రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

3, నవంబర్ 2018, శనివారం

702 : స్పెషల్ ఆర్టికల్


        క ఎలాగూ గుడ్ రైటింగ్ కి భరోసా ఇచ్చే సినిమాలుండవని మరోసారి తేలిపోయాక,  బ్యాడ్ రైటింగ్ సినిమాలతోనే సర్దుకుపోయి - బాక్సాఫీసు భరోసాకి బాధ్యత తీసుకుంటూ సినిమాలు చూడాలి. బ్యాడ్ రైటింగ్ సినిమాల్ని బతికిస్తూ ‘లో – నాలెడ్జి’ ని ప్రోత్సహించాలి. బ్యాడ్ రైటింగ్ కి వేసుకునే కథ - మాటలు - స్క్రీన్ ప్లే లలోంచి స్క్రీన్ ప్లే తీసేసి, టెంప్లెట్ అని, ఆ పైన దర్శకత్వం బదులు చాదస్తం అని క్రెడిట్స్ మార్చుకుని సినిమాలు చూడాలి. తెలుగు సినిమా కథ @ టెంప్లెట్ అని ఈజీగా సినిమా ఎలా వుంటుందో గుర్తుపట్టేసి, కుటుంబంతో ఓ వెయ్యి రూపాయలు త్యాగం చేసి, ఓవర్సీస్ లోనైతే ఇంకెక్కువ డాలర్లు ధారపోసి వూహించిన అకృత్యాలే చూసొచ్చి మర్చిపోవాలి. అవేవో వ్యాధుల పేర్లతో సినిమాలని చెప్పి రెచ్చగొట్టినా ఫర్వాలేదనుకుని చూసి, అంటు వ్యాధులతో తిరిగి రావాలి. సినిమా ప్రారంభంలోనే చాదస్తంగా భస్మాసుర హస్తం కథ చెపుతూ క్రూయెల్ జోకులాడినా అంతర్యం పసిగట్టలేక ఫూల్స్ అవాలి. సినిమా జానర్ మర్యాదతో సంబంధం లేకుండా మధ్యలో ఉన్నట్టుండి సుభద్రా పరిణయమంటూ నాటకం జొప్పించినా ఆ చోద్యమంతా చూసి ఆనందించాలి!

          స్క్రీన్ ప్లేలనేవి అంతరించిపోయాక టెంప్లెట్ తో బాటు సింగిల్ విండో స్కీము వుండేది. స్టార్లందరికీ అదే స్కీము. అందులో ఏ స్టార్ అయినా ఆ సింగిల్ విండో లోంచి జారుడు బల్ల మీదుగా బర్రున జారుకుంటూ వెళ్లి, సెకండాఫ్ లో అదే విలన్ ఇంట్లో అలాగే దభీల్మంటూ పడి, అవే ‘కన్ఫ్యూజ్ కామెడీలు’ చేసేలా ఆడిందే ఆటగా ఆడించారు. ఈ క్రియేటివ్ రైటింగ్ రేటింగుల్లేక మూతబడినా టెంప్లెట్ వదలడం లేదు. ఏ కథయినా ఈ టెంప్లెట్ లో వుండాల్సిందే. ఎవరైనా ప్రముఖ రాజకీయ నాయకుడి బయోపిక్ అంటూ తీసినా, అదే టెంప్లెట్ లో ఆ రాజకీయ నాయకుడు బిగ్ యాక్షన్ తో ఎంట్రీ ఇస్తాడు. ఆ వెంటనే వచ్చి పడిన డాన్సర్స్ తో గ్రూప్ సాంగేసుకుంటాడు. ఆ వెంటనే హీరోయిన్ కన్పించి లవ్ ట్రాక్ వేసుకుంటాడు. ఓ టీజింగ్ సాంగేసుకుంటాడు. లవ్ లో పడేసే కామెడీలు చేస్తాడు. హీరోయిన్ లవ్ లో పడ్డాక ఆమెతో డ్యూయెట్ వేసుకుంటాడు. ఇప్పటికి ఎంత టైము గడిచింది? గంట దాటింది. మూడు సాంగులు, ఓ ఫైట్, లవ్ ట్రాకు, కామెడీ వచ్చాయా? వచ్చేశాయ్. ఇంటర్వెల్ కి ఇంకెంత టైముంది? ఐదు నిమిషాలే. అయితే విలన్ ని దింపే టైమొచ్చింది. అప్పుడు విలన్ దిగి రాజకీయనాయకుడికి ఓ ఛాలెంజి విసురుతాడు. రాజకీయ నాయకుడు ఏవో పంచ్ డైలాగులు కొడతాడు. ఇంటర్వెల్. 

          ఇంటర్వెల్లో రాజకీయ నాయకుడికీ విలన్ కీ మధ్య పుట్టిన యాక్షన్ కథ సెకండాఫ్ లో మొదలవుతుంది. రాజకీయ నాయకుడు విలన్ గ్రూపుతో ఫైట్ చేస్తాడు. హీరోయిన్ తో కామెడీ చేస్తాడు. హీరోయిన్ తో ఎడారిలాంటి కొండ ప్రాంతంలో బ్లాక్ కాస్ట్యూమ్ లో మెలోడీ సాంగేసుకుంటాడు. విలన్ గ్రూపుతో ఇంకో ఫైట్ చేస్తాడు. హీరోయిన్ తో ఇంకో సాంగేసుకుంటాడు. విలన్ గ్రూపుతో ఇంకో ఫైట్ చేస్తాడు. హీరోయిన్ తో జానపద కాస్ట్యూమ్స్ తో ఫోక్ సాంగేసుకుంటాడు. విలన్ తో క్లయిమాక్స్ ఫైట్ మొదలెడతాడు...

