28, అక్టోబర్ 2024, సోమవారం
26, అక్టోబర్ 2024, శనివారం
1452 : స్పెషల్ ఆర్టికల్
గత 30 ఏళ్ళు గా
న్యూ ఢిల్లీలో రామ్ వర్మ న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ (ఎన్ ఎల్ పి) కోచ్. మన
సబ్ కాన్షస్ మైండ్ మన మాట వినేట్టు ఎలా ప్రోగ్రాం చేసుకుని సత్ఫలితాలు పొందవచ్చో
నేర్పే ఈ కోర్సుకి ఆయన దేశంలో మొట్ట మొదటి కోచ్. అంతే కాదు, క్యాన్సర్ సహా నయం
కాని వ్యాధులు రాకుండా, వస్తే నయం చేసుకునేలా అభివృద్ది చేసిన కొత్త శాస్త్రం ఎపిజెనెటిక్ హీలింగ్ ద్వారా స్వయంగా మన జీన్స్ ని ఎలా ప్రోగ్రామింగ్ చేసుకుని ఆరోగ్యవంతులు
కావచ్చో కూడా ఈ కోర్సుల్లో భాగంగా నేర్పుతాడు. తన యుక్త వయస్సులో వివిధ అనారోగ్యాలు వెంటాడి ఇక డాక్టర్లు చేతులెత్తేసిన సందర్భంలో, ఎన్ ఎల్ పి గురించిన ఓ పుస్తకం చేతిలో పడి దాని ద్వారా
పూర్తిగా ఆరోగ్యవంతుడయ్యాడు. అప్పట్నుంచీ ఈ స్వీయానుభవంతో ఎన్ ఎల్ పి నే వృత్తిగా
చేసుకున్నాడు. వివిధ నగరాల్లో వర్క్ షాపులు నిర్వహించడమే గాక, ఎన్నో వీడియోలు
రూపొందించాడు. యూట్యూబ్ లో ఈ వీడియోలు వందల సంఖ్యలో వుంటాయి. కాకపోతే హిందీలో
వుంటాయి. ఓ మూడేళ్ళుగా ఈయన వీడియోలు గమనిస్తూంటే గత వారం ఒక వీడియో బాగా ఆసక్తి కల్గించింది...
సిక్స్ టెక్నిక్స్
టు కంట్రోల్ సబ్ కాన్షస్ మైండ్’ అన్న వీడియోలో, పట్టు
పగ్గాల్లేని గుర్రంలాంటి మన సబ్ సబ్
కాన్షస్ మైండ్ కి ఎలా పగ్గం వేసి అనుకున్న గోల్ (లక్ష్యం)
దిశగా నడిపించి జీవితంలో విజయాలు
సాధించ వచ్చో వివరించాడు. ముందుగా ఈ టెక్నిక్స్ తెలుసుకుందాం. ఇవే
టెక్నిక్స్ ని సినిమా స్క్రీన్ ప్లేలకి అన్వయిస్తే కథలు మరింత అర్ధవంతంగా తయారవగలవన్న
నమ్మకంతో ప్రయోగాత్మకంగా రాస్తున్న వ్యాసమిది.
సబ్ కాన్షస్ మైండ్ (సుప్త
చేతనావస్థ) ని ప్రోగ్రామింగ్ చేయకపోతే దానికదే ప్రోగ్రాం అయిపోయి జీవితంలో ఇబ్బందులు
సృష్టిస్తుంది. మానసికంగా ఓ పద్ధతీ పాడూ లేకుండా జీవించేస్తాం. మనస్సుని అదుపులో వుంచుకోవాలంటారు
మునులు, ఋషులు, జెన్ మాస్టర్లు. అంటే ఏమిటి? మన నిత్య జీవితంలో
పనులు చేసుకోవడానికి వాడుకునే పైన వుండే, కాన్షస్ మైండ్ (చేతనావస్థ)
ని అదుపు చేయడమా? కాదు, అది తలకిందులు
తపస్సు చేసినా సాధ్యం కాదు. దానికి దిగువన వుండే సబ్ కాన్షస్ మైండ్ తోడ్పాటు
లేకుండా కాన్షస్ మైండ్ ఏమీ చేయలేదు. అందుకని అడుక్కి వెళ్ళి సబ్ కాన్షస్ మైండ్ ని
ప్రోగ్రామింగ్ చేసుకోవాలే తప్ప, పైపైన కాన్షస్ మైండ్ తో ఎన్ని
పాట్లుపడినా మనస్సుని అదుపు చేసుకునే విషయంలో సక్సెస్ అస్సలు సాధ్యం కాదు.
1. మంచీ చెడుల రహస్యం వైరింగే!
