ఒక ఉద్యోగానికి బయోడేటా పెట్టుకోవాలన్నా అందులో
పరువుపోయే అంశాలు రాయకుండా జాగ్రత్త పడతారు. కానీ ఒక హీరో కోసం కథ రాయాలంటే మాత్రం ఆ హీరో పరువంతా తీసే స్క్రీన్
ప్లే సంగతులు దట్టించి మరీ రాస్తారు. ఈ దర్శకుడు వచ్చి ఉత్త
పుణ్యానికి తన పరువంతా తీస్తున్నాడని హీరో కి కూడా తెలుసుకునే పరిజ్ఞానం వుండదు.
ఇద్దరు అజ్ఞానులు కలిసి ఒక విజ్ఞానదాయక సినిమా తీస్తారు. కొత్త వాళ్ళు నేర్చుకోవడానికి (పాతవాళ్లు చచ్చినా
నేర్చుకోరు కాబట్టి) ఆ సినిమా ఒక విజ్ఞాన ఖనిలా ఉపయోగ
పడుతుంది. ఆ సినిమాలు ప్రేక్షకుల కోసం కాక, నేర్చుకునే వాళ్ళకోసం స్కూలు
పుస్తకాలుగా ఉపయోగపడతాయి. నూటికి 90 శాతం
ఫ్లాపవుతున్న సినిమాలన్నీ నేర్చుకునే
వాళ్ళ ప్రయోజనార్ధమే వ్యయ ప్రయాసల కోర్చి నిర్మిస్తున్నారు. ఇంత
సేవ చేస్తూంటే నిందించడం, విమర్శించడం తగునా?
కొత్త దర్శకులు కొందరు
ఫలానా సీనియర్ దర్శకుడికి అసిస్టెంట్ గా పనిచేశామని చెప్పుకుని గ్లామర్ పెంచుకోవడం
అలవాటు. అయినంత మాత్రాన ఆ సీనియర్ దర్శకుడి
స్థాయికి సరితూగడం జరుగుతోందా? సీనియర్ దర్శకుల దగ్గర
టెక్నికల్ గా సినిమా మేకింగ్ వరకే నేర్చుకోగలరు, రచన
చేసుకోవడం ఎవరికి వాళ్ళు స్వయంగా చేసుకోవాల్సిన సాధనే. కానీ ఈ సాధనకంటే మేకింగ్ నేర్చుకున్న సర్టిఫికేట్టే
ప్రధానమైపోతే, దక్కే దర్శకత్వ ఛాన్సు కి అరకొర రచనానుభవం ఏమాత్రం ప్లస్ అవుతోంది?
క్రియేటివ్ శ్రమకి
ప్రత్యాన్మాయంగా కట్ అండ్ పేస్ట్ సదుపాయముండగా, ఇంకా
రచనానుభవం కోసం పాటుబడాలని ఎవరనుకుంటున్నారని?
రెండు సినిమాల తమిళ దర్శకుడు అట్లీ, తన గురువు శంకర్ నుంచి మేకింగ్ నేర్చుకున్నాడేమో గానీ, స్టోరీ టెల్లింగ్ కి సంపాదించుకున్న అనుభవం ప్రశ్నార్ధకమని ‘పోలీస్’ ని చూస్తే తెలిసిపోతోంది. ఏనాటిదో ‘బాషా’- ఆ ‘బాషా’ తోబాటు ఆ తరహా పాత్ర, దాని ఫ్లాష్ బ్యాక్ కథలతో వచ్చిన తెలుగు ఫ్యాక్షన్ సినిమాలూ గుర్తుకు వచ్చే విధంగా, తన కట్ అండ్ పేస్ట్ పనితనాన్ని మాత్రమే చూపెట్టాడు- మేకింగ్ కోసం మాత్రం గురువుగారు గర్వించేట్టు శ్రమించాడు.
‘బాషా’ ఫార్మాట్ ని మళ్ళీ మొన్నే బాలకృష్ణ నటించిన ‘డిక్టేటర్’ లో చూశాం. ‘బాషా’ ఫార్మాటే దాదాపు అంతరించిపోయాక తగుదునమ్మా అని మళ్ళీ ‘పోలీస్’ తీశాడు. ఇది సరిపోదన్నట్టు చిత్రవిచిత్ర హీరో పాత్ర చిత్రణ. హీరో పాత్రతో కథని నడపకుండా, కథతోనే హీరో పాత్రని నడపడం వల్ల ఆయా పరిస్థితులకి ఆ హీరో రియాక్షన్లూ, డైలాగులూ స్థానభ్రంశం చెంది స్క్రిప్టులో ముందూ వెనుకలై పోయాయి. ఫలానా ఈ సీన్లో చెప్పాల్సిన మాట ఎప్పుడో ఇంకేదో సీన్లో చెప్తాడు, ఫలానా ఆ సీన్లో అలా చెప్పకూడని మాట అలాగే చెప్పేసి వ్యక్తిత్వాన్ని దిగజార్చుకుంటాడు. ఫలానా విపత్కర పరిస్థితిని ఎదుర్కోవలసిన తను, మడమ తిప్పి కథలోంచి సన్యాసం పుచ్చుకుంటాడు. తను పోలీసు అధికారి అన్న సంగతే మర్చిపోయినట్టు ప్రవర్తిస్తాడు. ఓ చోట నా ఖర్మ ఇంతే అన్నట్టు ఏడుస్తాడు!!
కమర్షియల్ సినిమా అంటే హీరో పాత్రతోనే కథ! ఏం జరిగినా, ఎవరడ్డొచ్చినా సరే, హీరో పాత్రతోనే కథ! ఆర్ట్ సినిమా అంటే కథతోనే హీరో పాత్ర! ఈ తేడా గమనించకపోతే కమర్షియల్ సినిమాలు ప్రమాదంలో పడుతూనే వుంటాయి వందల కొద్దీ.
ఇక్కడ తరచూ ఎదురయ్యే ఒక వాదం గురించి చెప్పుకోవాలి. సినిమాల్లో తప్పొప్పులు ఎవరు పట్టించుకుంటున్నారు, హిట్టవుతున్నాయిగా, జనం విరగబడి చూస్తున్నారుగా - అనేది. నిజమే కల్తీ పాలు అని తెలీక తాగేస్తున్నారు, కార్బైడ్ పళ్ళు అని తెలీక తినేస్తున్నారు- కల్తీ పాలూ కల్తీ పళ్ళూ బాగా అమ్ముడుపోతున్నాయి కాబట్టి ఈ వ్యాపారం కరెక్టు అనుకోవాలా? కల్తీ అని తెలీక సినిమాలు కూడా చూసేస్తున్నారు, కాబట్టి కల్తీ సినిమాలతో వ్యాపారం కరెక్ట్ అనుకోవాలా? ఎవరికి వాళ్ళు వేసుకోవాల్సిన ప్రశ్న.
ఇలా ఒక పాసివ్ రియాక్టివ్ పాత్ర వల్ల జరిగిన కల్తీ కారణంగానే శోచనీయంగా ‘పోలీస్’ కథ నిస్తేజంగా తయారయ్యింది. ఈ సంగతి ప్రేక్షకులకి తెలీదు. స్టార్లూ దర్శకులూ తమకంటే ఎక్కువ ఆలోచనా పరులని నమ్మి ప్రేక్షకులు సినిమాలు చూస్తారు. ఏది చూపిస్తే అదే కరెక్ట్ అనుకుంటారు.
తెలిసిపోయే కథనం
ఈ కథేమిటంటే విజయ్ అనే ఒక పోలీసు అధికారి మంత్రితో పెట్టుకుంటే ఆ మంత్రి విజయ్ తోబాటు విజయ్ కుటుంబాన్నీ నాశనం చేయడం, చనిపోయాడనుకున్న విజయ్ రహస్యంగా తిరిగి వచ్చి మంత్రితో సహా అనుచరుల్ని చంపుతూంటే, విజయ్ ఆత్మ పగదీర్చు కుంటోందని ప్రచారం జరగడం, ఈ ప్రచారాన్ని ఉపయోగించుకుని పై అధికారి ఇంకింతమంది నేరస్థుల్ని శిక్షించే సీక్రెట్ ఆపరేషన్ కి ‘విజయ్ ‘ఆత్మ’ ని నియమించుకోవడం...

