7, జూన్ 2022, మంగళవారం
28, మే 2022, శనివారం
24, మే 2022, మంగళవారం
1170 : స్పెషల్ ఆర్టికల్
స్టోరీ ఐడియా
థింక్ హై గా వుండాలంటే ఈ నాల్గిటిని కూడా థింక్
హైగానే ఆలోచించాలి : హీరో, హీరో గోల్, కాన్ఫ్లిక్ట్, సొల్యూషన్. రెగ్యులర్ హీరో, రెగ్యులర్ హీరో గోల్, రెగ్యులర్ కాన్ఫ్లిక్ట్, రెగ్యులర్ సొల్యూషన్ లతో సినిమాలుంటాయి.
ఈ రెగ్యులర్ కి వ్యతిరేకంగా ఆలోచించినప్పుడు హీరో, గోల్, కాన్ఫ్లిక్ట్, సోల్యూషన్ హై లెవెల్లో కొత్తగా మారిపోతాయి.
‘రిజర్వాయర్ డాగ్స్' లో దొంగలు దోపిడీ ప్లాన్ చేస్తే
ఆ ప్లాన్ విఫల మవుతుంది. అప్పుడు తమలో ఒకడు పోలీస్ ఇన్ఫార్మర్ వున్నాడని అనుమానిస్తారు.
ఇది రెగ్యులర్. తమలో ఒకడు గాంధేయ వాది వున్నాడని అనుమానిస్తే? దొంగలందరూ గాంధేయ వాదులుగా మారిపోతే? ఇదేదో కొత్త కామెడీ అవుతుంది. ఉన్నదానికి వ్యతిరేకం (యాంటీ) గా ఆలోచిస్తే
థింక్ హై అయిపోతుంది. కాకపోతే యూనివర్సల్ స్పిరిచ్యువల్ టచ్ ఇవ్వాలి. గాంధేయ వాదులుగా
మారడం యూనివర్సల్ స్పిరిచ్యువల్ టచ్చే. తన పెళ్ళి కాకుండా ఇతరుల పెళ్ళిళ్ళు చేయడం యూనివర్సల్
అప్పీలున్న స్పిరిచ్యూవల్ టచ్చే...
—సికిందర్
22, మే 2022, ఆదివారం
1169 : సండే స్పెషల్
అసలు రాయాలంటే ముందు వామప్
(warm up) అవాలి. జిమ్ము కెళ్ళి బరువు లెత్తబోతే, జిమ్ ట్రైనర్ వచ్చేసి ముందు నీ బాడీని
వామప్ చేసుకోమంటాడు. అంటే ఎకాఎకీన ఎత్తబోయిన
బరువు శరీరం మీద పడి కండరాలు షాక్ కి గురవకుండా, నువ్వీ
బరువెత్తబోతున్నావూ అని ముందస్తుగా కండరాలకి కౌన్సెలింగ్
చేసుకోవడమన్నమాట. కానీ రూములో రైటర్ రాయడానికి
కూర్చున్నప్పుడు మాత్రం అలాటి వామప్పులూ ఏవీ
వుండవు. స్క్రిప్టు రాయడం మొదలెట్టాడంటే
వరసబెట్టి సీన్లే రాసేస్తూంటాడు. జిమ్ములోలాగే
రాయడానికి రూములో కూడా వామప్ చేసుకోవడం మనస్కరించదు.
రాస్తున్న
విషయానికి సంబంధించి ఏ విషయ సేకరణా (వామప్) వుండకపోతే, ఏ క్షేత్ర
స్థాయి పరిస్థితుల పరిశీలనా (వామప్) వుండక పోతే, ఏవో వూహలు అల్లేసుకుంటూ తమ లోకంలో తాము ఆత్మకథ రాసుకోవడమే. క్షేత్ర స్థాయిలో
అంటే - పంపిణీ రంగంలో, ప్రేక్షక రంగంలో- జయాపజయాల కదనరంగంలో- ఇతర భాషా రంగాల్లో - పరిస్థితులేమిటో
తెలుసుకోకుండానే గొప్ప వ్యాపారాత్మక సినిమా
స్క్రిప్టు రాయడం ఎలా సాధ్యం?
