకి పర్మిషన్ ఇవ్వడు జేసీ. హీరో బదిలీకీ అడపా అడ్డమేస్తాడు. హీరో ఒక పాటతో ఊరేగింపుగా వెళ్లి, ఓ ఫ్లాట్ లో ఇంకో అమ్మాయితో వున్న జేసీని అల్లరిపాలు చేస్తాడు. హీరోయిన్ కి ఆమె అన్న పెళ్లి సంబంధం తెస్తాడు. హీరోయిన్ ఏమీ నిర్ణయించుకోదు. హీరో మీద ఆమెకి ప్రేమ పుడుతుంది. ఆ ప్రేమని తాత్కాల్ చెడగొడతాడు- హీరో తను అద్దెకుంటున్న పోర్షన్ ని శృంగార కార్యకలాపాలకి ఇస్తున్నాడని. దీంతో హీరోయిన్ తన అన్న తెచ్చిన సంబంధాన్నే చేసుకోవడానికి సిద్ధపడుతుంది. ఈ పెళ్లిని చెడగొట్టడానికి హీరో పూనుకుంటాడు.
ఎండ్: హీరోయిన్ పెళ్లి సందడి. ఈ పెళ్లిని చెడగొట్టే
పని తత్కాల్ కి అప్పగిస్తాడు హీరో. పెళ్లి పంతులుగా ఆ పేద బ్రాహ్మడు వస్తాడు.
ఇంతలో హీరో ఇంటి ఓనర్ వచ్చి హీరోగురించి హీరోయిన్ కి అపార్ధం తొలగిస్తాడు. ఆరోజు
తన పోర్షన్ లో జేసీ బారిన పడకుండా హీరోయిన్ ని కాపాడింది హీరోయేనని చెప్తాడు.
దీంతో హీరోయిన్ కి మళ్ళీ హీరో మీద మనసుపోతుంది. తర్వాత పెళ్లి చెడగొట్టడం, హీరో హీరోయిన్లు ఒకటవడం, ‘సుఖాంతం’ అన్న
అక్షరాలు పడి సినిమా ముగియడం...
బిగినింగ్ బారెడు
బిగినింగ్ బారెడు
పైన మిడిల్ తో ప్రారంభమై, బిగినింగ్ కి వచ్చి, తిరిగి మిడిల్
కి వెళ్లి ఆపైన ఎండ్ కి వెళ్ళే ఈ అయ్యే
నాన్ లీనియర్ కథనాన్ని చూస్తే, ఫ్లాష్
బ్యాక్ గా చూపించుకొచ్చిన బిగినింగ్ విభాగం హద్దులు దాటి ఎంత బారుగా సాగిందో
తెలుస్తోంది. ఇంటర్వెల్ ని కూడా దాటిపోయి ఇరవై నిముషాలు సాగుతుంది. దీంతో ఇంటర్వెల్
దగ్గర కూడా ప్లాట్ పాయింట్ వన్ కి అవకాశం లేకుండా పోయింది. అంటే కథ ప్రారంభం
కాలేదు, అంటే కథేమిటో ఇంకా తెలీదన్న మాట ప్రేక్షకులకి. హీరోయిన్ ఏమయ్యిందా అని
హీరో ఆందోళన చెందడమనే బలహీన- విషయం లేని, ఆసక్తి రేపని - సీను మీద ఇంటర్వెల్
వేశారు. దీంతో ఫస్టాఫ్ అంతా చూసిందేమిటో అర్ధంగాని పరిస్థితి.
బిగినింగ్ విభాగాన్ని ఇంటర్వెల్ లోపు వీలయితే అరగంటలోగా, కాకపోతే ముప్పావుగంటలోగా ముగించడం పద్ధతి. ఈ మధ్య ఇంటర్వెల్ దాకా వెళ్ళకుండా ఈ పద్ధతికే వస్తున్నాయి సినిమాలు ప్రమాణాల ప్రకారం. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. కానీ ‘జయమ్ములో’ ఏ హద్దులూ లేవు, కనీసం ఇంటర్వెల్ అనే కథకి బలాన్నిచ్చే మూల స్టంభాన్ని కూడా నమ్ముకోలేదు. దీంతో తో స్ట్రక్చర్ చెదిరిపోయి- ఇంటర్వెల్ లోపు ప్రారంభం కావాల్సిన మిడిల్ వన్ విభాగాన్ని పూర్తిగానూ, ఇంటర్వెల్ తర్వాత ప్రారంభం కావాల్సిన మిడిల్ టూ విభాగాన్నీ పాక్షికంగానూ ఆక్రమించేసి స్క్రీన్ ప్లేని నీరు గార్చేసింది.
ఫస్టాఫ్ గంటంపావు సేపూ సాగుతుంది బిగినింగ్ విభాగం, సెకండాఫ్ ఇంకో ఇరవై నిమిషాలూ సాగి మొత్తం తొంభై అయిదు నిముషాలు- అంటే గంటన్నర పైన అయిదు నిమిషాలూ తినేస్తుంది ప్రధాన కథని. ఎక్కడి అరగంటా- ముప్పావుగంట పరిమితి, ఎక్కడి గంటన్నర సాగతీత! ఇంతసేపూ కథే మొదలవక, అసలు కథేమిటో అర్ధం గాక వుంటుంది పరిస్థితి. మిడిల్ ప్రారంభమైతే కదా, కథ మొదలై అది అర్ధమయ్యేది?
ఈ గంటన్నర పోనూ సెకండాఫ్ లో అరగంట మాత్రమే మిడిల్ విభాగం పంచుకుంటుంది. మిడిల్ విభాగం సినిమా నిడివిలో సగభాగం అక్రమిస్తేనే కథకి బలం వుండేది. ఈ బలాన్నే అరగంటకి కుదించేస్తే ఎలా వుంటుంది...అసలు హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ కథకన్నా ఇతరుల కామెడీ ట్రాకులే ఎక్కువైపోయాయి. అంటే అసలు కథ జోలికి అంతగా వెళ్ళదల్చుకోలేదు రచయిత. ఎందుకంటే ఆ కథని నిర్వహించడం తనకి తలకి మించిన పనిగా వుందేమో. ఇందుకే క్లయిమాక్స్ లో కూడా చివరి వరకూ హీరోలేకుండా కమెడియన్ల చేతే లాగించేశారు. ఈ ఎండ్ విభాగం కూడా ఓ అరగంట తెగ సాగుతుంది. మొతం కలిపి సినిమా నిడివి రెండు గంటలా 41 నిమిషాలు!
ఆలస్యం అమృతం అమృతాంజనం
సెకండాఫ్ లో ఆలశ్యంగా వచ్చే మిడిల్ విభాగంలో, హీరో జేసీ బారినుంచి హీరోయిన్ ని కాపాడి, తాయెత్తుని తెంపి సముద్రంలోకి విసిరేసే ఘట్టం ప్లాట్ పాయింట్ వన్. ప్లాట్ పాయింట్ వన్ రావడానికి ఇంతాలాస్యం అన్నమాట. ఇక మిడిల్ ఆఖర్లో, హీరోయిన్ వేరే పెళ్లి చేసుకోవడానికి సిద్ధ పడ్డం ప్లాట్ పాయింట్ టూ. అంటే ప్లాట్ పాయింట్ వన్ కీ, టూ కీ ఎడం కేవలం అరగంటే నన్న మాట! అంటే మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అన్నమాట. అసలు సినిమా ప్రారంభమే ప్లాట్ పాయింట్ వన్ (తాయెత్తు సముద్రం లో విసరడం) ఘట్టంతో ప్రారంభం కావడం ఎక్కడా వుండదేమో. ‘శివ’ లో నాగార్జున సైకిల్ చైనుతో జేడీని కొట్టే ఘట్టంతో సినిమా ప్రారంభించి వుంటే ఎలా వుండేదో?
బాపూ రమణ గార్ల సిల్వర్ జూబ్లీ ఆడి, రెండు జాతీయ అవార్డులు పొందిన ‘ముత్యాల ముగ్గు’ (1975) కీ, ‘జయమ్ము’ కీ దగ్గర పోలికలున్నాయి. ‘ముత్యాల ముగ్గు’ కుటుంబ కథ. సీతని అనుమానించి అడవులకి పంపే ఉత్తర రామాయణం లాంటిది లవకుశ లనే బాలపాత్రలు సహా. ఇందులో ప్లాట్ పాయింటు వన్ గా వచ్చే ప్రధాన ఘట్టంలో క్రైం ఎలిమెంట్ ని ప్రవేశ పెట్టారు. (క్రైంఎలిమెంట్ వున్న కుటుంబ కథలు బావుంటాయి). రోమాంటిక్ డ్రామా అయినా ‘జయమ్ము’ లో క్రైం ఎలిమేంట్ తోనే ప్లాట్ పాయింట్ వన్ ప్రధాన ఘట్టం వుంది.
‘ముత్యాల ముగ్గు’ లో సంగీత పాత్ర గదిలోకి బట్టలు విప్పుకుని నూతన్ ప్రసాద్ పాత్ర చొరబడి, ఆమె భర్త శ్రీధర్ పాత్ర వస్తున్న సమయానికి, కంటపడేలా పారిపోయే సీనులో ఎలాటి క్రిమినాలిటీ వుందో- ‘జయమ్ము’ లోనూ హీరోయిన్ ని జేసీ మభ్యపెట్టి హీరో పోర్షన్ కి తెచ్చుకోవడంలో అలాటి క్రిమినాలిటీయే వుంది, ఇప్పుడేం జరుగుతుందన్న సస్పెన్స్ ని క్రియేట్ చేస్తూ.
రెండూ హీరోయిన్ పాత్రల శీలాన్ని హననం చేయడానికి ఉద్దేశించినవే. కాకపోతే ‘జయమ్ము’ లో హీరో ఆమెని కాపాడుకుంటాడు, ‘ముత్యాలముగ్గు’ లో రాముడిలా అనుమానించి త్యజిస్తాడు. అయితే కథని ప్రారంభిస్తూ మిడిల్ కి తీసికెళ్ళే ఈ ప్లాట్ పాయింట్ వన్ సీన్ ని, బాపూ రమణలు సమయం వృధా చేయకుండా- సినిమా ప్రారంభమైన అరగంటలోనే పెట్టేశారు.
‘జయమ్ము’లో గంటన్నర పైగా పట్టింది! నేనింకా చట్నీయే వేస్తూంటాను తినండి, ఇడ్లీ గంట తర్వాత పెడతానంటే ఎలా వుంటుందో ఇదీ అలాగే వుంటుంది. కేవలం చట్నీ లాంటిది బిగినింగ్ విభాగం. జనం మిడిల్ విభాగమనే ఇడ్లీ కోసం చూస్తూంటారు. అప్పటి వరకూ చట్నీని చూస్తూ కూర్చుంటారు. ఇడ్లీ వస్తేనే చట్నీ ఉపయోగంలోకి వచ్చేది. మిడిల్ వస్తేనే బిగినింగ్ కి అర్ధంపర్ధం వుంటుంది. మిడిల్ కి వెళ్ళకుండా ఎంతసేపూ బిగినింగే వేసుకుంటూ కూర్చోవడం శుద్ధవేస్ట్. దానికి కథతో పనుండదు. కథని ప్రేమించకపోతేనే బిగినింగ్ తో కాలక్షేపం చేసేది. బాపూ రమణలు కథని ప్రేమిస్తారు కాబట్టే ఫ్లాష్ బ్యాకులతో ఎలాటి గిమ్మిక్కులు చేయకుండా, వినోదం పేరుతో ఫస్టాఫ్ అంతా కథతో సంబంధం వుండ ని కామెడీతో కాలక్షేపం చేయకుండా- కేవలం కథతోనే కదం తొక్కారు.
ఫ్లాష్ బ్యాక్స్ తో ప్లాట్ పాయింట్ వన్ ఎండమావియై పోతుంది...
పాత్రోచితానుచితాలు
ప్లాట్ పాయింట్ వన్ హీరో పాత్రకి కీలక ఘట్టం, సమస్యతో సంఘర్షించడానికి సమాయత్తం చేసే కేంద్రం. ఇక్కడే హీరోకి 1) ఒక లక్ష్యం ఏర్పడుతుంది, 2) ఈ లక్ష్యం కోసం దేన్నైనా పణంగా పెడతాడు, 3) దీని పరిణామాల హెచ్చరికలు ఎలా వున్నా లెక్క చెయ్యడు, 4) ఎట్టి పరిస్థితిలోనూ సమస్యని పరిష్కరించుకుని లక్ష్యాన్ని చేరుకోవాలన్న ఎమోషన్ తో వుంటాడు... ఈ నాల్గు టూల్సూ హీరో పాత్రని రక్త మాంసాలున్న సజీవ పాత్రగా తయారు చేస్తాయి.