స్క్రీన్ ప్లేలో కథ సర్దుకున్న తీరు-
ప్రారంభం : ఎండ్ (రన్నింగ్ స్టోరీ -1) : కేరళలో మారుమూల చోట బేకరీ నడుపుకుంటూ, ఐదారేళ్ళ కూతుర్ని చదివించుకుంటూ, ఎవరి జోలికీ పోని సాధు జీవితం గడుపుతూంటాడు జోసెఫ్. అతడి కూడా ఓ అసిస్టెంట్ ఉంటాడు. స్కూల్లో కూతురేదైనా గొడవ పడితే గొడవలు వద్దని మందలిస్తాడు. అదే స్కూల్లో ఏన్ అనే టీచర్ దగ్గరవుతుంది. ఒకరోజు ఆమె ఈ కూతుర్ని స్కూలుకి తీసుకుపోతూంటే లోకల్ గ్యాంగ్ సభ్యులు జీపుతో గుద్దుతారు. ఆమె పోలీస్ కంప్లెయింట్ ఇస్తుంది. ఆ గ్యాంగ్ తో గొడవలు వద్దని కంప్లెయింట్ వాపసు తీసుకునేలా చేస్తాడు జోసెఫ్. పోలీస్ స్టేషన్లో పోలీసు అధికారి ఎందుకో జోసెఫ్ ని అనుమానించి, అతను వెళ్లి పోతూంటే- ‘విజయ్ కుమారూ!’ - అని పిలుస్తాడు. జోసెఫ్ గిరుక్కున తిరిగి చూస్తాడు. పోలీస్ అధికారి టాపిక్ మార్చేస్తాడు. దీంతో జోసెఫ్ మీద ఏన్ కి కూడా అనుమానం వేసి గూగుల్లో సెర్చ్ చేస్తూంటుంది. ఇటు కంప్లెయింట్ వాపసు తీసుకున్నప్పటికీ ఇంటి మీద గొడవకొస్తారు గ్యాంగ్. వాళ్ళు కొట్టేస్తూంటే తిరగబడతాడు. అటు ఏన్ కి గూగుల్లో ‘విజయ్ కుమార్’ ఒకప్పుడు డిసిపి అని తెలుస్తుంది. పరుగెత్తుకుని వచ్చి చూస్తే, ఇక్కడ తీవ్రంగా పోరాటం చేస్తూంటాడు జోసెఫ్ అలియాస్ డిసిపి విజయ్ కుమార్. పోరాటాలు వద్దని శాంతి వచనాలు పలికే ఇతనే, మాంచి ప్రొఫెషనల్ లా ఫైట్ చేస్తూంటే కళ్ళప్పగించి చూస్తూంటుంది. ఇక తానెవరో ఆమెకి తెలిసిపోవడంతో, నిజం చెప్పక తప్పదతడికి. తన గతం చెప్పుకొస్తాడు...

బిగినింగ్ (ఫ్లాష్ బ్యాక్ -1) : నగరంలో
సగం ఏరియాకి శాంతి భద్రతలని చూసుకునే డిసిపి విజయ్ కుమార్ తను. తన డ్రైవర్ గా కానిస్టేబుల్ (కేరళలో తోడున్న
అసిస్టెంట్) ఉంటాడు. పెళ్ళంటూ పోరు
పెట్టే ఒక తల్లి వుంటుంది. ఆమె చూసే సంబంధాలు ఏవీ నచ్చవు అతడికి. ప్రేమించి
చేసుకుంటానంటాడు. పిల్లల చేత బిచ్చ మెత్తించుకుంటున్న
బెగ్గర్ మాఫియాని చిత్తుగా తన్ని హాస్పిటల్లో పడేస్తాడు. అదే
హాస్పిటల్లో హౌస్ సర్జన్ గా చేస్తున్న మిత్ర పరిచయమవుతుంది. తొలి
మాటల్లోనే ఆమె ప్రేమ బాణం విసురుతుంది. ఫిక్స్ అయిపోతాడు.
ఆమెకి పద్ధతైన తండ్రి, చెల్లెలు, మేనత్తా వుంటారు. మిత్రని విజయ్ తీసికెళ్ళి తల్లికి
పరిచయం చేస్తాడు. ఆమెకి నచ్చుతుంది.
డిసిపి విజయ్ తన ఏరియాలో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని మిస్సింగ్ కేసు చేపడతాడు. ఆమె ఎక్కి వెళ్ళిన వాహనాన్ని ట్రేస్ చేస్తాడు. ఈలోగా మానభంగానికి గురైన ఆమె దొరుకుతుంది. నిర్భయ టైపు ఘోరమైన కేసు. ఆమె మరణ వాంగ్మూలం రికార్డు చేస్తాడు. మంత్రి కొడుకు ఈ పని చేశాడు. ఆమె చనిపోతుంది. ఆమె తండ్రి ఏడ్పుని చూడలేకపోతాడు విజయ్. మీరే న్యాయం చేయాలంటాడు ఇంకో ఇద్దరు ఆడపిల్లలున్న ఆ తండ్రి. విజయ్ భావోద్వేగానికి లోనవుతాడు. మంత్రి కొడుకుని పట్టుకుని ఘోరంగా చంపి మంత్రికి చెప్తాడు. ‘నా వెంట్రుక కూడా పీకలేవ్’ అంటాడు. మంత్రి పగతో రగిలిపోతాడు. వాడు జీవితమంతా కుళ్ళి కుళ్ళి ఏడ్చేలా బుద్ధి చెప్పాలని ఆదేశిస్తాడు. ఇక్కడ విశ్రాంతి.
ఎండ్ (రన్నింగ్ స్టోరీ -2 ) : పై ఫ్లాష్ బ్యాక్ తెలుసుకున్న ఏన్, మరి మిత్ర ఏమైంది- విజయ్ మదర్ ఏమైందీ - అని అడుగుతుంది సెకండాఫ్ ప్రారంభంలో విజయ్ అసిస్టెంట్ ని. అతను చెప్పడం ప్రారంభిస్తాడు.
మిడిల్ (ఫ్లాష్ బ్యాక్ -2 ): డిసిపి విజయ్ పెళ్లి ప్రయత్నాల్లో భాగంగా మిత్ర తండ్రిని కలుసుకుంటాడు. దూరం నుంచి మిత్ర తండ్రిని చూసి- ఆ గుండోడేనా మీ నాన్న?- అని అడుగుతాడు. ఈ పోలీసు సంబంధం మిత్ర తండ్రికి ఇష్టం వుండదు. విజయ్ చాలా నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తాడు. ప్రేమ అనేది మా ఇద్దరికీ సంబంధించింది గానీ, పెళ్లి మన రెండు కుటుంబాలు ఒకటయ్యేది...మీరు వచ్చేసి మా పై పోర్షన్ లో ఉండొచ్చు..మనమంతా హాయిగా కలిసిమెలసి వుంటాం...లాంటి తియ్యటి మాటలెన్నో చెప్తాడు. అదే సమయంలో తుపాకీ పేలుతుంది. మంత్రి మనుషులు ఎటాక్ చేస్తారు. షాకైన మిత్ర తండ్రి, విజయ్ మీద జరుగుతున్న ఎటాక్ ని చూసి, తన వాళ్ళ ప్రాణాలూ కాపాడుకుని, ఈ సంబంధం వద్దని వెళ్ళిపోతాడు.
విజయ్ మిత్రని కలుసుకుంటే, పోలీసుద్యోగం మానేస్తేనే మన పెళ్ళంటుంది. ససేమిరా అని ఆమెని ఆటో ఎక్కించేస్తాడు విజయ్. వెళ్లిపోతూంటే మళ్ళీ పరిగెత్తుకొస్తుంది మిత్ర- నువ్వలా వెళ్లిపోతూంటే చూస్తూ వూరుకుంటానని ఎలా అనుకున్నావ్- లాంటి మాటలేవో చెప్పి చిలిపితనాలు పోతుంది. పెళ్ళయి పోతుంది. పిల్ల పుడుతుంది. ఓ శుభవేళ మిత్ర తన కోరిక ఇలా వెలిబుచ్చుతుంది- ఈ యాంత్రిక ప్రపంచానికి దూరంగా, ఎక్కడో నిర్జన ప్రదేశంలో పొదరిల్లు కట్టుకుని, ఫోనూ టీవీ లాంటి బయటి ప్రపంచంతో సంబంధాలు కట్ చేసుకుని, పెంపుడు కుక్కతో ఏకాంతంగా జీవించాలని..
స్వయంగా మంత్రే వచ్చేసి తుపాకీ పేలుస్తాడు. దెబ్బకి కింద పడుతుంది మిత్ర. ఇంకో తుపాకీ దెబ్బకి విజయ్ నీ పడేసి, పైకెళ్ళి పిల్లకి స్నానం చేయిస్తున్న విజయ్ తల్లినీ లేపేసి, పిల్లని నీట్లో ముంచేసి వెళ్ళిపోతూ- వీళ్ళ బూడిద కూడా దొరక్కూడదని అనుచరులకి ఆర్డరేస్తాడు మంత్రి.
