రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

12, జులై 2017, బుధవారం

480 : డార్క్ మూవీస్ స్క్రీన్ ప్లే సంగతులు - 7







తర అన్ని జానర్ల మూవీస్ కిలాగే  డార్క్ మూవీస్ బిగినింగ్ బిజినెస్ ని సర్దు బాటు చేయడం కూడా కష్టమే.  స్క్రీన్ ప్లేలో బిగినింగ్ విభాగమనేది ప్రయాణానికి సన్నాహం లాంటిది. మనమెక్కడికైనా ప్రయాణం పెట్టుకుంటే సూట్ కేసు సర్దుకుంటాం. అందులో పేస్టూ, బ్రష్షు, సబ్బు, టవల్ వగైరా ఎలా పెట్టుకుంటామో అలా- బిగినింగ్ కూడా ప్లాట్ పాయింట్ 1 దగ్గర కథా గమనమనే ప్రయాణం కట్టినప్పుడు, ఆ ప్రయాణంలో ఉపయోగపడే సరంజామా అంతా సిద్ధం చేసుకుంటుందన్న మాట. ఏమిటా సరంజామా? ఈ సరంజామా మూడు సెట్లుగా వుంటుంది. మొదటి సెట్ లో 1. ప్రథాన పాత్రనిఇతర ముఖ్య పాత్రల్నీ పరిచయం చేసికథా నేపధ్యాన్ని (జానర్ ని) తెలిపే; 2. ప్రధాన పాత్రకి సమస్య తలెత్తేందుకు ప్రేరేపించే పరిస్థితుల్ని లేదా శక్తుల్ని చూపే; 3. సమస్య తలెత్తే దిశగా పరిస్థితుల కల్పనచేసే; 4. సమస్యని  ఏర్పాటు చేసే - టూల్స్ ని  టూల్ బాక్సులో సర్డుతాం. ఇదొక సెట్. 

         
రెండో సెట్ లో  ఐదు సప్లిమెంటరీలని సర్దుతాం. అవి : 1. పాత్ర చిత్రణలు, 2. పాత్రకి  అంతర్గత- బహిర్గత సమస్యలు; 3. క్యారక్టర్ ఆర్క్, 4. టైం అండ్ టెన్షన్ గ్రాఫ్, 5. ఎమోషన్.
          ఇక మూడో సెట్లో గోల్ ఎలిమెంట్స్ ని సర్డుతాం. అవి : 1. కోరిక, 2. పణం,  3. పరిణామాల హెచ్చరిక, 4. ఎమోషన్. 

          1. ఇప్పుడు స్థూలంగా బిగినింగ్ విభాగపు బిజినెస్  =
 
        
1. ప్రథాన పాత్ర, ఇతర ముఖ్య పాత్రల పరిచయం, కథా నేపధ్య సృష్టి.
        2. ప్రధాన పాత్రకి సమస్య పుట్టే / పుట్టించే పరిస్థితులు/ శక్తులు 
        3. సమస్యని సృష్టించే దిశగా పరిస్థితుల కల్పన
        4. సమస్య ( ప్లాట్ పాయింట్ – 1 ) ఏర్పాటు.
 
          2. వీటిలో కల్పించాల్సిన సప్లిమెంటరీలు = 
        
1. పాత్ర చిత్రణలు 
        
2. పాత్రలకి అంతర్గత- బహిర్గత సమస్యలు
        3. క్యారక్టర్ ఆర్క్ 
        
4. టైం అండ్ టెన్షన్ గ్రాఫ్ 
        
5. ఎమోషన్ 
          3. గోల్ లో వుండాల్సిన  ఎలిమెంట్స్ =
        1. కోరిక
        2. పణం 
        3. పరిణామాల హెచ్చరిక
        4. ఎమోషన్ 
                                    ***
        అంటే స్క్రీన్ ప్లేలో అరగంటకో, ముప్పావు గంటకో ఇంటర్వెల్ లోపు వచ్చే ప్లాట్ పాయింట్ -1 కల్లా, బిగినింగ్ కథనంలో పై 13 పనిముట్లూ కనిపించాలన్న మాట. ఇదేదో ‘బ్లడ్ సింపుల్’ కోసం కల్పించి చెబుతున్నది కాదు. ‘శివ’ సార్వజనీన స్క్రీన్ ప్లేకి కూడా ఈ పదమూడే వుంటాయి. 

          అయితే డార్క్ మూవీస్ కి వున్న ప్రత్యేకతల దృష్ట్యా ఇంకొన్ని  ఎలిమెంట్స్ జత కలుస్తాయిక్కడ. చిత్రీకరణలో వచ్చే ఆ ఎలిమెంట్స్ గురించి  జూన్ 15 వ తేదీ వ్యాసంలో తెలుసుకున్నాం. ఇవన్నీ  ‘బ్లడ్ సింపుల్’ బిగినింగ్ 13  సీన్లలో ఎలా సర్దుబాటయ్యాయో చూస్తే, ఈ 13 సీన్లలో మొదటిది వాయిసోవర్ తో వుంది ( వాయిసోవర్ ప్రారంభాలు  నోయర్ జానర్ తప్పని సరి చేస్తున్నా, దీన్ని ఆప్షన్ గా తీసుకోవచ్చు) ఇకపోతే నోయర్ కి ఫ్లాష్ బ్యాక్ కథనం కూడా ఒక ప్రమాణమే అయినా, ఇది ‘బ్లడ్ సింపుల్’ లో లేదు. ఇది కూడా ఆప్షనే. వాయిసోవర్ ఏ పాత్ర చెప్తూంటుందో అదే ప్రధాన పాత్ర అవుతుంది. ఈ మేరకు డిటెక్టివ్ విస్సర్ ని ఇందులో ప్రధాన పాత్రగా చూశాం. ఇతనే ప్రధాన పాత్ర అనడానికి ఇంకో ఆధారం ప్లాట్ పాయింట్ -1 దగ్గర ఇతనే (ఎబ్బీ, రేలని చంపే) సమస్యని టేకప్ చేశాడు. ఇతనెలాటి వాడో,  ఆశయాలెలా వున్నాయో వాయిసోవర్ తోనే  పరిచయమయ్యాడు. ఈ ప్రధాన పాత్ర యాంటీ హీరో అని కూడా తెలిసిపోతోంది.


          రెండో సీన్లో ఎబ్బీ, రే లు, వాళ్ళ  వ్యవహారాలూ  కూడా పరిచయమయ్యాయి. పాత్రల పరిచయమంటే అన్ని పాత్రల్నీ వరసగా పరిచయం చేసుకుంటూ పోవడం కాదు. బిగినింగ్ కథనం చేసే డిమాండ్ ని బట్టి అవసరమైన  ఒక్కో పాత్రా సందర్భాన్ని బట్టి  పరిచయమవుతూంటుంది. అందుకని  రెండో సీన్లో  ఎబ్బీ, రే ల్ని  పరిచయం చేశాక ఎబ్బీ భర్త మార్టీ పరిచయం జోలికి పోలేదు. కానీ ఆమెకో భర్త వున్నాడని ఈ రెండో సీన్లో చెప్పారు. ఈ మొదటి రెండు సీన్లలోనే మూవీ జానర్ ఏమిటో ఏర్పాటయ్యింది. కథా పరంగా చూస్తే  ఎబ్బీ, రేల రహస్య ప్రేమాయణం, రివాల్వర్ ఉనికి, చుట్టూ వాతావరణం, ఆ వర్షంలో వెనక కార్లో ఎవరో వున్నారన్న భావం   ఇవన్నీ కూడా డార్క్ మూవీ జానర్ లోకి తీసికెళ్ళపోయాయి. 