కనుక సబ్ కాన్షస్ మైండ్ ని
ప్రోగ్రాం చేసుకోవడానికి కొన్ని టెక్నిక్స్ ని ప్రయోగించాలి. ఇక్కడ కాన్షస్ మైండ్
తో ఒక చిక్కు వస్తుంది. అది సబ్ కాన్షస్ మైండ్ మాట వినదు. లాజికల్ గా
ఆలోచిస్తుంది. ఉదాహరణకి,
ఆర్ధికంగా రిచ్ అవ్వాలనుకుని సబ్ కాన్షస్ మైండ్ ‘నేను బాగా
రిచ్ ని!’ అంటే, ‘నువ్వెప్పుడు రిచ్ వయ్యావ్? నువ్వింకా పూర్ గానే వున్నావ్
కదా?’ అని అడ్డు తగులుతుంది లాజికల్ కాన్షస్ మైండ్. ఇది
నిజమే. సాధారణ భాషలో చెప్పుకుంటే, మనం రిచ్ కానప్పుడు రిచ్
అని చెప్పుకోవడానికి మనసొప్పదు. అబద్ధంలో జీవిస్తున్నట్టు వుంటుంది. కనుక ‘నేను రిచ్ ని’ అని సబ్ కాన్షస్ కి సజెషన్ ఇవ్వకుండా, ‘నేను రిచ్
నవుతాను’, ‘నేను రిచ్ నవుతున్నాను’ అని ఫ్యూచర్ టెన్స్ లో, లేదా ప్రెజెంట్ కంటిన్యూయస్
టెన్స్ లో అంటే, రిచ్ అవ్వాలని కోరుకుంటున్నాడు కాబోలని, ఇది లాజికల్ గా వుందని, కాన్షస్ మైండ్ ఓకే అని, సబ్ కాన్షస్ తో చేతులు కలిపి -రిచ్ అవడానికి యాక్షన్ తీసుకుంటుంది. ఇలాగే
ఆరోగ్యం, విద్య, ఉద్యోగ, వ్యాపార, కుటుంబ సంబంధాలు వగైరా అన్ని విషయాల్లో
దీన్ని అప్లై చేయొచ్చు.
కాన్షస్ మైండ్ మన మనసులో స్వల్ప
భాగమే, 10 శాతమే వుంటుంది. అదే సబ్ కాన్షస్ మైండ్ 90 శాతం
ఆక్రమించి వుంటుంది. ఇది అంతులేని జ్ఞాపకాల భండాగారం. మన ప్రతి మాట, చేత, ఆలోచన, అనుభవాలు, వీటి తాలూకు భావోద్వేగాలూ జ్ఞాపకాలుగా నిక్షిప్తమై పోతాయి సబ్ కాన్షస్ మైండ్ లో. ఈ స్టోరేజీ మెదడు లోని 80
బిలియన్ల న్యూరాన్స్ లో వుంటుంది. ఈ న్యూరాన్లు శరీరమంతా కణం కణం వ్యాపించి
వుంటాయి. కనుక ఈ జ్ఞాపకాలు శరీరంలోని 60 ట్రిలియన్ల కణాలన్నిట్లో చేరిపోతాయి.
ప్రతీ కణంలోనూ ఆత్మలాంటి జీన్, మెదడు లాంటి డీఎన్ఏ వుంటాయి. జ్ఞాపకాలు
మొదట కణాల్లోని జీన్స్ లోకెళ్ళి పోతాయి. ఆ జీన్స్ మీద తమ రాత రాస్తాయి. జ్ఞాపకాలు
పాజిటివ్ గా వుంటే పాజిటివ్ రాతలు, నెగెటివ్ అయితే నెగెటివ్
రాతలు. జీన్స్ వెంటనే ఈ రాతల్ని డీఎన్ఏ కి పంపిస్తాయి. అవి పాజిటివ్ రాతలైతే, ఈ మనిషి సవ్యంగా ఆలోచిస్తున్నాడు/ఆలోచిస్తోంది గో ఎహెడ్ అంటాయి. నెగెటివ్ జ్ఞాపకాలైతే ఈ మనిషి చెడుగా ఆలోచిస్తున్నాడు / ఆలోచిస్తోంది ఫంక్షన్
ఆపేయమంటాయి.
మన శరీర కణాలు నిత్యం లక్షా 40 వేల
రకాల ప్రోటీన్లు తయారు చేస్తూ, శరీరంలోని ప్రతీ అంగాన్నీ ఆరోగ్యవంతంగా
వుంచుతాయి. ఇలాంటప్పుడు డీఎన్ఏ నుంచి పాజిటివ్ సిగ్నల్ అందితే, లక్షా 40 వేల రకాల నాణ్యమైన ప్రోటీన్లు తయారు చేసి,
ఆయా అంగాలకి పంపి ఆరోగ్యవంతంగా వుంచుతాయి. అదే నెగెటివ్ సిగ్నల్ అందితే, నాణ్యమైన ప్రోటీన్ల తయారీ ఆపేసి, నకిలీ ప్రోటీన్లు
తయారు చేసే పంపుతాయి. దీంతో దేహంలోని అంగాలు దెబ్బతింటాయి. అంటే అనారోగ్యం
చేస్తుంది. మన శరీరం మెదడుతో ఇంత వైరింగ్ అయి వుంటే, స్క్రీన్
ప్లేలేమో ఏ వైరింగూ లేని తలాతోకాలేని కథలతో వుంటున్నాయి.