బ్యాడ్ రైటింగ్ అంతా వామప్ కి ఎగనామం పెట్టే దగ్గరే మొదలవుతుంది. ఒక వస్తువు కొనాలన్నా నాల్గు చోట్ల వాకబు చేసి కొంటాం. కానీ ఒక స్క్రిప్టు రాయాలంటే ఏ వాకబూ వుండదు. ఇప్పుడు నేనీ స్క్రిప్టు రాస్తున్నాను, దీన్నిప్పుడు ప్రేక్షకులు చూస్తారా, ప్రేక్షకులు ఎలాటివి చూస్తున్నారు, ఎలాటివి చూసి చూసి విసిగి పోయారు, కొత్తగా ఏం కోరుకుంటున్నారు, అసలు సినిమా ప్రేక్షకులుగా ఇప్పుడెవరున్నారు, మొదటి రోజు మొదటి ఆటకి వచ్చే ప్రేక్షకులెవరు, వాళ్ళ అభిరుచులేమిటి, వాళ్ళ అభిరుచులకి ఏ సామాజికార్ధిక పరిస్థితులు దోహదం చేస్తున్నాయి, ఏ సామాజికార్దిక పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని నేను రాయాలి, నేను రాయాలంటే సదా స్మరించుకోవాల్సిన యూత్ అప్పీల్ అంటే ఏమిటి, ఆ యూత్ అప్పీల్ కి అబ్బాయిలే వున్నారా, అమ్మాయిలు కూడా వుంటున్నారా ప్రేక్షకుల్లో, ఎంత మంది అమ్మాయిలు కొత్త దర్శకుల స్మాల్, మీడియం బడ్జెట్ సినిమాలకి వస్తున్నారు, రాకపోతే అబ్బాయిల కోసమే వేటిని దృష్టిలో పెట్టుకుని ఏ కల్చర్లో, ఏ జానర్లో స్క్రిప్టులు రాయాలి...
―సికిందర్
14, మే 2022, శనివారం
1168 : స్క్రీన్ ప్లే సంగతులు- 2
‘దేర్ విల్ బి బ్లడ్’ లో వెనుకటి హత్య జరిగిన సీను పరిణామాలతో ఎలా కొత్త సీను కథని ముందుకు నడిపించింది? ఇప్పుడు డానీ గనుక మతాన్ని ఒప్పుకోకపోతే, వూచలు లెక్కెట్టే లాక్ వేశాడు బాండీ బ్లాక్ మెయిల్ చేస్తూ. ఇలాటిదేదో రాథోడ్ తమ్ముడికి సిద్ధ ఎందుకు చేయకూడదు? భూ కబ్జాలతో ముందు కెళ్ళ కుండా రాథోడ్ తమ్ముడ్ని స్ట్రాంగ్ గా ఇరకాటంలో పెట్టేసే సీనెందుకు కాకూడదిది? పరస్పరం హీరో విలన్లు ఎత్తుగడలతో దెబ్బతీసుకునే యాక్షన్ రియాక్షన్ల సంకుల సమరమేగా సెకెండ్ యాక్ట్ బిజినెస్ అంటే?
8, మే 2022, ఆదివారం
1167 : స్క్రీన్ ప్లే సంగతులు -2
నమ్మించని నేపథ్యం
ఋషులు శూద్రులకి శాస్త్రాలు నేర్పడం, సృష్టి రహస్యాలు చెప్పడం, ధర్మాన్ని బోధించడం - ఇదంతా వాస్తవ దూరమైన సెటప్. పైగా మూల వాసులైన గిరిజనులకి ఈ శాస్త్రాలకంటే పూర్వం నుంచీ వాళ్ళ వైద్య పద్ధతులు, జీవన విధానం, విశ్వాసాలు వాళ్ళకున్నాయి. ఇంకో కల్చర్ ని తమ మీద రుద్దితే ఒప్పుకోరు. వాళ్ళ ప్రపంచంలోకి వెళ్ళి ఇంకెవరూ ఏం నేర్పాలన్నా, మార్చాలన్నా నేర్చుకోరు, మారరు. ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం - ప్రభుత్వ సమగ్ర గిరిజానాభివృద్ధి సంస్థ వైఫల్యం.
కథా ప్రయోజనంతో వాస్తవికత
జీవికని లాగేసుకోవడాన్ని ఇంకో సెటప్ లో చూద్దామా అప్డేట్ చేసి సమకాలీనంగా మార్కెట్ యాస్పెక్ట్, యూత్ అప్పీల్, ఎకనమిక్స్ వగైరాలతో కలిపి? అడవుల్లో తిప్పతీగ అని వన మూలిక వుంటుంది. దీన్ని ఆయుర్వేద ఔషధ తయారీలో ఉపయోగిస్తూంటారు. మహారాష్ట్రకి చెందిన ఒక గిరిజనుడు ఈ తిప్పతీగెని పండిస్తూ కోట్లు ఆర్జిస్తున్నాడు. ఆయుర్వేద కంపెనీలు ఈ తిప్ప తీగె సాగుని కొనుగోలు చేస్తున్నాయి. కరోనా మహమ్మారి అధికం కావడంతో ప్రతీ ఒక్కరూ రోగ నిరోధక శక్తిని పెంపొందించుకునే పనిలో పడ్డారు. దీంతో తిప్ప తీగెలకి డిమాండ్ పెరిగింది. ఇంతేగాక, కరోనా మహమ్మారి వల్ల ఎంతోమంది ఉపాధిని కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ గిరిజనుడు తిప్పతీగల సాగుచేస్తూ ఎంతో మందికి ఉపాధి కూడా కల్పిస్తున్నాడు.
తర్వాతి కథ
ఫస్ట్ యాక్ట్ పరిస్థితి
సెకెండ్ యాక్ట్ -1 పరిస్థితి