       డార్క్ మూవీస్ ఎలిమెంట్స్ లో నైట్ సీన్స్ కూడా ఒకటి. ఈ బిగినింగ్ లో చాలా సీన్లు నైట్లోనే వున్నాయి. ఇక కథనం (కథ అనకూడదు అప్పుడే, ప్లాట్ పాయింట్ -1 దగ్గర్నుంచి మాత్రమే కథ  ప్రారంభమవుతుంది ఏ జానర్ కైనా) ప్రారంభించడానికి అవసరమైన పాత్రల పరిచయాలు చేస్తూనే, డార్క్ మూవీ జానర్ ని ఆవిష్కరిస్తూనే, ఈ విభాగం బిజినెస్ లో రెండవ టూల్ అయిన  ప్రధాన పాత్రకి సమస్య పుట్టే / పుట్టించే పరిస్థితులు/ శక్తులు తెలియ జేశారు. ఇక్కడ ప్రధాన పాత్ర విస్సర్ అయితే, ఇతడికి సమస్య పుట్టించే శక్తులుగా ఎబ్బీ, రేలున్నారు. వీళ్ళిద్దరూ ఎఫైర్ పెట్టుకుని మార్టీకి (ఎబ్బీ భర్తకి), తద్వారా విస్సర్ కీ సమస్య సృష్టించబోతున్నారు. కాబట్టి సమస్య పుట్టించే శక్తులు ఎస్టాబ్లిష్ అయిపోయాయి. ఇక 3 వ టూల్ అయిన సమస్యని సృష్టించే దిశగా పరిస్థితుల కల్పన  మొదలెట్టారు వీళ్ళు. ఎలా? 

          మోటెల్ లో సెక్స్ కి పాల్పడ్డం ద్వారా, ఆ ఫోటోలని తీసి విస్సర్ మార్టీకి చేరవేసేందుకు దోహదం చేయడం ద్వారా. ఇలా వాళ్ళ ఈ  ఒక్క చర్యే  చైన్ రియాక్షన్ లా  ఒకటొకటే విషమ పరిస్థితులకి దారి తీయిస్తూ పోయింది. భర్త మార్టీకి తెలిసిపోయిందని ఎబ్బీ,  రే తో రే ఇంటికి వెళ్ళిపోయింది. పైగా మార్టీ దగ్గరి కెళ్ళి జీతమడిగి రే ఇంకా మార్టీ మూడ్ చెడ గొట్టాడు. ఫోన్ ద్వారా ఈ జంటని ట్రాక్ చేస్తున్న మార్టీ, ఎబ్బీ రే ఇంట్లో వుందని తెలుసుకుని వెళ్లి ఎటాక్ చేశాడు. అది బెడిసి కొట్టి ఇక ఇద్దర్నీ చంపెయ్యాలని డిసైడ్ అయ్యాడు. మళ్ళీ విస్సర్ నే ఆశ్రయించాడు. విస్సర్  ఆ ఎబ్బీ, రే ల్ని చంపి బయటపడే ‘సమస్య’ ని టేకప్ చేశాడు. ఇదీ సమస్యని సృష్టించే దిశగా పరిస్థితుల కల్పన

    ఇదీ బిగిబింగ్ బిజినెస్ లో మొదటి సెట్ పాలన  జరిగిన విధం. ఒకదానికొకటి లింకులు బలంగానే వున్నాయి. బలహీన మోటివ్స్ ఎక్కడా లేవు. బలహీన మోటివ్ అంటే, ఉదాహరణకి – ‘నిన్ను కోరి’ లో బీచ్ బాల్ ఆడుతున్నప్పుడు హీరోయిన్ భర్త పర్సు మర్చిపోయాడని, తీసికెళ్ళి ఇస్తానని వెళ్ళడం, వెళ్ళినప్పుడు భర్త ఒకమ్మాయితో మాట్లాడడం చూసి తర్వాత దుమారం రేపడం. ఆమె పర్సు తీసుకెళ్ళాడం  బలహీన మోటివ్. తీసి అప్పటికి తనే దాచి పెట్టుకోవచ్చు, అంత అర్జెంటుగా వెళ్లి ఇవ్వాల్సిన అవసరం లేదు. పైగా అతనెటు వెళ్ళాడో తెలీదు. సహజంగా ఏం చేస్తారంటే, ఒక కాల్ చేస్తారు. అప్పుడా భర్త పర్సు నీ దగ్గరే వుంచమంటాడు. అంటే దర్శకుడు ఆ పర్సు తో ఏం చేయాలో పాత్రకి వదిలెయ్యకుండా,  కథా  సౌలభ్యం  (భర్తవేరే అమ్మాయితో వున్నదృశ్యం చూడ్డం) కోసం తనే పాత్రకి లేని ఉద్దేశాలు రుద్దడం వల్ల,  ఇలాటి బలహీన- ఇల్లాజికల్ మోటివ్  అన్నమాట. సింపుల్ గా ఏం చేయవచ్చంటే, అతను ఫోన్ మర్చిపోవాలి. అప్పుడా ఫోన్ మోగితే, ఆ కాల్ లో అమ్మాయి గొంతు పలికితే,   హీరోయిన్ డిస్టర్బ్ అవడానికీ, భర్త ఎటు వెళ్ళాడో వెతుక్కుంటూ వెళ్ళడానికీ, వెళ్లి  వాళ్ళిద్దర్నీఅలా  చూడ్డానికీ తగిన బలమైన ఎమోషన్ తో ప్రాతిపదిక ఏర్పడుతుంది. 

          బ్లడ్ సింపుల్ లో ఈ నిర్మాణమే వుంది. ప్రతీ చర్యకీ సహజంగా ఒక ఎమోషనల్  ప్రాతిపదిక. ఇలా మోటివ్స్ పుట్టే విధం రెండో సెట్ లో గమనించవచ్చు. 1. పాత్ర చిత్రణలు : పాత్రచిత్రణలు జరగకపోతే కథనంలో పై పరిస్థితు లేవీ ఏర్పడవు. ఎంత డబ్బున్నా భర్తతో సుఖం లేదన్న బాధ ఎబ్బీది, ఎబ్బీ కోసం నిలబడాలన్న సంకల్పం రే ది. ఇంత ద్రోహం చేసిన ఎబ్బీకి బుద్ధి చెప్పాలన్న ఉద్రేకం మార్టీది. 

          2. పాత్రలకి అంతర్గత- బహిర్గత సమస్యలు : ఇది పాత్రలకి సైకలాజికల్ ట్రాక్ ని  కల్పిస్తుంది. రే కి ఎబ్బీ తన భర్త గురించి చెప్పుకోవడం దగ్గర్నుంచీ, హేండ్ బ్యాగుల పిచ్చితో తను  ఇలా మారడానికి కారణం తెలుపుకోవడం దగ్గర్నుంచీ, రే తో విడిపోయే దాకావచ్చి వెంటనే లొంగు బాటు ప్రకటించడం వరకూ ఆమె సైకలాజికల్ ట్రాకుని గమనిస్తే, ఇంట్లో సుఖం లేకే హేండ్ బ్యాగుల అబ్సెషన్ పుట్టింది. బ్యాగులతో బయట షికార్లు తిరిగింది. ఈ ఏకాకి తనంవల్ల (మోటివ్) రే కి దగ్గరయ్యింది. రే తో మోటెల్ లో వున్నట్టు భర్తకి తెలిసిపోయిందని (మోటివ్) రే ఇంటికి మారిపోయింది. రే తో విడిపోయే దాకా వచ్చాక, తనకి గతి లేని పరిస్థితి వుందని (మోటివ్) లొంగు బాటు ప్రకటించింది. 

          రే సైకలాజికల్ ట్రాక్ :  బాస్ (మార్టీ) భార్యతోనే ఎఫైర్ పెట్టుకోవడానికి అతడికే  మానసిక నిషేధాలూ లేవు. అదే సమయంలో ఘర్షణ పడదల్చుకోలేదు. బాస్ ఇంటికెళ్ళి నప్పుడు సిగరెట్ నోట్లో పెట్టుకుని కూడా వెలిగించక పోవడానికి మోటివ్ ఇదే. జీతం డబ్బులకోసం బాస్ దగ్గరి కెళ్ళి నప్పుడు అతను  తనని పీకేశానని చెప్పాక- ఇక సిగరెట్ నోట్లో పెట్టుకున్నాడు. ఇప్పుడు తను అతడి ఉద్యోగియే కానప్పుడు ఎదురుగా సిగరెట్ కాల్చగలడు. అయితే కాల్చలేదు- మోటివ్- ఏం జరిగినా బాస్ తో ఘర్షణ పడదల్చుకోలేదు. ఇంకా జ్వాలలు రేపదల్చుకోలేదు. ఇందుకు సూచనగానే సిగరెట్ ముట్టించుకోలేదు.