అనుచరులు గ్యాస్ లీక్ చేసి వెళ్ళిపోతారు. కొనప్రాణాలతో మిత్ర ఒక కోరిక కోరుతుంది : కూతుర్ని బతికించుకుని, మళ్ళీ హింస జోలికి పోకుండా దూరంగా వెళ్ళిపోయి ప్రశాంతంగా జీవించమని. విజయ్ ఏడాది కూతుర్ని రక్షించుకుని పారిపోతాడు. గ్యాస్ బండ పేలి అంతా భస్మీ పటలమవుతుంది. అందులోనే కూతురితో పాటు విజయ్ బూడిదయ్యాడని నమ్ముతుంది లోకం.

ఎండ్ (రన్నింగ్ స్టోరీ -3) : విజయ్ కథంతా తెలుసుకున్నటీచర్ ఏన్, విజయ్
కి మరింత దగ్గరవుతుంది. మంత్రికి విజయ్ బతికే ఉన్నాడని
తెలుస్తుంది. ఒకరోజు టీచర్
ఏన్ పిల్లల్ని స్కూలు బస్సులో ఎక్స్ కర్షన్ కని తీసికెళ్తూంటే, అది పేలిపోయి కాలువలో పడిపోతుంది. మంత్రి
అక్కడ్నించి వెళ్లిపోతాడు. ఈ ప్రమాదంలో చాలా మంది పిల్లలు చనిపోతారు. మంత్రి
చేసిన ఈ పనికి కూతురుకూడా చనిపోయిందని విజయ్ కుమిలి కుమిలి ఏడుస్తాడు. కూతురు బతుకుతుంది. ఇక హింసా మార్గం తప్పదని విజయ్
యుద్ధానికి బయల్దేరతాడు.
ఆనాడు చచ్చిపోయిన విజయ్ ఆత్మలా నమ్మిస్తూ మంత్రి అనుచరుల్నీ, ఆఖరికి మంత్రినీ చంపేస్తాడు. మంత్రిని చంపుతూ- ఆవారాలు, క్రిమినల్సు, కిల్లర్సు, రేపిస్టులు, తాగుబోతులు, తిరుగుబోతులూ వంటి సకల సంఘ విద్రోహక శక్తులూ తయారు కావడానికి వాళ్ళ తండ్రుల పెంపకమే కారణమనీ, శిక్షించాల్సింది అలాటి తండ్రుల్నే అనీ చెప్పి చంపుతాడు.
ఈ చావులు బతికే వున్న విజయ్ పనేనని పై అధికారి అనుమానిస్తాడు. అతణ్ణి విజయ్ కలుసుకుంటాడు. పై అధికారి అభినందించి, ఇకనుంచి క్రిమినల్స్ ని ఎరేయడానికి నువ్వు విజయ్ ఆత్మలా పనిచేయాలని ఒప్పిస్తాడు.
విజయ్ కేరళ నుంచి లడఖ్ కి మకాం మారుస్తాడు కూతురూ టీచర్ సహా. ఒక ఫోన్ కాల్ వస్తుంది. విజయ్ ఇక్కడ్నించీ ఆపరేషన్స్ మొదలెడుతున్నాడన్న అర్ధంలో కథ ముగుస్తుంది.
ఇలా ‘బాషా’
ఫార్మాట్లో కథని సర్దడంవల్ల ముందేం జరుగుతుందో తెలిసిపోయే విధంగా
తయారైంది స్క్రీన్ ప్లే. ఎక్కడో వెళ్లి జీవించడం, ఫ్లాష్ బ్యాక్ ఒపెనవడం, ఫ్లాష్ బ్యాక్ తర్వాత వెళ్లి
విలన్ని చంపడం.. ఇదేగా
అనేక సార్లు చూస్తూ వచ్చింది. ఇపుడు మళ్ళీ చూడాల్సి
రావడమే ఇక్కడ ఐరనీ. ఈ ఫార్మాట్ స్ట్రక్చరేమీ కాదు, ఇదొక 1995 నాటి ‘బాషా’ క్రియేటివిటీ. స్ట్రక్చర్ శాశ్వతమైనది, అదెప్పుడూ మారదు. రిక్షాకైనా ఆటో రిక్షాకైనా మూడు
చక్రాలే. ఆ మూడు చక్రాలతో అదొక స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ ని మార్చలేరు. మారిస్తే ముందు రెండు
చక్రాలు, వెనుక ఒక చక్రం వుంటుంది. బోల్తా
పడుతుంది. కాబట్టి ముందున్న రిక్షా స్ట్రక్చర్ ని మార్చకుండా
క్రియేటివ్ ఆలోచనలు పుట్టి - ఇంజను, టాపు,
ముందద్దం వగైరాలు తగిలించి ఆటో రిక్షాగా తయారు చేశారు. ఠాట్, ఈ
ఫార్మాట్ కూడా కాదన్పించి, మరింత క్రియేటివిటీని వాడి,
అదే మూడు చక్రాల స్ట్రక్చర్ లో సిక్స్ సీటర్ ఆటోలు తయారుచేశారు.
నిత్యజీవితంలో ఇన్ని మార్పు లొస్తూంటే, ఏనాటిదో
రిక్షా లాంటి ‘బాషా’ ఫార్మాట్ నే చెమటలు కక్కుతూ ఇంకా లాగుతున్నారు!
ఫార్మాట్ ఒక క్రియేటివిటీ అనిగాక, స్ట్రక్చర్ అని భ్రమపడితే అదేన్నటికీ మారదు. అందుకే ఇదే ఫార్మాట్ తో ఇన్నేసి సినిమాలు విసుగులేకుండా తీశారు. ఫార్మాట్ క్రియేటివిటీ అని తెలిసివుంటే ఈ ఫార్మాట్ లోనే కొత్త దనం కోసం (క్రియేటివిటీ కోసం) ప్రయత్నించే వాళ్ళు. దర్శకుడు అట్లీ ఈ ఫార్మాట్ ని కొత్త మలుపు తిప్పే అవకాశం వున్నా, అందుకు తగ్గ తురుపు ముక్క చేతిలో వున్నా, చూసుకోకుండా లేజీ రేటింగ్ కి పాల్పడ్డంతో, ఈ పాత ఫార్మాట్ కి కొత్తగా బంగారు బాట వేసుకునే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఆ తరుపు ముక్క ఏమిటో, దాన్నెలా ప్రయోగించ వచ్చో తర్వాత తెలుసుకుందాం.
ఫ్లాష్ బ్యాక్స్ తో వుండే కథలన్నీ క్రియేటివ్ ప్రదర్శనలే, వాటిని స్ట్రక్చర్ అనుకోరాదు. స్ట్రక్చర్ అనుకుంటే, సినిమా ప్రారంభిస్తూ ఫ్లాష్ బ్యాక్ కంటే ముందు చూపించే కథ బిగినింగ్ విభాగమవుతుంది. అది బిగినింగ్ విభాగామా? కాదుకదా? పైన చెప్పుకున్న ‘పోలీస్’ రన్నింగ్ స్టోరీ -1 బిగినింగ్ విభాగం కాదుకదా? అది ఎండ్ విభాగం. కాబట్టి ఫ్లాష్ బ్యాక్స్ తో వుండే కథల్ని ఫ్లాష్ బ్యాక్ స్ట్రక్చర్ అని పోరబడకూడదు. అది స్ట్రక్చర్ ని విడగొట్టిన క్రియేటివ్ ప్రక్రియ. కేవలం బిగినింగ్- మిడిల్ - ఎండ్ లు స్థానాలు మారతాయంతే.
‘పోలీస్’ ఫార్మాట్లో ‘బిగినింగ్ విభాగం’ ఫస్టాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ -1 లో వుంది. బిగినింగ్ విభాగం లక్షణాల ప్రకారం వివిధ పాత్రల పరిచయం, 1. (ఇదొక పోలీస్ స్టోరీ అని) కథా నేపధ్యపు ఏర్పాటు, 2.(సాఫ్ట్ వేర్ ఉద్యోగిని మిస్సింగ్ కేసుతో) సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పనా, 3. (మంత్రి కొడుకుని విజయ్ చంపడంతో ) సమస్య ఏర్పాటూ జరిగి, విజయ్- మంత్రీ పరస్పర సవాళ్లతో ప్లాట్ పాయింట్ – 1 ఏర్పడింది. ఇలా బిగినింగ్ విభాగమంతా ఈ ఫ్లాష్ బ్యాక్ లోనే వుంది. ఇక్కడ ఇంటర్వెల్ పడింది.