          ఏ కథయినా, ఎలాటి కథయినా, ఈ వరసలో, ఇలాటివే స్లాట్స్ తో వుండాల్సిందే. ఇడ్లీ అయినా, దోశ అయినా, పూరీ అయినా, అదే ఇడ్లీ కుక్కర్లో వేసి అలాగే ఉడికించేయాల్సిందే. ఆల్రెడీ ఇలా కనిపెట్టేసిన ఇడ్లీ కుక్కర్ టెంప్లెట్ వుండగా, ఇక కథ రాయడానికి ఆలోచనలతో పనేలేదు. స్టార్ కో కొత్త గెటప్ సృష్టించి ఇందులోకి వదలడమే. మరి ఇలాటి టెంప్లెట్ మూస కథ ఇంటర్వెల్ దగ్గర చెప్పి మొదలెట్టేదైతే, ఫస్టాఫ్ అంతా వృధాగా హీరోయిన్ తో ఆ లవ్ ట్రాకుతో, ఇదే కథ అన్నట్టుగా ప్రేక్షకులని మిస్ లీడ్ చేయడమెందుకు? ఎందుకంటే ఫస్టాఫ్ ఖాళీని పూరించాలి కాబట్టి. ఇంటర్వెల్ దగ్గర మొదలయ్యే మూస కథనే ఓ గంట సినిమాగా చేసి చూపిస్తే నిడివి లేదని సెన్సార్ వాళ్ళు తిప్పి కొడతారు కాబట్టి. సెన్సార్ నిడివి కోసం ఫస్టాఫ్ స్పేస్ ఫిల్లర్ గా ఉత్తుత్తి లవ్ ట్రాక్ తో ప్రేక్షకులని మిస్ లీడ్ చేయక తప్పదన్న మాట. ఇలా సినిమాని రెండు ముక్కలు చేసి చూపించడం స్క్రీన్ ప్లే పేరుతో జరుగుతున్న స్కామ్ కాదా? స్క్రీన్ ప్లేలు ఎక్కడున్నాయి? ఏ ముక్కకా ముక్క ఏ స్లాట్ కా స్లాట్ లో వేసుకునే ఇడ్లీ కుక్కర్ టెంప్లెట్ వుండగా? అయితే హడావిడి పడి సినిమాకెళ్ళకుండా తీరిగ్గా ఇంటర్వెల్ టైముకి వెళ్లి కూర్చుంటే ఫస్టాఫ్ స్కామ్ ని, మన టైం వేస్టునీ  తప్పించుకోవచ్చా? తప్పించుకుని సెకండాఫ్ లో ఆ మూస కథేంటోచూసి మనమూ బతికి, సినిమాల్నీ బతికించ వచ్చు. లివ్ అండ్ లెట్ లివ్. సినిమాలు మారి స్క్రీన్ ప్లేలు వస్తాయని ఎప్పుడూ ఆశించవద్దు. కొత్త టాలెంటులు కూడా టెంప్లెట్ నారాయణులే.
***
          “సార్, న్యూ కాన్సెప్ట్ సర్, ఎక్కడా రాలేదు”
          “ఏంటీ?”
          “ఈఈ సిండ్రోం మీద స్టోరీ సార్”
          “ఈఈ సిండ్రోమా?”
          “ఎడం కాలితో ఎనక్కి తంతాడు సార్”
          “ఈజిట్? ఎక్కడుంది?”
          “జంబుకా దేశంలో”
          “అదెక్కడ?”
          “కన్ఫ్యూషియా పక్కన”
          “ఓ...సమ్మర్ కి నేనెళ్ళొచ్చాలే... సరే చెప్పు”
          “లాలిపాటతో బుజ్జి బాబు పుడతాడు సార్...”
          “ఇంకా పుట్టుక కాణ్ణించీ లాలిపాటల స్టోరీ లెందుకయ్యా?”
           “చావు పుట్టుకలు ప్రతీ ప్రేక్షకుడి జీవితంలో వుంటాయి సార్, మీ ఫ్యాన్స్ తో కలుపుకుని. బాగా ఐడెంటిఫై చేసుకుంటారు”
          “పుట్టుక వాళ్ళ చేతుల్లో లేదు, చావు నీ చేతుల్లో వుంది. నన్ను చూపించకుండా ఎవరో పిల్లల మీద టైం వేస్ట్ చేస్తే నాకెందుకు. సర్లే చెప్పు”
          “టైటిల్ వచ్చేసి సవ్య పాదం సార్. టైటిల్స్ లో వామనుడు బలి చక్రవర్తి నెత్తి మీద కాలెట్టి పాతాళానికి తొక్కేసే సీనుంటుంది సార్. ఆ తర్వాత మీరు - అంటే - హీరో పుడతాడు. పుట్టగానే ఎడం కాలితో ఎనక్కి డాక్టర్ని తంతాడు. డాక్టర్ పరీక్షించి ఈఈ సిండ్రోం అని తేలుస్తాడు. బుజ్జిబాబు స్కూల్లో చేరి ఎడం కాల్తో తంతుంటాడు. హీరోగా ఎదిగి మాఫియా గ్యాంగ్ తో ఫైట్ చేసి గ్రూప్ సాంగ్ తో సెలెబ్రేట్ చేసుకుంటాడు. ఈఈ సిండ్రోం మీద ర్యాప్ సాంగ్ సార్, సిడ్నీలో తీస్తాం. కాలేజీలో చేరి హీరోయిన్ని తంతుంటాడు. కామెడీ చేస్తాడు. తంతూనే టీజింగ్ సాంగేసుకుంటాడు. కామెడీ చేసి లవ్ లో పడేసుకుంటాడు. ఒక డ్యూయెట్ యేసుకుంటాడు. ఇక తన్నడం మానేస్తాడు. దూరంగా ఈదుర్లంక హీరో వూరు సార్. అక్కడ ఫ్యామిలీని మాఫియా ఎటాక్ చేసి చంపేస్తాడు. హీరో మరదల్ని కిడ్నాప్ చేస్తాడు. ఇంటర్వెల్ సార్”
          “ఇందులో కథెక్కడుంది?”
          “మరదలి కోసం సెకండాఫే కథ సార్”
          “కథ ఈఈ సిండ్రోం మీద కాదా?”
          “ఈఈ సిండ్రోం మీ క్యారక్టర్ ఇంట్రడక్షన్ కోసం వాడి వదిలేస్తాం సార్. ఎవరైనా ఇంతే చేస్తారు”
          “ఇంటర్వెల్లో వాడు మాఫియా అని తెలీక నేను డాంకీలా వాణ్ణి ఎడం కాల్తో లాగి ఎనక్కి రెండుసార్లు కిక్కివ్వడమే కథైతే? వాడు నా మీద పగబడితే? ఈఈ సిండ్రోంతో లెఫ్ట్ లెగ్గు సెకండాఫ్ లో ప్లే అవుతూంటుంది కదా? పైగా డాంకీ లైవ్ గా ఎంటర్టైన్ మెంట్ ప్లస్సవుతుంది. ఆలోచించు. సింపుల్ గా చెప్తా,  ‘జో సమ్ బడీ’ చూశావా? అందులో బలహీనుడైన టిమ్ అలెన్ తన కూతురి ముందు బలవంతుడు కొట్టాడని అవమానం తట్టుకోలేక, కూతురి ముందే వాణ్ణి కొట్టాలని బలవంతుడుగా మారేందుకు స్ట్రగుల్ చేస్తాడు...కష్టపడి రకరకాల విద్యలు నేర్చుకుని వాణ్ని పబ్లిక్ లో కొట్టి పడగొడతాడు. ఎత్తుకున్న పాయింటు మీద నడిచే ఈ ఎమోషనల్  మూవీ సూపర్ హిట్టయ్యింది. ఎత్తుకున్న పాయింటుని వదిలేస్తా నంటావేంటి? మరోసారాలోచించు” 
          “కష్టం సార్. లోకల్ ఆడియెన్స్ కిది సరిపోతుంది. వాళ్ళు ఫస్టాఫ్ ఒకలా, సెకండాఫ్ డిఫరెంట్ గా ఇంకోలా వుండాలని ఎందుకో కోరుకుంటారు.  సెకండాఫ్ లో అంతకన్నా ఇంటరెస్టింగ్ ప్లే వుంటుంది...మరదల్ని కిడ్నాప్ చేసిన మాఫియా ఎవరో తెలీక హీరో స్ట్రగుల్ అవుతూంటాడు. హైడింగ్ లో వున్న మాఫియా మైండ్ గేమ్స్ మొదలెడతాడు. కురుక్షేత్రం సార్. లేకపోతే చక్రవ్యూహం. మైండ్ గేమ్స్ తో మాఫియా సైంధవ వ్యూహం పన్నుతాడు.  దీన్నిహీరో సూపర్ బ్రెయిన్ తో టాకిల్ చేసి మాఫియాని క్యాచ్ చేస్తాడు. మరదల్ని సేవ్ చేసుకుంటాడు”
          “రియల్లీ? ఇప్పుడు మైండ్ బ్లోయింగ్ గా వుంది. బోయింగ్ - 747 ఫ్లయిట్ లా హాట్ హాట్ గా వుంది”
          “థాంక్యూ సార్”
          “బౌండెడ్ స్క్రీన్ ప్లే రాస్కో!”
***
          బౌం ‘డెడ్’ స్క్రీన్ ప్లే, బ్రెయిన్ డెడ్ టెంప్లెట్ గా రూపం దాల్చి అవతరించింది. వెయ్యి థియేటర్లలో వెలుగు చూసింది. వెలుగు చూసేది సినిమాలు కాదు, టెంప్లెట్ బైండింగుల బ్యాడ్ రైటింగ్ బండారాలే. పొద్దున్నే టాక్ బాంబ్ ఎటాక్ లా వచ్చింది. హిట్టవ్వాల్సింది హిరోషిమా ఎందుకయ్యిందో అర్ధంగాలేదు. ఎలా అర్ధమవుతుంది, బోయింగ్ -747 లా వేడి వేడిగా అన్పించిన స్టోరీలో తను నటించింది ఫక్తు చల్లారిన పాసివ్ పాత్ర అని స్టార్ కి తెలిస్తేగా? స్టార్ కేం తెలుసు - పాసివ్ పాత్రంటే ఏమిటో, యాక్టివ్ పాత్రంటే ఏమిటో; ఏది తన విజయానికి అవసరమో ఏం తెలుసు? పాసివ్ పాత్రలతో పదుల సంఖ్యలో సినిమాలు అట్టర్ ఫ్లాపవుతున్నాయని ఎప్పుడు తెలుస్తుంది? యాక్టింగ్ స్కూల్లో యాక్టింగే నేర్పుతారు గానీ, యాక్టివ్ పాత్రలే వుండేలా చూసుకోవాలనీ, పాసివ్ పాత్రల్ని తిప్పి కొట్టాలనీ చెప్పరుగా? యాక్టింగ్ కోర్సులకి స్క్రీన్ ప్లే సంగతులతో సమన్వయం వుంటేగా?   
   