          కానీ బాస్ ఎబ్బీ మీద ఎక్కించి చెప్పిన అలాటి మాటలకి (మోటివ్) ఎబ్బీ తో తేడా వచ్చింది. వచ్చి ఎబ్బీతో బ్రేకప్ కి సిద్ధపడ్డాడు. ఎబ్బీ  బాధపడి సారీ చెప్పలేదు. అలా చెప్పి వుంటే ఓకే అని, పక్కలో చోటిచ్చేవాడేమో క్యాజువల్ గా. ఆమెకి బయట జీవితం లేదని తెలుసుకుని వచ్చినందునే (మోటివ్) అలా అభయ హస్తమిస్తున్నట్టు చేయి చాపి అందుకున్నాడు.

      మార్టీ సైకలాజికల్ ట్రాక్ చూస్తే, ఫోటోలు రాకముందు బార్లో వస్తున్న పాటకి (మోటివ్ ) అతను ఎబ్బీ గురించి పునరాలోచనలో పడ్డాడు. ఫోటో చూసి (మోటివ్) ఆమెని స్పృశించి ప్రేమని చాటుకున్నాడు. కానీ ఎబ్బీతో అడ్జెస్ట్ అవడం చులకనవడం అనుకుని (మోటివ్ ) బార్ లో బార్ టెండర్ ఫ్రెండ్ తో మిస్ బిహేవ్ చేసి సైకోతనాన్ని బయట పెట్టుకున్నాడు. ఈ మానసిక స్థితితో (మోటివ్ )ఎబ్బీమీద కసిని పెంచుకున్నాడు. మంటెక్కిస్తూ రే రావడంతో (మోటివ్) ఎబ్బీగురించి నానా మాటలన్నాడు. తన టార్గెట్  ఎబ్బీయే, రే కాదని చాటుకున్నాడు. రాత్రంతా ఎబ్బీ గురించే నిద్రపట్టక తెల్లారి వచ్చి లైంగిక దాడి చేశాడు. లైంగిక దాడే చేయాలన్న దానికి ‘మోటివ్’ రే తో అన్న మాటల్లోనే బయటపడింది- ఆ ప్రకారం ఆమెని బయటికి లాక్కొచ్చి బహిరంగ మానభంగం చేస్తే ఇంకెవరితోనూపడుకోదనుకున్నాడు. ఆమె గాయపరచడంతో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాక ఈ తీరని కసి (మోటివ్) తో విస్సర్ దగ్గరి కెళ్ళి పోయాయి చంపెయ్యమని చెప్పాడు. ఎబ్బీ రే ల్ని చంపెయ్యాలన్న అంతిమ  నిర్ణయానికి రావడానికి అతడి మానసిక స్థితి ఎలాగెలా డెవలప్ అవుతూ వచ్చిందో అంచెలంచెలుగా ఈ సైకలాజికల్ ట్రాక్ తెలుపుతుంది.  రే మీద కోపం లేని అతను రేని కూడా చంపాలనుకోవడానికి మోటివ్, ఎబ్బీ హత్యతో అతను ప్రాబ్లం అవుతాడని. 

          విస్సర్ సైకలాజికల్ ట్రాక్ కొస్తే, స్వగతమే ఇతడి మైండ్ ఏంటో చెప్పేసింది. అందుకే ఇందులో తన అవసరం చూసుకునే మోటివ్ తో, చూసి రమ్మంటే ఫోటోలు తీసి మార్టీని బ్లాక్ మెయిల్ చేశాడు. తను చేస్తున్నది తప్పని తన మనసే తనకి చెప్తున్నా పట్టించుకునే స్థితిలో లేడు.  ఆ మనసు సిగరెట్ కేస్ ని టేబుల్ మీద పట్టి మర్చిపోయేలా చేసి, మళ్ళీ గుర్తు చేసి తీసుకునేలా చేసింది. అతనొకటి చేస్తోంటే అంతరంగం దాని మోటివ్ తో (పట్టివ్వడానికి) అది చేసుకుపోతోంది.

          ఇలా పాత్రల అంతర్గత- బహిర్గత  ముఖాల వల్ల కథనానికి చలనం వస్తోంది.  మానసిక కారణాలు భౌతిక చర్యలకి దారి తీయడం. ఈ బహిర్గత చర్యలు సమస్యకి దరి తీసే పరిస్థితుల్ని కల్పిస్తున్నాయి.

          ఇక ఈ సెట్ లో మూడవదైన క్యారక్టర్ ఆర్క్ గురించి : క్యారక్టర్ ఆర్క్ అంటే పాత్రల ఉత్థాన పతనాలు. రే ఎబ్బీలు మార్టీకి ఎలాటి  పరిస్థితిని సృష్టిస్తూ ఉచ్ఛ స్థితికి వెళ్లి, రిలేషన్ షిప్ లో తేడాలతో పతనావస్థని సృష్టించుకుని, తిరిగి కమిట్ మెంట్ తో ఉచ్ఛ స్థితి కెళ్లారో  చూశాం. 

      మార్టీ ఫోటో చూడకముందు ఎబ్బీ గురించి డైలెమాలో పడి ( డౌన్), ఫోటో చూశాక ప్రేమని చాటుకుని (ఇంకా డౌన్), అంతలోనే ఇలా కాదనుకుని బార్లో సైకోలా  ప్రవర్తించి (అప్), రే రాగానే అతడి ముందు ఎబ్బీ మీద అక్కసు ప్రదర్శించి (ఇంకా అప్),  రాత్రంతా ఆలోచించి తెల్లారి ఎబ్బీమీద లైంగిక దాడి చేసి (మరింకా అప్), ఫైనల్ గా చంపేసే నిర్ణయంతో పతాకస్థాయికి చేర్చాడు తన పాత్రోచిత చాపాన్ని. 

          విస్సర్ తన స్వగతంతో గొప్ప యాంటీ హీరోలా తన చాపాన్ని పైకెత్తు కుని, విస్సర్ ని బ్లాక్ మెయిల్ చేసి జెండా ఇంకా పైకెత్తుకుని సిగరెట్ కేస్ డైనమిక్స్ తో తెరచాప కంట్రోలు తప్పాడు. 

          చివరిది టైం అండ్ టెన్షన్ గ్రాఫ్ అంటే తెర మీద సినిమా నడుస్తున్న సమయం గడిచేకొద్దీ కథనం టెన్షన్ ని పెంచుకుంటూ పోవడం. ఇది చూస్తూనే వచ్చాం, సీను సీను కీ పాత్రల అంతర్- బాహ్య చర్యల వల్ల కథనం టెన్షన్ ని ఎలా  పెంచుకుంటూ పోయిందో. ఇక ఎమోషన్ విషయాని కొస్తే, ఇది ప్లాట్ పాయింట్ 1 దగ్గర ఏర్పాటయ్యే సమస్యని దృష్టిలో పెట్టుకుని ఆ ప్రధాన రసాన్నే ఎమోషన్ గా ఒలికిస్తూ వుంటుంది. హత్యలకి దారి తీస్తున్నందువల్ల ఈ బిగినింగ్ విభాగంలో ప్రధాన ఎమోషన్ సీరియస్ ఎమోషనే.
                                                  ***
      పై రెండు  సెట్స్ లోని ఈ తొమ్మిది పనిముట్లతో బాటు నోయర్ ఎలిమెంట్స్ ని ఎలా వాడుకున్నారో గమనించాం. కెమెరా యాంగిల్స్ ని, మూవ్ మెంట్స్ ని, మిర్రర్స్ ని, నీడల్నీ... ఈ ఎలిమెంట్స్ ప్రేక్షకులకి ఏమర్ధమవుతాయనొచ్చు. పైకి చెప్పలేని అనుభూతి ఏదో సబ్ కాన్షస్ గా అనుభవిస్తూనే వుంటారు. మనం 80 ఏళ్ల తర్వాత మన ప్రేక్షకులకి  ఏమర్ధమవుతా యనుకుంటున్నాం. 1930 లలో అమెరికన్లకి సినిమాలు ఏంతో కొత్త. అంత కొత్తలోనే ఫిలిం నోయర్ మూవీస్ ని ప్రారంభిస్తూ- ఈ ఎలిమెంట్స్ ని కలిపి అంత కళాపోషణ ఎందుకు చేశారు. బెడిసి కొడుతుందని తెలీదా? ఈ ఎలిమెంట్స్ విజువల్ గా ఇబ్బంది పెట్టకుండా, సబ్ కాన్షస్ గా వర్కౌట్ అవుతాయని తెలుసు కాబట్టే అప్పట్లోనే కళాపోషణ చేశారు. మనుషుల మానసిక లోకం ఎప్పుడైనా ఎక్కడైనా ఒకటే. 