‘జయమ్ము’ హీరో జేసీతో హీరోయిన్ ని చూసిన ప్లాట్ పాయింట్ వన్ ఘట్టం లో- 1) ఇక హీరోయిన్ ని పొందాలన్న ‘లక్ష్యం’ బలీయంగా మారింది, 2) దీనికోసం తనకి అడ్డున్న, తనకి ప్రాణప్రదమైన, మూఢ నమ్మకాల్నే ‘పణం’ గా పెడుతూ తాయెత్తుని తెంపి పారేశాడు, 3) బాబాని కాకుండా తనని తాను నమ్ముకుంటే ‘పరిణామాలు’ ఎలా వుంటాయో కూడా ఖాతరు చేయలేదు, 4) ఇవన్నీ కలగలిసి విపరీతమైన ఎమోషన్ కి లోనయ్యాడు...
ఈ ఎమోషన్ తర్వాత ఏమైంది? ఈ ఎమోషన్ ని కేవలం తాయెత్తుని తెంపే వరకే వాడుకున్నాడు. ఆ తర్వాత ప్రేమకోసం - అసలు లక్ష్యం కోసం వాడుకోలేదు, పెద్ద నోట్లలా రద్దు చేసుకున్నాడు. చూస్తే ఏటీఎం ఖాళీ. ప్రేమలో మళ్ళీ మునపటి పిల్లిలాంటి వాడే. ప్రేమలో ఎమోషన్ చచ్చిపోయింది, ప్రేమ కోసం లక్ష్యమూ చచ్చిపోయింది. ఇప్పటికైనా ఆమెకి ప్రేమని వెల్లడించే ధైర్యం చెయ్యడు. మరెందుకు పాపం అంత మంచి తాయెత్తుని తెంపుకున్నట్టు?
మిడిల్లో హీరో సమస్యతో సంఘర్షించాలి. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు- కేవలం తనని ఏడ్పించిన వాళ్ళకీ, ప్రేమకి అడ్డు తగిలిన వాళ్ళకీ కామెడీ చేస్తూ బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఆఖరికి పనికి రాని బైక్ వాడి మీద కూడా కసి తీర్చుకున్నాడు. ఈ మూడు నాల్గు సీన్ల వరకే తనలో వచ్చిన మార్పుకి ఫలితం చూపెట్టాడు. దీని తర్వాత మళ్ళీ మామూలే. మునుపటి పాసివ్ క్యారక్టరే. ఇక మిగిలింది ప్రేమ ఒక్కటే. ఈ ప్రేమ కోసం ప్రయత్నమే చేయడు. ఉపగ్రహంలా కథ చుట్టే తిరుగుతాడు తప్ప, కథలోకి ఇప్పటికీ వెళ్ళడు. ఈ మూగ ప్రేమతో ఎలా గడిస్తే అలా గడవనీ అన్నట్టు వుండిపోతాడు. దీంతో లక్ష్యం కోసం సంఘర్షణ లోపించి పేలవంగా కన్పిస్తాడు. టూల్స్ నాల్గింటిలో అసలు టూల్ (లక్ష్యం) కే కొన్న బైక్ కి లాగే తుప్పుపట్టింది.
యధా ప్లాట్ పాయింట్ వన్ తధా క్లయిమాక్స్ అన్నారు. ఇందుకే ప్లాట్ పాయింట్ వన్ టూల్స్ లో లక్ష్యమనేదే లోపించాక క్లయిమాక్స్ లో ఏమీ చేయలేని హీరో అదృశ్యమైపోయాడు.
ఈ కథ రోమాంటిక్ డ్రామా అనుకుంటే ఇవన్నీ సరిపోతాయి - హీరో హీరోయిన్లు పాసివ్ గా వుండడం, అసలు పరస్పరం ప్రేమనే వెల్లడించుకోక పోవడం, దాంతో ప్రేమలో సమస్యే ఏర్పడక పోవడం, సంఘర్షణే లోపించడం, ఏకపక్షంగా ఏవో అపార్థాలేర్పడ్డం, చివరికి పెద్దలే జోక్యం చేసుకుని పరిష్కరించడం (హీరో పోర్షన్ లో జేసీ బారిన పడకుండా హీరోయిన్ ని కాపాడింది హీరోయేనని, హీరోయిన్ కి చెప్పి ఇంటి ఓనర్ చివరికి అపార్ధాన్నితొలగించే దృశ్యం)...ఇవన్నీ సరిపోతాయి. అలాంటప్పుడు హీరో చేత దర్శకుడు తాయెత్తు తెంపించి లేని కథకి గొప్ప బిల్డప్ ఇవ్వనవసరం లేదు. అమలుకాని ఎక్స్ పెక్టేషన్స్ ని పెంచేయనవసరం లేదు. సెటప్ పే ఆఫ్ కాకుండా చేసుకోవాల్సిన అవసరమే లేదు. విప్లవాత్మకంగా తాయెత్తుని తెంపేసి గొప్ప అభ్యుదయవాది అన్పించుకున్న హీరోతో ప్రేమ విషయంలో చేయించిందేమిటి? ఏమీ లేదు. ఇతర పాత్రలే పూనుకుని అతడి ప్రేమని సాధించి పెట్టాయి. జయమ్ము నిశ్చయమ్ము వాళ్ళకే అయింది- హీరోకి కాదు. అలాంటప్పుడు అతడి తాయెత్తూ మూఢనమ్మకాలతో అతణ్ణి అలాగే కొనసాగించి, ఇతర పాత్రల చేత ప్రేమవిజయం గావిస్తే రోమాంటిక్ డ్రామా నేచర్ కి సరీగ్గా సరిపోయేది.
అలాంటప్పుడు, అంధవిశ్వాసాల్లోంచి ఆత్మవిశ్వాసంలోకి - అని కాన్సెప్ట్ చెప్పుకుంటూ ప్రచారం చేసుకోవడంలో అర్ధం లేదు- అంధవిశ్వాసాల్లోంచి బయటికి వచ్చి అతనేమీ సాధించనప్పుడు. అంటే తాయెత్తు తెంపడం అనే ఈ కథకి కీలక చర్య పూర్తిగా తప్పన్న మాటే. అంటే తాయెత్తు తెంపే ఎమోషనల్ సీనుతో ఫ్లాష్ బ్యాక్ ప్రారంభించడం చాలా బ్లండర్ అని ఇప్పుడు తెలియడం లేదూ? తాయెత్తు- అంధవిశ్వాసాలు- ఆత్మవిశ్వాసం - వీటితో వున్న గందరగోళమే ఫ్లాష్ బ్యాక్ ని సృష్టించిందన్న మాటే. సిడ్ ఫీల్డ్ చెప్పింది ఇలా నిజమేనెమో!
ఇక హీరోయిన్ విషయానికి వస్తే ఈమె రిజర్వుడు గా వుంటుంది. ఎవరి పట్లా ఏ దృక్పథమూ కలిగి వుండదు. వాళ్ళతో దెబ్బతిన్నానని అనుకున్నాకే దృక్పథం అలవర్చుకుంటుంది. అన్నిటి కంటే పెద్ద సస్పెన్స్ ఏమిటంటే, కాకినాడ లో వుండే ఈమె కరీంనగర్ కి ఎందుకొచ్చిందనేది . హీరో ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు కరీంనగర్ మార్కెట్ లో ఆమెని చూస్తాడు. అక్కడెందుకుంది? హీరోకి - బాబాకీ ఈ సన్నివేశంతో పనుంటుంది కాబట్టి వచ్చిందా? హీరో తనకి జాబ్ వచ్చిందని బాబాకి చెప్పగానే, ఒక ‘అద్భుత శక్తి’ ఎదురొచ్చింది కాబట్టి జాబ్ వచ్చిందంటాడు బాబా. హీరో ఆమెని ఊహించుకుని ఆనందిస్తాడు! ఇలా వుంది సన్నివేశ కల్పన! తర్వాత కాకినాడలో ఒకర్నొకరు చూసుకున్నప్పుడు కరీనం నగర్లో చూసుకోనట్టే ప్రవర్తిస్తారు. కనీసం హీరోకైనా - కరీంనగర్ మీరెందుకొచ్చారని అడగాలన్పించదు.
హీరోయిన్ పాత్రతో ఇంకో పెద్ద అభ్యంతరముంది. ఒకచోట తత్కాల్ అనే వాడు హీరో మీద హీరోయిన్ కి కావాలని ఫిర్యాదు చేస్తూ, ఇతరుల శృంగార కలాపాలకి హీరో తన పోర్షన్ ని ఇస్తున్నాడని చెప్పేస్తాడు. ఆమె డిస్టర్బ్ అయి హీరో మీద ఇక ప్రేమ వద్దనుకుంటుంది. మొదట జేసీ అనేవాడితో దెబ్బ తిని ప్రేమే వద్దనుకుంది. దాని తాలూకు బాధ, సఫరింగ్ ఏమీ వుండవు. పైగా అన్న తెచ్చిన సంబంధం వద్దని హీరో మీద ప్రేమ పెంచుకుంది. ఇప్పుడు హీరో గురించి చెడుగా వినడంతో ఈ ప్రేమ కూడా వద్దనుకుని అన్న తెచ్చిన సంబంధమే చేసుకుంటానంటుంది. బాధ, సఫరింగ్ ఏమీ వుండవు మరబొమ్మలాగా. మళ్ళీ చివరికి పెళ్లి పీటల మీద హీరో వైపు ఫిరాయిస్తుంది. ఇలావుంది పాత్రచిత్రణ.
ఇదలా ఉంచితే అసలు అభ్యంతరమేమిటంటే, తత్కాల్ అనేవాడు హీరో గురించి అలా చెబితే తక్షణం ఆమెకి జేసీతో తను వెళ్ళింది హీరో పోర్షన్ కే అని అర్ధమైపోవాలి! ఐతే అప్పుడు డోర్ తీసి తనని కాపాడింది హీరోయేననీ తెలిసిపోయి, తను చేసింది హీరోకీ తెలుసనీ రివీల్ అయిపోవాలి! చాలా షాక్ కి గురవ్వాలి. ఇక అప్పుడు హీరో దగ్గరికైనా వెళ్లి మ్యాటర్ క్లియర్ చేసుకోవాలి- లేదా హీరోకి అలాటి పరిస్థితిలో కంటపడినందుకు సిగ్గుతో ఏమైనా చేసుకోవాలి. ఇదేమీ లేకుండా తనని కాపాడిన హీరోనే ‘పోర్షన్ ని శృంగార కలాపాలకి ఇచ్చే చెడ్డవాడు’ గా భావించుకుని ఎలా అసహ్యించుకుంటుంది? పెళ్లి సమయంలో ఇంటి ఓనర్ వచ్చి- ఆ రోజు జేసీ బారి నుంచి తనని కాపాడింది హీరోయేనని చెప్తేగానీ తెలీదా? ఎప్పుడో తాత్కాల్ చెప్పినప్పుడే తెలీదా?
ఇలాటి పాత్ర చిత్రణలతో కథనం కూడా తప్పుడు కథనంగా మారిపోయింది. ఇంకా బాబా గురించి చెప్పుకుంటే, ఇతనూ పరస్పర విరుద్ధమైన మాటలు చెప్తాడు. శ్మశానంలో పడుకుంటే ఉద్యోగం వస్తుందన్న వాడే ‘అద్భుత శక్తి’ (హీరోయిన్) ఎదురురావడం వల్లే ఉద్యోగం వచ్చిందని మాట మారుస్తాడు. ఆమెని చేసుకుంటే కోరికలు నెరవేతాయని అన్న వాడే, ఆమెని ప్రేమిస్తే ఉద్యోగం పోతుందని అంటాడు- ఇలాటి వాణ్ణి ఎప్పుడో వదిలించుకోవాలి హీరో. ఆమె తన జీవితంలోకి వస్తే శుభం జరుగుతుందని ఓ పక్క బాబా అంటే, హీరో ఓ బైక్ కొని ఆమెని ఎక్కించుకోగానే అది బ్రేక్ డౌన్ అవుతుంది. ఇక ఇంటి ఓనరైతే అద్దెకిచ్చిన పై పోర్షన్లో రోజూ రంకు జరుగుతోంటే కూడా హాయిగా వుంటాడు!

సినిమాల్ని పైపైన ఏదో రాసేసి, పైపైన ఏదో
తీసేస్తే, పైపైన ఏదో చూసేసి ఎంజాయ్ చేసేస్తున్నారు ప్రేక్షకులు- వాళ్ళకో నమస్కారం!
బిగ్ సెల్యూట్!!
- సికిందర్
.
Friday, November 25, 2016
రివ్యూ!
రచన-దర్శకత్వం: శివ రాజ్ కనుమూరి
తారాగణం: శ్రీనివాసరెడ్డి, పూర్ణ, శ్రీవిష్ణు, కృష్ణుడు,
రవివర్మ, కృష్ణ భగవాన్, ప్రవీణ్, పోసాని కృష్ణమురళి, జీవా, జోగినాయుడు తదితరులు
సంగీతం: రవిచంద్ర, ఛాయాగ్రహణం
: నాగేష్ బన్నెల్
బ్యానర్: శివరాజ్ ఫిలిమ్స్
నిర్మాతలు: శివరాజ్ కనుమూరి-సతీష్ కనుమూరి,
విడుదల: 25 నవంబర్, 2016
***
కమెడియన్ శ్రీనివాసరెడ్డి హీరోగా గతంలోనే ‘గీతాంజలి’ అనే హార్రర్ కామెడీలో నటించాడు.