మిడిల్ విభాగం ఫ్లాష్ బ్యాక్ -2 లో వుంది. విజయ్ కీ మంత్రికీ సంఘర్షణ మొదలవడం, దీనికి గుర్తుగా విజయ్ పెళ్లి మాటలు జరుగుతున్నప్పుడు మంత్రి మనుషులు కాల్పులు జరపడం, విజయ్ పెళ్లి సంబంధం ఇబ్బందుల్లో పడి మళ్ళీ క్లియర్ అవడం, పెళ్లవడం, పిల్ల పుట్టడం, మంత్రి వచ్చి దాడి చేయడం, అందర్నీ చంపాననుకుని వెళ్ళిపోవడం, బతికిన విజయ్ పిల్లతో పారిపోవడం...విజయ్ కూడా చచ్చి పోయాడని లోకం నమ్మడంతో, ప్లాట్ పాయింట్ -2 ఏర్పడి మిడిల్ ముగియడం.
ఆనాడు చచ్చిపోయిన విజయ్ ఆత్మలా నమ్మిస్తూ మంత్రి అనుచరుల్నీ, ఆఖరికి మంత్రినీ చంపేస్తాడు. మంత్రిని చంపుతూ- ఆవారాలు, క్రిమినల్సు, కిల్లర్సు, రేపిస్టులు, తాగుబోతులు, తిరుగుబోతులూ వంటి సకల సంఘ విద్రోహక శక్తులూ తయారు కావడానికి వాళ్ళ తండ్రుల పెంపకమే కారణమనీ, శిక్షించాల్సింది అలాటి తండ్రుల్నే అనీ చెప్పి చంపుతాడు.
ఈ చావులు బతికే వున్న విజయ్ పనేనని పై అధికారి అనుమానిస్తాడు. అతణ్ణి విజయ్ కలుసుకుంటాడు. పై అధికారి అభినందించి, ఇకనుంచి క్రిమినల్స్ ని ఎరేయడానికి నువ్వు విజయ్ ఆత్మలా పనిచేయాలని ఒప్పిస్తాడు.
విజయ్ కేరళ నుంచి లడఖ్ కి మకాం మారుస్తాడు కూతురూ టీచర్ సహా. ఒక ఫోన్ కాల్ వస్తుంది. విజయ్ ఇక్కడ్నించీ ఆపరేషన్స్ మొదలెడుతున్నాడన్న అర్ధంలో కథ ముగుస్తుంది.
ఫార్మాట్ ఒక క్రియేటివిటీ అనిగాక, స్ట్రక్చర్ అని భ్రమపడితే అదేన్నటికీ మారదు. అందుకే ఇదే ఫార్మాట్ తో ఇన్నేసి సినిమాలు విసుగులేకుండా తీశారు. ఫార్మాట్ క్రియేటివిటీ అని తెలిసివుంటే ఈ ఫార్మాట్ లోనే కొత్త దనం కోసం (క్రియేటివిటీ కోసం) ప్రయత్నించే వాళ్ళు. దర్శకుడు అట్లీ ఈ ఫార్మాట్ ని కొత్త మలుపు తిప్పే అవకాశం వున్నా, అందుకు తగ్గ తురుపు ముక్క చేతిలో వున్నా, చూసుకోకుండా లేజీ రేటింగ్ కి పాల్పడ్డంతో, ఈ పాత ఫార్మాట్ కి కొత్తగా బంగారు బాట వేసుకునే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఆ తరుపు ముక్క ఏమిటో, దాన్నెలా ప్రయోగించ వచ్చో తర్వాత తెలుసుకుందాం.
ఫ్లాష్ బ్యాక్స్ తో వుండే కథలన్నీ క్రియేటివ్ ప్రదర్శనలే, వాటిని స్ట్రక్చర్ అనుకోరాదు. స్ట్రక్చర్ అనుకుంటే, సినిమా ప్రారంభిస్తూ ఫ్లాష్ బ్యాక్ కంటే ముందు చూపించే కథ బిగినింగ్ విభాగమవుతుంది. అది బిగినింగ్ విభాగామా? కాదుకదా? పైన చెప్పుకున్న ‘పోలీస్’ రన్నింగ్ స్టోరీ -1 బిగినింగ్ విభాగం కాదుకదా? అది ఎండ్ విభాగం. కాబట్టి ఫ్లాష్ బ్యాక్స్ తో వుండే కథల్ని ఫ్లాష్ బ్యాక్ స్ట్రక్చర్ అని పోరబడకూడదు. అది స్ట్రక్చర్ ని విడగొట్టిన క్రియేటివ్ ప్రక్రియ. కేవలం బిగినింగ్- మిడిల్ - ఎండ్ లు స్థానాలు మారతాయంతే.
‘పోలీస్’ ఫార్మాట్లో ‘బిగినింగ్ విభాగం’ ఫస్టాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ -1 లో వుంది. బిగినింగ్ విభాగం లక్షణాల ప్రకారం వివిధ పాత్రల పరిచయం, 1. (ఇదొక పోలీస్ స్టోరీ అని) కథా నేపధ్యపు ఏర్పాటు, 2.(సాఫ్ట్ వేర్ ఉద్యోగిని మిస్సింగ్ కేసుతో) సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పనా, 3. (మంత్రి కొడుకుని విజయ్ చంపడంతో ) సమస్య ఏర్పాటూ జరిగి, విజయ్- మంత్రీ పరస్పర సవాళ్లతో ప్లాట్ పాయింట్ – 1 ఏర్పడింది. ఇలా బిగినింగ్ విభాగమంతా ఈ ఫ్లాష్ బ్యాక్ లోనే వుంది. ఇక్కడ ఇంటర్వెల్ పడింది.
మిడిల్ విభాగం ఫ్లాష్ బ్యాక్ -2 లో వుంది. విజయ్ కీ మంత్రికీ సంఘర్షణ మొదలవడం, దీనికి గుర్తుగా విజయ్ పెళ్లి మాటలు జరుగుతున్నప్పుడు మంత్రి మనుషులు కాల్పులు జరపడం, విజయ్ పెళ్లి సంబంధం ఇబ్బందుల్లో పడి మళ్ళీ క్లియర్ అవడం, పెళ్లవడం, పిల్ల పుట్టడం, మంత్రి వచ్చి దాడి చేయడం, అందర్నీ చంపాననుకుని వెళ్ళిపోవడం, బతికిన విజయ్ పిల్లతో పారిపోవడం...విజయ్ కూడా చచ్చి పోయాడని లోకం నమ్మడంతో, ప్లాట్ పాయింట్ -2 ఏర్పడి మిడిల్ ముగియడం.
ఇలా బిగినింగ్, మిడిల్ ల తర్వాత, ఎండ్ వచ్చేసి మూడు విడతలుగా వుంది.
1. సినిమా ప్రారంభంలో అరగంట సాగే కేరళ రన్నింగ్ స్టోరీ-1 (అంటే ప్లాట్ పాయింట్ -2 దగ్గర్నుంచీ అదృశ్యమైన విజయ్
కూతురితో కేరళ వచ్చి సాధారణ జీవితం గడుపు గడుపుతున్నట్టు చిత్రణ) ఇది జోసెఫ్ పేరుతో ఉంటున్న అతనెవరో బయటపడడంతో ముగుస్తుంది, 2. ఇంటర్వెల్ తర్వాత రన్నింగ్
స్టోరీ -2 గా విజయ్ గతాన్ని కంటిన్యూ చేసే లీడ్ గా చిన్న
బిట్ గానూ, 3. విజయ్ గతమంతా చెప్పడం ముగిశాక, మంత్రి కేరళ వచ్చేసి కూతుర్ని టార్గెట్ చేయడం, విజయ్
ఆత్మలా వెళ్లి మంత్రి సహా అనుచరుల్ని అంతమొందించి, ఆఖర్న
పోలీస్ ఏజెంట్ ‘ఆత్మగా’ కొత్త ఎసైన్
మెంట్ అందుకునే రన్నింగ్ స్టోరీ -3 గానూ వుంది.
ఇందులో స్క్రీన్ ప్లేకి మూలస్థంభాలనదగిన ప్లాట్ పాయింట్-1, ప్లాట్ పాయింట్-2 లు బలహీనంగా కాదు, హాస్యాస్పదంగా వున్నాయి. దీనిక్కారణం హీరో పాత్ర చిత్రణ. పాసివ్ రియాక్టివ్ క్యారక్టర్ గా తయారైన హీరో పాత్ర మొత్తం స్ట్రక్చర్ నే చెడగొట్టింది...