          అసలు ఇంటర్వెల్లో విలన్ వచ్చి ఛాలెంజి చేస్తే, హీరో ఎదురుగా వుండకపోవడమే కదా పాసివ్ పాత్రకి చక్కగా పడిన ముళ్ళ బాట. ఇంటర్వెల్లో విలన్ పాయింటు చెప్పకుండా, ఈ కథేమిటో చెప్పకుండా, ఎందుకు ప్రతీకారం తీర్చుకుంటానంటున్నాడో విప్పకుండా ఇంటర్వెల్ వేసుకుని వెళ్లిపోయినప్పుడే కదా, కథ ఇంకా మొదలవలేదని తేలింది. ఇంటర్వెల్లో కూడా కథేమిటో తెలీకపోతే ప్లాట్ పాయింట్ వన్ ఇంకా రానట్టే కదా? అంటే మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే –టెంప్లెట్ - అనే కదా? క్లయిమాక్స్ లో ఆ విలనే చెప్పే వరకూ ఇదంతా ఎందుకు జరుగుతోందో కారణం తెలీదు, కథా తెలీదు హీరోకి. ఏదీ తెలీక దిక్కుతోచని పరిస్థితుల్లో సెకండాఫ్ మొత్తం విలన్ ఆడించినట్టూ ఆడే ‘గొప్ప కథానాయకుడు’ అయ్యాడు.  

          అంటే టెంప్లెట్స్ కి కథ కూడా చేతకాదన్న మాట. తన పాసివ్ పాత్రతో బాటు, ఎండ్ సస్పెన్స్ బాపతు అట్టర్ ఫ్లాప్ చేసే కథా తన ఆశల్ని హిరోషిమా చేశాయని ఎలా తెలుస్తుంది  స్టార్ కి? ఉన్న పాసివ్ పాత్రల ఫ్లాప్స్ కి తోడూ, ఎండ్ సస్పెన్స్ కథలూ డజన్ల సినిమాల్ని మట్టి కరిపించాయనీ ఇంకెప్పుడు ఎలా తెలుస్తుంది?   

          ఇంత బ్యాడ్ రైటింగ్ కి భరోసాగా బిగ్ కమర్షియల్స్ కూడా కోట్లు పోగొట్టుకుంటూ వుంటే, వంద రూపాయల టికెట్ ఓ లెక్కా? బ్యాడ్ రైటింగుకు  ఇలాగే వుండాలి, టికెట్లూ ఇలాగే తెగాలి.


సికిందర్





30, అక్టోబర్ 2018, మంగళవారం

700 : స్క్రీన్ ప్లే అప్డేట్స్


       టెర్రీ రోసో హాలీవుడ్ లో నెంబర్ టూ స్క్రీన్ రైటర్. అలాడిన్, ష్రెక్, మెన్ ఇన్ బ్లాక్, పైరేట్స్ ఆఫ్ ది కెరీబీన్ సిరీస్ వంటి అనేక బాక్సాఫీసు హిట్ సినిమాలు రాశారు. ప్రస్తుతం గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ నిర్మాణంలో వుంది. తన అనుభవంతో స్క్రీన్ ప్లే రచనలో భావి రచయితలకి ఉపయోగపడాలన్నఉద్దేశంతో ఎంత బిజీగా వున్నా ఆయన అనేక ఇంటర్వ్యూలివ్వడమే గాక, స్క్రీన్ ప్లే వ్యాసాలూ రాస్తూంటారు. రచనాపరమైన అన్ని సందేహాలు తీరుస్తూ, కొత్త రచయితలు అవకాశాలు పొందడానికి చేయూత కూడా అందిస్తూంటారు. అయితే ఫలానా సినిమా కంపెనీలో మా బంధువు వున్నాడనో, స్వయంగా సినిమా తీసుకోవడానికి డబ్బులుంటేనో, ఎవరికీ అర్ధంగాని కళాఖండాలు రాస్తేనో తన దగ్గరకి రావద్దంటారు. చూడగానే నిర్మాత రెండు చేతులతో లాగేసుకునే ష్యూర్ హిట్ కమర్షియల్ స్క్రీన్ ప్లేలు రాస్తేనే తన పూర్తి సహాయ సహకారాలుంటాయంటారు. ఈ సౌమనస్యంతో ఆయన రాసిన ఎన్నో వ్యాసాల్లో సీన్ ఎలా రాయాలనే వ్యాసం వొకటి. నేర్చుకోవాలన్న ఆసక్తిగల రచయితల కోసం ఇక్కడ అందిస్తున్నాం.

          పాత్రకి స్పష్టమైన సిట్యుయేషన్ లేకుండా సీన్ రాసేందుకు మీకు అనుమతిలేదు. కారులో వూరికే పిచ్చాపాటీ వేసుకుంటూ పోయే సీను రాయడానికి కూడా మీకు పర్మిషన్ లేదు. వాళ్ళలో ఒకరు సర్జరీ కోసమో, విమానాన్ని క్యాచ్ చేయడంకోసమో వెళ్తూండాల్సిందే. లేదా వాళ్ళ వెనకాల సీటులో హంతకుడు దాక్కుని కూర్చుని వుండాల్సిందే. సిట్యుయేషన్లు కథకి సంబంధించినవై వుంటే బెస్ట్. ఇవేవీ కుదరకపోతే కారు టైరు పంక్చర్ అయ్యేట్టయినా  చూడాలి. 

        ముందుగా ఇంటరెస్ట్ క్రియేట్ చేయాలి. ఇది స్క్రీన్ రైటర్ గా మీ ప్రథమ కర్తవ్యం. ఇంటరెస్ట్ ని క్రియేట్ చేయడానికి సాధనం సిట్యుయేషన్. సిట్యుయేషన్లు పరిస్థితుల నుంచి పుడతాయి. లేదా బలమైన పాత్ర ఫీలయ్యే అవసరం లోంచి పుడతాయి. లేదా రెండూ. మొత్తం స్క్రీన్ ప్లేని కేవలం సిట్యుయేషన్ ఆధారిత సీన్లతో రాయడం కూడా చేయవచ్చు. సిట్యుయేషన్స్ క్రియేట్ చేయడానికి మొదటి మార్గం పరిస్థితి. రెండో మార్గం బలమైన పాత్ర ఫీలయ్యే అవసరం. ఇవిలా వుంటాయి : పరిస్థితులు చుట్టూ వున్న బయటి ప్రపంచంలోంచి పుట్టుకు వచ్చి పాత్ర మీద ప్రభావం చూపిస్తాయి. ఇది మొదటి మార్గం విషయంలో. రెండో మార్గం విషయంలో,  పాత్ర ఫీలయ్యే అవసరం పాత్రలోంచి వచ్చి చుట్టూ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది.  

          ఎగ్జాంపుల్ 1 : అతను కూతురితో ఏర్ పోర్టుకెళ్ళి టికెట్లు కొంటున్నాడు. భార్య చనిపోవడంతో కొత్త జీవితం ప్రారంభించడానికి కూతురితో దేశం విడిచి వెళ్ళిపోతున్నాడు...

          ఈ పాత్రల్ని సిట్యుయేషన్ లో పెట్టాలంటే, పరిస్థితుల్ని మార్చెయ్యండి. ఆ బాలిక తల్లి మరణించ లేదనుకోండి. ఆ బాలిక గురించి కోర్టులో కస్టడీ కేసు వుందనుకోండి. అతను కోర్టు కళ్ళు గప్పి బాలికని దేశం దాటించేస్తున్నాడు. పోలీసులు బయల్దేరి వస్తున్నారు. అతడి క్రెడిట్ కార్డు అప్పుడే రిజెక్ట్ అయ్యింది. టికెట్లు తీసుకోవడానికి డబ్బెక్కడ తేవాలో అర్ధం గావడం లేదు. బాలికకి తాము ఎక్కడికి,  ఎందుకు పోతున్నామో తెలీక ప్రశ్నలడుగుతోంది...