          వీటినలా వుంచితే,  పై రెండు సెట్స్ లోని పనిముట్లన్నీ ఎందుకోసం పనిచేస్తు
న్నాయి? మొత్తం  పాత్రల్నీ పరిస్థితుల్నీ తీసుకెళ్ళి  బిగినింగ్ కి చివరిదైన పదమూడో సీన్లో ప్లాట్ పాయింట్ – 1 దగ్గర బ్లాస్ట్ చేయడానికే! 

          ప్లాట్ పాయింట్ -1 స్క్రీన్ ప్లేలో మొదటి మలుపు తీసుకునే కేంద్రం. కథకి మొదటి మూల స్థంభం. ఈ  మూల స్థంభం పటిష్టంగా లేకపోతే, ఇక్కడే బీటలు వారుతుంది కథ. అందుకే మొదటి మూల స్థంభం ఏ ఏ అంశాలు డిమాండ్ చేస్తుందో, అవన్నీ కలుపు కుంటూ రావాలి బిగినింగ్ విభాగంలో. ఈ కలబోతే కథ ప్రారంభ మవడానికి ముఖ్యం. ఇందులో ఏ లోపం జరిగినా ఈ మొదటి మలుపే బలంగా వుండదు,  ఇక కథనేం బలంగా నడిపిస్తుంది.

          ఉదాహరణకి, రే- ఎబ్బీలు సీరియస్ ఆరోపణలు చేసుకుని విడిపోయినట్టూ, మళ్ళీ అంతలోనే ఎబ్బీ రాజీ పడిపోయినట్టూ బిగినింగ్ విభాగంలోనే చూపించారు. ఆప్పుడే  రాజీ పడడమెందుకు, రాజీ పడ్డాకా రే ఆమెకి అప్పుడే అభయహస్తమిస్తున్నట్టు చూపించడ మెందుకూ, స్టోరీ ఇక్కడే ఎక్కువై పోతోంది, దీన్ని మిడిల్ విభగంలో లో చూసుకుందాంలే, తొందరేముందనుకుంటే కొంప కొల్లేరవుతుంది.

          బిగినింగ్ కి ముగింపు ప్లాట్ పాయింట్ -1. ఈ ప్లాట్ పాయింట్ -1 దగ్గర ఏం జరగాలని ఆశిస్తారో దాన్ని బలీయం చేసే  భావోద్వేగాల్ని నిర్వీర్యం చేయకూడదు. ప్లాట్ పాయింట్ -1 దగ్గర వీళ్ళని చంపే పథకం ఖరారవుతోంది. అలాంటప్పుడు వీళ్ళ రిలేషన్ షిప్ ని బ్రేకప్ గానే చూపిస్తే, విడిపోయిన ఆ ప్రేమికుల్ని చంపుతున్నారంటే ఏం సానుభూతి, ఆందోళనా వగైరా కలుగుతాయి ప్రేక్షకులకి? కలిసిపోయి ఇక పూర్తిగా కమిటైపోయిన లవర్స్ ని చంప బోతున్నారంటే  ఆందోళనా ఆదుర్దా సానుభూతీ వగైరా అన్నీ పుట్టుకొచ్చే వీలుంది.
***
     ఇక చివరిగా  ‘బ్లడ్ సింపుల్’ ప్లాట్ పాయింట్ -1 నిర్మాణం చూద్దాం. బిగినింగ్ బిజినెస్ 
ప్లాట్ పాయింట్ -1 కి చేరే సరికి అందులో ప్రతిఫలించాల్సినవి నాల్గు  ఎలిమెంట్స్ అని పైన మూడవ సెట్ లో చెప్పుకున్నాం. వీటిని గోల్ ఎలిమెంట్స్ అన్నాం. ఇక్కడ ప్రధాన పాత్రకి ఒక గోల్ ఏర్పడుతుంది గనుక అందులో వుండాల్సిన ఎలిమెంట్స్ ఇవీ... కోరిక, పణం, పరిణామాల హెచ్చరిక, ఎమోషన్. వీటిలో ఒకటి లోపించినా, లేదా బలహీనంగా వున్నా, ప్లాట్ పాయింట్ -1 కూడా బలహీనపడి ప్రధాన పాత్రకి అంత బలమైన లక్ష్యం కూడా ఏర్పడదు. దీంతో చప్పగా సాగుతుంది ఇక్కడ్నించీ మొదలయ్యే కథ. 

          కోరిక : అంటే ప్రధాన పాత్రకి  దాని కెదురైన సమస్యని సాధించి తీరాలన్న బలమైన కాంక్ష పుట్టడం. తద్వారా తనకో, ఇతరులకో లబ్ది చేకూర్చాలన్న ఆశయం ఏర్పడడం. దీనికి ప్రేక్షకులు కన్విన్స్ కావడం. యాక్షన్ లో అయితే ఎలాగైనా విలన్ ని అంతమొందించాలనుకోవడం ఆ కోరిక కావచ్చు, కామెడీలో నైతే ఎన్ని జిత్తులైనా వేసి హీరోయిన్ని పొందాలనుకోవడం ఆ కోరిక కావచ్చు. 

         
పణం:  ఏదీ ఫ్రీగా రాదు. కొంత  మూల్యం చెల్లించుకోవాల్సిందే. ప్రధానపాత్ర దానికున్న విలువైనది పణంగా పెట్టాల్సిందే., పణంగా పెట్టకపోతే కోరిక బలహీనంగా కన్పిస్తుంది. గోల్ పట్ల కమిట్ మెంట్ లేనట్టు వుంటుంది. యాక్షన్లో నైతే తనప్రాణాల్నిపణంగా పెట్టొచ్చు, కామెడీలో పరువు మర్యాదలు పణంగా పెట్టి, ప్రేమకోసం ఎంతకైనా దిగజారవచ్చు, తెగించి నాటకాలాడవచ్చు.

           
పరిణామాల హెచ్చరిక : ప్రధాన పాత్ర ఇక్కడ తీసుకుంటున్న నిర్ణయం ఫలితంగా ఏర్పడబోయే విపరిణామాలని సూచించడం. యాక్షన్ అయితే బలవంతుడైన విలన్ తోనే తలపడతాడు కాబట్టి,   విలన్ తో ఏఏ విపరిణామాలు సంభవించవచ్చో ప్రేక్షకులకి సంకేతాలిచ్చి ఆందోళన పర్చడం. కామెడీ అయితే హీరోయిన్ తండ్రివల్లనో, మరొకరితోనో గొప్ప ఇరకాటంలో పడవచ్చన్న  సంకేతాల్ని ప్రేక్షకులకివ్వడం.  ఈ సంకేతాలకి బిగినింగ్ బిజినెస్ లోనే బీజాలు వేయడం. 

    ఎమోషన్ : పైవన్నీ అర్ధవంతంగా, బలంగా వుంటే దానికదే ఎమోషన్ కూడా శక్తివంతంగా పుడుతుంది. కామెడీ కైతే కామెడీగా వుండే ఎమోషన్, యాక్షన్ అయితే థ్రిల్ చేసే ఎమోషన్, హార్రర్ అయితే భయపెట్టే ఎమోషన్...ప్రేమ కథలకి, ఫ్యామిలీ కథలకి బాధించాలంటే / ఏడ్పించాలంటే సీరియస్ ఎమోషన్...

          ఈ నాల్గు గోల్ ఎలిమెంట్స్ బ్లడ్ సింపుల్’ ప్లాట్ పాయింట్ – 1 దగ్గర  ఎలా వున్నాయో చూద్దాం. ఈ ఎలిమెంట్స్ అన్నీ ప్రధాన పాత్రగా తిరిగి ఇక్కడ ప్రవేశించిన డిటెక్టివ్ విస్సర్ పాత్రకి ఎలా వున్నాయంటే... కోరిక మార్టీ కోసం మర్డర్లు చేసి పెట్టాలని. ఈ కోరికకి   మంచి పేమెంట్ పురిగొల్పింది. డబ్బు తీసుకున్నాక మార్టీ కోరిక నేరవేర్చాల్సిందే (ఇది పైకి కన్పిస్తున్న కోరిక.  నిజానికిది విస్సర్ సొంత కోరికే. దొరికిన బకరాని కోసుకుని నంజుకునే రకం కదా. మిడిల్ విభాగంలో బయటపడతాడు). 