మాటలు కోట- చేతలు చేట!
మనశ్శాంతి ఎక్కడ లభిస్తుంది? వర్క్ లో లభిస్తుంది. చేయాల్సిన వర్క్ లో తప్ప ఇంకెక్కడా మనశ్శాంతి అనేది మనిషికి లభించదు. మనశ్శాంతికి వర్క్ ని మించిన మందు లేదు. అన్ని సమస్యలకీ వర్కే సమాధానం. డాక్టర్ థామస్ ఆంథోనీ హేరిస్ రాసిన ‘ఐయాం ఓకే- యూఆర్ ఓకే’ అన్న బెస్ట్ సెల్లర్ లో, ఒక చోట ఓ 27 ఏళ్ల యువకుడి గురించి రాస్తాడు. అతను భార్యని పోగొట్టుకున్నాడు. మూడేళ్ళ కూతురుంది. భార్య పోయిన బాధతో ఇంకే పనీ చేయలేక పోతున్నాడు. మనశ్శాంతి లేక రోజులు భారంగా గడుపుతున్నాడు. ఎవరెంత చెప్పినా తేరుకోవడం లేదు. ఒకరోజు కూతురు తనకి బొమ్మరిల్లు కట్టుకోవడం రావడం లేదని చేయి పట్టుకుని లాక్కెళ్ళింది. బొమ్మరిల్లు కట్టివ్వమని మారాం చేసింది. చేసేది లేక ఆ పనికి కూర్చున్నాడు. ఆ పని మీద మనసు లగ్నం చేసి పూర్తి చేస్తూంటే విచిత్రంగా బాధంతా మర్చిపోయాడు. చక్కటి మనశ్శాంతిని ఫీలయ్యాడు, ఇక రోజూ ఆమె కోసం ఏదో ఒకటి తయారు చేయడమే పనిగా పెట్టుకుని దాంట్లో మునిగిపోయేవాడు..పోగొట్టుకున్న మనశ్శాంతికి పనిని మించిన ఔషధం లేదని తెలుసుకున్నాడు. అంటే బ్రెయిన్ మానసిక శాంతికి పనిని తప్ప మరే మందూ మాకూ కోరుకోదని స్పష్టమవుతోంది. అసలు పని చేస్తూంటేనే ఏ రోగాలూ రావు, మానసిక సమస్యలూ దరికి చేరవు.
విజయ్ సమస్యలకి పరిష్కారం కూడా పనిలోనే వుంది. అంటే కూతురికి బొమ్మరిల్లు కట్టడంలో కాదు, ఆ అదృష్టానికి అతను నోచుకునే ప్రసక్తే లేదు. తగడు కూడా. ఎందుకంటే తల్లినీ, భార్యనీ ఏదో ప్రమాదంలో పోగొట్టుకోలేదు, అది తన స్వయంకృతమే. దీనికి ఇంకేదో నిష్కృతి చేసుకున్నప్పుడే మనశ్శాంతి, బొమ్మరిళ్ళు కట్టివ్వడంలో కాదు- నిమగ్నమవాల్సిన పని వేరే వుంది. అది అప్పుడే ప్లాట్ పాయింట్ -2 దగ్గరే మంత్రిని లేపేసి రావడమే. ఎండ్ విభాగంలో తనకి శత్రువనే వాడే లేకుండా చూసుకోవడమే!
ఐతే ఇందుకు అతను మొదట్నించీ తన ప్రవర్తన మార్చుకోవాల్సిన అవసరముంది. ఒక ఐపీఎస్ అధికారిగా చాలా డీసెన్సీ ని పాటించాలి తను. చట్టాన్ని చేతిలోకి తీసుకుని, నిందితుణ్ణి తనే దోషిగా నిర్ధారించి శిక్షించలేడు తను- ఇదెంత సినిమా కథైనా సరే. అలా చేసి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? సాఫ్ట్ వేర్ ఉద్యోగినిని రేప్ చేశాడని మంత్రి కొడుకు మీద వ్యక్తగత కక్ష పెట్టుకుని, వాణ్ని పట్టుకుని, మర్మాంగాన్ని కోసేసి, కిరాతకంగా చంపి, తల కిందులుగా శవాన్ని వేలాడదీయడం ఏ రకమైన న్యాయ ప్రక్తియ, అసలేం సభ్యత ?
ఇదొక అధికార దుర్వినియోగంతో తప్పయితే, రెండో తప్పు : ఇలా చంపింది తానేనని మంత్రికి చెప్పి, నా వెంట్రుక కూడా పీకలేవని ఛాలెంజి చేయడం. ఆ తర్వాత తన కథంతా గోవిందా చేసుకోవడం! ఎందుకీ మాటలు? ఏమిటీ చేతలు?
హీరోలు ఈ ఛాలెంజి చేయడాలూ బెదిరించడాలూ చాలా విచిత్రంగా వుంటుంది. ‘రేసుగుర్రం’ లో విలన్ ముఖేష్ ఋషిని ఇలాగే బెదిరిస్తాడు అల్లుఅర్జున్. అనవసరంగా తనతో పెట్టుకోవద్దని పెద్ద ఫ్యాక్షనిస్టు అయిన ముఖేష్ ఋషికి వార్నింగ్ ఇస్తాడు. ముఖేష్ రుషి పాత్రముందు అల్లు అర్జున్ ది ఊరూపేరూ లేని బచ్చా పాత్రే అప్పటికి. పెద్ద హీరోలా పనిమాలా బెదిరించి ఆ తర్వాత తననీ, తన కుటుంబాన్నీ ముఖేష్ చేతే సర్వనాశనం చేయించుకుని ఇంట్లోంచి వెలికి గురవుతాడు. అలా వెళ్ళిపోతున్న అర్జున్ ని చూసి అయ్యోపాపం అనుకోవాలన్న ఉద్దేశంతో దృశ్య చిత్రీకరణ. అయ్యోపాపమని ఎలా అను కుంటారు- తన అవివేకంతో ఇంత అన్యాయమైపోయాక. ‘శివ’ లో నాగార్జున అంత పెద్ద మాఫియాకి సవాలు విసిరాడంటే, అతడి వెనుక విద్యార్ధుల బలముంది.
ఇలాగే ‘శ్రీమంతుడు’ లో కూడా పనీ పాటా లేక తిరిగే మహేష్ బాబు ఏకంగా ఢిల్లీ వెళ్లి పోయి కేంద్ర మంత్రిని బెదిరించేస్తాడు. సొంతంగా తనకే బిల్డప్పూ లేదు. కేంద్ర మంత్రి దగ్గర ఎవరి పేరు చెప్పుకుని అపాయింట్ మెంట్ సంపాదించుకున్నాడంటే, తను వ్యతిరేకించే బిజినెస్ మాగ్నెట్ అయిన తండ్రి పేరు చెప్పుకునే. లేకపోతే బిల్డప్ లేదు. తనకు ఏ సొంత వ్యక్తిత్వం వుండాలని తండ్రికి దూరమయ్యాడో, ఆ తండ్రి పరపతే ఇక్కడ అవసరపడింది తప్ప, మరోటి కాదు. ఇలా విచిత్ర పాత్రచిత్రణలు మెదళ్ళలో ఎలా పుడతాయో- తాజాగా ఇప్పుడు విజయ్ అనే పోలీసు పాత్ర!
తాజాగా షారుఖ్ ‘ఫ్యాన్’ లో ఇలాటి పనిమాలా ‘బెదిరించుడు పాత్రలకి’ మంచి ట్రీట్ మెంటే ఇచ్చినట్టు కన్పిస్తుంది . షారుఖ్ సాటి స్టార్, షారుఖ్ గురించి అవమానకరంగా మాటాడితే తట్టుకోలేక పోతాడు షారుఖ్ ఫ్యాన్. ఆ స్టార్ ని నాల్గు పీకి, నిర్బంధించి, సారీ చెప్పించి ఆ వీడియో యూ ట్యూబ్ లో పెడతాడు పెద్ద హీరోలా. ఇది షారుఖ్ తెలిసి పోలీసుల చేత ఆ ఫ్యాన్ ని చితగ్గొట్టించి- నువ్వు చేసింది తప్పూ, నా ఫ్యాన్ గా నువ్వు పనికి రావు, నా జీవితం నాది, నీ జీవితం నీది వెళ్ళిపొమ్మని వెళ్ళ గొట్టేస్తాడు. ఈ సీను చూస్తూంటే, రేసుగుర్రం, శ్రీమంతుడు, పోలీస్ - సీన్లతో పుట్టిన ఎలర్జీ అంతా తగ్గిపోయి హాయిగా వుంటుంది ప్రాణం. లేకపోతే ఎవడుపడితే వాడు బెదిరించడానికి బయల్దేరే మొనగాడే- If you cannot protect yourself, do not threaten any one – అని ఎప్పుడు తెలుసుకుంటాయో ఈ హీరోల పాత్రలు.