          ఎగ్జాంపుల్ 2 : అతనూ ఆమే ఓ పార్టీ కెళ్ళడానికి తయారవుతున్నారు. అతడి మాజీ భార్య ఆ పార్టీ ఇస్తోంది. ఆమెతో ఈమె అభద్రత ఫీలవుతోంది. నీకింకా ఆమె అంటే ఇష్టమేనా అని అతణ్ణి అడిగితే, లేదన్నాడు...

          ఇది రాయదగ్గ సీనే. కాకపోతే వివరణ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే సిట్యుయేషన్ నామమాత్రంగా వుంది (వివరణల గురించి పచ్చి నిజం తెలుసుకోండి : సినిమాలకి వివరణలు అవసరం లేదు. లేదు లేదు, ఆడియెన్స్ కి ఇది తెలీకపోతే ఎలా, అది తెలీకపోతే ఎలా, మరేదో తెలీకపోతే ఎలా ... అనొద్దు. ఇదంతా పచ్చి అబద్ధం. ఆడియెన్స్ కి  తెలియాల్సిన అవసరంలేదు. ఆడియెన్స్ ఆశ్చర్యచకితులవడాని కిష్టపడతారు). నామమాత్రంగా వున్న ఈ సీనులో ఆశ్చర్యమే ఇంటరెస్ట్ ని క్రియేట్ చేస్తుంది కాబట్టి, వివరణలు ఇచ్చుకునే కంటే సిట్యుయేషన్ రీత్యా సీను ఆ లోచించండి. 

          పై సీనులో అతన్నీ ఆమెనీ రోడ్డుపక్కన ఆపెయ్యండి. అప్పుడు పంక్చరైన టైరు మార్చుకుంటూ, ఆర్గ్యూ చేసుకుంటూ వుంటారు. ఆ మాజీ భార్య ఇస్తున్న పార్టీకి వాళ్ళు కలిసి వెళ్ళే పరిస్థితి లేనట్టే వుండాలి. అతను మాజీ భార్య దగ్గర డబ్బు బదులు తీసుకోవడం తప్పనిసరి కాబట్టి ఆమెని రమ్మని వొత్తిడి చేస్తూంటాడు. ఆమె అనుమానిస్తూంటుంది, అక్కడికెళ్తే ఆమెకి దగ్గరై పోతాడేమోనని. తాము డబ్బవసరంలో వున్నది నిజమే. ఆయినా వెళ్ళడానికి మనస్కరించకుంటే, ఆమెని ఇక్కడే వదిలేసి వెళ్లి పోతానంటాడు. ఇటుగా వస్తున్న వ్యాను ఆపి ఎక్కేసి వెళ్ళిపోతాడు. ఆమె కోపంతో రగిలిపోతుంది...

          ఇప్పుడీ సిట్యుయేషన్ చోదిత రైటింగ్ వెర్షన్ లో, ఆడియెన్స్ ని కథలో ఇన్వాల్వ్ అయ్యేట్టు చేసేందుకు వీలవుతోంది. ఎందుకంటే, ఈ సీనులో ఆడియెన్స్ కి అనేక ప్రశ్నలు తలెత్తుతూంటాయి. టైములోగా టైరు మార్చడం అవుతుందా? అతనుంటాడా, ఆమెని వదిలేసి వెళ్లి పోతాడా? వాళ్లకి డబ్బు దేనికవసరం? ఆ డబ్బు దొరుకుతుందా? అతను మాజీ భార్యని చూస్తే మళ్ళీ ప్రేమలో పడిపోతాడా? అసలీ వ్యాను డ్రైవర్ మంచోడేనా? తీసికెళ్ళి నిలువు దోపిడీ చేయడు కదా?...

          ఇప్పుడర్ధమై వుండొచ్చు మీకు. మంచి సిట్యుయేషన్ ఆధారిత సీను రాయడమంటే ఆడియెన్స్ ని వూహాగానాలతో ఉక్కిరిబిక్కిరి చేయడమే. ఫ్యూచర్ ఈవెంట్స్ పట్ల స్పెక్యులేషన్ కల్పించడమే. సిట్యుయేషన్ల సెటప్ ఆ తర్వాత మీరు ఆడియెన్స్ వూహాగానాల్ని ఉల్టాపల్టా చేయడానికి ఉపయోగపడ్తుంది. కాబట్టి ప్రతీ సింగిల్ సీనుకీ సిట్యుయేషన్ అవసరం. ఇందులో ఇంకెలాటి మినహాయింపులూ వెతకొద్దు.  

        వివరణ లిచ్చుకోవడానికి మీకు మీరు ఎలాటి సినిమాటిక్ లిబర్టీ తీసుకోకండి. పాత్రల ఎస్టాబ్లిష్ మెంట్ సీన్లు రాయాలంటూ మీకు మీరే ఎలాటి అనుమతులూ జారీ చేసుకోకండి. కేవలం పాత్రల్ని ఎస్టాబ్లిష్ చేసేందుకే రాసే సీన్లకి స్క్రీన్ ప్లేలో చోటు లేదు. పాత్రలేమిటో సిట్యుయేషన్లే తెలుపుతూండాలి. మీరు కథనం గురించి కూడా వర్రీ అవనవసరం లేదు. అప్పుడు వివరణల ట్రాప్ లో చిక్కుకుంటారు. మీకు అవసరమున్నవల్లా, సంఘటనల క్రమం. సిట్యుయేషన్లతో కూడిన సంఘటనల క్రమం. ఇదే కథనాన్ని మీ కందిస్తుంది. 

          ఇందులో వున్న బ్యూటీ ఏమిటంటే, పాత్రకేం కావాలో స్పష్టంగా వున్నప్పుడు అదే సిట్యుయేషన్ అవుతుంది. బలమైన పాత్రకుండే అవసరం సిట్యుయేషన్ ని క్రియేట్ చేస్తుంది. దాంతో ఇంటరెస్ట్ పుడుతుంది. సిట్యుయేషన్లు పాత్రల్ని సృష్టిస్తాయి. అవసరం కోసమో, పరిస్థుతుల వల్లనో. లేదా రెండిటి వల్లనో. 

          ‘జూనో’ లో హీరోయిన్ ని చూడండి : గర్భవతైంది. గర్భవతవడమే సిట్యుయేషన్. పరిస్థితులు క్రియేట్ చేసిన సిట్యుయేషన్. తద్వారా గాఢంగా ఆమెకి పుట్టిన కోరిక, అవసరం : బిడ్డని దత్తత తీసుకునే కేంద్రం కోసం. ఇదే ఆమె ఏమిటో నిర్వచించేస్తోంది. బోనస్ ఏమిటంటే, ఈ బలమైన పాత్ర కోరిక, అవసరం వాటికవే కొత్త సిట్యుయేషన్ కి దారి తీయిస్తాయి - ఆమె కడుపులో బిడ్డకి భావి తండ్రిని పరిచయం చేస్తూ. ఇది అదనపు బ్యూటీ. గాఢమైన పాత్ర కోరిక, ఆవసరం, భద్రతగల సిట్యుయేషన్స్ ని క్రియేట్ చేస్తాయి. ఈ సిట్యుయేషన్స్  సందిగ్ధంలో కూడా పడెయ్యొచ్చు.  

          ‘లిటిల్ మిస్ సన్ షైన్’ లో చూడండి : ఈమెకి డాన్స్ పోటీల్లో పాల్గొనాలని చాలా బలమైన కోరిక. దీంతో కుటుంబానికి కుటుంబం గమ్మత్తయిన, తీపీ చేదు సిట్యుయేషన్ల బారిన పడతారు. పైలట్ కావాలన్న కోరికతో వున్న ఆమె అన్న కూడా సైలెంట్ అయిపోతాడు...