          దీనికి పణంగా ఏం పెడుతున్నాడూ...తన జీవితాన్నే పెడుతున్నాడు. మర్డర్లంటే మాటలు కాదుకదా?  జీవితంతో జూద మాడుతున్నాడు.   

          పరిణామాల హెచ్చరిక ఏమిటంటే, ఎంత డిటెక్టివ్ గా మర్డర్లు చేసినా, దొరికిపోయే ఛాన్సులు ఎప్పుడూ వుంటాయి. సిగరెట్ కేస్ తో, సిగరెట్ లైటర్ తో  అతడి సైకలాజికల్ ట్రాక్ మనకి సూచన లందిస్తోంది ఏదో ప్రమాదం పొంచే వుందని. 

       ఇక ఎమోషన్ కి వస్తే, విస్సర్ పట్ల విముఖతా, థ్రిల్ రెండూ ఏర్పడేట్టు వుంది. ఇది సబబే. మార్టీ పట్ల కూడా ఇవే  ఏర్పడతాయి. ఇది కూడా సబబే. కానీ ఎబ్బీ, రే ల పట్ల తీవ్ర ఆందోళన పెరిగిపోతుంది...ఎందుకంటే విడిపోయి మళ్ళీ వాళ్ళు కలుసుకున్నారు పాపం. ఆలోచిస్తే అప్పుడే విడదీసి అప్పుడే కలపడం కోయెన్ బ్రదర్స్ ఒక అంశాన్ని దృష్టిలో పెట్టకుని చేశారనిపిస్తుంది. వాళ్ళని అసలు విడదీయకుండా అలాగే వుంచేస్తే, ప్లాట్ పాయింట్ -1 ఘట్టంలో వాళ్ళని చంపాలనుకున్నప్పుడు ప్రేక్షకులకి ఎమోషన్ పుట్టక పోవచ్చు. విడదీసి మళ్ళీ కలపడం ద్వారా ఆ బంధం బలీయమై ప్రేక్షకులు బాగా ఎటాచ్ అవుతారు. అప్పుడు ప్లాట్ పాయింట్ -1 దగ్గర వాళ్ళని చంపే ప్లానుకి అఫెండవుతారు, రియాక్టవుతారు, ఇదన్యాయం అనుకుంటారు. ఈ లెవెల్ ని సాధించే ఉద్దేశంతోనే  విడదీసి కలిపారనిపిస్తోంది.

          ఇదీ బిగినింగ్ విభాగపు నిర్మాణం. ఇక మిడిల్ కెళ్దాం. వెళ్లేముందు ఒకసారి ఈ లింక్ ని క్లిక్ చేస్తే  ఒక వీడియో ఓపెనవుతుంది. అది  2009 లో తీసిన ‘ది రూల్స్ ఆఫ్ ఫిలిం నోయర్’ అనే డాక్యుమెంటరీ. దీన్నోకసారి వీక్షించండి, ఆల్ ది బెస్ట్,


-సికిందర్





           






Crime Stories column @ Andhra Jyothi


crime ss

Just for fun, since May

10, జులై 2017, సోమవారం

479 : రివ్యూ!







దర్శకత్వం : రవి ఉద్యావర్
తారాగణం : శ్రీదేవి, అద్నాన్ సిద్ధిఖీ, సజల్ అలీ, నవాజుద్దీన్ సిద్ధిఖీ, అక్షయ్ ఖన్నా, అభిమన్యూ సింగ్ తదితరులు
కథ :  రవి ఉద్యావర్, గిరీష్ కోహ్లీ, కోన వెంకట్, స్క్రీన్ ప్లే : గిరీష్ కోహ్లి, సంగీతం; ఏఎర్ రెహమాన్, ఛాయాగ్రహణం: అనయ్ గోస్వామి
బ్యానర్ : మ్యాడ్ ఫిలిమ్స్,  థర్డ్ ఐ పిక్చర్స్
నిర్మాత : బోనీ  కపూర్, సునీల్ మన్ చాందా
విడుదల :  జులై 7, 2017

***
      వాళ్ళ  రేప్ అతి సీరియస్ సమస్య. అయినా ఎంతటి నిర్భయ చట్టమూ రేపిస్టుల్ని ఆపలేక పోతోంది. చట్ట పాలనా అలాగే వుంది. రేప్ కేసుల్ని టెర్రరిజం కేసులతో సమానంగా పరిగణిస్తే గానీ  రేప్ కేసుల్లో రాజకీయ జోక్యాలూ, పోలీసుల పైత్యాలూ తొలిగేలా లేవు. రేప్ కేసులతో  వ్యవస్థల తీరు చూసి బాధితులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం చాలా కాలంగా సినిమాల్లో వస్తున్నదే. ఇప్పుడు కూడా ఇంకా అవే  పూర్వపు రేప్ రివెంజి డ్రామాలుగా రేపిస్టుల్ని చంపడం మాత్రమే చూపిస్తూ తృప్తి పడమంటున్నారు. ఇలా గత జనవరిలో హృతిక్ రోషన్ ‘కాబిల్’ చూశాం, ఇప్పుడు శ్రీదేవి ‘మామ్’ చూస్తున్నాం. ఒక రేప్ నేరంతో చట్టాలూ న్యాయవ్యవస్థ కూడా రేప్ అవుతున్నాయి. ఈ ‘రేపిస్టుల’ సంగతేమిటో చెప్పడం లేదు. 

         
కొత్త దర్శకుడు, యాడ్ ఫిలిం మేకర్ రవి ఉద్యావర్ ఐదేళ్ళ తర్వాత శ్రీదేవిని మరోసారి తెర మీదికి తీసుకువస్తూ రివెంజింగ్ మామ్ గా చూపించాడు. గత ‘ఇంగ్లిష్ వింగ్లిష్’ తో  ఇంగ్లీషు నేర్చుకునే మధ్యతరగతి గృహిణిగా హాస్యంతో అలరించిన శ్రీదేవి, ఈసారి యమ సీరియస్ గా దుష్టుల్ని శిక్షించే భద్రకాళి అవతారమెత్తింది. ఒక్కొక్కరి అంతూ చూసింది. ఒకణ్ణి మరీ ఆటవికంగా శిక్షించింది. ఇలా విషయం కంటే శ్రీదేవి బ్రాండ్ విలువ మీద ఆధారపడుతూ తీసిన  ఈ యాక్షన్ థ్రిల్లర్ పూర్తి  వివరాలు ఈ కింద చూద్దాం... 

కథ 
      ఢిల్లీలో దేవకి (శ్రీదేవి)  ఒక బయాలజీ టీచర్. ఆమెకి బిజినెస్ మాన్ భర్త ఆనంద్ (అద్నాన్ సిద్ధిఖీ), ఆరేళ్ళ కన్న కూతురు ప్రియ, పద్దెనిమిదేళ్ళ పెంచిన కూతురు ఆర్య (సజల్ అలీ) వుంటారు. మారుతల్లి దేవకి పాఠాలు చెప్పే స్కూల్ (? ) లోనే చదివే ఆర్యకి ఆమె అంటే పడదు. దేవకి ఎంత దగ్గరకి తీసినా దూరంగా వుంటుంది. తండ్రి చెప్పినా వినదు. ఒకరోజు వేలెంటైన్స్ డేకి పార్టీకి వెళతానంటుంది. స్కూల్లోనే క్లాస్ మేట్ మోహిత్ ఆమె మీద కన్నేస్తాడు. పార్టీకి వచ్చిన ఆమెని ఫ్రెండ్స్ తో కలిసి కిడ్నాప్ స్తాడు. ప్రయాణిస్తున్న కారులో  రేప్ చేసి రోడ్డు పక్కన డ్రైనేజీ లో పడేసి వెళ్ళిపోతారు. ఈ కేసుని క్రైం బ్రాంచ్ ఇన్స్ పెక్టర్ ఫ్రాన్సిస్ దర్యాప్తు చేసి, నిందితుల్ని కోర్టులో పెడతాడు. సరైన సాక్ష్యాధారాలు లేక నిందితులు  విడుదలైపోతారు. హతాశుడైన ఆర్య తండ్రి ఆనంద్ కోర్టులోనే తిరగబడతాడు. అతణ్ణి అరెస్టు చేస్తారు. ఇవన్నీ నిస్సహాయంగా చూస్తున్న దేవకి ఇక ఒక నిర్ణయం తీసుకుంటుంది. దయాశంకర్ (నవాజుద్దీన్ సిద్ధిఖీ) అనే ప్రైవేట్ డిటెక్టివ్ సహకరించడానికి ముందుకొస్తాడు. అతనిచ్చే సమాచారంతో రేపిస్టుల్ని శిక్షించడం   మొదలెడుతుంది...