తిరిగి ఇప్పుడు ఓ ప్రేమకథలో నటిస్తూ ప్రేక్షకుల ముందు కొచ్చాడు. కొత్త దర్శకుడు
శివరాజ్ కనుమూరి కమెడియన్ అయిన శ్రీనివాస రెడ్డికి కామెడీ పాత్రకాక సీరియస్
పాత్రలో చూపించదల్చుకున్నారు. ఒక ఆత్మవిశ్వాసం లేని వాణ్ణి నిండు ఆత్మవిశ్వాసం గల
వాడిగా తయారుచేసే బాధ్యత మీదేసుకుని, ప్రేమకథ ద్వారా దీన్ని చూపించ దల్చుకున్నారు.
పాత రోజుల్లో రాజబాబు లాంటి కమెడియన్లు సీరియస్ పాత్రలేసిన రోజులున్నాయి. ఇప్పుడు
శ్రీనివాస రెడ్డి వేసిన సీరియస్ పాత్ర ఎలావుందో చూద్దాం.
కథ
ఓ
రాత్రిపూట సముద్రపుటొడ్డున ఎమోషనల్ గా చూస్తూ నిలబడి వుంటాడు సర్వమంగళం అలియాస్
సర్వం (శ్రీనివాస రెడ్డి). మెళ్ళో వున్న తాయత్తు తెంపి సముద్రంలోకి కసికొద్దీ విసిరేస్తాడు.
ఎందుకలా విసిరేశాడు, ఆ తాయత్తుతో అతడికున్న సంబంధమేమిటి, చెప్పడానికి ఫ్లాష్
బ్యాక్ ఓపెన్ అవుతుంది...
2013 లో ఆంధ్రప్రదేశ్ ఇంకా విడిపోలేదు. కరీంనగర్ లో సర్వం కి వయస్సు ముప్పై దాటినా ఉద్యోగం రావడం లేదు. అతను ఆత్మవిశ్వాసం లేనివాడు. మూఢ విశ్వాసాలు పెంచుకుని ప్రతీదానికీ బాబా (జీవా) చెప్పే జ్యోతిష్యాల మీద ఆధారపడతాడు. పరీక్ష రాయాలన్నా బాబా చెప్పే ముహూర్తానికే వెళ్లి రాస్తాడు. ఒకరోజు బాబా, ఓ రాత్రి స్మశానంలో నిద్రపోతే ఉద్యోగం వస్తుందంటే అలగేపడుకుని ఉద్యోగం తెచ్చుకుంటాడు సర్వం. కాకినాడ మునిసిపాలిటీలో పోస్టింగ్ వస్తుంది. చీరలు నేసి కుటుంబాన్ని గడుపుకోస్తున్న తల్లితో ఇక్కడే ట్రాన్స్ ఫర్ చేయించుకుని వస్తానని కాకినాడ వెళ్తాడు.
అక్కడ ఆఫీసులో ఆంధ్రా వాళ్ళ మధ్య తెలంగాణా యాస మాట్లాడుతూ అమాయకంగా, బుద్ధిమంతుడిలా ఉంటాడు. పక్కనే మీ సేవా కేంద్రంలో పనిచేసే రాణి (పూర్ణ) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ చెప్పే ధైర్యం చాలదు. ఆమెకోసం మరో ఇద్దరు ప్రయత్నిస్తూంటారు. వాళ్ళని ఎదిరించలేక, ఆమెతో వాళ్ళ చేష్టల్ని నిస్సహాయంగా చూస్తూంటాడు. వాళ్ళలో ఒకడు జేసీ (రవివర్మ) అనే పై అధికారే. ఇతను అమ్మాయిలకి వలేసి రాత్రిపూట సర్వం గదికి తెచ్చుకుంటూంటాడు. సర్వం బయట గడుపుతూంటాడు. అలా ఓరాత్రి ఆ జేసీ ప్రేమని నమ్మి, అది సర్వం గది అని తెలీక జేసీతో వస్తుంది రాణి. షాక్ తిన్న సర్వం ఈమెనెలా కాపాడాలా అని కంగారు పడిపోతాడు. బాబా సలహా కోసం ఫోన్ చేస్తాడు....ఇదీ విషయం.
ఆత్మవిశ్వాసంలేని
మూఢవిశ్వాసాల పిరికి సర్వం ఎలా ధైర్యవంతుడై, తను ప్రేమిస్తున్న రాణిని కాపాడుకుని-
తన ప్రేమని ఎలా తెలియజేశాడూ అన్నది మిగతా కథ
ఎలావుంది కథ
రోమాంటిక్ డ్రామా... పాత స్టయిల్లో వుంది. ఇందులో కథతో సంబంధం లేని అనేక పాత్రలతో కామెడీ ట్రాకులున్నాయి. కొత్తదనం కోసం ప్రయత్నిచకుండా, ప్రూవైన పాత ఫార్ములానే నమ్ముకుని సేఫ్ జర్నీ చేద్దామనుకున్నట్టుంది దర్శకుడి ఆలోచన. అంధవిశ్వాసాలు మాని ఆత్మవిశ్వాసం పెంచుకోండి- అని చెప్పడం దర్శకుడి ఉద్దేశం. ఈ ఉద్దేశం ఉన్న చివరి అరగంటలోనైనా, ఆచరణలో కామెడీ ట్రాకుల అడ్డంకి వల్ల సూటిగా ప్రేక్షకుల హృదయాల్లోకి దిగేలా చెప్పలేక పోయాడు. ‘కోయీ మిల్ గయా’ లో హృతిక్ రోషన్ తో ఇదే ఉద్దేశాన్ని సూటిగా బలంగా చెప్పడం వుంటుంది. ఒక హాలీవుడ్ మూవీలో పిరికి వాడైన తండ్రి, తన కూతురి ముందు ఒక బలవంతుడు తనని చెంప దెబ్బ కొట్టాడని, ఆ కూతురిముందే కొట్టి పరువు నిలుపుకోవాలన్న లక్ష్యంతో సాగే కథనం బిగి సడలకుండా, కదిలించేలా వుంటుంది.
ఎవరెలా చేశారు
సెకండాఫ్
లో ఇంకో ఇరవై నిమిషాలూ గడిచేదాకా అణిగిమణిగి
అమాయకంగానే – పాసివ్ గా వుండే శ్రీనివాస రెడ్డికి - మెళ్ళో తాయత్తు తెంపి పారేసి
ధైర్యవంతుడయ్యాక హుషారోస్తుంది. తిరిగి తన ట్రేడ్ మార్క్ కామెడీతో నవ్వించడం మొదలుపెడతాడు- తనని ఏడ్పించిన వాళ్ళని
ఏడ్పిస్తూ. అయితే ఇది కాస్సేపే- ఓ రెండుమూడు సీన్లు. ఆ తర్వాత మళ్ళీ
షరామామూలే. తన గోల్ కోసం నవ్వించడం మానేసి
సీరియస్ గా మారిపోతాడు. హీరోయిన్ తో నైనా ఎంటర్ టైన్ చేసే ఆలోచన వుండదు. ఆ ప్రేమ
ఏదో అమర ప్రేమలాగా- ‘మేఘసందేశం’లో ఏఎన్నార్ ప్రేమలాగా గంభీరంగా వుంటుంది. కానీ ఈ
సినిమా రో మాంటిక్ కామెడీ కాకుండా, రోమాంటిక్ డ్రామా అయినప్పుడు ఇది కరెక్టే.
ఇలాగే చూడాలి ప్రేక్షకులు. ఇక క్లయిమాక్స్ ని కమెడియన్లకి అప్పజెప్పేసి చివర్లో
వస్తాడు.
హీరోయిన్ పూర్ణ ది కూడా గంభీరమైన పాత్ర. ఒక్కసారి కూడా అల్లరిగా నవ్వుతూ కన్పించదు. చిన్న స్మైలిచ్చి వూరుకుంటుంది- తన పాత్రకి హుషారే వుండదు. ముగ్గురి మధ్య ఎవర్ని నిర్ణయించుకోవాలో తెలీని అయోమయమాన్ని మాత్రం బాగా ప్రదర్శించింది.
ఇక సినిమా నిండా చాలా మంది కమెడియన్లున్నారు. వీళ్ళు కథతో సంబంధం లేకుండా వాళ్ళ కామెడీ వాళ్ళు చేసుకుంటూంటారు. కృష్ణభగవాన్ ‘మంగళవారం’ కామెడీకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వుంది. మున్సిపాలిటీలో తన పనిజరగని పోసాని కామెడీ కూడా.
పాట ఒక్కటే బావుంది. నేపధ్యసంగ్గేతంలో క్వాలిటీ లేదు. కెమెరా వర్క్ కూడా అంతంత మాత్రంగానే వుంది పాట సినిమా చూస్తున్నట్టు.
చివరికేమిటి
కొత్తదర్శకుడు పాతనే నమ్ముకున్నాడు. పాతని కూడా
సరీగ్గా చెప్పలేకపోయాడు. ఇంటర్వల్
పడినా హీరో హీరోయిన్ల మధ్య ఏమీ ఎస్టాబ్లిష్
కాక, కథ మొదలవక నిస్తేజంగా వుంటుంది. దీనిక్కారణం ఫస్టాఫ్ మొదలుకుని, సెకండాఫ్
ఇంకో పావుగంట దాకా ఫ్లాష్ బ్యాక్ గా సాగడమే. ఈ ఫ్లాష్ బ్యాక్ అయిపోతేగానీ కథ
మొదలవదన్న మాట. స్ట్రక్చర్ లేకపోవడం ఒకటీ, సీన్లు సాగదీయడం ఒకటీ, ముగించాల్సిన చోట
కథ ముగించకుండా సాగదీయడం ఒకటీ దర్శకత్వాన్ని బలహీనపర్చాయి. చాలాచాలా చెప్పేయ్యాలన్న
ఆత్రుత కూడా దర్శకుడికి ఎక్కువున్నట్టుంది. దీంతో నిడివి కూడా చాంతాడులా
సాగిపోయింది. ఒక అశక్తుడి ఈ రోమాంటిక్ డ్రామాని బాగా ట్రిమ్ చేసి క్రిస్ప్ గా
బలంగా- చెప్పే అవకాశం వుందిగానీ, అభత్రతా కారణాలవల్ల పాతనే బాగా నమ్ముకోవడంవల్ల- సహజంగానే
ప్రధాన కథలో కొరవడిన వినోదాన్ని కమెడియన్లతో ఒక వేరే ప్యాకేజిగా ఇవ్వాలన్న ఆలోచనతో,
ఈ సినిమాలో ఏవేవో విషయాలు చేరిపోయాయి. మొత్తానికి శ్రీనివాసరెడ్డి కామెడీ
చేయకున్నా, యాక్షన్ సీన్స్ పెట్టుకోకపోయినా, పోస్టర్ల మీద వేసినట్టు దీన్ని ‘దేశవాళీ వినోదం’ (?) గా సరిపెట్టుకోమన్నాడు.
-సికిందర్
http://www.cinemabazaar.in
http://www.cinemabazaar.in
Saturday, November 19, 2016
యూత్ కి వీణ కావాలా, గిటార్
కావాలా....తెలుసుకోలేకపోతున్న యంగ్ బ్రిగేడ్ డైరెక్టర్స్/రైటర్స్ బ్యాచి ఓ నాల్గేళ్ళుగా
ఒకటే మాట - రోమాంటిక్ కామెడీ! ఏ కొత్త దర్శకుణ్ణి కదిపినా -రోమాంటిక్ కామెడీ! ‘రోమ్ కామ్’ తీస్తున్నామనో రాస్తున్నామనో
ఫ్యాషనబుల్ గా, స్టైల్ గా అనడం! లవ్ స్టోరీ అనడం పాత మాట- రోమాంటిక్ కామెడీ తాజా
మాట! విడుదలయ్యే ప్రేమ సినిమాలు రోమాంటిక్ కామెడీలని చెప్పుకునే విడుదల
చేస్తున్నారు (విడుదల కానివి రెట్టింపుకంటే రెట్టింపు వుంటాయి). ఏడాదికి ఓ పాతిక
రోమాంటిక్ కామెడీల పేరుతో విడుదలైతే, ఒకటో రెండో నిజమైన రోమాంటిక్ కామెడీ
లన్పించుకుని హిట్టవవుతున్నాయని తెలుసుకుంటూనే వుంటారు. ఎవరి కోసం రోమాంటిక్
కామెడీలంటూ తీస్తున్నారో ఆ ప్రేక్షకులే వీటిని తిప్పి కొడుతున్నారనీ తెలుసు. పేరున్న
హీరో వుంటే తప్ప ఈ ‘రోమాంటిక్ కామెడీ’ లవైపు ఎవరూ కన్నెత్తి చూడడం లేదనీ తెలుసు. అయినా
తమదేదో డిఫరెంట్ అనుకుని తీసేస్తున్నారు. ఎదుటి వాడు బాగా తీయలేదు, మేం బాగా
తీస్తున్నామనుకుంటూ తీసేస్తున్నారు. అసలు ఎదుటి వాడు తీసింది ఏమిటో తెలుసుకోకుండా,
ఎదుటివాడి లాంటిదే బాగా తీస్తున్నామని నమ్మేసి తామూ తీసేస్తున్నారు. ఎదుటి వాడు తీసింది
ఏకోశానా రోమాంటిక్ కామెడీయే అన్పించుకోకపోయినా, అదే మాయలో పడిపోయి పోటీ ‘రోమాంటిక్
కామెడీలు’ సృష్టించేస్తున్నారు. ఆ ఎదుటి వాడిలాగే అట్టర్ ఫ్లాప్ అవుతున్నారు, ఈ వేలంవెర్రిలో
బాగా దెబ్బ తినేస్తున్నారు...