       సిట్యుయేషన్ లో సంక్షోభం వుండి తీరాలనేం లేదు. ఎందుకంటే కొన్ని సినిమాటిక్ సిట్యుయేషన్స్ సంక్షోభం లేకపోయినా, నామమాత్రంగా వున్నా చెల్లిపోతాయి. ఉదాహరణకి ఇది చూడండి : ఒక అందమైన అమ్మాయి తన గర్ల్ ఫ్రెండ్స్ తో కాఫీబార్ లో కూర్చుని వుంది. ఒక అందగాడు కాస్త దూరంలో కూర్చుని వున్నాడు. చిర్నవ్వు నవ్వాడు. ఆమే నవ్వింది. ఆమె రెస్పాండ్ అయినందుకు ఆనందించాడు. ఇక ఆమెని మీటవ్వాలన్న కోరిక పుట్టింది. పక్కనున్న మొక్క నుంచి ఒక గులాబీ పీకి ఆమె టేబుల్ మీద పడేస్తూ వెళ్ళిపోయాడు. ఆమె తీసుకుని వాసన చూసింది. అతను వెళ్లిపోయిన టేబుల్ పైన కీస్ కన్పించాయి. ఆ కీస్ నందుకుని బయటికి పరుగెత్తింది. బయట అతనామె కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏకాంతంలో దొరకడంతో ఆమెకి హలో చెప్పి, చాటుకి లాగి కిస్ చేశాడు...

          ఇది రొడ్డ కొట్టుడు బాయ్ మీట్స్ గర్ల్ సీనే. క్యూట్ మీట్ ఫ్లర్టింగ్ సీను. ఇది చెల్లిపోతుంది. సిట్యుయేషన్ ఏమిటంటే, ఒకతను ఒకామెని చూస్తాడు, ఆమెని కలవాలనుకుంటాడు, క్యూట్ గా ఆమెని ఏకాంతంలో కలుసుకునే మార్గం ఆలోచిస్తాడు. ఇంతే. దీంతో మీలో అలజడి రేగవచ్చు. ఇందులో సంక్షోభం ఏదీ? సోసైటీయా? ఆమె బిడియమా? గర్ల్ ఫ్రెండ్స్ ని వదిలి ఆమె వెళ్లి పోవడమా? అతనూ ఆమే ఇంకా పరిచయస్థులే కాకపోవడమా? ... ఏమైనా కానీ సిట్యుయేషనే రచయిత కనుగొనాల్సిన అవసరమైన ముడి పదార్ధం. సంక్షోభం దానికదే వుంటుంది. సంక్షోభం సులభం, సిట్యుయేషనే కష్టం.
***

28, అక్టోబర్ 2018, ఆదివారం

THE MAYOR (2017) Official Trailer | Choi Min-Sik | Korean Movie





     రాజకీయ కీకారణ్యంలో ఎన్నికల ప్రచారం...వ్యక్తిగత రహస్యాలు లాగి బురద జల్లుకోవడం...ఎట్టి పరిస్థితిలో తను మూడోసారి మేయర్ ఎన్నికలు గెలవాలి... గెలిస్తే రేపు దేశాధ్యక్షుడి పీఠం తనది... ఏం చేశాడు? ఇందుకేం అక్రమాలకి పాల్పడ్డాడు... హైటెక్ ప్రచార టీం మేనేజర్లని నియమించుకుంటే ప్రత్యర్ధులేం ఎత్తుగడ పన్నారు... హోరాహోరీ ప్రచార రగడలో  ... పోయిందేమిటి... మిగిలిందేమిటి ....కొరియన్ పొలిటికల్ థ్రిల్లర్ ‘ది మేయర్’ (2017) లో వీటన్నిటికీ సమాధానం... స్క్రీన్ ప్లే సంగతులు...ఈ వారం!

***


27, అక్టోబర్ 2018, శనివారం


Q : ‘దొంగరాముడు’ లో హీరోయిన్ సావిత్రి విలన్ తో పోరాడి కథకి ముగింపునిస్తే మీ పరిభాషలోనే హీరో పాసివ్ అయిపోయాడన్నారు. ఇది ఆ రోజుల్లో చెల్లిందన్నారు. ఈ రోజుల్లో హీరో పాసివ్ అవకుండా హీరోయిన్ తో కథ ముగించే మార్గం ఏదైనా వుందా? ఇలా చేసిన సినిమాలేమైనా వున్నాయా?
పేరు వెల్లడించ వద్దన్న దర్శకుడు 

A : పాసివ్ పాత్రనేది స్క్రీన్ ప్లే పరిభాష. ‘దొంగరాముడు’ చూడకముందు ఒక అసోసియేట్ కథకి పరమ రొటీన్ గా వున్న-  క్లయిమాక్స్ లో హీరోయిన్ ని విలన్ కిడ్నాప్ చేసే అరిగిపోయిన ఫార్ములాని - తిరగేసి హీరోయినే విలన్ ని కిడ్నాప్ చేసేట్టు చేయాలన్నప్పుడు అందులో స్పార్క్ గుర్తించలేకపోయాడు. ఆ కథ ప్రకారం హీరో పాసివ్ అవకుండా చేసే మార్గముంది. ‘దొంగరాముడు’ చూసినప్పుడు ఈ తిరగేసిన ఫార్ములా ఎదురై మనకి మనమే థ్రిల్లయ్యాం. ఇందులో క్లయిమాక్స్ హీరో చేతిలో లేక పాసివ్ అయ్యాడు. హీరోయినే నిభాయించింది. దీనికి హీరో పాసివ్ అవకుండా చూసే మార్గముంది. హీరోయిన్ ని హేండాఫ్ పాత్రగా మార్చేస్తే. అంటే ఎక్కడో వుండి హీరో ఆదేశాలిస్తూంటాడు. ఆ ఆదేశాలందుకుని హీరోయిన్ విలన్ సంగతి చూస్తుంది. క్లయిమాక్స్ వ్యూహం హీరోది గనుక అతను కథలో పాల్గొంటూ యాక్టివ్ పాత్రగా వున్నట్టే. అదే సమయంలో హీరోయిన్ కూడా యాక్టివ్ పాత్రే. గతంలో ఒక మూలనబడ్డ కథలో ఇలాటిదే యాక్టివ్ పాత్ర చిత్రణ చేశాం. అసలు సెకండాఫ్ లో హీరో యాక్షన్ లోకి రాడు. హీరోయిన్ తో తనపని తాను చూసుకుంటాడు. ప్రత్యర్ధులైన పోలీసులు ఒకళ్ళ నొకళ్ళు చంపుకుంటూ వుంటారు. ఒక్క ఫోన్ కాల్ తో హీరో క్లయిమాక్స్ మొదలెట్టేసి వూరుకుంటాడు. ఆ ఫోన్ కాల్  ఫలితంగా విలన్లయిన పోలీసులు ఒకర్నొకరు కాల్చుకు చావడం. క్లయిమాక్స్ వెనుక మాస్టర్ మైండ్ హీరో అయితే చాలు - అందులో చేతులు పెట్టక పోయినా యాక్టివ్ పాత్రగానే వుంటాడు. ఇలా వున్న సినిమాలు మనకి తెలిసినంత వరకూ రాలేదు. వస్తే కాపీ కొట్టడానికి క్యూలో చొక్కాలు చించుకుంటారు. ఇప్పుడు చెప్తే అర్ధమవక పాత మూసలోనే కమ్మగా కునుకు తీస్తారు.

Q : ‘దొంగ రాముడు’ కి చాలా లోతైన విశ్లేష చేశారు. ఇప్పటికిప్పుడు దొంగ రాముడు’ చూస్తూ మీ విశ్లేష సాయంతో అధ్యయనం చేయాలనిపిస్తోంది. అయితే సందేహం. మీ విశ్లేషణలో ఇలా పేర్కొన్నారు – “ఇందులో మిడ్ ఫ్రాక్చర్ ఇలా వుంటుంది : లావు తగ్గాలని (సైజ్ జీరోలో) ఇంటర్వెల్ దగ్గర ప్లాట్ పాయింట్ -1 తో వేసే గోల్ అక్కడితోనే ఆగిపోతుంది. సెకండాఫ్ ప్రారంభం కాగానే వేరే కథ మొదలెడతారు. అంటే ఫస్టాఫ్ లో ఎత్తుకున్న కథా దాని పాయింటూ సఫా. ఇక రెండో సినిమా షురూ. 