బాగానే వుంది, ఇక్కడ ఏది మంచి జ్ఞాపకం, ఏది చెడు జ్ఞాపకం ఎలా తెలుస్తుంది జీన్స్ కి? హార్మోన్ల
ద్వారా తెలుస్తుంది. ఈ హార్మోన్లు ఎలా ఉత్పత్తి అవుతాయి?
మెదడులో పుట్టే ఎమోషన్స్ (భావోద్వేగాల) ద్వారా ఉత్పత్తి అవుతాయి. అంటే సుఖ
సంతోషాలు, మంచి తనం, నీతీ నిజాయితీలు
మొదలైన పాజిటివ్ ఎమోషన్స్ తో, హేపీ హార్మోన్స్ ఉత్పత్తి అయి న్యూరాన్స్
ద్వారా మొదట కణాల్లోని జీన్స్ కి చేరతాయి. దీంతో జీన్స్ హేపీగా ఫీలై మనల్ని హేపీగా
వుంచుతాయి. అదే వొత్తిడి, కోపం, పగా
ప్రతీకారాలు, మోసం, భయం మొదలైన నెగెటివ్
ఎమోషన్స్ హేపీ హార్మోన్స్ ని ఆపేసి, కార్టిసాల్ అనే శరీరంలో భాధని
పుట్టించే హార్మోన్ ని విడుదల చేస్తాయి. ఇది జీన్స్ లోకెళ్ళి జీన్స్ ని ఏడ్పిస్తాయి.
అప్పుడు మనం ఛాతీనో, కడుపునో పట్టుకుని హాస్పిటల్లో బెడ్
బుక్ చేసుకుని, ఖర్మ ఖర్మ అనుకుంటూ నడుం వాలుస్తాం.
దాదాపు 100 శాతం రోగాలు మనసు వల్లే.
మనసులో ఎమోషన్స్ ఎలా వుంటే శరీరం అలా వుంటుంది. మెదడులోని న్యూరాన్లన్నీ శరీరంలోని
కణాలన్నిటితో కనెక్ట్ అయివుండడం వల్ల శరీరానికి ఈ మంచీ చెడులు జరుగుతాయి. అయితే
జీన్స్ పై పడ్డ చెడు రాతల్ని మంచి ఎమోషన్స్ తో చెరిపేసి,
పాజిటిటివ్ రాతల్ని ప్రవేశ పెట్టి, ఆరోగ్యాన్ని బాగు
చేసుకునే వీలుంది. దీన్ని ఎపిజెనెటిక్స్ వివరిస్తుంది. ఇది ప్రస్తుతం మనకి అవసరం
లేదు.
పై కార్యకలాపాలన్నీ సబ్
కాన్షస్ మైండ్ ఆధ్వర్యంలోనే జరుగుతాయి. మన
శరీరాన్ని నడిపించేది సబ్ కాన్షస్ మైండే కాబట్టి.
ఐతే రచయితలు ఒక ముఖ్య విషయాన్ని గమనించాలి- ఎమోషన్స్ మనసుకి సంబంధించినవి, ఫీల్ శరీరానికి
సంబంధించింది. అంతేగానీ ఎమోషన్స్, ఫీల్ రెండూ మనసుకి
సంబంధించినవి కావు. మనసులో ఏ ఎమోషన్ పుడితే హార్మోన్ల ద్వారా శరీరం అలా
ఫీలవుతుంది. అంటే వెండితెర మీద ఏ ఏ ఎమోషన్లు ఎలా ప్లే చేస్తే ప్రేక్షకుల శరీరాల్లో
ఏఏ హార్మోన్లు విడుదలై ఎలా ఫీలవుతారన్నది తెలుసుకుంటే -స్క్రీన్ ప్లేల క్వాలిటీయే
మారిపోతుంది. ఉదాహరణకి- ప్రేక్షకులు ఒక ప్రేమ సన్నివేశాన్ని బలంగా ఫీలవ్వాలంటే, వాళ్ళ శరీరాల్లో ఆక్సిటాసిన్ హార్మోన్ విడుదలయ్యేంత బలంగా ఆ ప్రేమ
సన్నివేశముండాలన్న మాట. ఆక్సిటాసిన్ అనేది లవ్ హార్మోన్. రచయితలు మానవ శరీరం
గురించి ఎన్ఎల్ పి, ఎపిజెనెటిక్స్ మొదలైనవి చదువుకుంటే రచనలో
ఇలాటి మౌలికాంశాలు బాగా ఉపయోగపడతాయి.
సబ్ కాన్షస్ మైండ్ (సుప్త చేతనావస్థ) ని ప్రోగ్రామింగ్ చేయకపోతే దానికదే ప్రోగ్రాం అయిపోయి జీవితంలో ఇబ్బందులు సృష్టిస్తుంది. మానసికంగా ఓ పద్ధతీ పాడూ లేకుండా జీవించేస్తాం. మనస్సుని అదుపులో వుంచుకోవాలంటారు మునులు, ఋషులు, జెన్ మాస్టర్లు. అంటే ఏమిటి? మన నిత్య జీవితంలో పనులు చేసుకోవడానికి వాడుకునే పైన వుండే, కాన్షస్ మైండ్ (చేతనావస్థ) ని అదుపు చేయడమా? కాదు, అది తలకిందులు తపస్సు చేసినా సాధ్యం కాదు. దానికి దిగువన వుండే సబ్ కాన్షస్ మైండ్ తోడ్పాటు లేకుండా కాన్షస్ మైండ్ ఏమీ చేయలేదు. అందుకని అడుక్కి వెళ్ళి సబ్ కాన్షస్ మైండ్ ని ప్రోగ్రామింగ్ చేసుకోవాలే తప్ప, పైపైన కాన్షస్ మైండ్ తో ఎన్ని పాట్లుపడినా మనస్సుని అదుపు చేసుకునే విషయంలో సక్సెస్ అస్సలు సాధ్యం కాదు.