ఎప్పుడైతే ప్రేమ కథలో హీరో హీరోయిన్లు విడిపోతారో అది రోమాంటిక్ డ్రామా!
2000 సంవత్సరం నుంచీ ‘కేవలం ఎంటర్ టైన్మెంట్ కోసమే సినిమా’ లాగా మారిపోయిన నిర్వచనానికి ఇవి న్యాయం చేయలేదు. దాంతో అత్యధిక సంఖ్యలో ఫ్లాపయ్యాయి.
యూత్ సినిమాల పేరుతో చిన్నాచితకా కొత్త హీరోల రోమాంటిక్ డ్రామాలు (అనేక బూతు కామెడీలు కూడా) వెల్లువెత్తుతున్న కాలంలోనే అల్లు అర్జున్ లాంటి యంగ్ స్టార్ హీరోలు రావడం మొదలెట్టారు. వీళ్ళు కూడా పూర్తి స్థాయి రోమాంటిక్ కామెడీల్లో నటించింది లేదు. రోమాంటిక్ డ్రామాలే నటించారు. మరి ‘కేవలం ఎంటర్ టైన్మెంట్ కోసమే సినిమా’ లాగా మారిపోయిన కొత్త ట్రెండ్ లో ఇవెలా హిట్టయ్యాయంటే, స్టార్ వేల్యూ వల్ల. కొన్నిసార్లు ముసలి కథలతో స్టార్లే వాళ్ళ చరిష్మాతో వెలిగిపోతారు గానీ, ఆ ముసలి కథలు వెలగవు - స్టార్ నుంచి విడదీసి చూస్తే ముసలి కథలకి వేల్యూ వుండదు, ఇది గుర్తు పెట్టుకోవాలి. కథా కథనాల్ని మర్చిపోయి తమ అభిమాన స్టార్ నే మైమరచిపోతూ చూసే ప్రేక్షకులున్నారు, ఇది కూడా గుర్తు పెట్టుకోవాలి.
రోమాంటిక్ డ్రామా వీణ!
రోమాంటిక్ కామెడీ గిటార్!
ఇప్పుడేం వాయించాలి?
స్టార్స్ వల్ల, బ్యానర్ వల్ల మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, కేరింత అనే రెండు వీణ సినిమాలు హిట్టయ్యాయేమోగానీ, అదే యంగ్ స్టార్ సుమంత్ అశ్విన్ నటించిన కొలంబస్ అనే వీణ సినిమాని చూడలేదెవరూ. అలాగే ఇంకో యంగ్ స్టార్ సుధీర్ నటించిన కృష్ణమ్మ పిలిచింది ఇద్దరినీ అనే వీణ సినిమా కూడా యూత్ కి నచ్చలేదు. ఇక మిగిలినవన్నీ కొత్త వాళ్లతో రోమాంటిక్ కామెడీ లనుకుంటూ, యూత్ కి గిటార్ బదులు వీణ వాయించుకుని నిద్ర పుచ్చినవే. ఈ ‘రోమాంటిక్ కామెడీ’ లని ఇక పీక్ ని తీసుకెళ్ళాలంటే, ఏడ్చే హీరోయిన్ కి వీణ పాట కూడా పెట్టేసి పాతసినిమాల టైపులో చుట్టేయాలేమో.
‘నేచురల్ స్టార్’ నాని నటించిన భలేభలే మగాడివోయ్ ఒక్కటే పక్కా గిటార్ వాయించిన రోమాంటిక్ కామెడీ. కాబట్టే యూత్ అంత హిట్ చేశారు.
ఈ సంవత్సరం - 2016 కి వస్తే, ఈ డిసెంబర్ మూడో వారం వరకూ రోమాంటిక్ కామెడీలంటూ 23 విడుదలయ్యాయి : పెళ్లి చూపులు, మజ్నూ, ప్రేమమ్, నరుడా డోనరుడా, నేనూ శైలజ, అ ఆ , సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు, కళ్యాణ వైభోగమే, ఒక మనసు, రోజులు మారాయి, శ్రీరస్తు శుభమస్తు, జ్యో అచ్యుతానంద, పడేశావే, నిర్మలా కాన్వెంట్, వెన్నెల్లో హాయ్ హాయ్, అబ్బాయితో అమ్మాయి, నేనూ మా ఆయన, దృశ్య కావ్యం, సావిత్రి, అమ్మాయి ఆరుగురు, కుందనపు బొమ్మ, మోహబ్బత్ మే, రోమాన్స్ విత్ ఫైనాన్స్... వీటిలో పెళ్లి చూపులు, వెన్నెల్లో హాయ్ హాయ్ తప్ప మిగిలిన ఇరవై ఒక్కటీ కూడా రోమాంటిక్ డ్రామాలే! అంటే వీణ సినిమాలే!
పెళ్లి చూపులు అనే పక్కా రోమాంటిక్ కామెడీ బాగా హిట్టయ్యింది, వెన్నెల్లో హాయ్ హాయ్ విడుదల ఆలస్యం వల్ల కాలేదు. గత సంవత్సరం భలేభలే మగాడివోయ్ అనే పక్కా రోమాంటిక్ కామెడీతో సూపర్ హిట్టయిన నానియే వెళ్లి వెళ్లి ఈ సంవత్సరం మజ్నూ అనే రోమాంటిక్ డ్రామాతో వీణ వాయించి ఫ్లాపయ్యాడు. లక్కీగా మరో యంగ్ స్టార్ రామ్ నటించిన నేనూ శైలజ అనే రోమాంటిక్ కామెడీ అనే రోమాంటిక్ డ్రామా హిట్టయ్యింది. అది స్టార్ వేల్యూ మహిమ. నాగచైతన్య నటించిన రోమాంటిక్ కామెడీ అనే రోమాంటిక్ డ్రామా ప్రేమమ్ అనే సక్సెస్ కూడా స్టార్ వేల్యూ మహిమే. నితిన్ నటించిన మరో రోమాంటిక్ కామెడీ అనే రోమాంటిక్ డ్రామా సక్సెస్ కూడా స్టార్ వేల్యూ మహిమే. అల్లు శిరీష్ నటించిన శ్రీరస్తు శుభమస్తు అనే ఇంకో రోమాంటిక్ కామెడీ అనే రోమాంటిక్ డ్రామా సక్సెస్ కూడా స్టార్ వేల్యూ మహిమే. ఈ నాల్గూ కాక, రోమాంటిక్ కామెడీల ముసుగులో వచ్చిన 18 రోమాంటిక్ డ్రామాలన్నీ ఫ్లాపయ్యాయి. వీటిలో నాని దగ్గర్నుంచీ నాగ శౌర్య, నారా రోహిత్, నాగబాబు కుమార్తె నిహారిక, సుమంత్, రాజ్ తరుణ్, శ్రీకాంత్ కుమారుడు రోషన్ లు నటించినవి ఏడు వున్నాయి. నాగ శౌర్య నటించినవే నాల్గుకి నాల్గూ ‘రోమాంటిక్ కామెడీలు’ ఫ్లాపయ్యాయి.
ఇలా రోమాంటిక్ కామెడీ లనుకుంటూ తీస్తున్న రోమాంటిక్ డ్రామాలు ఫ్లాపవుతున్నాయి. రోమాంటిక్ కామెడీలుగా తీసిన ఒకటీ అరా రోమాంటిక్ కామెడీలే హిట్టవువుతున్నాయని ఈ రెండేళ్లుగా విడుదలైన పై సినిమాల పెర్ఫార్మెన్స్ చూస్తే తెలిసిపోతోంది. కాబట్టి ఇంకా వీణ సినిమాలేనా- గిటార్ సినిమాలు ఇప్పటికీ వద్దా? అయితే ఇలాగే ఫ్లాపులు తప్పవు. 4జి ల కాలంలో 2జి లు చూపిస్తామంటే, చూసిన వాళ్ళు ఒక్క మౌత్ టాక్ తో ఇలాగే రిస్కులో పడేస్తూ వుంటారు.
అసలు రోమాంటిక్ కామెడీ అంటే ఏమిటి?
కామెడీ ఎప్పుడూ సంఘటనలోంచే పుడుతుంది. సిటీ బస్సు ఆగకుండానే దిగే తొందరలో హీరోయిన్ గభాల్న దూకి బైక్ మీద పోతున్న హీరో మీద దభీమని పడితే, కుయ్యోమని హీరో మొత్తుకుంటే చాలు, రోమాంటిక్ కామెడీకి బీజం పడిపోయినట్టే. చెమట కంపు కొడుతున్న హీరోయిన్ చున్నీ గాలి కెగిరివచ్చి హీరో మొహానికి ఠపీమని కొట్టుకుని, యాక్ మని వాంతి చేసుకుంటే చాలు- రోమాంటిక్ కామెడీ మొదలైపోయినట్టే.
ఒక్క సంఘటన ఇద్దరిమధ్యా రకరకాల హాస్య ప్రహసనాలకి దారితీస్తూ, ఇద్దరి మధ్యా పగని రగిలిస్తూ, ఒకర్నొకరు దెబ్బ తీసుకునే ప్రయత్నాలతో, యాక్షన్ రియాక్షన్ల సంఘర్షణకి తెరతీస్తే అది రోమాంటిక్ కామెడీ. ఒకరికొకరు ప్రత్యర్ధులైపోయి ఎవరూ తగ్గకుండా, ఎవరూ విడిపోకుండా, ఎవరూ ఏడుస్తూ కూర్చోకుండా, ఇగోల కోసం ఒకర్నొకరు ఇబ్బంది పెట్టేసుకునే యాక్షన్ లో వుండే కథనమే రోమాంటిక్ కామెడీ.
ఇద్దరూ ఒకటై చేసే రోమాంటిక్ కామెడీలు కూడా వుంటాయి. వెర్రితలలేసే ప్రేమలో ఏవో ప్రయోగాలు చేసుకుని, పీక్కోలేక, ఎవరికీ చెప్పుకోలేకా పడే ఇబ్బందులు- ఈ ఇబ్బందుల్లోంచి పుట్టే కామెడీలు, ఎలా బయటపడతారా అనే సస్పెన్స్. వీళ్ళేదో చేయకూడని పని చేశారని పెద్దలు వచ్చి క్లాసులు పీకి బుద్ధి నేర్పారా ఇక అంతే! అప్పుడది రోమాంటిక్ కామెడీ అవదు - రోమాంటిక్ కామెడీ జానర్ లోకి అక్రమంగా జొరబడ్డ రోమాంటిక్ డ్రామా అవుతుంది- కళ్యాణ వైభోగమే లోలాగా; మజ్నూలో లాగానూ.
రోమాంటిక్ కామెడీల్లో హీరోహీరోయిన్లు ప్రేక్షకులకి కనెక్ట్ కాకపోతే అది లేజీ రైటింగ్ అన్పించుకుంటుంది. ఫార్ములా మోజు అన్పించుకుంటుంది. యాక్షన్, హార్రర్, థ్రిల్లర్, మిస్టరీ, జానపద, పౌరాణిక, ఫాంటసీ ...ఇలా యే జానర్ లోనూ ప్రేక్షకులు ఎక్స్ పర్ట్స్ అయివుండరు. కానీ రెండు జానర్స్ లోమాత్రం మంచి ఎక్స్ పర్ట్స్ అయివుంటారు. వాళ్లకి తెలియనిదంటూ వుండదు. ఆ జానర్స్ లవ్, ఫ్యామిలీ అనేవి. ప్రేక్షకులందరూ నిజజీవితంలో కిల్లర్ ని పట్టుకునే పోలీసు అవరు. ప్రేక్షకులందరూ నిజజీవితంలో దెయ్యాల్ని ఎదుర్కొని వుండరు, ప్రేక్షకులందరూ నిజజీవితంలో రోడ్ల మీద కారు ఛేజింగ్స్ చేసివుండరు. నడిబజార్లో ఎగిరెగిరి తన్ని వుండరు. కానీ అందరు ప్రేక్షకులూ వాళ్ళ జీవితాల్లో ప్రేమతో, ఫ్యామిలీతో అనుభవించే వుంటారు, రోజూ అనుభవిస్తూనే వుంటారు- రోమాంటిక్ కామెడీ చూడ్డానికి వెళ్లేముందు కూడా అనుభవించే వెళ్తారు. తీరా వెళ్ళాక తాము అనుభవించే లవ్ ఎమోషన్స్ లాగా, తాము అనుభవించే ఫ్యామిలీ సంబంధాల్లాగా రోమాంటిక్ కామెడీల్లో హీరోహీరోయిన్ల వరస లేకపోతే, అది ఉత్త ఫేక్ అని తిప్పి కొట్టేస్తారు. కాబట్టి లవ్ లో, ఫ్యామిలీలో లాజిక్ తో ఆడుకోకూడదు. ‘బ్రహ్మోత్సవం’ లో తండ్రి చనిపోతే కూతురు రాకుండా ఫ్రెండ్ (హీరోయిన్) ని పంపిచడం, ఆ ఫ్రెండ్ వచ్చేసి ఆ చావు జరిగిన ఇంట కామెడీ చేయడం ఎంత అందంగా వుందో తెలిసిందే.