విజయ్
ఒక మంత్రినే అలా ఛాలెంజి చేశాక అతన్నుంచీ
ఏ ప్రమాదాన్నీ ఎందుకు ఆశించడో అర్ధం గాదు. ఒక అధికారి మంత్రిని బెదిరిస్తే మంత్రి
ఊరుకుంటాడా? యుద్ధం మొదలెట్టాక సర్వసన్నద్ధంగా ఉండక,
తను రెచ్చ గొట్టిన మంత్రిని మర్చిపోయి-ఎలా తన
ప్రేమా పెళ్ళీ గురించి కలలు గంటాడు. ఆ కాబోయే భార్యని కూడా
ప్రమాదంలోకి ఎలా లాగి ఆమె చావుకి బాధ్యుడవుతాడు.
దర్శకుడి ఉద్దేశం కాకపోయినా, విజయ్ పాత్ర మోస్ట్ కన్నింగ్ క్యారక్టర్ అని వ్యక్తమయ్యే సన్నివేశం హీరోయిన్ తండ్రితో సంబంధం మాటాడానికి వెళ్ళే అప్పటిది. దూరం నుంచి ఆమె తండ్రిని చూసి- ఆ గుండోడేనా మీ నాన్న? అని చెత్తగా కామెంట్ చేసినవాడు, తీరా ఆ తండ్రిని - మీరు ఇంద్రుడూ చంద్రుడూ అని పొగుడుతూంటే, వీడొక మోస్ట్ నమ్మలేని, క్యారక్టర్ లెస్ ఐపీఎస్ అధికారి అని మనకి అన్పిస్తాడు- హీరోలా ఉన్నతంగా గాక! దర్శకుడు ఆ 'గుండోడు' కామెంట్ చేయించకపోతే పాత్ర ఇంత అధమంగా వుండేది కాదు.
అక్కడే భారీ ఎత్తున ఎటాక్ జరిగినప్పుడు ఏమీ అనలేని స్థితి. సగం నగరపు శాంతి భద్రతలు తన చేతిలో వున్నాయని పలికిన వాడి గుమ్మంలో ఇదీ పరిస్థితి. హీరోయిన్ తండ్రి సంబంధం వద్దని వెళ్లి పోతాడు. మళ్ళీ ఇంత ప్రమాదం తలపెట్టిన మంత్రి దగ్గరికి వెళ్లి ఇంకో హెచ్చరిక చేస్తాడు. మంత్రికి ఈ హెచ్చరికలు ఇంకా రెచ్చగొట్టేందుకే పనికొస్తూంటాయి.
ఇక్కడ ఇంకో గజిబిజి ఏమిటంటే- ఈ దాడిని మంత్రి ఎవరి మీద ఎక్కుపెట్టాడు? ఎందుకంటే విజయ్ కుళ్ళి కుళ్ళి ఏడ్వాలని మంత్రి కోరిక. విజయ్ మీదే దాడి చేసి చంపేస్తే విజయ్ ఎలా కుళ్ళి కుళ్ళి ఏడుస్తాడు? ఇక్కడ దాడి జరిపింది విజయ్ మీదే! ఇలా కాకా మిత్ర టార్గెట్ గా దాడి చేసి ఆమెని చంపేసి వుంటే విజయ్ కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ వుండే వాడేమో! ఇది మర్చిపోయాడు దర్శకుడు.
అప్పుడు ఈ పెళ్లి వద్దని వెళ్ళిపోయిన హీరోయిన్ మళ్ళీ చిలిపిగా చేరువవుతుంది. ఇదామె అంత తేలిగ్గా తీసుకునే విషయం కాదు. తండ్రి మాటకి విలువ ఇవ్వకుండా. ఆ తండ్రి పెళ్ళిలో డమ్మీలా ఉంటాడు. ఇలా కిల్ అయిపోతుందీ పాత్ర.
పెళ్లి తర్వాత కూడా విజయ్ ఇంటికి భద్రత కల్పించుకోడు. పిల్ల పుట్టిన తర్వాత ఇక విజయ్ రెచ్చ గొట్టిన మంత్రే స్వయంగా వచ్చేసి ఒక్కొక్కర్నీ చంపడం మొదలెడతాడు. ఈ కాల్పులు పైన గదిలో వున్న తల్లికి ఎందుకు వినపడవోగానీ, పైకెళ్ళి ఆమెనీ చంపేస్తాడు మంత్రి.
ప్రాణాలు వదుల్తూ- పిల్లని తీసుకుని దూరంగా వెళ్లి బతకమనీ, హింస వద్దనీ విజయ్ దగ్గర మిత్ర మాట తీసుకుందంటే, తప్పు తనదే నని ఆమె గ్రహించడం వల్లే. విజయ్ తో జీ వితం ఇలాగే ఉంటుందని తెలిసీ పెళ్లి చేసుకుందామే. ప్రేమంటే ఆమెది. అలా తనని నమ్మి వచ్చిన ఆమెని కాపాడుకోలేని గొప్ప ఐపీఎస్ అధికారి విజయ్ దీ ఒక ప్రేమేనా?
ఆమె పెద్దమనసు చేసుకుని అలా మాట తీసుకుందంటే, విజయ్ తప్పులన్నీ మాఫీ అయిపోయినట్టు కాదు -పిల్లని తీసుకుని జంప్ అవడానికి. ఆమె చివరి కోరిక తనకి ఎలిబీ అయిపోదు. తను నిజమైన మగాడైతే, తనవల్ల మృత్యు పాలైన అమాయకురాళ్ళు తల్లీ భార్యల ఆత్మలకి తను శాంతి చేకూర్చాల్సిన బాధ్యత వుందని ఫీలయితే- అప్పుడే మంత్రిని చంపేసి పారిపోవాలి అజ్ఞాతంలోకి. అదీ పాత్రకి జస్టిఫికేషన్.

అలా చేయలేదు. ఇక్కడ కూడా తెలివితక్కువగా ఆలోచించాడు. ఎవ్వరి బూడిద
కూడా దొరక్కూడదన్న మంత్రి ఆదేశంతో విజయ్
కి ఓ క్రిమినల్ ఆలోచన పుట్టింది. తనుకూడా అందరితో కలిసి
బూడిదయ్యాడని లోకం నమ్మాలన్న తెలివితక్కువ
ఆలోచన చేశాడు ( క్రిమినల్ ఆలోచనెప్పుడూ
తెలివితక్కువదే). ఆ తన చావుని ఫేక్ చేయడం ఆ మంత్రిని చంపే ఉద్దేశంతో కూడా కాదు- కేవలం భార్య కిచ్చిన మాట ప్రకారం
ఏ కేరళో పారిపోయి ఇంకో గుర్తింపుతో క్షేమంగా బతకాలని. ఇంత తెలివి తక్కువ ఆలోచనతో కూతురితో పారిపోయి-
తన తల్లీ భార్యల మృతదేహాలు సబబైన రీతిలో అంతిమ సంస్కారాలకి
నోచుకోనివ్వకుండా, గ్యాస్
సిలెండర్ పేలుళ్లో బూడిదయ్యే ఖర్మానికి
వదిలేశాడు. ఇతణ్ణి ఓ హీరో క్యారక్టర్ అనాలా? ప్రేక్షకులు ఇతణ్ణి చూసి సానుభూతి చెందాలా?
ఈ ‘ప్రమాదం’ లో విజయ్ తో సహా కుటుంబంలో అందరూ చనిపోయారని ప్రజలూ ప్రభుత్వమూ అందరూ నమ్మడం ఇంకో బడాయి. ఆ బూడిదని ఎనాలసిస్ చేస్తే ఎంత మంది చనిపోయారో తెలిసిపోతుంది. దర్శకుడు సాఫ్ట్ వేర్ ఉద్యోగిని రేప్ కేసులో ప్రొఫెషనల్ గా, లాజికల్ గా, ఫోరెన్సిక్ రిపోర్టులూ వగైరా తెప్పించి హంగామాగా చర్చకి పెట్టాడుగా- అదే లాజిక్ తో, అదే న్యాయంతో ఇక్కడ బూడిదని కూడా ఎందుకు ఎనాలిసిస్ చేయించ కూడదు? ఆ రేప్ కేసు రిపోర్టుల చర్చ కూడా చాలా పచ్చిగా వుంది. సెన్సార్ కట్ పడాల్సిన సీన్ ఇది.