1. మంచీ చెడుల రహస్యం వైరింగే!
మన శరీర కణాలు నిత్యం లక్షా 40 వేల రకాల ప్రోటీన్లు తయారు చేస్తూ, శరీరంలోని ప్రతీ అంగాన్నీ ఆరోగ్యవంతంగా వుంచుతాయి. ఇలాంటప్పుడు డీఎన్ఏ నుంచి పాజిటివ్ సిగ్నల్ అందితే, లక్షా 40 వేల రకాల నాణ్యమైన ప్రోటీన్లు తయారు చేసి, ఆయా అంగాలకి పంపి ఆరోగ్యవంతంగా వుంచుతాయి. అదే నెగెటివ్ సిగ్నల్ అందితే, నాణ్యమైన ప్రోటీన్ల తయారీ ఆపేసి, నకిలీ ప్రోటీన్లు తయారు చేసే పంపుతాయి. దీంతో దేహంలోని అంగాలు దెబ్బతింటాయి. అంటే అనారోగ్యం చేస్తుంది. మన శరీరం మెదడుతో ఇంత వైరింగ్ అయి వుంటే, స్క్రీన్ ప్లేలేమో ఏ వైరింగూ లేని తలాతోకాలేని కథలతో వుంటున్నాయి.
దాదాపు 100 శాతం రోగాలు మనసు వల్లే. మనసులో ఎమోషన్స్ ఎలా వుంటే శరీరం అలా వుంటుంది. మెదడులోని న్యూరాన్లన్నీ శరీరంలోని కణాలన్నిటితో కనెక్ట్ అయివుండడం వల్ల శరీరానికి ఈ మంచీ చెడులు జరుగుతాయి. అయితే జీన్స్ పై పడ్డ చెడు రాతల్ని మంచి ఎమోషన్స్ తో చెరిపేసి, పాజిటిటివ్ రాతల్ని ప్రవేశ పెట్టి, ఆరోగ్యాన్ని బాగు చేసుకునే వీలుంది. దీన్ని ఎపిజెనెటిక్స్ వివరిస్తుంది. ఇది ప్రస్తుతం మనకి అవసరం లేదు.
పై కార్యకలాపాలన్నీ సబ్ కాన్షస్ మైండ్ ఆధ్వర్యంలోనే జరుగుతాయి. మన శరీరాన్ని నడిపించేది సబ్ కాన్షస్ మైండే కాబట్టి. ఐతే రచయితలు ఒక ముఖ్య విషయాన్ని గమనించాలి- ఎమోషన్స్ మనసుకి సంబంధించినవి, ఫీల్ శరీరానికి సంబంధించింది. అంతేగానీ ఎమోషన్స్, ఫీల్ రెండూ మనసుకి సంబంధించినవి కావు. మనసులో ఏ ఎమోషన్ పుడితే హార్మోన్ల ద్వారా శరీరం అలా ఫీలవుతుంది. అంటే వెండితెర మీద ఏ ఏ ఎమోషన్లు ఎలా ప్లే చేస్తే ప్రేక్షకుల శరీరాల్లో ఏఏ హార్మోన్లు విడుదలై ఎలా ఫీలవుతారన్నది తెలుసుకుంటే -స్క్రీన్ ప్లేల క్వాలిటీయే మారిపోతుంది. ఉదాహరణకి- ప్రేక్షకులు ఒక ప్రేమ సన్నివేశాన్ని బలంగా ఫీలవ్వాలంటే, వాళ్ళ శరీరాల్లో ఆక్సిటాసిన్ హార్మోన్ విడుదలయ్యేంత బలంగా ఆ ప్రేమ సన్నివేశముండాలన్న మాట. ఆక్సిటాసిన్ అనేది లవ్ హార్మోన్. రచయితలు మానవ శరీరం గురించి ఎన్ఎల్ పి, ఎపిజెనెటిక్స్ మొదలైనవి చదువుకుంటే రచనలో ఇలాటి మౌలికాంశాలు బాగా ఉపయోగపడతాయి.
ఈ బొమ్మల్ని స్వీకరించే రాడార్ మన మెదడులో ఆర్ ఏ ఎస్ (రెటీక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్) రూపం లో వుంటుంది. ఆ గోల్ డబ్బు కావచ్చు, ఆరోగ్యం కావొచ్చు, విద్యా వ్యాపార ఉద్యోగాలూ కావొచ్చు, ఇంకేదైనా కావచ్చు - దాన్ని ఎండ్ రిజల్టుతో మెంటల్ మూవీగా ఆర్ఏ ఎస్ అనే రాడార్ కి చూపించాల్సిందే.