రోమాంటిక్ కామెడీల్లో ఓ సంఘటనతో పాయింటు చిన్నదే కావొచ్చు- కానీ పోనుపోను రకరకాల పాత్రలు చేరి అటులాగి ఇటులాగి కాంప్లికేట్ చేస్తాయి -హేపీ భాగ్ జాయేగీ లోలాగా. పాయింటులో లాజిక్ వుంటే ఎంత ఇల్లాజికల్ కామెడీనైనా సృష్టిస్తుంది రోమాంటిక్ కామెడీ- మిస్టర్ బీన్స్ సిరీస్ ఎపిసోడ్స్ లాగా.
ఇవన్నీ రెండే రెండు సూత్రాల ఆధారంగా జరుగుతాయి- హీరోహీరోయిన్లు ఒకరికొకరు విలన్లై పోవడం, ముమ్మాటికీ ఎవరూ తగ్గిగానీ, విడిపోయిగానీ పాసివ్ గా మారకపోవడం- (ఒకవేళ విడిపోయినా పాసివ్ గా వుండకుండా గోతులు తవ్వడం, ప్రతీ చర్యతో నవ్వించడం) -ఈ రెండు ప్రాణప్రదమైన సూత్ర్రాల ఆధారంగానే రోమాంటిక్ కామెడీల్లో పైవన్నీ జరుగుతాయి. కామెడీ అంటేనే హుషారు, హుషారు ఎప్పుడూ పాసివ్ గా వుండదు. ఇది గుర్తుంచుకుంటే రోమాంటిక్ కామెడీల్లో ‘ఫీల్’ అనే చాదస్తాన్ని చొరబెట్టే అకృత్యాలనుంచి దూరంగా వుండగల్గుతారు.
రోమాంటిక్ కామెడీల్లో హీరోహీరోయిన్లు ప్రేమలకోసమే తపించిపోరు. ఈ ప్రేమలు సరే, జీవితం మాటేమిటి? అని చేతకాని వ్యాపకాలు పెట్టుకుని నవ్వుల పాలవుతూంటారు. స్ట్రగుల్ చేసి వాటిలో రాణించి, హమ్మయ్యా అని లైఫ్ లో సెటిలయ్యే ప్రాక్టికాలిటీతో కలర్ఫుల్ గా వుంటారు.
రోమాంటిక్ కామెడీ అంటే, రంగులు మారిపోయే ప్రపంచంలో యూత్ తమ స్థానాన్ని దక్కించుకోవడం కోసం, ప్రేమల్ని సపోర్టుగా చేసుకుని ఒక స్టడీ టూర్ చేయడమన్న మాట, ప్రేమే టూర్ అవకుండా. యూత్ కి తమ ఎదర కన్పించే తమకి తెలీని జీవితాల్ని శోధించి తెలుసుకోవాలన్న కుతూహలం ఎక్కువ వుంటుంది- దీన్ని వాళ్ళతో కనెక్ట్ అవుతూ ‘ఆబ్జెక్టివ్’ గా తీర్చేవే రోమాంటిక్ కామెడీలు.
రోమాన్స్ అనేది - లేదా లవ్ అనేది - ప్రేమ అనేది ఒక ఉన్నత విలువ, నిజమే. మరి దీన్ని కామెడీ చేస్తూ రోమాంటిక్ కామెడీ అని ఎందుకన్నారు? ఆ తెలివితక్కువ వయసులో తెలిసీ తెలీని ప్రేమలతో కన్ఫ్యూజన్ కామెడీ గానే వుంటుంది కాబట్టి- వాళ్ళ మనస్తత్వాలని అచ్చు గుద్ది రోమాంటిక్ కామెడీలనేశారు. అందుకే ఈ సినిమాల ధోరణి కూడా ఇలాగే వుంటుంది- ప్రేమల్ని వెటకారం చేసి కామెడీగా చూపిస్తూ. ఉదాత్త భావాలకి, విలువలకీ ఇక్కడ చోటుండదు. వాటికోసం రోమాంటిక్ డ్రామాలు చూసుకోవాల్సిందే. రోమాంటిక్ కామెడీల్లో ఉదాత్తత అనేది - ఫీల్ అనేది - కథని బట్టి అవసరమైతే చివర బయటపడే విషయాలు.
‘యువర్ బర్డ్ ఈజ్ హియర్, టామ్ థాంప్సన్’ అన్న అద్భుత నవల వుంది. ఇందులో 14-16 ఏళ్ల టీనేజర్స్ మధ్య తమ రిలేషన్ షిప్ స్నేహమో ప్రేమో అర్ధంకాని చిత్రణ వుంటుంది హాస్యభరితంగా. రెండు పక్షుల సాంగత్యం ద్వారా తమ రిలేషన్ షిప్ కి అర్ధం చెప్పుకుని, మళ్ళీ మామూలు స్టూడెంట్స్ గా కంటిన్యూ అయిపోతూంటారు. రచయిత్రి ఫిల్లీస్ ఆండర్సన్ వుడ్ తొందరపడి వాళ్ళని ప్రేమికులుగా ఫిక్స్ చేసి ముగించ లేదు. ప్రేమంటే ఏమిటో తెలుసుకున్నారు, దానికింకా చాలా టైముంది వాళ్లకి, అంతే! ఇది వాస్తవికత.
ఎంత నవ్వించినా రోమాంటిక్ కామెడీ చిట్ట చివర జాగ్రత్తగా, కంట్రోల్డుగా, కళ్ళు చెమర్చేలా చేస్తే బాగా గుర్తుండి పోతుంది.
ప్లస్ రోమాంటిక్ కామెడీ అనేది గాథలా పాసివ్ గా వుండదు, కథా లక్షణాలతో యాక్టివ్ గా, నిత్యనూతనంగా వుంటుంది. రోమాంటిక్ కామెడీ క్రియేటివ్ యాస్పెక్ట్ తోబాటు, మార్కెట్ యాస్పెక్ట్ ని కూడా పట్టించుకుని- టార్గెట్ ప్రేక్షకులైన ఇప్పటి యూత్ ప్రవర్తనలకి, అభిరుచులకి దగ్గరగా, సమకాలీనంగా, వాస్తవికంగా తాజాగా వుంటుంది.
రోమాంటిక్ డ్రామా ప్రేమలకి కుటుంబాల అభ్యంతరమో, సామాజిక కట్టుబాట్లో, మానసిక నిషేధాలో అడ్డంకిగా వుంటుంది. హీరో హీరోయిన్లు పాసివ్ గా వుంటారు. చదువూ కెరీర్ పట్టకుండా, ప్రేమా అప్పుడే పెళ్ళీ ఆరాటంతో వుంటారు. హీరోయిన్ పాత్రతో ఆడది అన్న పక్షపాతం వుంటుంది. సొంతవ్యక్తిత్వం వుండదు. రోమాంటిక్ డ్రామాల సెకండాఫ్ బరువుగా, రిలీఫ్ లేకుండా విషాదభరితంగా మారిపోతుంది.
రోమాంటిక్ డ్రామా వాస్తవికత కన్నా నాటకీయత మీద ఎక్కువ దృష్టి పెడుతుంది. పాత్ర చిత్రణల్లో ఒక్కోసారి బోల్తా పడుతుంది, క్రియేటివ్ యాస్పెక్ట్ ని పెద్దగా పట్టించుకోదు, లాజిక్ కి ఆస్కారం వుండదు. రోమాంటిక్ డ్రామాల మార్కెట్ యాస్పెక్ట్ కూడా మారకుండా ఎప్పుడూ ఒకేలా వుంటుంది- అవే పాత మూస ఫార్ములా ప్రేమలు రిపీట్ అవుతూంటాయి కాలంతో సంబంధంలేకుండా. ఇంకా క్యాన్సర్ ప్రేమ కథలు, పునర్జన్మ ప్రేమ కథలూ చూపించడానికీ మొహమాటం వుండదు.
మార్కెట్ యాస్పెక్ట్ పట్టని రోమాంటిక్ డ్రామా, యువప్రేక్షకుల అభిరుచుల్నీ సమస్యల్నీ జీవితాలనీ పట్టించుకోదు. వాస్తవ దూరమైన కృత్రిమ ప్రేమలతో డ్రామాలతో దూరంగా తనలోకంలో తానుగా - ‘సబ్జెక్టివ్’ గా వుండిపోతుంది. రోమాంటిక్ డ్రామాల్ని ఎప్పుడో వచ్చిన పాత సినిమాల్ని దృష్టిలో పెట్టుకుని, పెద్దగా శ్రమ అక్కర్లేకుండా లేజీగా, పాసివ్ గా రాసెయ్యొచ్చు. ఇవి స్టార్ వేల్యూ అనే అదృష్టం మీద ఆధారపడి ఒక్కోసారి ఈ కాలంలో హిట్టవుతూంటాయి.
దమ్ముంటే డ్రామా కూడా ఓకే!
సంజయ్ లీలా భన్సాలీ ‘బాజీ రావ్ మస్తానీ’ తీశాడు. దీన్ని తెలుగులో కూడా డబ్ చేశారు. ఇందులో వీరుడిగా బాజీరావ్ యాక్షన్ కన్నా, ఇద్దరు హీరోయిన్లతో ప్రేమ కథే ప్రధానంగా వుంటుంది. ఈ ప్రేమకథా ఇందులో మళ్ళీ సీరియస్ సంఘర్షణా ఎంత బలంగా ప్రేక్షకుల హృదయాలకి గాలం వేసి లాక్కెళ్తా యంటే, ఈ సినిమా కొచ్చిన తెలుగు మాస్ ప్రేక్షకులు సైతం కట్టేసినట్టు కూర్చుని చూశారు. ప్రొజెక్షన్ బాగాలేక మధ్య మధ్యలో నాల్గు సార్లు సినిమా ఆగితే గోలగోల చేశారు. అంతేగానీ, అసలే సినిమా బోరుగా వుంటే ఈ ప్రొజెక్షన్ ఏమిట్రా పదండి పోదామని లేచెళ్ళి పోలేదు. కావాల్సింది ప్రేమతో కమిట్ మెంట్. కమిట్ మెంట్ లేకుండా పిచ్చిపిచ్చి ప్రేమ డ్రామాలు చూపిస్తే ప్రొజెక్షన్ ఆపెయ్యమంటారు.
అప్పుడు కామెడీలే!
రోమాంటిక్ కామెడీ అనే పదాన్ని ఇష్టానుసారం వాడేస్తున్నారు గానీ, దుర్వినియోగం కూడా చేస్తున్నారు గానీ- ఒకప్పుడు ఈ మాట లేదు. కామెడీ సినిమాలే! జంధ్యాల ‘అహ నా పెళ్ళంట’ తీసినా, వంశీ ‘లేడీస్ టైలర్’ తీసినా, ఈవీవీ సత్యనారాయణ ‘ఆ ఒక్కటీ అడక్కు’ తీసినా అవన్నీ, అలా తీసినవన్నీ, అవెంత రోమాంటిక్ కథలైనా, వాటిని కామెడీ సినిమాలనే అన్నారు తప్ప, రోమాంటిక్ కామెడీలనలేదు. పిఎన్ రామచంద్రరావు ‘చిత్రం భళారే విచిత్రం’ తీసినా దాన్ని రోమాంటిక్ కామెడీ అనలేదు, కామెడీయే!
ప్రేమతో వాళ్ళ కామెడీ లెప్పుడూ కూడా ‘రోమాంటిక్ డ్రామా’ ల్లాగా కూడా వుండేవి కావు - ఆసాంతం నవ్వించీ నవ్వించీ వదిలిపెట్టడమే ఎజెండాగా పెట్టుకునే వాళ్ళు. వాళ్ళు నవ్వు దర్శకులే తప్ప, ఏడ్పు దర్శకులు అన్పించుకోలేదు. ఆ నవ్వు ఏమైపోయిందిప్పుడు? ఎందుకు ప్రేమల్లో పనిమాలా చేతకాని ఏడ్పులు చూపిస్తూ, పనికిరాని రోమాంటిక్ కామిడేడ్పు సినిమాలు తీస్తున్నారు పోటీలు పడి?ఈ విషయంగా ఇది ప్రశ్నించుకోవాల్సిన సమయం...