ఎలావుంది కథ 
      ఎన్నో కథలొచ్చాయి ఇలాటివి. కాకపోతే ఇది మదర్ సెంటిమెంటుతో కూడిన యాక్షన్ థ్రిల్లర్. విశాల ప్రయోజనంతో కాక వ్యక్తిగత ప్రతీకారానికే  పరిమితమైంది. తను చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడానికి కారణమైన వ్యవస్థనేమీ అనకుండా రేపిస్టుల్ని శిక్షించడం.  గత ఏప్రెల్ లోనే రవీనా టాండన్ పునరాగమన ‘మాత్ర్’ కీ,  శ్రీదేవి ‘మామ్’ కీ తేడా ఏమీ లేదు- ‘మాత్ర్’ లో కూతురితో బాటు రవీనా పాత్ర కూడా రేప్ అవడం తప్ప. రవీనా కూడా వ్యవస్థతో లాభంలేక రేపిస్టుల్ని చంపడం మొదలెడుతుంది. ఇది కూడా మదర్ సెంటిమెంటుతో కూడిన యాక్షన్ థ్రిల్లర్. ఇలాటి కథలు మదర్ సెంటిమెంటుని కూతురి వరకే పరిమితం చేసి ప్రేక్షకుల్ని అంతని మించి ఫీలవ నివ్వడం లేదు, ఆలోచించ నివ్వడంలేదు. 

          కొరియన్ మూవీ ‘డోంట్ క్రై మమ్మీ’ (2012) కూతురికి జరిగిన అన్యాయానికి పగదీర్చుకోవడంతో బాటు, ఒక సామాజిక బాధ్యత ప్రదర్శిస్తుంది. మైనర్ రేపిస్టులు స్వల్ప శిక్షలతో బయటపడే పరిహాసం ఇంకెన్నాళ్ళూ అని శాసన కర్తల్ని ప్రశ్నిస్తుంది. నిజానికి ‘మామ్’ కొన్ని సీన్లతో సహా ఈ కొరియన్ మూవీకి అనుసరణ- మెసేజి మినహా. 

ఎవరెలా చేశారు 
      ప్రధానంగా శ్రీదేవి బ్రాండ్ వేల్యూని సద్వినియోగం చేసుకోవడానికి  ఒక బర్నింగ్ ఇష్యూని బలిపెట్టిన ( లేదా వాడుకున్న)  ప్రయత్నం కావడం చేత- సహజంగానే శ్రీదేవి పర్సొనా, దానికి కాస్త అంతంతమాత్రం మదర్ సెంటిమెంటు, భారీ రివెంజెమోషనూ  కలిపి పాత్రని సృష్టించారు. ఈ పాత్రలో ఆమె చూపిన అభినయ చాతుర్యం ఆమె ఇప్పటి  సినిమాలకి చాలా అవసరమనే ఎమోషన్ని  క్రియేట్ చేస్తుంది. హీరోయిన్ గా వున్నప్పటి కంటే ఇప్పుడు చాలా గ్రేస్ ఫుల్ గావుంది. ఆమె ఏం చెప్పినా జనం వింటారు. అయితే పాత్రకి,  నేనూ - నా కూతురే  అని కాకుండా, నేనూ - నా కూతురూ - ఇంకెందరో ఇలాటి కూతుళ్ళూ- వ్యవస్థా-  అనే చతుర్విధ ధర్మం వుంటే జనం వినడమేమిటి, పాటిస్తారు కూడా. 

          కూతురికి జరిగింది తెలిసినప్పుడు ఆమె గుండె పగిలే రోదన, చివర్లో చివరి రేపిస్టుని మంచు కొండల్లో చంపుతున్నప్పుడు రక్తం గడ్డ కట్టుకు పోయే ఎమోషన్, ఈ సినిమాకి ఆమె ప్రసాదించిన రెండు గుర్తుండిపోయే దృశ్యాలు. శిక్షించడానికి వెళ్ళడం, దాక్కోవడం, గుట్టు చప్పుడు గాకుండా పనిపూర్తి చేసుకురావడం క్లాస్ యాక్షన్. ఈ క్లాస్ రివెంజి ప్రక్రియతో బాటు, వ్యవస్థ సంగతెలాగూ లేదు, కనీసం ఫ్యామిలీనైనా పట్టించుకోవాల్సింది. 


         కూతురు ఇప్పుడు కూడా ద్వేషంతో దగ్గరకి రానివ్వకపోయినా కనిపెట్టుకుని వుండమని భర్త కైనా చెప్పదు. రేపైన అమ్మాయిని - అందులోనూ గ్యాంగ్ రేపైన అమ్మాయిని మూసిన గదిలో ఒంటరిగా వదిలేస్తే ఏం జరగవచ్చో ‘డోంట్ క్రై మమ్మీ’ చూపిస్తుంది. అక్కడికి తల్లి పాత్ర నటించిన సియోన్ యూ, టీనేజి కూతురికి కౌన్సెలింగ్ ఇస్తూనే వుంటుంది (ఇది కూడా టీచర్ పాత్రే). నువ్వు బయటి కెళ్ళాలి, ఫ్రెండ్స్ ని కలవాలి, స్కూలు కెళ్లాలి, హాలీ డే ట్రిప్ కెళ్దామా? లాంటి చల్లని మాటలుచెబుతుం
టుంది.  

          శ్రీదేవి దేవకి పాత్ర టీచర్ అయినా ఈ క్యారక్టరైజేషన్ తో వుండదు. మన సినిమాల్లో మొదట్లో ఒకే  సీన్లో ఈ హీరో లేదా హీరోయిన్ పాత్ర ఫలానా ఈ ప్రొఫెషన్ లో వుందని చూపించి,  ఇక దాని తాలూకు పాత్రచిత్రణ జోలికే  పోకుండా అక్కడే వదిలేస్తారు. పైగా దేవకి  బయాలజీ టీచర్ అని ఎస్టాబ్లిష్ చేశారు. అలాంటప్పుడు కూతురు గ్యాంగ్ రేప్ అయినప్పుడు, ఆ మెడికల్ దర్యాప్తు ప్రక్రియ పట్ల  ఎందుకు అప్రమత్తంగా లేదు ఒక బయాలజీ టీచర్ గా? అలాగే తానొక టీచర్ అయినప్పుడు, వ్యవస్థలు ఎలా పనిచేస్తాయో తెలీని సగటు మనిషిలా ఎలా వుంటుంది. పోరాటం చేసే పాత్రకి  ఇలాటి లోపాలుంటాయా? 

      ఇంకొక విషయమేమిటంటే, చిన్న కూతురిని గాలి కొదిలేయడం. పెద్ద కూతురికి జరిగిందానికి దేవకి లోనైన భయందోళనలు, బయట చదువుకుంటున్న  చిన్న కూతురికి ఎందుకు వర్తించవో అర్ధంగాదు. పెద్ద కూతురి  భయానక గ్యాంగ్ రేప్ తో చిన్న కూతురితో యాదృచ్చికంగా మరింత ప్రొటెక్టివ్ గా వుండే మదర్ ఇన్ స్టింక్ట్ ఏమైందో తెలీదు. భయంతో ఆ చిన్న కూతుర్ని హత్తుకునే దృశ్యమే లేదు.  శ్రీదేవీ  - ఆమెకి  ఎంతో రివెంజీ  – ఇదే  పెట్టుకున్నారు పాత్రకి. 

          భర్త పాత్ర నటించిన పాకిస్తానీ నటుడు అద్నాన్ శ్రీదేవికి బాగానే మ్యాచయినా, పాత్ర అర్ధవంతంగా ప్రవర్తించదు. కేసు ఓడిపోయి అప్పీల్ కెళ్తాను, అప్పీల్ కెళ్తాను అంటూంటాడే తప్ప,  అప్పీల్ కే వెళ్ళడు. చక్కగా ఆఫీసులో కూర్చుని బిజినెస్ చూసుకుంటూ వుంటాడు. ఇలాటి తండ్రి కూడా వుంటాడేమో! 