ఈ మెంటల్ మూవీ ఏమిటి, ఎలా వుంటుంది? సినిమా దర్శకుడు/ దర్శకురాలు కథ రాయడం, అనుకున్న హీరోకి / నిర్మాతకి విన్పించడం, అది సింగిల్ సిట్టింగ్ లో ఓకే అవడం, నిర్మాత ఆఫీసు ఇవ్వడం, తాను స్టాఫ్ ని తీసుకుని ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించడం, ఇతర ఆర్టిస్టుల్ని, సాంకేతికుల్ని బుక్ చేసుకోవడం, కొబ్బరి కాయకొట్టి ఎంజాయ్ చేస్తూ షూటింగ్ ప్రారంభించడం,,, షూటింగ్ జరుగుతూంటే దృశ్యాలు బ్రహ్మాండంగా రావడం, గుమ్మడి కాయ కొట్టి షూటింగు ముగించడం, ఎంజాయ్ చేస్తూ పోస్ట్ ప్రొడక్షన్స్, ఫస్ట్ కాపీ, రిలీజ్ కార్యక్రమాలు, పబ్లిసిటీ, బయ్యర్ల సందడీ, సినిమా రిలీజ్....రిలీజ్ తర్వాత పైన చెప్పిన విధంగా ఎండ్ రిజల్ట్!
ఎక్కడా ఇది అవుతుందా లేదా అని సందేహ పడకూడడు. ఆటంకాలు చూడకూడదు. అంతా ఒక ఎంజాయ్ మెంటుగా సాఫీగా జరిగిపోతున్నట్టు వూహిస్తేనే సబ్ కాన్షస్ మైండ్ ఓకే చేసే మెంటల్ మూవీ వస్తుంది.
b. ఆఫర్మేషన్స్ : లా ఆఫ్ ఎట్రాక్షన్ లో ఎలాగైతే ఆఫర్మేషన్స్ చేస్తామో అదే ఇక్కడ చేయాలి. అంటే ఆటో సజెషన్స్ ద్వారా సబ్ కాన్షస్ మైండ్ ని జాగృతపర్చడం. అంటే పైన చెప్పుకున్న విధంగా, ‘నేను రిచ్ నవుతాను’, ‘నేను రిచ్ నవుతున్నాను’ వంటి గోల్ కి సంబంధించిన విన్నపాల్ని ఆటో సజెషన్స్ గా ఇవ్వడం. ‘ఈ గోల్ నేను సాధిస్తాను’, ‘నా గోల్ సాకారమవుతోంది’ వంటి ఆఫర్మేషన్స్ ని రాత్రి పడుకోబోయే ముందు, ఉదయం లేవగానే కనీసం 30 సార్లు వల్లె వేయాలి, రాయాలి. ఇలా చేస్తున్నప్పుడు ఆఫర్మేషన్ లోని పదాలు బ్రెయిన్ లో న్యూరల్ పాత్స్ ని సృష్టిస్తాయి. అంటే ముద్రితమైపోతాయి. ఇవి న్యూరాన్స్ ద్వారా శరీరం లోని ప్రతీ కణం కణం లోకీ ఇంకి, గోల్ ని సాధించడానికి శరీరాన్ని ప్రేరేపిస్తాయి. బ్రెయిన్ మెమరీ అంతా శరీర కణాల్లో కూడా మెమరీగా రికార్డయిపోతుంది.
c. యాక్షన్ : ఇక గోల్ తాలూకు పనితో యాక్షన్ లోకి దిగాలి. డబ్బు సంపాదన గోల్ అయితే, దానికే మార్గముందో ఆ పనులు మొదలెట్టాలి. సినిమా అవకాశం గోల్ అయితే స్క్రిప్టు రాయడం మొదలెట్టాలి. ఆరోగ్యం గురించయితే ఆరోగ్య సూత్రాలు పాటించడం వంటివి చేయాలి. దీంతో శరీరం చేపట్టిన ఈ యాక్షన్ కి అలవాటు పడుతుంది. ఈ పనులు ఎంత కష్టమైనా ఎంజాయ్ చేస్తూ చేయాలి. ఈ టఫ్ ఆర్టికల్ని ఎంజాయ్ చేస్తూనే రాశాం! ఎంజాయ్ చేసినప్పుడు హై వైబ్రేషన్స్ పుడతాయి. హై వైబ్రేషన్స్ సబ్ కాన్షస్ మైండ్ ద్వారా యూనివర్స్ తో కనెక్ట్ అవుతాయి. ఇక యూనివర్స్ మనం పడుతున్న శ్రమకి తగ్గ వినియోగ దారుల్ని వెతికి తేవడం మొదలెడుతుంది.