ఇలా ప్లాట్ పాయింట్ వన్ దగ్గర మంత్రికి ఛాలెంజి విసరడమే హాస్యాస్పదంగా
వుంటే, మళ్ళీ ప్లాట్ పాయింట్ టూ దగ్గర తన కుటుంబాన్ని
హతమార్చిన మంత్రిని వదిలేసి పారిపోవడం ఇంకా హాస్యాస్పదం. మంత్రిని
తను రెచ్చ గొట్టడం, మంత్రి పిచ్చ కొట్టుడు కొట్టడం, మళ్ళీ మంత్రిని రెచ్చ గొట్టడం, మళ్ళీ మంత్రి పిచ్చ
కొట్టుడు కొట్టడం...దీన్ని యాక్టివ్ పాత్రనాలా? పనికిరాని పాసివ్ రియాక్టివ్
పాత్రనాలా? ప్లాట్ పాయింట్స్ రెండూ ఫెయిలయ్యాక ఇదొక కథేనా?
ఈ ఎనాలిసిస్ తో తేలిందేమిటంటే – ది మినిస్టర్ ఈజ్ ఆల్వేస్ రైట్, న్యాయం అతడి పక్షానే వుందని- విజయ్ ఒక పచ్చి విలన్ అనీ!
రన్నింగ్ స్టోరీ కాన్సెప్ట్?
రన్నింగ్ స్టోరీ -1 తో సినిమా ప్రారంభమే విచిత్రంగా, నవ్వొచ్చేట్టు వుంటుంది. కేరళ మారుమూల రోడ్డు మీద వర్షంలో విజయ్ ఆగిపోయిన బైక్ బాగు చేస్తూంటాడు. కూతురు కొంత దూరంలో రోడ్డు పక్క నిలబడి వుంటుంది. ఒక కారు రయ్యిన పోవడంతో ఆమె మీద బురద చిమ్ముతుంది. అంతే, ఆ కూతురి ఆదేశంతో ఇక విజయ్ ఆ కారుని ఛేజ్ చేస్తాడు. కొంత దూరంలో ఆపేసి కారతన్ని దిగమంటాడు. కారతను దిగి వర్షంలో అలాగే నించుంటాడు. ఐదునిమిషాలు నిలబెట్టి- నీళ్ళల్లో తడవడమంటే ఎంత ఇబ్బందో అతడికి తెలియజేసి వెళ్లి పోమ్మంటాడు- ఇంకెప్పుడూ మనుషుల మీద బురద చిమ్ముకుంటూ వె ళ్ళొద్దన్న హెచ్చరికతో!

వర్షం పడ్డప్పుడు, పడుతున్నప్పుడు, వాహనాలు బురద చిమ్ముకుంటూ వెళ్ళడం అత్యంత సహజం. పాదచారుల్ని
మనిషి మనిషినీ చూసుకుంటూ బురద చిమ్మకుండా
వెళ్ళలేవు. మనుషులే జాగ్రత్త పడాలి. తండ్రి
రోడ్డు దిగి బైక్ బాగుచేస్తూంటే కూతురు
రోడ్డు మీద లిఫ్ట్ కోసం ఎదురు చూస్తున్నట్టు సీన్ ఓపెన్ చేయడమే తప్పు.
ఆమెని కావాలని బురద మీద పడేట్టు అక్కడ నిలబెట్టాడు దర్శకుడు.
పోనీ ఆ పిల్ల తెలీక అలా నిలబడిందనుకున్నా, ఆ
తండ్రి అప్పుడేం చేయాలి- వర్షంలో రోడ్డు మీద అలా నించో
వద్దమ్మా, బురద
చిమ్ముద్దనాలి. అలా అనకుండా రివర్స్ లో కారతని మీదికే పెద్ద ఎమోషన్ తో వెళ్ళడం సిల్లీ.
లాజిక్ లేకుండా ఎమోషన్ ఎలా పుడుతుంది?
మొదటి సీన్లోనే దర్శకుడి జీవితానుభవమెంతో తెలిసిపోయాక, ఇక అడుగడుగునా కథతో అవస్థలే. ఈ రన్నింగ్ స్టోరీ అనేది కూడా ఒక కథే. దానికదే ఒక సపరేట్ కథ. ఇందులో విజయ్ కేదో అయ్యిందని కాదు, కూతురి కేం అవబోతోందన్న కథ. విజయ్ రెండు ఫ్లాష్ బ్యాకుల్లో కథ తినేశాడు. ఆ ఫ్లాష్ బ్యాకుల ఫలితమైన కొత్త జీవితం- ప్రాణి అయిన కూతురి కథ! రన్నింగ్ స్టోరీ కేవలం ఫ్రెష్ గా కూతురి జీవితం- భవిష్యత్తు గురించిన కథ! ఈ సెన్సే ఫీలవుతాం రన్నింగ్ స్టోరీలో. కానీ దర్శకుడికి ఈ లోతైన పాయింటే తట్టదు. తండ్రికీ కూతురికీ మధ్య ఏవేవో సీన్లు వేసుకు పోతూంటాడు, అహింసని బోధిస్తూ.
ప్రారంభ సీన్లో కారతనికి బుద్ధి చెప్పాక- వెంటనే ఆ ‘ఘనవిజయాన్ని’ పురస్కరించుకుని పాట! ఇది రొటీన్ గా అన్ని సినిమాల్లో వచ్చేదే. రన్నింగ్ స్టోరీ-1 లో ఇలా ఒకఘనవిజయం, పాట పెట్టినట్టు- మళ్ళీ పక్కనే ఫ్లాష్ బ్యాక్ -1 లో డిసిపి విజయ్ గా ఇంకో ఘనవిజయాన్ని చూపించి, మళ్ళీ పాట పెట్టేశాడు. ఇలా అరగంట వ్యవధిలో ఈ రిపిటీషన్ తో కథ అక్కడక్కడే తిరుగుతోందని కూడా గ్రహించినట్టు లేదు.

ఇక పోలీస్ స్టేషన్లో జోసెఫ్ గా తెలిసిన హీరోని పోలీసు అధికారి ‘విజయ్ కుమారూ!’ అని పిలిచి టెస్ట్ చేయడం ఎందుకు
జరిగిందో అర్ధం కాదు. దాని కొనసాగింపు కూడా వుండదు. అంటే జోసెఫ్ ఎవరో ఆ అధికారికి తెలుసా? తెలిస్తే ఏం
చేస్తున్నాడు పట్టుకోక? ఎందుకంటే, విజయ్
చావు ఒక పెద్ద స్కామ్. తన చావుని అంత స్కామ్ చేసి వచ్చి బతుకుతున్న విజయ్ ని గుర్తు పడితే ఆ అధికారి ఊరుకుంటాడా? కేవలం
అతనలా పిలిస్తే ప్రేక్షకులు గొప్ప సస్పెన్స్ ఫీల్ అవుతారని చేసినట్టుంది- ఆ అధికారి పాత్ర గురించి ఆలోచించకుండా! ఇలా సరైన
బేస్ లేకుండా ఉత్తుత్తి ఎమోషన్స్, సస్పెన్స్ లని
ప్రేరేపించడాలు చాలానే వున్నాయి.
ఇక విజయ్ తో బాటు కానిస్టేబుల్ కూడా ఎలా
అజ్ఞాతంలోకి వచ్చేసి ఇక్కడ అసిస్టెంట్ గా బతుకుతున్నాడో అర్ధంగాదు.
సౌండ్స్ అంటే కూడా గిట్టనట్టుంది- ఫ్లాష్ బ్యాక్ -2 లో మంత్రి వచ్చి చంపుతున్నప్పుడు పైగదిలో విజయ్ తల్లికి ఆ కాల్పుల మోతే వినబడనట్టు- ఇక్కడ కూడా పెంపుడు కుక్క గొంతు నొక్కేయడం. లోకల్ గ్యాంగ్ వచ్చి దాడి చేస్తున్నప్పుడు విజయ్ పెంపుడు కుక్క గ్యాంగ్ మీద పడి చెండాడ కుండా, కనీసం మొరగకుండా, పక్కన నిలబడి చోద్యం చూస్తున్నట్టు, ఆ పోరాటం మధ్య మధ్యలో షాట్స్ వేయడం చాలా చాలా హాస్యాస్పదం! కుక్క స్వభావాన్ని కూడా కిల్ చేశాడంటే ఏమనుకోవాలి మిస్టర్ అట్లీని? విజయ్ మాస్ ఫాలోయింగ్ వున్న స్టార్ కాబట్టి, ఆ ఫైట్ ని సింగిల్ హెండెడ్ గా అతడికే వదిలెయ్యాలా? కుక్క కూడా జోక్యం చేసుకోకూడదా? కొంత క్రెడిట్ కుక్కకి పోతే భరించలేడా?- అన్నట్టే వుంది సీను!