          ఇక పెద్ద కూతురు ఆర్య రూపంలో పాకిస్తానీ సజల్ అలీ. చూడ్డానికి బాగానే వుంది, ఇది రెండో సినిమా. సీరియల్స్, టెలి ఫిల్ములు 45 వున్నాయి. కాబట్టి నటనలో అనుభవమున్నట్టే. తెరమీద కన్పిస్తూనే వుంది. ఫాం హౌస్ లో స్వింగింగ్ పార్టీలో  ఫ్రీకీ లైఫ్,  కూకే కాన్ జంట పాటల్లో ఆమె జోష్ వొక హైలైట్ సినిమాకి. తదనంతర విషాదంలో పాసివ్  గానే వుండిపోతుంది గదిలో. అసలేం మాట్లాడదు. జరిగిందాని పట్ల ఏ వైఖరీ తీసుకోకుండా నిస్త్రాణంగా వుండిపోతుంది. కొరియన్ మూవీలో టీనేజి కూతురు, తల్లి చెప్పే చల్లని మాటలకి- అలా చేస్తే నాకు జరిగినదంతా మాయమై పోతుందా? అని జవాబు దొరకని ప్రశ్న అడుగుతుంది. ఈమె పాత్రని విషాద ఘటన  తర్వాత ఆపెయ్యలేదు, ముందుకింకా  నడిపించారు. 

          క్రైంబ్రాంచ్ ఇన్స్ పెక్టర్ ఫ్రాన్సిస్ గా చాలాకాలం తర్వాత అక్షయ్ ఖన్నా అప్పీయరెన్స్.  అయోమయం పాత్ర. ఫాస్ట్ ట్రాక్ లో కేసు టేకప్ చేసి,  తీరా మెడికల్ ఎవిడెన్స్ ని కాపాడలేకపోతాడు. కోర్టులో కేసు ఓడిపోయి, తను చేయలేక పోయిన  పనిని  శ్రీదేవి చేసుకుపోతూంటే అడ్డు పడుతూంటాడు. ఆధారాలు సేకరించి అరెస్టు చేస్తానంటాడు. లైట్ తీసుకో అని పై అధికారి అన్నాక,  శ్రీదేవికి సహకరించడానికి వచ్చేస్తాడు క్లయిమాక్స్ లో. 

        ప్రైవేట్ డిటెక్టివ్ గా నవాజుద్దీన్ ఈసారి పూర్తిగా గెటప్మా ర్చేసుకుని, కామెడీని పంచిపెట్టే  పాత్ర పోషించాడు. అతడి హవా ఇంకా నడుస్తోంది. అయితే ఈ క్యారక్టర్ ని కూడా బతకనివ్వలేదు రైటర్లు. శ్రీదేవికి సమాచార మివ్వడానికి కలిసే చోట ఒకర్నొకరు ఎరగనట్టే వుండాలని అంటాడు. కానీ సీసీ కెమెరాలు చూస్తూనే వుంటాయని తెలుసుకోడు. రైల్వే స్టేషన్లో, ఆర్ట్ ఎగ్జిబిషన్లో  కేర్ ఫ్రీ బర్డ్స్ లా వుంటారు ఇద్దరూ. అక్కడ ఆమె కోసం పెన్ డ్రైవ్ పెట్టేసి పక్కకి తప్పుకుంటే, సీసీ కెమెరాలు చూడవా?  ముందుగా కలవాలనుకున్నచోట రెక్కీ నిర్వహించి చుట్టూ ఓ లుక్ కూడా వేయడు. డిఫెక్టివ్ డిటెక్టివ్

     ఇంకొక తప్పుడు పనేమిటంటే, మనిద్దరం కలుసుకుంటున్నట్టు మూడో కంటికి తెలియనివ్వద్దని అన్నాక,  తన గోప్యత  విషయంలో అతణ్ణి పూర్తిగా నమ్ముతుందామె. చివరికి హత్యకి గురవుతాడు. అతడి కళ్ళద్దాల్లో స్పై కెమెరా దొరుకుతుంది. అందులో తనని చంపినవాడి ఇమేజితో  బాటు,  అప్పుడప్పుడు తను శ్రీదేవిని కలుసుకున్న దృశ్యాలు కూడా వుంటాయి. ఏమిటిది? ఒక డిటెక్టివ్ గా క్లయింట్ తో బ్రీచ్  ఆఫ్ కాంట్రాక్టు కి పాల్పడినట్టు కాదా? పాత్రకి ఇలాటి ఉద్దేశం లేదని మనకి తెలుసు. ఎలాగోలా కథని ముగింపుకి తెచ్చేద్దా మనుకుని,  చనిపోయిన వాడికి కళంకం తెచ్చి పెట్టారు రైటర్లు.
 

          దర్శకుడు యాడ్ ఫిలిం మేకర్ అవడం వల్ల  సహజంగానే రిచ్ విజువల్స్ వున్నాయి. ప్రయాణిస్తున్న కారులో రేప్ జరుగుతోందన్న భావం కల్గిస్తూ చేసిన చిత్రణ మంచి  క్రియేషన్. అర్ధరాత్రి  నిర్జన రోడ్ల మీద ఎల్లో టింట్  లో చేసిన ఈ చిత్రీకరణకి,  ఏఆర్ రెహ్మాన్ ఇచ్చిన బిజిఎం జరుగుతున్న అకృత్యం పట్ల ఏహ్యభావం కల్గించేట్టు వుంది. ఫాం హౌస్ పార్టీలో వెంట వెంటనే వచ్చే రెండు సాంగ్స్, వాటి చిత్రీకరణా  అంతవరకూ పాత్రల  పరిచయాలతో నిదానంగా సాగుతున్న కథనాన్ని ఒక్కసారి పైకి లేపుతాయి. నటనల్ని రాబట్టుకోవడంలో, షాట్స్ ని ప్లాన్ చేయడంలో దర్శకుడు అందెవేసిన చేయిలా వున్నాడు. తన టాలెంట్ కి  ఒక కమర్షియల్ సినిమాకి కంటెంట్ పరంగా ఇంతే చాలనుకుంటే అదొక లెవెల్, కంటెంట్ కూడా ముఖ్యమనుకుంటే ఇంకో లెవెల్ లో వుంటాడు తను.

 చివరికేమిటి  
    ‘డోంట్ క్రై మమ్మీ’ లో కంటెంట్ వుంటుంది గానీ అది చంపడం మొదలెట్టే వరకే. చంపడం మొదలెట్టాక ఆ సీన్స్ చప్పగా వుంటాయి. కంటెంట్ లో  కూతురితో వుండే డ్రామా, న్యాయం కోసం తపనా, పాత్రచిత్రణలూ  అన్నీ అర్ధవంతంగా, బలంగా ఎందుకుంటాయంటే, వీటికి స్వల్ప శిక్షలతో మైనర్ రేపిస్టులు బయటపడుతున్న – చట్ట సవరణని కోరుతున్న కాన్సెప్ట్ నేపధ్యం వుంది. ‘మామ్’ కి ఇలాటి కాన్సెప్ట్ లేదు. కొరియన్ మూవీలోంచి రెండు మూడు పాత్రల్ని, కొన్ని సీన్స్ ని, గ్యాంగ్ రేప్  ప్రధాన ఘట్టాన్నీ తీసి యాక్షన్ ధోరణికి వాడుకున్నారు. కొరియన్ మూవీ ఇంకా ఎక్కడ కట్టుబడిందంటే, మైనర్ రేపిస్టులతో సమస్యని చూపిస్తున్నందుకు,  రేపిస్టులందరూ ఆ ఏజి గ్రూపులోనే వుండేట్టు చూశారు. ‘మామ్’ లో కనీసం ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం యూత్ వర్సెస్ యూత్ కథగానైనా మల్చుకోలేదు. అదే ‘పింక్’ లో కథకి తగ్గ పాత్రలుగా యూత్ వర్సెస్ యూత్ గానే వుంటుంది. ఇది బాక్సాఫీసు అప్పీలుకి బాగా తోడ్పడింది. ‘మామ్’ లో క్లాస్ మేట్ తప్పితే, అతడి అన్న, ఇంకో వాచ్ మన్, మరింకో గూండా లాంటి వయసుమీరిన పాత మూస ఫార్ములా పాత్రల వల్ల శిల్పం చెడింది.