డి. మెటఫర్స్ : అంటే రూపకాలంకారాలు. సబ్ కాన్షస్ మైండ్ మన ఉద్దేశాన్ని అర్ధం జేసుకోవాలంటే మెటఫర్స్ రూపంలో సంకేతాలు చూపించాలి. గెలుపుకి మెటఫర్ శిఖరం పైన జెండా ఎగరేయడం కావొచ్చు. రాకెట్ లా ఆకాశంలోకి దూసుకు పోవడం కావచ్చు. ఇలాటి మెటఫర్స్ తో ఎమోషనల్ కథలు చూపెట్టాలి. ఉదాహరణకి ముగ్గురు కొడుకులున్నారు. వాళ్ళెప్పుడూ కర్రలు పెట్టి కొట్టుకుంటూ వుంటారు. తండ్రి ఎంత వారించినా వినరు. ఇలా కాదని తండ్రి ముగ్గురికీ ఒక్కో కర్ర ఇచ్చి విరగ్గొట్టమన్నాడు. విరిచి పారేశారు. అవే కర్రల్ని కట్ట గట్టి ఇప్పుడు విరగ్గొట్టమన్నాడు. వాళ్ళ వల్ల కాలేదు.’చూశారా, ‘విడిగా వుంటే విరిగి పోతారు. కలిసివుంటే మిమ్మల్ని ఎవరూ ఓడించలేరు’ అని నీతి చెప్పాడు తండ్రి. ఇక్కడ కట్ట కట్టిన కర్రలు సంఘటిత బలానికి మెటఫర్ అన్నమాట. ఇలాటి మెటఫర్స్ ని ఇష్టపడుతుంది సబ్ కాన్షస్ మైండ్.
మెటఫర్స్ పాజిటివ్ సెన్స్ లో వుండాలి. పొరపాటున కూడా ‘నా జీవితం ముళ్ళదారి’ అనో, ‘నా గుండె మీద బండ పడింది’ అనో, ‘నా నెత్తిన పిడుగు పడింది’ అనో అనకూడదు, లేకి కవిత్వాలు రాయకూడదు. అప్పుడు ముళ్ళదారి, బండ, పిడుగు వంటి మెటఫర్స్ కి ఇన్స్ ఫైర్ అయి వాటినే తెచ్చి నిజజీవితంలో పడేస్తుంది సబ్ కాన్షస్ మైండ్. తధాస్తు దేవతల మహా త్మ్యం అన్నమాట! ఈ తధాస్తు దేవతలే సబ్ కాన్షస్ మైండ్.
ఇలా కాకుండా ‘నా జీవితం ఉదయించే సూర్యుడు’, ‘నా ఆరోగ్యం వికసించే పువ్వు’- లాంటి పాజిటివ్ మెటఫర్స్ వాడాలి.
14, అక్టోబర్ 2024, సోమవారం
1451 : రివ్యూ!
ఇప్పుడు చెన్నైలో గుర్తు తెలియని దుండగుడు శరణ్యని రేప్ చేసి చంపేస్తాడు. దీంతో ఉపాధ్యాయులు, ప్రజలూ తీవ్ర ఆందోళనకి దిగుతారు. వీళ్ళని శాంతపర్చడానికి కన్యాకుమారి నుంచి ఆదియన్ ని పిలిపించి కేసు అప్పగిస్తాడు డిజిపి (రావు రమేష్). ఆదియన్ గుణ అనే యువకుడ్ని రేపిస్టు- కిల్లర్ గా నిర్ధారించి ఎన్ కౌంటర్ చేసేస్తాడు. ఇది బెడిసి కొడుతుంది. తాను ఎన్ కౌంటర్ చేసింది అమాయకుడ్నని తెలుకుని షాక్ అవుతాడు.
భారీ ఉద్యమాలని, మెసేజుల్నీ ఒక ఫార్ములాగా డిమాండ్ చేసే ఇలాటి విద్యారంగం పాత కథకి యాక్షన్ తో కూడిన పోలీస్ ఎన్ కౌంటర్ల కథ జత చేసి, విద్యారంగం కథ పాత మూస టెంప్లెట్ లో పడిపోకుండా కాపాడడం తెలివైన పనే. దీంతో ఈ కథనం పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రధానంగా సాగుతూ యూత్ అప్పీల్ కీ, మాస్ అప్పీల్ కీ న్యాయం చేసే యాక్షన్ థ్రిల్లర్ జానర్ లో కొత్త పుంతలు తొక్కిందేమో ప్రేక్షకులే నిర్ణయించుకోవాలి...
ఐతే ఇది ‘జైలర్’ లాగా రియలిస్టిక్ గా వుండదు. రజనీ పాత్ర కూడా ‘జైలర్’లో లాగా వయ్సుకి తగ్గ, సాధారణ జీవితపు వాస్తవికతతో వుండదు. రజనీ తన ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకుని పూర్తి మాస్ మసాలా యాక్షన్ హీరోగానే కన్పిస్తాడు. ఎస్పీగా విచ్చలవిడి ఎన్ కౌంటర్ లతో ప్రారంభమై, ఓ గ్రూప్ సాంగ్ వేసుకుని, ఓ కామెడీ చేసుకుని పరిచయమవుతాడు. మరోవైపు సమాంతరంగా అమితాబ్ బచ్చన్ లాయర్ ట్రాక్ నడుస్తూంటుంది. దీనికి సమాంతరంగా టీచర్ పాత్రలో దుషారా విజయన్ ట్రాక్ వస్తూంటుంది. మధ్యమధ్యలో ఫహద్ ఫాజిల్ కామెడీ ట్రాకు. టీఛర్ హత్యతో కథ మలుపు తిరిగి ఇక రజనీ ఇన్వెస్టిగేషన్ తో పరుగులు తీస్తుంది. టీచర్ కేసులో తాను ఎన్ కౌంటర్ చేసింది అమాయకుడ్నని రజనీ తెలుసుకోవడంతో ఫస్టాఫ్ ముగుస్తుంది.