ఈ ఫైట్ జరుగుతున్నప్పుడు, అవతల టీచర్ ఏన్ గూగుల్లో సెర్చ్ చేస్తూంటుంది. ఇక్కడ ఈ సీన్ తో ఎంత అద్భుతం చేయ వచ్చో దర్శకుడు పట్టించుకోలేదు. దీని గురించి తర్వాత చెప్పుకుందాం. ఆమె గూగుల్ సెర్చి ఫలితంగా జోసెఫ్ డిసిపి విజయ్ అని తెలిసి ఫ్లాష్ బ్యాక్ – 1 ఒపెనవుతుంది.
రన్నింగ్ స్టోరీ -3 ఫ్లాష్ బ్యాక్ -2 కి ప్రస్తుత కాలంలో కొనసాగింపు. ఇక్కడ మనకి తన అజ్ఞాతవాసానికి విజయ్ ఈ కేరళలో ప్లేస్ ని ఎందుకు ఎంచుకున్నాడో, ఒకలాటి సెటప్ తో ఎందుకు బతుకుతున్నాడో అర్ధమవుతుంది. ఫ్లాష్ బ్యాక్ -2 లో, మంత్రి వచ్చి ఎటాక్ చేయక ముందు- విజయ్ భార్య మిత్ర తన కోరిక వెలిబుచ్చుతుంది- ఈ యాంత్రిక ప్రపంచానికి దూరంగా, ఎక్కడో నిర్జన ప్రదేశంలో పొదరిల్లు కట్టుకుని, ఫోనూ టీవీ లాంటి బయటి ప్రపంచంతో సంబంధాలు కట్ చేసుకుని, పెంపుడు కుక్కతో ఏకాంతంగా జీవించాలనీ ...
విజయ్ ఇలాగే బతుకుతున్నాడు. మారు మూల కేరళలో పొదరిల్లు..ఫోనూ టీవీ లేని ఇల్లు...పెంపుడు కుక్కా వగైరా...హౌ సిల్లీ! ఆమెని చేతులారా చంపుకుని, ఆమె కోరికని కాపీకొట్టి తను జీవించడం! ఇంట్లో ఆమె ఫోటో ఒక్కటి కూడా పెట్టుకోకుండా! అసలు హౌస్ సర్జన్ అయిన ఆమెకి డాక్టర్ కలలు లేవా...
ఈ రన్నింగ్ స్టోరీ -3 ఎండ్ విభాగంలో చివరి దశ. మంత్రి స్కూల్ బస్సు మీద దాడి జరిపించి పిల్లల్ని బలిగొంటే అందులో తన కూతురు కూడా పోయిందని ఘోరంగా ఏడుస్తాడు విజయ్. ఈ ఏడ్పుకి అర్ధం కన్పించదు. ఆనాడు శత్రువుని వదిలేసి తను చావు నటించి పారిపోతే, కొడుకుని పోగొట్టుకున్న, శత్రు శేషం ఫీలవుతున్న ఆ మంత్రి ఎందుకు వూరుకుంటా డనుకున్నాడు? కూతురి జీవితం కోసం హింస వద్దనుకున్నాను- అంటాడు మళ్ళీ విజయ్. యాక్షన్ కథకి ఒక హీరోగా తన భార్యని, తల్లినీ చంపిన శత్రువుని అంతమొందించాలని, లేకపోతే ప్రేక్షకులు వెలితి ఫీలవుతారని అతడి బుర్రకే తట్టడం లేదు.
ఇక ఇప్పుడు తప్పదనుకున్నట్టు మంత్రిని చంపడానికి బయల్దేరతాడు. చచ్చిపోయిన విజయ్ ఆత్మలా. తన వాళ్ళ ఆత్మలకి శాంతి చేకూర్చలేదు గానీ, ఇప్పుడు పెద్ద ఆత్మలా బయల్దేరాడు. ఒక్కొక్కర్నీ చంపుతూంటే సంచలనం - విజయ్ ఆత్మ పగ దీర్చుకుంటోందని. కేరళలో ‘విజయ్ కుమారూ!’ అని పిలిచిన పోలీసు అధికారి ఏంచేస్తున్నాడో!
ఈ మొత్తం కథకి, కథ పేరుతోదర్శకుడు ఆడుతున్న నాటకాలకి, ఈ ఒక్క డైలాగు దెయ్యంలా వెంటాడుతోంది! అయితే దెయ్యం మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకోదు, పొడుస్తూనే వుండడం దాని జాతి లక్షణం- ‘విజయ్ కుమారూ!’ అని. ఆ పోలీసు అధికారి యాక్టివేట్ అయితే విజయ్ కుమార్ కథే వుండదు.
ఆఖరికి మంత్రిని చంపుతూ- ఆవారాలు, క్రిమినల్సు, కిల్లర్సు, రేపిస్టులు, తాగుబోతులు, తిరుగుబోతులూ వంటి సకల సంఘ విద్రోహక శక్తులూ తయారు కావడానికి వాళ్ళ తండ్రుల పెంపకమే కారణమనీ, శిక్షించాల్సింది ఇలాటి తండ్రుల్నే అనీ చెప్పి చంపుతాడు.
నిజానికి ఐదేళ్ళ క్రితం ఇంటర్వెల్లోనే ఈ మాట చెప్పి చంపాలి. సంఘటన జరిగిన ఐదేళ్లకి మెసేజ్ ఇస్తున్నాడు. ఈలోగా ఇంకెంత మంది కిమినల్స్ ని అలాటి తండ్రులు తయారు చేసి వదిలారో!
దీని తర్వాత పై అధికారి ఇతను ఆత్మ కాదనీ, విజయ్ కుమారే అని గుర్తించి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంటాడు- నేను ఇన్ఫర్మేషన్ ఇస్తూంటా, నువ్విలాగే దెయ్యంలాగే క్రిమినల్స్ ని చంపుతూ వుండమని.
ఇలా ముగుస్తుంది కథ! కేరళలో ‘విజయ్ కుమారూ!’ అనే పోలీసు అధికారి వున్నాడు కాబట్టేమో, అక్కడ్నించీ లడఖ్ కి మకాం మార్చేస్తాడు కూతురితో, టీచరుతో. ఫోన్ రాగానే ఆత్మలా బయల్దేరరతాడు క్రిమినల్ని చంపడానికి. ప్రతీ సారీ ఎక్కడో లడఖ్ నుంచి హైదరాబాద్ కి వచ్చిపోతూంటాడా చంపడానికి? చెన్నైలో దర్శకుడి ఇంట్లోనే ఉండొచ్చుగా. ఎంత మంది ‘విజయ్ కుమారూ!’ అన్నా దర్శకుడే బాగా కాపాడతాడు.
ఈ కథలో మిత్ర తండ్రి, చెల్లెలు, మేనత్త మయ్యారో అయిపుండరు. ఫ్లాష్ బ్యాక్ -2, రన్నింగ్ స్టోరీ మూడు పార్టుల్లో ఎక్కడా కనపడరు. వీళ్ళని తురుపు ముక్కలా వాడుకుని రొటీన్ ‘బాషా’ ఫార్మాట్ ని బాద్షాలా రధం ఎక్కించవచ్చని దర్శకుడి నుంచి ఆశించడం అత్యాశే అవుతుంది...

అక్బర్స్ జాబ్
ప్రముఖ పాత్రికేయుడు ఎంజె అక్బర్ ప్రారంభంలో ‘సండే’ మేగజైన్ కి సంపాదకత్వం వహిస్తున్నప్పుడు, విలేఖర్లు పంపే వార్తా కథనాలని మొత్తం తిరగ రాసేవాడు. వార్తా కథనాల శైలిని, భాషనీ అక్బర్ తిరగ రాతల్లోంచి నేర్చుకునే వాళ్ళు విలేఖర్లు. ప్రస్తుతం కేవలం క్యారక్టర్ వల్ల ఇంత లోపభూయిష్టంగా తయారైన ‘పోలీస్’ కథని మనం కూడా అలా ఓసారి తిరగ రాసి రేపు చూద్దాం...

-సికిందర్
cinemabazaar.in
cinemabazaar.in