          ఇక నిర్భయ ఉదంతం తర్వాత దేశంలో చిల్లీ స్ప్రేలు,  వుమన్ సేఫ్టీ యాప్స్ ల పట్ల అవగాహన పెరిగి వీటి వాడకం పెరిగింది. పోలీసులు కూడా బయటి కెళ్ళే అమ్మాయిలు ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పటికీ ప్రచారం చేస్తూనే వుంటారు.  ప్రమాదంలో వున్నారనిపిస్తే యాప్ లో ఒక్క క్లిల్ చేస్తే చాలు, ఐదు చోట్లకి ఎలర్ట్ వెళ్ళిపోతుంది. అలాగే ఏ మాత్రం అనుమానం వచ్చినా చిల్లీ స్ప్రే కొడితే ఇరవై నిముషాలు లేవకుండా మూర్ఛ పోతారు రికామీలు. స్త్రీ స్వేచ్ఛకి  ఫ్రీ టికెట్ లేదు. ఆత్మరక్షణ చేసుకోగలిగితేనే స్వేచ్ఛ. మేం తిరుగుతాం, మమ్మల్ని మీరే కాపాడాలీ అంటే,  పోలీసులు వెంట తిరుగుతూండాలి పనులు మానుకుని. 

          శ్రీదేవి కూతురు ఆ నైట్ ఎక్కడో ఫాం హౌస్ కి పార్టీకి వెళ్తోంటే, సెల్ చార్జింగ్ వుందా?  అనడుగుతుంది. ఆమె చేయాల్సింది యాప్ డౌన్ లోడ్ చేసివ్వడం, బ్యాగులో ఒక  చిల్లీ స్ప్రే వుంచడం- ఒక తల్లిగా, అందులోనూ టీచర్ గానూ. ఇవేం చెయ్యక కత్తి పట్టుకుని బజార్న పడితే మామ్ అన్పించుకోదు. పోవయ్యా సినిమా కథకి ఈ లాజిక్కులేమిటి, ఇలాగైతే రేప్ ఎలా జరుగుతుంది?  అంటే - రేప్ ఎలాగైనా చేసుకో, అది నీ సమస్య. ముందు పాత్రల్ని కాలానుగుణంగా చూపించు. రేపులతో భగ్గుమంటున్న  దేశంలో  పోలీసులు చేస్తున్న ప్రచారానికి వ్యతిరేకంగా అజ్ఞానపు పాత్రల్ని గ్లామరైజ్ చెయ్యకు. ఎంత కమర్షియల్ సినిమాకైనా కొంత బాధ్యత వుంటుంది.
***
       మొన్న ‘కాబిల్’ లో చూశాం, ఆ తర్వాత ‘మాత్ర్’ లో, ఇప్పుడు ‘మామ్’ లో... అవగాహన లేని పోలీస్ ప్రొసీజర్లు. మూడేళ్ళ క్రితమే ఒకవైపు కేంద్ర ప్రభుత్వం రేప్ బాధితుల వైద్య పరీక్షల్ని లాలూచీ పడుతున్నారని పోలీసుల పరిధి నుంచి తప్పిస్తే, సినిమాల్లో ఇంకా రద్దయిన పాత పద్ధతులే. ఇక నుంచి రేప్ బాధితురాలు ముందు పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లెయింట్ చేయనవసరం లేదనీ,  నేరుగా ఏ డాక్టర్ దగ్గరికైనా వెళ్లి వైద్య పరీక్షలు కోరవచ్చనీ, ఆ రిపోర్టుతో వెళ్లి పోలీసు కంప్లెయింట్ ఇవ్వొచ్చనీ, డాక్టర్లు పరీక్షకి నిరాకరించినా, పోలీసులు ఆ రిపోర్టు ఆధారంగా కేసు నమోదు చేయకపోయినా జైలుకే పోతారనీ నిబంధనలు పెట్టింది కేంద్రం.

          కాబిల్, మాత్ర్ తో బాటు మామ్ ఈ వైద్యపరీక్షల్నే పాత ప్రొసీజర్ తో చూపించి రేప్ బాధితులకి తప్పుడు సమాచారాన్ని అందిస్తున్నాయి. మామ్ లో ఇంకా ఘోరం. రాత్రి మామ్ పోలీస్ కంప్లెయింట్ ఇస్తుంది. ఉదయం పోలీసు డాగ్ ని అనుసరించి డ్రైనేజీ దగ్గరి కొస్తాడు. మిస్సింగ్ కేసుని డెత్ కేసుగా అనుకుని ఎందుకు గాలిస్తున్నారో తెలీదు. ఆ  డ్రైనేజీలో బాధితురాలు దొరికితే, సమాచారం తెలుసుకుని పై అధికారి- ఆమె ఎస్కార్ట్ కానట్టుంది, రేప్ కేసులా వుంది,  టేకప్ చెయ్ – అంటాడు ఇన్స్ పెక్టర్ తో. రాత్రి మామ్ కూతురు కన్పించడం లేదని ఫోటోలు కూడా ఇస్తే, ఆ కూతుర్ని  ఎస్కార్ట్ అని ఎలా అంటాడు? ఎస్కార్ట్ కాదు, రేప్ కేసులా వుంది-  అనడమంటే, ఎస్కార్ట్ రేప్ అయితే రేప్ కేసు కాదా? 

          అలాటి స్థితిలో దొరికిన బాధితురాల్ని వెంటనే రేప్ దృష్టితో వైద్యపరీక్షలు చేయించాలి. ఆమె గాయాలకి చికిత్స చేస్తూ గడిపేసి- తీరా 72 గంటల తర్వాత రేప్ ఎవిడెన్స్ లేదని రిపోర్టు!  నిందితులు జంప్. ‘డోంట్ క్రై మమ్మీ’ లో సకాలంలో మెడికల్ ఎవిడెన్స్ సేకరించి, బాధితురాలు కోలుకున్నాక, లేడీ పోలీసులు ప్రశ్నిస్తారు ఆమె పీరియడ్స్ గురించి. ప్రెగ్నెన్సీ ప్రమాదాన్ని నివారించే దృష్టితో. ఇంకా కన్యాత్వం ఎప్పుడు పోగొట్టుకున్నావని కూడా కీలక ప్రశ్న వేస్తారు. 

          శ్రీదేవి శిక్షించే  విధానాల్లో ముందుగా వాచ్ మాన్ కి హిజ్రాల చేత లింగ విచ్ఛేదం  గావిస్తుంది. ఇది క్రూరంగా  వుంటుంది. తర్వాత మోహిత్  అన్న కోసం చేసే ప్లానులో, యాపిల్ గింజల్లోంచి  సైనేడ్ తీసి, వాడి ఫిట్ నెస్ సప్లిమెంట్ లో కలుపుతుంది. అది తాగి  వాడికి పక్షవాతం  వస్తుంది. ఇక అక్కడే లాప్ టాప్ లో గూగుల్ సెర్చ్ లో సైనైడ్ తయారీ గురించిన ఇన్ఫర్మేషన్ కోసం చూసినట్టు పరిస్థితి క్రియేట్ చేస్తుంది. ఆ టైములో ఆ డిజిటల్ ఫింగర్ ప్రింట్స్ మోహిత్ వే నని వాణ్ణి జైల్లో వేస్తారు. నాల్గో రేపిస్టు మీద ప్లాన్ చేయకుండానే వచ్చి మీద పడతాడు. ఆమె చేపట్టిన రెండో విధానం మాత్రం బాగా హైలైట్ గా  వుంది సినిమాకి.

          కానీ ఎంత చేసీ ఇలాటి సినిమాల్లో వన్ వే లో శిక్షించుకుంటూ వెళ్ళడమే కాబట్టి కథ మొత్తం ముందే తెలిసిపోయి సస్పెన్స్ వుండదు. ఈ లోటుని కేసుని గల్లంతు చేసిన వ్యవస్థని కూడా టార్గెట్ చేస్తూ పూరించవచ్చు. కనీసం మామ్ అనుభవిస్తున్న బాధ - రకరకాల స్థాయుల్లో రాజకీయనాయకులకీ, పోలీసులూ న్యాయ పాలకులకీ,   రేప్ కేసుల్లో ఇక మనం జోక్యం చేసుకోకూడదురా బాబూ అని,  దండం పెట్టుకునే తీవ్రతతో కదిలించేలా వున్నా, ఎంతో సామాజిక ప్రయోజనం కూడా నెరవేరేది.


-సికిందర్
cinemabaz
ar.in