రోమాంటిక్ కామెడీకీ, రోమాంటిక్ డ్రామాకీ తేడా
తెలుసుకోకపోవడం వల్లే వచ్చిన పరిస్థితి ఇది. రోమాంటిక్ డ్రామాల సీజన్ కొన్నేళ్ళ
క్రితమే అంతరించింది. 2000 ప్రారంభంలో చిత్రం, నువ్వే కావాలి లాంటి యూత్ సినిమాలతో
ప్రారంభమైన ట్రెండ్ ఐదారేళ్ళు కొనసాగింది. వందల సంఖ్యలో తీశారు. వాటిలో రోమాంటిక్
కామెడీలు అతి తక్కువ, రోమాంటిక్ డ్రామాలే
ఎక్కువ. హీరో హీరోయిన్లు మొదట అల్లరల్లరి చేసుకుని నవ్వించడం, తర్వాత ప్రేమలో తేడా వచ్చి విడిపోవడం,
అక్కడ్నించీ సెంటి మెంట్లూ ఎమోషన్లూ కొన్ని ఏడ్పులూ ప్రదర్శించుకుని మళ్ళీ
కలుసుకుని, ఓ ‘ఫీల్’ తో ముగించడం లాంటి రోమాంటిక్ డ్రామాలే రాజ్యమేలాయి. వీటిని
లైటర్ వీన్ లవ్ స్టోరీస్ అని కూడా పేరు పెట్టారు కొత్త ఫ్యాషన్ గా- ఇప్పుడు సరికొత్త
ఫ్యాషన్ గా రోమాంటిక్ కామెడీ లంటున్నట్టు. టీనేజీ హీరో హీరోయిన్లు స్వల్ప
కారణానికే విడిపోయి, కలుసుకుంటారు కాబట్టి, ఇవి లైటర్ వీన్ లవ్ స్టోరీలయ్యాయి. వీటిలో
స్క్రీన్ ప్లేనే అనేదే వుండేది కాదు. కథ ఎక్కడో క్లయిమాక్స్ దగ్గర ప్రారంభమయ్యేది.
ఆ సెంటిమెంట్లూ ఎమోషన్లూ ఫీల్ వగైరా వగైరా ఆ చివర పావుగంట సేపే. దీనికి ముందు
గంటన్నర సేపూ కథలేని ఉత్త కామెడీలే. ఇవి
బోరుకొట్టి మూతబడ్డాయి. ఇవన్నీ కొత్త హీరో హీరోయిన్లతో వచ్చి వెళ్ళిపోయిన
రోమాంటిక్ డ్రామాలు.
ఎప్పుడైతే ప్రేమ కథలో హీరో హీరోయిన్లు విడిపోతారో అది రోమాంటిక్ డ్రామా!
ఎప్పుడైతే ప్రేమ కథలో ఫీల్ కోసం ప్రయత్నిస్తారో అది
రోమాంటిక్ డ్రామా!
ఎప్పుడైతే ప్రేమ కథలో పెద్దల పాత్రలు జోక్యం
చేసుకుంటాయో అది రోమాంటిక్ డ్రామా!
2000 సంవత్సరం నుంచీ ‘కేవలం ఎంటర్ టైన్మెంట్ కోసమే సినిమా’ లాగా మారిపోయిన నిర్వచనానికి ఇవి న్యాయం చేయలేదు. దాంతో అత్యధిక సంఖ్యలో ఫ్లాపయ్యాయి.
యూత్ సినిమాల పేరుతో చిన్నాచితకా కొత్త హీరోల రోమాంటిక్ డ్రామాలు (అనేక బూతు కామెడీలు కూడా) వెల్లువెత్తుతున్న కాలంలోనే అల్లు అర్జున్ లాంటి యంగ్ స్టార్ హీరోలు రావడం మొదలెట్టారు. వీళ్ళు కూడా పూర్తి స్థాయి రోమాంటిక్ కామెడీల్లో నటించింది లేదు. రోమాంటిక్ డ్రామాలే నటించారు. మరి ‘కేవలం ఎంటర్ టైన్మెంట్ కోసమే సినిమా’ లాగా మారిపోయిన కొత్త ట్రెండ్ లో ఇవెలా హిట్టయ్యాయంటే, స్టార్ వేల్యూ వల్ల. కొన్నిసార్లు ముసలి కథలతో స్టార్లే వాళ్ళ చరిష్మాతో వెలిగిపోతారు గానీ, ఆ ముసలి కథలు వెలగవు - స్టార్ నుంచి విడదీసి చూస్తే ముసలి కథలకి వేల్యూ వుండదు, ఇది గుర్తు పెట్టుకోవాలి. కథా కథనాల్ని మర్చిపోయి తమ అభిమాన స్టార్ నే మైమరచిపోతూ చూసే ప్రేక్షకులున్నారు, ఇది కూడా గుర్తు పెట్టుకోవాలి.
ఇదలా
వుంచితే, 2012 లో ‘ఈరోజుల్లో’ హిట్టయ్యాక మళ్ళీ యూత్ సినిమాల ట్రెండ్
మొదలయ్యింది- ప్రతీ పదేళ్ల కోసారి ట్రెండ్స్ రిపీటవుతాయన్న సిద్ధాంతం ప్రకారం.
ఇక్కడ్నించీ రోమాంటిక్ కామెడీలనే కొత్త పేరు ప్రచారంలో కొచ్చింది. 2000 లో
ప్రారంభమైన కొత్త ట్రెండ్ ని యూత్ సినిమాలనో, లైటర్ వీన్ లవ్ సినిమాలనో అన్నారు.
ఇప్పుడు రోమాంటిక్ కామెడీలనడం మొదలెట్టారు- ఎందుకంటే ‘ఈ రోజుల్లో’ అలా అన్పించింది
కాబట్టి. నిజానికి ‘ఈరోజుల్లో’ అడల్ట్
కామెడీ. అడల్ట్ కామెడీ రోమాంటిక్ కామెడీల
చుట్టమే. ఎందుకంటే వీటిలో రోమాంటిక్ కామెడీల్లాగే డ్రామా వుండదు. దీన్ని పట్టుకుని
రోమాంటిక్ కామెడీలంటూ, మళ్ళీ కొత్త కొత్త వాళ్ళతో, కొత్త కొత్త దర్శకులు వచ్చేసి తీయడం
మొదలెట్టారు. అయినా పాత అలవాటు ఎక్కడికి పోతుంది? మా తాతలు నేతులు తాగారు,
మా మూతులు వాసన చూడండి- అన్నచందాన అవే ముగిసిపోయిన యూత్ సినిమాల నాటి రోమాంటిక్ డ్రామాలే, వీణ వాయించుకునే లైటర్ వీన్ లవ్ స్టోరీసే తీసి
పారెయ్యడం మొదలెట్టేశారు. రోమాంటిక్ డ్రామాలు ఓల్డ్ టైపులో వీణ వాయించుకుంటే,
రోమాంటిక్ కామెడీలు న్యూ టైపులో ‘గిటార్’ వాయించుకుంటాయని తెలుసుకోకుండానే!
రోమాంటిక్ డ్రామా వీణ!
రోమాంటిక్ కామెడీ గిటార్!
ఇప్పుడేం వాయించాలి?
2015
లోనే చూద్దాం, ఈ సంవత్సరం రోమాంటిక్ కామెడీ లంటూ 19 విడుదలయ్యాయి : భలేభలే
మగాడివోయ్, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, కేరింత, కొలంబస్, కృష్ణమ్మ పిలిచింది
ఇద్దరినీ, కుమారి 21ఎఫ్, నాకైతే నచ్చింది, లేడీస్ అండ్ జంటిల్ మన్, పెసరట్టు,
పడ్డానండీ ప్రేమలో మరి, నువ్వూ నేనూ ఒకటవుదాం, ఆనందం మళ్ళీ మొదలైంది, ఆంధ్రా పోరి, లవకుశ, వినవయ్యా రామయ్యా, అనగనగా ఒక విచిత్రం, రాంలీల, తప్పటడుగు...
వీటిలో ఒక్కటే ‘భలేభలే మగాడివోయ్’ గిటార్
సినిమా! కుమారి 21 ఎఫ్ అడల్ట్ కామెడీ అయితే, మిగిలిన పదిహేడూ వీణ వాయించుకున్న సినిమాలే!
స్టార్స్ వల్ల, బ్యానర్ వల్ల మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, కేరింత అనే రెండు వీణ సినిమాలు హిట్టయ్యాయేమోగానీ, అదే యంగ్ స్టార్ సుమంత్ అశ్విన్ నటించిన కొలంబస్ అనే వీణ సినిమాని చూడలేదెవరూ. అలాగే ఇంకో యంగ్ స్టార్ సుధీర్ నటించిన కృష్ణమ్మ పిలిచింది ఇద్దరినీ అనే వీణ సినిమా కూడా యూత్ కి నచ్చలేదు. ఇక మిగిలినవన్నీ కొత్త వాళ్లతో రోమాంటిక్ కామెడీ లనుకుంటూ, యూత్ కి గిటార్ బదులు వీణ వాయించుకుని నిద్ర పుచ్చినవే. ఈ ‘రోమాంటిక్ కామెడీ’ లని ఇక పీక్ ని తీసుకెళ్ళాలంటే, ఏడ్చే హీరోయిన్ కి వీణ పాట కూడా పెట్టేసి పాతసినిమాల టైపులో చుట్టేయాలేమో.
‘నేచురల్ స్టార్’ నాని నటించిన భలేభలే మగాడివోయ్ ఒక్కటే పక్కా గిటార్ వాయించిన రోమాంటిక్ కామెడీ. కాబట్టే యూత్ అంత హిట్ చేశారు.
ఈ సంవత్సరం - 2016 కి వస్తే, ఈ డిసెంబర్ మూడో వారం వరకూ రోమాంటిక్ కామెడీలంటూ 23 విడుదలయ్యాయి : పెళ్లి చూపులు, మజ్నూ, ప్రేమమ్, నరుడా డోనరుడా, నేనూ శైలజ, అ ఆ , సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు, కళ్యాణ వైభోగమే, ఒక మనసు, రోజులు మారాయి, శ్రీరస్తు శుభమస్తు, జ్యో అచ్యుతానంద, పడేశావే, నిర్మలా కాన్వెంట్, వెన్నెల్లో హాయ్ హాయ్, అబ్బాయితో అమ్మాయి, నేనూ మా ఆయన, దృశ్య కావ్యం, సావిత్రి, అమ్మాయి ఆరుగురు, కుందనపు బొమ్మ, మోహబ్బత్ మే, రోమాన్స్ విత్ ఫైనాన్స్... వీటిలో పెళ్లి చూపులు, వెన్నెల్లో హాయ్ హాయ్ తప్ప మిగిలిన ఇరవై ఒక్కటీ కూడా రోమాంటిక్ డ్రామాలే! అంటే వీణ సినిమాలే!
పెళ్లి చూపులు అనే పక్కా రోమాంటిక్ కామెడీ బాగా హిట్టయ్యింది, వెన్నెల్లో హాయ్ హాయ్ విడుదల ఆలస్యం వల్ల కాలేదు. గత సంవత్సరం భలేభలే మగాడివోయ్ అనే పక్కా రోమాంటిక్ కామెడీతో సూపర్ హిట్టయిన నానియే వెళ్లి వెళ్లి ఈ సంవత్సరం మజ్నూ అనే రోమాంటిక్ డ్రామాతో వీణ వాయించి ఫ్లాపయ్యాడు. లక్కీగా మరో యంగ్ స్టార్ రామ్ నటించిన నేనూ శైలజ అనే రోమాంటిక్ కామెడీ అనే రోమాంటిక్ డ్రామా హిట్టయ్యింది. అది స్టార్ వేల్యూ మహిమ. నాగచైతన్య నటించిన రోమాంటిక్ కామెడీ అనే రోమాంటిక్ డ్రామా ప్రేమమ్ అనే సక్సెస్ కూడా స్టార్ వేల్యూ మహిమే. నితిన్ నటించిన మరో రోమాంటిక్ కామెడీ అనే రోమాంటిక్ డ్రామా సక్సెస్ కూడా స్టార్ వేల్యూ మహిమే. అల్లు శిరీష్ నటించిన శ్రీరస్తు శుభమస్తు అనే ఇంకో రోమాంటిక్ కామెడీ అనే రోమాంటిక్ డ్రామా సక్సెస్ కూడా స్టార్ వేల్యూ మహిమే. ఈ నాల్గూ కాక, రోమాంటిక్ కామెడీల ముసుగులో వచ్చిన 18 రోమాంటిక్ డ్రామాలన్నీ ఫ్లాపయ్యాయి. వీటిలో నాని దగ్గర్నుంచీ నాగ శౌర్య, నారా రోహిత్, నాగబాబు కుమార్తె నిహారిక, సుమంత్, రాజ్ తరుణ్, శ్రీకాంత్ కుమారుడు రోషన్ లు నటించినవి ఏడు వున్నాయి. నాగ శౌర్య నటించినవే నాల్గుకి నాల్గూ ‘రోమాంటిక్ కామెడీలు’ ఫ్లాపయ్యాయి.