          “సెకెండాఫ్ సిండ్రోమ్ ఇలా వుంటుంది : ఇంటర్వెల్లో ప్లాట్ పాయింట్ -1 వేసి లావు తగ్గే పాయింటు వేశాక, దాన్నెలా కొనసాగించాలో తెలీనట్టు, ఇంటర్వెల్ తర్వాత దాన్నొదిలేసి, క్లినిక్ అక్రమాల పాయింటు నెత్తుకుంటారు. ఇంటి దగ్గర తల్లిగారు పెళ్లి కోసం లావు తగ్గమంటే, తల్లీనీ పెళ్ళీనీ వదిలేసి క్లినిక్ అక్రమాలంటూ వూరు మీద పడేశారు. ఉన్న పాయింటుతో సెకెండాఫ్ ఏం చేయాలో తెలీక, వేరే పాయింటుతో ప్లేటు ఫిరాయిస్తే, ఇలా సెకెండాఫ్ సిండ్రోమ్ లో- సుడిగుండంలో పడుతుంది సినిమా” అని.  

          ఇక్క మిడ్ ఫ్రాక్చర్, సెకెండాఫ్ సిండ్రోమ్ రెండింట్లోనూ స్టాఫ్కు భిన్నంగా సెకెండా ఫ్ లో వేరే చెప్పమే దా. అంటే రెండూ ఒకటే దా అనిపిస్తోంది. వాటి ధ్య భేదమేంటో కాస్త విపులంగా చెప్పరు.
-
ల్లా నాగార్జున, పాత్రికేయుడు

A :  మరేమీ లేదు, మిడ్ ఫ్రాక్చర్ రెండు రకాలుగా వుంటుంది : ఒకటి ఇంటర్వెల్ కే కథ అయిపోవడం; మరొకటి, ఇంటర్వెల్ కి ప్లాట్ పాయింట్ వచ్చినా కథేమిటో తేల్చక పోవడం. మొదటిది బాగా అర్ధమవాలంటే 2014 లో సుమంత్ అశ్విన్ నటించిన ‘చక్కిలిగింత’ ఒకటి చూస్తే చాలు. ఇందులో పాయింటేమిటంటే, ఫస్టాఫ్ ప్రారంభంలోనే హీరో ఒక గోల్ పెట్టుకుని ప్లాట్ పాయింట్ వన్ వేసుకుంటాడు. అమ్మాయిల వెంట అబ్బాయిలు పడకుండా, అమ్మాయిలే అబ్బాయిలకి ప్రేమని ప్రతిపాదించాలన్న పట్టుదలకి పోతాడు. కానీ హీరోయినే అతణ్ణి ప్రేమలోకి దింపి, ఆ గోల్ ని పటాపంచలు చేస్తుంది. ఈ ఇంటర్వెల్ సీన్లో ఓటమిని ఒప్పుకుంటాడు హీరో. ఇక్కడితో కథ అయిపోయినట్టే. ఇక సెకెండాఫ్ ప్రారంభం కాగానే, అయినా నన్ను ప్రేమలో పడేసి నిజంగానే నాలో ప్రేమని పుట్టించావంటూ ఇంకో రాగం ఎత్తుకుంటాడు హీరో. ఇది  అయిపోయిన కథకి ఇంకా అవసరం లేని కథని అనవసరంగా అతికించడం. అందువల్ల ఇది మొదటి రకం మిడ్ ఫ్రాక్చర్. 

          ‘సైజ్ జీరో’ లో ఈ రకం మిడ్ ఫ్రాక్చర్ లేదు. ఇంటర్వెల్ కి కథ అయిపోలేదు. పెళ్లవడానికి లావు తగ్గమంటే, లావు తగ్గాలా అని ఏడుస్తుంది హీరోయిన్. దీంతో ఇంటర్వెల్. ఇది ప్లాట్ పాయింట్ వన్ సన్నివేశమే. కానీ హీరోయినేం చేయాలో గోల్ ఏర్పడని అసంపూర్ణ ప్లాట్ పాయింట్ వన్. పోనీ సెకెండాఫ్ లోనైనా దీని కొనసాగింపు వుండదు. వూసే వుండదు. గోల్ లేకుండా వేరే గొడవ లెత్తుకుంటుంది. అందుకని ఇది రెండో రకం మిడ్ ఫ్రాక్చర్ అయింది. మొదటి రకం ఇంటర్వల్ కల్లా కథ ముగిసిపోతే, రెండో రకం ఇంటర్వెల్లో వచ్చిన ప్లాట్ పాయింట్ వన్ అసంపూర్ణంగా వున్నప్పుడు. 

          ఈ రెండిటికీ, సెకెండాఫ్ సిండ్రోంకీ తేడా ఏమిటంటే, ఇంటర్వెల్లో ప్లాట్ పాయింట్ వన్ లో ఏర్పడ్డ గోల్ కి భిన్నంగా సెకెండాఫ్ వేరే కథ ఎత్తుకుంటే సెకండాఫ్ సిండ్రోంలో పడ్డట్టు. ‘సైజ్ జీరో’ లో హీరోయిన్ గోలేమిటో ఇంటర్వెల్లో వచ్చిన ప్లాట్ పాయింట్ వన్ లో చెప్పలేకపోయినా, అమె లావు తగ్గడమే గోల్ అని మనకర్ధమై పోతుంది. ఈ గోల్ వదిలేసి క్లినిక్ అక్రమాలతో వేరే గోల్ ఎత్తుకోవడం వల్ల సెకెండాఫ్ సిండ్రోం అయింది.
***

698 : శనివారం సంత


    ఓ కొత్త దర్శకుడు వెళ్లి కథ చెప్తే నమ్మేస్తారు హీరోలు, నిర్మాతలు. అదే ఒక కొత్త రచయిత వెళ్లి కథ చెప్తే నమ్మరు. కొత్త దర్శకుడికి తెలిసిందేమిటి, కొత్త రచయితకి తెలియని దేమిటి? రచన చేయడానికి  కొత్త దర్శకుడికి వున్న అర్హతలేంటి, కొత్త రచయితలకి లేని అర్హతలేంటి? కొత్త దర్శకుడు కొత్త రచయితతో ఎందులో గొప్పవాడు? కొత్త దర్శకుడొచ్చి గందరగోళంగా ‘వీరభోగ వసంత రాయలు’ కథ చెప్పేస్తే అద్భుతమైన వాడా? ఒకరు కాదు, ముగ్గురు హీరోలు పోటీలు పడి నటించేస్తారా? కొత్త దర్శకుల కథల టాలెంట్ కి ‘వీరభోగ వసంతరాయలు’ పరాకాష్ట! దీనికి రేటింగ్ 1 కాదు, జీరో ఇచ్చినా ఎక్కువే. కొత్తవాళ్ళు దర్శకుడి లేబిల్ తగిలించుకుంటే రచయితలై పోతారా? అన్ని హక్కులు, అధికారాలు  వచ్చేస్తాయా? హీరోలు, నిర్మాతలు రచయితల కథలు తీసుకునే సాంప్రదాయం ఇరవై ఏళ్ల క్రితమే ముగిసిపోయింది, అదివేరు. ప్రత్యాన్మాయంగా ఆ స్థాయి కథలు వింటున్నారా అంటే అంత ఓపిక లేదు. అదే 90 % అట్టర్ ఫ్లాపులతో దశాబ్దాలు గడిపేస్తున్నారు. అట్టర్ ఫ్లా పులకి కారణం రచనలా, దర్శకత్వాలా? రచయితల్ని చంపేసిన ఈ ట్రెండ్ లో కొత్త బచ్చా దర్శకుడు కూడా రచయితల్ని చులకనగా చూస్తున్నాడు. రాసుకోలేక తను తీసేది అట్టర్ ఫ్లాపే. అది తెలుసుకోడు. మరిన్ని వీరభోగ వసంత రాయళ్ళు తీయాల్సిందే. ఎన్ని తీస్తే అన్ని బండారాలు బయటపడి మూతబడతారు. ‘కథ – మాటలు – స్క్రీన్ ప్లే – చాదస్తం’ అని వేసుకోలేక వాళ్ళే పారిపోతారు.
 ***



