![]() |
ai generated image |
సినిమాల్లోని
సంఘటనలు ప్రేక్షకుల మనసుల్లో బలంగా ముద్రించుకోవాలంటే
రూల్
ఆఫ్ త్రీస్ ని పాటించాల్సిందే...మూడు అనేది ఒక మ్యాజికల్ నంబర్.
ఏదైనా
విషయం మూడుగా వుండడం మానసికావసరం. సినిమాల్లో,
టీవీ
షోలలో సంఘటనలు మూడుగా జరిగి పూర్తవుతాయి. మెదడు
మూడుగా
జరిగే పాటర్న్ ని గుర్తుంచుకుంటుంది. సంఘటనల్లో ఈ పాటర్న్ ని
వెతుక్కుంటుంది. పాటర్న్ కనిపించలేదో ఆ సంఘటన
లేదా సీను సినిమాటిక్ గా విఫలమైనట్టే...