ఇక సెకండాఫ్ కూడా దాదాపు ముప్పాతిక భాగం అసలు హంతకుడెవరో తెలుసుకునే ఇన్వెస్టిగేషన్ కథ గానే మలుపులు తిరుగుతూ సాగి- ఎడ్యుటెక్ కంపెనీ ఓనర్ గా రానా తెరపైకి రావడంతో విద్యావ్యవ స్థ కథ మొదలవుతుంది. అయితే కథకి ముగింపు అతి సాధారణంగా వుండడమేగాక, రజనీ క్యారక్టర్ పరంగా కథలో వుండాల్సిన టర్నింగ్ కన్పించదు.
ఈ మద్య సెకండాఫులు తేలిపోయి ఫ్లాపవుతున్న సినిమాల్ని వరసగా చూస్తున్నాం. కానీ ఈ మూవీ ఫస్టాఫ్, సెకండాఫ్ ఎక్కడా పట్టుతప్పకుండా గ్రిప్పింగ్ గా వుండడం ఒక రిలీఫ్. దీనికి తగ్గట్టు పాత్ర చిత్రణలు కూడా గ్రిప్పింగ్ గా వుండుంటే –‘జైలర్’ లాగా మరో లెవెల్లో వుండేది ఈ పానిండియా మూవీ.
అయితే పాత్ర పరంగా వుండాల్సిన డెప్త్ లేదు. తాను అమాయకుడ్ని ఎన్ కౌంటర్ చేశాడన్న బాధ కాసేపే వుంటుంది. హతుడి కుటుంబంతో అసలు హంతకుడ్ని పట్టుకుని మీ కొడుకు నిర్దోషి అని నిరూపిస్తానంటాడు. దీంతో ఈ ఇన్వెస్టిగేషన్ తో సాగిపోతాడు. అసలు ఎన్ కౌంటర్ పేరుతో హత్య చేసినందుకు సస్పెండ్ అవ్వాలి. ఇది జరగదు. ఇంకా ఇతడ్ని నమ్మి అసలు హంతకుడ్ని పట్టుకునేందుకు అనుమతిస్తాడు డిజిపి. తాను అమాయకుడ్ని చంపాడన్న అపరాధ భావంతో కూడిన పాత్ర చిత్రణ, దానికి ప్రాయశ్చిత్తం చేసుకునే ముగింపూ వుండవు. చివరికి ఆ కొడుకు నిర్దోషి అని నిరూపించాక, నేను చంపానన్న బాధ వుంది- ఎంక్వైరీ కొంసాగుతుంది- అని కుటుంబంతో అంటాడు. అంటే ఏంటో? తన మీద థాణె ఎంక్వైరీ వేసుకుంటాడా?
ఇలాగే అమితాబ్ బచ్చన్ పాత్ర కూడా నామ్ కే వాస్తే వుంది. ఆయన మానవ హక్కుల పోరాటం ఏం చేశాడో కన్పించదు. తనకీ రజనీకీ సఘర్షణతో కూడిన కథ వుంటుందనుకుంటే అదీ వుండదు. అయితే ఫహద్ ఫాజిల్ కామిక్ పాత్ర కొనసాగింపు, దానికిచ్చిక షాకింగ్ ముగింపూ బావున్నాయి. విలన్ గా రానా దగ్గుబాటి చివర్లో వచ్చే పాత్ర. రొటీన్ విలనీ, మంజూ వారియర్ కి పెద్దగా ప్రాధాన్యంలేదు గానీ, టీచర్ పాత్రలో దుషారా విజయన్ సానుభూతి పొందే ప్రయత్నంచేస్తుంది. కానీ ఆమె హత్యా దృశ్యపు మాంటేజీలు పదేపదే వేయడం అనవసరం.
ఇక రజనీ ఎలా మూవ్ మెంటిస్తే అలా బీజీఎం ఇచ్చి అభిమానుల్ని ఫుల్ ఖుష్ చేశాడు అనిరుధ్ రవిచందర్. పాటల విషయంలో పెద్దగా శ్రద్ధ తీసుకోలేదు. కదిర్ ఛాయాగ్రహణం టాప్ క్లాస్. ఇతర సాంకేతిక విలువలు, యాక్షన్ దృశ్యాలు లైకా ప్రొడక్షన్స్ రేంజిలో వున్నాయి.
మొత్తానికి రజనీ, జ్ఞానవేల్ లు కలిసి కమర్షియల్ సినిమాని ఓ కొత్త శైలిలో చూపించాలని చేసిన ప్రయత్నం, ఓ ఫర్వాలేదనే స్థాయిలో వుందని చెప్పుకోవచ్చు.