ఇలా రోమాంటిక్ కామెడీ లనుకుంటూ తీస్తున్న రోమాంటిక్ డ్రామాలు ఫ్లాపవుతున్నాయి. రోమాంటిక్ కామెడీలుగా తీసిన ఒకటీ అరా రోమాంటిక్ కామెడీలే హిట్టవువుతున్నాయని ఈ రెండేళ్లుగా విడుదలైన పై సినిమాల పెర్ఫార్మెన్స్ చూస్తే తెలిసిపోతోంది. కాబట్టి ఇంకా వీణ సినిమాలేనా- గిటార్ సినిమాలు ఇప్పటికీ వద్దా? అయితే ఇలాగే ఫ్లాపులు తప్పవు. 4జి ల కాలంలో 2జి లు చూపిస్తామంటే, చూసిన వాళ్ళు ఒక్క మౌత్ టాక్ తో ఇలాగే రిస్కులో పడేస్తూ వుంటారు.
అసలు రోమాంటిక్ కామెడీ అంటే ఏమిటి?
ఎక్కడా ఏడ్పించనిది, బరువెక్కనిది, సీరియస్ అవనిది; ఎక్కడా
ఫీల్ సెంటిమెంటు ఎమోషన్లు అనే నాన్సెన్సుకి చోటివ్వనిది, లవర్స్ ఇద్దరి మధ్యా
హాస్యాన్ని తారా స్థాయికి చేర్చేది, డైరెక్టుగా లవ్ ని చూపించనిది, ప్రేమలకోసం
ప్రాకులాడనిది, ప్రేమల్ని కప్పిపుచ్చేది, వాళ్ళని ఒకానొక ఇబ్బందికర సంఘటనలో పడేసి
హాస్య ప్రహసనాలని సృష్టించేది...
కామెడీ ఎప్పుడూ సంఘటనలోంచే పుడుతుంది. సిటీ బస్సు ఆగకుండానే దిగే తొందరలో హీరోయిన్ గభాల్న దూకి బైక్ మీద పోతున్న హీరో మీద దభీమని పడితే, కుయ్యోమని హీరో మొత్తుకుంటే చాలు, రోమాంటిక్ కామెడీకి బీజం పడిపోయినట్టే. చెమట కంపు కొడుతున్న హీరోయిన్ చున్నీ గాలి కెగిరివచ్చి హీరో మొహానికి ఠపీమని కొట్టుకుని, యాక్ మని వాంతి చేసుకుంటే చాలు- రోమాంటిక్ కామెడీ మొదలైపోయినట్టే.
ఒక్క సంఘటన ఇద్దరిమధ్యా రకరకాల హాస్య ప్రహసనాలకి దారితీస్తూ, ఇద్దరి మధ్యా పగని రగిలిస్తూ, ఒకర్నొకరు దెబ్బ తీసుకునే ప్రయత్నాలతో, యాక్షన్ రియాక్షన్ల సంఘర్షణకి తెరతీస్తే అది రోమాంటిక్ కామెడీ. ఒకరికొకరు ప్రత్యర్ధులైపోయి ఎవరూ తగ్గకుండా, ఎవరూ విడిపోకుండా, ఎవరూ ఏడుస్తూ కూర్చోకుండా, ఇగోల కోసం ఒకర్నొకరు ఇబ్బంది పెట్టేసుకునే యాక్షన్ లో వుండే కథనమే రోమాంటిక్ కామెడీ.
ఇద్దరూ ఒకటై చేసే రోమాంటిక్ కామెడీలు కూడా వుంటాయి. వెర్రితలలేసే ప్రేమలో ఏవో ప్రయోగాలు చేసుకుని, పీక్కోలేక, ఎవరికీ చెప్పుకోలేకా పడే ఇబ్బందులు- ఈ ఇబ్బందుల్లోంచి పుట్టే కామెడీలు, ఎలా బయటపడతారా అనే సస్పెన్స్. వీళ్ళేదో చేయకూడని పని చేశారని పెద్దలు వచ్చి క్లాసులు పీకి బుద్ధి నేర్పారా ఇక అంతే! అప్పుడది రోమాంటిక్ కామెడీ అవదు - రోమాంటిక్ కామెడీ జానర్ లోకి అక్రమంగా జొరబడ్డ రోమాంటిక్ డ్రామా అవుతుంది- కళ్యాణ వైభోగమే లోలాగా; మజ్నూలో లాగానూ.
రోమాంటిక్ డ్రామాల్లో హీరో హీరోయిన్లే తమ సమస్యని తామే పరిష్కరించుకోవాలనే
రూలుండదు, పెద్దలే జోక్యం చేసుకుని పాసివ్ హీరోహీరోయిన్ల సమస్యని పరిష్కరించే పాత తంతు
వుంటుంది. లేదా వాళ్లకి అడ్డున్న పెద్దలే
మనసు మార్చుకుని వాళ్ళని కలిపే వ్యవహారముంటుంది. రోమాంటిక్ కామెడీల్లో హీరో
హీరోయిన్లు తాము సృష్టించుకున్న సమస్యల్లోంచి తామే బయటపడే మార్గాలని కనుగొని, యువతకి ఇన్స్ పిరేషన్ గా వుండే కథనం వుంటుంది.
యూత్ ఎప్పుడూ తమని తామే విజేతలుగా మల్చుకునే శక్తి సంపన్నులు కావాలి గానీ, ఇంకా
ఎవరో పెద్దల నుంచి తలలు వంచుకుని నేర్చుకునే పిల్లకాయల్లా వుండకూడదని రోమాంటిక్
కామెడీలు చెప్తాయి.
రోమాంటిక్ కామెడీల్లో హీరో హీరోయిన్ల పాత్రలు
ఎమోషనల్ గా పరిపూర్ణంగా వుండవు. సగం సంగం వాళ్ళిద్దరూ ఒకటైతేనే ఆ పరిపూర్ణతని
సాధిస్తారు. ఇంకా ఇద్దర్లో ఒకరు ఏదోవొక అంతర్గత సమస్యతో వుంటారు- భలేభలే మగాడివోయ్
లో మతిమరుపు నాని పాత్రలాగా. వాళ్ళ మధ్య రిలేషన్ షిప్పే వాళ్ళ సమస్యల్ని తొలగిస్తుంది. ఇంకా రోమాంటిక్ కామెడీల్లో ఒకరికి
జీవితంపట్ల హుషారు ఎక్కువైపోతే, మరొకరికి బోరు ఎక్కువైపోవచ్చు. ఈ పరస్పర విరుద్ధ
కెమికల్ ఈక్వేషన్స్ పాత్రల్ని ఆసక్తికరంగా తయారు చేస్తాయి.
సినిమా అంటే చలన చిత్రం, ఫోటోగ్రాఫ్ లా
నిశ్చల చిత్రం కాదు. అందులోనూ రోమాంటిక్ కామెడీ ఎప్పుడూ యాక్షన్ లో వుంటుంది.
అందుకని వున్నచోటే వుండిపోయి నాటకాల్లోలాగా, సీరియల్స్ లో లాగా పంచ్ డైలాగుల మీద పంచ్
డైలాగులు పేల్చుకుంటూ వుండదు రోమాంటిక్ కామెడీ. రోమాంటిక్ కామెడీ స్క్రిప్ట్
యాక్టివ్ గా వుంటుంది, రోమాంటిక్ కామెడీ కథనం
విజువల్ యాక్షన్ తో వుంటుంది. రోమాంటిక్ కామెడీ ఫార్ములాని విరిచేస్తుంది-
హీరో హీరోయిన్ల మధ్య అసలు ప్రేమ కథే వుండకపోవచ్చు - హేపీ భాగ్ జాయేగీ లోలాగా.
రోమాంటిక్ కామెడీల్లో హీరోహీరోయిన్లు ప్రేక్షకులకి కనెక్ట్ కాకపోతే అది లేజీ రైటింగ్ అన్పించుకుంటుంది. ఫార్ములా మోజు అన్పించుకుంటుంది. యాక్షన్, హార్రర్, థ్రిల్లర్, మిస్టరీ, జానపద, పౌరాణిక, ఫాంటసీ ...ఇలా యే జానర్ లోనూ ప్రేక్షకులు ఎక్స్ పర్ట్స్ అయివుండరు. కానీ రెండు జానర్స్ లోమాత్రం మంచి ఎక్స్ పర్ట్స్ అయివుంటారు. వాళ్లకి తెలియనిదంటూ వుండదు. ఆ జానర్స్ లవ్, ఫ్యామిలీ అనేవి. ప్రేక్షకులందరూ నిజజీవితంలో కిల్లర్ ని పట్టుకునే పోలీసు అవరు. ప్రేక్షకులందరూ నిజజీవితంలో దెయ్యాల్ని ఎదుర్కొని వుండరు, ప్రేక్షకులందరూ నిజజీవితంలో రోడ్ల మీద కారు ఛేజింగ్స్ చేసివుండరు. నడిబజార్లో ఎగిరెగిరి తన్ని వుండరు. కానీ అందరు ప్రేక్షకులూ వాళ్ళ జీవితాల్లో ప్రేమతో, ఫ్యామిలీతో అనుభవించే వుంటారు, రోజూ అనుభవిస్తూనే వుంటారు- రోమాంటిక్ కామెడీ చూడ్డానికి వెళ్లేముందు కూడా అనుభవించే వెళ్తారు. తీరా వెళ్ళాక తాము అనుభవించే లవ్ ఎమోషన్స్ లాగా, తాము అనుభవించే ఫ్యామిలీ సంబంధాల్లాగా రోమాంటిక్ కామెడీల్లో హీరోహీరోయిన్ల వరస లేకపోతే, అది ఉత్త ఫేక్ అని తిప్పి కొట్టేస్తారు. కాబట్టి లవ్ లో, ఫ్యామిలీలో లాజిక్ తో ఆడుకోకూడదు. ‘బ్రహ్మోత్సవం’ లో తండ్రి చనిపోతే కూతురు రాకుండా ఫ్రెండ్ (హీరోయిన్) ని పంపిచడం, ఆ ఫ్రెండ్ వచ్చేసి ఆ చావు జరిగిన ఇంట కామెడీ చేయడం ఎంత అందంగా వుందో తెలిసిందే.
రోమాంటిక్ కామెడీల్లో ఓ సంఘటనతో పాయింటు చిన్నదే కావొచ్చు- కానీ పోనుపోను రకరకాల పాత్రలు చేరి అటులాగి ఇటులాగి కాంప్లికేట్ చేస్తాయి -హేపీ భాగ్ జాయేగీ లోలాగా. పాయింటులో లాజిక్ వుంటే ఎంత ఇల్లాజికల్ కామెడీనైనా సృష్టిస్తుంది రోమాంటిక్ కామెడీ- మిస్టర్ బీన్స్ సిరీస్ ఎపిసోడ్స్ లాగా.
ఇవన్నీ రెండే రెండు సూత్రాల ఆధారంగా జరుగుతాయి- హీరోహీరోయిన్లు ఒకరికొకరు విలన్లై పోవడం, ముమ్మాటికీ ఎవరూ తగ్గిగానీ, విడిపోయిగానీ పాసివ్ గా మారకపోవడం- (ఒకవేళ విడిపోయినా పాసివ్ గా వుండకుండా గోతులు తవ్వడం, ప్రతీ చర్యతో నవ్వించడం) -ఈ రెండు ప్రాణప్రదమైన సూత్ర్రాల ఆధారంగానే రోమాంటిక్ కామెడీల్లో పైవన్నీ జరుగుతాయి. కామెడీ అంటేనే హుషారు, హుషారు ఎప్పుడూ పాసివ్ గా వుండదు. ఇది గుర్తుంచుకుంటే రోమాంటిక్ కామెడీల్లో ‘ఫీల్’ అనే చాదస్తాన్ని చొరబెట్టే అకృత్యాలనుంచి దూరంగా వుండగల్గుతారు.
రోమాంటిక్ కామెడీల్లో హీరోహీరోయిన్లు ప్రేమలకోసమే తపించిపోరు. ఈ ప్రేమలు సరే, జీవితం మాటేమిటి? అని చేతకాని వ్యాపకాలు పెట్టుకుని నవ్వుల పాలవుతూంటారు. స్ట్రగుల్ చేసి వాటిలో రాణించి, హమ్మయ్యా అని లైఫ్ లో సెటిలయ్యే ప్రాక్టికాలిటీతో కలర్ఫుల్ గా వుంటారు.
రోమాంటిక్ కామెడీ అంటే, రంగులు మారిపోయే ప్రపంచంలో యూత్ తమ స్థానాన్ని దక్కించుకోవడం కోసం, ప్రేమల్ని సపోర్టుగా చేసుకుని ఒక స్టడీ టూర్ చేయడమన్న మాట, ప్రేమే టూర్ అవకుండా. యూత్ కి తమ ఎదర కన్పించే తమకి తెలీని జీవితాల్ని శోధించి తెలుసుకోవాలన్న కుతూహలం ఎక్కువ వుంటుంది- దీన్ని వాళ్ళతో కనెక్ట్ అవుతూ ‘ఆబ్జెక్టివ్’ గా తీర్చేవే రోమాంటిక్ కామెడీలు.