25, అక్టోబర్ 2018, గురువారం

697 : రైటర్స్ కార్నర్


సినిమా రచయిత్రిగా మారిన నవలా రచయిత్రి కణికా థిల్లాన్ ఇటీవల ‘మన్మర్జియా’తో బాగా పాపులరయ్యారు. తన ఈ సినీ యానంలో ఎన్నడూ తన నవలల్ని సినిమాలుగా మార్చాలనే ఆలోచనే చెయ్యని కణికా,  సాహిత్యమూ సినిమా వేర్వేరు జాతులంటారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ లో మాస్టర్స్ డిగ్రీ చేసిన కణికా, 2008 లో షారుఖ్ ఖాన్ నటించిన ‘ఓం శాంతి ఓం’ కి సహాయ దర్శకురాలిగా పనిచేయడంతో సినిమా వృత్తిని  ప్రారంభించారు. ఆ తర్వాత ఓ రెండు లో - బడ్జెట్ సినిమాలకి స్క్రిప్టు సూపర్ వైజర్ గా పనిచేశారు. 2012 లో షారుఖ్ ఖాన్  నిర్మించిన ‘రా. వన్’ కి స్క్రీన్ ప్లే, మాటలూ రాసి పూర్తి స్థాయి సినిమా రచయిత్రి అయ్యారు. ఆ తర్వాత 2015 లో తెలుగులో ‘సైజ్ జీరో’ కి స్క్రీన్ ప్లే రాశారు. దీని తర్వాత 2018 లో  హిట్టయిన ‘మన్మర్జియా’ కి కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందించి అరుదైన క్రియేటివ్ ప్రొడ్యూసర్ హోదా పొంది, రచయిత్రిగా తన  స్క్రిప్టు పై పూర్తి స్వాతంత్ర్యమూ, హక్కులూ సాధించారు. సలీం - జావేద్ ల తర్వాత కరువైపోయిన  ‘ఇది ఫలానా రచయిత సినిమా’ అనే బ్రాండింగ్ ని తను పొందారు. ఈ సందర్భంగా ‘మన్మర్జియా’ రచన గురించి ఆమె వెల్లడించిన  ఆసక్తికర విషయాలేమిటో చూద్దాం...

మన్మర్జియా మీ హృదయానికి ఎంత దగ్గరగా వుంది?
         
నేను అమృత్ సర్ లో పుట్టి పెరిగాను. మన్మర్జియా లోని పాత్రలు ఆ ప్రపంచంలో లోతుగా పాతుకుని వున్నాయి. ఇది పూర్తి స్థాయిలో నేనొక్క దాన్నే రాసిన మొదటి స్క్రిప్టు. కథ, స్క్రీన్ ప్లే, మాటలు నేనే రాసుకున్నాను. ఈ స్క్రిప్టు రాయడానికి నా మూలాల్లోకి నేను వెళ్ళడం సరైన ఆలోచననుకున్నాను. అందుకని ఈ సినిమాలో నా కంఠ స్వరాన్నే ఫీలవుతారు మీరు.
మీరు దర్శకుడుగా అనురాగ్ కశ్యప్ నే బలంగా కోరుకున్నారు, ఎందుకని?
         
 స్క్రిప్టు రాస్తున్నప్పుడు అనురాగ్ కశ్యపే నా మనసులో మెదులుతున్నారు. ఆయనే రైటర్ - డైరెక్టర్ కదా అని కొందరన్నారు. ఇతరుల స్క్రిప్టులకి ఆయన దర్శకత్వం వహించరని చెప్పారు. అయినా సరే నా అదృష్టాన్ని పరీక్షించు కుందామనుకున్నాను. మన్మర్జియా సంక్లిష్ట ప్రేమ కథ. అందులో చెప్పాల్సింది నాన్ జడ్జి మెంటల్ గా, నిర్భయంగా చెప్పాను. అనురాగ్ ని ఒప్పించగలననే నమ్మకం నాకుండేది. ముందు నిర్మాత ఆనంద్ ఎల్ రాయ్ కి విన్పించాను. ఆయన వెంటనే దీన్ని ప్రొడ్యూస్ చేయడానికి ముందుకొచ్చారు. అప్పుడు అనురాగ్ పేరు చెప్పాను. అనురాగ్ అప్పుడు వేరే సినిమాతో బిజీగా వున్నారు. ఆనంద్ గారు అనురాగ్ చేస్తున్న సినిమాతో బాటు, నా స్క్రిప్టుని కూడా ప్రొడ్యూస్ చేయడానికి సిద్ధమయ్యారు. అలా అనురాగ్ పిక్చర్ లోకి వచ్చారు. ఆనంద్ గారికి ఎన్నోఇబ్బందులెదురయ్యాయి. అయినా నా పక్షానే నిలిచారు. రైటర్స్ కి ఆయన చాలా మర్యాదా స్వేచ్ఛా ఇవ్వడం చూశాను.
తారాగణం ఎంపిక ఎలా జరిగింది?
          షార్ట్ టెంపర్ తో, అర్ధంకాకుండా ప్రవర్తించే నటులు ఈ కథకి అవసరమనుకున్నాం. దీనికి తాప్సీ, విక్కీలు సరిపోయారు. రాబీ పాత్రకి ఆనంద్ గారే ఆభిషేక్ బచ్చన్ పేరు సూచించారు. అభిషేక్ నటిస్తున్నప్పుడు చూస్తే, సరీగ్గా నా వూహల్లో వున్న పర్సనాలిటీనే ఆయన నటించారు.
కథ తాప్సీపాత్ర చుట్టే తిరుగుతుంది...
          తాప్సీకి ఇందులో నటించే అవసరం లేదు, ఎందుకంటే తనే రూమీ...రూమీ పాత్రని నేనెలా వూహించి రాశానో అచ్చం అలాగే వుంది తను - సూఫీ స్మూత్ నెస్ తో. అందుకని రూమీ అని పేరు పెట్టాను.
నవల రాయడానికీ, స్క్రీన్ ప్లే రాయడానికీ తేడా ఏమిటంటారు?
          నవల రాయడం వ్యక్తిగత అనుభవం. సినిమాకి రాయడం సమిష్టి కృషి. నవలలో ఎన్ని వాక్యాలతో ఎన్ని అద్భుత వర్ణన లైనా చేసుకోవచ్చు పేజీల కొద్దీ. కానీ సినిమాకి రాయాలంటే క్లుప్తత, విజువల్ అప్పీల్ చాలా అవసరం. నవలకీ సినిమాకీ వేర్వేరు స్కిల్స్ వుంటాయి.
మన్మర్జియా తర్వాత వెనువెంటనే మీ సినిమాలు రెండు రాబోతున్నాయి – కేదార్ నాథ్, మెంటల్ హైయ్ క్యా. మీకు దర్శకత్వం వహించాలని లేదా?
          తప్పకుండా వుంది. ప్రస్తుతానికి రాయడాన్నే ఎంజాయ్ చేస్తున్నాను. దర్శకత్వం వహించడానికి సరైన కథ దొరికినప్పుడు తప్పకుండా డైరెక్షన్ లోకి దూకుతాను.  
అనురాగ్ కశ్యప్ సెట్స్ మీద ఇంప్రూవ్ మెంట్లు చేస్తూంటారని ఒక ఫిర్యాదు వుంది. మీకేమైనా ఇబ్బందులు కలిగాయా?
          ప్రతీ రోజూ ఆయనతో నేను సెట్స్ లోనే వున్నాను. కొన్ని సీన్లు తీసేప్పుడు సుదీర్ఘంగా చర్చ చేసే వాళ్ళం. ఆ చర్చల్లో ఆయన నా విజన్ ని మార్చేస్తున్నారని నాకెప్పుడూ అన్పించలేదు. గుండె లోతుల్లోంచి ఆయన నా స్క్రిప్టుకి కనెక్ట్ అయిపోయారు. ఎప్పుడైనా వాదోపవాదాలు జరిగితే, ఆయన నన్ను ఒప్పించడమో, లేదా తనే నాతో ఒప్పుకోవడమో చేసేవారు. అదే ఆయనలో అద్భుతం. స్క్రిప్టు చదివి, తన వరకూ తను తీసిన ‘దేవ్ డీ’ ఎక్కడ ముగిసిందో, అక్కడ ‘మన్మర్జియా’ ప్రారంభమవుతోందని చెప్పారు. 