-సికిందర్
5, అక్టోబర్ 2024, శనివారం
2021- 22 లలో
ఓ మూడు ఫ్లాపుల తర్వాత శ్రీవిష్ణు 2023 లో ‘సామజవరగమన’ కామెడీతో ఓ హిట్టిచ్చి, తిరిగి ‘ఓం భీమ్ బుష్’ అనే ఇంకో ప్లాప్ తో సరిపెట్టుకున్నాడు. అయితే 2021 ప్రారంభంలో ‘రాజరాజ చోర’ అనే హిట్ కూడా ఇచ్చాడు. దీనికి దర్శకుడు
హసిత్ గోలి. తిరిగి ఇదే దర్శకుడితో ఈవారం ‘స్వాగ్’ అనే మరో కామెడీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్
తిరిగి ఓ క్లీన్ ఎంటర్ టైనర్ ని అందించిందా? దసరా సందర్భంగా
దీన్ని చూసి ఎంజాయ్ చేయొచ్చా? తెలుసుకుందాం...
ఈ రాగి పలక భవభూతికి కాక ఈమెకెలా వచ్చింది? భవభూతి లాగే వున్న సింగరేణి అలియాస్ సింగ (శ్రీవిష్ణు) ఎవరు? వీళ్ళిద్దరికీ సంపద దక్కకుండా చేసిన యయాతి (శ్రీ విష్ణు) ఎవరు? 1551 ఏళ్ళ క్రితం మాతృస్వామ్యాన్ని స్థాపించి మగాళ్ళని తోక్కెసిన వింజామర వంశ మహారాణి రుక్మిణీ దేవి (రీతూ వర్మ) నుంచి అధికారాన్ని లాక్కుని, పితృ స్వామ్య వ్యవస్థని స్థాపించిన అదే వంశ మహారాజు భవభూతి (శ్రీ విష్ణు) ఏం చేశాడు? ఇందులో రేవతి (మీరా జాస్మిన్) ఎవరు? చివరికి సంపద ఎవరి సొంతమైంది? ఇదీ మిగతా కథ.
మహారాణి పాత్రలో, తర్వాత ఈ కాలంలో లింగ వివక్ష నెదుర్కొనే ఆత్మాభిమానం గల సాధారణ యువతి పాత్రలో రీతూ వర్మ మాత్రం నీటుగా నటించింది. ఈ రెండూ సీరియస్ పాత్రలే. కంగాళీ కామెడీలో ఈమె భాగం కాలేదు. శ్రీవిష్ణు భార్య పాత్రలో మీరా జాస్మిన్ కూడా చెప్పుకోవాల్సిన నటి. ఇక సునీల్ రొటీన్. వంశ వృక్ష నిలయంలో రవిబాబు, గోపరాజు పాతకాలపు పాత్రలు, నటన యూత్ కి అవసరం లేదు. రవి బాబుతో పరమానందయ్య శిష్యుల్లాగా వుండే నటుల హాస్యమేమీ లేదు.
పురాతన కాలపు సెట్స్, వాతావరణ సృష్టి, దీనికి తగ్గ కెమెరా వర్క్ బావున్నా వీటితో సంగీతం మాత్రం పోటీపడలేదు. పాటలేమీ వర్కౌట్ కాలేదు. ఈ గజిబిజి కథకి ఎడిటింగ్ ఎలా వర్కౌట్ అయిందో ఎడిటర్ కే తెలియాలి.
జానపద కథల్లోంచి కథ తీసుకుని మోడరన్ కాలపు కథ చెప్పిన సినిమాలెన్నో వచ్చాయి. ఫాటల్ ఎట్రాక్షన్, కిల్ లిస్ట్, ఏక్ హసీనా థీ, బుల్ బుల్ వంటివి. ‘స్వగ్’ లింగ వివక్ష కథని నేటి కాలంలో స్థాపించి మెసేజి ఇస్తే బాక్సాఫీసు అప్పీల్ బ్లాస్ట్ అయ్యేది.
—సికిందర్
27, సెప్టెంబర్ 2024, శుక్రవారం
1449 : రివ్యూ!
ఈ స్థాయి బిగ్ బడ్జెట్ పానిండియా మూవీకి కొరవడింది కంటెంటే. దర్శకుడు కొరటాల శివ రైటింగ్ విభాగం ప్రొడక్షన్ విలువలతో పోటీ పడి వుండాల్సింది
ప్రేక్షకులు ఎంతగానో
ఎదురు చూస్తున్న ఎన్టీఆర్- కొరటాల శివ కాంబినేషన్ లో ‘దేవర’ పార్ట్ 1 ఈ రోజు అయిదు భాషల్లో పానిండియా మూవీగా రిలీజైంది. ఇందులో ఒక
ప్రత్యేకాకర్షణ శ్రీదేవి కుమార్తె జాహ్నవీ కపూర్ హీరోయిన్ గా నటించడం. అలాగే
బాలీవుడ్ నటుడు సైఫలీ ఖాన్ విలన్ గా నటించడం. ఇలా ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన
పూర్తిగా కొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ మెగా
మూవీ ఎలా వుందో చూద్దాం...
--సికిందర్