రోమాన్స్ అనేది - లేదా లవ్ అనేది - ప్రేమ అనేది ఒక ఉన్నత విలువ, నిజమే. మరి దీన్ని కామెడీ చేస్తూ రోమాంటిక్ కామెడీ అని ఎందుకన్నారు? ఆ తెలివితక్కువ వయసులో తెలిసీ తెలీని ప్రేమలతో కన్ఫ్యూజన్ కామెడీ గానే వుంటుంది కాబట్టి- వాళ్ళ మనస్తత్వాలని అచ్చు గుద్ది రోమాంటిక్ కామెడీలనేశారు. అందుకే ఈ సినిమాల ధోరణి కూడా ఇలాగే వుంటుంది- ప్రేమల్ని వెటకారం చేసి కామెడీగా చూపిస్తూ. ఉదాత్త భావాలకి, విలువలకీ ఇక్కడ చోటుండదు. వాటికోసం రోమాంటిక్ డ్రామాలు చూసుకోవాల్సిందే. రోమాంటిక్ కామెడీల్లో ఉదాత్తత అనేది - ఫీల్ అనేది - కథని బట్టి అవసరమైతే చివర బయటపడే విషయాలు.
‘యువర్ బర్డ్ ఈజ్ హియర్, టామ్ థాంప్సన్’ అన్న అద్భుత నవల వుంది. ఇందులో 14-16 ఏళ్ల టీనేజర్స్ మధ్య తమ రిలేషన్ షిప్ స్నేహమో ప్రేమో అర్ధంకాని చిత్రణ వుంటుంది హాస్యభరితంగా. రెండు పక్షుల సాంగత్యం ద్వారా తమ రిలేషన్ షిప్ కి అర్ధం చెప్పుకుని, మళ్ళీ మామూలు స్టూడెంట్స్ గా కంటిన్యూ అయిపోతూంటారు. రచయిత్రి ఫిల్లీస్ ఆండర్సన్ వుడ్ తొందరపడి వాళ్ళని ప్రేమికులుగా ఫిక్స్ చేసి ముగించ లేదు. ప్రేమంటే ఏమిటో తెలుసుకున్నారు, దానికింకా చాలా టైముంది వాళ్లకి, అంతే! ఇది వాస్తవికత.
ఎంత నవ్వించినా రోమాంటిక్ కామెడీ చిట్ట చివర జాగ్రత్తగా, కంట్రోల్డుగా, కళ్ళు చెమర్చేలా చేస్తే బాగా గుర్తుండి పోతుంది.
ప్లస్ రోమాంటిక్ కామెడీ అనేది గాథలా పాసివ్ గా వుండదు, కథా లక్షణాలతో యాక్టివ్ గా, నిత్యనూతనంగా వుంటుంది. రోమాంటిక్ కామెడీ క్రియేటివ్ యాస్పెక్ట్ తోబాటు, మార్కెట్ యాస్పెక్ట్ ని కూడా పట్టించుకుని- టార్గెట్ ప్రేక్షకులైన ఇప్పటి యూత్ ప్రవర్తనలకి, అభిరుచులకి దగ్గరగా, సమకాలీనంగా, వాస్తవికంగా తాజాగా వుంటుంది.
రోమాంటిక్ డ్రామా అంటే?
ఐతే కథగా వుండ వచ్చు, లేకపోతే గాథ గానూ తయారవ్వొచ్చు - దానిష్టం. రోమాంటిక్ డ్రామా కాస్సేపు నవ్వించి ఆ పైన ఏడ్పించేది, ప్రేమో రామచంద్రా అని అల్లాడేది, కాన్వెంట్ పిల్లల్ని కూడా వదలకుండా పట్టి పీడించేది, నువ్వు లేకపోతే నేను బతకలేను ప్రియా అనేవి; నిన్ను ప్రేమిస్తున్నాను, ఐ లవ్యూ అనకుండా ప్రేమని వ్యక్తం చేయలేనివి (నిన్ను ప్రేమిస్తున్నాను అని డైలాగు రాయడమే అసహజ అమెచ్యూరిష్ రైటింగ్), నాటకీయతని దండిగా వడ్డించేది, చిన్న మాటకే హీరో హీరోయిన్లని విడదీసేది, పెద్దల జోక్యంతోనో విధివిలాసంతోనో మరెలాగో సుఖాంతమో దుఃఖాంతమో అయ్యేది, ఎమోషన్స్ నీ సెంటిమెంట్స్ నీ ఫీల్ నీ ధారాళంగా ప్రవహింపజేసేదీ ...
ఐతే కథగా వుండ వచ్చు, లేకపోతే గాథ గానూ తయారవ్వొచ్చు - దానిష్టం. రోమాంటిక్ డ్రామా కాస్సేపు నవ్వించి ఆ పైన ఏడ్పించేది, ప్రేమో రామచంద్రా అని అల్లాడేది, కాన్వెంట్ పిల్లల్ని కూడా వదలకుండా పట్టి పీడించేది, నువ్వు లేకపోతే నేను బతకలేను ప్రియా అనేవి; నిన్ను ప్రేమిస్తున్నాను, ఐ లవ్యూ అనకుండా ప్రేమని వ్యక్తం చేయలేనివి (నిన్ను ప్రేమిస్తున్నాను అని డైలాగు రాయడమే అసహజ అమెచ్యూరిష్ రైటింగ్), నాటకీయతని దండిగా వడ్డించేది, చిన్న మాటకే హీరో హీరోయిన్లని విడదీసేది, పెద్దల జోక్యంతోనో విధివిలాసంతోనో మరెలాగో సుఖాంతమో దుఃఖాంతమో అయ్యేది, ఎమోషన్స్ నీ సెంటిమెంట్స్ నీ ఫీల్ నీ ధారాళంగా ప్రవహింపజేసేదీ ...
రోమాంటిక్ డ్రామా ప్రేమలకి కుటుంబాల అభ్యంతరమో, సామాజిక కట్టుబాట్లో, మానసిక నిషేధాలో అడ్డంకిగా వుంటుంది. హీరో హీరోయిన్లు పాసివ్ గా వుంటారు. చదువూ కెరీర్ పట్టకుండా, ప్రేమా అప్పుడే పెళ్ళీ ఆరాటంతో వుంటారు. హీరోయిన్ పాత్రతో ఆడది అన్న పక్షపాతం వుంటుంది. సొంతవ్యక్తిత్వం వుండదు. రోమాంటిక్ డ్రామాల సెకండాఫ్ బరువుగా, రిలీఫ్ లేకుండా విషాదభరితంగా మారిపోతుంది.
రోమాంటిక్ డ్రామా వాస్తవికత కన్నా నాటకీయత మీద ఎక్కువ దృష్టి పెడుతుంది. పాత్ర చిత్రణల్లో ఒక్కోసారి బోల్తా పడుతుంది, క్రియేటివ్ యాస్పెక్ట్ ని పెద్దగా పట్టించుకోదు, లాజిక్ కి ఆస్కారం వుండదు. రోమాంటిక్ డ్రామాల మార్కెట్ యాస్పెక్ట్ కూడా మారకుండా ఎప్పుడూ ఒకేలా వుంటుంది- అవే పాత మూస ఫార్ములా ప్రేమలు రిపీట్ అవుతూంటాయి కాలంతో సంబంధంలేకుండా. ఇంకా క్యాన్సర్ ప్రేమ కథలు, పునర్జన్మ ప్రేమ కథలూ చూపించడానికీ మొహమాటం వుండదు.
మార్కెట్ యాస్పెక్ట్ పట్టని రోమాంటిక్ డ్రామా, యువప్రేక్షకుల అభిరుచుల్నీ సమస్యల్నీ జీవితాలనీ పట్టించుకోదు. వాస్తవ దూరమైన కృత్రిమ ప్రేమలతో డ్రామాలతో దూరంగా తనలోకంలో తానుగా - ‘సబ్జెక్టివ్’ గా వుండిపోతుంది. రోమాంటిక్ డ్రామాల్ని ఎప్పుడో వచ్చిన పాత సినిమాల్ని దృష్టిలో పెట్టుకుని, పెద్దగా శ్రమ అక్కర్లేకుండా లేజీగా, పాసివ్ గా రాసెయ్యొచ్చు. ఇవి స్టార్ వేల్యూ అనే అదృష్టం మీద ఆధారపడి ఒక్కోసారి ఈ కాలంలో హిట్టవుతూంటాయి.
దమ్ముంటే డ్రామా కూడా ఓకే!
ఇదంతా చెప్పడం ఇప్పుడు రోమాంటిక్ డ్రామాలు పూర్తిగా
పనికిరావని కాదు. ముందు దీని జానర్ లక్షణాల్ని గుర్తించి, రోమాంటిక్ డ్రామాని
ప్యూర్ రోమాంటిక్ డ్రామాగానే బలంగా తీస్తే కొత్త నటీనటులతో నైనా వర్కౌట్ అవుతుంది.
ఇలాకాకుండా, ఎప్పుడో ఫేక్ డ్రామాలుగా
తేలిపోయిన గత దశాబ్దపు లైటర్ వీన్ ప్రేమల వ్యవహరాల్నే మళ్ళీ ‘మజ్నూ’ లాగా రీసైక్లింగ్ చేస్తే కాదు.
బాలచందర్ ‘మరోచరిత్ర’, దాసరి నారాయణరావు ‘తూర్పు- పడమర’, మణిరత్నం ‘గీతాంజలి’
లాంటి బలమైన కళాత్మక, సంగీతభరిత ప్రేమకథలు తీయగల్గితే అవి తప్పకుండా ఇప్పుడూ
ఆడతాయి. కానీ ఇప్పుడెవరు అలా తీయగలరు? అందుకని వీణ సినిమాలు ఇప్పుడు వద్దనేది.
సంజయ్ లీలా భన్సాలీ ‘బాజీ రావ్ మస్తానీ’ తీశాడు. దీన్ని తెలుగులో కూడా డబ్ చేశారు. ఇందులో వీరుడిగా బాజీరావ్ యాక్షన్ కన్నా, ఇద్దరు హీరోయిన్లతో ప్రేమ కథే ప్రధానంగా వుంటుంది. ఈ ప్రేమకథా ఇందులో మళ్ళీ సీరియస్ సంఘర్షణా ఎంత బలంగా ప్రేక్షకుల హృదయాలకి గాలం వేసి లాక్కెళ్తా యంటే, ఈ సినిమా కొచ్చిన తెలుగు మాస్ ప్రేక్షకులు సైతం కట్టేసినట్టు కూర్చుని చూశారు. ప్రొజెక్షన్ బాగాలేక మధ్య మధ్యలో నాల్గు సార్లు సినిమా ఆగితే గోలగోల చేశారు. అంతేగానీ, అసలే సినిమా బోరుగా వుంటే ఈ ప్రొజెక్షన్ ఏమిట్రా పదండి పోదామని లేచెళ్ళి పోలేదు. కావాల్సింది ప్రేమతో కమిట్ మెంట్. కమిట్ మెంట్ లేకుండా పిచ్చిపిచ్చి ప్రేమ డ్రామాలు చూపిస్తే ప్రొజెక్షన్ ఆపెయ్యమంటారు.
అప్పుడు కామెడీలే!
రోమాంటిక్ కామెడీ అనే పదాన్ని ఇష్టానుసారం వాడేస్తున్నారు గానీ, దుర్వినియోగం కూడా చేస్తున్నారు గానీ- ఒకప్పుడు ఈ మాట లేదు. కామెడీ సినిమాలే! జంధ్యాల ‘అహ నా పెళ్ళంట’ తీసినా, వంశీ ‘లేడీస్ టైలర్’ తీసినా, ఈవీవీ సత్యనారాయణ ‘ఆ ఒక్కటీ అడక్కు’ తీసినా అవన్నీ, అలా తీసినవన్నీ, అవెంత రోమాంటిక్ కథలైనా, వాటిని కామెడీ సినిమాలనే అన్నారు తప్ప, రోమాంటిక్ కామెడీలనలేదు. పిఎన్ రామచంద్రరావు ‘చిత్రం భళారే విచిత్రం’ తీసినా దాన్ని రోమాంటిక్ కామెడీ అనలేదు, కామెడీయే!
ప్రేమతో వాళ్ళ కామెడీ లెప్పుడూ కూడా ‘రోమాంటిక్ డ్రామా’ ల్లాగా కూడా వుండేవి కావు - ఆసాంతం నవ్వించీ నవ్వించీ వదిలిపెట్టడమే ఎజెండాగా పెట్టుకునే వాళ్ళు. వాళ్ళు నవ్వు దర్శకులే తప్ప, ఏడ్పు దర్శకులు అన్పించుకోలేదు. ఆ నవ్వు ఏమైపోయిందిప్పుడు? ఎందుకు ప్రేమల్లో పనిమాలా చేతకాని ఏడ్పులు చూపిస్తూ, పనికిరాని రోమాంటిక్ కామిడేడ్పు సినిమాలు తీస్తున్నారు పోటీలు పడి?ఈ విషయంగా ఇది ప్రశ్నించుకోవాల్సిన సమయం...
-సికిందర్
Subscribe to:
Posts (Atom)