గత కొన్ని నెలలుగా మీరు ఒక సెట్ నుంచి ఇంకో సెట్ కి విశ్రాంతి లేకుండా తిరుగుతూ బాగా బిజీ అయినట్టున్నారు?
          చాలా హడావిడి. కానీ ఇదంతా నేనింత కాలం చేస్తూ వచ్చిన కృషికి  ఫలితంగా మీకన్పించొచ్చు గానీ - ఈ ప్రయాణాలూ, ఒక సినిమా సెట్స్ నుంచి ఇంకో సినిమా సెట్స్ కి తిరగడాలూ, నాకేమీ ఆసక్తికరంగా వుండవు. అయినా ఎంజాయ్ చేస్తున్నాను. దర్శకుడితో నా ఈక్వేషన్ మీద ఆధారపడుంటుంది. కథలకి నేనే సొంతదారు కాబట్టి నేను సెట్స్ లో వుండాలని దర్శకుడు కోరుకుంటే కాదనలేను.
దాదాపూ మీ మూడు స్క్రిప్టులూ ఒకేసారి ప్రొడక్షన్ లో కొచ్చి నట్టున్నాయి? ఇదెలా జరిగింది?
         
మన్మర్జియా కొంత కాలంగా నిర్మాణంలో వుంది. దీంతో బాటు కేదార్ నాథ్, మెంటల్ హై క్యా నిర్మాణంలో వున్నా, ఇవన్నీ నేనొకేసారి రాసినవి కావు. ఒకటి రాశానంటే మొత్తం నేనే రాసుకుని ఎవరికైనా ఇంట్రెస్టుందేమో వెళ్లి కలుస్తూంటాను. అలా రాసింది ఒకటి ఓకే అయ్యాకే మరోటి రాయడం మొదలెడతాను. అలా నేను రాసి ఓకే చేయించుకోవడంలో ఈ మూడిటి మధ్య ఎడం వున్నా, అవి నిర్మాణాలు ప్రారంభం కావడంలో జాప్యాల వల్ల, మూడూ వెంట వెంటనే విడుదల కొస్తున్నాయి.  
మన్మర్జియా మీకు మైలు రాయి. మీరు  రా. వన్ తో ప్రారంభమయ్యారు. అంతకి ముందు మీరు నవలా రచయిత్రి.  మరి మీకు సినిమా రైటర్ అవాలని ఎలా అన్పించింది?
          రా. వన్ కి రాసిన రచయితల్లో నేనొక రైటర్ని. సాంకేతికంగా రైటర్ గా నా మొదటి సినిమా మన్మర్జియా అవుతుంది. రా. వన్ నా ఇల్లు. షారుఖ్ ఖాన్ రెడ్ చిల్లీస్ సంస్థ నుంచి నేను మొదలయ్యా. అక్కడే అన్నీ నేర్చుకున్నాను. అక్కడే ట్రైనీ గా చేరి అసిస్టెంట్ డైరెక్టర్ ని అయ్యాను. మూవీ మేకింగ్ లో ప్రతీదీ అప్పుడే నేర్చుకున్నాను. ట్రైనీగా వుంటున్నప్పుడే మూడు నవలలు రాశాను. ‘డాన్స్ ఆఫ్ దుర్గా’ నవల రాస్తున్నపుడు వ్యక్తిగతంగా నేను బాగా లేను. నాన్న పోయారు. నా మానసిక శారీరకారోగ్యాలు చెడిపోయాయి. ఆ సమయంలో ఎక్కడో చదివాను – జీవితంలో నీ దుర్భర క్షణాల్ని డబ్బుగా మార్చే ప్రక్రియే రచన చేయడమని. కానీ నవలలు రాసే ఏకాంత వ్యాపకం నేను కోరుకోలేదు. ఆ ఏకాంతంలోకి, ఆ వొంటరి తనంలోకి వెళ్ళ వద్దని కొందరు వారించారు. అందుకని సినిమా స్క్రిప్టులు రాయడం ప్రారంభించాను. ఇదైతే నల్గురితో టీంవర్క్ ని డిమాండ్ చేస్తుంది కదా.
అనురాగ్ కశ్యప్ తానే రైటర్. ఆయన ఏంరాసి తీస్తున్నారో ఆఖరి క్షణాల వరకూ చెప్పరని యాక్టర్స్ అంటూంటారు. మీకూ ఇదే అనుభవమా?
          అలాటిదేమీ లేదు. ముందే చాలా చర్చించుకునే వాళ్ళం. ఎల్లవేళలా ఆయన సెట్స్ లో వుండమనే వారు. మన్మర్జియా పాత్ర ప్రధాన కథ. మంచి దర్శకుడైతేనే నటుల నుంచి ఈ పాత్రల్ని వెలికి తీయగలడు. పాత్రల్ని నటింప జేయడం కాదు, వాళ్ళని పాత్రలుగా మార్చేయగలడు. అనురాగ్ నటులతో నటింప జేయడం ఎలా వుంటుందంటే, వాళ్ళ  పర్సనాలిటీల్ని  పాత్రల్నుంచి అడ్డు తొలగించేస్తారు. అప్పుడా నటులు కేవలం వ్యక్తులుగా మిగులుతారు. ఇలా ఫిల్టర్ చేయడం చాలా కష్టమైన పని.  
రైటర్స్ కి ఫ్రెండ్లీ టీమ్స్ దొరకడం కష్టమే. అనురాగ్ తో మీ టీం వర్క్ అంత కష్టం కాలేదేమో...
         
ప్రతీ దర్శకుడిలో నేను అనురాగ్ లాంటి ప్రొఫెషనల్ ని కోరుకుంటాను. అనురాగ్ తానే రైటరైనా సాటి రైటర్స్ తో అభద్రత ఫీలవరు. పైగా స్నేహపూర్వకంగా వుంటారు. టాలెంట్ ని ప్రోత్సహించడంలో చాలా ముందుంటారు. తామొక్కరే వెలిగిపోవాలనుకోకుండా టాలెంటున్న ఇతరుల్ని ప్రోత్సహించే వాళ్ళు అతి తక్కువ మంది వుంటారు. అనురాగ్ నుంచి నేను నేర్చుకున్న గొప్ప విషయమేమింటే, మనతో పాటూ ఇతరులూ ఎదిగేలా చూడాలి, తొక్కేసి ముందుకెళ్ళి కూడదు...
కరణ్ జోహార్ తీస్తున్న ‘తఖ్త్’ పోస్టర్ లో రైటర్స్ పేర్లు వేశారు. రచయితలెంతో  ధన్యులైనట్టు ఫీలయారు. అనురాగ్ కూడా ఎప్పుడూ మన్మర్జియా కథ మీదేనని ప్రకటిస్తూ వచ్చారు. ఇది మీకు ఎంకరేజింగ్ గా వుందంటారా?
         
మేమెందుకు ధన్యులమనుకోవాలి? ఇలా రైటర్స్ ని గుర్తించాల్సిందే కదా. అనురాగ్ విషయానికొస్తే నా ఒక్కరి విషయంలోనే అలా చేయలేదు. చాలా మంది రైటర్స్ విషయంలో ఇవ్వాల్సిన క్రెడిట్ ఇచ్చారు. ఎవ్వరూ పాటించని సాంప్రదాయాన్ని ఆయన పాటిస్తున్నారు. ఇందుకు అభినందిస్తానే తప్ప, నేను రుణపడి వుండాలనుకోను. రైటర్స్ ని నమ్మి ఆదరించే మరొకరు ఆనంద్ గారు. సినిమా మీడియా అంటే కంటెంట్ క్రియేషన్ అనీ, అందుకని క్రియేటర్స్ ని చాపకింద తోసేయలేమనీ ఆయనకి తెలుసు. రైటర్స్ ని పోషించడం తమ అవసరమనీ కూడా ఆయనకి తెలుసు. మరలాంటప్పుడు రుణపడడం దేనికి? రైటర్ పేరు పోస్టర్ మీద వుండాల్సిందే. ఈ ట్రెండ్ ని కరణ్ జోహార్ ప్రారంభిస్తున్నందుకు సంతోషిస్తున్నాను. మన్మర్జియా కి నేను క్రియేటివ్ ప్రొడ్యూసర్ ని. అనురాగ్, ఆనంద్ ఇద్దరూ రైటర్ గా నా పేరేయడమే గాక, ఓనర్ షిప్ కూడా నాకే ఇస్తున్నట్టు చెప్పారు. పోస్టర్ మీద పేరుకంటే నాకు ఇది ముఖ్యం.
***